16, జూన్ 2020, మంగళవారం

సమస్య - 3400

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె"
(లేదా...)
"వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్"

85 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    సందియ మింత కానకయె శంకను జేయక శాస్త్రివర్యుడే
    ఛందము నేర్వగోరుచును జంబము వీడుచు కాళ్ళు బట్టుచున్
    కందియ శంకరున్ కొలువు కమ్మగ జేరగ, కాలకూటమై
    వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రాణరక్షణకు వినియోగించే కొన్ని ఔషధాలను విషంతో తయారుచేస్తారట! క్రమం తప్పకుండా, క్రమపద్ధతిలో, పరిమితంగా తీసుకుంటే విషమూ మంచిదే!
      మీ సరదా పూరణ చక్కగా ఉన్నది. 'శంకరాభరణం' సమస్యలు (విపరీతార్థాలతో) విషతుల్యాలైనా పద్యరచనాభ్యాసానికి ప్రాణరక్ష!

      తొలగించండి
  2. దుష్టపు కరోనయె జనుల దునుముచుండె
    పంటలను మిడుతల దండు పాడుజేసె
    క్ష్మాతలమునందు ప్రజలకు గాంచ నిట్టి
    వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె"

    రిప్లయితొలగించండి
  3. వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్
    యందురదేల నమ్ముడిక నందరు నచ్చెరువొందు రీతిగా
    కందువ కంది శంకరుల గాదిలి పద్య సభాంగణమ్మునన్
    చందపు పూరణమ్ములను సత్కవి శేఖరులందజేయగా
    విందొనరించు గాదె యవి వీనులకున్ రసవత్తరమ్ముగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రసవత్తరమైన పూరణ. బాగున్నది.
      'ఇయ్యెడన్+అందురు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సుందరి రూపునున్ గనుచు శుంఠయె గ్రక్కున పెండ్లియాడగా
    ముందుగ కోరికన్ తెలిపి ముద్దుల నిచ్చుచు శోభనంబునన్
    తొందర జేయుచున్ సతియె తోడుగ తేగను వృద్ధుమాతనున్
    వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆటవిడుపు పూరణ ప్రశస్తంగా ఉన్నది. 'తేగను' అన్న ప్రయోగం సాధువు కాదు.
      మీ పూరణకు నా పేరడీ....

      సుందరి రూపునున్ గనుచు శుంఠయె చేరగ సానికొంపకున్
      ముందుగ కోరికన్ తెలిపి ముద్దుల నిచ్చుచు పొందు గూడగా
      తొందర జేయ వేశ్య తన తోడుగ తెచ్చిన వృద్ధమాతచే
      వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్

      తొలగించండి


  5. నేనేమి చేతు 3400 సమస్యల నుండి శ్రేష్టమైన‌ వాటిని నెన్నుకొనగ ! ( నాది కూడ వుంటుందా దాంట్లో :))



    ప్రకటించితి ప్రచురింపం
    గ కూర్పు పూరణల మాలికగ చూడగ నా
    డికముగ నెన్నుకొనగ పొ
    ల్తుక! వే లకొలఁది సమస్యలు వెతలఁ గూర్చెన్!


    శంకరుల వారి మాటగా

    జిలేబి
    కందగీతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఛందస్సుతో ఆటలాడుకుంటున్నారు. బాగుంది మీ పూరణ.
      సమస్యాపూరణ పుస్తకం తయారైతే మీ పూరణలు తప్పక ఉంటాయి. సందేహం లేదు. కాని అది కార్యరూపం దాల్చే దెన్నడో?

      తొలగించండి


  6. కందోత్పల


    గసవచ్చె నెన్నుకొన కే
    సిస! వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రో
    చె సమస్య లియ్యెడన్! జ
    గ్గు సాధనమున పనులు సమకూరు ధరణిలో!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. తొందరగాను కూర్పునదె తొయ్యలి! చేయదలంచి చూడగా
    వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్!
    కొందరు సాయమీయగ నకుంఠితమైన సమస్యలెన్నగా
    చందము గాను దోచినవి చాలిక తోడుత, వచ్చు తప్పకన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  8. చేయ దలచితి ప్రచురణ చెంగలువల
    దండగ పలుకులచెలికి! దాని కొరకు
    పూర్వపు టపాల చూడగ పూవుబోడి!
    వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె
    నెన్ను కొనగ కఠినమయ్యె నేదియనుచు !



    జిలేబి


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాస్తవం తెలియజేసారు. సమస్యలను, పూరణలను ఎన్నుకొనడానికి కొందరు మిత్రులు ముందుకు వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరం కేటాయించాలనుకున్నాను. కాని కొందరు మిత్రులు ఫోన్ చేసి పూరణలను ఎన్నుకొనే పని మీరు చేస్తేనే యుక్తంగా ఉంటుందన్నారు. నాకేమో సమయం చిక్కడం లేదు. ప్రస్తుతానికి పని ఆగిపోయింది.
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.

      తొలగించండి
  9. వసుధపై పుట్టుక మొదలు బతుకు నందు
    గాలము గడచిన గొలది గలియబడిన
    వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె ,
    నైనను సరియగుననెడి యాశ మనది

    రిప్లయితొలగించండి
  10. ఎంచగ సమస్య. లిచ్చోట యెన్ని‌ గలవు,

    పూరణములు వేటిని జేయు బుధులు నెపుడు

    దుష్కర ప్రాస యేమిడు తొలుత యిచట

    వేలకొలది,సమస్య లు,వెతలు గూర్చె

    రిప్లయితొలగించండి
  11. గల్ఫు లోన పెట్రోలు దుకాణమందు
    పనులఁ జేయు ధీరూభాయి పాటులు పడి
    పెద్ద వ్యాపార వేత్తయై పేర్గడింప
    వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె

    రిప్లయితొలగించండి
  12. కష్టములుమకరమ్ములై కడలియందు
    వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె
    సాధ్యమెటులీద సంసార సాగరమ్ము
    దైవచింతనదోనెయై దరికిజేర్చు

    రిప్లయితొలగించండి
  13. అందని పండుగా నిలిచె నాదర మింటను లెక్కచేయరే
    బందుగులైన నాశ్రమపు వాసము వార్ధకమున్ గ్రసించెడిన్
    సందునుజూచి వ్యాధులును శారదమాత్రమె సాంత్వనమ్మయెన్
    వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణలో నా పరిస్థితినే వివరించినట్టున్నారు. ప్రశస్తంగా ఉన్నది.
      దేవుని దయవల్ల వ్యాధుల సమస్య లేదండీ!

      తొలగించండి
    2. అది మహద్భాగ్యమే గురువు గారు

      తొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    సుందరభావజాలపరిశోభితపద్యఫలప్రసూనముల్
    విందన శంకరాభరణవృక్షము సత్కవికోకిలాళికా...
    నందము గూర్చె నేటికి గనన్ త్రిసహస్రచతుశ్శతంబుగా!
    వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  15. కంది శంకర స్వామికి కనగ నిజము 
    వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె
    రోజు కొక్క సమస్యను లోటు లేక 
    యిఛ్చి వాటి నన్నిటి  చూచు నింపుమీర

    రిప్లయితొలగించండి
  16. ప్రజలు గెలిపించ లభియిం చె పదవి తనకు
    సంబరంబున మునిగిన సమయ మందు
    తలకు మించియు దీర్చ గా వలను గాని
    వేల కొలది సమస్యలు వెతల గూర్చె

    రిప్లయితొలగించండి
  17. సుందర హస్తినాపురము శోభల దప్పి విహీనమయ్యెగా
    చిందర వందరై బ్రతుకు చిక్కెను సొక్కెను చిక్కులందునన్
    కుందెను నామనంబు ఘటికుల్ గద వారలు పాండు నందనుల్
    వందలు వేలుగా ముసిరి వంతల దోచె సమస్యలియ్యెడన్.

    దుర్యోధనుని మనోగతము

    రిప్లయితొలగించండి
  18. [16/06, 06:56] V: శ్రీ లక్ష్మీ నారసింహాయనమః
    మహోదయులకు శుభోదయం.
    నేటి సమస్యా పూరణాల ప్రయత్నం -

    ఆర్యా! ధన్యోస్మి మొదటి పద్యం
    సవరణతో-

    పిల్లలెవరైన యానంద జల్లు వారె
    ఆటలాడంగ వారిన ట్లాడ నివ్వు
    అట్లు గాకున్న వారంత పాట్లు బడగ
    వేలకొలది సమస్యలు వెతలు గూర్చు


    నిందలు మోసిరే! చనిరె నెయ్యపు‌ దారిన! నోపిరే! భువిన్
    అందలమాస లేదనిరె! యందరి సౌఖ్యము గోరిరే! సదా
    నందపు డెందమున్గలిగి నైష్ఠికులై మను పాండుపు త్రులన్
    వందలు వేలుగా ముసిరి వంతల ద్రోచె సమస్యలియ్యెడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి.
      మొదటి పూరణలో 'ఎవరైన నానంద..' అనాలి. 'ఆనంద జల్లు' దుష్టసమాసం.

      తొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దుష్టమౌ కరోన వలన నష్ట మమరి
    ఆర్ధికమ్మగు లోటుతో ననయ మంత
    దిగులుతో నగడు పడెడి దేశ మందు
    వేలకొలది సమస్యలు వెతలు గూర్చు

    రిప్లయితొలగించండి
  20. ఏల నిచ్చెను నిత్యము నెన్ను కొనుచు
    వేలకొలఁది సమస్యలు; వెతలఁ గూర్చె,
    వాని బూరించి పంపగ బ్రతి దినమ్ము,
    సభను నామోద మును దెల్ప శంకరార్య!


    అందెలు గట్టి జీవన భ
    యానక దృశ్య కరాళ కేళియై
    చిందర వందరన్ బ్రతుకు
    చిత్రము ద్రుంచె "కరోన" భూతమై
    అందము లీను మానవ సు
    హాస వికాసము వ్రీల్చి విశ్వమున్
    వందలు వేలుగా ముసిరి,
    వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్!

    రిప్లయితొలగించండి
  21. కాల చక్రము దిరుగగ గదలి పుడమి
    కాల సర్పమై శార్వరి కాలు మోపె
    కాలకూటము చిందించె కరుణ లేక (కరొన నేడు)
    వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె

    రిప్లయితొలగించండి
  22. చెందె కరోన యందెటుల జూడ నుపాధియె లేకపోయె నా
    క్రందనె మారుమ్రోగ విధి కాటును వేయ డబ్బులేక పే
    రొందిన వారె మాటువడ నూహయె జేయగలేము కష్టముల్
    వందలు వేలుగా ముసిరి వంతల ద్రోచె సమస్యలియ్యెడన్

    రిప్లయితొలగించండి
  23. అందినసొమ్ములన్నియు రయమ్ము వ్యయమ్ము కరోనచేయగా
    కుందుచు నుండె ముల్లె సమకూరక యన్ని ప్రభుత్వశాఖలున్
    చిందరవందరయ్యె పని చిక్కక కొంపలనుండ నెల్లరున్
    పొందుట కష్టమయ్యె కట! భోజ్యము నిత్యము పేదవారికిన్
    వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్

    రిప్లయితొలగించండి
  24. 16.06.2020
    *శంకరాభరణం*

    నా పూరణ యత్నం

    *తే గీ*

    శంకరాభరణమునందు శంకరునకు
    వ్రాయు పద్యమ్ము పదుగురు పరుగులిడుచు
    ఇష్ట పడుచు తా నీయగ నిచట, నెటుల
    *"వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె"?*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  25. మీ పూరణ బాగున్నది.
    మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

    రిప్లయితొలగించండి
  26. నాదుపట్టికజూడుమునాతి!యుండు
    వేలకొలదిసమస్యలు,వెతలగూర్చె
    నింటబయటనుగలిగెడునిడుములరయ
    మనసునిబ్బరమొక్కటేమార్గమపుడు

    రిప్లయితొలగించండి
  27. మందగ నూటయాభయొక మానితసభ్యులు గల్గియున్ జయం
    బొందక నిత్యమొక్కటిగ మొట్టగ కోర్టు ప్రభుత్వచర్యలన్
    కుందుచు చంద్రబాబుపయి కుట్రలబన్నెడు ముఖ్యమంత్రికిన్
    వందలు వేలుగాముసిరి వంతలద్రోచె సమస్యలియ్యడల్

    చిందరవందరై బడుగుజీవుల జీవిక లాకుడౌనునన్
    బందవ నన్నిసేవలిట బాసటగానక బిల్లజెల్లతో
    వందల వేలమైళ్ళు నడవంగను జేరగ సొంతగూటికిన్
    వందలు వేలుగాముసిరి వంతలద్రోచె సమస్యలియ్యడల్

    రిప్లయితొలగించండి
  28. అందపుకాపురంబునననారడివెట్టుచువచ్చెచూడరో
    వందలువేలుగాముసిరివంతలద్రోచెసమస్యలియ్యెడన్
    చిందరవందరాయెయికజీవితమంతయునెట్లుసాగునో
    బందుగులందరియ్యెడలబంధమువద్దనిదూరమైరిరే

    రిప్లయితొలగించండి
  29. సుంత చింతించు మింపుగ నంతరంగ
    మందుఁ జాలక యున్నదె డెంద మందు
    నొత్తిడి మన కిప్పట్టున గ్రొత్తది గొలు
    వేల కొలఁది సమస్యలు వెతలఁ గూర్చె

    [కొలువు +ఏల = కొలు వేల]


    కందురె వైపరీత్యములఁ గ్రమ్మఁ గరోన వినూత్న కీటకం
    బెందును విశ్వమందుఁ బరమేశ్వరు నండను గొన్న జీవియే
    యందఱిఁ దారతమ్యముల నారయ కక్కట ముట్టడించఁగా
    వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్

    [కరోన = చేతులు తక్కువ యైన]

    రిప్లయితొలగించండి
  30. "వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె"
    కష్ట మెరుగని జన్మము కానరాదు!
    కుంగి పోవుట తగదుగ కొరత తోడ!
    నేర్పు తోడను మనవలె నోర్పు కలిగి !

    రిప్లయితొలగించండి
  31. తేటగీతి
    గురులు కారుణ్యమూర్తియై కొదువ లేక
    పెక్కు చోట్ల సమస్యల పేర్చియిచ్చి
    పొందువడఁగ సమీక్షకున్ బూరణములు
    వేలకొలఁది, సమస్యలు వెతలఁ గూర్చె

    ఉత్పలమాల
    ఎందరినో కవీంద్రులుగ నింపుగ దీర్చుచుఁ శంకరార్యులా
    నందము గూర్చగా నొసఁగ నాలుగు చోట్ల సమస్యలన్నిటిన్
    విందొనరన్ సమీక్షల నపేక్షను బట్టఁగ పూరణమ్ములున్
    వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్

    రిప్లయితొలగించండి
  32. చిందరవందరై తుదకు చేదుగమారెనుజీవనమ్మహో
    విందువినోదముల్ గనము వేడుకలన్నియు లుప్తమాయె నే
    మందుకరోనజిమ్ము విషమంతనియింతనిచెప్ప శక్యమే!
    వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్

    రిప్లయితొలగించండి
  33. ఉ:

    పొందిక గూడి దేహమున పొంగినయందము కాంతు లీనగన్
    చిందులు వేయగన్ మనసు, చెక్కిలి నొక్కుచు వృద్ధ యిట్లనెన్
    తొందర యేల సుందరిని దోపగ నెందరొ యర్రు జాచుటై
    వందలు వేలుగా ముసిరి వంతల ద్రోచె సమస్య లియ్యెడన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  34. గీతపరమార్థమిదియన్ననూతమగుచు
    కర్మయోగముమనకున్నధర్మమనుచు
    గూర్చిసమకూర్చిదీర్చగాబేర్చిబేర్చి
    వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె

    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  35. మందిల లేని రోగమది మానవ జాతిని ద్రుంచ నెంచుచున్
    ముందుగ చైన దేశముమ పుట్టిన నేమి ప్రపంచ మంతకున్
    తొందర గానె ప్రాకెనది దుష్ట కరోనయె లోకమందునన్
    వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్యలియ్యెడన్.

    రిప్లయితొలగించండి
  36. ముందుగ ప్రస్తుతింతు కవి పుంగవు లందున యగ్రగణ్యుడౌ
    కందిని, పేరు దెచ్చెగద కల్పము నందు సమస్యలే గనన్
    వందలు వేలుగా ముసిరి, వంతలఁ ద్రోచె సమస్యలియ్యెడన్
    మందులు శుంఠకాయలకు మాఘుల కెల్లను భీతి గొల్పుచున్.

    రిప్లయితొలగించండి
  37. స్రుష్టిఁజేసినబ్రహ్మయేస్రుణినిఁజూపె
    తఱచిఁజూడగనెక్కడదారిలేదు
    ముందుజీవితమేరీతినుండునయ్య
    వేలకోలదిసమస్యలువెతలఁగూర్చె

    రిప్లయితొలగించండి
  38. కలియుగమ్మున జనులను కలతబెట్ట
    ఇంట బయటను నెన్నియో యిక్కుపాట్లు
    కుదురు నీయక నిత్యము బెదరగొట్టి
    వేల కొలది సమస్యలు వెతల గూర్చె!!!

    రిప్లయితొలగించండి
  39. పదవి కాంక్షలు బెరుగగ పాట్లు బడుచు
    నేరకిచ్చిన హామీల నేత, నేడు
    దీర్చ బూనంగ నెదురొచ్చె, తీరు గనిన
    వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె!!

    రిప్లయితొలగించండి
  40. బంధము మోసపుచ్చె బహు భారము నెత్తు కొ నంగనా డటన్
    కొందరు నవ్వవట్రి గద కొంపల జర్గిన దేమిటంచు నా
    డెందరెరింగినారనుచు ఎవ్విదమందర తెల్యజెప్పగన్
    వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్!!



    ***** ఒకానొక కుటుంబంలో భార్య విడిచి వెళ్ళినపిల్లవాడిని జూచి నవ్విన వారికి సర్దిచెప్పలేక ఆ పిల్లవాడు పడుతున్న బాధ...

    రిప్లయితొలగించండి
  41. చేయ పనులే వి కనరాక చేతియందు
    పైకమసలు లేక కరోన బాధ హెచ్చ
    దార సుతులను పోషించు దారి లేక
    వేలకొలది సమస్యలు వెతలు గూర్చె.

    మరొక పూరణ

    సుందర స్వప్నముల్ గనుచు చోద్యముగాంచెడి వాంఛలెల్లయున్
    గొందల మెట్టుచున్ నిపుడు కుందును నింపక రోన వచ్చెనే
    చిందులువేయుకోరికలు చింతయు కూర్చగ మానసంబునన్
    వందలు వేలుగా ముసిరి వంతల ద్రోచె సమస్య లియ్యెడన్

    రిప్లయితొలగించండి