4, జూన్ 2020, గురువారం

సమస్య - 3389

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్"
(లేదా...)
"నవనీతప్రతిమల్ నటించెఁ గడు నానందమ్ముతో నగ్నిలోన్"

34 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  జవసత్వమ్ములు క్రుంగినన్, బలుపుగా జాడ్యమ్ము లొప్పారగా
  లవలేశమ్మును చింత చేయకనహో రాజ్యమ్మునున్ గ్రోలగా
  కవిరో! దీది, ప్రియంకవద్ర, వనితల్ కానంగ తోచున్ గదా: 👇
  నవనీతప్రతిమల్ నటించెఁ గడు నానందమ్ముతో నగ్నిలోన్

  రిప్లయితొలగించండి
 2. నవనీత కళా కారిణి
  యవలీలగకీలుబొమ్మ లామెయె చేయున్
  వివిధాకృతులను గలిగిన
  నవనీత ప్రతిమ లగ్ని నడుమ నటించెన్

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చవిలేకుండను బ్రహ్మచర్యమునయో జాడించి పాటింపగా
  పవలున్ రాత్రియు ప్రొద్దుబోవు నెపమున్ బంగాలు రాష్ట్రమ్మునన్
  నవలల్ క్రోలుచు చిత్రముల్ కనగహా! నాదైన హృత్తందునన్
  నవనీతప్రతిమల్ నటించెఁ గడు నానందమ్ముతో నగ్నిలోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. బాంగ్లాభామలు వెన్నముద్దలు భళా భాసింతురే దీప్తితో :)


   జిలేబి

   తొలగించండి


 4. సర్వం విష్ణుమయం !


  అవనీ కృపయా కమనీ
  య వరముగ కసవును మేయ యవకల నా పుం
  సవనంబద్దాని కలిమి
  నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. కం//
  కవయిత్రి మొల్ల కగుపడె
  నవనీతప్రతిమ, లగ్ని నడుమ నటించెన్ !
  స్తవముల్ సలుపగ కృష్ణుడె
  నవశోభలు గూర్చు రామ నారాయణుడై !!

  రిప్లయితొలగించండి


 6. సర్వం బ్రహ్మార్పణమస్తు


  అవనీనభ్యుపపత్తిగా కసవు నంబాయంచు మేయంగ పుం
  సవనంబాయెను చిల్కగాను మిసిమించారంగ బాపండొకం
  డు వషట్కారము చేయ పాల్గొనుచు విడ్డూరమ్ముగా పేర్మితో
  నవనీతప్రతిమల్ నటించెఁ గడు నానందమ్ముతో నగ్నిలోన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. చవిగొన జేసితి బొమ్మల్
  రవి చూపిన తీక్షణమున రగిలిన మంటన్
  ద్రవమగు వేళన గాంచితి
  నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్

  రిప్లయితొలగించండి
 8. అవనిన్ బూర్వము సర్వలోక గతులం దాయెన్ ప్రతిస్పర్థ యా
  యవకాశంబున నందరచ్చటను దా మాశ్చర్యజన్యంబులౌ
  వివిధప్రజ్ఞలు జూపుచుండ నపుడున్ విజ్ఞానియైనట్టి మా
  నవ నీతప్రతిమల్ నటించెఁ గడు నానందమ్ముతో నగ్నిలోన్.

  రిప్లయితొలగించండి
 9. నిన్నటి పూరణ

  భీమపరాక్రమప్రకటవీరవరాగ్రణి మేఘనాథసం
  గ్రామభయంకరుం డసురరాడ్ప్రియశౌర్యతనూభవుండు లం
  కామహిభావిరాజు పితృకామ్యముఁ దీర్చఁ బరాజితారిసు
  త్రాముఁడు గోతులం దునిమె రావణు నెయ్యముఁ గోరి యాజిలో.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 10. జవరాండ్రిద్దరు సోదరీమణులు సంస్కారమ్ములో మిన్నలే
  యవరోధమ్ములు చుట్టుముట్టినను వారన్నింటినిన్ దాటి పా
  టవమున్ జూపుచు నేర్చినారచట కష్టంబైన నృత్యంబునే
  నవనీతప్రతిమల్ నటించెఁ గడు నానందమ్ముతో నగ్నిలోన్

  రిప్లయితొలగించండి
 11. అవకాశము లసలు లేవు అందిన దానిన్ 
  వ్యవధానము చేసుకొంద మనుకొను  చేగన్ 
  జవసత్వము లుడిగె  గ్రీష్మ సంతాపమునన్     
  నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్

  రిప్లయితొలగించండి
 12. కవి పృచ్చకుడై సభలో
  నవనీ తపు ప్రతిమ లగ్ని నడుమ నటించె న్
  ప్రవిమలము గ పూరింపుము
  కవు లందరు మెచ్చ ననుచు కాంక్షగ కోరె న్

  రిప్లయితొలగించండి
 13. ధృవతారలుగా వెలిగిరి
  జవమున రుద్రాంబదేవి ఝాన్సీ రాణుల్
  బవరమున నిల్వ బోలరె
  నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్.

  రిప్లయితొలగించండి
 14. అవలోకించి జగత్ప్రభావముల సత్యాన్వేషియై ముక్తికై
  శివ సాన్నిధ్యము చాల మేలనుచు సాక్షీభూత చేతస్వియై
  వివిధ స్తోత్ర పఠోన్ముఖత్వముగ భావించెన్ భక్తుడేకాగ్రతన్
  నవనీత ప్రతిమల్ నటించె గడు నానందంబుతో నగ్నిలోన్.

  రిప్లయితొలగించండి
 15. నవతలు తప్పవు నటికిల
  అవగడ మెంచక నటనల నలరించ వలెన్
  భువిలో మనుగడ కొరకై
  "నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్"
  (అవగడ - ఆపద ; నవత - దుఃఖము )

  రిప్లయితొలగించండి
 16. నవవిజ్ఞానము "గ్రాఫి
  క్స"వసరముగ వాడ ప్రేక్షకాళితలఁచె ని
  క్కువముగ సినిమాలో స్త్రీల్
  నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్

  రిప్లయితొలగించండి
 17. భువి సౌమ్యు లుదారులు మా
  నవత్వమే ప్రధమమనెడి నరులు, ఖలుల పా
  లవడి కడు బాధనోర్చెన్
  నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్.

  రిప్లయితొలగించండి
 18. నేటి శంకరా భరణము వారి సమస్య

  నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్"

  ఇచ్చిన సమస్య కందములో

  నా పూరణము సీసములొ


  తెలుగు చలన చిత్ర రంగములో దర్శకుడు విఠలచార్య నాడే ఎన్నో జిమ్ముక్కులు చేశాడు. ఆ జిమ్మిక్కులు నేటి తరవము వారికి తెలియవు. పాత సినిమాలు
  పూర్తిగా మరుగు అయిపోయిన సమయములొ నెట్ లో శోధించి నొకడు పాత సినిమాలు తన భార్యకు చూపు సందర్భము  గానమ్ము చేయును ఘనముగా నొకచోట
  దయ్యముల్, నొకచొట పొయ్యిలోన

  తన చేతులను బెట్టి దారుడు వోలె పా
  కమ్ము నొండునుగ దయ్యమ్ము నొకటి,


  ధూమపానము చేసి దొరలుచుండు దగర
  నొకచోట, రయమున్ కనుమిచట పొల


  తీ నవనీత ప్రతిమలగ్ని నడుమ న
  టించె నెగుడుతోడ యించు కంత


  కరుగ కుండ ఘనముగాను, కాంచ గలము

  సతతము విఠలాచార్యుని చలన చిత్ర

  రాజములలోన ననుచుభార్యకు నొకపతి

  దర్శనము నిడె నెట్ట్లో ముదమ్ము నిడుచు
  రిప్లయితొలగించండి
 19. అవిరళపొగమంటలతో
  నవతనుదారంగరించినలుపునెఱుపుతో
  చువచువలాడుచునెగురుచు
  నవనీతప్రతిమలగ్నినడుమనటించెన్

  రిప్లయితొలగించండి
 20. మ:

  అవనిన్ గానగ క్రూర పోకడలు నెక్కాడింప చిన్నారుల
  న్నెవరే మన్నను మైలకూపమున దా నెట్టం బడం వేయగన్
  జవసత్వాదులు బుగ్గిలో గలువ యా జారాంగనల్ దైన్యమున్
  నవనీతప్రతిమల్ నటించె గడు నానందమ్ముతో నగ్నిలోన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 21. శ్రవణాలంకృత మండము
  లవి కాంతుల నీనఁగ నయనానందముగన్
  యువతీమణి సుందరముగ
  నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్


  భువ నౌఘమ్ముల శ్రేష్ఠ మీ వసుధ యంభోజాక్ష సంప్రీతమై
  యవనీ లోక నభో జగత్ప్రవర లోకావాస చిత్తాలిఁ దా
  కి విశుద్ధాత్మ మహా జనోత్సవము భోగిన్ గోమయోత్పత్తులా
  నవనీతప్రతిమల్ నటించెఁ గడు నానందమ్ముతో నగ్నిలోన్

  [నవనీతము = క్రొత్తగాఁ దేఁబడినది; గోమయోత్పత్తి ప్రతిమ = పిడుక]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చాల చక్కనిపూరణార్యా!నమస్సులు!

   ఇటువంటిదే ఇదివరలో నేను పూరించిన సమస్య గుర్తువచ్చినది.
   "యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్ " అనే సమస్యకు నా పూరణ
   తిమిరమువలె నల్లనిదై
   యమరగ కుడ్యమునదట్ట నరచేయగుచున్
   సమముగ నెండిన ధేను మ
   యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్


   తొలగించండి
  2. డా. సీతా దేవి గారు ధన్యవాదములు.
   ధేనుమయమును సంస్మరించి మీ చేసిన పూరణ మద్భుతము!

   తొలగించండి

 22. మత్తేభవిక్రీడితము
  చివురున్ బోలిన సున్నితత్వమున భాసిల్లంగ శ్రీవాసవిన్
  భువనాధీశుడు విష్ణువర్ధనుఁడుఁ దా మోహించ ద్వేషమ్మునన్
  దవులన్ జూడగ నగ్నిగుండమున సద్వంశానుజుల్ వెన్కొనన్
  నవనీతప్రతిమల్ నటించెఁ గడు నానందమ్ముతో నగ్నిలోన్

  రిప్లయితొలగించండి

 23. కందం
  భువి విష్ణువర్ధనుండు మ
  నువెంచఁ నచ్చక జనఁగ వెనుకొనఁగఁ గులజుల్
  భవనాశిని వాసవితో
  నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్

  రిప్లయితొలగించండి
 24. గోపికల విరహ వేదన.

  నవయౌవనవతు లంతయు
  నవమోహను వేణుగాన నాదము వినుచున్
  తవ విరహాగ్నిని నేగుచు
  *నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్*

  రిప్లయితొలగించండి
 25. అవనీపతులకు సతులై
  బవరంబున నోడపతులు భగ్నముగాకే
  శివమైన శీలసంపద
  నవనీతప్రతిమ లగ్నినడుమ నటించెన్

  అవనీనాథుల భార్యలౌవనిత లాయజ్మీరు సంస్థానమున్
  బవరంబందున నోడగాపతులు భగ్నంబైన చిత్తంబునన్
  శివమైనట్టిది శీలమంచు బహుచిత్రంబౌవిధిన్ దూకుచున్,
  నవనీతప్రతిమల్ నటించె గడునానందమ్ముతో,నగ్నిలోన్


  రిప్లయితొలగించండి
 26. పవనా!వింటివెజాగరూకతననెవ్వండైనదానోపునే
  నవనీతప్రతిమల్నటించెగడునానందమ్ముతోనగ్నిలోన్
  నవనీతంబునజేయుబొమ్మలనునెన్నండైనవేజూచితే
  నవనీతంబదివెంటనేకఱగుదానగ్నింబడంగాగదా

  రిప్లయితొలగించండి
 27. వివరింతును విను నా కల
  నవనీతలమంతట విలయముగా దోచెన్
  యవనిక దొలగిన వేదిక
  నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్

  రిప్లయితొలగించండి
 28. లక్ష్మీ నారసింహాయనమః తేది:04-06-2020.మహోదయులకు శుభోదయం. నేటి సమస్యాపూరణాల యత్నం -

  సవినయదార్శనికుం డిం
  దువదన నటనాప్సరసల తోప్రకటించన్
  సువిధిగ వేదికపై యా
  నవనీత ప్రతిమ లగ్ని నడుమ నటించెన్


  ఎవరే ?నీకిచటంబనేల ?తలపేమింగల్గి కూర్చుం టివో!
  వివరంబేమ?న పుత్రికా మణులు వేచంద్ర ప్రభాస్యుల్ స్వ పెం
  డ్లివిధిన్ రూప్యనిమిత్తమున్నటన లేదిక్కన్న!..యామోదతన్
  నవనీత ప్రతిమల్ నటించె గడు నానందమ్ముతో నగ్నిలోన్

  రిప్లయితొలగించండి