19, జూన్ 2020, శుక్రవారం

న్యస్తాక్షరి - 67

కవిమిత్రులారా,
'ర-రి-రు-రె'
పై అక్షరాలను ప్రాసస్థానంలో ప్రయోగిస్తూ
స్వేచ్ఛాఛందంలో
వృద్ధావస్థను వర్ణించండి.

105 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    గారవ మబ్బగా మిగుల గంధము పూయగ పుత్రరత్నమే
    వారిజ నేత్ర కోడలమ వండుచు గారెలు మెండు మేపగా
    పోరుట మానుచున్ వధువు పోకిరి చూపులు చూచుచుండగా
    వారెవ! వృద్ధ జీవితము బంజరు హిల్సున స్వర్గతుల్యమే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. న్యస్తాక్షరి అనగానే 'సెల్ఫ్ డిక్లేర్డ్ హాలీడే' తీసుకుంటారనుకున్నా...
      మీ పూరణ బాగున్నది. వృద్ధాప్యంలో అలాంటి జీవితం కొందరు అదృష్టవంతులకే లభ్యం.

      తొలగించండి
    2. గురువు గారూ, నేను కూడా అలాగే అనుకున్న 🙏😀

      తొలగించండి
    3. స్వగతానికి సరిపోతయే అంశం కనుక సత్వర పూరణ వచ్చింది,న్యస్తాక్షరియైనా:)

      తొలగించండి

    4. ఆటవిడుపు సరదా పూరణ:
      (జిలేబి గారికి అంకితం)

      కరవై పోవగ కంటిచూపు మదినిన్ కల్యాణమే తోచగా
      సరిలే నట్టివి కర్ణముల్ వినగనే శ్రావ్యంపు గానమ్ములన్
      గిరులన్ జేరగ పాదముల్ సయిచకే కీర్తింప బాలాజినిన్
      వరెవా! పింఛను హెచ్చగన్ విరివిగా భాగ్యమ్ము వృద్ధాప్యమే

      తొలగించండి
    5. ప్రశస్తమైన పూరణ.
      అన్నీ తగ్గుతాయి... పెన్షన్ పెరుతుతుంది. నిజమే...

      తొలగించండి
  2. జర యేతెంచ సుతులు తమ
    దరినుంచక కరుణ వీడి తలిదండ్రుల జే
    తురు యాశ్రమముల పాలు;య
    రరె! వీరిక నరులు కారు! రాక్షసలు గదా!


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  3. మేరయె తెలియని యశమును
    కూరిమి యాజ్ఞను తలనిడు కొమరులు యుండన్
    చేరువ బంధువు లుండగ
    వారెటు వృద్ధులు యగుదురు వారిజనాభా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'కొమరులు+ఉండన్, వృద్ధులు+అగుదురు' అన్నపుడు యడాగమం రాదు. "కొమరులు గలుగన్..వారెటుల వృద్ధు లగుదురు..." అనండి.

      తొలగించండి
  4. న్యస్తాక్షరి :- *'ర-రి-రు-రె'*

    పై అక్షరాలను ప్రాసస్థానంలో ప్రయోగిస్తూ
    స్వేచ్ఛాఛందంలో
    వృద్ధావస్థను వర్ణించండి.

    *కందం**

    భారముగనైతిని గదా
    దారిని జూపిన సుతులకు దయరాదింకన్
    దారుణమైనది బ్రతుకిది
    దారెటు తెలియక చివరకు దైవము పిలిచెన్
    ...............✍చక్రి

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. కారము లుప్పులు బందు,కాయ మంతయును ముడతలు,

    జారిన దంతములు,సరసములాడెడు మధుమేహమ్ము,

    జోరును తగ్గించు గుండె,చూడ లేనని పల్కు కనులు,

    కారెడి మలమూత్రములు,వికారముల్ వృద్ధుల సొత్తు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వృద్ధావస్థ యొక్క వాస్తవ చిత్రాన్ని కళ్ళముందుంచారు. బాగుంది మీ పూరణ.

      తొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  8. అరయన్ వృద్ధావస్థన
    పరిచయములు మెండగున్ ప్రభాతపు వేళన్
    మెరుగౌ పూరణలను చే
    యరె! బుద్ధి బలమ్ము వృద్ధియగును జిలేబీ



    జిలేబి
    జాల్రా

    రిప్లయితొలగించండి


  9. అరయన్ వృద్ధావస్థన
    పరిచయములు మెండగున్ ప్రభాతపు వేళన్
    మెరుగౌ జాగింగుల చే
    య రెక్కల బలమ్ము వృద్ధియగును జిలేబీ


    రియాలిటీ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. గురువర్యులకు నమస్సులు, నా నిన్నటి పూరణను పరిశీలించ ప్రార్థన.
    ఆరయ కారు చిచ్చొ కటి ఆస్ట్రెలియా నొలయంగ నంతటన్
    ఆరినవెన్నియో యుసురు లచ్చట మానవుడెంత చేసినన్
    ఆరని మంట లారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్
    తీరుగ వానలున్ హిమము దేకువ జూపగ శాంతి నొందెనే!

    రిప్లయితొలగించండి
  11. అరువది యేండ్లు నెరవడిన
    గరములు గలుపుచు గదలిం చిరిగా
    పరిచయము లన్ని మఱుపడె
    మరెవరికి వలదుర యిట్టి మనుగడ యిలపై

    అవస్థ దురవస్థయే కానక్కర లేదు

    అరువది యేండ్లయి పోయెను
    మరి నీవు విరతి గొనుమని మరిమరి దెలుపన్
    మరచిన ఛందము దోచ న
    మరె పద్యరచనను జేయ , మదియు ప్పొంగన్

    రిప్లయితొలగించండి
  12. భారము గాదు ముసలితన
    మేరికి వ్యాసంగమొకటి యేదోయుండన్
    చేరువ కాదే రుగ్ణత
    కారెనుబోతుదొరఁ గూర్చి కలతను విడువన్.

    రిప్లయితొలగించండి
  13. అరచుచు కరచు సతి సుతులు,

    పెరిగెడి విరుపులు,తరిగిన ప్రేమల్,పోవున్

    పరువు ప్రతిష్ఠలు, సతము ము

    దిరెడి గొడవలు తరచుగ ముదిమి లో కలుగున్

    రిప్లయితొలగించండి
  14. నరకంబేగదనాశ్రితంబుగననానాశోకసంతప్తమై
    సిరిబాంధవ్యముపుత్రపౌత్రులననిశ్శేషంబుభాగింపగన్
    చిరుధాన్యంబులవంటకంబులవిభాసిల్లంగనారోగ్యమై
    సురెచందమ్ముగనాశ్రమంబుననసుశ్లోకంబుమిత్రంబునై

    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  15. మైలవరపు వారి పూరణ

    స్వరమున్ దగ్గును., దగ్గు హెచ్చును., పటుత్వంబున్ నశింపంగ నీ
    దరి రా రోసెదరేది పల్కినను చాదస్తంబుగా దోచెడిన్,
    పురుగున్ జూచిన రీతి జూచెదరు., రేపున్ మాపు దౌర్భాగ్యమౌ
    నరెరే! యెంతటి దైన్యమో! భువిని వృద్ధావస్థ భారంబగున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మరొక పూరణ 🙏

      వరరామాయణపుణ్యభాగవతదివ్యానందమున్ పొందుచున్
      హరిసంకీర్తనలాలపించు క్రియ మోక్షార్థమ్ము వాంఛించుచున్
      గురులై జ్ఞానవయోవిధానముల బాగున్ గోరుచున్., ధాత్రి ని.. ల్వరె వృద్ధుల్ సురరూపులై జగతికిన్ భద్రమ్ములందింపరే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి


    2. అవధానులవధానులవధానులే!


      కత్తికి రెండు వైపులా పదును !



      జిలేబి

      తొలగించండి
    3. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి.

      తొలగించండి
  16. అందరికీ నమస్సులు 🙏🙏
    19.06.2020

    *శంకరాభరణం*
    కవిమిత్రులారా,
    *'ర-రి-రు-రె'*
    పై అక్షరాలను ప్రాసస్థానంలో ప్రయోగిస్తూ
    స్వేచ్ఛాఛందంలో
    వృద్ధావస్థను వర్ణించండి.

    నా పద్య యత్నం ..

    *కం*

    వరమది వృద్దాప్యమ్ముగ
    సరియగు మిత్రులు పదుగురి సాంగత్యము లో
    బరువులు భాధ్యతలు విడి, న
    రెరె నిక యా బ్రతుకు నందు లేదే కష్టం!!

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరికీ నమస్సులు 🙏🙏
      19.06.2020

      *శంకరాభరణం*
      కవిమిత్రులారా,
      *'ర-రి-రు-రె'*
      పై అక్షరాలను ప్రాసస్థానంలో ప్రయోగిస్తూ
      స్వేచ్ఛాఛందంలో
      వృద్ధావస్థను వర్ణించండి.

      నా పద్య యత్నం ..

      *ఉ*

      _*సారము కద్దు కొందరికి*_ _*సంతస మొందును కొందరెప్పుడున్*_
      _*మారిన వంటిలో సదరు మాయని రోగము లెన్నియో గదా*_
      _*దారుణ మంతయున్ వెరసి దాడులు జేసిన దీరులే యనన్*_
      _*చేరెడి వారలే కరవు చెంతకు ప్రేమగ వృద్దులన్ గనన్*_

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి.
      మొదటి పూరణలో "... నరరె యిక.." అనండి.

      తొలగించండి
    3. ధన్యోస్మి గురువు గారు 🙏🙏🙏
      సవరణచేసుకొందును🙏🙏

      తొలగించండి
  17. కరములు వణకన్ దొడగెను
    దరి జేరెను రోగ చయము తనువును డస్సెన్
    కురులవి పలితం బయ్యె ను
    సరె సరె యని మిత్తి తనదు సమయం బనియెన్

    రిప్లయితొలగించండి
  18. దారయు కన్న బిడ్డలను దన్నుఁగ నుండియు ముల్లెలుండినన్
    ఓరిమి యున్న గాని మయి నోపిక పూర్తిగ సన్నగిల్లగా
    జారును కండరమ్ములు విచారమె దోచును జీవనమ్మునన్
    సారెకు తాల్మియన్ సడలు సాగదు స్వామ్యము వార్ధకమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్సులు, మొదటిపాదంలో "కన్న బిడ్డలును" అని సవరించడమైనది.

      తొలగించండి
    2. బాగున్నదండీ!బయటి సౌకర్యములెన్ని యున్ననూ వార్ధక్యములో ఆరోగ్యమే మహాభాగ్యము!తప్పించుకోలేని అవస్థ!

      తొలగించండి
    3. గురువర్యులకునమస్సులు, ధన్యవాదములు.

      తొలగించండి
    4. ధన్యవాదములండి సీతాదేవి గారూ.

      తొలగించండి
  19. భారముమోసిమోసితమవారలకోసముజీవితాంతమున్
    కోరిన కోర్కెలన్నియునుగూరిమి దీర్చిన తల్లిదండ్రులన్
    వేరుగజూసి వారలను వృద్ధులయాశ్రమమందునుంచుటన్
    వారెవ యేమనందుమిటువంటిదురాత్ములజన్మమేలనో!

    రిప్లయితొలగించండి
  20. పేరు పేర్మియు సంపదల్ గొనఁ బిడ్డ నాడు బయల్పడెన్
    యూరినుండి యమేరికాకును యూడిగమ్మున చేరఁ, నో
    రార మాటలనాడి తోడుగ రక్షణై వసియించగన్
    సారెసారెకు జ్ఞప్తికొచ్చు స్వజాత నేడిక రాదులే౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      "...యమేరికాకును నూడిగమ్మున..." అనండి. 'రక్షణ+ఐ' అన్నపుడు సంధి లేదు. 'వచ్చు'ను 'ఒచ్చు' అనరాదు.

      తొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    జరముదిరిన నీ బ్రదుకున
    సరియగు నాదరణతోడ సాగుచు నుంటిన్
    పురువడి గూడిన కొమరుడు
    సరె ననుచు వలసినవన్ని సమకూర్చంగన్.

    రిప్లయితొలగించండి
  22. కారముతిన్నచో కలుగు కంఠము నందున మంట చెచ్చెరన్
    చేరికఫమ్ము వేగముగ చింతలు హెచ్చును దగ్గుతోడుతన్
    మారు గృహమ్మునందుగతి మాన్యత తగ్గును, సొమ్ములేనిచో
    దూరెద రెల్లరున్, సతము దోషమునెంచును స్వార్థబుద్ధితో

    రిప్లయితొలగించండి
  23. మిత్రులందఱకు నమస్సులు!

    తోరమునైన యాక్రమణతో, ముఖమందు వళుల్ నటించినన్;
    బేరిమి శీర్షమందుఁ, దగ వెల్లఁదనం బదె యంకితంబుగాన్;
    దీరుగఁ గీళులన్నియును, దేహమునందునఁ బట్టుఁదప్పినన్;
    జేరెను వార్ధకాన, విలసిల్లెడి జవ్వనులౌచుఁ దృష్ణలే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'వళిభి ర్ముఖమాక్రాంతం... తృష్ణైకా తరుణాయతే" శ్లోకానికి అనువాద రూపమైన మీ పూరణ అద్భుతంగా ఉన్నది.

      తొలగించండి

  24. శంకరాభరణం శుక్రవారం
    న్యస్తాక్షరి౼ 67

    'ర-రి-రు-రె'

    పై అక్షరాలను ప్రాసస్థానంలో ప్రయోగిస్తూ
    స్వేచ్ఛాఛందంలో
    వృద్ధావస్థను వర్ణించండి.

    నా పూరణ. ఉ.మా.
    **** **** **

    నే(ర)ము నేమి జేసితిని నేడిట హింసలు బెట్టి రయ్యయో!

    పే(రి)మితోడ పుత్రులను బెంచుట పాపమె? పొమ్ము పొమ్మనన్

    పౌ(రు)షమున్ జెలంగ మరి పత్నిని గూడుచు గూడు వీడితిన్!

    దా(రె)టు మాకు సాంబశివ! తక్షణమే కొనిపోవుమా దయన్!


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷




    రిప్లయితొలగించండి
  25. కరములు మోడిచి వేడెద
    కరివరదుని భవహరముగ గాపాడుమనిన్
    కరుణను జూపగ ధరణిఁ గ
    లరెవరయ పరమ పురుష పరాత్పర శౌరీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "గాపాడగ నన్" అందామా?

      తొలగించండి
  26. కరముల సడలు పట్టును,కన్ను మసక
    బారి తడబడు నడుగుల పడుతు లేస్తు
    జరుగు బ్రతుకాయె,నరుగదు,కరువు నిదుర
    కోరెడు,ముదుకు బ్రతుకులు ఘోరమె కద!

    రిప్లయితొలగించండి

  27. శంకరాభరణం శుక్రవారం
    న్యస్తాక్షరి౼ 67

    'ర-రి-రు-రె'

    పై అక్షరాలను ప్రాసస్థానంలో ప్రయోగిస్తూ
    స్వేచ్ఛాఛందంలో
    వృద్ధావస్థను వర్ణించండి.

    నా పూరణ.
    **** **** **
    కం//

    జర యేతెంచ సుతులు తమ
    దరినుంచక గీము నుండి తరలింతురుగా
    కరుణా హృది వీడుచు న
    రరె! వీరిక నరులు కారు! రాక్షసలు గదా!

    కం//

    భారమని పుత్రులు దలచ
    జేరిరి వృద్ధాశ్రమాల చెంతకు జరులున్!
    దారుణమిదియే!నేడిల
    మారెను కఠినమ్ము సుతుల మానస మయయో!

    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷




    రిప్లయితొలగించండి
  28. కందం
    కరములు వడఁకఁ దొడంగిన
    నెరిసిన తల రంగు కోర నెగ్గును పూయన్!
    బిరుసెక్కి కాళ్లుఁ గాదన
    నరెరే! పరుగెత్తు మనసు యటునిటు వడిగా!!

    రిప్లయితొలగించండి
  29. వరగుణశాలినాధుఁడునురాజసమంతయుగోలుపోయెగా
    మరిమరిసేవఁజేయగలమానినివీడినశాంతచిత్తయై
    చిరుబురులాడుపుత్రుఁడునుఛీయనిరోయగదీనులైమదిన్
    సరెసరెయంచుతప్పుకోనసేవకులందరునిస్సిరోయనెన్

    రిప్లయితొలగించండి
  30. వరమగు వృద్ధాప్యము శ్రీ
    హరి నెద ధ్యానించి భక్తి ననవరతమ్మున్
    సురుచిర పరమ పదం బం
    దరె సుజనులు శంకయె విబుధా నీ కిందున్


    ధర జీవాలికిఁ గల్గు నిక్కముగ వృద్ధాప్యమ్ము జీవించ న
    త్తరి సారోగ్యము దైవచింతనల శుద్ధంబైన చిత్తమ్మునన్
    గురు వాక్యమ్ములు సంస్మరించి మది సంకోచమ్ములన్ వీడఁ బో
    వరె సన్మార్గులు దివ్య ధామములకున్ భద్రమ్ముగా నిద్ధరన్

    రిప్లయితొలగించండి
  31. అరయగ బుట్టుక మొదలుగ
    విరివిగ ననుభవము లంది విహితా
    హితముల్
    బరుచుక పరుగిడు కాలం
    బరెరే! వృద్ధాప్య మనుచు నావహ మందున్!




    రిప్లయితొలగించండి
  32. మరణము జేరవచ్చె చరమాంకము నందున నిల్చియుంటిగా
    పరిమిత మైన భోజనము పత్తెపు కూడు భుజించుచున్ సదా
    దురుసుగ మాటలాడెడి సుతుండును ప్రేమయె లేని కోడలే
    యెరెమును వేయుచుండనిక హీనపు జీవిత మెందు కంటినే.

    ఎరెము .... వడ్లకమ్మరులకు వేసే భిక్షము

    రిప్లయితొలగించండి
  33. నరములయ్యివికబలహీనమగుమిగుల
    నెరియువెంట్రుకలన్నియునెరపుతగ్గి
    బిరుసుగామారుబిక్కలుబెడచెవులగు
    నరెరెముడతలుబడునుదేహమకటయిక

    రిప్లయితొలగించండి
  34. మరణమ్ము చేర వచ్చెను
    పరిమితమైనట్టి కూడు పత్తెమ్మనుచున్
    దురుసుగ మాటలతోడ వి
    సిరెడన్నము కాశపడెడు జీవితమయ్యెన్.

    రిప్లయితొలగించండి
  35. ఆరగ గోర్కెలన్నియును హాయిగ దేవుని చింతనమ్మునన్
    కూరిమి దీర్ధయాత్రలను కొల్లగజేయుచు దేశమంతటన్
    తీరుగ నామకీర్తనము తేటగ నింద్రియ నిగ్రహంబులన్
    వారెవ!వార్ధకమ్మదియె బంధవిమోచన మార్గమేయగున్

    స్వగతము

    తీరగ బాధ్యతల్ మురిసి తీరికనందగ నర్వదేండ్లకున్
    కూరిమి పద్యమల్లుటను క్రొత్తగనేర్చుచు తోషమందుచున్
    చేరుచు శంకరాభరణ చెల్వగువేదిక చేయబూన నిం
    పారెడు యూరణంబులను వార్ధకమెంతయు సార్ధకంబయెన్

    రిప్లయితొలగించండి
  36. జరయన దుర్భర మకటా!
    తరిగిన జవసత్వములును, తడబడు నడకల్
    చురుకుగ నుండగ లేకను
    సరెలే యనుచును తిరిగెడి శవమే యనగన్!

    రిప్లయితొలగించండి
  37. తన మాటవినదీ Generation అని ఒక వృద్ధుని యావేదన.
    (Generation Gap)

    వరమని తలపరు పిల్లలు
    మరినా యనుభవమునెంచి మంచే జెప్పన్
    గురు రీతిగ భావించరు,
    మరెలా?బాగేపడంగ మార్గము కనరే.

    రిప్లయితొలగించండి

  38. చం.మా॥
    కరమున తత్త్వచింతనము గాంచె డి పుస్తక ముండు నందమే

    మురియుదు రెంతగానొ కని పుత్రుల వృద్ధిని కన్నులారగా

    తిరుగుచు నుందురెప్పుడును తీర్థములంచును భక్తి తోడుతన్

    సరెవరు లేరు వృద్ధులను చక్కగ చూడగ లోకమందునన్

    రిప్లయితొలగించండి
  39. ప్రాసాక్షరములలో ( ర , రి , రు, రె ) వచ్చునట్లు వృధ్ధాప్యపు జీవి మనోగతము
    సీసములో నా పూరణము


    కారపు కూరలు కడుపున వాయువు న్పెంచునని‌ తలచి పెట్ట కుండె
    నూరిన పచ్చడి నోట పెట్ట దలచ బీపి పెరుగు నంచు వేయకుండె
    మారును రయముగ మధుమేహము ననుచు చక్కెర వేయక చిక్కు లిడెను,
    చేరెగా కొవ్వని చెప్పుచు నేయి నూనెలను విదల్చక కలప‌ మనెను

    సారము లేనట్టి జావను నోటన బెట్టగ నాలుక నెట్టి వేసె
    దారిలోన కఫము‌ దాగగ నంగిట, దాడులు చేసెన దగ్గు‌ తెరలు
    నోరున దంతముల్ నూగిస లాడుచు చీకొట్టె నన్నిటిన్ జివ్వుమనుచు
    మూరెడు మంచమున్ ముడుచు కొందుననిన నడయాడ చుండెగా నల్లులచట

    భారము నెప్పుడు ముదుసలి బ్రదుకు నిలన,
    మారిరి సతిసుతులనుచు మదన పడుచు
    దారుణమగు జీవిత మిది తనది యనుచు
    పోరె నొకముదుసలి మిత్తి కోరుకొనుచు



    రిప్లయితొలగించండి

  40. శంకరాభరణం శుక్రవారం
    న్యస్తాక్షరి౼ 67

    'ర-రి-రు-రె'

    పై అక్షరాలను ప్రాసస్థానంలో ప్రయోగిస్తూ
    స్వేచ్ఛాఛందంలో
    వృద్ధావస్థను వర్ణించండి.

    నా పూరణ. చం.మా.
    **** **** **

    వరమని హృత్తునన్ దలచి ప్రాణ సమమ్ముగ సంతు బెంచినన్

    తరిమిరి గీము నుండి తలిదండ్రుల సాకగ భారమెంచుచున్

    కరుణ నెఱుంగరేమి? మమకారము సుంతయు జూపరేమి?దే

    వరె గతి మాకు పుత్రులకు వాసి గుణాలిడి మమ్ము గావగన్


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷




    రిప్లయితొలగించండి
  41. భారమె వృద్ధాప్య మ్మిది
    భూరిగ కలిగెడు రుచులను బుద్దిగ మానన్
    పోరును రుగ్మతలన్నియు
    వారెవ్వా యెవరెరుంగ భాగ్యమ్మేమో!

    రిప్లయితొలగించండి
  42. భారమె జీవితమ్మికను వార్థక మందున నేమిచెప్పుదున్
    జేరితి నింటియందు పని జేసెడు శక్తి కృంగిపోవుచున్
    బారులు తీరి దేహమున వైద్యుల కందని పెక్కురోగముల్
    జేరెను, రోజురోజుకు నజీర్ణపవస్థలె పెర్గుచుండెనే.

    రిప్లయితొలగించండి
  43. కం.
    హర హర శంభోయనుచును
    హరి నామము తోడు గలిపి హారతులిడుచున్
    యిరువురి తోడుగ గొలచిన
    మరె ! వేరెందుకు మనసున మాపగు బ్రతుకున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  44. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః.తేది:19.06.20209 మహోదయులకు శుభోదయం.
    నేడు న్యస్తాక్షరి (ర,రి,రు,రె. లను ప్రాస స్థానం లో వాడాలి) పద్యం -

    ధర,గుర్రు మనుచు నుం డ!దె
    వరిపైన?,తెలియదు నీకు! బడియుండుము! నీ
    బరు వెవరు మోతురు?! బ్రతుకు
    సరె!యని,కసిరే దెవరిని? జగమెల్ల గనన్?

    కరకర లాడగ మూసుకు
    తిరిగి!,గతస్మృతులను గుర్తు దెచ్చు కొనునదె
    వ్వరు?జీవచ్ఛవముగమా
    ర్చిరె నన్న!నని కుములుచు హరీ!యనెదవరున్.

    రారండనియున్నంతలొ
    కోరిన విధినిచ్చివేసి కొంత తమకనన్
    కోరుకొనగ సేవనెపుడు
    వేరెయనక జేసె సుఖము వెల్గెముసలికిన్

    రిప్లయితొలగించండి