18, జూన్ 2020, గురువారం

సమస్య - 3402

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆరనట్టి మంట లారె నెటుల"
(లేదా...)
"ఆరని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్"
(శిష్ట్లా శర్మ గారికి ధన్యవాదాలతో...)

53 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  కూరిమి మీర పోరుచును గ్రుడ్డిగ కొల్చుచు మందిరమ్ములన్
  వారిజ నేత్ర కొట్టగను భళ్ళున చెంపల మేఠినందునన్
  తీరిక మీర నేడ్వగను తిట్టుచు మోడిని కండ్లనీరుతో
  నారని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కోరిక తీర కున్కుచును ఘోరపు లేటుగ నిద్ర లేచి, నా
  వారిజ నేత్ర స్పీడుగను వండగ బూనగ నాల్గు పొయ్యిలన్
  గారబు గ్యాసు నిండుకొన గ్రక్కున దబ్బున గుప్పుచుప్పుగా
  నారని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్

  రిప్లయితొలగించండి
 3. గురువుజేరి గూర్చ గుహ్యమైన సవాలు
  ఆరనట్టి మంట లారునెటుల?
  సత్యమైన ఙ్ఞాన సముపార్జనము చేత
  గోర్కెలనెడి మంట కుప్పగూలు

  కోరిన కోర్కెలన్నియు కోయనదీరెడు రాకుమారుడే
  భూరి యశాంతినిన్ వెడలి మోక్షమునొందెడి మార్గగామియై
  చేరెను శాంతిధామమును చిత్తమునిండగ ఙ్ఞానపూర్ణమై
  ఆరనిమంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి.
   ఆటవెలది సమస్యలో 'ఆరె నెటుల'
   వృత్తంలో మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా!
   కోరిన కోర్కెలన్నియును అని ఉండాలి. టైపు దోషము!ఆరె నెటుల కూడ ప్రమాదవశమే!క్షమించండి!

   తొలగించండి


 4. అవిరళముగ కన్నీరు! త
  నివి! ఆరని మంటలారె నెవరార్పక ము
  న్నె విచిత్రమౌనటుల్, జల
  మవి దీర్చు వెతల మృదువుగ మహిళల హృదిలో!


  కందోత్పల
  జిలేబి

  రిప్లయితొలగించండి


 5. పొలతుక మది లోన బుసబుస కసకస
  లారనట్టి మంట లారె నెటుల?
  కంట నీరు చింద కందివరార్య, జి
  లేబి పలికె వడిని లెస్స గాను  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. వీర మాత కడుపులో రగిలెను చిచ్చు!
  ఆరనట్టి మంట లారె నెటుల?
  కంటి లోని నీటిఁ గడుపున దిగమ్రింగ
  దేశరక్షకీల్గె ధీరుడంచు!

  రిప్లయితొలగించండి
 7. కారణభూతమైనిలచెకాలుషమందగమానవాకృతిన్
  నేరముజేయుచున్నిలచినేస్తములందరబాలిశత్రువై
  దీరుగదీర్చెగాలమనదేశమునంతటనిశ్చలంబునై
  నారని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్

  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 8. లేచినది మొదలుగ రేతిరివరదాక
  నత్తమామల నడి యలుకలన్ని
  మాయమయ్యె నిపుడు మనుమనిరాకతో
  నారనట్టి మంట లారె నెటుల ?

  రిప్లయితొలగించండి


 9. సకలజనులసమ్మె సాకల్యమవగాను
  తెలుగు నేల లొల్లి తెరిపి యిచ్చె
  వలసజీవి వెతలు పట్టించుకొనకున్న
  ఆరనట్టి మంట లారె నెటుల!!  వీరులగాధలన్నియును ప్రేరణ నిచ్చెడు కావ్యసంపదల్
  ధీరులు దీటుగా కదిలి దిగ్విజయమ్ముల దెచ్చినారహో
  ఆరని నార్తులందరివినాకలి కేకలపోరుబాటలో
  ఆరని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి.
   "అరని యార్తులందరివి యాకలి కేకల..."

   తొలగించండి
 10. మేరలు మీరు కోరికలు మిన్నును దాకు విహంగవేగసం
  చారవిలాసభావనలు స్వాదుపదార్థబుభుక్ష లందు బా
  జారుల నొప్పు పాకరుచిసక్తపరేప్స కరోన రాకతో
  నారని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 11. కారణభూతమైనిలచెకాలుషమందగమానవాకృతిన్
  నేరముజేయుచున్నిలచినేస్తములందరబాలిశత్రువై
  దీరుగదీర్చెగాలమది,దేశమునంతటనిశ్చలంబునై
  యారని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్

  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 12. మైలవరపు వారి పూరణ


  పేరునకారురీతి కనిపించెడి షడ్రిపువర్గమెంచగా
  కారణమొక్కటే యదియె కామము., దీనిని గెల్చినారలా
  కారణజన్ములౌ ఋషులు కారడవిన్ చరియించి., వారికా
  యారని మంటలారెనెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 13. ఎదుగుచున్నకొడుకుమదియునెదగలేదె
  కలత చెందుతల్లికడుపు నందు
  ఆరనట్టి మంట లారె నెటుల?చెంబు
  నీరు బోసి నార్ప నిప్పు గాదె

  రిప్లయితొలగించండి
 14. తెలుగు దేశ మదియు దేశాన కాంగ్రేసు
  బద్ధ శత్రువులగు పార్టి లకును
  భాజపాను కూల్చ బంధమే కూడెనే
  యారనట్టి మంట లారె నెటుల?

  రిప్లయితొలగించండి
 15. జోరుగ గాలివీచె నిక జూడగ భాజప గెల్పు నిక్కమే
  మీరును మేము గల్సినను మేలగు నంచు దలంచినట్టి యా
  కారణ మొక్కటే కలిపె కాంగ్రెసు తో తెదెపాను కాంచగన్
  ఆరని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్

  రిప్లయితొలగించండి
 16. సారస రాత్రులన్ తనువు జారెను నిద్రలొ సుంత శాంతితో
  చేరువ కర్ణవేధినిటు చేసెను పద్య రణాంగణ ధ్వనుల్
  ధీరులు మెచ్చ పద్యముల తీరుగ పూరణ జేసి పంపగన్
  ఆరని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్!

  కర్ణవేధిని = సెల్ ఫోన్

  రిప్లయితొలగించండి
 17. ఆరయ కారు చిచ్చొ కటి ఆస్ట్రెలియా నొలయంగ నంతటన్
  ఆరినవెన్నియో యుసురు లచ్చట మానవుడెంత చేసినన్
  ఆరని మంట లారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్
  తీరుగ వానలున్ హిమము దేకువ జూపగ శాంతి నొందెనే!

  రిప్లయితొలగించండి
 18. దేశ రక్ష కొఱకు ధీరుడై పోరుచు
  సుతుడు మరణ మందె శోక వహ్ని
  ఆర నట్టి మంట లారె నెటుల? తల్లి
  కలత చెంది రగుల కడుపు చి చ్చు

  రిప్లయితొలగించండి
 19. దూరపుదేశమేగపతి తోయజ లోచన యొంటి నుండగా
  మారుడుచేరి దేహమున మంటల రేపగ పత్ని మన్మథున్
  దూరుచునుండగా వడి సుదూరము నుండి విభుండు క్రమ్మఱన్
  ఆరని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్

  రిప్లయితొలగించండి
 20. ఊరు నందు నున్న వారి మధ్య నెపుడు
  నారనట్టి మంట లారె నెటుల?
  'మేముకోరుకొంటిమి'యని వారి కొడుకు
  గూతురు మనువాడి కూడి రాగ.

  రిప్లయితొలగించండి
 21. గీత బోధల మది క్లేశము తొలగంగ|
  పోరుచేయ పార్ధు పూనుకొనెను!
  కృష్ణు కృపను పొంద ఖేద మంతయు పోయె!
  "ఆరనట్టి మంట లారె నెటుల"

  రిప్లయితొలగించండి
 22. అందరికీ నమస్సులు 🙏
  18.06.2020

  *శంకరాభరణం సమస్య*

  *ఆ వె*

  అత్త కోడలనిన నారని మంటలు
  వారి మధ్య నెపుడు 'వారు' జరుగు
  ఇంటిపోరు లిచట యింతింత గాదయా
  *"ఆరనట్టి మంట లారె నెటుల"?*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🙏

  రిప్లయితొలగించండి

 23. భీరువుగన్ జరించ పరి
  వేదనలందు జనించు జ్వాలలన్
  బోరెడి జీవన క్రతువు
  బొందెడి తాప విలాప వీధిలో
  ధీర వచో వికాస వర
  ధీమతు లిచ్చు సుధీ ప్రభావము
  న్నారని మంటలారె నెవ
  రార్పక మున్నె విచిత్రమౌనటుల్!


  రిప్లయితొలగించండి
 24. వీరసైనికుండువిగతజీవియగుట
  శోకసంద్రమందుస్రుక్కభార్య
  తెలుగునేలప్రజలువిలవిలలాడంగ
  నారనట్టిమంటలారెనెటుల

  రిప్లయితొలగించండి
 25. మారణ హోమమున్ జనులు మానము బ్రాణము గోలుపోవగా
  మారెను మానసమ్ము, విని మాన్యుడు శాక్యమునీంద్రు బోధలన్
  సారము నాకళింప మది శాంతిని బొందె నశోకుడా యెడన్,
  ఆరని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్

  రిప్లయితొలగించండి
 26. ఆకలాకలనెడి భారతావనియందు
  ఆరనట్టి మంటలారెనెటుల
  హరిత నీలి ధవళ యను విప్లవములను
  మలచి విజయ ఫలితమంది నటుల

  రిప్లయితొలగించండి
 27. గొల్ల పిల్లల నట గోపాలుఁడు కనులు
  మూసికొనుఁ డనంగ మూసి తెఱవ
  దరికొని పఱతెంచు దావానలమ్మున
  నారనట్టి మంట లారె నెటుల


  భూరి యశోవిరాజిత నభోవర పట్టణ ముల్లసిల్లగం
  జారుతరమ్ము భాసిలుచు సంయమనీ పుర నిత్య మోక్షవ
  త్తీరము సేరి మౌనముగ దేహి ప్రసన్నత శాంతి నొందగా
  నారని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్

  రిప్లయితొలగించండి
 28. ఆరగజ్యోతియయ్యెడలయాహవరంగమునందుదానుగా
  బోరగయుద్ధరంగమునభూప్రజరక్షణగూర్చియేవెసన్
  శూరులబాహుతేజములస్రుక్కుచుమృత్యువుగౌగిలించగా
  నారనిమంటలారెనెవరార్పకమున్నెవిచిత్రమౌనటుల్

  రిప్లయితొలగించండి
 29. ఆటవెలది
  మట్టు బెట్ట మగువ మానమ్ము దోచియు
  లోకులెల్లరంత క్రుద్ధులైనఁ
  గన్నుమూసిరనఁగఁ గాల్పులన్ దోషులు
  నారనట్టి మంట లారె నెటుల?

  ఆటవెలది
  సీత సాధ్విఁ గోర శీలపరీక్షను
  పర పురుషునిఁ దృణము భంగి చూడఁ
  దా పవిత్రురాలు ధర్మ పత్నియెగాక
  నారనట్టి మంట లారె నెటుల?


  ఉత్పలమాల
  పేరిచి మధ్యలో తృణము విజ్ఞత రావణు ముందు చాటినన్
  గోరఁగ రామచంద్రుడటఁ గొంకక దూకఁగ నగ్నికీలలన్
  శ్రీరమఁ బోలు సీతను ద్విశీర్షుడు అగ్నిపునీత యంచనన్
  యారని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్

  రిప్లయితొలగించండి

 30. ఉ:

  నేరము కాదు నా మదిని నిక్కము నూహలు చిందులేయగన్
  దూరము వీడి వేగమున తోడగు పెన్మిటి జేర కౌగిలిన్,
  కోరిక దీర, శాంతమున కోయిల రాగము లాలపింపగ
  న్నారని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌ నటుల్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 31. పొరుగువారితోడపోరునిత్యముసల్పు
  ఆరనట్టి మంట లారె నెటుల?
  లాకుడౌనువచ్చి లంపటవెట్టగ
  కలిసిమెలిసియుండవలసివచ్చె

  రిప్లయితొలగించండి
 32. ఓరిమిలుప్తమైపెరిగెనొండురులందున ద్వేష భావముల్
  కోరలుసాచివిశ్వమున కోవిదు వ్యాప్తమునొందు చుండగా
  ఆరని మంటలారె నెవరార్పక మున్నె విచిత్ర మౌనటుల్
  పోరునువీడికూరిమిని పొందగగూడిరి లాకుడౌనులో

  రిప్లయితొలగించండి