23, జూన్ 2020, మంగళవారం

సమస్య - 3406

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్"
(లేదా...)
"ఇంతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్"
(కళ్యణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

52 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    గొంతుల్ కోసెడు రాజకీయముననున్ కొండాడగా మిత్రులే
    పంతమ్మొందుచు దూకి పోరుచునహో పైకమ్ము కోల్పోవుచున్
    సంతాపమ్మున క్రుంగి యేడ్వగనయో సాధించనత్తయ్యలే
    యింతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కాంతన్ గానక వ్రాయలేని కవులే గ్రంథమ్ములన్ కూర్చగన్
    సంతోషమ్మున స్ఫూర్తి నొందగ కడున్ జాగ్రత్తనున్ వీడుచున్
    గంతుల్ వేయగ మర్కటాల
    వలెనున్ కన్చూపునన్ లేకయే
    యింతుల్;.. వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "కప్పురవిడె మిచ్చు కాంత కనుచూపులో ఉంటేనే" హృద్యమైన పద్యం వస్తుందంటారు. బాగుంది మీ ఆటవిడుపు పూరణ.

      తొలగించండి

    2. "గంతుల్ వేయగ మర్కటాల వలెనున్"

      It is said that William Makepeace Thackeray, on the title "Vanity Fair" for his novel striking his head, jumped up from his bed and ran seven times around it.

      తొలగించండి
  3. ఇడుకొను సిరుల నొక‌ పడతి,


    నడపును చదువు నొకపడతి, నమ్మిన శక్తిన్


    పడతియె నొసగున్,మరియే

    పడతులు సరిపోరు మధుర పద్య రచనకున్

    రిప్లయితొలగించండి
  4. కడు రంగముల గెలిచిరే
    పడఁతులు , “సరిపోరు మధుర పద్యరచనకున్"
    జడువగవలె నట్లు బలుక ,
    గడబిడ యగునని దెలియుడు గాంతల దోడన్

    రిప్లయితొలగించండి
  5. బద్ధుడు సూనృతమ్ములకు పావనచంద్రమతీశు డర్థిసం
    బద్ధుడునై శ్మశానపరిపాలకు డయ్యె, బలీంద్రు డట్లుగా
    తద్ధరణీప్రదాతయయి ధన్యు డధోగతు డయ్యె, దానకృ
    ద్బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  6. పడతులబొగడుచుగురువనె
    పడఁతుల సరిరారు మధుర పద్యరచనకున్
    తడబడిఛాత్రుడుపలికెను
    పడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్

    రిప్లయితొలగించండి


  7. విడువరు జిలేబులు సుమా
    పడఁతులు! సరి, పోరు మధుర పద్యరచనకున్
    వడియాలనువేసినటుల
    గడియగడియకున్ దడదడ గడగడ విడిగా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. వడివడి  పనులను చేయుచు
    గడియారమువోలె కార్య ఘటనలు కూర్చున్ 
    సడి చేయక యన సరిగాదు  
    పడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్ 

    రిప్లయితొలగించండి
  9. పుడమిఁ గరయిత్రి మొల్లయె
    కడురమణీయముగ వ్రాసె కావ్యము గదరా
    గడసరి, పలికితి వేలర
    పడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్

    రిప్లయితొలగించండి


  10. ఔరౌరా యేమి యీ అభాండముల్ !



    కాంతల్నేర్వగ లేని విద్య గలదే కందోత్పలమ్మాది పూ
    బంతుల్కట్టిరి శంకరాభరణ దివ్యారామమున్ ప్రీతితో
    చెంతన్ చేరుచు కైపదమ్ములలరన్ చిత్రాతిచిత్రమ్ముగా
    నింతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్?



    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. చెడు నడవడితో సతతము
    కుడుచుచు మధు మాంసమ్ముల కొంటె తనముతో
    గడగడ వాగుచు దూలెడు
    పడతులు సరి పోరు మధుర పద్య రచన కున్

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    శాంతిస్థావరమైన కాంత మది సంసారంపు భారమ్మునన్
    చింతాక్రాంతముగాగ., భర్త మరి హింసింపంగ నిత్యమ్ము రా...
    ద్ధాంతమ్మౌ గృహసీమలో కవితకున్ తావుండునే ? యట్టిచో
    నింతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  13. చెడుగను బలుకులు పలుకకు
    "పడఁతులుసరిపోరు మధుర పద్యరచనకున్"
    నడపుచు నన్నియు కళలను
    వడి వడిగనుపూరణంబు(బంపెడి వారే

    రిప్లయితొలగించండి
  14. కడు రంగముల బ్రవీణులు
    పడతులు,సరిపోరు మధుర పద్యరచనకున్
    వడిగా నాడుట,పోటీ
    వడి పాడుటకున్ పురుషులు,వారసమాన్యుల్

    రిప్లయితొలగించండి
  15. [23/06, 7:44 AM] bhagvan yagna: పిడివాదము జేయకుమిల
    *పడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్*
    వడి యూహలు మారనిచో
    వెడదంపుమొగముమెకమయి వేటాడుదురే!!!

    వెడదంపుమొగముమెకము-సింహం

    [23/06, 8:03 AM] bhagvan yagna: పడిపడి యింటిలి పాదుల
    కడు వేగము పనుల జేయ కరుణన్ పతిదే
    వుడు కఠినాత్ముడయిన నా
    పడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్!!!

    రిప్లయితొలగించండి
  16. శ్రీమాత్రేనమః     
      
    చింతాకంతయు చింతలేక హృదియే శ్రీ సంగతంబైన చో   
    స్వాంతంబందున భాసురంబు సొబగుల్ వాగ్దేవితంత్రీ ధ్వనుల్ 
    సంతోషంబుగ వెంగమాంబ కవితా చందంబు! పల్కంగ యా   
    ఇంతుల్ వ్రాయగలేరునిశ్చయముగా,హృద్యమ్ముగాపద్యముల్ ?

    కస్తూరి శివశంకర్, ముంబయి  

    రిప్లయితొలగించండి
  17. సమస్య :-
    "పడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్"

    *కందం**

    గడగడ నాంగ్లము నేర్పెడు
    బడుల జదివి తెలుగు పలుకు బడులే రాకన్
    పొడి పొడి పలుకులు పలికెడు
    పడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్
    .................✍చక్రి

    రిప్లయితొలగించండి
  18. మిత్రులందఱకు నమస్సులు!

    "సుంతైనన్విరమమ్ములేక గృహమున్ సుస్వర్గసీమాధికం
    బంతంతన్మఱి మార్చఁగాను శ్రమకుం బాలౌచుఁ దాఁ బిల్లలం
    గాంతున్మామనునత్తనున్ ససిగ వే కాపాడ యత్నించు నే

    యింతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్!"

    రిప్లయితొలగించండి
  19. అంతన్ భ్రాంతినిఁ బొందితో? కవివరా! యాలోచనన్ మానితో?
    కొంతైనన్ మతి లేద? నీకిటుల సంకోచమ్మునే వీడితో?
    వంతల్ పాడుట మాను మూర్ఖులకు! నా వాగ్దేవి పాలింప నే
    *"యింతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్"*

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాంతారత్నముయే నొసంగు నిలలో గాటంపు సంపత్తులున్
      కాంతారత్నముయే నొసంగు నిలలో జ్నానంపు టంకారముల్
      సంతానమ్ముకు మూలకారణము స్త్రీ సత్యంబు కాకున్న నే
      యింతుల్ వ్రాయగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగా పద్యముల్

      తొలగించండి


  21. పుడమిని కుకవిత వ్రాయగ
    *పడతులు సరిపోరు, మధుర పద్యరచనకున్*
    కడగిన చాలును తప్పక
    పడయుదురెప్పుడును వీరె బహుమతులెల్లన్.

    పడతుల రచనా పాటవ
    మడుగడుగున హెచ్చుచుండ నక్కసు తోడన్/ననవరతంబున్
    నుడువుట సబబా నిట్టుల
    *'పడతులు సరిపోరు మధుర పద్యరచనకున్.'*

    కాంతండివ్వకపోగసమ్మతి నిలన్కన్చూపు నైనన్న టన్
    *ఇంతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్"*
    కాంతుండిచ్చినసమ్మతిన్ కడువడిన్ కాంతామణుల్ కూర్తు రే
    కొంతైనన్ సమయమ్మ జిక్కిన సరే కూర్చంగ కావ్యముల్



    రిప్లయితొలగించండి
  22. అడుగిడె విరియాల వనిత
    సుడులను సృష్టించెమొల్ల సుందర వసుధన్
    బడుచుయు వేమూరి నననే
    పడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్

    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  23. కందం
    ఇడుముల్ గరోన నిడ, దూ
    కుడుగన్ జెలరేగఁ జైన, కొందలపెట్టన్
    మిడతలు నశాంతి రగులన్
    బడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్

    శార్దూలవిక్రీడితము
    ఎంతైనన్ గరుణార్ధ్ర చిత్త గతులై యింపారు కాంతామణుల్
    వింతన్గూర్చి కరోన మింగ గలుగన్ వేవేల ప్రాణమ్ములన్
    వంతన్బొందఁగ పంటపైన మిడుతల్ వాలంగ నష్టమ్ములన్
    చింతాకారకమౌచుఁ జైన భటులన్ ఛేదించ నిశ్చేష్టులై
    యింతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్

    రిప్లయితొలగించండి
  24. చింతాక్రాంతుల జేయునట్టి బదముల్ జిందింప మాత్సర్యమున్
    ఇంతుల్ వ్రాయఁగ లేరు; నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్
    కాంతల్ వ్రాయగ గర్ణపేయములగున్ కావ్యమ్ములై భాసిలున్
    స్వాంతమ్మూయలలూపు రీతి నుడువన్ సాధ్యమ్మగున్ వారికే

    రిప్లయితొలగించండి
  25. 23.06.2020
    అందరికీ నమస్సులు🙏

    నా పూరణ యత్నం..

    *కం*

    గడియకొక పనియనుచు దా
    బడలిక చెందుచు నిరతము పరుగుల నిడుచున్
    విడిగా సమయము నెరుగని
    *పడతులు సరిపోరు మధుర పద్య రచనకున్*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  26. గడబిడఁజేయగఁజాలక
    విడువకమాటలముసుగునువేదనఁజెందన్
    వడిగలరవ్వలపలుకుల
    పడఁతులుసరిపోరుపద్యరచనకున్

    రిప్లయితొలగించండి
  27. సంతోషమ్మున నింటి బాధ్యతల నశ్రాంతమ్ము కావించుచున్
    కాంతల్ వర్తిలుచుందురే దొరకునే కాలమ్ము వెచ్చించగా
    కొంతైనన్ మగడియ్యకున్న నెరవున్ కోర్కెన్ ప్రవీక్షించి తా
    నింతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్

    రిప్లయితొలగించండి
  28. గడసరి పురుషులు చేతికి
    నిడిరే గరిటెలు, కుదరదు నికపై నటులన్!
    గొడవలు రేపకు రీవిధి
    పడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్

    రిప్లయితొలగించండి
  29. పడతీ!యేమనియంటివి
    పడతులుసరిపోరుమధురపద్యరచనకున్
    విడువకమాబ్లాగునుగన
    పడతులపూరణలుమెండుపరికింపంగా

    రిప్లయితొలగించండి
  30. పంతుల్ నేర్పగ శ్రద్ధతోడ వినుచున్ బద్యాల సాహిత్యమున్

    వంతుల్ వచ్చిన వెంటనే తిరిగి యప్పంజెప్పు నైపుణ్యమే

    యింతింతై కవయిత్రులైరి నిలువన్ వృత్తంబు లెన్నెన్నొ, యే

    యింతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్?

    రిప్లయితొలగించండి
  31. శాంతీ సౌఖ్యము లున్నచాలు గదరా జాగర్యమున్ బొందుచున్
    కాంతల్ జేయగ లేని కార్యమది యీ కల్పంబులో లేదుగా
    సంతోషమ్మది మెట్టినింట కరువై సంతాపమున్ బొందె యా
    ఇంతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్

    రిప్లయితొలగించండి
  32. పుడమిన్ నేటికిఁ దలఁచమె
    కడు గారవమునను మొల్లఁ గవయిత్రినిఁ దా
    మిడి భీతిలి వెనుకంజను
    బడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్

    [సరి పోరు = నశించరు]


    కాంతా రత్నము లెంచఁ గాంతులకు నిక్కం బిత్తురే స్ఫూర్తినిం
    బొంతన్నిల్చి సతమ్ము సాదరము నంభోజాక్షులే కాన వే
    దాంతం బౌనె తలంచ సత్కవులు, సాహాయ్యమ్ము నీ కున్నచో
    నింతుల్, వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్

    రిప్లయితొలగించండి
  33. సంతున్ బెంచుటయే భువిన్ సతులకున్ సద్ధర్మమై యొప్పగా
    నింతుల్ వ్రాయగలేరు నిశ్చయమ్ముగా;హృద్యమ్ముగా పద్యముల్
    నెంతేనిన్ ననిపుణత్యమున్ చతురతన్ నింపారగా గూర్తురే
    చింతల్ దొల్గగ శ్రీహరిన్ మనమునన్ జింతించి పూజింగా

    అడచ బడినవారె భువిన్
    బడతులు;సరిపోరు మధుర పద్యరచనకున్
    గడుసరి మగవారలె చే
    నిడ గంటము వాణిగొలుచు నింతులతోడన్

    రిప్లయితొలగించండి
  34. ఇంతుల్వ్రాయగలేరునిశ్చయముగాహృద్యమ్ముగాబద్యముల్
    కాంతా!యెట్లుగజెప్పనోపుదువుబేకాంతామణుల్వ్రాయగా
    నెంతోమందిగనుండిరిచ్చటగదాయీమందిరంబానగా
    నింతుల్జేయగలేనిదేదియుభువిన్వీక్షించగన్పించునే?

    రిప్లయితొలగించండి
  35. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  36. డా.బి.ద్వారకానాధ్

    సడలెను రచనా దక్షత
    పడి పడి మగవారితోటి పదునగు మాటల్
    కడు సున్ని తులగుట వలన
    పడతులు సరిపోరు మధుర పద్య రచనకున్

    రిప్లయితొలగించండి
  37. శా:

    చింతింపందగు స్త్రీల నిత్య విధులన్ శ్రీకారమున్ జుట్టగన్
    దంతఃశుద్ధి తదాదిగా టిఫిను, టీ, తాకీదు లీడేర్చుచున్
    కొంతైనన్ నిలు సందు లేక పవలున్ కూడొండి సాయంత్రమున్
    యెంతైనన్ తగు నల్ప హారము నహో నీ రీతి పట్టీలతో
    ఇంతుల్ వ్రాయగ లేరు నిశ్చయముగా హృద్యంబుగా పద్యమున్

    కొన్ని ఇతర భాషా పదాలను సౌలభ్యత కొరకు వాడాను.

    టిఫిను =Tiffin , టీ=Tea , తాకీదు= order
    పట్టీ=schedule

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  38. ఇంతుల్ కావ్య ప్రసూన గంధము విరా
    జిల్లన్ సరాగోక్తులన్
    చెంతన్ బంచి విశేష సంభరిత రా
    శీ భూత సత్కావ్యముల్
    పుంత న్నిల్పె ననంత మోదము కదా!
    పో! యిట్టివౌ నిందలా?!
    "ఇంతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్"

    రిప్లయితొలగించండి