12, జూన్ 2020, శుక్రవారం

సమస్య - 3397

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ"
(లేదా...)
"సుతులే నా పతులంచుఁ గృష్ణ వలికెం జొక్కంపు మాటే కదా"

41 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    కుతుకమ్మొందుచు వేచి యుండగనహో కోలాహలమ్మందునన్
    వెతలన్ ద్రోలుచు నాదు డెందముననున్ బీభత్సుడే ప్రీతినిన్
    నుతమౌ రీతిని మీనమున్ దునుమగన్ నోరార; పాండీశుకున్
    సుతులే నా పతులంచుఁ గృష్ణ వలికెం జొక్కంపు మాటే కదా

    రిప్లయితొలగించండి
  2. అతిమానుష వరభవుల
    ప్రతిహతశౌర్యగుణశీలరాశీభూతుల్
    సతులౌ కుంతీమాద్రుల
    సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ!

    రిప్లయితొలగించండి
  3. వెతను బడ గుండెను మనము,

    మతి తప్పిన బలుకు కాదు, మదిలో కొలుతన్

    సతతము భక్తిగ,కుంతీ

    సుతులే పతులనెను కృష్ణ చొక్కపు మాటే

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మతిలే కుండను వీపు మీదనెగుచున్ మర్యాదనున్ వీడుచున్
    వెతలన్ బెట్టుచు కౌగిలించి మెడనున్ వేసార ముద్దాడుచున్...
    గతిలే కుండను దున్నగన్ పొలమునన్ గారాబు రైతన్నలన్
    సుతులే నా పతులంచుఁ గృష్ణ వలికెం జొక్కంపు మాటే కదా

    కృష్ణ = దున్న
    పతి = ఏలిక

    రిప్లయితొలగించండి
  5. పతి సేమంబును గోరుచు
    వ్రతమునొకటి జేయబోవ బాటించు పురో
    హితుడడిగినంత ,పాండుని
    సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ

    రిప్లయితొలగించండి


  6. తతరతి కారణమాయె పొ
    లతి ముందటి జన్మ కర్మలవలన ప్రార
    బ్ధతగానై పాండవకుల
    సుతులే పతులనెను కృష్ణ చొక్కఁపు మాటౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      "పాండునృపుని సుతులే" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  7. గతిగలవాయువుతేజపు
    సుతులనభీమార్జునునులెశూరులువీరుల్,
    జతగాయముడునునశ్విని
    సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  8. పతులుగ కుంతీ సుతులను 
    మతి నిశ్చయ బుధ్ది తలచి మాన్యులు కాగ
    న్వ్యతిరేకత లేక పలికె    
    సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ  

    రిప్లయితొలగించండి


  9. పతి మౌద్గల్యుని కామరూపముల నాప్యాయమ్ము లే మూల? నా
    రతి యున్మాదము తీరనా పశుపతిన్ రాత్రింబవళ్ళున్ మన
    స్సు తిరమ్మై కొని యాడె వాని కృపగా సొంపారు కౌంతేయులీ
    సుతులే, నా పతులంచుఁ గృష్ణ వలికెం జొక్కంపు మాటే కదా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. అతులితబలసంపన్నులు
    సతతముధర్మపథమందుజరియింత్రు దయా
    మతులగుపాండునృపాలుని
    సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ

    రిప్లయితొలగించండి
  11. అతివలు కుంతీ మాద్రులె
    సతులుగ గలిగిన ఘనుండు సద్గుణ శీలుం
    డతిరథుడగుపాండు నృపుని
    సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ

    రిప్లయితొలగించండి
  12. సతతము ధర్మాచరణమె
    క్రతువుగ తలచుచు చరించు ఘనులును, వంశో
    న్నతిగోరు పాండు నృపునకు
    సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ

    రిప్లయితొలగించండి
  13. క్రతురాజ గుండమందున
    ద్యుతితో ప్రభవించె తాను దుష్టుల దునుమన్
    అతివర్ణాశ్రమి, పాండుని
    సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ.

    అతివర్ణాశ్రమి-జ్ఞాని, వర్ణాశ్రమాలకు అతీతి ఈ ద్రౌపది

    రిప్లయితొలగించండి
  14. చతురులు విక్రమ శాలురు
    మతి మంతులు వీర వరులు మాన్యులు మహిలో
    నుతి గన్న పాండు రాజుకు
    సుతులే పతు లనెను కృష్ణ చొక్కపు మాటౌ

    రిప్లయితొలగించండి
  15. అతివా నీ పతులెవరన
    నతులితబలయుతులజేయులవనీపతులున్
    నుతముగ పాండునృపాలుని
    సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ

    రిప్లయితొలగించండి
  16. అతులితతేజముగలుగుచు
    సతతమువినయంబుదోడసద్గుణయుతులై
    సతులగుగుంతీమాద్రుల
    సుతులేపతులనెనుకృష్ణచొక్కపుమాటౌ

    రిప్లయితొలగించండి
  17. మతి శోభిల్లెను కాంచివారలను సమ్మానమ్ముతో కొల్వునన్
    ధృతితోవర్తిలు వారిమోములట నుద్దీపింప శౌర్యమ్ముతో
    సతిఁ బ్రార్థించితి పూర్వజాత వరమున్ సాధింపగా పాండు రా
    ట్సుతులే నా పతులంచుఁ గృష్ణ వలికెం జొక్కంపు మాటే కదా

    రిప్లయితొలగించండి


  18. అతుల పరాక్రము లగు వా
    రతి వినయ పరులను ఖ్యాతి నందిన వారల్
    మతిమంతులునౌకుంతీ
    సుతులే పతులనెను కృష్ణ చొక్కపుమాటే

    రిప్లయితొలగించండి
  19. మతి శూన్యమ్ము శయనమే
    సతతం బెవ్వరికి లేవు చదువులు నిత్య
    మ్ము తిని తిరుగ నకటా నా
    సుతు లే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ

    [పతి = ఏలిక]


    శతసాహస్ర తపః ప్రభావ మహిమన్ శస్త్రాస్త్ర విద్యా విని
    ర్జిత సాపత్న్యులు వీర విక్రములు దుర్భేద్యాక్త్ర ధారుల్ కరో
    ద్యత బాణాసన లబ్ధ కీర్తులును సాద్వ్యంబాలికా పుత్ర రా
    ట్సుతులే నా పతులంచుఁ గృష్ణ వలికెం జొక్కంపు మాటే కదా

    రిప్లయితొలగించండి
  20. గతి ధర్మయుతముగ నొకడు,
    నతిబలుడును,సవ్యసాచి,ననువుపు వాడున్,
    చతురుడు నొకకరు,పాండుని
    సుతులే పతులనెను కృష్ఞ చొక్కపు మాటౌ

    రిప్లయితొలగించండి
  21. ధృతరాష్ట్రుండకు తమ్ముడైన ఘనుడా ధీశాలియౌ మాన్యుడే
    సతి యంబాలిక ముద్దు పుత్రుడతడే సచ్ఛీలుడా వీరుడే
    యతివల్ కుంతియు మాద్రు లిర్వురికి తా నార్యుండెయౌ పాండుకున్
    సుతులే నా పతులంచుఁ గృష్ణ వలికెం జొక్కంపు మాటే కదా"

    రిప్లయితొలగించండి
  22. జూదం లో ఓడిన పిదప ద్రౌపదిని దుర్యోధనుడు సతిగా కోరిన సందర్భము:

    కం:

    అతిగా బల్కుచు సంజ్ఞన
    సతిగా రమ్మని బిలువగ శంకయె లేకన్
    సతమున్ కుంతీ మాద్రుల
    సుతులే పతులనెను కృష్ణ చొక్కపు మాటౌ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  23. 12/06/2020

    శంకరాభరణం సమస్య..🌹

    *"సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ"*

    *కం*

    మతిపోదును మరునిమిషము
    నతిగా యోచించ నీకు ననుమానములా
    అతిరథులౌ నా కుంతీ
    *"సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ"!!*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏🙏

    రిప్లయితొలగించండి
  24. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః.
    మహోదయులకు నమస్సులతో,

    నేటి సమస్యాపూరణాల యత్నం -

    సతతము ధర్మనిరతులై
    గతవైభవవారసత్వ ఘనతను చాటన్
    స్థితులీ భువికి నిపుడు నా
    సుతులే పతులనెను కృష్ణ చొక్కపు మాటౌ.

    (అడవి జంతువుల సమావేశంలో జింక తన కొడుకులే రాజులనే ప్రతిపాదన తో-)

    వెతకంబూనకుడీధరన్, సరిమృగంబే గావలేలం? చు నీ
    స్థితి యెట్లైనను మార్చెదమ్మిపుడె యీతీక్ష్ణంబు వారించ ,స
    న్మతులై మీరు వినంగ బూనుము సుధర్మం!బీ వ నం బింక నా
    సుతులే నా పతులంచు గృష్ణ వలికెం జొక్కంపు మాటే కదా!

    రిప్లయితొలగించండి
  25. అశ్వత్థామను జాలితో వదలివేయమని చెబుతున్న ద్రౌపది
    వితరణ బుద్ధిని విడువుము
    స్తుతమతి ద్రోణుని కొమరుని,శుభముల గొనగా
    గత భర్తృకలకు మిగిలిన
    సుతులే పతులనెను కృష్ణ చొక్కపుమాటే!
    పతి=కాపాడువాడు

    రిప్లయితొలగించండి
  26. కందం
    మితిమీరకు గతితప్పకు
    వెతలొందకు మత్స్యరాజ విను నా మాటల్
    యతిబలులౌ గంధర్వుల
    సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ!
    మత్తేభవిక్రీడితము
    మితిమీరన్ గతిఁ దప్పి మోహమున గామించంగ నన్ జూచితే
    వెతలన్ జిక్కవె కీచకా! వినుమ! నన్వేదించుటల్ మానుమా
    సతినై గుట్టుగ దాసిగన్ మెలగు నే సైరంధ్రి! గంధర్వరా
    ట్సుతులే నా పతులంచుఁ గృష్ణ వలికెం జొక్కంపు మాటే కదా!

    రిప్లయితొలగించండి
  27. క్షితిలోవారలవక్రవిక్రములు సంసేవింతురా మాధవున్
    సతతంబెంతయుధర్మమార్గగమనాసక్తంబుచూపించుచున్
    వితతంబౌఘనకీర్తినొందినగుణోపేతుల్ మహిన్ పాండురాట్
    సుతులే నా పతులంచుఁ గృష్ణ వలికెం జొక్కంపు మాటే కదా

    రిప్లయితొలగించండి