సోకుగ గన్పడు చూడగ, నోకర గల్గును మెసవగ నోకహోటలులో శాకము కంటెను సతి ! వే పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ గురువు గారు మీ సూచన మేరకు సవరించిన పద్యం. కృతజ్ఞతలు 🙏
సందర్భము: పాతాళ లంకలో మైరావణుడు ప్రభువు. అక్కడ 81 అడుగుల విగ్రహం వున్న కాళికాలయం వుంది. పురుషులకు వేరే చెరసాల లున్నవి. అందు కిన్నర కింపురుషాదు లున్నారు. స్త్రీలకు వేరే చెరసాల లున్నవి. అం దొకదాంట్లో అతడు చెల్లెలు దుర్దండిని చేతులు కాళ్ళకు తగుమాత్రం కదల్చి నడువడానికి మాత్రం వీలుండేలా గట్టి సంకెళ్ళతో బంధించాడు. ఆమె కొడుకును మరో చెరసాలలో వుంచాడు. మైరావణుడు రామ లక్ష్మణులను విభీషణుని రూపంలో వెళ్లి తెచ్చి కాళి గుడిలో బంధించినాడు. బలి ఈయా లనుకున్నాడు. ఆచారం ప్రకారం ఇంటి ఆడపడుచుచేత పసుపు నీళ్ళతో మంగళ స్నానం చేయించాక గన్నేరు పూదండలు వేపాకులు మెడలో వేస్తారు. అప్పు డవి బలి ఈయదగిన నరపశువులు. మైరావణుడు చెల్లెలును పురమా యించాడు వేకువనే రామ లక్ష్మణులకు స్నానాలు చేయించి ఆ పని చూడు మని. అట్లైతే శాశ్వతంగా బంధ విముక్తురాలిని చేస్తా నని.. అట్లే వంటవాళ్ళనూ తొందరపెట్టాడు రుచ్యములైన పదార్థాలు వండా లని.. అదీ పద్య సందర్భం.. అనంతర కథ. ఆమె పొలిమేరలోని అమృతసరస్సులో 12 బిందెల నీళ్ళు తేవాలని బయలు దేరింది. ఆమె ఏడుస్తుంటే ఆంజనేయుడు ఓదార్చి ఆమె సంకెళ్ళు ఒక్క దెబ్బతో విరగ్గొట్టాడు. అవి మైరావణుడు తప్ప మరెవరూ తొలగించలేనివి. "నా కొడుకు బాల్యంలో వుండగా నారదుడు 'వీడు పాతాళ లంకకు రాజౌతా' డని చెప్పగా మా యన్న మమ్మ ల్నిద్దరినీ చెరలో బంధించా" డని ఆమె చెప్పింది. ఆంజనేయు డెంతో కష్టపడి ఆలయం చేరుకొని దుర్గాదేవిని ప్రార్థించినాడు. ఇలా ఎంతో కథ జరిగాక మైరావణుణ్ణి మారుతి సంహరించాడు.. (శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం వినవచ్చు) హవణించు = అలంకరించు 12.10.19 నాటి నా పూరణమూ చూడవచ్చు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*హనుమద్విభూతి*
"ఓ కలికీ! నరపశువుల
నా కాళికి బలి యొసంగ హవణింపవలెన్
వేకువ దండలతో వే
పాకులతో.." "వంటఁ జేయు మా రుచ్యంబౌ.."
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 12.03.20 -----------------------------------------------------------
కాకరకాయల పులుసా?
రిప్లయితొలగించండిభీకరమగు చేదు పోవ బెల్లము తోడన్
పాకపు పోపున కరివే
పాకులతో వంటఁజేయుమా రుచ్యంబౌ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
చాకోలేటులు దండిగాను తినగన్ జాగ్రత్తనున్ వీడుచున్
కేకల్ వేయుచు వైద్యుడయ్య సుగరున్ కించిత్తునున్ వద్దనన్
సాకుల్ చెప్పక వల్లభుండ! తినుమా! సంతోషమౌ రీతి వే
పాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్!
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పీకల్ నిండుగ రాత్రి ప్రొద్దుటను భల్ పెండ్లింటనున్ మేయగా
పాకుల్ మైసురు లడ్లు జాంగ్రిలననున్ భారమ్ము తోరమ్ముగా
చీకాకుల్ మిగులంగ జేయు పురుగుల్ చేరంగ పొట్టందు వే
పాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పొట్ట+అందు' అన్నపుడు సంధి లేదు. అక్కడ "చేరంగ నా పొట్ట..." అనవచ్చు.
🙏
తొలగించండిఆకులలో రాజము రే
రిప్లయితొలగించండిజీకటి దొలగించును మరి జేకూర్చు పసిన్
ప్రాకటమైనన్ కరివే
పాకులతో వంటజేయుమా రుచ్యంబౌ
పసి = సువాసన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిజేబులో డబ్బులు పోయెనే :)
ఓ కళ్ళాల! దివాలా
యే! కబళించెను బజారు! యేగానియు లే!
తేకువ గనుమా కరివే
పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి( ఒక పెద్దాయన తన యిల్లాలితో )
రిప్లయితొలగించండిసోకుల వంటలు చాలును ;
చేకొని బచ్చలి కొతిమిర జిలకర మునగల్
గాకర వెల్లులి కరివే
పాకులతో వంట జేయుమా ! రుచ్యంబౌ .
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితాకెన్ చీని జనాళి నా రసి భయోత్పాతమ్ము తాకంగనే
దూకెన్ జారి బజారు! జారె చమురే! దూపాడె బాజారెపో!
ఓకళ్ళాల! కిసాయి ఖాళి!కయిలో నోబేడ లేదాయె వే
పాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీకంఠాది సమస్తదేవగణముల్ శ్రేయస్కరం బౌచు మీ
రిప్లయితొలగించండిచీకాకుల్ దొలగించునంచు భువిపై సృష్టించి రిద్దానినిన్
సాకున్ దల్లిగ సత్యమోయి జనుడా శంకింప కీకర్రి వే
పాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిప్రాకటము! పెరటి కరివే
పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ
తాకదు వైరెసు మనల వి
వేకము తో లేహ్యముల చవిగొనదగునికన్ !
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడా.బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండికాకరకాయలనంగా
భీకరమగుచే దదుండు వినుమది తొలగన్
ప్రాకటమగు నా కరివే
*పాకులతో వంట చేయుమా రుచ్యంబౌ*
కానీ చివరి పాదంలో యతి కుదరలేదని అనుమానంగా ఉంది
..
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅది కాకుస్వర యతి. చేయుము + ఆ (నిబోధన)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చూడగ । నోకర..." అనండి. వోతో మొదలయ్యే తెలుగు పదాలు లేవు.
"చూడగ । నోకర గల్గును మెసవగ నొక హోటలులో..." అనండి.
తొలగించండిసోకుగ గన్పడు చూడగ,
తొలగించండినోకర గల్గును మెసవగ నోకహోటలులో
శాకము కంటెను సతి ! వే
పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ
గురువు గారు మీ సూచన మేరకు సవరించిన పద్యం.
కృతజ్ఞతలు 🙏
సమస్య :- "వేపాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ"
రిప్లయితొలగించండి(ఛందో గోపనం)
*కందం**
సోకుల శ్రద్ధలు చాలిక
ప్రాకటముగ వంటజేయ పాటుపడుటకున్
సాకులు జెప్పక కరివే
పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ
.........................✍చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆకలితో జేరితిమిట
రిప్లయితొలగించండివేకువగా నిద్రలేచి వేడిగనుప్మా
మాకొరకింకను కరివే
పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికేకల్ వేయకు "డార్లింగ్"
రిప్లయితొలగించండిప్రాకటమౌ ప్రకృతివైద్యపద్ధతి యనిరే!
చేకురు నారోగ్యము "వే
పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆకులు తినంగ జనులకు
రిప్లయితొలగించండిచేకురు నారోగ్య మనుచు చెప్పగ వినమే
కాకర శాకము కరివే
పాకు తో వంట జేయుమా రుచ్యంబౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఆకొన్న కూడు అమృతము..
"లోకో భిన్నరుచిర్హి" యన్న పలుకుల్ పూర్వోక్తముల్ సత్యముల్!
నీ కౌశల్యము జూపి పాకమున నెంతేన్ శ్రద్ధతో వండుమా!
యాకొన్నన్ దినఁ బ్రీతి! సుంత మధుమేహవ్యాధి తగ్గించు వే...
పాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్"!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి.... శంకరాభరణం....
రిప్లయితొలగించండి12/03/2020...గురువారం
సమస్య.
*******
"వేపాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్
నా పూరణ.
** *** *****
ఆకుల్ పువ్వులు వేర్లు కొమ్మలు గనంగా ఔషధంబై సదా
రాకుండన్ గడు వ్యాధులున్ శుభముగన్ బ్రాణాల రక్షించదే?
లోకమ్మందున వేపచెట్టు ఘనమౌ లోకించ సత్యంబె!వే
పాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
. 🌷 వనపర్తి 🌷
నా పూరణ 🙏🙏
రిప్లయితొలగించండి*"వేపాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ"*
(ఛందోగోపన సమస్య)
*కం||*
ఆకులు యలములు తినినన్
చాకు వలెను యుందు వనెను చాందసు డొకడున్
నా కోరిక చచ్చెను, వే
*పాకులతో వంటఁజేయుమా రుచ్యంబౌ!*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😃🙏😃🙏
*నా సరదా పూరణ* 🙏🌹🌹
తొలగించండి*కం||*
వేకువ ఝామున లేచితి
ఈకలు పీకిరి తినుటకు యిగురే బెట్టన్
నీకొక చిట్కా, కరివే
*పాకులతో వంటఁజేయుమా రుచ్యంబౌ!*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😊🙏😊🙏
నాకముదాకు సువాసన
రిప్లయితొలగించండిచేకొని పులిహోరజేయ జేర్చుచు శనగల్
దాకను నింగువ కరివే
పాకులతో వంటజేయుమా రుచ్యంబౌ
దాక = పాత్ర
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీకారమ్మునుజుట్టి శార్వరికి నిక్షేపమ్ముగా కుండలో
రిప్లయితొలగించండిసాకల్యమ్మన నిక్షుకాండములు నాస్వాదింపగా మావియున్
సౌకర్యమ్ముగ చింత యుప్పు జలమున్ సంధించి మిర్యాలు వే
పాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
ఆకులలములను వండెద
రిప్లయితొలగించండిపాకము రుచిగా ననుచును డంబము లాడే
యో కామిని, చూతము వే
పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ
శార్దూలవిక్రీడితము
రిప్లయితొలగించండిమీ కల్యాణము జేయ లేవనఁగ సామీప్యమ్మునన్ మండపాల్
సౌకర్యంబుగ చల్వ పందిరి విలాసంబౌగదే పైన వే
పాకుల్ వేసిన, వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్
శాకమ్ముల్ దగ వండ క్రిందుగను, యాస్వాదింత్రు వడ్డించినన్!
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
(ఛందో గోపనము)
వేపాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ
సందర్భము: పాతాళ లంకలో మైరావణుడు ప్రభువు. అక్కడ 81 అడుగుల విగ్రహం వున్న కాళికాలయం వుంది. పురుషులకు వేరే చెరసాల లున్నవి. అందు కిన్నర కింపురుషాదు లున్నారు. స్త్రీలకు వేరే చెరసాల లున్నవి. అం దొకదాంట్లో అతడు చెల్లెలు దుర్దండిని చేతులు కాళ్ళకు తగుమాత్రం కదల్చి నడువడానికి మాత్రం వీలుండేలా గట్టి సంకెళ్ళతో బంధించాడు. ఆమె కొడుకును మరో చెరసాలలో వుంచాడు.
మైరావణుడు రామ లక్ష్మణులను విభీషణుని రూపంలో వెళ్లి తెచ్చి కాళి గుడిలో బంధించినాడు. బలి ఈయా లనుకున్నాడు. ఆచారం ప్రకారం ఇంటి ఆడపడుచుచేత పసుపు నీళ్ళతో మంగళ స్నానం చేయించాక గన్నేరు పూదండలు వేపాకులు మెడలో వేస్తారు. అప్పు డవి బలి ఈయదగిన నరపశువులు.
మైరావణుడు చెల్లెలును పురమా యించాడు వేకువనే రామ లక్ష్మణులకు స్నానాలు చేయించి ఆ పని చూడు మని. అట్లైతే శాశ్వతంగా బంధ విముక్తురాలిని చేస్తా నని..
అట్లే వంటవాళ్ళనూ తొందరపెట్టాడు రుచ్యములైన పదార్థాలు వండా లని.. అదీ పద్య సందర్భం..
అనంతర కథ. ఆమె పొలిమేరలోని అమృతసరస్సులో 12 బిందెల నీళ్ళు తేవాలని బయలు దేరింది. ఆమె ఏడుస్తుంటే ఆంజనేయుడు ఓదార్చి ఆమె సంకెళ్ళు ఒక్క దెబ్బతో విరగ్గొట్టాడు. అవి మైరావణుడు తప్ప మరెవరూ తొలగించలేనివి. "నా కొడుకు బాల్యంలో వుండగా నారదుడు 'వీడు పాతాళ లంకకు రాజౌతా' డని చెప్పగా మా యన్న మమ్మ ల్నిద్దరినీ చెరలో బంధించా" డని ఆమె చెప్పింది.
ఆంజనేయు డెంతో కష్టపడి ఆలయం చేరుకొని దుర్గాదేవిని ప్రార్థించినాడు.
ఇలా ఎంతో కథ జరిగాక మైరావణుణ్ణి మారుతి సంహరించాడు..
(శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం వినవచ్చు)
హవణించు = అలంకరించు
12.10.19 నాటి నా పూరణమూ చూడవచ్చు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*హనుమద్విభూతి*
"ఓ కలికీ! నరపశువుల
నా కాళికి బలి యొసంగ హవణింపవలెన్
వేకువ దండలతో వే
పాకులతో.." "వంటఁ జేయు
మా రుచ్యంబౌ.."
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
12.03.20
-----------------------------------------------------------
నూకాలమ్మ మసూచి తట్టు ప్రబలన్నన్యోన్య స్నేహంబునన్
రిప్లయితొలగించండిప్రాకారంబుల చుట్టునున్ మరి గృహద్వారంబులన్ మూలలన్,
చీకాకుల్ దొలగున్,హరిద్రసలిలా విక్షేపణన్,లేతవే
పాకుల్ వేసిన;వంటకంబు గడురుచ్యంబౌను స్వాస్థంబిడున్
పాకంబున్ కరివేప యుల్లి మిరియాలన్ వాడగానిత్యమున్
మశూచి
తొలగించండిసతీ!
రిప్లయితొలగించండికందం
మాకని జామ యిగురులున్
పాకమ్ముగ రేని కాయ వడ్డించంగన్
డోకొనరు బదులుగన్ వే
పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ!
ఆకుల కూరలు లేవని
రిప్లయితొలగించండియాకలితో నన్ను మాడ్చ నన్యాయమ్మే
ఆ కాయలతో కరివే
పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ
పాకమురుచికరమగుటకు
రిప్లయితొలగించండిసాకల్యముగాపొగడగ సకల జనంబుల్
తేకువయలరగకరివే
పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఆఁకొన్న వారి కింపుగ
తొలగించండినేకాలము నందు నైన నిష్టం బగునే
యా కొత్తిమిరియుఁ గఱివేఁ
పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ
శాకాహారపు భోజనమ్ములఁ బలాశవ్రాత విఖ్యాతమున్
సాకారమ్మొనరించఁ బాకమున విధ్యాధిక్య వీక్షించుమా
వాకాటుల్ దగ మాని పెద్దలగు నవ్వారిన్ మదిం దల్చ వేఁ
పాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్
[దల్చవు + ఏఁపు +ఆకుల్ = దల్చ వేఁ పాకుల్; ఏఁపు = బాధ]
చేకూరెన్ మధు మేహమంచు మిగులన్ జింతింపగా నేలరా
రిప్లయితొలగించండినీకున్ క్షేమము గూర్చు సూత్రమొకటిన్ నే చెప్పుచుంటిన్ గదా
చీకాకెందుకు వీడుమా పెరటిలో చెట్టుండ నిత్యమ్ము వే
పాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్
ఆకులరాజమయయి,రే
రిప్లయితొలగించండిజీకటిపోగొట్టునట్టిచిరుపత్రంబౌ
శాకములన్నియుకరివే
పాకులతోవంటజేయుమారుచ్యంబౌ
బామ్మ:
రిప్లయితొలగించండి" నా కేమో కను లాన వాయె సరిగా నా నాన్న నే కర్రివే
పాకేమో యని దూసి వేసితిని వేపా కింత యీ చారులో "
మనవడు:
"చీకా కేలను బామ్మ యీ రసము బల్ చెన్నొందు నే మెత్తు వే
పాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్."
పాకము చేయుట యెరగని
రిప్లయితొలగించండిరాకేందుముఖికెరిఁగించె రమణుండీలా
కాకర వేపుడు కరివే
పాకులతో వంట జేయుమారుచ్యంబౌ
చౌకగ లభించు నోషధి,
రిప్లయితొలగించండియాకుల రూపున జనమ్ము నలరించగ నే
శాకము నేనియు కరివే
పాకులతో వంట చేయుమా రుచ్యంబౌ!
జోకుల్వేయుటలేదునమ్ముము ప్రభో!చూర్ణమ్ముగానుండువే
రిప్లయితొలగించండిపాకుల్వేసినవంటకమ్ముగడురుచ్యంబౌనుస్వాస్ధ్యంబిడున్
గాకల్దీరినవ్యాధులన్నియునునీకాండంపుకోడెమ్ముతో
జేకూరున్ససిసత్యమేయిదిసుమాశ్రీరామభక్తాగ్రజా!
ఏకాలంబుననైనవాడదగునేదేనిన్ పదార్థంబులో
రిప్లయితొలగించండిసాకల్యంబుగగూడి రుచ్యము రసాస్వాదంబుగా చేయునా
పాకంబందలియాకుపేరుకరివేపాకండ్రు, కాదయ్యొవే
పాకుల్!, వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్
చేకూరును రుచులన్నియు
రిప్లయితొలగించండిసాకల్యపు సొబగులన్ని సమపాళ్ళందున్
చేకూర్చి లేత కరివే
పాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ!