26, జూన్ 2020, శుక్రవారం

సమస్య - 3409

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వంచనతో సజ్జనుఁడుగ బ్రతుకఁగ వచ్చున్"
(లేదా...)
"వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్"
(కళ్యణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

53 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  కొంచెము రక్తమున్ సుగరు కూడుచు నున్నదియంచు తెల్పుచున్
  దంచుచు స్పీచులన్ మిగుల దారుణ రీతిని నాంక్ష పెట్టగా
  కంచము నిండుగా గొనుచు కమ్మని స్వీటులు వైద్యవేదునిన్
  వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  సంచిత కర్మ ప్రాప్తమున చక్కగ చేరుచు నిల్లటమ్మునన్
  కొంచెము బీరు త్రాగుచును గూటికి చేరగ నర్ధరాత్రినిన్
  మంచము క్రింద దూరుచును మౌన వ్రతమ్మున నత్తగారినిన్
  వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్

  ఇల్లటము = ఇల్లఱికము

  గమనిక: రేఫయుక్తమైన "ప, వ" లకు ముందునున్న అక్షరమును లఘువుగా స్వీకరించుటకు వెసులుబాటున్నదని ఆర్యోక్తి

  రిప్లయితొలగించండి
 3. మా చిన్నప్పటి జ్ఞాపకం. మా ఊరిలో కృష్ణయ్యగారు అనేవ్యాపారి ఇంటి లోపలి నుండే
  5వేళ్ళను ఒకే నేతి గిన్నెలో ముంచుకొని వచ్చి వాసన చూపించి వివిధ రేట్లకు అమ్మే వారట

  మంచి ఘృతమ్మని తెలుపుచు
  ముంచుచు తన యేను వేళ్ళ ముక్కుకు గంధ
  మ్ముంచుచు బేపారిఁక తా
  వంచనతో సజ్జనుఁడుగ బ్రతుకఁగ వచ్చున్

  రిప్లయితొలగించండి
 4. కృతఘ్నుడి లక్ష్ణములు ........

  మంచిని వీడి సన్మతుల మాన్యుల వాక్కుల తూలనాడుచున్
  పెంచినవారి ముంచి విలపించగజేసెడు దుష్టచిత్తులున్
  కుంచిత బుద్ధియున్ మిగుల కోపము జూపి జరించువారులున్
  వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్"

  రిప్లయితొలగించండి
 5. వంచన తోడనే వినత వారసు‌ డయ్యెగ దాస్యు డచ్చటన్,

  వంచన తోడనే శిరము పైచర ణమ్మును వామనుండిడెన్

  వంచన చేయుచున్ బ్రతుకు వాని నుతింతురు సజ్జనుండుగన్

  వంచన చేయ దోషమని వాగక కార్యము చేయ యుక్తమౌ


  మారీచునితో రావణుడు మాయా లేడిగా మారమని చెప్పు సందర్భము

  రిప్లయితొలగించండి
 6. శుక్రనీతి
  చంచల చిత్తపు సతియెడ,
  మంచిగ బెండిండ్లలోన,మానముబోవన్ ,
  పెంచగ విత్తము ప్రాణము
  వంచనతో సజ్జనుండు బ్రతుకగ వచ్చున్

  శిశుపాలుడు
  వంచన జేయుచున్ గుడిచె పాలనువెన్నల గోకులమ్మునన్
  వంచన జేయుచున్ నొడచె భామను రుక్మిణి బెండ్లియాడగా
  వంచన జేయుచున్ మధుర పాలకుజంపెను బ్రహ్మవేషమున్
  వంచన జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్
  రిప్లయితొలగించండి
 7. కుంచితముగ నియమము పా
  టించక గెలిచిన దరిని పఠింతురు నీతుల్
  వంచితులయి తలతురిటుల
  “వంచనతో సజ్జనుఁడుగ బ్రతుకఁగ వచ్చున్"

  రిప్లయితొలగించండి


 8. మించారును దుర్బుద్ధియె
  వంచనతో, సజ్జనుఁడుగ బ్రతుకఁగ వచ్చున్
  కొంచెము మేలును చేర్చుచు
  కుంచించుకొనక నరుడు ముగుద! తెలివిడితో


  జిలేబి

  రిప్లయితొలగించండి


 9. కందోత్పల


  మరణము కోరెద రోయి వి
  దుర వంచనఁ జేయుచున్ బ్ర తుకువాని, నుతిం
  తురు సజ్జనుండుగన్ చే
  తల, మాటల కీడు చేయ తలచని నరుడిన్!  కందోత్పల శతకమునకు
  అతి సమీపము :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   కందోత్పల శతకం సాధిస్తున్న మీకు అభినందనలు.

   తొలగించండి


 10. కుంచిత బుద్ధి వీడుమిక కోరరు చెంగట చేరగన్ సుమా
  వంచనఁ జేయుచున్ బ్రతుకువాని, నుతింతురు సజ్జనుండుగన్
  కొంచెము మేలు కూర్చగ నకుంఠితమై జనులెల్లరున్ సదా
  పంచన చేర వత్తురు నివాసముగానదె మూర్ధకర్ణిగా !


  జిలేబి

  రిప్లయితొలగించండి

 11. * శంకరాభరణం వేదిక *
  26//06/2020...శుక్రవారం

  సమస్య
  ********

  "వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్"

  నా పూరణ. ఉ.మా.
  *** ********

  కొంచము న్యాయధర్మముల గోరక మెల్గుచు దుష్టచిత్తులై

  ముంచుతు బ్రక్కవారలను మోసమునన్ సిరి గొల్లగొట్టుచున్

  కుంచిత బుద్ధినిన్ గలిగి ఘోరము లెన్నియొ సల్పువారలే

  వంచన జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్

  ఎంచగ నెట్టివారలకు నిమ్మహి నిమ్మగు నట్టి వారలే

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 12. మంచిగ కనబడు దుష్టుడు 
  వంచనతో, సజ్జనుఁడుగ బ్రతుకఁగ వచ్చున్ 
  వంచన లేకనె మంచిగ 
  సంచితమే చాలుననుచు సంతృప్తి పడన్ 

  రిప్లయితొలగించండి
 13. మంచితనము నటియించుచు
  వంచనతో సజ్జనుఁడుగ బ్రతుకఁగ వచ్చున్
  వంచన ముసుగులుతొలగగ
  వంచకులకు తగిన శాస్తి ప్రాప్తించుజుమీ!

  రిప్లయితొలగించండి
 14. పంచన చైన ధూర్తులిటు భారత వీరుల మాయమాటలన్
  వంచన చేయగా మదిని పంతము బూనియె మంతనంబనన్
  మంచితనంబుతో పిలిచి మట్టును బెట్టగ జూచిరక్కటా
  వంచన జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్

  రిప్లయితొలగించండి

 15. * శంకరాభరణం వేదిక *
  26//06/2020...శుక్రవారం

  సమస్య
  ********

  "వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్"

  నా పూరణ. ఉ.మా.
  *** ********

  వంచన జేసి దాశరథి వాలిని ద్రుంచెను; వాసుదేవుడున్

  వంచనతో సుయోధనుని పార్థునిచే వధియింప జేయడే!

  వంచనచే యధోభువికి వామనుడై బలి బంపె విష్ణువే!

  వంచన జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   సుయోధనుని చంపింది పార్థుడు కాదు కదా... "వంచనతోడ సూతసుతు పార్థునిచే..." అనండి.

   తొలగించండి
  2. గురువు గారూ...సవరిస్తాను..🙏🙏🙏🙏🙏🙏

   తొలగించండి
 16. ఎంచగ కుజనుడు వెలుగడె
  వంచన తో సజ్జనుడు గ : బ్రతుకగ వచ్చు న్
  పంచుచు సమతల మమతల
  కొంచక ననుదినము భువిని కోరిక మీ రన్

  రిప్లయితొలగించండి

 17. పిన్నక నాగేశ్వరరావు.

  మంచిగ పదుగురెదుట నటి
  యించుచు, త్రవ్వుచును గోతులెన్నియొ
  వెనుకన్
  వంచన తెలియని వరకే
  వంచనతో సజ్జనుడుగ బ్రతుకగ వచ్చున్.

  రిప్లయితొలగించండి

 18. పిన్నక నాగేశ్వరరావు.

  మంచిగ పదుగురెదుట నటి
  యించుచు, త్రవ్వుచును గోతులెన్నియొ
  వెనుకన్
  వంచన తెలియని వరకే
  వంచనతో సజ్జనుడుగ బ్రతుకగ వచ్చున్.

  రిప్లయితొలగించండి
 19. పంచుచు నోట్లకట్టల సుభాషణలన్ మురిపించి మించి సా
  దించుచునోట్ల నెన్నికల తీర్చెద పేదల బాధలంచు బో
  ధించుచు నీతివాక్యముల తేకువ పేదల భూమి దోచుచున్
  వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్

  రిప్లయితొలగించండి
 20. కందం
  పంచఁగ గీతా జ్ఞానము
  నంచితముగ గెల్చెనరుఁడు హరిదాసుండై
  త్రుంచఁగ నధర్మపరులన్
  వంచనతో సజ్జనుఁడుగ బ్రతుకఁగ వచ్చున్!

  ఉత్పలమాల
  ఎంచుచు బంధువర్గతతి నీ రణ మెందుకుఁ? జేయలేననన్
  బంచఁగ గీతఁ గృష్ణుఁడు సభక్తినిఁ బార్థుఁడు గెల్చె యుద్ధమున్
  ద్రుంచ నధర్మవర్తనులఁ, బ్రోచెడు దైవమె యండనుండగన్,
  వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్


  రిప్లయితొలగించండి
 21. మంచితనంపుమేల్ముసుగు మానసమందున దుష్టభావనల్
  కొంచెముకూడసిగ్గిలక గోతులు త్రవ్వుచు హారకుండునై
  వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్
  వంచనజేయువాడుతలవంచకతప్పదు యెప్పుడేనియున్

  రిప్లయితొలగించండి
 22. మంచిగనటియించకుమా
  వంచనతో,సజ్జనుడుగబ్రతుకగవచ్చున్
  కుంచితమార్గమువిడుచుచు
  సంచితమగుసేవజేయజనులకునెపుడున్

  రిప్లయితొలగించండి
 23. వంచకులైన నాయకుల పాలనలో గడు బాధలొందుచున్
  మంచికి చోటు లేదనుచు మ్రగ్గెడి వారికి నిల్చి యండగా
  పంచన జేరి నాయకుల భాగ్య మభాగ్యుల కందజేయగా
  వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్

  రిప్లయితొలగించండి
 24. అందరికీ నమస్సులు 🙏🙏

  *కంది గురువులకు శతాధిక వందనములతో, వరుసగా 5 దినములు నా సమస్యలని అందరి సమస్యలుగా చేసిన వారి సహృదయానికి 🙇‍♂️🙇‍♂️🙇‍♂️😊*

  నా పూరణ యత్నం..

  *కం*

  కుంచిత బుద్ది గలిగినను
  పంచగ ప్రేమ పలుకులను పదుగురు మెచ్చున్
  కించిత్ యనుమానమిడక
  *"వంచనతో సజ్జనుఁడుగ బ్రతుకఁగ వచ్చున్"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🙏

  రిప్లయితొలగించండి
 25. సంచుల నిండుగ విత్తము
  పెంచఁగ నేల బ్రతుకుటకుఁ బృధ్విని మిత్రా
  యంచితముగ, జీవించక
  వంచనతో, సజ్జనుఁడుగ బ్రతుకఁగ వచ్చున్


  మించి నిజమ్ముఁ గట్టెదుట మేదినిఁ బల్కిన నిష్ఠురం బగుం
  గొంచెము నైన నన్నరునిఁ గోవిదు లైనను మెచ్చ రక్కటా
  పంచను జేరి తియ్య నగు పల్కులు పల్కుచు నిచ్చమెచ్చఁగన్
  వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్

  రిప్లయితొలగించండి
 26. మంచిగనుండువారలిలమాయలగాడనినందురెప్పుడున్
  వంచనజేయుచున్బ్రతుకువాని,నుతింతురుసజ్జనుండుగన్
  సంచయమైనభావములుసద్గురువోలెనుబ్రస్ఫుటించుచో
  సంచితమానసంబులయియిసాదరమొప్పగనట్టివానినున్

  రిప్లయితొలగించండి
 27. పంచుచు మద్యమాంసమును వాసిగ ద్రవ్యము నెల్లనోట్టు వే
  యించుకొనంగనెంచి, కడుహీనులు పాలకు లౌచు భూమిలో
  కుంచన భావనల్ గలిగి కూరిమి లేక జనాళి నెప్పుడున్
  వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్

  రిప్లయితొలగించండి
 28. పంచెను మద్యమతడు వే
  యించుకొనగ నోట్లు జనుల కెంతయొ ధనమున్
  పంచిగెలిచెనతడు జన
  వంచనతో, సజ్జనుడుగ బ్రతుకఁగ వచ్చున్.

  రిప్లయితొలగించండి
 29. మంచిగ మాటాడుచునే
  వంచనతో గెలుచువాడి పంచన జేరన్
  కొంచెపు మాటలనాడుచు
  వంచనతో సజ్జనుఁడుగ బ్రతుకఁగ వచ్చున్!!

  రిప్లయితొలగించండి
 30. ఉ:

  కొంచము సంశయింపకయె కోరిన కోర్కెలు దీర్తుమంటు తా
  నెంచిన మార్గమున్నెపుడు నిక్కము వీడగ వీడనంచనన్
  యెంచగ సంఘ సభ్యునిగ యెక్కడివక్కడె యాది మర్చ నీ
  వంచన జేయుచున్ బ్రతుకు వాని నుతింతురు సజ్జనుండుగన్

  సంఘ సభ్యుడు =MLA / MP మొ. పొసగే పదము గా ఉందని వ్రాశాను.

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 31. కాంచగలేరువేషమును గాంచియు జెప్పగ నెవ్వరెవ్వరో
  మంచిగ మాటలాడుచునె మాన్యత బొందుచు నుందురేలగన్
  ఎంచగ లేమువారలవి యెవ్వరెరుంగరు చాటుమాటునన్
  వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్!!

  రిప్లయితొలగించండి