22, జూన్ 2020, సోమవారం

సమస్య - 3405

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బుద్ధి గల జనులకు బూది మిగులు"
(లేదా...)
"బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్"
(కళ్యణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

52 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  ఇద్ధర సత్యమిద్దియెర హేళన జేయకు శాస్త్రివర్యునిన్:
  బద్ధము గాని మాటలను వందలు వేలుగ చాటి చెప్పుచున్
  శ్రద్ధగ రాజనీతిగొని జారుల చోరుల తామసంబులౌ
  బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్

  రిప్లయితొలగించు

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ఇద్ధర సత్యమిద్దియెర హేళన జేయకు శాస్త్రివర్యునిన్:
  బద్ధమునౌచు సత్యమున బాధల నోర్చుచు నొజ్జ వృత్తినిన్
  శ్రద్ధగ శాస్త్రముల్ చదివి చక్కని బోధలు చేయబూను స
  ద్బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్"

  రిప్లయితొలగించు
 3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 5. నేటికాలమందునేర్పుగయుండక
  దానధర్మమంటుదండిగాను
  తనకులేకయున్నదానంబుజేసెడి
  బుద్దిగలజనులకుబూదిమిగులు

  యస్ హన్మంతు

  రిప్లయితొలగించు
 6. సమస్య :-
  "బుద్ధి గల జనులకు బూది మిగులు"

  *ఆ.వె**

  నాకు మాత్రమే కనపడి దక్కవలెను
  పరుల కింత కూడ దొరకరాదు
  మేదినిటుల పరుల మేలు కోరని నల్ప
  బుద్ధి గల జనులకు బూది మిగులు
  ...................✍చక్రి

  రిప్లయితొలగించు
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 8. కలిమి గలిగి యుండి కడుబీద వారిని
  గేలి జేయ కున్న గీర్తి మిగులు
  పదవి గలిగి యుండి పరుసగ పలికెడు
  బుద్ధి గల జనులకు బూది మిగులు

  రిప్లయితొలగించు

 9. శివుని పూజజేయ చిత్తశుద్ధి గలిగి
  కోర్కె లేమి లేక కూర్చుసుఖము
  గుడికి యేగ నిచ్చు గుర్తుగా పూజారి
  బుద్ధి గల జనులకు బూది మిగులు!!


  బాధలోన నుండి పాదమ్ములరుగంగ
  పనుల కొరకు దిరుగ పడతియొకతె
  జాలిజూపకుండ జనియెడు నీచపు
  బుద్ధి గల జనులకు బూది మిగులు!!

  రిప్లయితొలగించు
 10. సిద్ధిగల్గు నెపుడు చీటింగుజేసేటి
  దేశముదురు లైన దిట్టలకును
  నీతి మానమంచు నిత్యమ్ముపోరాడు
  బుద్ధిగల జనులకు బూదిమిగులు

  శాసనమండలి సమావేశములు

  వృద్ధుల మేమటంచు బహువిద్యల జూపుచు బిల్లులడ్డగా
  కృద్ధత మంత్రిసత్తములు కేకలువేయుచు కీచులాడుచున్
  వృద్ధిని గాంచలేని యవివేకులు మీరని దూరిరిట్లు దు
  ర్బుద్ధులు గల్గువారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్

  రిప్లయితొలగించు
 11. కీచకునకు కలిగె కీడు కృష్ణ ను కోర,

  రావణుండు కోరి రమణి సీత

  సంగమమును నాడు భంగ పడెను, దుష్ట

  బుద్ధి గల జనులకు‌ బూది మిగులు

  రిప్లయితొలగించు


 12. కందగీతి


  విబుధా! బుద్ధి గల జనుల
  కు బూది మిగులుననుచు పలుకుదురా మూర్ఖుల్
  తబమున నిలకడ గాంచిన
  ప్రబుద్ధులనుచు తెలియక నిరాధారముగా !  జిలేబి

  రిప్లయితొలగించు


 13. విబుధ! తెలివి లేక విస్తృతముగనరె
  బుద్ధి గల జనులకు బూది మిగులు
  ననుచు పలుకు దురిలన పెళుచులయ్యరో
  వారి పోకకు కలవరపడకయ!


  జిలేబి

  రిప్లయితొలగించు


 14. అనుమానమేల మూర్ఖులి
  లన "బుద్ధులు గల్గు వార లకు బూదియె ద
  క్కును నిక్కువంబు" గంజా
  యిని బీల్చి పలుకుదురయ సయింపక సుమ్మీ


  జిలేబి

  రిప్లయితొలగించు
 15. పరమ శివుని గొల్చు నరులకాముష్మిక
  బుద్ధి గల జనులకు ముక్తి కలుగు!
  పరమ శివుని గొల్చు నరులకైహిక సుఖ
  బుద్ధి గల జనులకు బూది మిగులు!

  (మరణానంతరం)

  రిప్లయితొలగించు
 16. పద్ధతి లేక నిచ్చలును బాపము చేయుచు స్వార్థజీవులై
  వృద్ధజనంబులన్ హితుల విజ్ఞుల స్త్రీలను దోటివారినిన్
  శుద్ధమనస్కులన్ గినుక జూపుచు నెల్లెడ బాధపెట్టు దుర్
  బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్"

  రిప్లయితొలగించు
 17. ధర్మబుద్ధి గలిగి దానంబుజేయుచున్
  ఉన్న దంతనిచ్చినూడ్చి వేయ
  తండ్రి నంత్య వేళధనములేకుండగన్
  బుద్ధి గల జనులకు బూది మిగులు

  రిప్లయితొలగించు
 18. నిద్దుర రాదు వారికన నీచపు సంపదఁ గూడబెట్టగ
  న్మిద్దలు మేడలన్ ధనము మిక్కుట మయ్యడి భూషణంబులు
  న్పద్దతి లేనివౌ సిరులు వాడకు వాడకు నింపునట్టి దు
  ర్బుద్దులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్

  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గురువు గారికి నమస్కారములు ప్రాస తప్పింది కదా?

   తొలగించు
 19. మైలవరపు వారి పూరణ

  *ఒక సాధువు*

  ఇద్ధతపంబొనర్చి పరమేశ్వరుగాంచి వరంబు పొందితిన్
  సిద్ధుడ., గాలిలోనిటుల చేయి కదల్చగ స్వర్ణభస్మముల్
  పద్ధతిగా జనించు., గుణవంతులకందును హేమ., మట్లె దు...
  ర్బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు

 20. స్వార్థ మదియు హెచ్చ జగతి నొరుల దోచి
  నాస్తి కూడ బెట్టు నధము లకిల
  తప్పుదంత్య మందు దప్పక హాని,దు
  *ర్బుద్ధి గల జనులకు బూదిమిగులు*


  వృద్ధిని గోరుచున్నిటవివేకము కోల్పడి చేయనెంచ గన్
  సిద్ధముసుమ్మినియ్యదిలశీఘ్రమెజూతురుసర్వనా శమున్
  సుద్దులుచెప్పిమోసమున సొమ్మునువంచనతోడ దోచుదు
  *ర్బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్"*

  రిప్లయితొలగించు

 21. నా పూరణ. ఉ.మా.
  *** ********

  శ్రద్ధ వహించి కార్యముల జక్కటి బుద్ధి నొనర్చ భూరిగన్

  సిద్ధి కలుంగు.,భాగ్యములు జిక్కును.,సౌఖ్యము లభ్యమౌచు దా

  వృద్ధిని జీవనమ్మునను బెక్కుగ నొందును గాని.., ధాత్రి దు

  ర్భుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించు
 22. లాగుగొనుట నెరుగు బాగు నేటిజనము
  పరుల కిచ్చునందు పడదు మనసు
  నిట్టి మనుజులందు నిలచి,నిరతి దాన
  బుద్ది గల జనులకు బూది మిగులు.

  రిప్లయితొలగించు
 23. 22.06.2020
  అందరికీ నమస్సులు🙏

  నా పూరణ

  *ఆ వె*

  మంచి పనులు జేయ మనసురాదనువారు
  పరుల బాధ బెట్టు వంచకులును
  సత్ప్రవర్తన లను సరిగాదనునొక దు
  ర్భుద్ది గల జనులకు బూది మిగులు

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించు
 24. సుద్దులు జెప్పువాడయును శోడశ కర్మల నెన్నిజేసినన్
  శుద్దిగ నాచరించకయె శూన్యపు దిక్కుల జూడగా నిటన్
  యొద్దిక లేని మాటలను యోర్చెడు వారలు నుండ జాలరే
  బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్!!

  రిప్లయితొలగించు
 25. పరుల దోచు కొనుచు సిరులు సంపాదించి
  పదవి బొంది ప్రజల బాధ పెట్టు
  కపట వర్తనులకు కలిమి తొలగి దుష్ట
  బుద్ది గల జనులకు బూది మిగిలు

  రిప్లయితొలగించు
 26. హద్దులు వీడివర్తిలుచు నాగము చేయుచు నాస్తిపాస్తులన్
  వృద్ధిని పొంద నెంచుచును పేదలభూములు కొల్లగొట్టుచున్
  శుద్ధులఁ జెప్పియన్యులకు, చోర గుణమ్మున నిల్చునట్టి దు
  ర్బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్

  రిప్లయితొలగించు
 27. పుణ్య ఫలము కోరి పూజలు, దానము
  శక్తిమించి చేసి శ్రమను జెంది
  యిల్లు, వళ్ళు నంత గుల్ల జేసెడి మూఢ
  బుద్ధి గల జనులకు బూది మిగులు

  రిప్లయితొలగించు
 28. మిత్రులందఱకు నమస్సులు!

  శుద్ధపు టంతరంగమునఁ జొచ్చిన స్వార్థము, మానవాళికిన్
  వృద్ధినిఁ గూల్చి, దుఃఖమును బెంచును ముందున! స్వార్థమూని, స
  త్సిద్ధికి బాతు పొట్ట నటు చీల్చియుఁ గాంచిరె కాంచనంబు? దు

  ర్బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్!

  రిప్లయితొలగించు
 29. బుద్ధి లేని వాని భూవరునిగ జేయ
  బుద్ధ భూమి నెటుల నుద్ధరించు
  బుద్ధి దెచ్చుకొనక బోవ వాడి వెనుక
  బుద్ధి గల జనులకు బూది మిగులు

  రిప్లయితొలగించు
 30. బుద్ధిని కల్గి వాడు నిను మూర్ఖుని జేయుచు తాను నిత్యమున్
  వృద్ధిని బొందనెంచి కడు విజ్ఞత జూపెడు కుచ్చితుండు దు
  ర్బుద్ధిని జూపుచున్ బొగుడు మోసపు మాటల నమ్మి పొంగెడిన్
  బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్

  రిప్లయితొలగించు
 31. కార్యసిద్ధి కొరకు కయివారములతోడ
  స్వార్థపరులు జేరి సన్నుతింత్రు
  మధుర మైన యట్టి మాటలకును పొంగు
  బుద్ధి గల జనులకు బూది మిగులు.

  రిప్లయితొలగించు
 32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు

 33. నా పూరణ. ఉ.మా.
  *** ********

  బద్ధము గాక యుండి భవబంధములన్ని త్యజించి..,ధ్యానమున్

  శ్రద్ధగ బోధి శాఖి కడ సల్పుచు జ్ఞానము నొంది బుద్ధుడున్

  బుద్ధివికాసమున్ గలుగ బోధన జేసి ప్రసిద్ధుడయ్యెగా!

  బుద్ధియు శ్రద్ధలేక కడు మూర్ఖపు చేష్టలతో చరించు దు

  ర్భుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించు
 34. పెద్దవారి మాట పెడచెవినే బెట్టు
  బుద్ధి గల జనులకు బూది మిగులు
  పెద్దలాడు మాట చద్దిమూట గదర
  తరచిచూడ నిదియె తంగిరాల౹౹

  రిప్లయితొలగించు
 35. ఆ. వె. హద్దు పద్దు లేక యర్థము గడియింప
  మదిని దలచి హితవు మఱచి సతత
  మక్రమ మవి నీతు లరయు నికృష్టపు
  బుద్ధి గల జనులకు బూది మిగులు!

  రిప్లయితొలగించు
 36. బుద్దిపెట్టిధర్మజుండెకానలలయందు
  అద్దియుండికాంతనోడ్డెతుదకు
  ఎద్దిధర్మమండ్రునిలలోనమీరలు
  బుద్దిగలజనులకుబూదిమిగులు

  రిప్లయితొలగించు
 37. కలుగుసిరులుశుభముగలుగునుదప్పక
  బుద్ధిగలజనులకు,బూదికలుగు
  జోగిజోగులొకరికొకరురాసుకొనిన
  బుధులసేవవలనపుణ్యమబ్బు

  రిప్లయితొలగించు
 38. పరులసొమ్ముదినుచుపందికొక్కులవోలె
  బ్రతుకువెళ్ళమార్చుబైతులకును
  సాధుజనుల హింస సలిపియానందించు
  బుద్ధి గల జనులకు బూది మిగులు

  రిప్లయితొలగించు
 39. పనికిరాని వాడు పట్టము చేపట్ట
  చదువుకున్న వాని నదుపు చేయు
  బుద్ధి లేని వాడు బొక్కసం భుజియింప
  బుద్ధి గల జనులకు బూది మిగులు.

  రిప్లయితొలగించు
 40. పనికిరాని వాడు పట్టము చేపట్ట
  చదువుకున్న వాని నదుపు చేయు
  బుద్ధి లేని వాడు బొక్కసం భుజియింప
  బుద్ధి గల జనులకు బూది మిగులు.

  రిప్లయితొలగించు
 41. మంచి బుద్ధి గలిగి మసలెడు వారికి
  పుణ్యకర్మ లను విభూతి గలుగు
  నటుల గాక పరుల హాని గోరెడు పెడ
  బుద్ధి గల జనులకు బూది మిగులు

  రిప్లయితొలగించు
 42. మించి సంపదలను సంచయమ్ము తివిరి
  చేయు వారి కిట్లు చెప్పు మింకఁ
  దుదకుఁ దృప్తి లేక తోరమ్ముగా దుష్ట
  బుద్ధి గల జనులకు బూది మిగులు


  వృద్ధి యనంగ నెంచకుమ విత్త సమార్జన మొక్క టంచునుం
  దద్ధిత ముక్తిఁ గాంచుమ నుతప్రవరమ్మును సుంత సత్య మీ
  వృద్ధ జనోక్త భాషణము విష్ణు పదాంచిత చింత నాది స
  ద్బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్

  [బూది = భూతి =విభూతి; అంతియే కాక యైశ్వర్యము హరించి ముక్తి మార్గమును జూపెద నని సాక్షాత్తు శ్రీకృష్ణుఁడే ధర్మరాజుతోఁ జెప్పెను. కనుక వారికి బూది మిగులుట కూడా వాస్తవమే.]

  రిప్లయితొలగించు
 43. పద్ధతిగాజరించకనుబాధలువెట్టెడుమానసంపుదు
  ర్బుద్ధులుగల్గువారలకుబూదియెదక్కునునిక్కువంబుగన్
  శుద్ధమనంబుతోమెలగిసూనృతవాక్యముబల్కువారలన్
  నిద్ధరదుష్టమార్గముననిక్కటుబాలుగజేయభావ్యమే

  రిప్లయితొలగించు
 44. సుద్దులుబల్కునాచరణశూన్యము సిద్ధుల నిందజేయు నే
  పొద్దును దైవచింతనముబూనడుమానసమందు దద్దయున్
  కృద్ధతజూపునిర్దయనువృద్ధుల బిన్నలయందునట్టిదు
  ర్బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్

  రిప్లయితొలగించు
 45. ఆటవెలది
  పరుల శిరము పైన కరముంచి కాల్చెడున్
  వర పరీక్షకెంచ హరుని శిరము
  మోహినిగ నసురుని బుగ్గిఁ జేసె హరి! దు
  ర్బుద్ధి గల జనులకు బూది మిగులు!

  ఉత్పలమాల
  సిద్ధ వరంబదే పరుల శీర్షము పై కరముంచఁ గాల్చుఁ ద
  త్సిద్ధిఁ బరీక్షసేయ పొలదిండి దలంచఁగ దాతపైననే
  క్రుద్ధుడునైన శ్రీహరియె గూల్చఁడె మోహిని రూపమంది, దు
  ర్బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్

  రిప్లయితొలగించు
 46. విదేశీ ఇన్వెస్టర్ల ను ఆకర్షిస్తూ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తామను ఆహ్వానాలు వచ్చిన వారికి చుక్కలు చూపించే సందర్భము :

  ఉ:

  హద్దులు దాటి రమ్మనుచు హార్దము నీవియు నాశజూపగన్
  సద్దులు మూట గట్టుకొని చప్పున జేరగ భారతావనిన్
  సుద్దులు జెప్పి ద్రిప్పుచును శుల్కము లేకయె దుర్లభంబనన్
  బుద్ధులు గల్గు వారలకు బూదియు దక్కును నిక్కువంబుగన్

  ఈవి=బహుమానము

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు
 47. ఇద్ధరణిన్ మహాత్ములకు నెంత కొరంతయు లేదు చూడ సం
  శుద్ధతపోనిధానులు యశోవిభవాత్ములు వారితో నసం
  బద్ధఁపురీతి ప్రేలుచునవాంతరముల్ కలిగించునట్టి దు
  ర్బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్

  రిప్లయితొలగించు