నడిరేయి సరదా పూరణ: కొమరుని పత్నినిన్ విడిచి కొండొక రేయిని పారిపోవుచున్ సమరము చేసి జ్ఞానమును చక్కగ పొందుచు బోధి క్రిందనున్విమలపు బుద్ధుడాదటను ప్రేమను పంచుచు రాగ వీటికిన్ కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
ఇది సరదా పూరణ ఎంతమాత్రం కాదు. ప్రశస్తంగా ఉన్నది.
🙏
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) చెమటల నోర్చి వీధులను చిన్నలు పెద్దలు చూచుచుండగన్ క్రమముగ రెండు పోరులను గాఢపు రీతిని హస్తినమ్మునన్సమరము చేసి చూపగను సంతస మొందుచు; నాకమందునన్ కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. ఇంతకూ హస్తినలో పోరుచేసిన ఆ మహానుభావు డెవరో?
🙏😊
శివుని విల్లును మోపెట్టి చిదుమి నట్టిధీరుడా యయోధ్యాధిపతి దశ రథునికొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ ,ననుగు పుత్రి సీతను బెండ్లియాడ మనుచు
చక్కని పూరణ.
కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ బ్రహ్మచారియై తా నిలబడుచు నచటపழని మలపైన వెలయగ బాలచర్యుడయ్య జ్ఞానఫలంపు గొడవల వలన!జిలేబి
మీ పూరణ బాగున్నది.నాకు బాగా నచ్చిన క్షేత్రాలలో పళని ఒకటి. ఇప్పుటకి రెండుసార్లు దర్శించుకున్నాను.
కందా చంప్స్ విను పళని కథను ఝషలోచన! కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్గొనియాడఁ గూర్మితోన్ మురుగుని జ్ఞానఫలమ్ము గా సుగుణముల వనిగాజిలేబి
మీ పూరణ బాగున్నది.
అమలినభక్తిభావమున నందరు జేరి శివాలయంబునన్ గ్రమముగ నిల్చి గొల్చు నెడ కాంత యుమన్ తనయుండు శంకరున్దమనిట గావుడంచనిన తాను మహోదరు నేకదంతుడౌకొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్"
గురువర్యులకు నమస్సులు, నిన్నటి నా పూరణను పరిశీలింప ప్రార్థన.పశ్య మొసంగదే మధురవాణి సమాజ శుభమ్ము గోరు నా దృశ్యము జూచు వారలకు! ధీమతి యొక్క వకీలు తోడుతన్ పాశ్యను జిక్కినట్టి పసి భామల బాగొనరించె గాదె, యీ వేశ్యల జీవితమ్మతి పవిత్రము! సాధ్వులు వారి సాటియే! (పశ్య = విస్మయము; పాశ్య = వల)
గురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు.
అమరెను కొండ పైన మురుగాయని కొల్వగ జ్ఞానపండితుండమరెను బాలచర్యునిగ డాంకృతి మీరగ చేత బట్టి దండమును! ఫలమ్మతండె ఘనుడాతడె "వేలవ"నాతడేసుమాకొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్!జిలేబి
తనదు మనమును పసిగట్టి మనసు బెట్టితాను కోరిన స్త్రీ తోడ తనదు సుతడుతనకు మనువు చేయంగ శంతనుడు బీష్మునిరతిని గని మనసులోన సరస గతినికొమరునకు మ్రొక్కె జనకుండు కూర్మి తోడ
పుణ్య భాగ్యవశంబున సన్యసించిదక్షిణామ్నాయ పీఠపు తదుపరి యధికారియౌ "విధుశేఖర భారతి" మునుకొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ(మును = సన్యసించక ముందటి)
కొమరునకుమంచి చదువులకొఱకుతండ్రివిద్యలకునొజ్జయనియెంచి విఘ్నపతినిభక్తిమదినింపి శిరమొంచి పరమశివునికొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
తమతమ సేవలందునను దండ్రియె కొల్వును జేయుచున్న గ్రామమున సుతుండు సైతమట మానిత జీవిక సల్పుచుండె నాకొమరుని గాంచి మొక్కె జనకుండు జనుల్ కొనియాడ కూర్మి తోన్ప్రమదమె యౌగదా!యతని వత్సుని యున్నతమౌ స్థితింగనన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మిత్రులందఱకు నమస్సులు!విమలయశోవిభూషితుఁడు వీక్షిత లక్ష్మణ యుక్త సద్గురుండమలకపర్దిచాపభిదుఁ డంచిత సద్గుణగణ్యశోభితుండమితవినీలదేహుఁడగు నా రఘురామునిఁ గ్రొత్త పెండిలింగొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్!
తే.గీ//తరలి వచ్చిరి వేల్పులు, దశరథదొరకొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ !సీత పరిణయ సమయంబు చిత్తమలరురామచంద్రుని పదములె క్షేమమనుచు !!
శివుని విల్లును విరచిన జేత కిత్తు నవనిజనన పలుకరైరి యవని విభులు గురుని యాజ్ఞను రాముడు విరువ రాచ కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
యాగ రక్షణఁ జేసిన యనఘు డైనపంక్తిరథుని సుతునితోడ పలుకువాలుకదలి తా వచ్చినట్టి యా గాధి రాజుకొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
సుమనసవేదిగూర్చిఘనసోమునిసూనుడువిఘ్నరాజునున్గొమరితఁబెండ్లివేడుకనఁగోర్కెనుఁగోరగనెంచుచుండగన్సుమశరబంచబాణహరసోమునిపుత్రుడుషణ్ముఖుండునౌకొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్కొరుప్రోలు రాధాకృష్ణారావు
విక్రమము జూపి రాముడు విల్లు ద్రుంచ సీత కళ్యాణ మది సాగె చిత్త మలర విఘ్నముల నెల్ల నెడ బాపు వేల్పు శివుని కొమరునకు మ్రొక్కె జనకుండు కూర్మి తోడ
అన్నయ్యకు అంకితం!క్రమమును దప్పకుండ ప్రతిరాత్రిని శంకరు బ్లాగులోననున్ చెమటల గ్రక్కుచున్ మిగులచెన్నగు పద్యములల్లుచున్ సదా యమితపు హాస్యధోరణిని హద్దులులేక చెలంగ శాస్త్రియే కొమరునిగాంచి మ్రొక్కెజనకుండు జనుల్ గొనియాడ గూర్మితో!
అమితపు కామవాంఛలను హద్దులుమీరిన వర్తనంబునన్ సమకొన శాపమే తనదు సత్వము యవ్వనమంతరింపగాసముచితరీతి తండ్రికిని జవ్వనమున్ దగధారవోయగా కొమరునిగాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడ గూర్మితో!
తనదు వార్ధక్యమును గొని తనదు సుతుడుపురు తనదు యవ్వనమును వి తరణ మిడగమది పరవశ మొంద యయాతి మనసు లోన,కొమరునకు మ్రొక్కె జనకుండు కూర్మి తోడ
మఱొక పూరణము:తమను మునీంద్రుఁ డా యడవి దాపునకుం గొనిపోవఁ, దాటకన్విమల శరాళిఁ గూల్చి, తనివిం గన మౌని, శిలం బడంతిగానమర నొనర్చి, శంకరు శరాసన మోర్చిన యా యయోధ్య రా కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్!
వినియు, సీతా స్వయంవర విషయమెఱిగిమునితొ జనుదెంచ గని మోదమున దశరథకొమరునకు మ్రొక్కె జనకుండు కూర్మితోడనయ జయమిడు కాలము కారణార్థముగను...!
విమలపు జ్ఞాన మాయుధము వేదపు వాదమునందు వందితోనమలిన రీతిఁ వాడి తన నాన్నకు బంధ విముక్తి గల్గజేయు మహిత మౌని బాలకుని, యుత్తమ దేశికు డేకపాదునిన్కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్(అష్టావక్రుని కథ)
సుమములు నారికేళములు సోమము లోహిత పుష్పకమ్ముతోప్రమదయు పుత్రి తో పళణి వాసుని క్షేత్రము జేరి యచ్చటన్ దమనసుతుండు శక్తిధరుఁ దారక హారిని కేకి వాహనున్ కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్.
ధనువుఫెళ్ళుమనవిఱుచుదశరధుప్రియకొమరునకుమ్రొక్కెజనకుండుగూర్మితోడయంతపూలమాలనువేయసీతసాధ్విపూలవర్షముగురిపించిరెల్లసురలు
మిథిల జేరి గురువు యాన మీర దానుశివుని విల్లు విరిచి బట్టె సీత చేయిధన్యమాయె జన్మమని యంత దశరథునికొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
శ్రీ గురుభ్యో నమః 8.6.20శ్రవణ పుత్రుడె వెడలెను సద్దు లేక కరియని తలచి బాణము కాచి వేయ నరచి పడిపోయె బాలుడు నంత లోనె జలము నిమ్మని చెప్పుచు జాలిగాను *కొమరునకు మ్రొక్కె జన కుడు కూర్మి తోడ*
సవరించితిని గురూజీతే.గీ//తరలి వచ్చిరి వేల్పులు, దశరథవిభుకొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ !సీత పరిణయ సమయంబు చిత్తమలరురామచంద్రుని పదములె క్షేమమనుచు !!
సుమములుబత్రముల్నికనుసోయగమబ్బెడుగంధమాదులన్ నమలినభక్తిగన్పఱచియాశివపూజనుజేయుచున్నయాకొమరునిగాంచిమ్రొక్కెజనకుండుజనుల్గొనియాడగూర్మితోన్ గొమరునినున్నతిన్గదిలగోరుదురయ్యలుదల్లులెప్పుడున్
అమల మనస్కుడై వఱలు యారఘురాముడు వెంటనంటి సంయమి హవనమ్ముఁ గాచి కడు హర్షముతోడుత చెంగలించి గోత్రమునను,మౌని పన్పునను త్ర్యక్షుని విల్లును త్రెంచ చెచ్చెరన్విమలమతిన్ మహీజ లలి వేయగ మాల్యము శౌరిఁ పెండ్లియౌకొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
బ్రహ్మ రుద్ర శక్రాదులు బ్రహ్మఋషులు నింక దేవర్షి గణముతో నెలమి రాఁగ మిథిల నాఁ బురి నేలెడు మేటి ఱేఁడు కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ [కొమరుఁడు = కుమారస్వామి]కమలజు కన్నతండ్రి లతికా సుతనూ కమలా ధవుండునుం గమల ధనూ రమాసుతుని కన్న మహాత్ముఁడు నందపుత్రుఁ డా కమలదళాక్షఁడే వరుణ కాంతు జగమ్మున కేఁగి నందుఁ దేఁ గొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
సమరమునందుజూపెతనశౌర్యముసింహకిశోరమై యరిందమునిగ ఫల్గుణాత్మజుఁడు తల్లడమొందగజేసి వైరులన్ సమయగనాజియందు తన స్వాంతమునందు జ్వలించునార్తితోకొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
చం: దుముకుచు లాడ బెండ్లమును తొందర జేర్చగ వైద్యశాలకున్సమయము కూడి దా వలని శక్యము పుత్రుని బొంద గోరుటైవిమల మనస్కుడై మదిని వేడగ నా పరమాత్ము , తత్కృపన్ కొమరుని గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడ గూర్మితోన్వై. చంద్రశేఖర్
క్రమముగ నాది శంకరుల గౌరవ పీఠపు టుత్తరాధికారమునను శృంగ పర్వతపు ప్రస్తుత పూజ్య యతీంద్రవర్యులేప్రమదము మీరగా సుతుని వారసుగా బ్రకటింప స్వామియౌకొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్.
శ్రీగురుడు,దత్త రూపుండు, సిధ్ధయోగి! అంబ కిచ్చిన వరముకై యవని బుట్టె! దైవమును గన్న జన్మము ధన్యుమనుచు! కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ"
తేటగీతిహరు విలుఁద్రుంచి జానకి మురిసి పోవపెళ్లి వేదిపై వరుడన్న విష్ణువనుచుకాళ్లు కడుగి మురిపెమునఁ గని దశరథకొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
అమిత పరాక్రమం బెనయ నాసుర శక్తుల గూల్చి మౌని యాగమునకు రక్ష గూర్చి మునికాంతకు శాపము నొల్చి శైవ చాపము నవలీల డుల్చి ఘన పావని సీతను నేలినట్టి రాకొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్.
చంపకమాలసుముఖత గాధిసూనునకు స్తోమము గాచిన రామచంద్రుడున్సుమశరు వైరి వింటిఁ గొని స్రుక్కగ దిక్కులు ద్రుంచి వైచి శ్రీరమయన నొప్పు సీతఁ గొన రంజిలి విష్ణువు రూపమంచు రాకొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
08/06/2020అందరికీ నమస్సులు 🙏*నా పూరణ*(కరోనా warriors)*తే గీ* 🌹సమర యోధుడి రూపున సంతసముగ వచ్చె రోగుల బాధను వదుల గొడుచు కష్టములిచట తాను సుఖములనుగొను *"కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ"**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*🙏
దశరథుని సుతుగొం పోయి దండి విద్యనెల్లయు ను నేర్పి నట్టి మునీంద్రుడైనకౌశికు డన బరంగెడు గాధి రాజు కొమరునకు మ్రొక్కెజనకుండు
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
కొమరుని పత్నినిన్ విడిచి కొండొక రేయిని పారిపోవుచున్
సమరము చేసి జ్ఞానమును చక్కగ పొందుచు బోధి క్రిందనున్
విమలపు బుద్ధుడాదటను ప్రేమను పంచుచు రాగ వీటికిన్
కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
ఇది సరదా పూరణ ఎంతమాత్రం కాదు. ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
చెమటల నోర్చి వీధులను చిన్నలు పెద్దలు చూచుచుండగన్
క్రమముగ రెండు పోరులను గాఢపు రీతిని హస్తినమ్మునన్
సమరము చేసి చూపగను సంతస మొందుచు; నాకమందునన్
కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది.
తొలగించండిఇంతకూ హస్తినలో పోరుచేసిన ఆ మహానుభావు డెవరో?
🙏😊
తొలగించండిశివుని విల్లును మోపెట్టి చిదుమి నట్టి
రిప్లయితొలగించండిధీరుడా యయోధ్యాధిపతి దశ రథుని
కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ ,
ననుగు పుత్రి సీతను బెండ్లియాడ మనుచు
చక్కని పూరణ.
తొలగించండి
రిప్లయితొలగించండికొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
బ్రహ్మచారియై తా నిలబడుచు నచట
పழని మలపైన వెలయగ బాలచర్యు
డయ్య జ్ఞానఫలంపు గొడవల వలన!
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండినాకు బాగా నచ్చిన క్షేత్రాలలో పళని ఒకటి. ఇప్పుటకి రెండుసార్లు దర్శించుకున్నాను.
రిప్లయితొలగించండికందా చంప్స్
విను పళని కథను ఝషలో
చన! కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్
గొనియాడఁ గూర్మితోన్ మురు
గుని జ్ఞానఫలమ్ము గా సుగుణముల వనిగా
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఅమలినభక్తిభావమున నందరు జేరి శివాలయంబునన్
రిప్లయితొలగించండిగ్రమముగ నిల్చి గొల్చు నెడ కాంత యుమన్ తనయుండు శంకరున్
దమనిట గావుడంచనిన తాను మహోదరు నేకదంతుడౌ
కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్"
మీ పూరణ బాగున్నది.
తొలగించండిగురువర్యులకు నమస్సులు, నిన్నటి నా పూరణను పరిశీలింప ప్రార్థన.
రిప్లయితొలగించండిపశ్య మొసంగదే మధురవాణి సమాజ శుభమ్ము గోరు నా
దృశ్యము జూచు వారలకు! ధీమతి యొక్క వకీలు తోడుతన్
పాశ్యను జిక్కినట్టి పసి భామల బాగొనరించె గాదె, యీ
వేశ్యల జీవితమ్మతి పవిత్రము! సాధ్వులు వారి సాటియే!
(పశ్య = విస్మయము; పాశ్య = వల)
చక్కని పూరణ.
తొలగించండిగురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅమరెను కొండ పైన మురుగాయని కొల్వగ జ్ఞానపండితుం
డమరెను బాలచర్యునిగ డాంకృతి మీరగ చేత బట్టి దం
డమును! ఫలమ్మతండె ఘనుడాతడె "వేలవ"నాతడేసుమా
కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండితనదు మనమును పసిగట్టి
రిప్లయితొలగించండిమనసు బెట్టి
తాను కోరిన స్త్రీ తోడ తనదు సుతడు
తనకు మనువు చేయంగ శంతనుడు బీష్ము
నిరతిని గని మనసులోన సరస గతిని
కొమరునకు మ్రొక్కె జనకుండు కూర్మి తోడ
మీ పూరణ బాగున్నది.
తొలగించండిపుణ్య భాగ్యవశంబున సన్యసించి
రిప్లయితొలగించండిదక్షిణామ్నాయ పీఠపు తదుపరి యధి
కారియౌ "విధుశేఖర భారతి" మును
కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
(మును = సన్యసించక ముందటి)
మీ పూరణ బాగున్నది.
తొలగించండికొమరునకుమంచి చదువులకొఱకుతండ్రి
రిప్లయితొలగించండివిద్యలకునొజ్జయనియెంచి విఘ్నపతిని
భక్తిమదినింపి శిరమొంచి పరమశివుని
కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
తమతమ సేవలందునను దండ్రియె కొల్వును జేయుచున్న గ్రా
రిప్లయితొలగించండిమమున సుతుండు సైతమట మానిత జీవిక సల్పుచుండె నా
కొమరుని గాంచి మొక్కె జనకుండు జనుల్ కొనియాడ కూర్మి తోన్
ప్రమదమె యౌగదా!యతని వత్సుని యున్నతమౌ స్థితింగనన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండివిమలయశోవిభూషితుఁడు వీక్షిత లక్ష్మణ యుక్త సద్గురుం
డమలకపర్దిచాపభిదుఁ డంచిత సద్గుణగణ్యశోభితుం
డమితవినీలదేహుఁడగు నా రఘురామునిఁ గ్రొత్త పెండిలిం
గొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్!
తే.గీ//
రిప్లయితొలగించండితరలి వచ్చిరి వేల్పులు, దశరథదొర
కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ !
సీత పరిణయ సమయంబు చిత్తమలరు
రామచంద్రుని పదములె క్షేమమనుచు !!
శివుని విల్లును విరచిన జేత కిత్తు
రిప్లయితొలగించండినవనిజనన పలుకరైరి యవని విభులు
గురుని యాజ్ఞను రాముడు విరువ రాచ
కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
యాగ రక్షణఁ జేసిన యనఘు డైన
రిప్లయితొలగించండిపంక్తిరథుని సుతునితోడ పలుకువాలు
కదలి తా వచ్చినట్టి యా గాధి రాజు
కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
సుమనసవేదిగూర్చిఘనసోమునిసూనుడువిఘ్నరాజును
రిప్లయితొలగించండిన్గొమరితఁబెండ్లివేడుకనఁగోర్కెనుఁగోరగనెంచుచుండగ
న్సుమశరబంచబాణహరసోమునిపుత్రుడుషణ్ముఖుండునౌ
కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
విక్రమము జూపి రాముడు విల్లు ద్రుంచ
రిప్లయితొలగించండిసీత కళ్యాణ మది సాగె చిత్త మలర
విఘ్నముల నెల్ల నెడ బాపు వేల్పు శివుని
కొమరునకు మ్రొక్కె జనకుండు కూర్మి తోడ
అన్నయ్యకు అంకితం!
రిప్లయితొలగించండిక్రమమును దప్పకుండ ప్రతిరాత్రిని శంకరు బ్లాగులోననున్
చెమటల గ్రక్కుచున్ మిగులచెన్నగు పద్యములల్లుచున్ సదా
యమితపు హాస్యధోరణిని హద్దులులేక చెలంగ శాస్త్రియే
కొమరునిగాంచి మ్రొక్కెజనకుండు జనుల్ గొనియాడ గూర్మితో!
అమితపు కామవాంఛలను హద్దులుమీరిన వర్తనంబునన్
తొలగించండిసమకొన శాపమే తనదు సత్వము యవ్వనమంతరింపగా
సముచితరీతి తండ్రికిని జవ్వనమున్ దగధారవోయగా
కొమరునిగాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడ గూర్మితో!
తనదు వార్ధక్యమును గొని తనదు సుతుడు
రిప్లయితొలగించండిపురు తనదు యవ్వనమును
వి తరణ మిడగ
మది పరవశ మొంద యయాతి మనసు లోన,
కొమరునకు మ్రొక్కె జనకుండు కూర్మి తోడ
మఱొక పూరణము:
రిప్లయితొలగించండితమను మునీంద్రుఁ డా యడవి దాపునకుం గొనిపోవఁ, దాటకన్
విమల శరాళిఁ గూల్చి, తనివిం గన మౌని, శిలం బడంతిగా
నమర నొనర్చి, శంకరు శరాసన మోర్చిన యా యయోధ్య రా
కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్!
వినియు, సీతా స్వయంవర విషయమెఱిగి
రిప్లయితొలగించండిమునితొ జనుదెంచ గని మోదమున దశరథ
కొమరునకు మ్రొక్కె జనకుండు కూర్మితోడ
నయ జయమిడు కాలము కారణార్థముగను...!
విమలపు జ్ఞాన మాయుధము వేదపు వాదమునందు వందితో
రిప్లయితొలగించండినమలిన రీతిఁ వాడి తన నాన్నకు బంధ విముక్తి గల్గజే
యు మహిత మౌని బాలకుని, యుత్తమ దేశికు డేకపాదునిన్
కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
(అష్టావక్రుని కథ)
సుమములు నారికేళములు సోమము లోహిత పుష్పకమ్ముతో
రిప్లయితొలగించండిప్రమదయు పుత్రి తో పళణి వాసుని క్షేత్రము జేరి యచ్చటన్
దమనసుతుండు శక్తిధరుఁ దారక హారిని కేకి వాహనున్
కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్.
ధనువుఫెళ్ళుమనవిఱుచుదశరధుప్రియ
రిప్లయితొలగించండికొమరునకుమ్రొక్కెజనకుండుగూర్మితోడ
యంతపూలమాలనువేయసీతసాధ్వి
పూలవర్షముగురిపించిరెల్లసురలు
మిథిల జేరి గురువు యాన మీర దాను
రిప్లయితొలగించండిశివుని విల్లు విరిచి బట్టె సీత చేయి
ధన్యమాయె జన్మమని యంత దశరథుని
కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
శ్రీ గురుభ్యో నమః
రిప్లయితొలగించండి8.6.20
శ్రవణ పుత్రుడె వెడలెను సద్దు లేక
కరియని తలచి బాణము కాచి వేయ
నరచి పడిపోయె బాలుడు నంత లోనె
జలము నిమ్మని చెప్పుచు జాలిగాను
*కొమరునకు మ్రొక్కె జన కుడు కూర్మి తోడ*
సవరించితిని గురూజీ
రిప్లయితొలగించండితే.గీ//
తరలి వచ్చిరి వేల్పులు, దశరథవిభు
కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ !
సీత పరిణయ సమయంబు చిత్తమలరు
రామచంద్రుని పదములె క్షేమమనుచు !!
సుమములుబత్రముల్నికనుసోయగమబ్బెడుగంధమాదులన్
రిప్లయితొలగించండినమలినభక్తిగన్పఱచియాశివపూజనుజేయుచున్నయా
కొమరునిగాంచిమ్రొక్కెజనకుండుజనుల్గొనియాడగూర్మితోన్
గొమరునినున్నతిన్గదిలగోరుదురయ్యలుదల్లులెప్పుడున్
అమల మనస్కుడై వఱలు యారఘురాముడు వెంటనంటి సం
రిప్లయితొలగించండియమి హవనమ్ముఁ గాచి కడు హర్షముతోడుత చెంగలించి గో
త్రమునను,మౌని పన్పునను త్ర్యక్షుని విల్లును త్రెంచ చెచ్చెరన్
విమలమతిన్ మహీజ లలి వేయగ మాల్యము శౌరిఁ పెండ్లియౌ
కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
బ్రహ్మ రుద్ర శక్రాదులు బ్రహ్మఋషులు
రిప్లయితొలగించండినింక దేవర్షి గణముతో నెలమి రాఁగ
మిథిల నాఁ బురి నేలెడు మేటి ఱేఁడు
కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
[కొమరుఁడు = కుమారస్వామి]
కమలజు కన్నతండ్రి లతికా సుతనూ కమలా ధవుండునుం
గమల ధనూ రమాసుతుని కన్న మహాత్ముఁడు నందపుత్రుఁ డా
కమలదళాక్షఁడే వరుణ కాంతు జగమ్మున కేఁగి నందుఁ దేఁ
గొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమరమునందుజూపెతనశౌర్యముసింహకిశోరమై యరిం
తొలగించండిదమునిగ ఫల్గుణాత్మజుఁడు తల్లడమొందగజేసి వైరులన్
సమయగనాజియందు తన స్వాంతమునందు జ్వలించునార్తితో
కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
చం:
రిప్లయితొలగించండిదుముకుచు లాడ బెండ్లమును తొందర జేర్చగ వైద్యశాలకున్
సమయము కూడి దా వలని శక్యము పుత్రుని బొంద గోరుటై
విమల మనస్కుడై మదిని వేడగ నా పరమాత్ము , తత్కృపన్
కొమరుని గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడ గూర్మితోన్
వై. చంద్రశేఖర్
క్రమముగ నాది శంకరుల గౌరవ పీఠపు టుత్తరాధికా
రిప్లయితొలగించండిరమునను శృంగ పర్వతపు ప్రస్తుత పూజ్య యతీంద్రవర్యులే
ప్రమదము మీరగా సుతుని వారసుగా బ్రకటింప స్వామియౌ
కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్.
శ్రీగురుడు,దత్త రూపుండు, సిధ్ధయోగి!
రిప్లయితొలగించండిఅంబ కిచ్చిన వరముకై యవని బుట్టె!
దైవమును గన్న జన్మము ధన్యుమనుచు!
కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ"
తేటగీతి
రిప్లయితొలగించండిహరు విలుఁద్రుంచి జానకి మురిసి పోవ
పెళ్లి వేదిపై వరుడన్న విష్ణువనుచు
కాళ్లు కడుగి మురిపెమునఁ గని దశరథ
కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమిత పరాక్రమం బెనయ నాసుర శక్తుల గూల్చి మౌని యా
రిప్లయితొలగించండిగమునకు రక్ష గూర్చి మునికాంతకు శాపము నొల్చి శైవ చా
పము నవలీల డుల్చి ఘన పావని సీతను నేలినట్టి రా
కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్.
చంపకమాల
రిప్లయితొలగించండిసుముఖత గాధిసూనునకు స్తోమము గాచిన రామచంద్రుడున్
సుమశరు వైరి వింటిఁ గొని స్రుక్కగ దిక్కులు ద్రుంచి వైచి శ్రీ
రమయన నొప్పు సీతఁ గొన రంజిలి విష్ణువు రూపమంచు రా
కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్
08/06/2020
రిప్లయితొలగించండిఅందరికీ నమస్సులు 🙏
*నా పూరణ*
(కరోనా warriors)
*తే గీ* 🌹
సమర యోధుడి రూపున సంతసముగ
వచ్చె రోగుల బాధను వదుల గొడుచు
కష్టములిచట తాను సుఖములనుగొను
*"కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏
దశరథుని సుతుగొం పోయి దండి విద్య
రిప్లయితొలగించండినెల్లయు ను నేర్పి నట్టి మునీంద్రుడైన
కౌశికు డన బరంగెడు గాధి రాజు
కొమరునకు మ్రొక్కెజనకుండు