5, మార్చి 2020, గురువారం

సమస్య - 3300 (సంతానముఁ గాంచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్"
(లేదా...)
"సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై"

101 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  పంతంబెచ్చగ దేశసేవ కొరకై ప్రాణేశనున్ వీడుచున్
  వంతల్ తీర్చుచు రామభక్తుల యెదన్ పండించుచున్ కోర్కెలన్
  చింతల్ తీర్చుచు భాజపా జనులకున్;...శ్రీమాను రాజీవునిన్
  సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై...

  రిప్లయితొలగించు


 2. అంతయు లీలా మయ భగ
  వంతుని సృష్టియె మనుజులు పశుపక్ష్యాదుల్
  చెంతయె చేరిన జియ్యపు
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్!


  జిలేబి

  రిప్లయితొలగించు

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  సంతోషమ్మున గోచి దాల్చుచునహో సంఘమ్ములో నుండగా
  చింతల్ మీరగ మూషికమ్ము లిడెడిన్ చీకాకులన్ దోలుటన్
  పంతంబెచ్చగ సాకగా ముదముతో ప్రక్కింటినిన్ పిల్లిదౌ
  సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై...

  రిప్లయితొలగించు


 4. అంతర్యామి యనుంగుబిడ్డలగు పక్ష్యాదుల్, జనాకీర్ణముల్,
  శాంతమ్మై వెలయంగ సన్నికటమై , క్షామమ్మనావృష్టులా
  సాంతంబచ్చట లేక చేయ‌ భళి ప్రాశాస్త్రమ్మి రావంతు లా
  సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై!


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రాశాస్త్రమ్మి రావంతులు'?

   తొలగించు

  2. ప్రాశాస్త్రము - పరిపాలన
   ఇరావంతులు - రాజులు

   పరిపాలించు రాజులు


   సరియేనాండి ?

   తొలగించు


 5. శ్రీకృష్ణ మాయ మొదటి సంతానము :)


  అంతయు కృష్ణుని మాయయె!
  కాంతా మణి నారదునికి కళ్ళాలయె మా
  సాంతములు దొరలె పుట్టిన
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 6. స్వంతముగ పిల్లలెందుకు?
  వంతులవారిగయనాధ వసతిగృహమునన్
  కంతులవారిగ జేరెడు
  సంతానముగాంచిమురిసె సన్యాసి గడున్
  *+**********+*++********
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించు
 7. సుంతయు చదువకనే భగ
  వంతుని గారవము గూర్చు పలుకుల తోడన్
  వింత గొలుపుచుండిన యా
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్

  రిప్లయితొలగించు
 8. స్వాంతశ్శుద్ధిని ఘోరమైనతపమున్ సమ్యగ్విధానమ్మునన్
  చింతల్ వీడి తదేకదీక్ష సలిపెన్ జిత్సౌఖ్యమందంగ నా
  వింతన్ మింటను నిర్జరాళి గములై వీక్షించ నద్దేవతా
  సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై"

  రిప్లయితొలగించు
 9. రిప్లయిలు
  1. అంతా రామమయంబని
   కాంతారముసేరి హనుమ కైవల్యముకై
   చింతించుచుదా సీతా
   సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్"

   తొలగించు
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కైవల్యమునకై' అనడం సాధువు.

   తొలగించు
 10. హరి మాయతో నారదుడు ఒకసారి సరస్సు లో దిగి స్త్రీ రూపము పొంది అరవై మంది సంతానమున కనెను అవి యే ప్రభచాది వత్సరములు వారిని చూసి నారదుడు మురిసెన్ అను భావన

  వింతగ కోమలిఐ తా

  సంతు బడిసెనారదుండు సరసున మునుగన్,


  చింత యె వడయక నరువది

  సంతానముగాంచిమురిసె సన్యాసి గడున్

  రిప్లయితొలగించు
 11. (యాగరక్షణకోసం దశరథుని ఆస్థానానికి
  విచ్చేసిన విశ్వామిత్ర మహర్షికి సంప్రాప్తిం చిన రామలక్ష్మణ సందర్శనభాగ్యం )
  కంతుండట్లు వసంతునట్లు జతగా ;
  కందోయి కందమ్ముగా ;
  నంతంబొందగ జింత ; దాశరథులే
  యాగమ్ము నిర్విఘ్నశో
  భాంతంబున్ బొనరింప కౌశికు మహా
  భాగున్ సమీపింప ; రా
  ట్సంతానమ్మును గాంచి మోదము గనెన్
  సన్న్యాసి సంతుష్టుడై .
  (కంతుడు - మన్మథుడు ; దాశరథులు -
  రామలక్ష్మణులు ; కౌశికుడు - విశ్వామిత్రుడు )

  రిప్లయితొలగించు
 12. శ్రాంతుని కోరికపై సా
  ద్వంతుల యజ్ఞమ్ముఁ గాచ దనుజుల వారే
  యంతమొనర్చిన దశరథ
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్

  రిప్లయితొలగించు
 13. చెంతను చేరిన దాసికి
  నంతకు నంశను విదురమహాత్ముడు పుట్టన్
  స్వాంతముఁ దననైమిత్తిక
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్!

  రిప్లయితొలగించు
 14. చింతాక్రాంతుడగాకుము
  అంతట సుఖ శాంతినిచ్చు యాశ్రమమందున్
  సంతసమున యెగురగలుగు
  సంతానము గాంచి మురిసె సన్యాసిగడున్
  ++++++++++++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించు
 15. సంతు కొఱకు చిరకాలము
  చింతిల్లు నొకని కొఱకును చేయగ యాగ
  మ్మంతట నతనికి కలిగిన
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్

  రిప్లయితొలగించు
 16. ప్రాంతము దెలియదు, స్వార్థము
  సుంతైనను లేదు, జన్మ సుకృతం బేమో
  యంతయు శిష్యపరంపర
  సంతానము; గాంచి మురిసె సన్యాసి గడున్!

  రిప్లయితొలగించు

 17. మూడు వేల మూడొందల కైపద కొమరుల కవిరాట్ !


  సుంతయొకో కాదెంతయు!
  వంతుగలియ మూడు వేల పై మూడొందల్
  వింతగు కైపద కొమరుల
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్!  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు. నిజమే... వృద్ధాశ్రమంలో సన్యాసి జీవితాన్నే గడుపుతున్నాను. అయితే ఈ మూడువేల పైచిలుకు సంతానంలో మొత్తం నా సొంతం కాదు. పక్కింటివాళ్ళు, సేకరించినవాళ్ళు, మిత్రులచే పంపబడ్డవాళ్ళూ, ఎత్తుకొచ్చి కొద్దిగా రూపం మార్చినవాళ్ళూ ఇలా ఎందరో ఉన్నారు. :-)

   తొలగించు

 18. నా పూరణ : శార్ధూల విక్రీడితము
  ***** ****

  సుంతన్ దగ్గక శాస్త్రముల్ లవకుశుల్ జొక్కంగ నేర్వంగనే

  చింతల్ వీడెను క్ష్మాతనూజయె ప్రవీక్షించంగ నా విద్యలన్

  స్వాంతమ్మందున బ్రేమ పొంగ ఘనుడౌ వాళ్మీకి యా జానకీ

  సంతానమ్మును గాంచి మోదము గనెన్ సన్యాసి సంతుష్టుడై


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించు
 19. మిత్రులందఱకు నమస్సులు!

  [సంసారపు మాయను తెలుసుకొనఁగోరిన నారదుని స్త్రీగా మార్చి, సంవత్సర షష్టి రూపులగు ప్రభవాదులైన యఱువదిమంది సుతుల నిచ్చి, మాయ విడఁజేసిన విష్ణు మాయా విలాస కథా సందర్భము]

  శాంతిన్, "సంసృతి" మాయఁ దెల్ప హరి పుచ్చన్ నారదర్షిన్ భువిన్,
  బొంతం గల్గు కొలంకుఁ గ్రుంకి, యతఁడే పూఁబోఁడిగా మాఱియున్,
  జెంతం జేరిన భూపుఁ గూడి, సుత షష్టిన్ బొంది, మాయల్ విడన్,

  సంతానమ్మును గాంచి, మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై!

  రిప్లయితొలగించు
 20. మైలవరపు వారి పూరణ

  చింతల్ పొందకుమీశ్వరార్చనవిధిన్ సిద్ధించు నీ కోర్కె., స...
  త్సంతానమ్మగునంచు నమ్మ బలికెన్ సన్న్యాసి., తద్రీతిగా
  కాంతారత్నము భక్తితో గొలువగా కామ్యమ్ము సిద్ధింపనా...
  సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. అంతశ్శత్రుల గెల్వగల్గు సుతుడాహ్లాదంకరుడౌను.,ని...
   శ్చింతన్ మెల్గుమటంచు నారదుడు రక్షింపంగఁ దత్పుత్రు శ్రీ...
   కాంతానంతవిశిష్టగాథలను పల్కన్., నాడు లీలావతీ
   సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై!!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు
  2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
 21. కాంతార పు టా శ్రమమున
  కాంత యవనిజ గనె దానుకవలల నపుడా
  చెంతకు వఛ్చి న వాడై
  సంతానము గాంచి మురిసె సన్యాసి కడున్ l

  రిప్లయితొలగించు
 22. అందరికీ నమస్సులు 🙏🌹

  *|కం|*

  సంతస మొనరించగ మది
  వింతగ కోరికలనణచి విపరీతముగన్
  నంతయు తలచుచు నందున
  *"సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్"*!!

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌹🙏🌷🙏

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విపరీతముగా । నంతయు...' అనండి.

   తొలగించు


 23. కందము:
  చింతామణి గొడ్రాలికి
  చింతను దీర్పంగ నిచ్చె చిటికెడు బూదిన్
  వింతగ కవలల గనగా
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్.

  --గోలి.

  రిప్లయితొలగించు
 24. కాంతలు మువ్వురి తోడను
  రంతు జరుపె నా పరాశర సుతుండు లలిన్
  సంతతి వర్థిల వారల
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్
  సంతతి: కులము

  రిప్లయితొలగించు
 25. సంతును కోరి సతిపతులు
  చింతను బూనుచు యతివరు సేవింపగ శ్రీ
  కాంతుని దలచి ఫలమొసగ
  సంతానము గాంచి మురిసె సన్యాసి గడున్

  రిప్లయితొలగించు
 26. చెంతను చేరిన గువ్వల
  నెంతనొ ప్రేమను మఠమున చేరగ దీసెన్
  వింతగు రంగుల పక్షుల
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్

  రిప్లయితొలగించు
 27. గాంధారి పిండము వ్యాస మహర్షి రక్శించిన ఘట్టము

  కుంతీ కోమలి పొందె సంతనుచు నుక్రోషమ్ముతో గర్భమున్

  కాంతా రత్నము తాడనమ్ము నిడగన్ ,కాడ్పాటు తోనున్న భూ

  కాంతున్కాంచిన మౌని సేవకులతో గర్భంబు నెత్తించి చీ

  ముంతల్ తైలము తోడ నింప జనన మ్మొందెన్వహంతంబు లా

  సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై"

  రిప్లయితొలగించు
 28. సంతతి లేదనుచు మిగుల
  చింతించుచు తనను వేడిఁ జింతలు తీరన్
  సంతోషపడిన భక్తుని
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్"

  రిప్లయితొలగించు
 29. వింతగ సృష్టించి యిరుల
  కాంతకు పరిమళములద్ది గంగానదిలో
  చెంతకు జేరగ బడసిన
  సంతానము గాంచి మురిసె సన్యాసిగడున్
  ఇరులు = చీకటి (వ్యాస జననము)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  2. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!మీ వ్యాఖ్యలులేక బ్లాగు బోసిపోతున్నది!

   తొలగించు
 30. కందం
  చింతాక్రాంతను సీతను
  శాంతమ్మునఁ జేరఁ దీయ సౌజన్యత ని
  శ్చింతగఁ గవలలఁ గనఁ ద
  త్సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్

  రిప్లయితొలగించు
 31. శార్దూలవిక్రీడితము
  చింతాక్రాంతను నిండు గర్భవతి సచ్ఛీలన్ రమా రూపిణిన్
  శాంతమ్మందఁగ చేరఁ దీసి గొన విశ్రాంతిన్ ప్రసాదించి ని
  శ్చింతన్ జెందుచు జన్మనీయ కవలల్ శ్రీరాముఁ బోలంగఁ ద
  త్సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై

  రిప్లయితొలగించు
 32. (రామ లక్ష్మణులు విశ్వామిత్రునితో యాగ సంరక్షణకు వెడలిన సందర్భంలో)
  అంతము జేయగ రాక్షస
  మంతేవాసులుగ దండ్రి యానతి మీరన్
  చెంతను నడిచెడి భూవరు
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్

  రిప్లయితొలగించు
 33. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "సంతానముఁ గాంచి మురిసె
  సన్యాసి గడున్"

  సందర్భము:
  హా! సీతా! హా! లక్ష్మణా! అని మాయలేడి రూపంలో మారీచుడు అరువగానే రాముని కేదో ప్రమాదం జరిగిం దని భయమందిన సీత పరుగెత్తు మని తొందరపెడుతూ అనరాని మాట లనగా కలత జెంది లక్ష్మణుడు వెళ్ళిపోయాడు.
  త దాసాద్య దశగ్రీవః క్షిప్ర మాంతర మాస్థితః
  అభిచక్రామ వైదేహీం పరివ్రాజక రూప ధృత్
  అర.కాం.46-2
  ఆ అవకాశాన్ని వినియోగించుకొని రావణుడు శీఘ్రమే సన్యాసి రూపం దాల్చి సీత వద్దకు వచ్చాడు.
  కాషాయ వస్త్రం, శిఖ, గొడుగు, చెప్పులు, కమండలం అన్నీ సలక్షణంగా వున్నాయి. (శ్లక్ష్ణ కాషాయ..కమండలూ 3 పరివ్రాజక..వనే 4)
  సీత అథితి సత్కారాలు గావించి, పూజించింది. ఆమె నపహరించ నెంచిన రావణు డామె సౌందర్యాన్ని చూసి మురిసిపోయినాడు.
  రావణ కా మాసంతుష్టుడు = రావణు డనెడు కామమునందు అసంతుష్టు డైనవాడు (సంతృప్తి చెందనివాడు)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *కపట సన్యాసి*

  అంతన్ రావణ కా మా

  సంతుష్టుడు వచ్చెఁ గపట సన్యాసివలెన్

  బంతంబుతోడ.. జనకుని

  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  5.03.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 34. చింతాకంతయుఁనైహిక
  చింతనఁదలుపనిసదమలచిన్మయుఁడతఁడే
  సంతత తపమున దివిజుల
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చింతాకంతయు' తర్వాత అరసున్న అవసరం లేదు.

   తొలగించు
 35. కాంతారములను దాటుచు
  శాంతివనము జేరి ధ్యాన సాధన కొరకై
  చెంతనె వ్రాలిన పక్షుల
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్

  రిప్లయితొలగించు
 36. అంతామాయయటంచుమున్నెరిఁగితాఁ నావంతయేనిన్ మదిన్
  చింతన్నిల్పకసంచరించుటయెనౌచిత్యంబు సన్యాసికిన్
  కాంతన్ పుత్రులనర్థమున్విడచియేకాంతంబునన్ దేవతా
  సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంచరించుటయె యౌచిత్యంబు' అనండి.

   తొలగించు
 37. శాంత గుణాశ్రిత చిత్త ని
  రంతర దానగుణ శీల రాజిత లా సీ
  మంతినుల సదమల మతుల
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్


  సంతుష్టాత్మలు రాణు లింపుగను గౌసల్యాది కాంతామణుల్
  వింతన్ నల్వుర నంద నోత్తముల సంప్రీతిం గనన్ సత్కృపా
  స్వాంతద్యుమ్నుఁడు ఋష్యశృంగ మునియే భామాన్వ యేక్ష్వాకు స
  త్సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీనశ్వేతవరాహ రూప శివ భూమిత్రాతృ కూర్మప్రభా
   నానా వస్తు సుధా రమా సుసృజనా నైపుణ్య భాస్వన్నృసిం
   హానింద్యాకృతి వామనప్రవర రామాఖ్యావనీశఘ్న రా
   మానంతాసుర హంతృ కృష్ణ నృప బుద్ధావార్య కల్కీ నతుల్

   తొలగించు
  2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   మీ దశావతార పద్యం ప్రౌఢంగా, మనోజ్ఞంగా ఉన్నది.

   తొలగించు
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. ధన్యుఁడను.

   తొలగించు
 38. పంతముతోదశకంఠుడు
  సుంతయుమానంబులేకచోరపుబుద్ధిన్
  సొంతముజేయగజనకుని
  సంతానముగాంచి,మురిసెసన్యాసిగడున్

  రిప్లయితొలగించు
 39. కాంతన్ శ్రీ రఘు రామపత్ని నట దుష్కార్యమ్మటంచున్ మహా
  చింతాక్రాంతుడు లక్ష్మణుండు విడువన్ సీతమ్మ నాకానలో
  శ్రాంతుండామెను చేరదీయ కనియెన్ సత్పుత్రులన్నచ్చటన్
  సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పుత్రులన్+అచ్చటన్' అన్నపుడు ద్విత్వనకార ప్రయోగాన్ని సాధ్యమైనంత వరకు వర్జించండి.

   తొలగించు
 40. సమస్య:
  సంతానమ్మును గాంచిమోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై  చింతింపన్ పదివత్సరంబులుగతించెన్ పెళ్ళియైనాటికిన్
  సంతానంబులులేనిజంటలకువాంఛల్ దీరెఁదీవింపగాన్
  సంతోషంబుననాకుటుంబములుప్రస్తావించికీర్తింపగాన్
  సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై

  గాదిరాజు మధుసూదన రాజు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...దీరె' తరువాత అరసున్న అవసరం లేదు.

   తొలగించు
 41. చింతాక్రాంతునికా యతీంద్రుడుపదేశింపంగ సంసిద్ధుడై
  యెంతో భక్తిగ యాగమున్నెరిపె దా నిందీవరున్ సత్కృపన్
  సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్; సన్యాసి సంతుష్టుఁడై
  కాంతారమ్మున కేగె; దాపసికి నిష్కామ్యమ్మె సమ్మోదమౌ

  రిప్లయితొలగించు
 42. సంతుకొరకు సంసారపు
  చింతఁగొనక వ్యాసుడు తనుసృష్టించుకొనెన్
  సొంతము గానే శుకునిన్!
  *సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్!*

  రిప్లయితొలగించు
 43. సంతానమ్మునునొందుదాశరధినిన్సన్మౌనియాక్షణంబే
  సంతానమ్మునుగాంచిమోదముగనెన్సన్యాసిసంతుష్టుడై
  యంతేవాసులదీవనల్గలుగగాహర్షంబునేగల్గుగా
  చింతన్జేయగనొప్పునాప్రభు,రమాశ్రీవల్లభున్ముక్తికై

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించు
 44. చింతించెడు నా సీతకు
  కాంతారమ్మున వసతిడ కవి వాల్మీ కా
  కాంతకు బుట్టగ కవలలు,
  సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్

  రిప్లయితొలగించు
 45. సంతానమ్మది లేక రాజు మునికిన్ సాష్టాంగ దండమ్మిడన్
  సంతోషమ్మునచేసినంత మునియున్ శాంతంబు గా గాంచు చున్
  చింతల్ దీరునటంచుపండునొసగిన్ సేవించి పొందంగ నా
  సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై

  రిప్లయితొలగించు
 46. Your Affiliate Money Making Machine is ready -

  Plus, making money with it is as easy as 1---2---3!

  Here is how it all works...

  STEP 1. Input into the system what affiliate products the system will advertise
  STEP 2. Add push button traffic (it takes JUST 2 minutes)
  STEP 3. See how the system grow your list and sell your affiliate products all by itself!

  So, do you want to start making money???

  Get the full details here

  రిప్లయితొలగించు