28, జూన్ 2020, ఆదివారం

సమస్య - 3411

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నిలువు బొట్టుఁ బెట్టె నీలగళుడు"
(లేదా...)
"నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు మురారి భక్తుఁడై"

70 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  సలుపుచు పద్యయాగమును సాయము ప్రొద్దున శ్రాంతిలేకయే
  కులుకుచు హైద్రబాదునను కూరిమి నిచ్చుచు భక్తబృందమున్
  పలుకుచు శంకరయ్యయన పద్యములల్లుచు వందవందలున్
  నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు మురారి భక్తుఁడై..

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  తలపులు దిల్లి గద్దెనిడి తన్మయ మొందగ జంద్యమూనుచున్
  వెలుపల దాపటన్ గనక వేడుక జేయుచు మోడిఁ దిట్టుచున్
  కులుకుచు భంగు పీల్చగను కోవెల లందున వోట్లకోసమై
  నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు మురారి భక్తుఁడై...

  రిప్లయితొలగించండి
 3. వరమునీయ నసుర వలచినట్లాతని
  యుదరమందు విధిగ నొదుగియుండ
  వెలికి దీసినట్టి విష్ణుమూర్తి నొసట
  నిలువు బొట్టుఁ బెట్టె నీలగళుడు

  రిప్లయితొలగించండి

 4. శ్రీ, భూ, నీలా శక్తులు.

  నీలా శక్తి సమేత విష్ణువు శివుని గా ప్రళయ కాలములో‌.


  అక్కడ విష్ణువు విలయము
  నెక్కి నిలువు బొట్టుఁ బెట్టె, నీలగళుడు తా
  చక్కగ ముస్తాబయ్యెను
  ఱిక్కుగ నీలయమరె తుదిరేయికి సుదతీ!  జిలేబి

  రిప్లయితొలగించండి


 5. కమలాక్షుని విలయము నిధ
  నమె నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుం
  డు! మురారి, భక్తుఁడై నీ
  మముగా ప్రార్థించె మోక్షమార్గము కొరకై !  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబిగారూ!నిన్నటి శంకరాభరణాన్ని ఒకసారి వీక్షించండి!గురువుగార మీకో సందేశం పెట్టారు!

   తొలగించండి


  2. ఇప్పుడే జవాబు చేర్చానండీ ఈ టపా ఆఖరులో   జిలేబి

   తొలగించండి
 6. కంది వంశమందు కంజాక్షు మతమున
  జన్మ నొందగాను జనకుడంత
  శంకరుం డనుచును చక్కని పేరిడ
  నిలువు బొట్టుబెట్టె నీలగళుడు

  రిప్లయితొలగించండి
 7. వేంకటేశ్వరుడు నుదుటి పైన నిలువు

  బొట్టు పెట్టె, నీళ గళుడు బూది పెట్టె

  నడ్డముగ ,సిరి తన వదనమున గుండ్ర

  ని తిలకంబును పెట్టె‌ను నెమ్మి‌ తోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 8. 28.06.2020

  నా పూరణ యత్నం..
  *ఆ వె*

  కలను గంటి నిపుడు కలహాల భోజుడు
  వచ్చి బలికె నతడు వారి నోట
  నమ్మకున్న నిజము నాకిట్లు దెలిపెను
  *"నిలువు బొట్టుఁ బెట్టె నీలగళుడు"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏😊

  రిప్లయితొలగించండి
 9. చదువదొంట బట్టె శాస్త్రములపఠించ
  శంక లన్ని దీర్ప శంకరార్యు
  దేవుడొక్క డనుచు దేహాలు వేరైన
  నిలువు బొట్టుఁ బెట్టె నీలగళుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   డు ప్రత్యయం లేకుండా శంకరార్యు అనడం దోషమే. "శంకరయ్య" అనండి.

   తొలగించండి
 10. కులసతి నందురాణి తన కోరిక మీరగ తానె కస్తురిన్
  నిలువుగ బొట్టు బెట్టెనట నీలగళుండు మురారి భక్తుడై
  కులుకుచు పింఛముల్ శిఖను గూర్చగ కౌస్తుభ ధారియై మహా
  కలిమల దోషహారి హరి కామితముల్ నెరవేర్చు నెప్పుడున్

  రిప్లయితొలగించండి
 11. శంకరుండునడుపు శంకరాభరణము
  చక్రధారివోలె చతురగతిని
  శివుడుహరియొకటనిచెప్పుటకన్నట్లు
  నిలువు బొట్టుఁ బెట్టె నీలగళుడు

  రిప్లయితొలగించండి
 12. తలఁచె మతములందు తారతమ్యములను 
  తొలగ జేసి ఐక్యతలనుగూర్చ 
  తెలియఁజేసినాడు తిక్కన జనులకు  
  నిలువు బొట్టుఁ బెట్టె నీలగళుడు

  రిప్లయితొలగించండి
 13. తనను గూర్చి ఘోర తపమాచరించెడు
  తరుణి చెంత కేగ హరుడు తాను
  తరలినట్టి వేళ నెఱుకలసానిగా
  నిలువు బోట్టుఁ బెట్టె నీలగళుడు.

  రిప్లయితొలగించండి
 14. తెలతెల వారకుండగనె దివ్యగతిన్ హరిదాసు ఫాలమందు న
  న్నలతిని పాండు నందనున కస్త్ర ప్రదానమొనర్చెనిచ్ఛతో
  చెలిమిని కోర్కతీరగ కుచేలుడు చేరెను ద్వారకాపురిన్
  నిలువుగ బొట్టు బెట్టెనట, నీలగళుండు, మురారి భక్తుడై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది.
   మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 15. నలుబది నామకీర్తన లనమ్మిన బంటుయె నాంజనే యుడై
  సులువుగ రామనామమున సూక్ష్మము దెల్యిచు మంత్రమూర్తియై
  కలియుగ దైవమందిరము గాచుచు ముంగిట స్వామిసన్నిధిన్
  నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు మురారి భక్తుఁడై

  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొదటి పాదంలో నమ్మిన దైవమె అని సరిచేసాను

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది.
   "దైవమె యాంజనేయుడై... సూక్ష్మ మెఱుంగుచు..." అనండి.

   తొలగించండి
 16. ఫలములనీకనోములవి,పాపముపుణ్యములెక్కదేల్చగా
  తులము ఫలమ్ములైన నిట తొట్రుపడంగనుజూచు నట్టియా
  కలహపునారదుండు, కడకా దిశజూచుచు విస్తుబోవగా
  నిలువుగ బొట్టుబెట్టెనట,నీకగళుండుమురారిభక్తుడై
  *************************
  రావెల పురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి

 17. * శంకరాభరణం వేదిక
  నా పూరణ. చం.మా.
  *** ********


  నిలుచు ధరిత్రి నందొకడు నిత్య మొనర్చుచు దైవ సేవలన్

  కొలుచును భూతనాథునుని గొల్లగ,నట్టులె చక్రపాణినిన్

  గెలివిగ హృత్తుఁ దల్చుచును గీర్తన జేయుచుఁ దా వెడల్పుగా,

  నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు, మురారి భక్తుఁడై

  ( గెలవి అనగా సంతోషము )


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 18. ప్రళయము వచ్చునా యనగ పార్వతి జేసి తపస్సు శ్రీహరీ!
  గళమున మంగళమ్ముగను గట్టు మటంచును కోరె సూత్రమున్
  ఫలితము నా వివాహమిదె స్వాగతమంచును బల్కి చక్రికిన్
  *నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు మురారి భక్తుఁడై*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 19. తపము మెచ్చి యెదుట తక్షణమే నిల్చి
  భక్తి సులభు డగుచు వరము నిచ్చె
  వాని కోర్కె వినియు పాటింప గా తాను
  నిలువు బొట్టు పెట్టె నీల గ ళు డు

  రిప్లయితొలగించండి
 20. నామధేయమేమొ నాగభూషణునిది!
  కులపు దైవమేమొ కుస్తుభుండు !
  తిలక మర్మమేమొ తికమక కలిగించె!
  "నిలువు బొట్టుఁ బెట్టె నీలగళుడు"

  రిప్లయితొలగించండి
 21. కలతలె పెచ్చు మీరెనట కల్పము నందున వైష్ణవుండ్రు, శై
  వులు మత భేదమెంచనది భూరివివాదము హింసఁ రేపగన్
  తలచెను సర్పభూషణుడు ధాత్రిని సత్యముఁ జాట నెంచుచున్
  నిలువుగ బొట్టుపెట్టెనట నీలగళుండు మురారి భక్తుడై.

  రిప్లయితొలగించండి
 22. హరుడు కోరినంత హరి చుట్టమై వచ్చె
  కాళ్లు ముఖము గడిగి సేదదీరె
  బొట్టు లేని విష్ణు బోసి మొగము నందు
  నిలువు బొట్టు బెట్టె నీలగళుడు

  రిప్లయితొలగించండి
 23. హరుడు కోరినంత హరి చుట్టమై వచ్చె
  కాళ్లు ముఖము కడిగి సేదదీరె
  బొట్టు లేని విష్ణు బోసి మొగమునందు
  నిలువు బొట్టు పెట్టె నీలగళుడు

  రిప్లయితొలగించండి
 24. వేడ్కగంగతోడవిందులేలేవుగా
  సరసమాడగౌరిసోకుమాడె
  విష్ణుచింతఁజేసివిధమునుతెలియంగ
  నిలువుబోట్టుఁబెట్టెనీలగళుఁడు
  కరోనానేపథ్యంలోగరళకంఠునిఅవస్థ

  రిప్లయితొలగించండి
 25. నిలుపుచురామ నామమును నెమ్మనమందున చంద్ర మౌళి, గా
  ములదొర విష్ణు వేతనకు మూల మటంచు నుదెల్ప గోరుచున్
  వలసిన కోర్కె దీరగను వైరపుభావన వీడ మంచు దా
  నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు మురారి భక్తుఁడై

  రిప్లయితొలగించండి
 26. గురువులు శంకరయ్యగారికి పుట్టినరోజుశుభాకాంక్షలు
  ఆపార్వతీపరమేశ్వలు వారికి
  ఆయురారోగ్యసంపదలనిచ్చుగాక!

  రిప్లయితొలగించండి
 27. కొలువు దీరె నేడు కొండల రాయడు
  నిలువు బొట్టుఁ బెట్టె, నీలగళుడు
  చలువ కొండ పైన సరి యడ్డ బొట్టుతో
  కొలువు దీరె, భక్త కోటి మురిసె

  రిప్లయితొలగించండి
 28. చం॥
  అలసియు నిద్రపోవు నపుడం తనె భక్తులు గుంపు గుంపులై

  కలవగ వచ్చిరా గరళ కంఠుని మేలును కాంక్ష సేయుచున్

  తల గన నడ్డనామములు తల్చిరి నిట్టుల తారుమారుగా

  "నిలువుగ బొట్టు పెట్టెనట నీలగళుండు మురారి భక్తుడై"

  (శివుడు నిద్రించినపుడు అడ్డ నామములు నిలువుగా భక్తులకు కనిపించినవి )

  రిప్లయితొలగించండి


 29. సీతా దేవి గారికి !

  నమో నమః

  ఇవ్వాళే మీరు చెప్పాకే గమనించాను. నెనరులతో


  కందివరులకు


  ప్రణామములతో


  శ్రీ కంది శంకరయ్య సు
  ధాకాంతుల పూరణలు సదా ప్రవహించెన్
  మాకందపు తీయదనము
  లై కబ్బపు సేవ చేసె బ్లాగ్లోకమ్మే!


  అలుపా? చెంగట రాదు! కర్తగ సమస్యాపూరణల్ చేయగా
  పలుదేశస్థుల చేర్చి ముద్దుగుడిచెన్ పారాయణీ సేవలో
  తొలినాటన్ చిరు డాలుగా నిపుడు ప్రత్యూషాంశువై వెల్గె! దా
  ఖలుచేసెన్ తన దైన స్థానమును ప్రఖ్యాతమ్ము జాలమ్ములో!


  అనవరతమ్ము గా నొక దశాబ్దము పైబడి కైపదమ్ములి
  చ్చెను! తనివారగాను పరి శీలన చేసి సమీక్ష నిచ్చి నూ
  తనముగ చేర నాదరపు దారము తోడుగ కట్టి వేసి సా
  ధనమును చేయ నుత్సుకత తాండవ మాడగ చేసె నొజ్జయై!


  శరణం పండిత మానసాపహరణం ...

  డెబ్బది యేండ్ల బాలుడితడెవ్వడు? శంకరుడీతడంట నా
  కబ్బము గొల్వ బ్లాగునిడి కైపదముల్ నునుపార దీర్చి తా
  నబ్బుర మొందగాను శరణాగతి తోడు విశాలజాలమం
  దిబ్బడి చేసె పూరణల ద్వీపము చందపు కాంతులీనగా

  సేవాతత్పరుడీతడౌత స్రుతియై జీరాడ పద్యమ్ములే
  శ్రీవాగ్దేవిని వందనమ్ముల సదా సేవించె బ్లాగ్లోక మం
  దావాలమ్మున మబ్బుపూవులను విస్తారించి క్రొంగొత్త నె
  త్తావిన్పంచెడు పుష్పదమ్ములకు సుస్థానమ్ము కల్పించెగా!

  సరదాగా జిలేబీయము :)


  సరదాగా పేర్చుచు నే
  వరుస జిలేబులను వేయ వాటిని త్రుంచె
  య్యరు మీదుమిక్కిలిని మె
  చ్చి రవంతగ జోక జేర్చి చీర్సందురుగా!
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. దీనితో బాటు బుజ్జిపండు తెలుగు చదువు కూడా చేసుకోవచ్చు :)


   http://funzilebi.blogspot.com/2011/12/blog-post.html


   జిలేబి

   తొలగించండి
  2. సంతోషం!సమయం అయిపోవస్తున్నది!

   తొలగించండి
 30. వైష్ణవుడగుటరవిప్రియముగనునుదుట
  నిలువుబొట్టుబెట్టె,నీలగళుడు
  కాచుగావుతమన గారవంపుగురుడు
  శంకరార్యునిననిశమ్ముదయను

  రిప్లయితొలగించండి
 31. చెలువముమీర పద్యవన సేద్యముజేసెడు శంకరార్యునిన్
  పలువురు మెచ్చగా పరమపావనజీవనయాత్ర సల్పు నే
  కలుషమెరుంగనట్టియొకకారణజన్ముడు కర్మయోగి తా
  నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు మురారి భక్తుఁడై

  రిప్లయితొలగించండి
 32. రిప్లయిలు
  1. ఇట్టు లట్టు లెట్టు లెట్టులు వెట్టిన
   వట్టి దౌను పెట్టి యొట్టు చిట్టి
   పట్టి చెప్పు చుంటి గట్టిగ నమ్ముమ
   నిలువు బొట్టుఁ బెట్టె నీలగళుఁడు


   పలుక నిజమ్ము నెవ్వ రిల వైష్ణవ శైవుల యందు దేవునిం
   గొలిచిరి కాంచి రూప మతి గుహ్యమ యాత్మగతుండు దైవమే
   పలువురు వారి కిష్టముగఁ బల్కుదు రన్యుల యందు ద్వేషులై
   నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు మురారి భక్తుఁడై !

   తొలగించండి
 33. తెలివియొకీంతలేనియొకదేవరకొండకుజెందురాముడే
  కలిబొలిమాటలాడుచునుగాంతలయొద్దననిట్లుగాననెన్
  నిలువుగబొట్టుబెట్టెనటనీలగళుండుమురారిభక్తుడై
  నిలువుగబొట్టుబెట్టుదురునీరజనాభునిభక్తులిద్ధరన్

  రిప్లయితొలగించండి
 34. ఆ.వె.

  సులువు ధనము గూడ చూచె నుపాయంబు
  చీట్లువేయనెంచె శీఘ్ర గతిని
  కోట్లు డబ్బు జేర కొంటె తనము జూపి
  నిలువు బొట్టు పెట్టె నీలగళుడు

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 35. పలునగరమ్ము లేగుచును పన్నగ భూషణుఁ దెల్పునాటికల్
  చెలువము నాడువార లొగి చేరియె దూరపు హంపి సీమకున్
  దెలిసి నృపాలు వైష్ణవుగఁ దేకువ నాడగ కృష్ణలీలలన్
  నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు మురారి భక్తుఁడై

  రిప్లయితొలగించండి
 36. పద్యపూరణమన పడిలేచు కెరటమే
  ప్రాశ్నికులకు నెల్ల పదకిరీటి
  పద్య ప్రేమికుండు పదకోశమేయౌను
  నిలువు బొట్టుఁ బెట్టె నీలగళుడు!!

  రిప్లయితొలగించండి
 37. ఆటవెలది
  యేలె దక్షయజ్ఞ నీలగళుండుగఁ
  బ్రజల మానసమ్ము రామరావు!
  మరల పాండురంగమహిమమ్మునఁ జెలఁగి
  నిలువు బొట్టుఁ బెట్టె నీలగళుడు!


  చంపకమాల
  పలువురు మెచ్చు మేటి నట పాటవమేర్పడ రామరావులో
  వెలిగెను దక్షయజ్ఞమున వేడుక నీలగళుండునౌచుఁ దా
  నలువుగఁ బాండురంగని మహత్త్వము నందున భేషు భేషనన్
  నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు మురారి భక్తుఁడై


  రిప్లయితొలగించండి
 38. ఇలపయి శంభు నంశముగ నింపుగనంజన గర్భమందునన్
  కలిగి కరమ్ముభక్తినల కైటభవైరి భజించుచున్ సదా
  వెలుగుచు రామభంటుగను ప్రీతిని వానర సేనతో ధృతిన్
  నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు మురారి భక్తుఁడై

  రిప్లయితొలగించండి
 39. నందుని సతి సుతుకు నందముతో బెట్టె
  నిలువు బొట్టు,బెట్టె నీలగళుడు
  నడ్డముగ విభూతి నద్రిజ ఫాలము
  నందు నవియె మనకు నవని రక్ష

  రిప్లయితొలగించండి