నడిరేయి సరదా పూరణ: బాగుగ పీల్చుచున్ కడకు బాధల నొందగ దగ్గు వ్యాధితోబేగమె పారిపోదునని భీషణ రీతిని రచ్చజేయగావేగమె బీడిలన్ విడిచి, ప్రీతియె లేదని జీవితమ్మునన్ రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
మీ సరదా పూరణ బాగున్నది.
🙏
రోగికి యూపిరి యాడకవేగమె యాస్పత్రి కేగ వేదన తోడన్లాగేయగ ధనమంతయురోగము నయమైన మిగుల రోదించెనయో.
మీ పూరణ బాగున్నది."రోగికి నూపిరి..." అనండి.
15.06.2020అందరికీ నమస్సులు 🙏సమస్యను స్వీకరించిన కంది గురువులకు శతాధిక వందనములు 🙏🙇♂️🙏*సమస్య: రోగము నయమైన మిగుల రోదించెనయా*నా పూరణ యత్నం 😊😀*కం*రోగము దరిజేరెననుచు త్యాగము జేయుట సరియని త్రాగుడు నికపై వాగిన మిత్రుల జూచుచు *రోగము నయమైన మిగుల రోదించెనయా**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*🙏🙏
మీ పూరణ బాగున్నది.
ధన్యవాదములు గురువర్యా 🙏🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రోగము కొరోన పోవగవేగమె నాస్పత్రిని ప్రయివేటుది చేరన్బాగుగ డబ్బులు వ్యయమైరోగము నయమైన మిగుల రోదించెనయో
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) భోగము లన్నియున్ విడిచి బొట్టును పెట్టుచు మోము మీదనున్ సాగుచు వీధి వీధులను జంబము మీరగ వోట్లు కోరగా....వేగమె మోడి గెల్వగను పీకుచు జంద్యము, వీపు గోకెడున్ రోగము పోయి స్వస్థుఁడయి, రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్గోకుడు = గజ్జి
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది.
వేగగ లేక తండ్రి యటు వేదన నొందగ పుత్రరాజమేవేగిర చేర్చవైద్యుడటు వెట్టగ కృత్రిమ శ్వాసయందగన్బాగుపడంగనే కనుచు బాదిన బిల్లును దానుదల్చుచున్రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
[15/06, 00:27] V: శ్రీ లక్ష్మీ నారసింహాయనమః తేది:15-06-2020. మహోదయులకు శుభోదయ నమస్సులతో ,నేటి సమస్యాపూరణాల యత్నం - వేగమె బడికిక చనుమనసాగదనె బాలుడు తనకిక స్వాస్థత విధిగన్చేగూరలేదనుచున్రోగము నయమైన మిగుల రోదించెనయో!జాగృతమైన పుత్రుని తొ , చక్కగ సర్వము తీర్చి దిద్దగన్నీగృహ శుభ్రతన్ మరియు నేమపు కార్యము లెల్లజే యు మో!స్వగృహమే !యనంగ హృది భారము నిండగ బాధగూడ గన్రోగము పోయి స్వస్థుడయి రోదన జేయగ సాగె బిట్టు గన్.
మీ రెండు పూరణలు బాగున్నవి.కందం రెండవ పాదంలో గణభంగం. 'స్వస్థత/స్వాస్థ్యము...చేకూరలేదు' సాధువులు. వృత్తంలో 'పుత్రునితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'స్వగృహ' మన్నపుడు 'స్వ' లఘువే. గణభంగం. సవరించండి.
భోగము కాదె వేళకును భోజనమంది కరోన వైద్యమేసాగుట క్షేమ సౌఖ్యముల సాధనయే పరమంబుగన్? సదుద్యోగము లేని గొప్ప పనిదొంగకు గుండెల గుండుపడ్డదోచ్రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
రోగిష్టి భార్య పేరునవేగము గన్జేసె నొకడు బీమా ఘనతన్భోగము నుకోరి,శుభముగరోగము నయమైన మిగుల రోదించెనయో భార్య చనిపోయిన కోట్లు వచ్చునని తలచి ఒకడు అప్పు చేసి ఇన్సూరెన్స్ పాలసి చేసి భార్య కోలుకొనగా ఏడ్చిన సందర్భము
ఆగని గ్రీష్మ పు తాపముసాగని భిక్షాటనమ్ము,సాగెడు నేసీ భోగము లిక నుండవనుచురోగము తగ్గెనని మిగుల రోదించెనయోబిక్ష గానికి కరోనా వచ్చిన దని ఆస్పత్రిలో చేర్చగా ఏసి రూములో భోగములు అనుభవించుచు డిస్చార్జి అయినపుడు అతని మనోభావము
ఆగిన వంటల డ్యూటీ,బాగుగ దొరికిన సెలవులు, భామల సేవల్,ఆగును గదా యికననుచురోగము తగ్గెనని మిగుల రోదించెనయో
రాగముల తీసి పాడెనురోగము నయమైన, మిగుల రోదించెనయోయోగము కలయక బాధలుతీగల వలెచుట్టుకొనగ తిండాట్టముతో!జిలేబి
కందోత్పలభగభగ మండుచు బాధ బడగ రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టు గన్ తాళగలేక నలిపిరినిక కలవరపడి సుమీ!అలిపిరి - నీరసముజిలేబి
రోగము తో తిరుక్షవరము వేగము గాను తగ్గుటకు వేలకు వేలు ధనమ్ము బోవగారోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్మీగడ యైన జీవితము మిక్కిలి హీనము కాగ లేమితోభోగము లెల్ల బోవనరె బువ్వకు బువ్వకు చిక్కుపాట్లతో!జిలేబి
భోగములన్ని మాసినవి బూడిద యయ్యెను విత్త మంతయున్ రోగము ఘోర మైనదని లోపల నెల్ల దహించి వేసె నంౘాగము చేసె వైద్యు డది యౌనను కొంటిని మోసమంౘు నారోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.
ధన్యవాదాలు గురువు గారు
రోగముమూగబాధయనరోగముబోయినబల్కెదూరుడైరోగముగంటిజూపుదనరోగముబోవగజూచెహింసలన్రోగమువిన్కిడిన్దనినరోగముబోవగదూరతన్వినన్రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్కొరుప్రోలు
రోగనివారణశాలకురోగినితరలించినారు రుగ్మతవోవన్ వేగమె ప్రాణాంతకమగురోగము నయమైన మిగుల రోదించెనయో
బాగుగ సంతోషపడెనురోగము నయమైన , మిగుల రోదించె , నయోబాగుగ నింటనె యుండుటసాగదు , మరి యెటులగోష్టి సలుపుదు ననుచున్
మైలవరపు వారి పూరణ రోగము హెచ్చె వీని., కిక రోజులు మాత్రమె యుండు., నాస్తిలోభాగము నాకు నాకనుచు బంధువులెల్లరు కీచులాడ., నేయోగమొ యాతడే బ్రతికియుండగ నీగతి జూచి ఖిన్నుడైరోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
నా పూరణ. ఉ.మా.*** ***** **** ****రోగపు పాలు జేసెను కరోన పిశాచమె భార్యభర్తలన్వేగమె తగ్గె భర్త కతివేలపు చక్కని వైద్య మందగాన్రోగమె మీఱగన్ గృహిణి క్రుంక భరించక ప్రాణనాథుడేరోగము పోయి స్వస్థుడయి రోదన జేయగసాగె బిట్టుగన్ -- �� ఆకుల శాంతి భూషణ్ �� �� వనపర్తి��
రోగమనుచు పోవంగనువేగమె చేయగ పరీక్ష బిల్లుల మోతన్నా గతి అప్పులె యనుచునురోగము తగ్గంగ మిగుల రోదించె నయో
మీ పూరణ బాగున్నది.'పోవంగను' అనడం సాధువు కాదు. "రోగమనుచు తానేగగ..." అనండి.
బాగరి నర్సొక్కతె యనురాగము తో పలుకరింప రక్తుండగుచున్ భోగార్థియైన వాడే రోగము నయమైన మిగుల రోదించెనయో
రోగి ముదంబున బొంగెను రోగము నయమైన : మిగుల రోదించె న యో ఈగతి చికిత్స కొఱకై తా గడి యించిన ధనమది తరిగిన దనుచు న్
సాగగ సుదీర్ఘ వైద్యము రోగికి స్వస్థత లభించి రుగ్మత వీడన్ ఆగెను గడనని వైద్యుడు రోగము నయమైన మిగుల రోదించె నయో!
ఏగెదవెచటికి విను నీవాగుము జెల్లింపుమనగ నరవై లక్షల్ఆగని కన్నీట నతడురోగము నయమైన మిగుల రోదించెనయో
రోగముగలయాసోముడురోగమునయమైనమిగులరోదించెనయోరోగపుసమయములందునభోగములంబొందియికనుభోగములేమిన్
ఉ:వేగన మాన్ప, సోమరిగ వేదనలేలని లాకుడౌనునన్భాగము పొంద ముచ్చటగ భార్యకు సాయము జేయ వంటలన్సాగవు యాటలింక పద సాకులు యేలని గద్దిరింపగన్రోగము పోయి స్వస్థుడయి రోదన జేయగ సాగె బిట్టునన్వేగన=కలతవై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది.'సాగవు+ఆటలు, సాకులు+ఏల' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.
గురువు గారి సూచనల ననుసరించి మార్పుతో..ఉ: వేగన మాన్ప,సోమరిగ వేదనలేలని లాకుడౌనునన్భాగము పొంద ముచ్చటగ భార్యకు సాయము జేయ వంటలన్సాగవు కుంటిసాకు లిక సాగిలు టేలని గద్దిరింపగన్రోగము పోయి స్వస్థుడయి రోదన జేయగ సాగె బిట్టునన్వై. చంద్రశేఖర్
రోగమునొందినట్టిరవిరోజులవెంబడివైద్యశాలలోభోగములొందుచున్ నికనుభోగములుండనిగారణంబునన్ రోగముపోయిస్వస్ధుడయిరోదనజేయగసాగెబిట్టునన్ రోగములేకయుండుటకురోదనజేయకసంతసింపుమా
మీ పూరణ బాగున్నది."భోగములంది తా నికను..." అనండి.
ఆగమ కాలమంతయు తనాయస మంతయు బాపగానిటుల్బాగుగ జూచెనీ ప్రకృతి, ప్రాణము నిల్వగ వార్ధకంబునన్రాగము చావకింతయును లక్ష్యము వీడుట కొక్కరోజుకేరోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
నాగరికం బయ్యెను వేవేగఁ జనఁగ వైద్యు కడకు వెఱ్ఱిగ భీతిన్ వేగఁ దిరిగి కనిపించఁగ రోగము నయ మైన మిగుల రోదించెనయో [నయ మైన(న్)]బాగుగ చిత్త ముంచి మఱి వైద్యము సేయఁగఁ గీర్తి హస్తుఁడేక్రాఁగఁగఁ జేసి సంతతము కంటకమై రుజ కొన్ని నాళ్లహో దాగి శరీరమం దిపుడు తగ్గిన హర్షము పొంగ నత్తరిన్రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగ సాగె బిట్టుగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
రోగముసోకి కరోనా వేగమెచని వైద్యశాల బెడ్డునజేరన్ జాగున దొంగలుదోచగరోగము నయమైన మిగుల రోదించెనయో!బాగుగ వైద్యమందగ సుభాగ్యుడు సోముడు జేరెనింటికిన్ రోగముపోయి స్వస్థుడయి,రోదన సేయగసాగె బిట్టుగన్ బీగములేని యిల్లుగని ,పెక్కగుసొమ్ములు దోచుకోబడన్ సాగగ నెట్టులో బ్రతుకు చచ్చిన బాగుగనుండె నంచునున్
మీ రెండు పూరణలు బాగున్నవి.
ధన్యవాదములు గురుదేవా,నమస్సూలు!
భోగపు వాడలన్ దిరుగు పోకిరి వానికి యంటుకున్నదో రోగము, గేస్తురాలు ఝష లోచన భీతిలి వైద్యశాలలో లోగిలినమ్మి చేర్చెనట రూపసి, వాసము పోయెనంచు నారోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
ఉత్పలమాలఆగును నీదు గుండియ నియంత్రణ జేసెద మంచు వైద్యులున్జాగు వినాశ కారకము శస్త్ర చికిత్సకు రమ్మటంచు నారోగికి వైద్యమున్ సలిపి రొక్కము గుంజగ లక్షలాదులున్రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
కందంఆగును గుండియ యంచునుసాగించుచు వేగిరముగ శస్త్ర చికిత్సన్తూగననిన గుంజ ధనమురోగము నయమైన మిగుల రోదించెనయో!
ఆగముచేసెనే జగతి నందరి జీవితముల్ కరోన యుద్వేగమునొందగా నొకడు వేగ సువైద్యము పొందనెంచుచున్సాగెను వైద్యశాల, కట సంపద వారలు కొల్లగొట్ట నారోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
రోగముపెచ్చరిల్లనొక రోగి జనెన్ జనవైద్యశాలకున్రోగచికిత్సజేసితనరుగ్మతమాన్పగ వైద్యుడంతటన్రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్సాగిలి మ్రొక్కి వైద్యునకు సాంత్వనజేకుర మానసంబునన్
బాగుగ దేహపుష్టిగొని భార్య కుటుంబముఁ వీడి దుర్మతిన్భోగపు బాటనెంచి యది భూషణ మేనని నెంచి జూడగాసాగదు జీవితంబనుచు సత్వరమే తన తప్పు నొప్పగన్రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్.
వేగమున వెడలె నల్లుడురోగము నాస్పత్రి జేర్చిరో దన మామన్ చేగొనుదు నాస్తి యాశన,రోగము నయమైన మిగుల రోదించెనయో!
సాగే ప్రేమే పెళ్లికివేగముసాగంగ పిదప వేడుకదరుగన్!మూగిన ననుమానంబునరోగమునయమైనమిగులరోదించెనయో!
క్రొవ్విడి వెంకట రాజారావు: సాగెను ముదమున నింటికి రోగము తగ్గెనని; మిగుల రోదించెనయో రోగము నణచిన వైద్యుడు బాగుగ ధనమును కొసరిన వైనము ననుచున్.
త్రాగుచు నుండగ సతతమురోగమొకటి వచ్చిచేర రొప్పుచు మందున్త్యాగము చేయుమనంగనురోగము నయమైనపిదప రోదించెనయా
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
బాగుగ పీల్చుచున్ కడకు బాధల నొందగ దగ్గు వ్యాధితో
బేగమె పారిపోదునని భీషణ రీతిని రచ్చజేయగా
వేగమె బీడిలన్ విడిచి, ప్రీతియె లేదని జీవితమ్మునన్
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
మీ సరదా పూరణ బాగున్నది.
తొలగించండి🙏
తొలగించండిరోగికి యూపిరి యాడక
రిప్లయితొలగించండివేగమె యాస్పత్రి కేగ వేదన తోడన్
లాగేయగ ధనమంతయు
రోగము నయమైన మిగుల రోదించెనయో.
మీ పూరణ బాగున్నది.
తొలగించండి"రోగికి నూపిరి..." అనండి.
15.06.2020
రిప్లయితొలగించండిఅందరికీ నమస్సులు 🙏
సమస్యను స్వీకరించిన కంది గురువులకు శతాధిక వందనములు 🙏🙇♂️🙏
*సమస్య: రోగము నయమైన మిగుల రోదించెనయా*
నా పూరణ యత్నం 😊😀
*కం*
రోగము దరిజేరెననుచు
త్యాగము జేయుట సరియని త్రాగుడు నికపై
వాగిన మిత్రుల జూచుచు
*రోగము నయమైన మిగుల రోదించెనయా*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🙏
మీ పూరణ బాగున్నది.
తొలగించండిధన్యవాదములు గురువర్యా 🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరోగము కొరోన పోవగ
తొలగించండివేగమె నాస్పత్రిని ప్రయివేటుది చేరన్
బాగుగ డబ్బులు వ్యయమై
రోగము నయమైన మిగుల రోదించెనయో
మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
భోగము లన్నియున్ విడిచి బొట్టును పెట్టుచు మోము మీదనున్
సాగుచు వీధి వీధులను జంబము మీరగ వోట్లు కోరగా....
వేగమె మోడి గెల్వగను పీకుచు జంద్యము, వీపు గోకెడున్
రోగము పోయి స్వస్థుఁడయి, రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
గోకుడు = గజ్జి
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది.
తొలగించండి🙏
తొలగించండివేగగ లేక తండ్రి యటు వేదన నొందగ పుత్రరాజమే
రిప్లయితొలగించండివేగిర చేర్చవైద్యుడటు వెట్టగ కృత్రిమ శ్వాసయందగన్
బాగుపడంగనే కనుచు బాదిన బిల్లును దానుదల్చుచున్
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండి[15/06, 00:27] V: శ్రీ లక్ష్మీ నారసింహాయనమః తేది:15-06-2020. మహోదయులకు శుభోదయ నమస్సులతో ,
రిప్లయితొలగించండినేటి సమస్యాపూరణాల యత్నం -
వేగమె బడికిక చనుమన
సాగదనె బాలుడు తనకిక స్వాస్థత విధిగన్
చేగూరలేదనుచున్
రోగము నయమైన మిగుల రోదించెనయో!
జాగృతమైన పుత్రుని తొ , చక్కగ సర్వము తీర్చి దిద్దగ
న్నీగృహ శుభ్రతన్ మరియు నేమపు కార్యము లెల్లజే యు మో!
స్వగృహమే !యనంగ హృది భారము నిండగ బాధగూడ గన్
రోగము పోయి స్వస్థుడయి రోదన జేయగ సాగె బిట్టు గన్.
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండికందం రెండవ పాదంలో గణభంగం. 'స్వస్థత/స్వాస్థ్యము...చేకూరలేదు' సాధువులు.
వృత్తంలో 'పుత్రునితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'స్వగృహ' మన్నపుడు 'స్వ' లఘువే. గణభంగం. సవరించండి.
భోగము కాదె వేళకును భోజనమంది కరోన వైద్యమే
రిప్లయితొలగించండిసాగుట క్షేమ సౌఖ్యముల సాధనయే పరమంబుగన్? సదు
ద్యోగము లేని గొప్ప పనిదొంగకు గుండెల గుండుపడ్డదోచ్
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరోగిష్టి భార్య పేరున
రిప్లయితొలగించండివేగము గన్జేసె నొకడు బీమా ఘనతన్
భోగము నుకోరి,శుభముగ
రోగము నయమైన మిగుల రోదించెనయో
భార్య చనిపోయిన కోట్లు వచ్చునని తలచి ఒకడు అప్పు చేసి ఇన్సూరెన్స్ పాలసి చేసి భార్య కోలుకొనగా ఏడ్చిన సందర్భము
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఆగని గ్రీష్మ పు తాపము
రిప్లయితొలగించండిసాగని భిక్షాటనమ్ము,సాగెడు నేసీ
భోగము లిక నుండవనుచు
రోగము తగ్గెనని మిగుల రోదించెనయో
బిక్ష గానికి కరోనా వచ్చిన దని ఆస్పత్రిలో చేర్చగా ఏసి రూములో భోగములు అనుభవించుచు డిస్చార్జి అయినపుడు అతని మనోభావము
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఆగిన వంటల డ్యూటీ,
రిప్లయితొలగించండిబాగుగ దొరికిన సెలవులు, భామల సేవల్,
ఆగును గదా యికననుచు
రోగము తగ్గెనని మిగుల రోదించెనయో
మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిరాగముల తీసి పాడెను
రోగము నయమైన, మిగుల రోదించెనయో
యోగము కలయక బాధలు
తీగల వలెచుట్టుకొనగ తిండాట్టముతో!
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండికందోత్పల
భగభగ మండుచు బాధ బ
డగ రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జే
యఁగసాగె బిట్టు గన్ తా
ళగలేక నలిపిరినిక కలవరపడి సుమీ!
అలిపిరి - నీరసము
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిరోగము తో తిరుక్షవరము
వేగము గాను తగ్గుటకు వేలకు వేలు ధనమ్ము బోవగా
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
మీగడ యైన జీవితము మిక్కిలి హీనము కాగ లేమితో
భోగము లెల్ల బోవనరె బువ్వకు బువ్వకు చిక్కుపాట్లతో!
జిలేబి
మీ పూరణ బాగున్నది.
తొలగించండిభోగములన్ని మాసినవి బూడిద యయ్యెను విత్త మంతయున్
రిప్లయితొలగించండిరోగము ఘోర మైనదని లోపల నెల్ల దహించి వేసె నం
ౘాగము చేసె వైద్యు డది యౌనను కొంటిని మోసమంౘు నా
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిధన్యవాదాలు గురువు గారు
తొలగించండిరోగముమూగబాధయనరోగముబోయినబల్కెదూరుడై
రిప్లయితొలగించండిరోగముగంటిజూపుదనరోగముబోవగజూచెహింసలన్
రోగమువిన్కిడిన్దనినరోగముబోవగదూరతన్వినన్
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
కొరుప్రోలు
మీ పూరణ బాగున్నది.
తొలగించండిరోగనివారణశాలకు
రిప్లయితొలగించండిరోగినితరలించినారు రుగ్మతవోవన్
వేగమె ప్రాణాంతకమగు
రోగము నయమైన మిగుల రోదించెనయో
మీ పూరణ బాగున్నది.
తొలగించండిబాగుగ సంతోషపడెను
రిప్లయితొలగించండిరోగము నయమైన , మిగుల రోదించె , నయో
బాగుగ నింటనె యుండుట
సాగదు , మరి యెటులగోష్టి సలుపుదు ననుచున్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిరోగము హెచ్చె వీని., కిక రోజులు మాత్రమె యుండు., నాస్తిలో
భాగము నాకు నాకనుచు బంధువులెల్లరు కీచులాడ., నే
యోగమొ యాతడే బ్రతికియుండగ నీగతి జూచి ఖిన్నుడై
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండినా పూరణ. ఉ.మా.
రిప్లయితొలగించండి*** ***** **** ****
రోగపు పాలు జేసెను కరోన పిశాచమె భార్యభర్తలన్
వేగమె తగ్గె భర్త కతివేలపు చక్కని వైద్య మందగాన్
రోగమె మీఱగన్ గృహిణి క్రుంక భరించక ప్రాణనాథుడే
రోగము పోయి స్వస్థుడయి రోదన జేయగసాగె బిట్టుగన్
-- �� ఆకుల శాంతి భూషణ్ ��
�� వనపర్తి��
మీ పూరణ బాగున్నది.
తొలగించండిరోగమనుచు పోవంగను
రిప్లయితొలగించండివేగమె చేయగ పరీక్ష బిల్లుల మోతన్
నా గతి అప్పులె యనుచును
రోగము తగ్గంగ మిగుల రోదించె నయో
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'పోవంగను' అనడం సాధువు కాదు. "రోగమనుచు తానేగగ..." అనండి.
బాగరి నర్సొక్కతె యను
రిప్లయితొలగించండిరాగము తో పలుకరింప రక్తుండగుచున్
భోగార్థియైన వాడే
రోగము నయమైన మిగుల రోదించెనయో
మీ పూరణ బాగున్నది.
తొలగించండిరోగి ముదంబున బొంగెను
రిప్లయితొలగించండిరోగము నయమైన : మిగుల రోదించె న యో
ఈగతి చికిత్స కొఱకై
తా గడి యించిన ధనమది తరిగిన దనుచు న్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిసాగగ సుదీర్ఘ వైద్యము
రిప్లయితొలగించండిరోగికి స్వస్థత లభించి రుగ్మత వీడన్
ఆగెను గడనని వైద్యుడు
రోగము నయమైన మిగుల రోదించె నయో!
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఏగెదవెచటికి విను నీ
రిప్లయితొలగించండివాగుము జెల్లింపుమనగ నరవై లక్షల్
ఆగని కన్నీట నతడు
రోగము నయమైన మిగుల రోదించెనయో
మీ పూరణ బాగున్నది.
తొలగించండిరోగముగలయాసోముడు
రిప్లయితొలగించండిరోగమునయమైనమిగులరోదించెనయో
రోగపుసమయములందున
భోగములంబొందియికనుభోగములేమిన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండివేగన మాన్ప, సోమరిగ వేదనలేలని లాకుడౌనునన్
భాగము పొంద ముచ్చటగ భార్యకు సాయము జేయ వంటలన్
సాగవు యాటలింక పద సాకులు యేలని గద్దిరింపగన్
రోగము పోయి స్వస్థుడయి రోదన జేయగ సాగె బిట్టునన్
వేగన=కలత
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'సాగవు+ఆటలు, సాకులు+ఏల' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.
గురువు గారి సూచనల ననుసరించి మార్పుతో..
తొలగించండిఉ:
వేగన మాన్ప,సోమరిగ వేదనలేలని లాకుడౌనునన్
భాగము పొంద ముచ్చటగ భార్యకు సాయము జేయ వంటలన్
సాగవు కుంటిసాకు లిక సాగిలు టేలని గద్దిరింపగన్
రోగము పోయి స్వస్థుడయి రోదన జేయగ సాగె బిట్టునన్
వై. చంద్రశేఖర్
రోగమునొందినట్టిరవిరోజులవెంబడివైద్యశాలలో
రిప్లయితొలగించండిభోగములొందుచున్ నికనుభోగములుండనిగారణంబునన్
రోగముపోయిస్వస్ధుడయిరోదనజేయగసాగెబిట్టునన్
రోగములేకయుండుటకురోదనజేయకసంతసింపుమా
మీ పూరణ బాగున్నది.
తొలగించండి"భోగములంది తా నికను..." అనండి.
ఆగమ కాలమంతయు తనాయస మంతయు బాపగానిటుల్
రిప్లయితొలగించండిబాగుగ జూచెనీ ప్రకృతి, ప్రాణము నిల్వగ వార్ధకంబునన్
రాగము చావకింతయును లక్ష్యము వీడుట కొక్కరోజుకే
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
మీ పూరణ బాగున్నది.
తొలగించండినాగరికం బయ్యెను వే
రిప్లయితొలగించండివేగఁ జనఁగ వైద్యు కడకు వెఱ్ఱిగ భీతిన్
వేగఁ దిరిగి కనిపించఁగ
రోగము నయ మైన మిగుల రోదించెనయో
[నయ మైన(న్)]
బాగుగ చిత్త ముంచి మఱి వైద్యము సేయఁగఁ గీర్తి హస్తుఁడే
క్రాఁగఁగఁ జేసి సంతతము కంటకమై రుజ కొన్ని నాళ్లహో
దాగి శరీరమం దిపుడు తగ్గిన హర్షము పొంగ నత్తరిన్
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగ సాగె బిట్టుగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిరోగముసోకి కరోనా
రిప్లయితొలగించండివేగమెచని వైద్యశాల బెడ్డునజేరన్
జాగున దొంగలుదోచగ
రోగము నయమైన మిగుల రోదించెనయో!
బాగుగ వైద్యమందగ సుభాగ్యుడు సోముడు జేరెనింటికిన్
రోగముపోయి స్వస్థుడయి,రోదన సేయగసాగె బిట్టుగన్
బీగములేని యిల్లుగని ,పెక్కగుసొమ్ములు దోచుకోబడన్
సాగగ నెట్టులో బ్రతుకు చచ్చిన బాగుగనుండె నంచునున్
మీ రెండు పూరణలు బాగున్నవి.
తొలగించండిధన్యవాదములు గురుదేవా,నమస్సూలు!
తొలగించండిభోగపు వాడలన్ దిరుగు పోకిరి వానికి యంటుకున్నదో
రిప్లయితొలగించండిరోగము, గేస్తురాలు ఝష లోచన భీతిలి వైద్యశాలలో
లోగిలినమ్మి చేర్చెనట రూపసి, వాసము పోయెనంచు నా
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
ఉత్పలమాల
రిప్లయితొలగించండిఆగును నీదు గుండియ నియంత్రణ జేసెద మంచు వైద్యులున్
జాగు వినాశ కారకము శస్త్ర చికిత్సకు రమ్మటంచు నా
రోగికి వైద్యమున్ సలిపి రొక్కము గుంజగ లక్షలాదులున్
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
రిప్లయితొలగించండికందం
ఆగును గుండియ యంచును
సాగించుచు వేగిరముగ శస్త్ర చికిత్సన్
తూగననిన గుంజ ధనము
రోగము నయమైన మిగుల రోదించెనయో!
ఆగముచేసెనే జగతి నందరి జీవితముల్ కరోన యు
రిప్లయితొలగించండిద్వేగమునొందగా నొకడు వేగ సువైద్యము పొందనెంచుచున్
సాగెను వైద్యశాల, కట సంపద వారలు కొల్లగొట్ట నా
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
రోగముపెచ్చరిల్లనొక రోగి జనెన్ జనవైద్యశాలకున్
రిప్లయితొలగించండిరోగచికిత్సజేసితనరుగ్మతమాన్పగ వైద్యుడంతటన్
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్
సాగిలి మ్రొక్కి వైద్యునకు సాంత్వనజేకుర మానసంబునన్
బాగుగ దేహపుష్టిగొని భార్య కుటుంబముఁ వీడి దుర్మతిన్
రిప్లయితొలగించండిభోగపు బాటనెంచి యది భూషణ మేనని నెంచి జూడగా
సాగదు జీవితంబనుచు సత్వరమే తన తప్పు నొప్పగన్
రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్.
వేగమున వెడలె నల్లుడు
రిప్లయితొలగించండిరోగము నాస్పత్రి జేర్చిరో దన మామన్
చేగొనుదు నాస్తి యాశన,
రోగము నయమైన మిగుల రోదించెనయో!
సాగే ప్రేమే పెళ్లికి
రిప్లయితొలగించండివేగముసాగంగ పిదప వేడుకదరుగన్!
మూగిన ననుమానంబున
రోగమునయమైనమిగులరోదించెనయో!
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసాగెను ముదమున నింటికి
రోగము తగ్గెనని; మిగుల రోదించెనయో
రోగము నణచిన వైద్యుడు
బాగుగ ధనమును కొసరిన వైనము ననుచున్.
త్రాగుచు నుండగ సతతము
రిప్లయితొలగించండిరోగమొకటి వచ్చిచేర రొప్పుచు మందున్
త్యాగము చేయుమనంగను
రోగము నయమైనపిదప రోదించెనయా