25, జూన్ 2020, గురువారం

సమస్య - 3408

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మహిమలు గల దేవుఁ డెపుడు మంచినిఁ గనఁడే"
(లేదా...)
"మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే"
(కళ్యణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

48 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  Bengal 19th Century:

  దహనము జేసి హిందువుల ధర్మము లెల్లను క్రీస్తు చెంతనున్
  నహినహి యంచు వేదముల నందము నొందుచు బైబులందునన్
  సహనము వీడి తెమ్మనుచు చంకలు నాకెడి భక్తబృందమున్
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే

  రిప్లయితొలగించండి


 2. అహరహము పనుల మునిగితి
  మహిమలు గల దేవుఁ డెపుడు మంచినిఁ గనఁడే,
  విహితుని గా కన రాడే
  సహవాసియని పలికెదరు సాక్షి పలుకడే !  జిలేబి

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  Bengal 2020:

  దహనము జేయు వైరసుల దండిగ జేర్చుచు వంగభూమినిన్
  నహినహి యంచు పంపుచును నారదు వోలెడు రాష్ట్రపాలకున్
  సహనము వీడి దీదినిక చక్కగ త్రోయుచు మోడి సన్నిధిన్
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే

  రిప్లయితొలగించండి
 4. శ్రీమాత్రేనమః

  తుహినపు వెన్నెలందు బహుదూరపు కాంతులలోన గాంచినన్   
  గహనుడి మాయలే గని జగంబున భక్తికి చేరు తత్వమే  
  సహనము  పేర్మి భావముల సంహితమైన నితాంత  భావమే 
  విహితపు కర్మసాధనల విహ్వలమందున మాయలే సుమీ 
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే

  కస్తూరి శివశంకర్

  రిప్లయితొలగించండి
 5. ఇహమున మంచిని గాంచును
  మహిమలు గల దేవుఁ డెపుడు ; మంచినిఁ గనఁడే
  మహిలో నని యనుకొందురు
  కుహనా సుజనులు నిరతము గూడిన తరులన్

  రిప్లయితొలగించండి


 6. కందా చంప్స్


  వయసాయె సుమీ దీనుడ
  నయ! మహిమలు గల్గు దేవునకు మంచి రవం
  తయుఁ గానుపించ దేలన్,
  ప్రయత్నములచేసినాను వరమివ్వడయా!  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. అహమును వీడక నధునా
  సహజాత మ్ములనువీడి చరియిం పగనే
  డహరహ మిచ్చట కలిలో
  మహిమలు గల దేవుఁ డెపుడు మంచినిఁ గనఁడే

  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 8. మైలవరపు వారి పూరణ


  *శిశుపాలుడు*

  అహహ! యితండు యోగ్యుడట! యంగన జంపెను., పుచ్చినట్టి భూ...
  రుహముల గూల్చగల్గెడి బలుండట., పుట్టను గోట మోయగా
  మహి గిరి మోసెనందు.. రవమానము! వీనికి పూజ యుక్తమే?
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 9. మహిలో పూజలు గొనుచును
  మహిమలు గల దేవుఁ డెపుడు మంచినిఁ గనఁడే
  అహి విడచును  దొరకనిచో
  నహి విడచుట క్రూరుఁడెపుడు నాశము కనమే !

  రిప్లయితొలగించండి


 10. ఇహమున ధ్యానమార్గమున నిమ్ముగ నీశుని గొల్చుచుంటి నే
  నహరహ మాతడే విభుడ
  నంగ దయాళువనంగ వేడినా
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించ దే
  ల! హితము లేవి దక్కవె ఫలమ్ములు లేవె! జిలేబి చెప్పవే!  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. మిత్రులందఱకు నమస్సులు!

  [హనుమంతునితో రావణుఁడు పలికిన సందర్భము]

  "మహిళను దాటకం దునిమి, మాన్యను ఱాయినిఁ గాలఁ దన్నియున్,
  మహలునఁ బుచ్చినట్టి విలు నడ్డి విఱుంగఁగఁ జేసియున్, మహీ
  రుహముల మాటునన్ నిలిచి క్రోఁతినిఁ జంపెను! దైవ మాతఁడా?

  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపింపదే?"

  రిప్లయితొలగించండి
 12. *చెరసాలలో కంచెర్లగోపన్న ఆవేదన*

  మహిమాన్వితుడారాముం
  డహల్యనున్ బ్రోచినట్టి యనఘుండైనన్
  మహిపాలుడాగ్ర హించిన
  మహిమలు గల దేవుఁడెపుడు మంచినిఁ గనఁడే

  రిప్లయితొలగించండి
 13. ఇహమున పాప కర్మల వి
  హీనము గోరుచు దేవదేవునిన్
  రహినొగి తోడ నిత్యము వి
  రామమెరుంగక పూజసల్పుదో-
  మహిమలు గల్గు దేవునకు,
  మంచి రవంతయుఁ గానుపించదే?!
  విహిత కృతార్థ వృత్తిని త
  పించుచు పాపపు కర్మవీడగన్!


  రిప్లయితొలగించండి
 14. ........శంకరాభరణం బ్లాగు....
  25/06/2020 , గురువారం
  సమస్య:

  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే"

  నా పూరణ. చం.మా.
  **** *** ***

  అహరహమున్ మదీయ పతియౌ రఘురాముని సేవ మున్గినన్

  కుహకమొనర్చె బుద్ధి విడి కుంఠుడు క్షారకు బల్కు నమ్ముచున్

  సహనమొకింతలేక నను సానువు సన్నిధి జేర్చుటేల?నా

  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే"


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
 15. విహితపు గోర్కెల దీర్చును
  మహిమలు గల దేవుడె పుడు : మంచిని గనదే
  అహమున మెలిగెడు వాడై
  సహనము లేనట్టి నేత శాంతము తోడన్

  రిప్లయితొలగించండి
 16. అహరము దేవుని నమ్ముచు
  మహి మంచిని జేయ జూచు మనుజ కిడుములే
  సహచరు లగుటను గనమే,
  మహిమలు గల దేవుడెపుడు మంచిని గనడే!

  రిప్లయితొలగించండి
 17. 25.06.2020
  అందరికీ నమస్సులు🙏

  నా పూరణ యత్నం..

  *కం*

  ఇహమున గనె యా నిజము, ప
  రిహసింప దగదు పలికితి రిటులనుచున్, తా
  సహనము జూడగ దలచిన
  *"మహిమలు గల దేవుఁ డెపుడు మంచినిఁ గనఁడే"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 18. మహిలో దేవుని లీలలు
  అహమున మూసిన కనులకు నవగతమవునే? సహనము వీడిటు ననెదరు!
  "మహిమలు గల దేవుఁ డెపుడు మంచినిఁ గనఁడే"

  రిప్లయితొలగించండి
 19. మహిజను గాన కంపె నొక మందుని మాటకు ధర్మమంచటన్
  మహిత గుణాత్మునా బలిని మట్టున నెట్టె నధో జగమ్ముకున్
  మహి నిటు రేగ ఘోరకలి మాపగ జూచెడి వెజ్జు గావడే
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే

  రిప్లయితొలగించండి
 20. ఇహమున పూర్వజన్మమున నెన్నియొ పాపపు చేష్టితమ్ములన్
  కుహక మనస్కుడై సలుప కూడెను పాప ఫలమ్ముతోడుగా
  మహిని గతంపు పాపములు మాయక యున్నను పూజసల్పినన్
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే

  రిప్లయితొలగించండి
 21. ఇహమున గోరి దాశరథికింపగు కోవెల గట్టితిన్ గదా
  యహరహమున్ శ్రమించి, వసుధాధిపుడా విషయమ్మెఱంగి యా
  గ్రహమున బంధిసేసె నను కావగ రాడయె రామచంద్రుడా
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే.

  రిప్లయితొలగించండి
 22. దేహికితోడుగకర్మలు
  మహిలోమంచిచెడులుగమారుటవలనన్
  సహనములేకనునరుడను
  మహిమలుగలదేవుఁడెపుడుమంచినిఁగనఁడే

  రిప్లయితొలగించండి


 23. దుహితయుమరణింపగ గని
  మహిళయు వేదనయు హెచ్చ మగనిని గనుచున్
  సహనముకోల్పోయిపలికె
  *మహిమలు గల దేవుడెపుడు మంచిని గనడే*

  మహిళ నటంచును నెంచక
  నహమును చూపుచు ఖలుడట నందరి యెదుటన్
  మహిలో వలువలు లాగెను
  * మహిమలు గల దేవుడెపుడు మంచిని గనడే"*

  రిప్లయితొలగించండి
 24. తహతహ నింద్రుఁడు మునిసతి
  నహల్య మోహించె నకట యన్యాయముగా
  నహరహము కురిసె శిలలను
  మహిమలు గల దేవుఁ డెపుడు మంచినిఁ గనఁడే


  గృహగత కార్య భారమునఁ గృచ్ఛ్రము లందు మునుంగఁ దోఁచదే
  బహువిధ దుఃఖ సంచయము పట్టి భృశమ్ముగ నొంచుచుండగా
  నిహమున భక్త పుంగవుల యెల్లరి చిత్తము లందు నివ్విధిన్
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానిపించదే

  రిప్లయితొలగించండి
 25. అహరహము పరితపించుచు
  మహితాత్ములు దేశరక్ష మనకర్తవ్యం
  బే హరిసేవనమనగా
  మహిమలు గల దేవుఁ డెపుడు మంచినిఁ గనఁడే!!

  రిప్లయితొలగించండి
 26. కుహనాబుద్ధులునిరతము
  నహములులేబెరుగుకతననదుపులులేమిన్
  నిహపరములుదెలియకయనె
  మహిమలుగలదేవుడెపుడుమంచినిగనడే

  రిప్లయితొలగించండి
 27. చం:

  విహితము యేది గావలయొ వేగమె గూర్చగ వెన్ను జూపడే
  తహతహ లాడనేల ప్రతి తప్పును ఒప్పుగ నెంచి జూపనై
  సహనము వీడనేల నిక సాపెన లేల తలంచ నివ్విధిన్
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయు గానుపించదే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 28. తహతహ లాడడు జూపగ
  మహిమలు గలదేవుడెపుడు; మంచిని గనడే
  అహమే బ్రహ్మని యెరుగక
  రహితో జీవించు నరుడు రాత్రింబవలున్

  సహనము లేని పలుకులివి
  మహిమలుగల దేవుడెపుడు మంచిని గనడే?
  మహితాత్ముని నియతి యిదే
  గ్రహియింపుడు కర్మకొలది రక్షణ దొరకున్

  సీతాపరివేదన!

  అహరహ మున్ననాతప మన్నటుల నే జరించి సాగినన్
  ఇహపర మాతడేయనుచు నీశ్వరునానగ నమ్మి బాధలన్
  సహనముతో వహించి పచిసాక్షిగ శీల పరీక్షగొన్ననున్
  మహిమలుగల్గు దేవునికి మంచి సుమంతయు గానుపించదే?!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంపకమాల మొదటి పాదములో సవరణ
   అహరహ మున్ననాతపము వోలెను నేజరియించి సాగినన్

   తొలగించండి
 29. మహిలో భక్తుల బ్రోచును
  మహిమలు గల దేవుఁ డెపుడు, మంచినిఁ గనఁడే
  ని హితము గూర్చడు గాంచుచు
  అహరహముజనులుసలిపెడుఅగవులనెల్లన్

  రిప్లయితొలగించండి
 30. అహితముగోరునట్టి రిపు నట్టడగించగ నెంచగోరగా
  తహతహలాడెమానసము ధైర్యము నందుచు పోరుసల్పగా
  కుహనమనస్కులన్ దరుమ గోరియు ముందున కేగినన్గదా
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే!!

  రిప్లయితొలగించండి
 31. కందం
  అహరహముఁ గోవిడుఁ జెలఁగ
  సహనముఁ జూచి చెలరేగ చైనయె రైతున్
  దహతహల ముంచ మిడుతల్
  మహిమలు గల దేవుఁ డెపుడు మంచినిఁ గనఁడే?

  చంపకమాల
  అహరహమున్ గరోన వికటాస్పద కేళికి భీతినందుటల్
  సహనము, చేతఁ గాకయని చైన దలంచుచు దాడిఁ జేయుటల్
  తహతహ లాడుచున్ మిడుత దండులు నాశమొనర్చఁ బంటలన్
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే

  రిప్లయితొలగించండి
 32. మహిమలుగల్గుదేవునకుమంచిరవంతయుగానుపించదే
  మహిమలుగానిపించకనెమాటలయందునగాకచేతలన్
  నహరహముంముదంబునునెనంచితరీతినిగల్గజేయుచున్
  నిహముపరంబునందునసహేతుకమైనవరంబులుచ్చుగా

  రిప్లయితొలగించండి
 33. సీతాపహరణ సందర్భములో జటాయు పక్షి........

  సహనము మీరి రావణుని శక్తికొలందిగ నడ్డగించి దు
  స్సహతర సంగరమ్మున నశక్తతఁ సీతను గావనైతినే
  సహృదయ చంచలాక్షి విలసన్ముఖి యామెకు రక్షయెవ్వరో !
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే

  రిప్లయితొలగించండి
 34. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః
  తేది:25-06-2020,శభోదయ నమస్సులతో,

  నేటి సమస్యాపూరణాల యత్నం-


  మహితల్లిదండ్రులకు సే
  వహో!యనునటుల గరుపెడి బాలుని జంపన్
  అహ!యిది తగునా దైవమ?
  మహిమలు గల దేవు డెపుడు మంచిని గనడే


  తుహిన నగంబు పై ఘన మదోద్ధతులౌ కపటంపు వైరి,శాం
  తి,హితముగోరి వెళ్ళిన సుధీరులజంపె! నిదేమి చిత్రమో?
  సహనము గల్గి‌ యుండగ విషాదము గూర్చితివేల దైవమా!?
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయు గానుపించదే

  రిప్లయితొలగించండి
 35. అహరహమెల్లరుగ్మతలనధ్యయనంబొనరించి రోగులన్
  మహితగుణాఢ్యులైయరయు మాన్యులు వైద్యులు వారికక్కటా
  విహితపుసేవజేయుతరివేసటగల్గు విషజ్వరాలతో
  మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే

  రిప్లయితొలగించండి