11, జూన్ 2020, గురువారం

సమస్య - 3396

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె"
(లేదా...)
"పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా"

49 కామెంట్‌లు:

 1. 11/06/2020
  *శంకరాభరణం* 🍁
  *సమస్య: "పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె"*

  నా పూరణ ప్రయత్నం..

  *తే గీ*

  ప్రెక్కు కష్టముల నెపుడు పెట్టె వారు
  వదుల కుండగ బట్టుచు పగను జూపె
  చంప దలచిన గూడను సంతసించు
  *"పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె"*

  *తే గీ*

  మోస గించెడి వారికి ముద్దుగాను
  చంప జూచిన గూడను సరియె ననుచు
  వేటు వేయక వదిలెడి పెద్ద మనసు
  *"పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి.
   మొదటి పూరణలో కొంత అన్వయదోషమున్నది. "పెట్టువారు... పగను జూప... చంపదలచి విడిచిపెట్టి సంతసించు..." అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
  2. ధన్యవాదములు ఆర్యా 🙏🙏

   *సవరణతో*

   ప్రెక్కు కష్టముల నెపుడు *పెట్టు వారు*
   వదుల కుండగ బట్టుచు పగను జూప
   చంప దలచి *విడిచిపెట్టి సంతసించు*
   *"పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె"*

   తొలగించండి
 2. అండయె లేక లాక్ష గృహమందున దగ్ధములౌదు రోహొ యీ
  పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరు గా
  నిండ"ని రాజరాజుయె గణించె, నుపాయము చేత త్రవ్వె భీ
  ముండు సొరంగమున్, గరిమమొప్పగ గాచెఁ కుటుంబమంతయున్౹౹

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   'రాజరాజు+ఎ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "ధర్తరాష్ట్రుడు గణించె" అందామా?

   తొలగించండి

 3. కందగీతి


  అకటా జిలేబి! "పాండవు
  ల కంటె మూర్ఖులు వసుధఁ గలరె" చూడగ పా
  చికలాడి వారి రాజ్య
  మ్ము కట్టు కున్నట్టి భార్య మొదలు విడిచిరే  జిలేబి

  రిప్లయితొలగించండి


 4. కందోత్పల


  మరిమరి జూదమునకు బి
  ల్తురు! పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్
  మఱి లేరు లేరు గా పో
  యి రొంపిని పడుదురు దురద యిదియె జిలేబీ


  జిలేబి

  రిప్లయితొలగించండి


 5. జూదమునకు బిలువగ హుజూరటంచు
  పోయి యన్నదంతయునట పోచుపుచ్చు
  కొనుట లోన జిలేబులు కోరి కోరి
  పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె?  జిలేబి

  రిప్లయితొలగించండి


 6. దండగమారి జూదమది! దాయని బిల్వగ పోయి పోయి రా
  రండని నాటలాడుచు హిరణ్యము భార్యను నొడ్డుటందు హా!
  పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. వండలి పూసుకోవలదు వద్దిక పాచికలాట మాటలే
   దండగమారి జూదమది! దాయని బిల్వగ పోయి పోయి రా
   రండని నాటలాడుచు హిరణ్యము భార్యను నొడ్డుటందు హా!
   పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా


   జిలేబి

   తొలగించండి
 7. భార్య వలువలు విప్పినన్ పలక కుండె,

  వనములకు‌ పంప వెడలెను వల్లె యనుచు,

  కరుణ తో నేడు శతృవున్ కాచ మన్న,

  పాండ వులకంటె మూర్ఖులు‌ వసుధ కలరె

  యనుచు నవ్వుదుర్ జను లెల్ల ,వినగ లేను

  మాట లని భీముడనెను ధర్మజుని తోడ

  రిప్లయితొలగించండి
 8. లక్కయింటిని యిదె మీ నిలయమనినను ,
  కౌరవులలోని యొకడు గాక మరి శకుని
  యేల జూదమాడు ననెడి యెరుక లేని
  పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె

  రిప్లయితొలగించండి
 9. వాసుదేవుని తోడుండ బలురు కలరె
  పాండవుల కంటె! మూర్ఖులు వసుధఁ గలరె
  ఱుఁక వహింపని పలువురు సకల సమయ
  ధర్మ నిరతి వారికిడె యుద్ధజయమంచు!

  రిప్లయితొలగించండి
 10. అస్త్రశస్త్రములెఱుగనినల్పులనగ
  బట్టిఁబంతముఁబగవారివగవగలరె,
  దల్లిగనుసన్నమఱువనిదనయులునుప
  పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 11. హస్తిన సామాన్య ప్రజల మనోగతం..

  తేటగీతి
  ధర్మజసహోదరుని బాట ధర్మమనుచు
  నాస్తి పాస్తులతో సొంత యాలి నొడ్డి
  తగని జూదమోడి వెతల దావమేగు
  పాండవులకంటె మూర్ఖులు వసుధఁగలరె?

  రిప్లయితొలగించండి
 12. పడతిపాంచాలినవమానపరచినిండు
  సభనువస్త్రములూడ్చు దుస్సహముసైచి
  మిన్నకుండినవారిని మెచ్చగలమె
  పాండవులకంటె మూర్ఖులు వసుధఁ గలరె

  రిప్లయితొలగించండి
 13. దైవమే కాచువాడట ధన్యులేరి 
  పాండవుల కంటె, మూర్ఖులు వసుధఁ గలరె
  కౌరవులకంటె తెలిసియు కలహమూని
  నాటకమ్మాడి నాశనమందినారు

  రిప్లయితొలగించండి
 14. *దుర్యోధనునితో శకుని మాటలుగా.....*

  ధర్మమూర్తుల మంచును ధరణిఁ దెలుప
  మౌనమె వహింతు రవమాన మైన గాని
  దాడి సేయగ వారేమి తరలి రారు
  పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె

  రిప్లయితొలగించండి
 15. ఫణము గా పెట్టి జూదాన పత్ని నకట
  కోలు పోయిరి సర్వమ్ముకూళ లగుచు
  పాండవుల కంటె మూర్ఖులు వసుధ గలరె
  యనుచు పలుకుట విన నయ్యె నచట నచట

  రిప్లయితొలగించండి
 16. తాండవ కృష్ణునిన్ గొలుచు ధన్యులు వేరొక రేరి చూడగన్
  పాండవులంత; మూర్ఖులు ప్రపంచమునన్ మ ఱి లేరులేరుగా
  కొండలు పిండి చేయుటకు కోతుల నూతగ నెంచు వారు,పా
  ఖండులు వేద శాస్రముల గర్వముతో నిరసించు వారలున్.

  రిప్లయితొలగించండి
 17. ధర్మరతులుగ కృష్ణబోధ నడయాడి
  విజయలక్ష్మి నొంది నిలచె,విఙ్ఞులుంద్రె
  పాండవుల కంటె;మూర్ఖులు వసుధ గలరె
  కౌరవుల కన్న,రాజ్యపు కాంక్ష నెడలె!

  రిప్లయితొలగించండి
 18. మండవె గుండియల్ కనగ మానిని వస్త్రము లూడ్చునాడిటుల్!
  నిండగు నాసభాంతరము నెవ్వరు నన్నను ధిఃకరింపరే?
  ఒండొక బుద్ధిచేయ మనకొప్పగు నారసి జూడగా నిటుల్
  పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా!
  అండగ నా యుధిష్ఠిరున కాహరి యుంటను ధర్మముండదే!

  రిప్లయితొలగించండి
 19. శకుని దుర్యోధనునితో
  కండబలమ్ము చాలదుగ కానలకంపగ వైరివీరులన్
  నిండగు ప్రేమజూపుచును నేర్పుగబిల్వుము జూదమాడగా
  రెండవ యూహలేకిటకు రివ్వునవత్తురు ధర్మరాజుతో
  పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మరి లేరులేరుగా

  రిప్లయితొలగించండి
 20. పాడవుల కంటె మూర్ఖులు వసుధ గలరె
  యనుచు హేళన సేయుట హాస్యమగును!
  మాటకు నిలబడి గెలుపు బాట నంద
  మంచితనము, నోర్మిని జూప మంకు కాదు!

  రిప్లయితొలగించండి
 21. *దుర్యోధనునితో శకుని మాటలుగా.....*

  దుండిని పంచుకొంద్రుగద ధూర్తులు వారలు కాదె కాంచగన్
  దండుగ మారిజూదమున దారను పందెము బెట్ట నా సజా
  తుండను సైసిరైరి యటఁ దొయ్యలి హేడము నోర్చినట్టి యా
  పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా

  రిప్లయితొలగించండి
 22. మంచి విలువ నెరుగలేరు మనుజులెపుడు
  కుంచితంబుగ నీరీతి కూయగలరు!
  ధర్మపరుల దూరతగదు దయను మాలి
  పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె

  రిప్లయితొలగించండి
 23. హస్తిన సామాన్య ప్రజల మనోగతం...

  ఉత్పలమాల
  దుండగమెంచి బాల్యమున దుఃఖముఁ బంచ సుయోధనాధులన్
  మెండుగ నమ్మి జూదమున మెట్టిన ద్రౌపదితోడనందరన్
  దండిగ నొడ్డి యోడి వెత ధర్మమటంచును దావమేగెడున్
  బాండవు లంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా!

  రిప్లయితొలగించండి
 24. మండలి లోనికీడ్చుకొని మానిని జీరల నూడదీయు పా
  షండుని నడ్డగించకనె సౌమ్యుల బోలి నటించుచుండగా ,
  షండుల తోడ నాపతుల సామ్యత
  జూసి జనావళిట్లనెన్
  ‘పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా’

  రిప్లయితొలగించండి
 25. భండన భీముడొక్కడును వాసిగ గాండివధన్వుడొక్కడున్
  మెండగు శౌర్యమున్ జెలగు మేటి సహోదరులాశ్వినేయులున్
  దండుగ గాదొకో యకట ధర్మజుడా సతి నొడ్డ ద్యూతమున్
  పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా

  రిప్లయితొలగించండి
 26. దుండగు లైననే మిటుల దుర్మతి కార్యము
  జేయజాలరే
  మెండుగ కష్టముల్నెపుడు మేలుగదల్చుట
  దేమిటోయి, భీ
  ముండును సైచె కౌరవులు మొండిగ రాజ్యము పంచకుండినన్
  దండిగ కీడొనర్చినను దౌత్యము జేయగ
  కృష్ణుతోడుతన్
  పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా!!

  రిప్లయితొలగించండి
 27. భండన భీములై చెలగు పార్థులు సత్యపు దారి కెప్డు తా
  మండగ నిల్చి పృథ్విపయి నందరి మెప్పును పొందుచుందురే
  నిండుసభన్ నొగుల్చ సతి నిల్చిరి ధూర్తుల నడ్డకుండగన్
  పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా

  రిప్లయితొలగించండి
 28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 29. వీరులనదగువారలులేరుభువిని
  పాండవులకంటె,మూర్ఖులువసుధగలరె
  ధార్తరాష్ట్రులబోలెడువారలరయ
  జరిగెయుద్ధముమూర్ఖపుచర్యవలన

  రిప్లయితొలగించండి
 30. వైద్య శాస్త్రము జగతి నపార వృద్ధి
  సెందె నేఁడు రోగములకు మందు లుండ
  కోటి యొండొక మందు గైకొన రకట వి
  పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె

  [విపాండవులు = మిక్కిలి పాండు రోగము కలవారు]


  దండధ రాంశ వృద్ధ జన ధార్మిక బాంధవ మిత్ర తాప సో
  ద్దండ నికాయ భీష్మ గురు తాత సమాతృ వచో విరుద్ధులున్
  గండులు ధార్తరాష్ట్రు లగు కౌరవ వంశులు క్రూర దుర్న యా
  పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా

  [దుర్నయ + అపాండవులు = దుర్నయాపాండవులు]

  రిప్లయితొలగించండి
 31. దండిగద్రాగినారదుడుదాననెనిట్లనిమత్తుగల్గుటన్
  పాండవులంతమూర్ఖులుప్రపంచమునన్మఱిలేరులేరుగా
  కొండలుబిండిజేయగలగ్రొవ్వునుగల్గినభీమసేనుడే
  నండగనుండెనచ్చటనాతనినందుమెమూర్ఖువానిగా

  రిప్లయితొలగించండి
 32. ఉ:

  మెండగు సంపదల్ గలిగి మెప్పును కీరితి సాధికారతన్
  దండిగ హెచ్చవేసి తమ దారిన సౌఖ్యత బొందకుండగన్
  మొండిగ జూదమాడి ఖలు మోసము మాటున నోడ సర్వమున్
  పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మరి లేరు లేరు గా

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 33. కౌర వకులనా శనముకై కంకణంబు
  గట్టి, ధార్తరాష్టృలతోడ జట్టు గట్టి
  దర్మ మువిడరు పాండవుల్ తరచి జూడ
  పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె
  యనుచు శకునిబల్కె సుయోధనాదులకడ

  రిప్లయితొలగించండి
 34. శ్రీలక్ష్మీ నారసింహాయనమః తేది:11-06-2020.
  నేటి సమస్యాపూరణాల యత్నం -

  భీష్మ యోధులై రాజ్యపభీష్ట లుప్తు
  లైరి యైదూళ్ళు జాలిక ననెడి మాట
  పలికి పలుచనై జారిరి పగతుడింట
  పాండవులకంటె మూర్ఖులు వసుధ గలరె!

  గండములన్నిదాటుచుసుఖైక మనోజ్ఞత గోరకుండగన్,
  లండులధర్మవర్తనుల రాజ్యము గోరక శాంతి గోరు ను
  ద్దండుల నింద జేయగను ధైర్యము బూనుచు నేలయం టివా?
  పాండవులంత మూర్ఖులు ప్రపంచమునందున లేరులేరుగా!


  రిప్లయితొలగించండి


 35. ఏదియు మన కరములందు లేదనుటను
  విబుధ వరులను వినియును వీనులలర
  "పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె"
  యనుట నుచితమౌ న చెపుమ యతివ నీకు

  రిప్లయితొలగించండి