నడిరేయి సరదా పూరణ: కవులున్ లేమలు హైద్రబాదు నగరిన్ గాఢంపు బిర్యానినిన్పవలున్ రాత్రియు మెక్కుచున్ బలుపుగా వంకాయ బజ్జీలునున్లవలేశమ్మును సిగ్గు వీడి తనరన్ రాకాసి కాయంబనన్ శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
మీ సరదా పూరణ బాగున్నది.
🙏
అవగడములు కలిగించెడిశవ పూజలు కో రుచుండు జంతువుల బలిన్ అవిరామము జేసెడి కేశవపూజ లొసంగును శుభసంతోషములన్అవగడము = కీడు
మీ పూరణ బాగున్నది. 'బలిన్+అవిరామము' అని విసంధిగా వ్రాయరాదు. "జంతు బలులనే । యవిరామము..." అనవచ్చు కదా!
🙏🏽🙏🏽
నా పూరణ. మత్తేభము**** **** ***భవ పాథోనిధి నీద శక్యమగు నా పద్మాక్షునిన్ గొల్చినన్శివముల్ కూర్చియు బ్రోచు వేడ మదినిన్ శ్రీనాథునిన్ భక్తిచే!పవలున్ రాత్రియు శ్రద్ధ దల్చ హరియే పాలించడే? దివ్య కేశవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే" -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱 🌷 వనపర్తి🌷
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) అమిత్ షా అంతరంగము: పవలున్ రాతిరి భారతీయ భటులే ప్రాశస్త్యమౌ తీరునన్ భువిలో ధీరుడు వీరుడన్ వెలిగెడిన్ మోడీని ధ్యానించుచున్చవటల్ కాకయె చంపుచున్ విరివిగా జంబంపు చీనీయులౌ శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది.
తవణించు వేళ యిదియేగవతంబాయెను కరోన కారణముగ మానవుల బతుకులు సుమా! కేశవ! పూజ లొసంగును శుభసంతోషములన్జిలేబి
మీ పూరణ బాగున్నది.
శివనామామృతగానమునవదుర్గాంబలకుబెట్టునైవేద్యంబుల్,నవవిధమార్గపుశివకేశవపూజ లొసంగును శుభసంతోషములన్కొరుప్రోలు రాధాకృష్ణారావు
కాలమిదియె ధ్యానమునకు !అవకాశమ్మిదియే! కరోన కరణంబాయెన్ సుమా యెల్లరున్గవతంబయ్యిరి మానవాళి ప్రకృతిన్ కాపాడకన్ బోవగాను! వరంబాయె మరో విధమ్ముగ సుమా నుంపారగా నర్చ, కేశవ! పూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరేజిలేవి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నవరాత్రి తొలిదినమున శివ లలిత రూపిణిగ నుద్భ వమ్ము బడయ గాశివమను కోరి పరచు శైశవ పూజలొసంగును శుభ సంతోషములన్
కం//భవునికి భస్మము కొరకున్శవపూజ, లొసంగును శుభసంతోషములన్ !అవనిన నుజ్జయనీశుడెనవవిధ నర్చన సలుపగ నానందముతోన్ !!
అవమానంబని తెలుపుచు ఎవరును పోకూడదనెడు ఎకసక్కెములన్ చెవి పెట్టక చేసిన కే శవపూజ లొసంగును శుభసంతోషములన్
మైలవరపు వారి పూరణ 🕉నమో నారాయణాయ🙏🙏💐🌷అవధుల్ లేని మహత్వపూర్ణమగునా యష్టాక్షరీమంత్రమున్వ్యవధానంబిసుమంత లేక మదిలో వల్లించి వల్లించి., త... త్స్తవముల్ జేయుచు నిత్యకృత్యముల., భక్త్యావిష్టులై మ్రొక్కు కే... శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే?! మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
నవ విధ భక్తిని గొల్చుచు కువలయ మందలి జనతతి కోరిక తోడన్ భవ బంధ నాశు డగు కే శవ పూజ లొసంగును శుభ సంతోష ము ల న్
శివమున్ గోరుచు నిత్యముభవభయ హరులంచు జనులు వాసిగ నమ్మే యవనిని బ్రోచెడు శివకే శవపూజ లొసంగును శుభ సంతోషములన్
సవితృడు నక్రగతుండగుపవిత్ర సంక్రాంతి మనకు పర్వదినము! రెండవ దినమౌ కనుమను పాశవపూజ లొసంగును శుభసంతోషములన్!
క్రొవ్విడి వెంకట రాజారావు: తివురును చెందని విధమున పవిదగు భక్తిని నిరతము పరిశుద్ధుడవై పొవడుచు ఘటించు శివ కే శవ పూజ లొసంగును శుభసంతోషములన్
భవనాశమ్మొనరించువాడనుచు విశ్వాసమ్ముతో భక్తులే శివమున్ గోరుచు భోగముల్ విడిచి సచ్చీలుండ్రుగా నిత్యమున్ దవిషమ్మే తనవాసమై భుజగమే తల్పమ్ము గాగల్గు కే శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
అవిరళభక్తినొనరుకేశవపూజలొసంగునుశుభసంతోషములన్ శివపూజజేయునెడలనుభవబంధములెల్లదొలగిభగముంగలుగున్
నవనీ తోపమ సు మనోవివశత నిత్యామర వర వేష్టిత జగతిన్ వివిధ వ్యథోపశమ నాశవ పూజ లొసంగును శుభసంతోషములన్ [ఆశవము ==శీఘ్రత]అవనీదేవుల సంయమీశ్వరుల హృద్యానంద సంధాయ కైక వరాభ్యర్చనలన్ రమా కుధరజా కాంత ప్రశంసాలి సన్నవ గానామృత తృప్త చిత్తమున సద్భక్తిన్ గవాహ్యాది పాశవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే [నవము =స్తోత్రము; గో+అహి+ఆది = గవాహ్యాది; పాశవము = పశువులకు సంబంధించిన]
26/6/2016 నాటి సదృశ పూరణములు: (అరసున్నలు, ద్రుత సంధి సవరించి)అవనీ భారము దీర్పఁ బుట్టు నిల మాహాత్మ్యంబునన్ విష్ణువేసవనాధీశుఁడు లోకపాలకుఁడు తత్సన్నామ సంకీర్తనల్భవతోయాంబుధి దాట నావలట సంప్రాప్తింప నిత్యమ్ము కేశవసందర్శన మిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!సవనమ్ము లేల సేయఁగభవసాగర మీద గాఢ భక్తిని హరినింగవనములఁ బొగడ నగుఁ గేశవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్
భువిపైపుట్టుచు పూర్వజన్మపు ఫలమ్మున్ పొంద కర్మమ్ముచేచవిగొంచున్ పలుహీనమౌ పనుల నీచమ్మైన సంతృప్తికైయవసానమ్మున ముక్తిఁ గోరుకొని పద్మాక్షుండు దైత్యారి కేశవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
అందరికీ నమస్సులు 🙏🙏నా పూరణ 😄( *e-తరగతుల ఎఫెక్ట్* )*కం|*చివరకు జెప్పిన దిది కే *"శవ పూజ లొసంగును శుభసంతోషములన్"*నెవరది పలికెనిటుల ఛీ *"శవపూజ లొసంగును శుభసంతోషములన్"**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*🙏😄🙏
శివుఁడునుకేశవుడిరువురుభవనాశకులుర్వియందుభావింపంగానవిరామముగా శివకేశవపూజ లొసంగును శుభసంతోషములన్
భవుడున్ కేశవులిర్వురొక్కటిగసంభావించు భక్తాళికిన్భవనాశంబగునిక్కమీ పలుకు సంప్రాప్తించు మోక్షంబు కేశవుడే శర్వుఁడు శర్వుడే యజుఁడుసంసారార్ణవోద్ధారి కేశవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
అవనిని కరోన రేగగభవభయ హరుజేరి కొలువ బాయును కదరా!లవలేశమైన శివ, కేశవపూజ లొసంగును శుభసంతోషములన్
సవనంబులు వలనుపడంబవిరళ తపములొనరంగ నల్పాయువులౌతవ భక్తులకు కలిని కేశవ పూజలొసంగును శుభ సంతోషంబుల్ సవనంబుల్ దగజేయలేరు తమినిన్ శ్రద్ధాళులై యొప్పుగా నవిరామంబగు సంయతిం సలుపగా నల్పాయువుల్ మానవుల్ తవ నామంబును భక్తితో బలుకుచున్ ధర్మాత్ములై నిత్య కేశవ పూజాభిరతుల్ శుభంబు గనరే సంతోషముం బొందరే !
కందంఎవరిఁ గొలిచి కనక కశిపునవగడముల దాటె భక్తుడౌ ప్రహ్లాదుండవలీలన్ దగ, నా కేశవపూజ లొసంగును శుభసంతోషములన్మత్తేభవిక్రీడితముశ్రవణీయంబుగ శ్రీహరిన్ గొలిచెడున్ ప్రహ్లాదుపై క్రోధియైపవలున్ రేయియు మాననెంచుమనుచున్ బాధించినన్ దండ్రియేస్తవముల్ జేయుచు మాధవున్ గెలిచి తా సాధించె సంతృప్తి కేశవ పూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే!
శివునికి హరికిని బేధము లవలేశము లేదు నరయ రక్షణ నిడగన్ | నవతలు తొలగగ శివకే "శవపూజ లొసంగును శుభసంతోషములన్"
శ్రీలక్ష్మీ నారసింహాయనమఃతేది:01.06.2020.మహోదయులకు వందనములతో,శుభోదయం.నేటి సమస్యాపూరణ ప్రయత్నం -భవబంధమోచనంబీభువిసర్వసుఖంబు లంద బేర్మిసుహృది సద్భావమలరంగ యాకేశవపూజలొసంగును శుభసంతోషములన్.కవనోత్తుంగతరంగశీకరము లుత్క్రష్టాభిభావంబుతోస్తవనీయంబగు నక్షరాంజలుల ప్రస్తావంబుసల్పందగన్నవమోహంబగు సుందరాకృతుని నాన్యంబౌ తలంపుండ కేశవపూజాభిరతుల్ శుభంబు గనరే, సంతోషముంబొందరే
మ: అవతారమ్ము నఘోర వేశమున నావాహింప యాత్రాగతిన్ కవియించన్ తమ టక్కు చేష్టలన బాకానూదుచున్ దీవెనల్ద్రవిణమ్మున్ సమకూర్చ నీచముగ నేదారైన నర్తింప నైశవ పూజాభిరతుల్ శుభంబు గనరే సంతోషముం బొందరేవై. చంద్రశేఖర్
నవదుర్గాంబలుశక్తిరూపమగుసన్మాత్రల్విశేషంబునైశివసంకల్పముభక్తిరూపమునశ్రీచిద్రూపదైవంబునైనవమార్గమ్ములరాగధారలన,శ్రీనామంబునానందకేశవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరేకొరుప్రోలు రాధాకృష్ణారావు
భవ బంధనముల జిక్కిడిశివుడని కేశవుడని మది చింత యదేలాధ్రువముగ నొకటౌ శివ కేశవ పూజ లొసంగును శుభసంతోషములన్
సరిజేసితిని గురూజీ ! 🙏కం//భవునికి భస్మము కొరకున్శవపూజ, లొసంగును శుభసంతోషములన్ !అవనిని నుజ్జయనీశుడెనవవిధ నర్చన సలుపగ నానందముతోన్ !!
మిత్రులందఱకు నమస్సులు![తమ దీనస్థితిని బాల్యమిత్రుఁడగు కేశవున కెఱింగించి, తగిన ధనసహాయము నొందుఁడని కుచేలునకు నాతని భార్య హితవు బోధించిన సందర్భము]భవదీయాంచిత బాల్యమిత్రుని హరిం బ్రార్థించి, యర్థించుచోస్తవనీయుం డిఁక నీదు దైన్య గతికిం దా నోర్చునే? వేగమేసవయస్కున్ నినుఁ జేరఁదీసి, విభవత్సౌఖ్యంబిడుంగాదె? కేశవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే?
భవ బంధములను బాపునుశివమున గూర్చు ననయమ్ము సేవించినచో జవమును చేసిన శివకేశవపూజలొసంగును శుభసంతోషములన్
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
కవులున్ లేమలు హైద్రబాదు నగరిన్ గాఢంపు బిర్యానినిన్
పవలున్ రాత్రియు మెక్కుచున్ బలుపుగా వంకాయ బజ్జీలునున్
లవలేశమ్మును సిగ్గు వీడి తనరన్ రాకాసి కాయంబనన్
శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
మీ సరదా పూరణ బాగున్నది.
తొలగించండి🙏
తొలగించండిఅవగడములు కలిగించెడి
రిప్లయితొలగించండిశవ పూజలు కో రుచుండు జంతువుల బలిన్
అవిరామము జేసెడి కే
శవపూజ లొసంగును శుభసంతోషములన్
అవగడము = కీడు
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'బలిన్+అవిరామము' అని విసంధిగా వ్రాయరాదు. "జంతు బలులనే । యవిరామము..." అనవచ్చు కదా!
🙏🏽🙏🏽
తొలగించండి
రిప్లయితొలగించండినా పూరణ. మత్తేభము
**** **** ***
భవ పాథోనిధి నీద శక్యమగు నా పద్మాక్షునిన్ గొల్చినన్
శివముల్ కూర్చియు బ్రోచు వేడ మదినిన్ శ్రీనాథునిన్ భక్తిచే!
పవలున్ రాత్రియు శ్రద్ధ దల్చ హరియే పాలించడే? దివ్య కే
శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే"
-- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి🌷
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
అమిత్ షా అంతరంగము:
పవలున్ రాతిరి భారతీయ భటులే ప్రాశస్త్యమౌ తీరునన్
భువిలో ధీరుడు వీరుడన్ వెలిగెడిన్ మోడీని ధ్యానించుచున్
చవటల్ కాకయె చంపుచున్ విరివిగా జంబంపు చీనీయులౌ
శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండితవణించు వేళ యిదియే
గవతంబాయెను కరోన కారణముగ మా
నవుల బతుకులు సుమా! కే
శవ! పూజ లొసంగును శుభసంతోషములన్
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండిశివనామామృతగానము
రిప్లయితొలగించండినవదుర్గాంబలకుబెట్టునైవేద్యంబుల్,
నవవిధమార్గపుశివకే
శవపూజ లొసంగును శుభసంతోషములన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండికాలమిదియె ధ్యానమునకు !
అవకాశమ్మిదియే! కరోన కరణంబాయెన్ సుమా యెల్లరున్
గవతంబయ్యిరి మానవాళి ప్రకృతిన్ కాపాడకన్ బోవగా
ను! వరంబాయె మరో విధమ్ముగ సుమా నుంపారగా నర్చ, కే
శవ! పూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
జిలేవి
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినవరాత్రి తొలిదినమున శి
రిప్లయితొలగించండివ లలిత రూపిణిగ నుద్భ వమ్ము బడయ గా
శివమను కోరి పరచు శై
శవ పూజలొసంగును శుభ సంతోషములన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండికం//
రిప్లయితొలగించండిభవునికి భస్మము కొరకున్
శవపూజ, లొసంగును శుభసంతోషములన్ !
అవనిన నుజ్జయనీశుడె
నవవిధ నర్చన సలుపగ నానందముతోన్ !!
అవమానంబని తెలుపుచు
రిప్లయితొలగించండిఎవరును పోకూడదనెడు ఎకసక్కెములన్
చెవి పెట్టక చేసిన కే
శవపూజ లొసంగును శుభసంతోషములన్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి🕉నమో నారాయణాయ🙏🙏💐🌷
అవధుల్ లేని మహత్వపూర్ణమగునా యష్టాక్షరీమంత్రమున్
వ్యవధానంబిసుమంత లేక మదిలో వల్లించి వల్లించి., త...
త్స్తవముల్ జేయుచు నిత్యకృత్యముల., భక్త్యావిష్టులై మ్రొక్కు కే...
శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
నవ విధ భక్తిని గొల్చుచు
రిప్లయితొలగించండికువలయ మందలి జనతతి కోరిక తోడన్
భవ బంధ నాశు డగు కే
శవ పూజ లొసంగును శుభ సంతోష ము ల న్
శివమున్ గోరుచు నిత్యము
రిప్లయితొలగించండిభవభయ హరులంచు జనులు వాసిగ నమ్మే
యవనిని బ్రోచెడు శివకే
శవపూజ లొసంగును శుభ సంతోషములన్
సవితృడు నక్రగతుండగు
రిప్లయితొలగించండిపవిత్ర సంక్రాంతి మనకు పర్వదినము! రెం
డవ దినమౌ కనుమను పా
శవపూజ లొసంగును శుభసంతోషములన్!
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితివురును చెందని విధమున
పవిదగు భక్తిని నిరతము పరిశుద్ధుడవై
పొవడుచు ఘటించు శివ కే
శవ పూజ లొసంగును శుభసంతోషములన్
భవనాశమ్మొనరించువాడనుచు విశ్వాసమ్ముతో భక్తులే
రిప్లయితొలగించండిశివమున్ గోరుచు భోగముల్ విడిచి సచ్చీలుండ్రుగా నిత్యమున్
దవిషమ్మే తనవాసమై భుజగమే తల్పమ్ము గాగల్గు కే
శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
అవిరళభక్తినొనరుకే
రిప్లయితొలగించండిశవపూజలొసంగునుశుభసంతోషములన్
శివపూజజేయునెడలను
భవబంధములెల్లదొలగిభగముంగలుగున్
నవనీ తోపమ సు మనో
రిప్లయితొలగించండివివశత నిత్యామర వర వేష్టిత జగతిన్
వివిధ వ్యథోపశమ నా
శవ పూజ లొసంగును శుభసంతోషములన్
[ఆశవము ==శీఘ్రత]
అవనీదేవుల సంయమీశ్వరుల హృద్యానంద సంధాయ కై
క వరాభ్యర్చనలన్ రమా కుధరజా కాంత ప్రశంసాలి స
న్నవ గానామృత తృప్త చిత్తమున సద్భక్తిన్ గవాహ్యాది పా
శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
[నవము =స్తోత్రము; గో+అహి+ఆది = గవాహ్యాది; పాశవము = పశువులకు సంబంధించిన]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి26/6/2016 నాటి సదృశ పూరణములు: (అరసున్నలు, ద్రుత సంధి సవరించి)
తొలగించండిఅవనీ భారము దీర్పఁ బుట్టు నిల మాహాత్మ్యంబునన్ విష్ణువే
సవనాధీశుఁడు లోకపాలకుఁడు తత్సన్నామ సంకీర్తనల్
భవతోయాంబుధి దాట నావలట సంప్రాప్తింప నిత్యమ్ము కే
శవసందర్శన మిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!
సవనమ్ము లేల సేయఁగ
భవసాగర మీద గాఢ భక్తిని హరినిం
గవనములఁ బొగడ నగుఁ గే
శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్
భువిపైపుట్టుచు పూర్వజన్మపు ఫలమ్మున్ పొంద కర్మమ్ముచే
రిప్లయితొలగించండిచవిగొంచున్ పలుహీనమౌ పనుల నీచమ్మైన సంతృప్తికై
యవసానమ్మున ముక్తిఁ గోరుకొని పద్మాక్షుండు దైత్యారి కే
శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
అందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండినా పూరణ 😄
( *e-తరగతుల ఎఫెక్ట్* )
*కం|*
చివరకు జెప్పిన దిది కే
*"శవ పూజ లొసంగును శుభసంతోషములన్"*
నెవరది పలికెనిటుల ఛీ
*"శవపూజ లొసంగును శుభసంతోషములన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏😄🙏
శివుఁడునుకేశవుడిరువురు
రిప్లయితొలగించండిభవనాశకులుర్వియందుభావింపంగా
నవిరామముగా శివకే
శవపూజ లొసంగును శుభసంతోషములన్
భవుడున్ కేశవులిర్వురొక్కటిగసంభావించు భక్తాళికిన్
రిప్లయితొలగించండిభవనాశంబగునిక్కమీ పలుకు సంప్రాప్తించు మోక్షంబు కే
శవుడే శర్వుఁడు శర్వుడే యజుఁడుసంసారార్ణవోద్ధారి కే
శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
అవనిని కరోన రేగగ
రిప్లయితొలగించండిభవభయ హరుజేరి కొలువ బాయును కదరా!
లవలేశమైన శివ, కే
శవపూజ లొసంగును శుభసంతోషములన్
సవనంబులు వలనుపడం
రిప్లయితొలగించండిబవిరళ తపములొనరంగ నల్పాయువులౌ
తవ భక్తులకు కలిని కే
శవ పూజలొసంగును శుభ సంతోషంబుల్
సవనంబుల్ దగజేయలేరు తమినిన్ శ్రద్ధాళులై యొప్పుగా
నవిరామంబగు సంయతిం సలుపగా నల్పాయువుల్ మానవుల్
తవ నామంబును భక్తితో బలుకుచున్ ధర్మాత్ములై నిత్య కే
శవ పూజాభిరతుల్ శుభంబు గనరే సంతోషముం బొందరే !
కందం
రిప్లయితొలగించండిఎవరిఁ గొలిచి కనక కశిపు
నవగడముల దాటె భక్తుడౌ ప్రహ్లాదుం
డవలీలన్ దగ, నా కే
శవపూజ లొసంగును శుభసంతోషములన్
మత్తేభవిక్రీడితము
శ్రవణీయంబుగ శ్రీహరిన్ గొలిచెడున్ ప్రహ్లాదుపై క్రోధియై
పవలున్ రేయియు మాననెంచుమనుచున్ బాధించినన్ దండ్రియే
స్తవముల్ జేయుచు మాధవున్ గెలిచి తా సాధించె సంతృప్తి కే
శవ పూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే!
శివునికి హరికిని బేధము
రిప్లయితొలగించండిలవలేశము లేదు నరయ రక్షణ నిడగన్ |
నవతలు తొలగగ శివకే
"శవపూజ లొసంగును శుభసంతోషములన్"
శ్రీలక్ష్మీ నారసింహాయనమః
రిప్లయితొలగించండితేది:01.06.2020.
మహోదయులకు వందనములతో,శుభోదయం.
నేటి సమస్యాపూరణ ప్రయత్నం -
భవబంధమోచనంబీ
భువిసర్వసుఖంబు లంద బేర్మిసుహృది స
ద్భావమలరంగ యాకే
శవపూజలొసంగును శుభసంతోషములన్.
కవనోత్తుంగతరంగశీకరము లుత్క్రష్టాభిభావంబుతో
స్తవనీయంబగు నక్షరాంజలుల ప్రస్తావంబుసల్పందగన్
నవమోహంబగు సుందరాకృతుని నాన్యంబౌ తలంపుండ కే
శవపూజాభిరతుల్ శుభంబు గనరే, సంతోషముంబొందరే
మ:
రిప్లయితొలగించండిఅవతారమ్ము నఘోర వేశమున నావాహింప యాత్రాగతిన్
కవియించన్ తమ టక్కు చేష్టలన బాకానూదుచున్ దీవెనల్
ద్రవిణమ్మున్ సమకూర్చ నీచముగ నేదారైన నర్తింప నై
శవ పూజాభిరతుల్ శుభంబు గనరే సంతోషముం బొందరే
వై. చంద్రశేఖర్
నవదుర్గాంబలుశక్తిరూపమగుసన్మాత్రల్విశేషంబునై
రిప్లయితొలగించండిశివసంకల్పముభక్తిరూపమునశ్రీచిద్రూపదైవంబునై
నవమార్గమ్ములరాగధారలన,శ్రీనామంబునానందకే
శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే
కొరుప్రోలు రాధాకృష్ణారావు
భవ బంధనముల జిక్కిడి
రిప్లయితొలగించండిశివుడని కేశవుడని మది చింత యదేలా
ధ్రువముగ నొకటౌ శివ కే
శవ పూజ లొసంగును శుభసంతోషములన్
సరిజేసితిని గురూజీ ! 🙏
రిప్లయితొలగించండికం//
భవునికి భస్మము కొరకున్
శవపూజ, లొసంగును శుభసంతోషములన్ !
అవనిని నుజ్జయనీశుడె
నవవిధ నర్చన సలుపగ నానందముతోన్ !!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[తమ దీనస్థితిని బాల్యమిత్రుఁడగు కేశవున కెఱింగించి, తగిన ధనసహాయము నొందుఁడని కుచేలునకు నాతని భార్య హితవు బోధించిన సందర్భము]
భవదీయాంచిత బాల్యమిత్రుని హరిం బ్రార్థించి, యర్థించుచో
స్తవనీయుం డిఁక నీదు దైన్య గతికిం దా నోర్చునే? వేగమే
సవయస్కున్ నినుఁ జేరఁదీసి, విభవత్సౌఖ్యంబిడుంగాదె? కే
శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే?
భవ బంధములను బాపును
రిప్లయితొలగించండిశివమున గూర్చు ననయమ్ము సేవించినచో
జవమును చేసిన శివకే
శవపూజలొసంగును శుభసంతోషములన్