13, జూన్ 2020, శనివారం

దత్తపది - 168

కవిమిత్రులారా,
మబ్బు - వాన - ముసురు - వరద
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. 

47 కామెంట్‌లు:

 1. మబ్బుకొనిన గాంధారీ కుమారుడనియె
  ద్రోవదిఁగని నీవా నను తొల్లి చూచి
  నవ్వితివి? వరదత్తుల నాఁబరగెడు
  నీ మగలు దాము సురుల నేగెలుతు మ
  టంచను ప్రగల్భులిట దాసులైరిమాకు
  దాసివీవింక మాకు నీదంభ మణతు

  రిప్లయితొలగించండి
 2. *13/06/2020*

  అందరికీ నమస్సులు 🙏

  *శంకరాభరణం దత్తపది*

  *మబ్బు - వాన - ముసురు - వరద*
  పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
  భారతార్థంలో నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

  ద్రౌపతి కీచకునితో అన్నట్లు భావనతో (నేను అప్పుడు లేను🙏😊)...

  *కం*

  అడుగగ మే *మబ్బు* రపడి
  తడబడె, నీ *వా న* నుగని తపియించితివా!
  విడువు *ము సురు* చిర మనుకొనె
  కడు ధీ *వర ద* రినిచేర కాదది శ్రేయం!!

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏😊🙏

  రిప్లయితొలగించండి
 3. అఙ్ఞాతవాసమునకు ముందు

  కృష్ణ!యేపదమబ్బునో క్లిష్టమెంచ
  గడచి వానప్రస్థము మేము బడయగాను
  ముసిరినవి చిక్కులన్ని దాముసురుదీయ
  భక్తవరద!మమ్మేలెడు భర్తవీవె!

  రిప్లయితొలగించండి
 4. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః
  తేది:13-06-2020. మహోదయులకు సూషోదయమ్.

  నేటి దత్తపది మబ్బు,వాన,ముసురు,వరదలను అన్యార్థ ప్రయోగంలో భారతార్థానికి పద్య ప్రయత్నం -

  హే కృష్ణా! భక్తవరద!
  నీకృప మేముసురు బోక గెలువగన్
  మాకు పతిత్త్వమ్మబ్బున్
  శ్రీ కరముగజేయవా! నశించ నధర్ముల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   రెండవ పాదంలో గణభంగం. "నిలిచి గెలువగన్" అనండి.

   తొలగించండి
  2. ఆర్యా! ధన్యోస్మి. సవరణ స్వీకృతం.

   తొలగించండి
  3. నీవా నన్నెదిరించగ
   నేవాలకమబ్బనిట్లు నీమము దప్ప
   న్నేవరదుడాయని దగన్
   బ్రోవడు పాపములముసురు ప్రోదయ్యెనటన్.

   మొదటిది సవరణతో -
   హే కృష్ణా! భక్తవరద!
   నీకృప మేముసురు బోక నిలిచి గెలువగన్
   మాకు పతిత్త్వమ్మబ్బున్
   శ్రీ కరముగజేయవా! నశించ నధర్ముల్

   తొలగించండి

 5. తే.గీ.

  ( శ్రీ కృష్ణుడు రాయబారిగా ఏగి సుయోధనితో ఇలా హితువు చెబుతున్నాడు...)


  వినుము!భూవర!దర్పము వీడుమయ్య!
  అదన మబ్బురమౌ రీతి యనక నీవు
  పాండు సుతులదౌ భాగము వారికిడుము
  కానిచో!గాటముసురు తగలదె నీకు?
  తగవు గోరెదవా నయముగునె యద్ది?


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 6. దేవ దే(వా న)లువ పితా, బ్రో(వర ద)య

  తోడ. వచ్చితి వీవు నాదు గృహమునకు,

  పుణ్య (మబ్బు)ను గానాకు, పుచ్చు కొనుము

  (ముసురు) తేనెను,ఫలములు ముదము‌గ‌ నని

  వెన్న దొంగతో పలికెను‌ విదురు డపుడు


  రాయ భారము తర్వాత. కృష్ణుడు విదురునింట ఆ‌ధిత్యము‌ స్వీకరించిన సమయములో విదురుడు పలుకు మాటలు

  రిప్లయితొలగించండి
 7. ముచ్చటించగవారినిపుణ్యమబ్బు
  వానప్రస్థముముగియించివరలుచుండ
  మూడు దిక్కుల కష్టాలు ముసురుకొనగ
  రక్షవసుదేవసుతుడువరదముకుంద
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 8. పుణ్యమబ్బునుచరితనుముచ్చటించ
  వానప్రస్థముచరియించువారలనగ
  ముప్పుముప్పేటదాడులుముసురుకొనగ
  రక్షవసుదేవసుతుడువరదముకుంద
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి


 9. హే కృష్ణా ముకుందా మురారి ! దౌపది పిలుపుగా  రావా ననుకావన్ వర
  దా!వలమబ్బురము వ్రేకదనమును కావం
  గా వేగిరము! సురుగు నె
  త్తావికి సాయమ్ముగ నగధరుడా రమ్మా!  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. కృష్ణుడు సుయోధనుని తో ----
  కుశల మబ్బును సోదరుల్ కూడి యుండ
  దురమున దవాన లంబది దుఃఖ మొసగు
  ముసురు కొను నిడుము లవి భువిని యంత
  జనుల గావర దక్ష తన్ సంధి సలిపి

  రిప్లయితొలగించండి
 11. తే. గీ. పిఱికి తనమబ్బె నేలను ప్రియసఖ! యప
  కీర్తి గొనెదవా వానర కేతనుండ!
  నీవరదమున చింతిల నేర్వ దగునె
  గన వితండ బుద్ధి ముసురుకొనియె నీకు!
  (కురుక్షేత్రమున శ్రీకృష్ణుడు అర్జునునితో పలికిన మాటలు)

  రిప్లయితొలగించండి
 12. శ్రీకృష్ణునితో ధర్మరాజు
  మొండికి సుగుణ *మబ్బు* నే పుడమిపైన
  స్వార్థ భా *వాన* సతతము సాగుచుండ
  *ముసురు* కొనె యుద్ధ మేఘాలు మొప్పెకతన
  భక్త *వరద* ! సలుపు రాయ భారమిపుడు

  రిప్లయితొలగించండి

 13. శంకరాభరణం..13/06/2020

  దత్తపది - 168
  మబ్బు - వాన - ముసురు - వరద
  పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
  భారతార్థంలో నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. 

  కం//
  ★★★

  ( ...శ్రీ కృష్ణుడు రాయబారిగా ఏగి సుయోధనితో ఇలా హితువు చెబుతున్నాడు...)


  కడు పాపమబ్బు!పట్టును
  విడు బావా! నయము గాదు!విను ముసురున్ దం
  దడి తగులు భూవర!దయన్
  పుడమిని భాగమిడు పాండు పుత్రులకు నృపా!


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 15. పాప(మబ్బు) నీకు పాంచాలి వేధింప
  రౌర(వాన)బడకు రాజ రాజ
  విను(ము సురు)గువడును విభవమ్ములన్నియు
  (వర ద)యా గుణమ్ము వాసి గూర్చు

  రిప్లయితొలగించండి
 16. వానప్రస్థము శ్రేయమై వరలుగాన
  వృద్ధులెల్ల ముసురుకొను వెతలు వీడి
  మబ్బుకొనునట్టి యాశల మరులుకొనక
  వరదుడగువాని వేడుచు బ్రతుకవలయు

  రిప్లయితొలగించండి
 17. పరమ పద'మబ్బు' శరణన్న పాహి!పాహి!
  కేశ'వా!న'ను దయజూడు కృష్ణ! కృష్ణ!
  'ముసురు' కొనిన నధైర్యపు మురికి తొలగ,
  భక్త 'వరద' నభయమిడి భద్రతిమ్ము!

  రిప్లయితొలగించండి
 18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 19. మబ్బు - వాన - ముసురు - వరద
  పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
  భారతార్థంలో నా పూరణము.

  రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో
  నిట్లనియె.

  మామ! క్షేమమబ్బును చేటు మానుమింక
  పాండు సుతుల కీవానతి వ్వంగ రాజ్య
  మేల, దాము సురులరీతి యిద్ధరణిని
  గొల్వ! వరదహస్తమునిచ్చి గొలువుతీరు!

  రిప్లయితొలగించండి
 20. నీవా నన్నెదిరించగ
  నేవాలకమబ్బనిట్లు నీమము దప్ప
  న్నేవరదుడాయని దగన్
  బ్రోవడు పాపములముసురు ప్రోదయ్యెనటన్.

  రిప్లయితొలగించండి


 21. ఇవ్వాళ జీపీయెస్ వారు రాయ లేదు కాబట్టి , వారి తరపున నేటి భారతం వారి ప్రియతమ బెంగాలు+ మమతా దీదీ :)


  రావా! నరేంద్ర మోడీ!
  యీ వానల గనుము సురుగు లిచ్చెను బెంగా
  లే వరదల మయమై! నీ
  వే వరదాయివి! మమతయె వేమబ్బుకొనెన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. *కీచకుడు ద్రౌపదితో పలికిన మాటలు*

  జవరదనముఁ బల్కు జవరాల మమ్మబ్బు
  రపరచె గద, ముసురులన్ కడుగెడు
  దాసివైన నేమి వాసియందమె నీది
  చేరవా నను, మదిఁ జింతమాని

  జరవదనము =మృదువు.
  ముసురులు=అంట్లపాత్రలు.

  రిప్లయితొలగించండి
 23. వరదా మేమబ్బుర మం
  ద రోదనము సురుచిరమును దయతో విని మా
  ది రమాసతితో రావా
  న రార్తులము మాకు రక్షణం బీయంగన్

  రిప్లయితొలగించండి
 24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 25. భక్తవరద!కృష్ణ!వానరాధిపుకేతు!
  శ్రేయమబ్బునటులజేయుమయ్య!
  యుద్ధమేఘములవియయిద్ధరముసురుకొ
  నకగమునుపెసామి!నయముజేయు

  రిప్లయితొలగించండి
 26. తే.గీ.

  కానవాననుమోదము కావ్య పఠన
  ముసురు కొన్నట్టి యజ్ఞాన ముసుగు దొలగ
  వాసి గీతను వెలయించ వరదకృష్ణ
  భారతమ్మును చదివిన భాగ్యమబ్బు

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 27. స్వర్గంలో ఊర్వ శి అర్జునునితో ...

  కందం
  సరసమ్మబ్బునె నరులకు
  పరువాన వరించి సుఖద వలపించుటలున్
  నిరతము సురుచిర మనియెడు
  మరుకేళికి కురువర! దయ మన్నించఁ గదే

  రిప్లయితొలగించండి
 28. నీవా నను బంధింతువు
  సావాసము సురుచిరమని సంధిని సేయన్
  బోవేల కురుష్వధిపా
  ధీవర దరిజేరితినిటిదె కుశల మబ్బుటన్

  తొలి ప్రయత్నం చేసితిని విజ్ఞులు మన్నింప మనవి.

  రిప్లయితొలగించండి
 29. విశ్వరూప సందర్శనానంతరం కృష్ణునితో అర్జునుడు

  దేవా! నవారుణ రుచుల
  దావానల మబ్బురమన దర్శింపగ నీ
  లో విశ్వ రూపము వరద!
  భావము సురుచిరమయి నను పావను జేసెన్

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 30. ధృతరాష్ట్రుని తో కృష్ణుని పలుకులు

  దాసుల మొదలు దే’వర ద’ నుక నున్న
  సభన , నీ’వా న’రుని యొక్క చామ నీడ్చ
  నాపకనె పుణ్య’మబ్బు’నా యరయుమయ్య
  తథ్య ‘ముసురు’ కలుగ నీదు తనయులకును

  రిప్లయితొలగించండి
 31. *నిండు సభలో వస్త్రాపహరణ సమయంలో ద్రౌపతి.*

  కావర దయామయా నను కరుణతోడ
  పాప మబ్బుననెడు భీతి వదలిరైరి
  మాధవా నను బ్రోవరా మగువఁ గావ
  రమ్ము సురుచిర రూపా సరసిజ నాభ.

  రిప్లయితొలగించండి