10, జులై 2020, శుక్రవారం

సమస్య - 3423

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తన సతి పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్"
(లేదా...)
"తన యర్ధాంగి వివాహముం గనుటకై తానేఁగె నుత్సాహియై"

52 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    ఘనమౌ తీరున సూటుబూటు గొనుచున్ గారాబు ముస్తాబునన్
    చనుచున్ హైదరబాదునందు నగుచున్ జాగ్రత్తగా వీధులన్
    కొనుచున్ పట్టువి వస్త్రముల్ విరివిగా కోపిష్ఠియౌ బాసు నూ
    తన యర్ధాంగి వివాహముం గనుటకై తానేంగె నుత్సాహియై...

    రిప్లయితొలగించండి
  2. 🙏 *గురువు గారికి నమస్కారములు*🙏
    🙏🙏🌹🌹🌹🌹

    నేటిదత్తసమస్య : -

    *తన సతి పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్ *

    నాపూరణప్రయత్నం :-

    వనితల చీరల అంచుల
    ను నగలసామ్యములతూచనుపలువిధములౌ
    తనసొమ్ములతో ముదమున
    తన సతి; పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్
    .....✍బోరెల్లి హర్ష
    కర్నూలు

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వినగన్ హాయిగ వార్తనున్ తనరుచున్ బీభత్సమే పారగన్
    తనువున్ మానసమందు హర్షమొలుకన్ తంటాలు తీరంగహా
    కనగన్ బుద్ధివిహీనుడైన వరునిన్ గయ్యాళి పూర్వంబుదౌ
    తన యర్ధాంగి వివాహముం గనుటకై తానేంగె నుత్సాహియై...

    రిప్లయితొలగించండి
  4. అనుజుడు పిల్చెనని వెడలె
    తన సతి పెండ్లిం గనుటకుఁ ; దానేఁగెఁ ద్వరన్
    ననుసరుని యింటికి నచట
    ననువగునని జీట్లపేక నాడుట కొరకై

    రిప్లయితొలగించండి
  5. ఘనరీతిన్ తన కొడ్కు పెండ్లి జరుపన్ కాంక్షించె నంబానియే
    తన యుద్యోగులకున్ వివాహ శుభపత్రంబిచ్చి యెల్గివ్వగా
    పనినిం జిక్కిన భర్తకిన్ బదులుగా బాధ్యత్వ ముప్పొంగగా
    తన యర్ధాంగి వివాహముం గనుటకై తానేంగె నుత్సాహియై౹౹

    రిప్లయితొలగించండి
  6. తను దమయంతిని విడి నలుఁ
    డని తెలుపక బాహుకునిగ నాతడు, రుతుప
    ర్ణునితోన్, చాటింపు వినగ
    తన సతి పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనూహించిన పూరణ మీనుండి వచ్చింది. బాగుంది. అభినందనలు.

      తొలగించండి

    2. బాగుందండి. కాని యది పెండ్లి కాదు స్వయంవరము మాత్రమే పెండ్లిగా పరిణమించను లేదు!

      సుదేవుం డయోధ్యానగరంబునకుం బోయి ఋతుపర్ణుం గాంచి ‘విదర్భాపురంబున దమయంతీ ద్వితీయ స్వయంవరం బెల్లియె యయ్యెడు’ నని చెప్పిన విని ఋతుపర్ణుండు బాహుకుం జూచి ‘నాకు దమయంతీ స్వయంవరంబుఁ జూడ నొక్క నాఁటన విదర్భకుం బోవలయు నీ యశ్వశిక్షానైపుణ్యంబుఁ బ్రకాశింపు’ మనవుడు ‘నట్ల చేయుదు’ నని నలుండు దన మనంబున దుఃఖించి. --భార. ఆర. 2. 164.

      తొలగించండి
  7. ఘనసౌందర్యపు రాశులో యనగ లోకంబందునన్ గానగా
    శనివక్రంబుగ జూచెనో, నలుని రాజ్యమ్మున్ సతిన్వీడుచున్
    తను నాబాహుకుడన్ననామమున వింతైదోచ చాటింపులే
    తన యర్ధాంగి వివాహముం గనుటకై తానేంగె నుత్సాహియై

    రిప్లయితొలగించండి


  8. పోతన, సతి అనే వారి కల్యాళము


    వినుకొండలోన జేసి టి
    ఫిను బస్సును వెదకి నెక్కి పెనిమిటి తోడై
    హనుమానుజంక్షనుకు "పో
    తన-సతి", పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. తనసతి ప్రేమలబడయగ
    తనసతి చేకొనె నెరుగక తాపము నొందన్
    తనసతి ప్రేమికునొసగగ
    తన సతి పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్!

    రిప్లయితొలగించండి
  10. తనసతిసోదరిపెండ్లికి
    తనపుట్టింటికిజనినదితదుపరిదినమం
    దునపెండ్లికిరమ్మనగా
    తన సతి, పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్

    రిప్లయితొలగించండి
  11. ఘనముగ చేతురు పె౦డ్లిని
    మనమేగి చూతము వారి మహనీయతలన్
    వినవేయనగా రానన
    తన సతి పె౦ధ్లిన్ గనుటకు తానేగె త్వరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం రెండవ గణం జగణమయింది. "మనమేగి కనవలె వారి..." అనండి.

      తొలగించండి
  12. సమస్య :-
    "తన సతి పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్"

    *కందం**

    వినినంతనే విషయమును
    కనులందున సంబరమ్ము కళకళ లాడెన్
    మనుమని వివాహము జరుగగ
    తన సతి,పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్
    ...................✍️చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అన్వయదోషమున్నది. "మనుమని గన తోడై రా తన సతి..." అనండి.

      తొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    మనవాడయ్యు కనీసమెప్పుడయినన్ మాట్లాడెనా? ., నేడు ర...
    మ్మని యీ పత్రికనివ్వగా దగుదునమ్మా! యంచు పోరాదనన్
    వినవే! నల్గురు నవ్వి పోయెదరు రావే! యంచు కోరంగ., రాన్
    తన యర్ధాంగి., వివాహముం గనుటకై తానేగె నుత్సాహియై"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  14. వనమున వేపకు ,రావికి
    ఘనముగ లగ్నము నుసేయ గదిలిరి విబుధుల్,
    ననుకూలముగాదనయయు
    తన సతి పెండ్లిం గనుటకుఁదానేఁగెఁ ద్వరన్

    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తన ననుసరింప దనయయు..." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. వనమున వేపకు ,రావికి
      ఘనముగ లగ్నము నుసేయ గదిలిరి విబుధుల్,
      తన నను సరింప దనయయు
      తన సతి పెండ్లిం గనుటకుఁదానేఁగెఁ ద్వరన్

      కొరుప్రోలు రాధాకృష్ణారావు

      తొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మునుపు విడాకులు నొందియు
    తనను విడిచిపెట్టినట్టి దారయె నిపుడున్
    మనువాడుచుండ పూర్వపు
    తన సతి పెండ్లిం గనుటకుఁదానేఁగెఁ ద్వరన్

    తనచెలి నింటికి నేగెను
    తన సతి పెండ్లిం గనుటకుఁ; దానేఁగెఁ ద్వరన్
    అనుసారులతో మద్యము
    ఘనముగ పానము చలిపెడి కాంక్షను గూడన్.

    రిప్లయితొలగించండి

  16. ( చీరలు నగలు లేవు అని భార్య అంటె భర్త రమ్మని వేడుకొను సందర్భము )

    మత్తేభము:

    వినుడో పెన్మిటి!పట్టుచీర , నగలున్ బ్రేమార గొన్పెడ్తివే??

    కని నన్నున్ దెగ నవ్విపోదురు గదా కళ్యాణ మందంచనన్...

    వినవే!రానన మంచిదౌనె ? యని దా వేడంగనే..,తోడు రాన్

    తన యర్ధాంగి..,వివాహముం గనుటకై తానేంగె నుత్సాహియై


    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷



    రిప్లయితొలగించండి


  17. పనపాకమెక్కడుంది ? హనుమాన్ జంక్షనెక్కడుంది లంకెలేసు కుంటూ వృత్తము గోలు గోలు గా చుట్టుటయే కదా జిలేబి యనగా :)



    "పనపాకంబున చిన్ననాటి చెలి! యాప్యాయమ్ముగా బిల్చె,నా
    హనుమాన్ జంక్షను పట్టణమ్ము పదవయ్యా" చెప్పగా పేర్మితో
    తన యర్ధాంగి, వివాహముం గనుటకై తానేగె నుత్సాహియై,
    తనసంగాతి కొమర్తె పోవలెను ప్రాధాన్యమ్ము తోడై కదా!



    హమ్మయ్య!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. పని యొత్తడి వలన జనులు
    మనమున మరచుట సహజము మరి యయ్యెడ నా
    దినము జరుగు నది తెలిపెను
    తన సతి ' పెండ్లిం గనుటకు దానేగె త్వరన్

    రిప్లయితొలగించండి
  19. కనుమా మారెను కాలమివ్విధిని లోకంబందు బంధమ్ములున్
    విను మామెన్ గని బెండ్లి యాడె నతడా ప్రేమాతిరేకమ్మునన్
    చనెనా ముచ్చట మూడునాళ్ళ వరకే చాలంచు వేరై రికన్
    తన యర్ధాంగి వివాహముం గనుటకై తానేగె నుత్సాహియై

    రిప్లయితొలగించండి
  20. 10.07.2020
    అందరికీ నమస్సులు🙏

    *కం*

    వినదది నా మాటలనుచు
    యనుకొని తా నడిగినపుడు రానని తానే
    విను నా పల్కుల ననగా
    *"తన సతి, పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  21. వినుడిది మరి మరి బిలిచిరి
    పని గలదను సాకు వలదు పదపదమంచున్
    జనవలె దప్పనిసరి యన
    తన సతి, పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్

    రిప్లయితొలగించండి
  22. వినయముగలదనెరాయుడు
    తనసతి,పెండ్లింగనుటకుదానేగెద్వరన్
    ననకాపల్లినిజరిగెడు
    తననేస్తపుకొడుకుకూతుతన్విదియగుటన్

    రిప్లయితొలగించండి
  23. కనగను రాముని పెండ్లిని
    చనెదము భద్రాద్రి కనుచు సంబరపడుచున్!
    కొనగను వెంటను జంటగ
    "తన సతి, పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్"

    రిప్లయితొలగించండి
  24. కనుటకుదమయంతినితను
    వినగనురెండవపెండ్లినివివరముఁదెలియన్
    గోనకోనినలుఁడేగెనుగా
    తనసతిపెండ్లిఁగనుటకుఁదానేగెవడిన్

    రిప్లయితొలగించండి
  25. చనెగారుక్మిణిరూపునున్నిలనుకంజాక్షీవిలాసంబునే
    వినగానామెయెలక్ష్మినచటతావైదర్భియైనుండెగా
    చనెగాక్రుష్ణుఁడుభూరితేజముననాచానన్హ్రుదిన్నిల్పుచున్
    తనయర్ధాంగివివాహముంగనుటకైతానేఁగెనుత్సాహియై

    రిప్లయితొలగించండి
  26. [09/07, 6:30 PM

    ఘనముగ పట్నము నందున
    పినతల్లి కుమారు నింట వేడుకతోడన్
    కనువిందుగ నగునంచును
    *తనసతి పెండ్లిన్ గనుటకు దానేగె ద్వరన్.*


    ఘనసౌందర్యపురాశియౌసిరికి నాకంసా రికిన్ పెండ్లనన్
    ఘనమౌ నుత్సుకతంబునన్ గనగ సింగారంబు నొప్పారగన్
    చనసంసిద్ధతజూపుచుండగను నాశంభుండుదల్చెన్ మదిన్
    *తన యర్ధాంగి వివాహముం గనుటకై తానేగె నుత్సాహియై"*

    రిప్లయితొలగించండి
  27. ఘనముగ భూషితయై ముఖ
    మున చిరు నవ్వొలుకు చుండ ముద్దుగ హర్ష
    మ్మునఁ గులుకుచుఁ దోడు నడవఁ
    దన సతి, పెండ్లిం గనుటకుఁ దా నేఁగెఁ ద్వరన్


    పను లెల్లం దగఁ బూర్తి సేసి వడిఁ బ్రాప్త చ్ఛంద యానమ్మునం
    దన భాగ్యమ్ముఁ దలంచి గుట్టడర నత్యంతమ్ము చిత్తమ్ము నం
    దున హర్షించి వివాహ మాడ సతికిం దోబుట్టు, మున్నేఁగఁగాఁ
    దన యర్ధాంగి, వివాహముం గనుటకై తానేఁగె నుత్సాహియై

    రిప్లయితొలగించండి
  28. వినయంబేతనమార్గమంచుమనునావైశాలియేభీమునూ
    తనయర్ధాంగి,వివాహముంగనుటకైనేగెనుత్సాహియై
    యనకాపల్లినిచావడిన్జరుగునాయార్యాసురేఖాలకున్
    వినుమాయార్యుడుమంచినేస్తముగయీభీముండునెక్కాలమున్

    రిప్లయితొలగించండి
  29. పెండ్లికి పోయే హడావిడిలో భార్యా భర్తల మాటల సందర్భము:

    మ:

    వినుమా వేగమె పోవ నెంచితిమి రావేలన్ సదా జాగుయే;
    కొనసాగన్ హవణింపు సొంపులును నీకూకల్నెపంమ్మేమిటో;
    కనగా నెచ్చెలి రూపమున్ మిగుల సింగారింపనాశ్చర్యమున్
    తన యర్ధాంగి ! వివాహముం గనుటకై తానేగె నత్సాహియై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  30. వినుమో వారలు నాకునాప్తులు కడున్ ప్రేమాభిమానంబుతో
    మనయింటన్ దిగి కూతు బెండ్లికిదె రమ్మా యంచు బిల్వంగ వెం
    టనె మీవెంటనె నేనటంచు బలుకన్ భార్యానురక్తుండునై చెం
    తన యర్ధాంగి,వివాహముం గనుటకై తానేఁగె నుత్సాహియై

    రిప్లయితొలగించండి
  31. కందం
    కనువిందౌ కూర్పులతో
    మనువొకటన తీర్చి నాను మండపమనుచున్
    వినజెప్ప వృత్తిమొదలిడి
    తన సతి, పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్

    మత్తేభవిక్రీడితము
    కనువిందౌ సరళిన్ వివాహమున సింగారాలఁగూర్చం గ మీ
    రను కూలమ్ముగ నొప్పి పెట్టుబడికై యంగీకరించన్ దగన్
    ధనమున్ గూర్చఁగ వృత్తిలో మొదటిదౌ తత్కార్య మీనాడనన్
    దన యర్ధాంగి, వివాహముం గనుటకై తానేఁగె నుత్సాహియై

    రిప్లయితొలగించండి
  32. అనబోకుము వలదనుచును
    వినుమా నామాటలికను విజ్ఞత తోడన్
    జనవలె ననుచును పోరగ
    తనసతి, పెండ్లింగనుటకు దానేఁగెఁ ద్వరన్.

    రిప్లయితొలగించండి
  33. జనసమ్మూహము చేరకూడ దనుచున్ జాగ్రత్త లెన్నింటినో
    మనసర్కారది చెప్పినన్ వినక నే మాత్రమ్ము చింతింపకన్
    తనవారంచును తప్పదంచు కడు సంతాపమ్ముతో కోరగా
    తన యర్ధాంగి, వివాహముంగనుటకై తానేగె నుత్సాహియై.

    రిప్లయితొలగించండి
  34. కనవో నేడిట జానకీ సుదతికా కౌసల్యకున్ బుత్రుతో
    ఘనమౌ పెండిలి వేడ్కగాజరుగు లగ్నంబే సమీపించెనే
    యని సంభారములన్ బిరానగొని సౌహార్ద్యంబుతో వెంటరా
    దన యర్ధాంగి,వివాహమున్ గనుటకై తానేగె నుత్సాహమున్

    రిప్లయితొలగించండి