9, జూన్ 2020, మంగళవారం

సమస్య - 3394

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్"
(లేదా...)
"దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై"

72 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  దీటుగ పేరటమ్మునను తీరిచి దిద్దుచు పట్టుచీరనున్
  వాటపు తీరునన్ గునిసి వద్దుర రావుర నాకటంచు వే
  పాటలు పాడ నత్తయయె పండుగ పూటను, గుమ్మమున్నహో
  దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై...

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  2019:

  గూటిని వీడుచున్ చిలుక గ్రుడ్డిగ కొట్టుచు చిన్న రెక్కలన్
  వోటుల కోరుచున్ నగుచు బొట్టును బెట్టుచు మందిరమ్ములన్
  పోటిని చేయబూనుచును పోరున మోడికి, గంగ వాహినిన్
  దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై..

  రిప్లయితొలగించండి
 3. నేటి ప్రభుత మిక్కిలి యా
  రాటము నొందుచు కరోన రాకుండుటకై
  చాటి తెలిపిన నియమముల
  దాఁటిన , వేగిరమ కీడు దథ్యముగ నగున్

  రిప్లయితొలగించండి


 4. కాటేయంగ కరోనా
  వాటము గా వేచి యుండె ప్రజలారా నా
  మాట వినుడి జాగ్రత్తను
  దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్!  జిలేబి

  రిప్లయితొలగించండి


 5. కందోత్పల


  నిజమిదియే జాగ్రత్తను
  ప్రజ దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీ
  డు జనించు ఘోరమై సూ
  వె జిలేబి! కరోన నక్కి వేచె కడిదిగా !  జిలేబి

  రిప్లయితొలగించండి


 6. దీటుగ నన్ని దేశముల త్రిప్పట చేసె కరోన! చూడగా
  వాటము దాని కయ్యెను నివాసము మానవ దేహమే కదా!
  మాటుగ వేచె గండము సుమా జను లెల్లెరు జాగరూకతన్
  దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై!  జిలేబి

  రిప్లయితొలగించండి

 7. నా పూరణ. ఉ.మా.
  *** **** *** *** ***

  కీటకమౌ కరోన కడు కీడొనరించ దనర్చి ధాత్రిపై

  కాటును వేసె మానవుల.., కట్టడి జేయ క్రిమిన్ ప్రభుత్వమే

  మేటి సమీక్ష జేయుచును మిన్నగ దెల్పిన సూచనావళిన్

  దాటగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 8. చేటుఁడుజెప్పెడిమాటలు
  గోటలుదాటించునన్నగోరికమీరన్,
  దాటకువేశ్యలగోటలు
  దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 9. నాటికి నేటికిన్ సతమ నామయ దీప్తులు జీవనమ్మునన్
  గూటములౌచు జేరగల కూర్మిని నింపుచు జెప్పినట్టి వా
  మాటలు చద్దిమూటలవి మాన్యులు పెద్దలు పల్కు వానినిన్
  దాఁటఁగ రాదు, వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై

  రిప్లయితొలగించండి
 10. పూటకు లేకయు, బలిసియు
  మీటకనంగుని, కరోన మిక్కుట మౌటన్
  చాటుగ మాటుగ హద్దులు
  దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్

  రిప్లయితొలగించండి

 11. నా పూరణ. ఉ.మా.
  *** **** *** *** ***

  చేటును జేయ నెంచకయ! చేడియలన్ తలి వోలె గాంచుమా!

  ఓటును కాసు కమ్మకయ!ఓరిమి వీడకు;మంచి నెంచుమా!

  వేటను మాని జీవముల బ్రేమగ జూడయ! ధర్మ మార్గమున్

  దాటగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 12. 1. కం//
  చాటుగ లేడిని జూపగ
  వేటకు రాముడు వెడలెను వేడుక దీర్చన్ !
  దాటకు లక్ష్మణరేఖను
  దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్ !!

  2. కం//
  మేటిగ సీతకు దెలిపెను
  పాటవముగ లక్ష్మణుండు ప్రారబ్దమికన్ !
  కాటే వేయను, గీతను
  దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్ !!

  రిప్లయితొలగించండి
 13. ఆటల నాడగ బోకుము
  వాటముగా వేచియుండె వాసిగ వినుమా
  కాటేయకరోనా యిలు
  దాటిన వేగిరమకీడు దథ్యముగనగున్

  రిప్లయితొలగించండి
 14. పూటకు లేకనో మరియు భోజన మర్గక తప్పుదారినన్
  బోటుల మీటగన్ తగదు భోగము కోరి, కరోన యుద్ధృతిన్
  పేటలు పట్టణంబులను పేరిణి నాట్యము సల్ప, హద్దులన్
  దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై.

  రిప్లయితొలగించండి
 15. సూటిగ తెలుపుచు నుండిరి 
  పోటుదనము చూప పోకు పోగాలమునన్ 
  చాటుగ కాదని గీతను 
  దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్  

  రిప్లయితొలగించండి
 16. బీటలు వారెను మనసని
  ధాటిగ మద్యమ్ముఁ ద్రావి తప్పుడు మాటల్
  నోటను వాఁగుచు హద్దులు
  దాఁటిన, వేగిరమ కీడు దథ్యముగ నగున్

  రిప్లయితొలగించండి
 17. చేటగు వినుమా యికపై
  దాటిన చో రేఖలనిల తల్లీయనుచున్
  సూటిగ సౌమిత్రి తెలిపె
  దాటిన వేగిరమకీడు దథ్యముగనగున్

  రిప్లయితొలగించండి
 18. నేటి కరోనా తాకెను
  కోటిల జన మెవరు నంట గూడ దితరులన్,
  మాట వినుము నియమములను
  దాటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్.

  రిప్లయితొలగించండి
 19. దీటుగ బాటలు వేసిరి
  మేటిగ జీవించు మనుచు మేధావులి ల న్
  సూటిగ నడవక గీతలు
  దాటిన వేగిరమ కీడు ద థ్య ముగ నగున్

  రిప్లయితొలగించండి
 20. మాటల(బలుకుటయును,సా
  పాటున(గడుపున భుజించ భద్రములేకన్
  నోటినినదుపున(బెట్టక
  దాఁటిన, వేగిరమ కీడు దథ్యముగ నగున్

  రిప్లయితొలగించండి
 21. పోటుగ లోకమంతటను పొంగిన రోగము , పౌరులం దరిన్
  కాటును వేయబోవగనె కట్టడి జేయుటకై ప్రభుత్వముల్
  చాటిన నీమముందెలిసి , చక్కగ నాచరణం బొనర్చుటన్
  దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై

  రిప్లయితొలగించండి
 22. బాటలలో చరించు తరి బాధ్యత తోడ ప్రభుత్వమెప్పుడున్
  చాటు ప్రదేశమందునను చక్కగ దాట లభించు సౌఖ్యముల్
  పాటి నెరుంగకుండ పలు వాహనముల్ పయనించు చుండగా
  దాటగరాడు వేగిరమ, తథ్యము కీడు జనించు ఘోరమై

  రిప్లయితొలగించండి
 23. చేటును జేయు కరోనా!
  ధాటిగ తా విస్తరించె ధారుణి యందున్
  బోటీ! వెజ్జుల మాటను
  దాటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్

  రిప్లయితొలగించండి
 24. పాటవమెంతయు గల్గిన
  మాటను నిలువ బడినపుడె మాన్యత గొనుచున్
  మేటిగ మనెదవు! మాటను
  దాటిన వేగిరమె కీడు తథ్యముగ నగున్!

  రిప్లయితొలగించండి
 25. 09/06/2020
  *అందరికీ నమస్సులు*

  *కం*

  నీటుగ నిటను కరోనా
  ధాటిగ నిను చంపజూడ తర్కించుటయా
  మాటలు జెప్పుచు నీమము
  *"దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 26. చేటు కరోనా వినుడని
  చాటించిరి నియమములను జనులందరకున్
  పాటింపక హద్దులనిక
  దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్

  రిప్లయితొలగించండి
 27. పోటీపడి మోటరుపై
  దీటుగగమ్యమునుజేరతెలివివిహీనుల్
  ధాటిగనపమార్గములో
  దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్

  రిప్లయితొలగించండి
 28. గాటపు వేగమెన్నడునుగల్గగజేయు ప్రమాదముల్ నిరా
  ఘాటముగా ప్రయాణముల కారులయందున సల్పుచుండగన్
  దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై
  బాటలఁబోవువేళకడు పద్ధతిగా జరియింపమేలగున్

  రిప్లయితొలగించండి
 29. ధాటిగ పెరిగిన రక్తపు
  పోటును, దలపక తినగను పూటుగ తొక్కున్
  చాటుగ, బీపీ లెవలున్
  "దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్"

  రిప్లయితొలగించండి
 30. (హనుమంతునితో లంకిణి)
  కాటికి పంపెదన్ నిలువు, కాలుని కైనను నన్ను గెల్వగన్
  మాటలుగాదు, బుద్ధిగొని మానము ప్రాణము దక్కనెంచినన్
  చాటుగనేలవచ్చితివి సత్వము పల్కుము, లంకిణిన్
  దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై.

  రిప్లయితొలగించండి
 31. సాటియె లేని వీరునికి శత్రు భయమ్మను మాటలేలనో
  దాటగలేను నీ పనుపు దప్పక నేగెద నన్న జాడకై
  చేటును గల్గకుండ నిదె జేసెద రక్షణ రేఖ నో యమా
  దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై

  రిప్లయితొలగించండి
 32. కాటికి కాలుజాపితివి కమ్మటి భోజనమేల కోరఁ నా
  మాటల నారకించుమిక మాన్యభిషక్కు వచించి నట్లుగా
  పూటకు రెండు చాలునిక పుల్కలు క్షేమమొసంగు, దీనినిన్
  దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై

  రిప్లయితొలగించండి
 33. ఏటికి సంశయము జటా
  జూట తపోధన మహిమలు చోద్యము లెంచన్
  మేటి మునీంద్రని మాటను
  దాఁటిన వేగిరమ కీడు తథ్యముగ నగున్


  కాటికి నేఁగఁ దల్చి నరకమ్ము గనుంగొన నెంచి తేని నీ
  వాటగఁ జేయ వచ్చును మహాత్మ యొకింతఁ దలంచు మయ్య య
  య్యేటినిఁ గట్టి నట్టి మును పెన్నఁడొ భద్రము జీర్ణ వారధిన్
  దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై

  రిప్లయితొలగించండి
 34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దాటకుకరోన నియమము
   దాటినవేగిరమకీడుదధ్యముగనగున్
   నాటలువలదురయింకను
   మీటింగులుబెట్టవలదు,మీరకుహద్దుల్

   తొలగించండి
 35. మాటల నేర్చితి వమ్మో!
  కోటలనవి దాటునట్లు కుశలము కాదే!
  బోటీ! నీవగు హద్దులు
  దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్

  రిప్లయితొలగించండి
 36. దీటగు వారలెవ్వరిక ధీరస మానుడు రామునాజినన్?
  మాటున నుండురక్కసుల మాయలు మిక్కుట మయ్యె! వన్నె! మీ
  మాటలె శూలమైతొలిచె మానస మందున నింక, కూటమున్
  దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై.

  రిప్లయితొలగించండి
 37. ఆటలయావలోబడుచు నందఱు భౌతికదూరమెప్పుడున్
  దాటగరాదువేగిరమతధ్యముగీడుజనించుఘోరమై
  యాటలపాటలన్మునిగియాక్రిమిబారినిబొందబోకుమా
  దాటుమయీకరోననికదవ్వుననుండుచుమాస్కుతోడుతన్

  రిప్లయితొలగించండి
 38. ఆటగ బైకును గొనుచును
  దాటక పదునారు వయసు తాలిమితోడన్
  సైటును గొట్టుచు రోడ్డును
  దాటిన వేగిరమకీడు దథ్యముగనగున్

  ఆటగ బైకులన్ గొనుచు నల్లరిజేయుచు హాయిహాయిగా
  పాటలు బాడుచున్ మిగుల ప్రల్లదనంబున వాయువేగమున్
  తేటులవోలె తేలుచును తీయని యూహల సీమబాటలన్
  దాటగరాదు వేగిరమె తథ్యము కీడుజనించు ఘోరమై

  చేటును దెచ్చునే వినగ చెప్పుడుమాటల దుర్విచారమున్
  పాటునుగూర్చునే పలుక ప్రల్లదనంబున వక్రరీతిగన్
  కాటునువేయునే బ్రతుకు ఖచ్ఛితమియ్యది ధర్మమార్గమున్
  దాటగరాదు,వేగిరమె తథ్యము కీడుజనించు ఘోరమై!

  రిప్లయితొలగించండి
 39. మిత్రులందఱకు నమస్సులు!

  [తెలిసీ తెలియని వయస్సులో, యౌవనపు పొంగులో, ఆడపిల్లలను చూసి, వెకిలిచేతలు చేస్తూ, పెద్దల నీతిబోధలను దాటి, ప్రమాదములకు గురికావద్దని యువతకు చేయు సూచన]

  "తూఁటులు పెక్కులున్నఁ, దమ దోషములన్ గమనించి, దిద్దుచుం,
  బూఁటకుఁ బూఁటకున్ ఘనతఁ బొందుచుఁ, బోఁదగుఁగాని, యెప్పుడున్
  గీఁటుచుఁ గన్నులం, గొమల గ్రేణి నొనర్చుచు, నీతి బోధలన్
  దాఁటఁగ రాదు! వేగిరమ, తథ్యము గీడు జనించు, ఘోరమై!"

  [తూఁటు=దోషము]

  రిప్లయితొలగించండి
 40. ఉ:

  చాటువు లెన్నియున్న జన జాతికి 'లక్ష్మణ రేఖ' నొప్పగన్
  మాటికి మాటికిన్ తుదకు మంచిని బెంచగ లోక మందునన్
  చాటుకు బిల్చి బల్కెదరు జాగ్రత లెన్నియొ, చాటిజెప్పుచున్,
  దాటగరాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమ


  కం:

  రాటుగ శకటము ద్రోలుచు
  మాటుగ కూడలి యెగయుట మరు క్షణ ముగనే
  చీటిని యొసగడె పోలిసు
  దాటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 41. బంగరు జింక కొఱకు వెళ్లిన రాములవారి హాల క్ష్మణా! హా సీతా! అన్న పిలుపు విని అన్నగారు ఆపదలో చిక్కుకున్నట్టున్నారు వెంటనే నీ వెళ్లి చూడమన్న సీతమ్మతల్లితో లక్ష్మణస్వామి :

  కందం
  బూటక మిది వదినమ్మా!
  యాటవికుల కుట్రలివ్వి యన్న రఘువరుల్
  సూటిగ మిముఁ గను మన నే
  దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్


  ఉత్పలమాల
  బూటకమిద్ది రక్కసులు బూనిన మాయయె రామమూర్తికిన్
  జేటు కలుంగ జేసెడు ప్రసిద్ధులొకో? వదినమ్మ! దుష్టులీ
  నాటక మాడు చుండిరని నమ్ముమ! మిమ్మిడి పర్ణశాల నే
  దాఁటఁగ రాదు, వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై!

  రిప్లయితొలగించండి
 42. నేటి సమస్యాపూరణాల యత్నం -

  చేటగు జీవన మెంచుచు
  ధాటిగ జీవుల యుసురును దయలేనిమతిన్
  వేటాడితినుచు గీతను
  దాటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్


  కాటుక కళ్ళయమ్మగన! గావుమొ నేను కవిత్వ
  ధారలన్
  నోటమెరుంగగూడదని యొప్పెడి భూరివరంబు నొంది నే
  మేటి కవీశ్వరుండనుచు మీరి యకృత్య కవిత్వహద్దులన్
  దాటగరాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘెరమై.

  రిప్లయితొలగించండి
 43. కోటలు దాటెను మాటలు
  మాటలతో మాయచేయు మర్మమె చేటౌ
  చేటగు హద్దులు దాటకు
  దాటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్

  రిప్లయితొలగించండి