14, జూన్ 2020, ఆదివారం

సమస్య - 3398

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శాంతిఁ గోరువాఁడె శత్రువు గద"
(లేదా...)
"శాంతినిఁ గోరు వారలనె శత్రువులంచుఁ దలంత్రు సజ్జనుల్"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

61 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  పంతము చేసి దానవులు భండన మొల్లుచు దాడిజేయగన్
  సుంతయు సిగ్గువీడుచును చూపుచు వెన్నును పోరకుండనే
  వింతగ బోడి ముండలయి భీతిని జెందుచు చీని నేతతో
  శాంతినిఁ గోరు వారలనె శత్రువులంచుఁ దలంత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. *అందరికీ నమస్సులు* 🙏🙏

   *నా పూరణ*

   *ఆ వె*

   *కొంప ముంచు పనులు గొప్పగ జేయుచు*
   *తప్పు జేయు నెపుడు తగవు దెచ్చి*
   *పగలు కూడదనిన పంతము తోడ న*
   *"శాంతిఁ గోరువాఁడె శత్రువు గద"*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏😞🙏

   తొలగించండి
 3. చేయఁగలిగియు ననిఁ జేటు నివారింప
  నయిదు పట్టణముల నడిగె ధర్మ
  రాజు! రాజరాజు రణమునకున్ మ్రొగ్గె!
  శాంతిఁ గోరువాఁడె శత్రువు గద!

  రిప్లయితొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కొంతయు బుద్ధి వీడుచును కోరిక తీరగ రాత్రి ప్రొద్దుటన్
  గంతులు వేయుచున్ సతము కవ్వము నెత్తగ పాకశాలలో...
  చింతను సుంత చేయకయె చెప్పుల నెత్తక; తిక్క మామితో
  శాంతినిఁ గోరు వారలనె శత్రువులంచుఁ దలంత్రు సజ్జనుల్

  మామి = అత్త (తెలంగాణ పదకోశం)

  రిప్లయితొలగించండి
 5. సీత నొప్ప జెప్పి శీఘ్రమే శరణన్న
  రామచంద్రుఁ గాచు రాధనమున
  ప్రేమ తోడ నా విభీషణుడనినంత
  శాంతిఁ గోరువాఁడె శత్రువు గద!

  రిప్లయితొలగించండి
 6. ప్రభుతనందు గొలువుబన్నుచు జనులకు
  ముఖ్య మైన పనుల మొత్తమొదలి
  సొంత పనుల వరకె సొంపు జూ పించి ప్ర
  శాంతిఁ గోరువాఁడె శత్రువు గద

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   "మొత్త మొగ్గి" అనండి. 'వదలి'ని ఒదిలి అనరాదు.

   తొలగించండి
 7. శాంతిమంత్రమయ్యెస్వాతంత్ర్యసమరాన
  సిద్దిగూర్చెనదియెస్థిరముగాను
  శాంతిమంత్రమన్నసత్యదూరులకిక
  శాంతిఁ గోరువాఁడె శత్రువు గద
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి


 8. కందోత్పల


  వదినా ! అబద్ద మింత వ
  లదె?శాంతినిఁ గోరు వార లనె శత్రువులం
  చుఁ దలంత్రు సజ్జనుల్? పద
  పదవే తప్పుల తడకల‌ పలుకులవేలా ?


  జిలేబి

  రిప్లయితొలగించండి


 9. మిత్రు డగును మనకు మిన్నగను జిలేబి
  శాంతిఁ గోరువాఁడె, శత్రువు గద
  చేడు కలుగ జేయు చింతల ద్రోయుచు
  విశ్వదాభిరమణి వినవె భామ


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. మీ కందోత్పల పద్యములు చాలా బాగా ఉంటున్నాయి.
  🙏🙏

  రిప్లయితొలగించండి
 11. సుంతయు సొంత లాభమునె చూడక నాంధ్రము నందు రైతులున్
  యెంతయొ మేలు కల్గునని యించుక భూమిని యుంచ కుండగన్
  అంతయు రాజ్య పాలకుల పాలును జేసి నిరాశ్రయంబునన్
  శాంతిని గోరు వారలనె శత్రువులంచు దలంత్రు సజ్జనుల్

  నేటి ఆంధ్ర రాజధాని అమరావతి పరిస్థితి గురించి ఈ పద్యం

  రిప్లయితొలగించండి
 12. అంతయు భారతీయులకు నాంగ్లపు వారిని వెళ్ళగొట్టుటే
  క్రాంతిపథమ్ము నెంచుకుని కాలునె దువ్వుచు కాటికేగగా
  వింతగ శాంతిమంత్రమున విశ్వము గెల్వగ గాంధిమార్గమున్
  శాంతినిఁ గోరు వారలనె శత్రువులంచుఁ దలంత్రు సజ్జనుల్.

  రిప్లయితొలగించండి
 13. ఆవె//
  ఓటమి పసిగట్టి చేటు తధ్యంబని
  సమ్మతించక తను వమ్ముజేయ !
  వెనకడుగులు వేసి తనకనుకూలపు
  శాంతిఁ గోరువాఁడె శత్రువు గద !!

  రిప్లయితొలగించండి

 14. మైలవరపు వారు:

  మా అమ్మ శ్రీమతి మైలవరపు లక్ష్మీకాంతం గారి మరణవార్త విని తల్లడిల్లి ఆత్మీయముగా ఆమె ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించిన సాహితీమిత్రులందరికీ ప్రణామములు.

  అమ్మకు వందనమ్ము., మమతామృతమూర్తికి వందనమ్ము., మా
  యమ్మకు వందనమ్ము., మధురార్ద్రమనస్వినికిన్ ప్రణామమౌ.,
  నిమ్ముగ ప్రేమ పంచి, మమునిందరి పెంచిన కన్నతల్లి ల...
  చ్చమ్మకు వందనమ్ము., హృదయమ్ము ద్రవించెను తల్లి! నీ మృతిన్!!

  మాతృవియోగశోకవినిమగ్నత పద్యములల్లలేక వా..
  ఙ్మాతృనిరంతరార్చనము మానితి కొన్నిదినమ్ములమ్మరో!
  ధాతృసతీరమాగిరిసుతాప్రకృతిత్వము పొందితీవు., త...
  న్మాతృపదమ్ములన్ విడువ.. నన్ దయతో కరుణింప వేడెదన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. స్వాంతము కర్కశత్వమయి శాంతిని భగ్నము చేయువారలౌ
   ధ్వాంతమునన్ చరించు నవదానవులౌ ధరనుగ్రవాదులౌ
   క్రాంతిని జూడనెంచని దురాత్ముల బట్టి వధింపనెంచగా
   శాంతిని గోరువారలనె శత్రువులంచు దలంత్రు సజ్జనుల్!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. ఆ మాతృ దేవత కాత్మ శాంతి ప్రసాదించ శ్రీమన్నారాయణుని వేఁడుకొనుచున్నాను. .

   వచ్చు మరణము పుట్టిన వారి కెల్ల
   జన్మ కలుగుటయు ధ్రువము సచ్చినంతఁ
   దప్ప నట్టి యిట్టి పనులు దలఁచి తలఁచి
   వంతఁ జెందంగ నీకు భావ్యమ్ము గాదు


   మురళీకృష్ణ గారికి నా ప్రగాఢ సంతాపమును దెలుపు చున్నాను.

   తొలగించండి
 15. వలదు యుద్ధమంచు వాసుదేవుడు సంధి
  గోరి వచ్చినపుడు కుట్ర పన్ని
  పాపులైన వారు బంధింప బూనిరే
  శాంతిఁ గోరువాఁడె శత్రువు గద

  రిప్లయితొలగించండి
 16. సరిజేసితిని గురూజీ 🙏
  ఆ.వె//
  ఓటమి పసిగట్టి చేటు తధ్యంబని
  సమ్మతించ తాను వమ్ముజేయ !
  వెనకడుగులు వేసి తనకనుకూలపు
  శాంతిఁ గోరువాఁడె శత్రువు గద !!

  ప్రత్యుత్తరంతొలగించు

  రిప్లయితొలగించండి
 17. బంధువర్గము శ్రేయము సంధియనుచు
  మంచి మాట చెప్ప మాట వినక
  బంధనమ్మున పట్టంగ బలిమి చూపె
  శాంతి గోరువాడెవడైన శత్రువు గద

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆటవెలది సమస్యాపాదాన్ని తేటగీతిగా మార్చారు. కాని రెండవ పాదం ఆటవెలది అయింది.

   తొలగించండి
 18. కపట బుద్ధి గలిగి కమ్మని నటనతో
  మిత్రు భంగి మెలగి మిడుకు వాడు
  నమ్మి నట్టి వాని నట్టేట ముంచి య
  శాంతి గోరు వాడె శత్రువు గద

  రిప్లయితొలగించండి
 19. ఎంత జేసియున్న ఎదరి మిత్రుడె సుమ్మి
  శాంతిగోరువాడె, శత్రువుగద
  నతనిమిత్రుడితడుగానజాగ్రత మేలు
  మనము మైత్రినెరప మంచిదిపుడు!

  రిప్లయితొలగించండి
 20. పంతము వీడు రావణ శుభంబది కూర్చదు నీతివీడి యా
  యింతిని బంధిసేయుట యిదెక్కడి న్యాయము దుష్టులెప్పుడున్
  శాంతినిఁ గోరు వారలనె శత్రువులంచుఁ దలంత్రు, సజ్జనుల్
  క్షాంతిని గోరుచుందురు ప్రశాంతత నెప్పుడు శాంతి కాములై.

  రిప్లయితొలగించండి


 21. భ్రాంతియు లేక కూటమిని వర్ధిల చేయగ చూతురే సదా
  శాంతినిఁ గోరు వారలనె, శత్రువులంచుఁ దలంత్రు సజ్జనుల్,
  గుంతల ద్రొవ్వు వారల నిగూఢపు కార్యకలాపముల్ గనన్
  చెంతయు జేర నివ్వరిక చేటని దూరము త్రోయుచుందురే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. కాంతల మోహమందు గనుగానక నన్నియు గోలుపోయినన్
  భ్రాంతిని వీడలేక దమ బాధలు దూరము జేయునంచు వి
  శ్రాంతి నొసంగు మార్గమని సంతతమా మధుపానమందునన్
  శాంతినిఁ గోరు వారలనె శత్రువులంచుఁ దలంత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 23. హిందు ముస్లిములను హింస వలదనుచు|
  కలసి సాగమన్న గాంధి నకట!
  కాల్చి వేసి నాడు గాడ్సే కఠిన చిత్తు!
  "శాంతిఁ గోరువాఁడె శత్రువు గద"

  రిప్లయితొలగించండి
 24. భ్రాంతినొంది తనదు బంధువుల దలచి
  యారు శత్రువల సమాదరించు
  పరమ మూర్ఖులైన పాషండులకు నెప్డు
  శాంతి గోరువాడె శత్రువగును

  సంతతత మంతరంగమున శంకల మున్గుచు దేలువారలే
  శాంతిని గోరువారలనె శత్రువులంచు దలంత్రు,సజ్జనుల్
  సుంతయు బాధలేక హరిసోదరి గొల్చుచు పారవశ్యమున్
  చింతిత మోక్షమందెదరు చిత్తమె యొప్పగ శాంతిపూర్ణమై!

  రిప్లయితొలగించండి
 25. సిరులుసంపదలకుశ్రీకారమునుజుట్టు
  శాంతిగోరువాడె,శత్రువుగద
  కోపమతిగనుంట,క్రూరపువర్తన
  సహనముండునెడలశాంతికలుగు

  రిప్లయితొలగించండి
 26. ఇంతులతోడ వైరముల వేర్పడ, కాలము నిత్యమన్యులౌ
  కాంతలతోసరాగముఁ గాంచుచు సౌఖ్యము, దుష్టబుద్ధితో
  పంతముతోడ భార్యలను బాధలు పెట్టుచు తుచ్ఛమౌ మన
  శ్శాంతినిఁ గోరు వారలనె శత్రువులంచుఁ దలంత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 27. సంజయుండుతనదుచాతుర్యసంపద
  పోరుకూడదనుచుపలుకసాగె
  బిచ్చమెత్తియైనబతుకవచ్చనియెనుశాంతిగోరువాడెశత్రువుగద

  రిప్లయితొలగించండి
 28. సకలజనులుసౌఖ్యసంపదలందగ
  శాంతచిత్తులగుచు క్షాంతినుండ
  నెలమి యట్లుగాక నితరులయొక్కయ
  శాంతిఁ గోరువాఁడె శత్రువు గద

  రిప్లయితొలగించండి
 29. శాంతి హర్షదాయ కాంతరంగ విమల
  కారకమ్ము సుమ్ము తోరముగను
  భంగపఱచ నేల పగఁబూని నిత్య మ
  శాంతిఁ గోరువాఁడె శత్రువు గద


  అంతము లేదు ద్వేషమున కార్యులు మెచ్చరు దాని నెన్నడుం
  జింతలె దక్కు నంతమునఁ జిత్తము నందిఁక నిశ్చయమ్ముగన్
  బంతము మాను ఘోర జననాశక యుద్ధము, దేనిఁ గాంచవో
  శాంతినిఁ, గోరు వారలనె శత్రువులంచుఁ దలంత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 30. శాంతినిగోరువారలనెశత్రువులంచుదలంత్రుసజ్జనుల్
  శాంతినిగోరువారలరుశత్రువులంటనున్యాయమేరమా!
  శాంతినిగోరువారినిసజ్జనుగోవకుజెందురేసుమా
  శాంతినిగల్గుచోభువినిసంపదలెన్నియొసంభవించుగా

  రిప్లయితొలగించండి
 31. శాంతములేక లేదిలను సౌఖ్యమటన్నది సత్యవాక్కు యే
  చింతలుజేరనీకమది సేకమునన్బడనీకనెన్నడున్
  శాంతిగనుండగానెలమి శాంతివిఘాతమొనర్చి పిమ్మటన్
  శాంతినిఁ గోరు వారలనె శత్రువులంచుఁ దలంత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 32. సంజయుండుతనదుచాతుర్యసంపద
  పోరుమానుడనుచుపలుకసాగె
  బిచ్చమెత్తియైనబతుకవచ్చనియెను
  శాంతిగోరువాడెశత్రువుగద

  రిప్లయితొలగించండి
 33. ఆటవెలది
  నిత్యము ధరియించి సత్యమహింసలన్
  స్వేచ్ఛఁ దెచ్చి నట్టి వేల్పు నైన
  శాంతి మంత్ర మెంచ నంతమొందించిరే
  శాంతి గోరు వాడె శత్రువు గద!

  ఉత్పలమాల
  సాంతము రామునిన్ దలఁచి సత్యమహింసలె యాయుధమ్ములన్
  జింతన తోడ జాతిపిత స్వేచ్ఛనొసంగిన కాల్చివైచిరే
  శాంతము గోరువారలనె! శత్రువులంచు దలంత్రు సజ్జనుల్
  భ్రాంతిని నాటి హంతకుల బాటను భేషను తీవ్రవాదులన్

  రిప్లయితొలగించండి


 34. ఆ.వె:సహన భావ మూని సాగును జగతిలో
  శాంతి గోరువాడె, శత్రువు గద
  కయ్యమునకు నెపుడు కాలు దువ్వెడు వాడు
  నట్టి వాని మార్చ నజుని తరమె

  ఆ.వె:హితవు పలుకు చున్న హీనముగా
  జూచు నచ్చినట్టి మాట నయము గాను
  చెప్ప కున్న తాను చిత్తగించడెపుడు
  శాంతి గోరువాడె, శత్రువు గద

  రిప్లయితొలగించండి
 35. స్వాంతమునందునెప్పుడునుసఖ్యతగోరుచు నుండచ క్కగన్
  చింతలవీడియుండగనుచెంతకునెమ్మదివచ్చిచేరుతా
  శాంతినిఁ గోరు వారలనె ,శత్రువులంచుఁ దలంత్రు సజ్జనుల్"
  నంతము లేనిదుష్టమగు నాశలు దాచినటించు వారలన్

  రిప్లయితొలగించండి