10, జూన్ 2020, బుధవారం

సమస్య - 3395

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్"
(లేదా...)
"శస్త్రచికిత్స పిమ్మటనె జానకి సంతుఁ గనెన్ ముదంబునన్"

32 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  శాస్త్రిని పెండ్లియాడుచును జానకి పోవగ ఖర్గపూరుకున్
  దస్త్రము లన్నియున్ చదివి దండుగ మాలిన జ్యోతిషమ్మునన్
  శాస్త్రియె వీడగా జడిసి జల్గము నందున; వైద్యశాలలో
  శస్త్రచికిత్స పిమ్మటనె జానకి సంతుఁ గనెన్ ముదంబునన్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  శాస్త్రియె పెండ్లియాడుచును జానకి నామపు ముద్దు చేడియన్
  శాస్త్రము లన్నియున్ చదివి చక్కని సంతును పొందగోరుచున్
  మేస్త్రిని పిల్చి వాస్తునకు మేలగు రీతిని గోడకూల్చుటన్
  శస్త్రచికిత్స పిమ్మటనె; జానకి సంతుఁ గనెన్ ముదంబునన్

  రిప్లయితొలగించండి
 3. శాస్త్రోక్తముగా జరిగెను
  శాస్త్రికి జానకికి బెండ్లి; సంతతి లేకన్
  నిస్త్రాణకు గురియైనను
  శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్

  రిప్లయితొలగించండి


 4. మేస్త్రీ పెండ్లాడెనయా
  ఆ స్త్రీ కొన్నేండ్లు వేచెనా సంతతికై
  శాస్త్రము తెలిపిన సమయము
  శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్


  జిలేబి

  రిప్లయితొలగించండి


 5. కందోత్పల


  మగువ మనువై వయసు దా
  టగ శస్త్రచికిత్స పిమ్మ టనె జానకి సం
  తుఁ గనెన్ ముదంబునన్ ము
  ద్దుగ చూచుకొనె కొమరుని నదుముకొనుచు సుమా


  జిలేబి

  రిప్లయితొలగించండి


 6. అస్త్రము లెన్ని! చేసిన విహారము లెన్ని! ఫలింప యత్నముల్
  శాస్త్రి ప్రమోదమొందగ బసాలొక నాడు ససత్త్వతయ్యె కా
  ళాస్త్రిని వైద్యశాల! వకుళాయను డాక్టరు చెప్పగా సుమా
  శస్త్రచికిత్స పిమ్మటనె జానకి సంతుఁ గనెన్ ముదంబునన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. "శాస్త్రీయ ముహూర్తంబున
  శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్"
  నిస్త్రాణ వాదమిట్లన
  శాస్త్రపురాణములలోన సాక్ష్యము లేదే!

  రిప్లయితొలగించండి
 8. శాస్త్రులు గారి సతీమణి
  శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్
  శాస్త్రము నందు కలదనుచు
  వస్త్రములను పంచిరి తమ వాడన ప్రీతిన్

  రిప్లయితొలగించండి
 9. శస్త్రంబుల్బాత్రలనగ
  శస్త్రచికిత్సబహుపాకశాకంబులునై
  శాస్త్రంబొప్పగదిరుగుచు
  శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 10. శాస్త్రులుగారు పలికిరట 
  శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతుల
  న్వస్త్రములను పంచిరనుచు 
  శాస్త్రీ! వింటిమ మనమిది సత్యమె యనుచున్ 

  రిప్లయితొలగించండి
 11. శాస్త్రము లెన్నో చదివిన
  శాస్త్రి యొడయురాలిపుడు ససత్త్వయె కాగా
  నిస్త్రాణము తోనుండగ
  శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్.

  రిప్లయితొలగించండి
 12. క్రమాలంకారంలో ---
  అస్త్రము రాబడి కెయ్యది?
  శస్త్రము గా బాధ పెట్ట చాకలి నింద ల్
  నిస్త్రా ణ త వనికి బనుప
  శస్త్ర చికిత్స : పిదప గనె జానకి సుతుల న్

  రిప్లయితొలగించండి
 13. శాస్త్రికి నుండగ దోషము
  శస్త్రచికిత్సజరుపుటయె శరణ మనంగా,
  శస్త్రనిపుణు బిలిచి జరిపె
  శస్త్రచికిత్స,పిదప గనె జానకి సుతులన్.

  రిప్లయితొలగించండి
 14. ఏస్త్రీ కైనను తప్పదు
  నస్త్రము వాడక ప్రసవము యనరుగ మారన్!
  శాస్త్రీ భార్యకు కవలలు
  శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్"

  రిప్లయితొలగించండి
 15. 10/06/2020

  అందరికీ నమస్సులు..🙏

  *సమస్య: "శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్"*

  *నా పూరణ..*

  *కం*

  అస్త్రము లేమియు వలదని
  శస్త్రము యా చేతులనుచు సంతస పడగన్
  యా స్త్రీ సీతయె శుభమన
  *"శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  ✍️🙏

  రిప్లయితొలగించండి
 16. నిస్త్రాణనొందెజానకి
  శాస్త్రికికాళ్ళాడకుండెసరగునజేరెన్
  శాస్త్రమునెఱిగిన వైద్యుని
  శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్

  రిప్లయితొలగించండి
 17. శాస్ర్రులుసెప్పినవిధముగ
  శస్త్రచికిత్సపిదపగనెజానకిసుతులన్
  శస్త్రచికిత్సలులేకను
  నేస్త్రీయునుగనుటలేదెయీకాలములోన్

  రిప్లయితొలగించండి
 18. నిస్త్రాణ మేల నతనికి
  నా స్త్రీకిం గవలు పుట్టి రానందముగన్
  శాస్త్రికి భార్యామణి ని
  శ్శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్


  వస్త్ర విభూషణాదుల నపార ముదాకర రూప సత్కృపా
  నిస్త్రిగు ణాంతరంగ యవనీసుత ధారుణి భర్త తప్తయై
  నిస్త్రుటి తాత్మ దర్ప ఖర నిష్ఠుర దుర్జయ దైత్యకోటికిన్
  శస్త్రచికిత్స పిమ్మటనె జానకి సంతుఁ గనెన్ ముదంబునన్

  రిప్లయితొలగించండి
 19. కం:

  శాస్త్ర విదుడు గోవిందుడు
  శాస్త్రీయము మేలనుచును చాదస్తముగా
  అస్త్రము వలదన ; కసరగ
  శస్త్ర చికిత్స పిదప గనె జానకి సుతులన్

  గోవిందుడు: ఒక కల్పిత పాత్ర & జానకి భర్త
  కసరగ=కోపించగ

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 20. శాస్త్రిని పెండ్లి యాడగనె జానకి సంతతి కోరుచుండుచున్
  దస్త్రము నిండునట్లుగనె దైవము నామము వ్రాసినం తనే
  శస్త్రచికిత్స పిమ్మటనె జానకి సంతుఁ గనెన్ , ముదంబునన్
  వస్త్రము లందరు ప్రజకు పంచిరి యచ్చటి వాడలందునన్

  రిప్లయితొలగించండి
 21. నేటి శంకరా భరణము వారి సమస్య


  శస్త్ర చికిత్స పిదప, కనె జానకి సుతులన్  ఇచ్చిన పాదము కందము  నా పూరణము సీసములో  హిందు పురాణములలో చిత్రమగు జననములు గురించి ఒక ముని తన శిష్యులకు తెలుపు సందర్భము


  కలిగెను గాదె సుతులు తైల భాండమ్ము
  లందు గాంధారికిన్ వంద మంది,  శరవణ మందున జారిన రేతస్సు
  వలన పుట్టెను చుక్క తొలువ వేల్పు  గొంగ, ఘనత తోడ గుబ్బలి విలుకాడు
  గజ వదనము నివ్వ గణపతి బ్రతి


  కెనుగద శస్త్ర చికిత్స పిదప, కనె
  జానకి సుతులన్ ఝషమ్మునందు
  ద్రోణుడున్ బుట్టె కుంభ మందు, హరి నాభి
  నుంచి పుట్టె నాడు విరించనుండు, కడు వి
  చిత్ర మైనట్టి జననముల్ శిష్యు లార
  యనుచు బలికె మౌని యొకడు వనములోన  చుక్క తొలువ వేల్పు గొంగ= కుమారస్వామి ,
  గుబ్బలి విలుకాడు = శివుడు,
  ,ఝషము = అడవి
  విరించనుండు = బ్రహ్మ

  రిప్లయితొలగించండి
 22. శాస్త్రీ! నీసతి కానుపు
  శాస్త్రీయముగ జరుగదిక సాగు ముడిచి నీ
  దస్త్రము ననగా, వైద్యుని
  శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్

  రిప్లయితొలగించండి

 23. * శంకరాభరణం వేదిక *
  11/06/2020..గురువారం

  సమస్య
  ****

  పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా"

  నా 1వ పూరణ. ఉ.మా.
  *** **** *** *** ***

  దండిగ జూదమాడి తమ దార పణంబుగ బెట్టి యోడగన్

  నిండు సభా తలమ్మునను నీచుడు ద్రౌపది వల్వలూడ్చ తా

  ముండియు మిన్నకుండిరి మహోత్తమ పాండ సునందులయ్యయో!

  పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి