24, జూన్ 2020, బుధవారం

సమస్య - 3407

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్"
(లేదా...)
"మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే"
(కళ్యణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

66 కామెంట్‌లు:

 1. చైనా దొంగదెబ్బతో మరణించిన మన వీరుని గూర్చి..... .....

  అంచితమైనరీతి హృదయాంతరమందున స్నేహశీలియై
  మించిన దేశభక్తియును మీరిన ధైర్య బలప్రతాపముల్
  గాంచిన వీరునిన్ తుదకు కల్మష దుష్ట రణంబు గూల్చెనే
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే  రిప్లయితొలగించండి

 2. నడిరేయి సరదా పూరణ:

  కొంచెము కూడ సిగ్గు విడి కోరిక లన్నియు దాచిపెట్టుచున్
  దంచుచు భాషణమ్ములను దండుగ మాలిన తర్క యుక్తులన్
  వంచన జేసి దోచుచును బంగరు భూషలు దేవళమ్మునన్
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే

  రిప్లయితొలగించండి
 3. 24.06.2020
  అందరికీ నమస్సులు 🙏
  *కంది గురువులకు శతాధిక వందనములతో*.
  (వరుసగా మూడు రోజులు నేను ఇచ్చిన సమస్యలని పద్య పాదములుగా మార్పు జేసి ఇచ్చిరి🙏🙏🙇‍♂️🙇‍♂️ )

  *కం*

  పెంచుకు ప్రేమలు నిరతము
  పంచుచు మనవారె యనుచు పదుగురి కొరకున్
  మించిన భారము తోడుగ
  మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్!!

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 4. శ్రీమాత్రేనమః 

  కాంచనసంధులన్ చెలిమికై నిజశౌర్యము చూపినప్పుడే    
  వంచన నేర్చునట్టి కుటిలంబుల చీనియ దుర్మదాంధులే  
  క్రించుదనంబులన్ దనరు హింసన ; భారతి ముద్దు బిడ్డలే     
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే

  కాంచనసంధులు = ఇరుదేశాల వారు చేసుకునే ఒడంబడిక

  ✍️ కస్తూరి శివశంకర్ 🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   రెండవ, మూడవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 5. కుంచిత బుద్ధినపొరుగుయు
  వంచనతో మోసగింప, భారత హద్దున్
  కంచియనందున సైనిక
  మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   కొంత అన్వయదోష మున్నట్టున్నది. "బుద్ధిని" అనడం సాధువు.

   తొలగించండి

 6. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  మరో గాంధి:

  మించిన భూరి కుక్షులకు మేలును జేయగ నిశ్చయించుచున్
  పంచగ భారతావనిని బంగరు భూములు దేశమంతయున్
  కొంచెము సుందరాంగముల కోసిన చాలని చింతజేయుచున్
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే

  రిప్లయితొలగించండి
 7. పెంచిన జాగిలమొక్కటి
  వంచన చేయంగగాంచి బాలెయము న
  క్తంచరు గనిన ఫలమదియె
  మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్

  రిప్లయితొలగించండి


 8. మించారును మేలెల్లెడ
  మంచి నొనర్చెడి జనులకు, మరణమె దక్కున్
  కుంచితబుద్ధిని చూపను
  వంచన వలదోయి నరుడ వాంఛల విడుమోయ్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 9. కందోత్పల


  వరమాల తధ్యముగ ను
  ల్లరి, మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్
  వరియించు, మృత్యువే ప
  ల్లరులకు, కల్లరి తనము వలదు వలదు సుమా  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. కించిద్యోచన లేకయె
  వంచకులకు కీచకులకు పంచుచు పదవుల్
  పెంచగ రౌడీయిజమును
  మంచి యొనర్చెడు జనులకు మరణమె దక్కున్

  ఇంచుకయేని శంకవల దియ్యదినిక్కము లోకమందునన్
  వంచకులే యధేచ్ఛనుజను వాసిగబెంచి యరాచకంబునన్
  కంచెయె చేనుమేసినటు కాచెడువారలె నీతిదూరరులై
  మంచి యొనర్పగం దలచు మానవులన్ వరించు మృత్యువే!

  మంచిగ నాల్గుగింజలను మందికినీయగ నేలదున్నుచున్
  దించిన వెన్నునెత్తకను దేహమునెంతయు కృంగజేసెడున్
  చెంచయవంటి రైతులను చేయగమోసము తాలువిత్తులన్
  మంచి యొనర్పగందలచు మానవులన్ వరించు మృత్యువే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి.
   రెండవ పూరణలో "యథేచ్ఛ జను" టైపాటు.

   తొలగించండి
  2. ఆహా డా. సీతాదేవి గారు మీరు బహు భాషా కోవిదులు.
   రౌడి – హిందీ
   ఇజమ్ – ఆంగ్లము
   పద్యము – తెనుఁగు

   తొలగించండి
  3. ఆర్యా,నమస్సులు!ఏదో జనాకర్షక ప్రయోగాలు! మూడవ పద్యంలోకూడ మంచిగ,మందికి తెలంగాణ వ్యావహారిక పదాలు!మీకు నచ్చేపద్యం యిప్పుడు వ్రాశాను పరిశీలించండి!

   తొలగించండి
  4. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!టైపాటును సవరిస్తాను!

   తొలగించండి

  5. Trivia:

   "rowdyism" is an English Americanism.

   రౌడీ రాణి (1970) తెలుగు చిత్రం:

   This is the first heroine oriented action film in India.
   This was remade in Hindi as RANI MERA NAAM by KSR Das and starred by Vijaya Lalitha.

   ORIGIN OF ROWDYISM
   An Americanism dating back to 1835–45; rowdy + -ism

   https://www.dictionary.com/browse/rowdyism

   http://telugucineblitz.blogspot.com/2010/09/rowdy-rani-1970.html?m=1

   తొలగించండి


 11. సంచిత కర్మ భోగముల చట్టని తీర్చుకొనంగ మేలగున్
  పంచన చేరు నీశ్వరియె వాంఛల వీడను మోక్షమార్గమే
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు, మృత్యువే
  కుంచిత మైన బుద్ధిగల క్రూరుల కింక ఘటిల్లు తధ్యమై


  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. వంచక తన శిరమును యెదు

  రించుచునల్లూరి తన శరీరమున బులెట్స్

  దించినను పోరు సలిపెన్,

  మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   'శిరమును+ఎదురించు' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 13. కొంచెము పుణ్యము దక్కును
  మంచి నొనర్చెడి జనులకు ; మరణమె దక్కున్
  పంచస జేరుచు బేలను
  వంచన జేసి యతనిపయి బతుకుచు నుండన్

  రిప్లయితొలగించండి
 14. మారీచుడు రావణునికి మంచిని చెబుతాడు సీతను పట్ట వద్దు అని అతని మాటలు వినకున్న రావణుడు ‌అతనిని చంపుతాను అని పలుకుతాడు

  అప్పుడు మారీచుడు మాట వినక బోతే నువ్వు చంపుతావు మాట విని జింకను అయితే రాముడు చంపుతాడు అని చెప్పి జింకగా మారి రాముని చేతిలో ప్రాణములు వదులుతాడు


  వంచన తోడ రాఘవుని భార్యను పట్టుట పాడికాదు నీ

  వెంచిన మార్గమెప్పుడును వీరుల లక్షణ మవ్వబోదు నీ

  మంచిని కోరి పల్కితిని మాటను దాటిన చావు కల్గు నా


  కంచును ప్రాణముల్ విడిచె
  కాంచన శంబర మై ఘనమ్ముగా

  *"మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే"*

  రిప్లయితొలగించండి
 15. ఎంచగపుణ్యముదక్కును
  మంచి నొనర్చెడి జనులకు, మరణమె దక్కున్
  వంచకులకునిదితథ్యము
  సంచితమగుకర్మఫలముసతతముతోడౌ.

  రిప్లయితొలగించండి
 16. ఎంచిన నెందరో జనుల కెన్నగరాని యకాల వ్యాధులే
  పొంచును, మందుకన్న నతిముఖ్యము నవ్వుల వైద్యమేనటుల్
  మంచి నొనర్పఁగం దలఁచు, మా నవులన్ వరియించు మృత్యువే
  బాంచను నీకు నేననుచు పాఱునులే విడనాడి రోగులన్౹౹

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   'అకాల వ్యాధు' లన్నపుడు 'ల' గురువై గణభంగం. "...యకాల రోగముల్" అనవచ్చు.

   తొలగించండి
 17. సంచిత పాపక ర్మమన సాక్షము కర్ణుడు యుద్దభూమినన్
  వంచన సేయజా లకను పంచన నిల్చిన తాత భీష్ముడున్
  పంచెను విద్యవా రికన పంచన ద్రోణుడు పాండువైరులై
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే

  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది.
   'సాక్ష్యము.. భూమినిన్" అనండి.

   తొలగించండి
  2. సంచిత పాపక ర్మమన సాక్ష్యము కర్ణుడు యుద్దభూమినిన్
   వంచన సేయజా లకను పంచన నిల్చిన తాత భీష్ముడున్
   పంచెను విద్యవా రికన పంచన ద్రోణుడు పాండువైరులై
   మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే

   కొరుప్రోలు రాధాకృష్ణారావు

   తొలగించండి
  3. భీష్మ ద్రోణులు యుద్ధమున పాండవ వైరు లైరి కాని పాండు వైరులు కాలేదు.
   పాండవారులై యనిన సమంజసము. పరిశీలించండి.

   తొలగించండి
 18. ఎంచగ స్వర్గము తధ్యము 
  మంచి నొనర్చెడి జనులకు, మరణమె దక్కున్ 
  వంచకులకు సరికాదని 
  ముంచుదుర టశౌచ కూపములను వారిన్

  రిప్లయితొలగించండి
 19. మైలవరపు వారి పూరణ

  సంచితపుణ్యకార్యఫలజాతము మానవజన్మమండ్రు., ప్రా...
  ప్తించెను నీకు., గావున వివేచనతో మరికొంత పుణ్యమా...
  ర్జించుము., ప్రాప్తజన్మమిది చిన్నది., సత్వరమాచరింపుమా!
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగి

  రిప్లయితొలగించండి
 20. కుంచిత బుద్ధియులేకను
  మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్
  వంచనజేసెడిజనులకు
  మంచిగనుండును,కలియుగమహిమయునేమో

  రిప్లయితొలగించండి
 21. వంచన తోడ రావణుడు భామను గైకొని పోవుచుండగా
  మంచిదికాదు నీకనుచు మాన్య జటాయువె యడ్డగింపగా
  నంచలమందినట్టి యసురాధము డంతము జేసె చిల్లమున్
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే

  రిప్లయితొలగించండి
 22. కాంచుచు దేశరక్షణపు కార్యములందుముదమ్ము దీక్షతో
  నెంచి యహింస ధర్మమని యింపుగ సాగుచు నుండ హద్దులన్
  వంచనతో పరాయి పరివారము చెచ్చెర చుట్టుముట్టగా
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే

  రిప్లయితొలగించండి
 23. వంచకరావణాసురుడు పావని సీతను దొంగిలించగాఁ
  గాంచి జటాయు వడ్డు వడ క్రచ్చర నిర్దయ సంహరించె య
  త్కించిదపప్రథం గనక కేవలమోహమదాంధు, డట్లె యే
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 24. అంచిత ఘనత లభించును
  మంచి యొనర్చెడు జనులకు : మరణమె దక్కు న్
  కొంచక దేశము కొఱకై
  పొంచి న వైరుల నెదిర్చి పోరాడంగన్

  రిప్లయితొలగించండి
 25. అంచితమై విరాజిలు మ
  హాద్భుత ధర్మ వితాన వేదిపై
  కుంచిత భావమిశ్రిత ప్ర
  కోప మసూయయు, ఙ్ఞాన హీనతల్
  వంచనలన్ సృజించి మృదు
  భావము ద్రుంచగ యోజన క్రియన్
  మంచి నొనర్పఁగం దలఁచు
  మానవులన్ వరియించు మృత్యువే!


  రిప్లయితొలగించండి
 26. మించెడు దృప్తి,సుఖ మొనరు
  మంచి నొనర్చెడి జనులకు;మరణమె దక్కున్
  వంచన జేసినను కడకు
  మంచిని జేసిన,నెటులది మన నిర్ణయమే!

  రిప్లయితొలగించండి
 27. త్రుంచగ మతపర ద్వేషము
  నెంచెను బాపూ నొకటిగ యెల్లరు నుండన్!
  కుంచిత బుద్ధులు కూల్చిరి!
  మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్

  రిప్లయితొలగించండి
 28. మంచియె జరుగును దలపగ
  మంచి నొనర్చెడి జనులకు; మరణమె దక్కున్
  ఇంచుక దయ లేక జనుల
  వంచించెడి వారలకిక ప్రారబ్ధముగా

  రిప్లయితొలగించండి
 29. సంచితమగుబుణ్యంబులు
  మంచినొనర్చెడిజనులకు,మరణమెదక్కున్
  మంచినిజేయకనెవరికి
  వంచనతోగూడిబ్రదుకువారలకెపుడున్

  రిప్లయితొలగించండి
 30. కందం
  ఎంచుచు మతాభివృద్ధినిఁ
  బంచుచు నిల వాజ్ఙ్మయమ్ము వ్రాలె యువకుఁడై
  సంచారి శంకరార్యులు
  మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్!

  ఉత్పలమాల
  ఎంచుచు హిందువున్ మతము హీనత జెందక యుండునట్లుగన్
  బంచుచు మేటి వాజ్ఞ్మయము భారత మంతట సంచరించుచున్
  బొంచిన మృత్యుపాలబఁడె ముప్పదిరెండున శంకరార్యులున్
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే!

  రిప్లయితొలగించండి
 31. మంచిగజేయగోరియటమాన్యుడుకల్ననుజింతజేయగా
  వంచనజేసిచైనులటభండనమందునహత్యజేసెనే
  కుంచితమైనయాపనికికూలెనునాతడునిస్సహాయుడై
  మంచినొనర్పగందలచుమానవులన్వరియించుమృత్యువే

  రిప్లయితొలగించండి
 32. మంచిమనంబుతోతమసమాజహితంబునుగోరి సజ్జనుల్
  మంచి నొనర్పఁగం దలఁచు, మానవులన్ వరియించు మృత్యువే
  సంచితమైనకర్మములుసైతముతోడుగతెచ్చువారితో,
  పంచినమంచి మానవుల బాయకచేయును కీర్తిశేషుగా!

  రిప్లయితొలగించండి
 33. ఉంచి యసూయ మనమ్ములఁ
  గించపఱచుచుండ జనులు కీర్తికి మున్నే
  యెంచఁ బుడమిఁ ద్వరితమ్ముగ
  మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్


  ముంచును మృత్యు వెల్లరను మూఁడినఁ గాలము మాన కెవ్వరిన్
  సంచిత వర్జి తాఘులను సర్వ సజీవ విహార కోటినిం
  ద్రుంచుము సందియమ్ము మదిఁ దూర్ణము మంచినిఁ జేయకున్ననున్
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే

  రిప్లయితొలగించండి
 34. చంచల చిత్తమాపగను చక్కగ ధ్యానము నభ్యసించుచున్
  కుంచితపాదు గొల్చుచును కూరిమిజేయుచు దానధర్మముల్
  మంచి యొనర్పగం దలచు;మానవులన్ వరించు మృత్యువే
  పొంచిన బెబ్బులిన్ పగిది ముందుగజెప్పక రెప్పపాటునన్ !
  కుంచిత పాదుడు = కృష్ణుడు,నటరాజ స్వామి!

  రిప్లయితొలగించండి
 35. వంచన జేయుచు సంపా
  దించగ బూనెడు కుటిలురు దీక్షగ వెదుకన్
  కాంచక బుధజనులయ్యెడు
  మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్!!

  రిప్లయితొలగించండి
 36. వంచన జేసిపన్నగ సుభధ్రసుతుండ భిమన్యు డేగగన్
  కొంచెపు బుద్ధులయ్యి కురు క్రూరులు కూడిరొక్కచో
  కంచెనుగట్టినొక్కటిగ కారణమైరిరణమ్మునన్ గదా
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే!!

  రిప్లయితొలగించండి 37. అంచితమగుఫలమందును
  మంచి నొనర్చెడు జనులకు ,మరణమెదక్కున్
  వంచనచేయుచొరుల హిం
  సించెడు వారలకు వేగ శిక్షగ నదియే
  మరొక పూరణ


  వంచన చేయగా దలచి పాడుతలంపును బూనిసాగుచున్
  మించిన క్రూరులై వడిగ మీరిన యక్కసు తోడ లోయలో
  కంచెను కాచుకల్నలును గాల్వను లోపడ వైచి చంపిరే
  మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే"*

  రిప్లయితొలగించండి