16, మార్చి 2020, సోమవారం

సమస్య - 3311 (నాగమ పెండ్లాము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నాగమ పెండ్లాము బ్రహ్మనాయునకుఁ గదా"
(లేదా...)
"నాగమ బ్రహ్మనాయునకు నచ్చిన పెండ్లము గాదె చూడఁగన్" 
(ఈరోజు మాచెర్లలో ఐతగోని వెంకటేశ్వర్లు గారి అష్టావధానం)

23 కామెంట్‌లు:

 1. అందరికీ నమస్సులు 🙏

  నా పూరణ ప్రయత్నం 😞

  *కం||*

  వేగిరముగ తెలుపగ నే
  తాగిట వాగితి ననుదురు తప్పది యనినన్
  ఆగిల యడిగిరి తెలుపుము
  *"నాగమ పెండ్లాము బ్రహ్మనాయునకుఁ గదా"?*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🙇‍♂️🙏🙇‍♂️🙏

  రిప్లయితొలగించు
 2. రాగమయాత్మవై వినుము రమ్యగుణాఢ్యుడు, మేనయల్లు డే
  లా గమనించ వంచు నొక డాడెను భార్యకు కక్ష లేలనే
  కాగల దన్నిటన్ శుభము, కాంతుని నమ్మవె యాత్మజాతయౌ
  నాగమ బ్రహ్మనాయునకు నచ్చిన పెండ్లము గాదె చూడఁగన్.

  రిప్లయితొలగించు
 3. వాగకు మని చెప్పితిగద
  రా! గడుసు దనమ్మదేల రమణి యైత
  మ్మేగద గాదిలి, కాదుర
  నాగమ పెండ్లాము, బ్రహ్మనాయునకుఁ గదా.

  రిప్లయితొలగించు
 4. వాగుట మానర యే 
  లాగున చెప్పుటో తెలియదు రచ్చన్ వినవే 
  లాగున ఐతమర,  కాదుర
  నాగమ పెండ్లాము బ్రహ్మనాయునకు, కదా !

  రిప్లయితొలగించు
 5. (నలగామరాజు మంత్రి బ్రహ్మనాయుడు వైష్ణవుడు.సమసమాజసంస్థాపనాసక్తుడు.మరొక అమాత్యురాలు
  నాగమ్మ శివభక్తివిరాజిత.వర్ణాశ్రమాసక్తచిత్త.మంత్రులిద్దరికీ మతవిషయకవైరమే.)
  మ్రోగగ శైవమంత్రములు
  ముచ్చటకైనను విష్ణుకీర్తనల్
  సాగగనీయనట్టి మతి
  సంయుతధీయుతశత్రుకాంతయే
  నాగమ బ్రహ్మనాయునకు;
  నచ్చిన పెండ్లము గాదె చూడగన్
  బాగుగ నైతమాంబ తన
  భర్తకు నైతికధర్మవీధులన్.

  రిప్లయితొలగించు
 6. త్రాగిన మైకము నందున
  వాగుచు సందర్భ రహిత పలుకుల తోడన్
  రాగము దీయుచు నిట్లనె
  నాగ మ పెండ్లాము బ్రహ్మ నాయు నకు గదా

  రిప్లయితొలగించు
 7. నలగామరాజు రాజ్యంలోని ఒక పౌరుడు నాగమ్మ పౌరుషం చూచి... ఇలా అంటున్నాడు...

  ఆగదు ! యుద్ధమన్న విజయమ్మును లక్ష్యమటంచునెంచెడిన్!
  సాగగనీదు ముందుకదె సై యన సై యను తగ్గదింతయున్!
  యోగములేదు గాని సమయోచితమౌ సరిజోడనంగ మా
  నాగమ బ్రహ్మనాయునకు నచ్చిన పెండ్లము గాదె చూడఁగన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

  రిప్లయితొలగించు
 8. క్రాగెను వైరమిద్దరకి కారము పూడియె వేదికయ్యె నా
  *నాగమ బ్రహ్మనాయునకు నచ్చిన పెండ్లము గాదె! చూడఁగన్*
  నాగుల యేరుపైన పలనాటి రణమ్మున భీకరమ్ముగా
  సాగిన రక్తపాతమున సాచిరి కత్తులు నిల్చి వైరులై

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించు
 9. లాగకుమా చరిత్ర పుటలన్ తెలుపంగను లేడెవండు, నే
  డాగమ శాస్త్రముల్ చరిత లన్నను ఛాత్రులయిష్టులై భువిన్
  బాగదె యింజనీరు చదువంచును దల్చిరి, యైతమాంబయే
  నాగమ, బ్రహ్మనాయునకు నచ్చిన పెండ్లము గాదె చూడఁగన్

  రిప్లయితొలగించు
 10. రిప్లయిలు
  1. ఆర్యా నమస్సులు ఈరోజు నేను ఆ మహత్తర అవకాశం ఎప్పుడో కొట్టసాగా 🙏🙏🙏😀😀

   తొలగించు
 11. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "నాగమ బ్రహ్మనాయునకు
  నచ్చిన పెండ్లము గాదె చూడఁగన్" 

  సందర్భము:
  గురు శిష్య సంవాదం..
  (కేవలం మాటలలోనే..)
  శిష్యుని జవాబుల్లో ఒకటి సందేహాత్మకం.. మరొకటి నిశ్చయాత్మకం.. ఐతే సందేహాత్మకం ఒప్పు. నిశ్చయాత్మకం తప్పు.
  "సందేహాత్మకంగా నైనా చెప్పినాడు గదా! (రాముని భార్య యేమొ!) ఈ కాలంలో ఈ మాత్రం చెప్పగలిగితే చాలు.." అని గురువుకూడా "మెచ్చితి" అంటున్నాడు.
  రామాయణాదులు పురాణాలు మేం నమ్మమండీ! అనడం ఒక ఆధునిక దృక్పథం అనుకుంటున్నా రివాళ. ఆ ఉద్గ్రంథాలనుండి గ్రహించవలసిం దేమిటో గ్రహించకుండా తొలుతనే "అవి జరిగినాయా!" అని ఒక అడ్డుపుల్లలాంటి ప్రశ్న వేస్తారంతే! పుణ్యకాలం హరించిపోతుంది. ఇవీ ఇప్పటి తెలివితేటలు.
  (మరి జరుగుతున్న చరిత్రనుంచి ఎంతమాత్రం గ్రహిస్తున్నారో రాముణ్ణే అడుగాలి.)
  శిష్యుడు చరిత్ర నా కిష్టం.. అని అప్పు డప్పు డంటూ వుండేవా డన్నది గుర్తు వచ్చి అదేదో గొప్పగా అవగాహన తెచ్చుకున్నట్టు.. చరిత్రకు సంబంధించిన ప్రశ్న వేశారు గురువు గారు "నాగమ్మ ఎవ రని?" దానికీ శిష్యరత్నం చెప్పిన జవాబు ఎంత గొప్పగా వుందో!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *నేటి శిష్య రత్నము*

  "ఏగుము చెప్పి , సీత యన
  నెవ్వరొ!".."రాముని భార్యయేమొ!".."ఓ
  రీ! గుణశాలి! మెచ్చితి.. చ
  రిత్రయె నీకుఁ బ్రియంబటందువే!
  నాగమ యన్న నెవ్వరొకొ!..
  నాకు వచింపుము శిష్య రత్నమా!"
  "నాగమ బ్రహ్మనాయునకు
  నచ్చిన పెండ్లము గాదె చూడఁగన్!" 

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  16.03.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 12. మిత్రులందఱకు నమస్సులు!

  [బ్రహ్మనాయని గుణగణములను మెచ్చుకొనుచు, నొక రాచకన్నియ తన చెంతనున్న పున్నాగ వృక్షముతో మాటలాడు సందర్భము!]

  "త్యాగవిశేషకర్మఠుఁడు; ధర్మియు, భక్తుఁడు, సద్విధేయుఁడున్,
  భోగము లేనివాఁడు! కులమోక్ష రతిన్ సహపంక్తిభోజనం
  బీగతిఁ బెట్టినాఁడు! కను మీయమ యైతమ! యీమె, విన్ము పు

  న్నాగమ! బ్రహ్మనాయునకు నచ్చిన పెండ్లము గాదె చూడఁగన్!"

  రిప్లయితొలగించు
 13. బాగుగనేదెలిపిరియా
  నాగమపెండ్లాముబ్రహ్మనాయునకుగదా
  త్రాగినదిదిగనికతమున
  రాగముమఱిహెచ్చెనేమొరమణులపైనన్

  రిప్లయితొలగించు
 14. హా గమనించితి నంతయు
  వేగమె జెప్పెద వినుమని వెంగలిదనమున్
  ఆ గాడిద పలికె నిటుల
  "నాగమ పెండ్లాము బ్రహ్మనాయునకుఁ గదా"

  రిప్లయితొలగించు
 15. నాగమబ్రహ్మనాయునకునచ్చినపెండ్లముగాదెచూడగన్
  నేగతిజూచినన్దెలియునీయిరుమంత్రులుబద్ధవైరులే
  నాగమశంకరుంగొలుచు,నాయుడుగొల్చునువిష్ణునిన్దగన్
  నాగమపెండ్లమెట్లగునునక్కనుబోల్చుటచందమాయెగా

  రిప్లయితొలగించు
 16. తా గర్వాంధ యయి ధరన్
  వేగ మనికి దారి తీసె ద్వేషియె చేసెం
  దా గారడమ్ము కా దట
  నాగమ పెండ్లాము బ్రహ్మనాయునకుఁ గదా


  బాగరి బ్రహ్మనాయిఁడు దివమ్మున కేఁగెను గోత్ర సంగ రా
  వేగ రయమ్మునన్ వెలమ వీరుఁడు సర్వ కులైక మాన్యుఁడే
  యే గతి నచ్చ నట్టిదియు, నియ్యది సత్యమ నేను నంటినే,
  నాగమ బ్రహ్మనాయునకు నచ్చిన పెండ్లము గాదె చూడఁగన్

  [కాదె = కాదు]

  రిప్లయితొలగించు
 17. రోగిగమారెగాచరిత రోజుకురోజుకు దుష్టపాలనన్
  ఈగతియెవ్వరేనియిట,,యింపుగబల్కగ సాహసింతురా?
  పోగయివచ్చుకాలమున పోరు ,విదిల్చినకార్యరంగమున్
  నాగమబ్రహ్మనాయునికి ,నచ్చిన పెండ్లముగాదెచూడగన్
  +++++++++++++++=++=+++++==+++
  రావెలపురుషోత్తమరావు


  రిప్లయితొలగించు
 18. నాగమ బ్రహ్మనాయునికి నచ్చిన పెండ్లము గాదెచూడగన్
  సాగినయుద్ధరంగమున జచ్చినయోధుల సాక్షి యోడినన్
  భోగపరాయణుండ్రసురమూఢులుచండికనోడజేసియా
  భాగినినేలుకొందుమన వారలె జచ్చిరి గెల్చెనాజిలో
  నాగమ యోడి భార్యయయినన్ జనులెల్లరు మెచ్చరే భువిన్


  రిప్లయితొలగించు
 19. కందం
  త్రాగుడు నేర్చిన దాదిగ
  నాగమ పెండ్లాము బ్రహ్మనాయునకుఁ గదా!
  బేగమ్ మాచర్ల కనెడు
  వాగుడు మీరెనె శకారివలె! వాంఛిత మా?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   నాగమ బ్రహ్మనాయునకు నచ్చిన పెండ్లము గాదె చూడఁగన్!
   బేగము నౌచు బిడ్డఁ గని వీరుని శూరుని బాలచంద్రునిన్
   బేగిని రాజుఁ జేసెనని వీధులఁ దూగుచు వాగుడాపవే?
   త్రాగుడు తో శకారి వలె రంజిలు టేల? చరిత్ర మార్చుచున్!

   తొలగించు
 20. (తప్పుగా చెపుతున్న విద్యార్థితో....గురువు గారు)


  నే నిట్టు లనగ లేదే
  "నాగమ పెండ్లాము బ్రహ్మ నాయునకు గదా";
  మానితముగ వచియింపుము
  కానగ నాగమ యతనికి కంటౌనుగదా!

  కంటు=శత్రువు

  రిప్లయితొలగించు
 21. తాగినమైకమునందున
  వాగుటతగదోయివట్టివాచాలతతోఁ
  నీగతి, కాదెన్నండును
  నాగమ పెండ్లాము బ్రహ్మనాయునకుఁ గదా

  రిప్లయితొలగించు