ప్రభాకర శాస్త్రి గారూ, జిలేబి గారూ, జులై 17 నా 70వ జన్మదినం సందర్భంగా మిత్రులు 'సప్తతి సంచిన' ముద్రిస్తున్న విషయం మీకు తెలిసినదే. అందులో మీ ఇద్దరి పద్యాలు (నాలుగుకు మించకుండా) ఉండాలని నా ప్రగాఢ వాంఛ. ఆలస్యం చేయకుండా వ్రాసి పంపండి. బ్లాగులో ప్రకటించండి.
రిప్లయితొలగించునడిరేయి సరదా పూరణ:
మాయల మారి శీర్షకము మన్నన కోసము రోజు రోజునన్
సోయగ మొంద దాల్చగను స్రుక్కుచు సోలుచు గోకుడొల్లుచున్
రాయలు గారి శీర్షమున రచ్చను జేయుచు నెర్ర స్వేదపుం
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్
తొలగించు* నెఱ్ఱ
మీ సరదా పూరణ బాగున్నది.
తొలగించు🙏
తొలగించుమాయల మాటలు జెప్పిన
రిప్లయితొలగించువేయగ నొక యోటు మనము బెంచుకు నాసల్
చీయనినను దెలియు మనకు
*"కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్"*
గురువు గారు ...ఇది నేనే ..
తొలగించుకళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి 🙏🙏
వేరే మొబైల్ నుండి చేసినాను 😀
మీ పూరణ బాగున్నది.
తొలగించు"పెంచుచు/పెంచియు నాసల్" అనండి.
ధన్యవాదములు ఆర్యా🙏
తొలగించు*సవరణతో*
మాయల మాటలు జెప్పిన
వేయగ నొక యోటు మనము *పెంచియు* నాసల్
చీయనినను దెలియు మనకు
*"కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్"*
🙏
చేయక గోల మౌనముగ జెప్పిన దంతయు కాగితమ్మునన్
రిప్లయితొలగించువ్రాయుడటంచు జెప్ప నిక వ్రాసిరి జూడగ బాలలందరున్
కాయల పేరు లిట్లు దలకాయను చొక్కడు గుండెకాయనిన్
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్
మీ పూరణ బాగున్నది.
తొలగించు"గుండెకాయలున్" అనండి.
రిప్లయితొలగించుఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
కోయిల లెన్నొ కూడుచును కూయుచు దాగగ చూతమందునన్
పోయగ నీరమున్ మగడు, పొంకము మీరగ రాణిగారయో
కోయగ నూరగాయలిడ గుంపులు గుంపులు చెట్టుమీదనున్
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్
ఊరగాయ కోసం ముందే కోస్తే ఇక పండ్లెలా అవుతాయి? చక్కని పూరణ.
తొలగించు🙏
తొలగించుజాయ పనుపంగ వెడలితి
రిప్లయితొలగించుజాయ మగని తీక్షణమున సంప్రా ప్తించన్,
కాయము సాంతముగ జెమట
కాయలు గలవెన్నొ , పండ్లు గావెన్నటికిన్
మీ పూరణ బాగున్నది.
తొలగించు'జాయ' పునరుక్తమయింది.
రిప్లయితొలగించుమాయా మహేంద్ర జాలము!
ఛాయా లక్ష్మీ షకీల సరసి జిలేబీ
సోయగములొల్కెడు టపా
కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్
జిలేబి
టపాకాయలతో మీ పూరణ బాగున్నది.
తొలగించు
రిప్లయితొలగించుతీయని విత్తును నాటగ
కాయలు కాచెను త్వరితముగానిల తరుకున్
నాయన గనుమనపలికెను
కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్.
వేయగ పొలమున కూరల
కాయల విత్తులు వరుసగ కాచెను వేగన్
కాయలు బీరయు మామిడి
కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించు'త్వరితముగా తరువునకున్' అనండి.
రిప్లయితొలగించుకందోత్పల
భళి బొమ్మలు రంగుల నా
వల కాయలు పెక్కులున్న వవి గావు ఫలం
బులు చూడ నెన్నఁడున్ కా
వలెనని కోరెను బుడతడు ప్రసువు వలదనెన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించు
రిప్లయితొలగించువేయికి పైన కైపులన వేగము గానదె వెళ్ళి చూచినా
నోయమ! పోయె నామతియు నొవ్వె! బజారున పేర్లు బాపురే!
మాయ! జిలేబి! ఇందుముఖి! మాధురి! లక్ష్మి! భళా!భళా టపా
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించువాయికి తీయనైనదియు వారి యె దైవము మెచ్చుచుండుగా
రిప్లయితొలగించుకాయగ యెండ త్రాగినను కాయము చల్లగ మారు వెంటనే
కోయగ తోటలో నొకడు కొబ్బరి చెట్టుకు పైకి చూడ టెం
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్..
మీ పూరణ బాగున్నది.
తొలగించు"కాయగ నెండ..." అనండి.
ప్రేయసి వంకాయ ననగ
రిప్లయితొలగించుజేయగ గుత్తిగనువండజిత్తముజిత్తౌ,
దోయముతోబీరను,సొర
కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీ పూరణ బాగున్నది.
తొలగించుహాయిగ తల్లి పజ్జన మహానిశివేళ భయంబు లేక కై
రిప్లయితొలగించుదోయిని మాత మేననిడి తుష్టిగ నిద్రకుపక్రమించ పా
పాయిదె కెవ్వనంగ వడి బాధతొ మేన్గన చెమ్మలోనె యీ
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నడున్
మీ పూరణ బాగున్నది.
తొలగించు'బాధతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "బాధను" అనండి.
మాయలు పన్నుచు వారలు
రిప్లయితొలగించునాయకులై మోసగించి నటులై పోవన్
ఛీయని పలికిరి పచ్చివి
కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్
మీ పూరణ బాగున్నది.
తొలగించు
రిప్లయితొలగించు* శంకరాభరణం వేదిక *
27//06/2020...శనివారం
సమస్య
********
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్"
నా పూరణ. ఉ.మా.
*** ********
వేయుచు పాడిపంటలను వేసట జెందక కర్షకుండు తా
కాయగ కాపు వాటికిని కానగ రాదు ఫలంబు సుంతయున్!
కాయము రేబవళ్ళు మరి కష్టముజేయగ హస్తమందునన్
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్"
-- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి🌷
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించుకాయకు పందెము నాతో
రిప్లయితొలగించుతోయలి యోటమిక తప్పదోయి నిజమిదే
స్థాయనిఁ గాంచగ కొబ్బరి
కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్
మీ పూరణ బాగున్నది.
తొలగించుసరదాకు రాసిన పూరణ మాత్రమే.
రిప్లయితొలగించుఉ:
వ్రాయుచు నుండ పూరణలు వందలు వేలుగ వాట్సపందునన్
త్రోయుచు నుండ వీటికివె తొందర ముందర బ్లాగునందునన్
వేయరె ముద్ర శంకరులు పేరున కొన్నిటికుత్తరంబుగా
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నడున్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది.
తొలగించుకాయకు మంటి పందెమిక ఖాయమె యోటమి నీకు తప్పదో
రిప్లయితొలగించుతోయలి తెచ్చితిన్ గనవె దూరము నుండి ఫలింపనట్టియౌ
కాయలు గాని కాయలవి కాంతరొ యెప్పటి కిన్ని యీటపా
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్
మీ పూరణ బాగున్నది.
తొలగించు
రిప్లయితొలగించునా పూరణ. ఉ.మా.
*** ********
( ఓ తండ్రి ఆవేదన )
న్యాయము ధర్మ మెంచకను హాని యొనర్చుచు ప్రక్కవారికిన్..,
హేయపు కార్యముల్ సలుపు హీనపు పుత్రుల రీతి గాంచి యో
నాయన బాధనొందె ;మదినన్ మరి భావన యిట్లు దోచెగా!
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్"
-- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి🌷
మీ పూరణ బాగున్నది.
తొలగించు"హాని నొనర్చుచు... మదినిన్..."
ఖాయము వైద్యవిద్యగొని కాగలడీతడు వైద్యుడంచు న
రిప్లయితొలగించున్యాయముగా గ్రహించు ధనమందరినుండియు పెక్కుకేంద్రముల్
ధ్యేయముకూరునెందరికొదేశము నందున, పిల్లవాండ్రలో
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్
మీ పూరణ బాగున్నది.
తొలగించుమాయల జేయుచు నొక్కడు
రిప్లయితొలగించువేయగ రాళ్లనొక చోట వింతగ మారన్
తోయజ నేత్రులు బల్కిరి
" కాయలు గలవెన్నొ పండ్లు కావెన్న టికిన్ "
మీ పూరణ బాగున్నది.
తొలగించుప్రభాకర శాస్త్రి గారూ,
రిప్లయితొలగించుజిలేబి గారూ,
జులై 17 నా 70వ జన్మదినం సందర్భంగా మిత్రులు 'సప్తతి సంచిన' ముద్రిస్తున్న విషయం మీకు తెలిసినదే. అందులో మీ ఇద్దరి పద్యాలు (నాలుగుకు మించకుండా) ఉండాలని నా ప్రగాఢ వాంఛ. ఆలస్యం చేయకుండా వ్రాసి పంపండి. బ్లాగులో ప్రకటించండి.
ఒకటి నుండి నాలుగు పద్యాల వరకు వ్రాయవచ్చు.
తొలగించు
తొలగించుసార్! అమూల్యమైన వ్యాసాన్ని నేను వ్రాసి మీకు పంపాను కదా! నా వంతు పద్యాలు కూడా జిలేబి గారు వ్రాయగలరు.
🙏
తొలగించుమీ సద్భావనలకు నెనరుల్స్!
నేటి టపాలో వేయడమైనది .
జిలేబి
ధృతరాష్ట్రుడు భీముని అంతము చేయదలచి కౌగలించినపుడు కృష్ణుని మాటగా
రిప్లయితొలగించుచేయని తప్పులు లేవుగ
కాయము నిండుగనసూయ క్రమ్మగ నూరౌ
ప్రాయమునను పగనువిడడు
కాయలు గలవెన్నొ పండ్లుగావెన్నటికిన్
ఆయతధర్మముచేతను
రిప్లయితొలగించుపాయకమార్గముమనుజులుఫలమునుబోందన్
సాయముదైవముగావలె
కాయలుగలవెన్నోపండ్లుగావెన్నటికిన్
ఊయలనూగుచుశాస్త్రులు
రిప్లయితొలగించుసాయీ!నామాటవినుముసన్మతితోడన్
రాయునిపెరడుననానప
కాయలుగలవెన్నొపండ్లుగావెన్నటికిన్
కాయముశాశ్వతంబనియుకామనపెంచుచులోకమందునన్
రిప్లయితొలగించుచేయినివాయినింగలిపిచేటునుదెచ్చుచుదుష్టసంగతిన్
డాయగకాలమున్తుదినిఠావునుదప్పుచునుండువారలే
కాయలుపెక్కులున్నవవిగావుఫలంబులుచూడనెన్నడున్
వాయి=నోరు,ఠావు=స్థానము
వేయగ నరటిగెల యొకటి
రిప్లయితొలగించుకోయను జూడగ తెలిసెను కూరరటియనిన్ !
తీయగ తినుటకు కుదరదు
"కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్"
తీయనిమామిడిచెట్టున
రిప్లయితొలగించుకాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్
పాయక పెనుగాలికి కసు
గాయలుగానేలరాలుకతముననెప్డున్
మాయలు నాలుగు దిక్కులు
రిప్లయితొలగించుమాయావులు చుట్టుపక్క మనుజులె కాదా!
మాయలు కలిలో యెన్నో
కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్
సంబరాజు రవిప్రకాశ రావు
ఈ యా వాక్యము లఱిముఱి
రిప్లయితొలగించువేయేల పలికెద వీవు వెఱ్ఱిదనమునం
గోయుమ వేగమ యానప
కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్
ఏ యొక దైవ మైన నను నింపుగఁ గావఁగ వేగ రా గలం
డే యని దిక్కు లారయుచు నివ్విధి దీనుఁడు చూచుచుండగాఁ
బాయక దుఃఖ సంచయము పాఱఁగఁ గన్నులఁ గాచి నట్టివౌ
కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్
రాయలసీమ నందున పరంపరగా నిది మెట్ట పంటరా
రిప్లయితొలగించుతీయురు దీనినుండి బహు తీరుగ నూనెను, వంటలందు స్త్రీ
సోయగ పోషకాలఁ పొడచూపు గణించగ దోర వీ సెన
క్కాయలు పెక్కులున్న వవి, గావు ఫలంబులు చూడ నెన్నఁడున్౹౹
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుమాయలమల్లిగాాడనెనుమాకనపాలెపురాజుగారితోన్
రిప్లయితొలగించురాయలతోటలోగనగరాటులుదేలుచుచక్కగానుటెం
కాయలుపెక్కులున్నవిగావుఫలంబులుచూడనెన్నడున్
గాయలుబూర్తిగాముదరగన్పడుపండిననట్లుదోచుగా
కందం
రిప్లయితొలగించుస్త్రీ యొకతె రాత్రి నడచుటఁ
బాయఁగ నవినీతి దేశపాలనమందున్
ధ్యేయమన గాంధి యాశలఁ
గాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్!
ఉత్పలమాల
స్త్రీ యిల నర్దరాత్రి యొకతే తిరుగాడట నెంచినావొకో
యే యవినీతి దేశమున నించుక నెంచక కోరుకొంటివో
తీయని స్వప్నముల్! భరత దేశము నందున గాంధి యాశలన్
గాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్! !