5, జూన్ 2020, శుక్రవారం

సమస్య - 3390

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్"
(లేదా...)
"దానవరూపియై విడిచె దానవరూపము దానవుం డటన్"

65 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    అమిత్ షా స్వప్నము:

    మానము కోలుపోవుటను మంగళ కార్యము కాదటంచు తా
    చీనుల సైన్యమున్ వడిగ చిందర వందర చేయబూనుచున్
    కోనల కోనలన్ తరుమ గొప్పగు మోడియె; చీని నేతయే
    దానవరూపియై విడిచె దానవరూపము దానవుండటన్

    రిప్లయితొలగించండి
  2. 05.06.2020
    అందరికీ నమస్సులు 🙏

    నా పూరణ 😞

    *కం*

    మానవులే దానవులని
    వీనుల విందుగ పలుకగ వింటిమి నెపుడో
    హీనముగా జంపితిరట
    *"దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్"!!*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏

    రిప్లయితొలగించండి
  3. *అందరికీ నమస్సులు* 🙏

    *నా పూరణ*

    *ఉ*

    జ్ఞానము బొందగన్ జదువు చాలక కాలము వెళ్లబుచ్చుచున్
    కానక లోకమందునొక కష్టము నెప్పుడు తోటివాడిలోన్
    మానవ రూపియై తరచు మానుచు మంచిని నెల్లవేళలన్
    *"దానవరూపియై విడిచె దానవరూపము దానవుం డటన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌹🙏
    ( *తప్పులుంటే ఎల్లరు* 🙅‍♂️🙅‍♂️)

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    "అహ నా పెళ్ళంట"

    కానగ సూనుడే కడకు గాభర నొందుచు నేలకూలగా
    దీనత వీడి పద్యమును దిక్కులు మ్రోగ సుభద్ర మాతయే
    వీనుల విందుగా పలుక వేగమె మ్రొక్కుచు రంగరావహో
    దానవరూపియై విడిచె దానవరూపము దానవుండటన్

    రిప్లయితొలగించండి
  5. మానవ రూపుని రాముని
    బాణాహతి గర్వమెల్ల భగ్నము గాగా
    ఆ నారాయణు మది గని
    దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్

    రిప్లయితొలగించండి
  6. మానిత దివ్య మూర్తి మహిమాన్వితుడా హరి మాయ జేతనా
    దానవు నేమరించ వనితామణి రూపము దాల్చె నంతటన్
    ఆ నవ మోహనాంగి గని యామెను జేర విమోహచిత్తుడై
    దా నవ రూపియై విడిచె దానవరూపము దానవుం డటన్

    రిప్లయితొలగించండి
  7. కానన మందొక కుటిలో
    దానొక్కతె తో డులేమి దాళుచునుండన్
    జానకిని దొంగిలించగ
    దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్

    రిప్లయితొలగించండి


  8. మానవుడే దుర్గుణముల
    దానవునిగ మారె ! సావధానము తోడై
    తానొక ప్రవచనమును విని
    దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. దానవుడు మాయ తోడ భ

    వాని గ రూపమున మార్చి‌ వాముని జేరన్

    వానిని జంపె శివుడు, నడి

    దానవ రూపమును విడిచె దానవుడచటన్



    అడిదానవుఁడు : పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 Report an error about this Word-Meaning
    అంధకుని కొడుకు. వీఁడు స్వస్వరూపమున యుద్ధమున మరణమునొందకుండునట్లును వేరురూపము చెందిన మరణము కలుగునట్లును వరముఁబొంది ఉండెను. కనుక ఒకప్పుడు పార్వతివలె రూపము ధరించి శివుని మోసము చేయరాఁగా అది అతఁడు ఎఱిఁగి వీనిని చంపెను.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. కానలలో దిరుగాడెడి

    మానవ పలలము భుజించు మాయావిని‌ నా

    మౌని యుదరమున చంపన్

    దానవ రూపము‌ నువిడిచె దానవు డచటన్


    వాతాపి ని‌ అగస్త్యుడు చంపుట

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  13. కందోత్పల

    విముఖత తోడు తొలగ ప్రౌ
    ఢిమ దానవరూపియై విడిచె దానవరూ
    పము దానవుండటన్ వివ
    రముగా నొకనాడు వినగ ప్రవచనములనే !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. దానవ సైంహికు డమృతముఁ
    బానము సేయంగ సురుల బారున, విష్ణుం
    డాననము నఱుక గ్రహమై
    దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్

    రిప్లయితొలగించండి
  15. తానహమున రావణుడటు
    జానకినే యపహరించి చచ్చెను గాదా!
    తానిక శాపము బాయగ
    దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్

    రిప్లయితొలగించండి
  16. మానవుడుకాదు మగువల
    మానములనుపాడుచేయు మనుజాశనుడే
    మానినిహితబోధలువిని
    దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్

    రిప్లయితొలగించండి
  17.  మానవ రూపము నందున
    మానవతిని మోసగింప మాయలు పన్నెన్ 
    బోనము నివ్వగ చేరగ  
    దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్   

    రిప్లయితొలగించండి
  18. అవనీచక్రము నాట్యరంగమట నయ్యాపాత్రధారుల్ నరుల్
    వ్యవహారాంతరదుఃఖమగ్నలును భూమ్యాకాశమధ్యావృతా
    హవనీయానలకుండతప్తపటుమాయాసృష్టిసమ్మోహమా
    నవనీత..ప్రతిమల్ నటించెఁ గడు నానందమ్ముతో నగ్నిలోన్.

    మానవనీతప్రతిమలు మానవులు అనే (అనునట్టి) తీసుకరాబడిన బొమ్మలు.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  19. మానిని జానకి కొరకై
    కానలఁ జని రావణుండు కాముకు డగుచున్
    దా నైకటికుడు గానట
    దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్

    రిప్లయితొలగించండి
  20. ఆనతి గొని మారీచుడు
    దానవ రూపమును విడిచె దానవు డచట న్
    తానొక హరిణ పు రూపున
    జానకి దృష్టి కి పడుటకు చరి యించె గదా !

    రిప్లయితొలగించండి
  21. మిత్రులందఱకు నమస్సులు!

    [రావణుఁడు మారీచుని మాయలేడిగా మార్చి, యంపి, రాముఁడా మాయామృగముకోసమయి యడవులకు వెడలగా, లక్ష్మణునిఁ గూడ మాయచే నచటినుండి పంపించి, తాను మాయా మౌనీంద్రు వేషముం దాలిచి, సీత నపహరించిన ఘట్టము నిట ననుసంధానించుకొనునది]

    మానవకాంత సీతకయి, మాయల జింకను నంపి, శీఘ్రమే
    దా నయవంచనం, బ్రభుని దాశరథిన్ వనమందుఁ ద్రోలియుం,
    దాను మునీంద్ర రూపమునుఁ దాలిచి, సీతను దొంగిలెం! గనం

    దా నవరూపియై విడిచె దానవరూపము, దానవుం డటన్!

    రిప్లయితొలగించండి
  22. కానల లోన పంచవటిఁ గాపుర ముండెడి మోహనాంగి యౌ
    మానినిఁ దస్కరించు నెప మందున జేరిన పాళమందు నా
    జానకి చెంతకేగుతరి జంగమ రూపము దాల్చె గాంచగన్
    దా నవరూపియై విడిచె దానవరూపము దానవుం డటన్

    రిప్లయితొలగించండి
  23. కం//
    శ్రీనటరాజును గొలుచుచు
    దానవ రూపమును విడిచె, దానవుఁ డచటన్ !
    గానక పార్వతి నడుగగ
    తానుగ రావణునిజేరి తాపముదీర్చెన్ !!

    రిప్లయితొలగించండి
  24. జానకిని మోసగించను
    దానవ రూపమును విడిచె దానవు డచటన్,
    మౌనిగ బిక్షను గోరి ని
    దానము లక్ష్మణుని రేఖ దాటగ జేసెన్.

    రిప్లయితొలగించండి
  25. హీనుడు సొమ్ముల కొరకై
    ఖూనీ చేయగ తలపగ, కోమలి వేడన్|
    దీనత దయగొని వదలెన్|
    దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్"

    రిప్లయితొలగించండి
  26. ఆ నారాయణ భక్తుడు
    జానకినిన్ రావణుండుశాపమునెపమై
    దానవుడైచెఱబట్టియు
    దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్

    రిప్లయితొలగించండి
  27. కాననమందునదిరుగుచు
    దానవుడారావణుండుదాల్చెనుమునిగా
    మానినిసీతాపహరణకు
    దానవరూపమునువిడిచెదానవుడచటన్

    రిప్లయితొలగించండి
  28. కాననమందు శంబరము కాంచన వర్ణముఁ గానిపించగా
    జానకి కోరె రాఘవుని చక్కని జింకను పొందనెంచుచున్
    దానిని వెంబడించి కని దానవ మాయగ, బాణమేయగా
    దానవరూపియై విడిచె దానవరూపము దానవుం డటన్

    రిప్లయితొలగించండి
  29. మౌనియొసంగ శాపము, నమానుషచర్యల కారణమ్ముతో
    మానవలోకమందునను మానిసి దిండిగ పుట్టి, పృథ్విపై
    జ్ఞాన విహీనుడై చనుచు కానల మారగు రూపమందునన్
    వానికి శాపమోచనము పావన రాముడొసంగ నంబుతో
    దానవరూపియై విడిచె దానవరూపము దానవుం డటన్

    రిప్లయితొలగించండి
  30. జానకి జూడ బంగరపు ఛాయ మృగంబయి సంచరించగా
    మానిని మానసంబు నిటు మాయల పన్నుచు తాటకేయుడే
    తానిక గూల రామవిలు తాకి యమాంతము మోక్షమొందుచున్
    దానవరూపియై విడిచె దానవరూపము దానవుం డటన్

    రిప్లయితొలగించండి
  31. ఉ:

    మానవ మాతృడే గనగ మారిన వైనము దుర్భరంబవన్
    కానన మందు జేరి కడు కర్కశ రీతిని మోసగించుచున్
    దీనుల గాంచి మార్గమున దిక్కుగ నిల్చన పోషణార్థమై
    దానవ రూపియై విడిచె దానవ రూపము దానవుండటన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  32. మానినిఁ జపలాక్షిం జం
    ద్రానను దనుమధ్య ఘన నితంబిని నచటం
    గానఁగ మున్నూనిన యది
    దా నవ రూపమును విడిచె దానవుఁ డచటన్

    [నవ రూపము = క్రొత్త రూపము]


    మానవ మాత్రుఁ డాతఁ డని మత్తిలి బాహు బలోద్ధతిన్ సరో
    షానన భీకరుండు ముని సత్తము దూఱి చెలంగ శప్తుఁడై
    దానవ కిన్న రాహి నర దైత్య సుపర్వులు సూచుచుండగం
    దా నవరూపియై విడిచె దానవరూపము దానవుం డటన్
    [దాను +అవరూపి = దానవరూపి]

    రిప్లయితొలగించండి
  33. కాననమందునన్గనగగాంక్షనుగైకొనసీతనున్దగన్
    దానవరూపియైవిడిచెదానవరూపముదానవుండటన్
    మానవరూపముందనరిమైత్రినిగోరుచువానరాదులన్
    దానవుడైనరావణుని,దైత్యకులంబునుసంహరించెగా

    రిప్లయితొలగించండి
  34. కందం
    కానల వసించు సీతనుఁ
    బూనుచుఁ జెరఁబట్ట బంతిమోములదొరయే
    కానఁగ భిక్షువనంగన్
    దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్

    ఉత్పలమాల
    కానల వీడి శూర్పణఖ కర్ణములున్ ముకు బాసి క్రోధియై
    దీనత రావణాసురుని దిగ్గున జేరుచు సీతఁ జేకొనన్
    బూనుచఁ గాముకుండగుచుఁ బొందఁగ జానకి భిక్షకుండుగన్
    దా నవరూపియై విడిచె దానవరూపము దానవుం డటన్

    రిప్లయితొలగించండి
  35. కానన మందు పడంతిని
    మానుగ గొంపోవ వచ్చె మాయా యతియై
    జానకి మాతను గాంచుచు
    దానవ రూపమును విడిచె దానవుడ చటన్

    రిప్లయితొలగించండి
  36. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః
    తేది:05-06-2020.
    మహోదయులకు నమస్సులతో శుభోదయం.

    నేటి సమస్యాపూరణ యత్నం -

    శ్రీ నరసింహాకృతిగని
    తాను ముదమునొందె విష్ణు తద్వైరముతో
    యా
    నృహరినఖములమడిసి
    దానవ రూపమును విడిచె
    దానవు డచటన్.

    రిప్లయితొలగించండి