మిత్రులందఱకు నమస్సులు![ఒకానొక యవధానమున ధారణము పూర్తికాఁగనే, సంతోషమునఁ బంచె దులుపుకొనుచు నొక యౌత్సాహికుఁడు పైఁకి లేచిన సందర్భము]గుణయుత సద్వధానమునఁ గూర్చొనియుండిన సద్వధాని కారణయుత పృచ్ఛలన్నిటికినిఁ గ్రక్కునఁ బద్దెములన్ని సెప్పి, పూరణము మనోజ్ఞరీతిఁ గడు రమ్యత నన్నియు నొప్పగించె! ధారణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్!!
పణముల దండిగ దింప విపణివీథి మెరుగపడంగ బాజారున తోషణముక నబడెను ! నేటికిరణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్!:)జిలేబి
తృణధాన్యములందలిపోషణసామర్థ్యమునుగూర్చి సభలో తెలుపన్ గుణదోషములనువిని వివరణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్
కందోత్పల :)పణముల దండిగ దింప గణన రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్ వచ్చిన కాసులెమేలనుకొని చీర్సనుకొనుచున్ :)అమెరికా మార్కెట్టు ఆకాశమెక్కె :)/సోమవారము ముంబై మార్కెట్టు గాలిలో తేలును :)జిలేబి
గుణయుతశంకరార్యకవికోవిదు డోర్మి తగన్ సమస్యలన్రణవిధపూరణమ్మునకు రండని బిల్వగ సత్కవీంద్రు డాక్షణమున పూర్తి జేసి సరసమ్ముగఁ దాఁ దెలవారుజాము పూరణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్.కంజర్ల రామాచార్య.
నిన్నటి పూరణదానవదుర్మదాంధులను ధర్మము వీడి చరించు వారలన్బూని వధించి సాధుగుణపుణ్యులఁ గావగ కృష్ణుడయ్యెడన్మానుగ శైశవాప్తమహిమన్ శకటుం బరిమార్చ నత్తరిన్దా నవరూపియై విడిచె దానవరూపము దానవుం డటన్"
ఫణి యొక్కటి కంటపడగ వణకుచు భయమున పరుగిడు వైనము తెలియన్ మణి ధైర్యము చూపి దునుమ రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్
ఔరా ! ఇవ్వాళ జీపీయెస్ వారి సరదా పూరణలింకా రాలేదేమిటి ?
గణగణ బడిగంటకు శిక్షణ నేటికి ముగిసెనంచు ఛాత్రుడు తా, తక్షణమే సంచిని సర్దుచురణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్.
అణువును దడ బడ కుండగ చెణుకులు విసురుచు సభికులు సెహ బాసన గా మునుకొని యవ దాన పు పూ రణము ముగిసిన దనుచు నను రక్తుడు లేచెన్
అణిమాగరిమాలఘుమలగుణగణసంయుతులుజేరిగూర్చినసభనైఘనమవధానపుసభ,ధీరణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్కొరుప్రోలు రాధాకృష్ణారావు
గణపతి నవరాత్రులకై పణమును గైకొంచు వేయ పందిరి నచటన్ పణబంధము చేసికొని కరణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్.
గణితము నేర్పువాడె పలు కావ్యములన్ రచియించె, వాడె నేడణుకువతోడ నచ్చట మహాద్భుత రీతి వధాన మొక్కటిన్ దొణకక చేసెనాతడు ప్రదోషము నందు బుధుల్ నుతింప ధారణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్
గణయతులట్లు ప్రాసముల కట్టడి మీరక, సద్వధానవిస్ఫురణముఁ గొల్పురీతి,నుడిసోయగము ల్విలసిల్లు భంగి,ధా రణ తడ వొందనీక, యవధానసమస్యల నెల్ల రమ్యపూరణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్కంజర్ల రామాచార్య.
గు రు మూ ర్తి ఆ చా రి--------------------------------దానవదుర్గుణంబులను దాల్చిన వాడెవ డైననున్ సరేమానుష భోక్తయౌను | మును , మౌనిసతీమణి మానభంగమున్దానొక కుక్కుటం బగు చొనర్చె - సురేంద్రుడు | తాపసి వీక్షసేయగాదానవరూపియై విడిచె , దానవరూపము దానవుండటన్ !( మానుషభోక్త = దానవుడు ; వీక్షసేయు = కనుగొను ; )""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
రణమే నాగృహమున కారణములు లేకయె,పొరుగు పర జనులకు బ్రతిక్షణమది వేడుకె,నాదినరణము ముగిసినదనుచు ననురక్తుడు లేచెన్.
రణగొణ ధ్వానముల నడుమచెణుకులు చెవి బడక సరిగ శ్రీమతి మీరాసణుగుడు నాపుడు చాలనరణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్ 😛
అణువణువుంబులకించగనణకువగానుండునటులనదుపుంజేయన్ వినయుతుడునగుటనాప్రేరణముముగిసినదనుచుననురక్తుడులేచెన్
క్షణమును విడువక మగనిని వ్రణమన నిందలు సలిపెడి వల్లభ టివి వీ క్షణ సమయమవ విడిచెనిక "రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చ: గణగణ మంచు పాడుచును కమ్మగ నాడుచు రంగమందు ధా రుణిపయి పేరుపొందితిరి రూపకమందున తెల్గునేలపై హనుమకు రాముతోడనట నంకము గాంచుచు తెల్లవార్లు నా రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్ అంకము: యుద్ధము
కం:కణకణకడుపులుకాలగచెణకుల పనియేమి వానిచింతయెతీరన్ఘణభోజనమేకుదిరినరణము ముగిసిన దనుచు ననురక్తుడులేచెన్
అందరికీ నమస్సులు 🙏🙏నా పూరణ..(కరోనా కాలము)*కం*అణువంతయు లేకయె దారుణ మరణమ్ములను జూపు రూపమె యొక మా రణ హోమమున్ తలపిన చ *"రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్"**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*🙏🌸🙏
క్షణము యుగమ్ముగా గడిచె కార్యపు రాత్రి ప్రతీక్షణమ్మునన్తొణికిసలాడు సిగ్గు గనుదోయిని దాచుచు పారవశ్యమున్వణికెడి మేన జేరువగు భామిని గూడి యనంగ రంగమున్రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్
వ్రణకారక ద్విష ధనుర్గుణ ధ్వనులు నంతరించె క్షోణితలమునన్ క్షణమాత్రమ్మున నర మారణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్ ఫణిశయనస్త వాభిరత పావన విప్ర మహాకులైక భూషణుఁడు నిరంత రాధ్యయన శాంత మనస్కుఁడు సత్యవంత సద్గుణగణ ధాముఁడున్ లస దకుంఠిత వైష్ణవ సంభృతాంక ధారణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్
రణమె సమస్య నేడు రణరంగమునన్ కవిరాజులందరున్రణమునకర్థముల్ వెదకి వ్రాయగ బూనిరి పద్యముల్ భళారణమన ధారణమ్మనుచు వ్రాసిరి గొందరు తోరణమ్మనిన్రణముననంగ సంగర సరాగము జేసిరి కొందరంచు పూరణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్ 🙂
చంపకమాలఅణువణువందు పట్టుదల నార్తిగ దూకుచు నెన్నికందునన్బణముగఁ బెట్టి సంపదల వైభవమెంచుచు, నోట్ల నెంచునంకణమున వైరికిన్ గెలుపు కైవసమౌచును నోక్కవోటుతోరణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్
కందంపణముగ సంపదఁ బెట్టియునణుకువ గెలువన్ శ్రమించి యపజయమందన్గణనమున నొక్క యోటుకురణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్
హరికథ వినడానికి వస్తే హరిదాసు మోసాన్ని గ్రహించిన సందర్భములో.... చం: గొణుగుట నాపి రామకథ గొప్పగ గానము జేయమన్న దాకణతలు రుద్దుచున్ నుదురు గట్టిగ నొక్కుచు మోస గించుటన్వణకుచు దెల్పె దాసు తల వంచగ తప్పు క్షమించ మన్న కారణము సమాప్తమైన ననురక్తుడు లేచెను బంచ దుల్పుచున్దాసు =హరిదాసువై. చంద్రశేఖర్
ఫణమున ధర్మజుండు తమపత్నిని ద్రౌపది నోడజూచి, తక్షణము సుయోధనుం గనుచు శస్త్రసమంబగు పాచికా యిరింగణమున నూడ్చి వేసితినిగా యని యాశకునిట్లు బల్కుచున్రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్-యజ్ఞభగవాన్ గంగపురం
అణకువనొప్పగానొదిగినాతురతోడనునాలకించిపూరణముసమాప్తమైనననురక్తుడులేచెనుబంచిదుల్పుచున్ వినయముతోడుగాగనునభీష్టముసిద్ధినొందుచోనగున్ ననితరసౌఖ్యముందగునాయువు,బెర్గునునెల్లవారికిన్
గణకుడొకండువాదమునఁజక్కగపండితసంఘముఖ్యులున్ఫణితిఁబరాభవించెనుసభాస్థలిఁబ్రగ్రహణాంతరమ్ముకారణమునుతెల్పసత్కృతివిరాజితుడైసభనందునేడువా"రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్"
ముఖ్యులన్
శ్రీ లక్ష్మీ నారసింహాయనమః తేది:06-06-2020.మహోదయులకు ఉషోదయ నమస్సులతో, నేటి పద్యపూరణా యత్నం - గణముల గూర్పుచు , యతు లనుగుణమౌ పొందిక , సుభావ కోమల లుప్తంబణగగ పద్యము ముగియగరణము ముగిసిన దనుచు ననురక్తుడు లేచెన్
గణములు వాసిగ కుదరకసణుగుచు నుండన్ సఖుడొక సలహా యొసగన్ క్షణము ననీ పద్యపు తోరణము ముగిసినదనుచు ననురక్తుడు లేచెన్.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[ఒకానొక యవధానమున ధారణము పూర్తికాఁగనే, సంతోషమునఁ బంచె దులుపుకొనుచు నొక యౌత్సాహికుఁడు పైఁకి లేచిన సందర్భము]
గుణయుత సద్వధానమునఁ గూర్చొనియుండిన సద్వధాని కా
రణయుత పృచ్ఛలన్నిటికినిఁ గ్రక్కునఁ బద్దెములన్ని సెప్పి, పూ
రణము మనోజ్ఞరీతిఁ గడు రమ్యత నన్నియు నొప్పగించె! ధా
రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్!!
రిప్లయితొలగించండిపణముల దండిగ దింప వి
పణివీథి మెరుగపడంగ బాజారున తో
షణముక నబడెను ! నేటికి
రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్!
:)
జిలేబి
తృణధాన్యములందలిపో
రిప్లయితొలగించండిషణసామర్థ్యమునుగూర్చి సభలో తెలుపన్
గుణదోషములనువిని వివ
రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్
రిప్లయితొలగించండికందోత్పల :)
పణముల దండిగ దింప గ
ణన రణము సమాప్తమైన ననురక్తుఁడు లే
చెను బంచె దుల్పుచున్ వ
చ్చిన కాసులెమేలనుకొని చీర్సనుకొనుచున్ :)
అమెరికా మార్కెట్టు ఆకాశమెక్కె :)/సోమవారము ముంబై మార్కెట్టు గాలిలో తేలును :)
జిలేబి
గుణయుతశంకరార్యకవికోవిదు డోర్మి తగన్ సమస్యలన్
రిప్లయితొలగించండిరణవిధపూరణమ్మునకు రండని బిల్వగ సత్కవీంద్రు డా
క్షణమున పూర్తి జేసి సరసమ్ముగఁ దాఁ దెలవారుజాము పూ
రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్.
కంజర్ల రామాచార్య.
నిన్నటి పూరణ
రిప్లయితొలగించండిదానవదుర్మదాంధులను ధర్మము వీడి చరించు వారలన్
బూని వధించి సాధుగుణపుణ్యులఁ గావగ కృష్ణుడయ్యెడన్
మానుగ శైశవాప్తమహిమన్ శకటుం బరిమార్చ నత్తరిన్
దా నవరూపియై విడిచె దానవరూపము దానవుం డటన్"
ఫణి యొక్కటి కంటపడగ
రిప్లయితొలగించండివణకుచు భయమున పరుగిడు వైనము తెలియన్
మణి ధైర్యము చూపి దునుమ
రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్
రిప్లయితొలగించండిఔరా ! ఇవ్వాళ జీపీయెస్ వారి సరదా పూరణలింకా రాలేదేమిటి ?
గణగణ బడిగంటకు శి
రిప్లయితొలగించండిక్షణ నేటికి ముగిసెనంచు ఛాత్రుడు తా, త
క్షణమే సంచిని సర్దుచు
రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్.
అణువును దడ బడ కుండగ
రిప్లయితొలగించండిచెణుకులు విసురుచు సభికులు సెహ బాసన గా
మునుకొని యవ దాన పు పూ
రణము ముగిసిన దనుచు నను రక్తుడు లేచెన్
అణిమాగరిమాలఘుమల
రిప్లయితొలగించండిగుణగణసంయుతులుజేరిగూర్చినసభనై
ఘనమవధానపుసభ,ధీ
రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
గణపతి నవరాత్రులకై
రిప్లయితొలగించండిపణమును గైకొంచు వేయ పందిరి నచటన్
పణబంధము చేసికొని క
రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్.
గణితము నేర్పువాడె పలు కావ్యములన్ రచియించె, వాడె నే
రిప్లయితొలగించండిడణుకువతోడ నచ్చట మహాద్భుత రీతి వధాన మొక్కటిన్
దొణకక చేసెనాతడు ప్రదోషము నందు బుధుల్ నుతింప ధా
రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్
గణయతులట్లు ప్రాసముల కట్టడి మీరక, సద్వధానవి
రిప్లయితొలగించండిస్ఫురణముఁ గొల్పురీతి,నుడిసోయగము ల్విలసిల్లు భంగి,ధా
రణ తడ వొందనీక, యవధానసమస్యల నెల్ల రమ్యపూ
రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్
కంజర్ల రామాచార్య.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి--------------------------------
దానవదుర్గుణంబులను దాల్చిన వాడెవ డైననున్ సరే
మానుష భోక్తయౌను | మును , మౌనిసతీమణి మానభంగమున్
దానొక కుక్కుటం బగు చొనర్చె - సురేంద్రుడు | తాపసి వీక్షసేయగా
దానవరూపియై విడిచె , దానవరూపము దానవుండటన్ !
( మానుషభోక్త = దానవుడు ; వీక్షసేయు = కనుగొను ; )
""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
రణమే నాగృహమున కా
రిప్లయితొలగించండిరణములు లేకయె,పొరుగు పర జనులకు బ్రతి
క్షణమది వేడుకె,నాదిన
రణము ముగిసినదనుచు ననురక్తుడు లేచెన్.
రణగొణ ధ్వానముల నడుమ
రిప్లయితొలగించండిచెణుకులు చెవి బడక సరిగ శ్రీమతి మీరా
సణుగుడు నాపుడు చాలన
రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్ 😛
అణువణువుంబులకించగ
రిప్లయితొలగించండినణకువగానుండునటులనదుపుంజేయన్
వినయుతుడునగుటనాప్రే
రణముముగిసినదనుచుననురక్తుడులేచెన్
క్షణమును విడువక మగనిని
రిప్లయితొలగించండివ్రణమన నిందలు సలిపెడి వల్లభ టివి వీ
క్షణ సమయమవ విడిచెనిక
"రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచ: గణగణ మంచు పాడుచును కమ్మగ నాడుచు రంగమందు ధా
రిప్లయితొలగించండిరుణిపయి పేరుపొందితిరి రూపకమందున తెల్గునేలపై
హనుమకు రాముతోడనట నంకము గాంచుచు తెల్లవార్లు నా
రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్
అంకము: యుద్ధము
కం:
రిప్లయితొలగించండికణకణకడుపులుకాలగ
చెణకుల పనియేమి వానిచింతయెతీరన్
ఘణభోజనమేకుదిరిన
రణము ముగిసిన దనుచు ననురక్తుడులేచెన్
అందరికీ నమస్సులు 🙏🙏
రిప్లయితొలగించండినా పూరణ..
(కరోనా కాలము)
*కం*
అణువంతయు లేకయె దా
రుణ మరణమ్ములను జూపు రూపమె యొక మా
రణ హోమమున్ తలపిన చ
*"రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌸🙏
క్షణము యుగమ్ముగా గడిచె కార్యపు రాత్రి ప్రతీక్షణమ్మునన్
రిప్లయితొలగించండితొణికిసలాడు సిగ్గు గనుదోయిని దాచుచు పారవశ్యమున్
వణికెడి మేన జేరువగు భామిని గూడి యనంగ రంగమున్
రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్
వ్రణకారక ద్విష ధను
రిప్లయితొలగించండిర్గుణ ధ్వనులు నంతరించె క్షోణితలమునన్
క్షణమాత్రమ్మున నర మా
రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్
ఫణిశయనస్త వాభిరత పావన విప్ర మహాకులైక భూ
షణుఁడు నిరంత రాధ్యయన శాంత మనస్కుఁడు సత్యవంత స
ద్గుణగణ ధాముఁడున్ లస దకుంఠిత వైష్ణవ సంభృతాంక ధా
రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్
రణమె సమస్య నేడు రణరంగమునన్ కవిరాజులందరున్
రిప్లయితొలగించండిరణమునకర్థముల్ వెదకి వ్రాయగ బూనిరి పద్యముల్ భళా
రణమన ధారణమ్మనుచు వ్రాసిరి గొందరు తోరణమ్మనిన్
రణముననంగ సంగర సరాగము జేసిరి కొందరంచు పూ
రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్ 🙂
రిప్లయితొలగించండిచంపకమాల
అణువణువందు పట్టుదల నార్తిగ దూకుచు నెన్నికందునన్
బణముగఁ బెట్టి సంపదల వైభవమెంచుచు, నోట్ల నెంచునం
కణమున వైరికిన్ గెలుపు కైవసమౌచును నోక్కవోటుతో
రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్
రిప్లయితొలగించండికందం
పణముగ సంపదఁ బెట్టియు
నణుకువ గెలువన్ శ్రమించి యపజయమందన్
గణనమున నొక్క యోటుకు
రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్
హరికథ వినడానికి వస్తే హరిదాసు మోసాన్ని గ్రహించిన సందర్భములో....
రిప్లయితొలగించండిచం:
గొణుగుట నాపి రామకథ గొప్పగ గానము జేయమన్న దా
కణతలు రుద్దుచున్ నుదురు గట్టిగ నొక్కుచు మోస గించుటన్
వణకుచు దెల్పె దాసు తల వంచగ తప్పు క్షమించ మన్న కా
రణము సమాప్తమైన ననురక్తుడు లేచెను బంచ దుల్పుచున్
దాసు =హరిదాసు
వై. చంద్రశేఖర్
ఫణమున ధర్మజుండు తమపత్నిని ద్రౌపది నోడజూచి, త
రిప్లయితొలగించండిక్షణము సుయోధనుం గనుచు శస్త్రసమంబగు పాచికా యిరిం
గణమున నూడ్చి వేసితినిగా యని యాశకునిట్లు బల్కుచున్
రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్
-యజ్ఞభగవాన్ గంగపురం
అణకువనొప్పగానొదిగినాతురతోడనునాలకించిపూ
రిప్లయితొలగించండిరణముసమాప్తమైనననురక్తుడులేచెనుబంచిదుల్పుచున్
వినయముతోడుగాగనునభీష్టముసిద్ధినొందుచోనగున్
ననితరసౌఖ్యముందగునాయువు,బెర్గునునెల్లవారికిన్
గణకుడొకండువాదమునఁజక్కగపండితసంఘముఖ్యులున్
రిప్లయితొలగించండిఫణితిఁబరాభవించెనుసభాస్థలిఁబ్రగ్రహణాంతరమ్ముకా
రణమునుతెల్పసత్కృతివిరాజితుడైసభనందునేడువా
"రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్"
ముఖ్యులన్
తొలగించండిశ్రీ లక్ష్మీ నారసింహాయనమః తేది:06-06-2020.మహోదయులకు ఉషోదయ నమస్సులతో,
రిప్లయితొలగించండినేటి పద్యపూరణా యత్నం -
గణముల గూర్పుచు , యతు లను
గుణమౌ పొందిక , సుభావ కోమల లుప్తం
బణగగ పద్యము ముగియగ
రణము ముగిసిన దనుచు ననురక్తుడు లేచెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగణములు వాసిగ కుదరక
రిప్లయితొలగించండిసణుగుచు నుండన్ సఖుడొక సలహా యొసగన్
క్షణము ననీ పద్యపు తో
రణము ముగిసినదనుచు ననురక్తుడు లేచెన్.