20, జులై 2020, సోమవారం

సమస్య - 3432

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె"
(లేదా...)
"పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్"

50 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    December 2018:

    చల్లగ నుండకాంధ్రమున జంబము జూపుచు మీసమెత్తుచున్
    చెల్లియొ చెల్లకో ఘనుడు చిక్కగ నోటిని హైద్రబాదునన్
    గొల్లున నాయుడేడ్వగను గొప్పగ శేఖరు డాడెనివ్విధిన్: 👇
    "పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్"

    రిప్లయితొలగించండి
  2. గణపతికిఁ జతుర్థి తిథిఁ బ్రగాఢ భక్తి
    మోదకంబుల నైవేద్యముఁ గుడుపంగఁ
    దినగ దూరె బిడాలము! గని తరుమఁగ
    పిల్లినిన్, మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె!

    రిప్లయితొలగించండి
  3. దేశ రాజధానిలో కేజ్రివాల్

    కాంగిరేసు పాలనమును కాలరాచి
    ఖేలు ఖతమొనర్చి చిరుత కేజ్రివాలు
    కుటిల కుహనవాదులగు నా గోడమీది
    పిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఖేల్, ఖతమ్' అన్నవి అన్యదేశ్యాలు కదా!

      తొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    Tom & Jerry:

    పిల్లియె వేచియుండగను భీష్మపు రీతిని పట్టుబట్టుచున్
    చల్లని గాలినిన్ తనరి చక్కగ తూగగ కల్గుచెంతనున్...
    మెల్లగ ప్రాకి మేయగను మేలగు జున్నును; మోసగించుచున్
    పిల్లిని; మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్

    రిప్లయితొలగించండి
  5. సమస్య :-
    "పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్"

    *కందం**

    కబురందిన వెంటనె గబ
    గబ పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొ
    చ్చె బిలమ్ములోనికిన్, దబ
    దబ కీచకుని చిదిమెను గదా! భీముడిలా
    .......................✍️చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ కందోత్పల పూరణ బాగున్నది. అభినందనలు.
      'భీముడిలా' అనడం వ్యావహారికం. *భీము వలెన్* అనండి.

      తొలగించండి
  6. ఇంత భారీ శరీరము నెరిగి గూడ
    భయపడక పలురీతుల బాధబెట్టి
    కనబడక బారిన క్రిముల గనగ దోచు
    బిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె

    రిప్లయితొలగించండి
  7. భీతిని గొలుపుచు మహిపై పూతన పడ,

    బాల కృష్ణుని‌ ఘనమగు లీల కాంచి

    పల్లె లోని వారెల్లరు పలికె రిటుల

    "పిల్లినిన్ మ్రింగి‌ యాఖువు బిలము జొచ్చె."

    రిప్లయితొలగించండి


  8. మంచి వాడివయ శకార! మాకొక కథ
    చెప్పు మయ్య వినెదమిదె చెవుల నొగ్గి
    "పిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె
    బల్లి మ్రింగెను దానిని పసదనముగ"



    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. కందోత్పల


    కబలనపు కథ వినుడి గబ
    గబ పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొ
    చ్చె బిలమ్ములోనికిన్, తృటి
    ని బల్లి యొకటి తినె దానిని గుటుక్కు సుమీ


    జిలేబి

    రిప్లయితొలగించండి


  10. ఉల్లము ఝల్లనంగ కథ నొక్కటి చెప్పె శకారు డయ్య నా
    పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్
    కిల్లల బల్లి యొక్కటి టకీల్మని వెంబడి తోక లాగుచున్
    వెల్లకి లంగ ద్రోసె భళి వేటరి యొక్కడు దూరెనప్పుడే



    ఆ తరువాతేమయింది ? వచ్చే వారము చిన్ని తెర పై చూడండి :)
    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. కుంభ కర్ణుడు రాముని చేతిలో చనిపోయాడు అని వార్త తెచ్చిన వానితో రావణుడు పలుకు మాటలు


    తల్లడ మొందుచుండెమది తప్పుడు వార్తను తెచ్చినారుగా

    కల్లయె గాదుగా పలుకు,కాంచగ సాధ్యము కాదు నుర్విలో

    పిల్లిని మ్రింగి మూషకము వేగమె జొచ్చెబిలమ్ము లోనికిన్

    చెల్లని మాట లెప్పుడును చెప్పగ రాదని రావణుండనెన్

    రిప్లయితొలగించండి
  12. తమ్ము నడుగ౦గ నెవరికి దమ్ము కలదు
    నేత లగుచును తెగమి౦గి వెతలన౦ది
    నేడు శిక్శల పాలౌచు వేడుకొనుచు
    పిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె

    రిప్లయితొలగించండి
  13. కుడుములనుతినియాఖువు కునుకుదీయ
    కలనుగాంచెను కలలోనగానుపించె
    పిల్లియొక్కటి దరిచేర మెల్లగాను
    పిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె

    రిప్లయితొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    చల్లని మైత్రితో శునకసర్పమయూరబిడాలమూషికా..
    లెల్ల చరించు గౌతమమునీంద్రుని యాశ్రమసీమ., శాంతి శో...
    భిల్లగ గారెముక్క తినిపించుచునుండగ ప్రేమఁ జూచుచున్
    పిల్లిని., మ్రింగి మూషకము ., వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కదన మందున భీష్ముని కెదురు నిలచి
    కూలజేసె నల్పశిఖండి కుత్సితమున
    మానసించిన తోచును మనకు నిద్ది
    పిల్లినిన్ మ్రింగి యాఖువు బిలము జొచ్చె.

    రిప్లయితొలగించండి
  16. పంచదారపాకముతోడ పలువిధముల
    సాలభంజికలను జేయు సార్థకుడట
    యందమైన బొమ్మలఁ జేయ నందు నుండి
    పిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె

    రిప్లయితొలగించండి


  17. తే.గీ:పంచదార తోచేసెను పలురకాల
    ప్రతిమలనుసంకురాత్రికై పడతి యోర్తు
    వాసనపసిగట్టుచు వచ్చి వడివడిగను
    *పిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె"*

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    విల్లు పరిత్యజించునటు భీష్ముని జేసి రణమ్మునందునన్
    అల్లరితోడ మోసముగ నల్పుడు నైన శిఖండి తానటన్
    కల్లయెకాని చందమున కారణమయ్యెను గాంగుడొంగగన్
    పిల్లినిమ్రింగి మూషకము వేగమె జొచ్చె బిలమ్ములోనికిన్.

    రిప్లయితొలగించండి
  19. వంట యింటను నున్నట్టి వడలు తినగ
    దొంగ గా జేరి కాంచె తా దూర మందు
    పిల్లిని న్ ' మ్రింగి యాఖువు బిలము జొచ్చె
    చిక్క లేదని పిల్లి కి చింత గలిగె

    రిప్లయితొలగించండి
  20. కలను కుడుములదరి పిల్లికాపలుండె
    సామి గణనాయకుండిచ్చె సత్వమంత
    తానుననకొండగా మారె తక్షణంబె
    పిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె!

    రిప్లయితొలగించండి
  21. పిల్లల కోసమై కలిపి పిండిని బొమ్మలు జేసెనందులో
    పిల్లియు కోడి కొంగ పలు వింతగు రూపములెన్నియో భళా
    తల్లియు బేర్చి బొమ్మలను దానొక వంకకు మళ్ళెనంతలో
    పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్

    రిప్లయితొలగించండి
  22. పిల్లియె గాంచివచ్చెనట ప్రేమగ తల్లియె యిచ్చినట్టి యా
    బెల్లపు బూరెలన్ దినుచు పిల్లలు ముక్కలు పారవేయగా
    నల్లది గోరి వచ్చుతరి యల్లరి మూకయె ప్రారద్రోలగా
    పిల్లిని, మ్రింగి మూషకము వేగమె జొచ్చెబిలమ్ము లోనికిన్.

    రిప్లయితొలగించండి
  23. ఎత్తుపైయెత్తువేయుటసేమమగుగ
    జిత్తుఁజూపుచునగ్రజునిచిత్తుఁజేసి
    చైనతనచేయిపైకెత్తిచేవఁదెలిపె
    పిల్లినిన్మ్రింగియాఖువుబిలముఁజోచ్చె

    రిప్లయితొలగించండి
  24. ఎత్తుపైయెత్తువేయుటసేమమగుగ
    జిత్తుఁజూపుచునగ్రజునిచిత్తుఁజేసి
    చైనతనచేయిపైకెత్తిచేవఁదెలిపె
    పిల్లినిన్మ్రింగియాఖువుబిలముఁజోచ్చె

    రిప్లయితొలగించండి
  25. 20.07.2020
    సమస్యా పూరణం

    నా పూరణ యత్నం 🙏

    *తే గీ*

    వైరసును ద్రోలి కించితు పైత్యమునను
    భయము నొందిన డ్రాగను పరుగులిడుచు
    వైరి దేశము వీడిన వైన మిటుల
    *"పిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె"*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  26. పంచదారతోమార్జాలప్రతిమజేయ
    చుట్టుప్రక్కలదిరిగెడుచుంచుజూచి
    పిల్లినిన్ మ్రింగియాఖువుబిలముజొచ్చె
    జూచుచుండగక్షణమునచోద్యముగను

    రిప్లయితొలగించండి
  27. బల్లి నొకటి చూచె నెలుక పిల్లి చెంత!
    చంపి తిననెంచె బల్లిని సాహసముగ!
    ముప్పు కలుగక మెల్లగ తప్పు కొనుచు
    "పిల్లినిన్, మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె"

    రిప్లయితొలగించండి
  28. కళ్లములోని ధాన్యమును కావలికాయగ రైతుబిడ్డ డో
    పిల్లిని తెచ్చియుంచి కడు ప్రేమగ సాకుచు నుండ సాగె జా
    బిల్లి వెలుంగులోన కని పెల్లుగ గింజలు, కట్టివేయగా
    పిల్లిని, మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్

    రిప్లయితొలగించండి
  29. పిల్లులుమూషకంబులకువేటరులైచరియింప సాజమే
    కల్లలుకాదొకోభువిని గాంతుమెయెచ్చటనైన వింతగా
    పిల్లులవేటలోయెలుకవెళ్ళుట యీవిధి పల్కుటొప్పునే
    పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ము లోనికిన్

    రిప్లయితొలగించండి
  30. ఎవ్వరికి నే తరి నకట యెట్టి పగిది
    వచ్చు నాపద లేరికి వచ్చుఁ దెలియ
    దుముకఁ దనపైకిఁ గుప్పించి తూర్ణ మంతఁ
    బిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె

    [ఆఖువు = అడవి పంది; బిలము = గుహ; మ్రింగి = పొట్టన పెట్టుకొని]


    ఉల్లము హర్ష వేగమున నుప్పెన భంగినిఁ బొంగు చుండినన్
    మెల్లఁగ సంచరించుచును మేదిని నక్కట యంతఁ జిత్తమే
    తల్లడిలంగ సన్నగిల ధైర్యము దా గుటకల్, కనంగ నా
    పిల్లిని, మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్

    రిప్లయితొలగించండి
  31. చల్లగ మెల్లగాజనుచు చావడియందున గాంచివేడ్కతో
    తెల్లని మోదకంబులను తియ్యనియూహల దేలుచున్ దరిన్
    ఝల్లన యుల్లమే యడరి చక్కగగన్గొని కూర్కుపాటునన్
    పిల్లిని,మ్రింగి మూషికము వేగమెజొచ్చె బిలమ్ములోనికిన్
    చావడి = మండపము

    రిప్లయితొలగించండి
  32. కల్లలు జెప్పుటన్ననిదె గ్రద్దను మ్రింగెను పాము నింగిలో
    బల్లిని జూచి నొక్క శలబమ్మది మ్రింగెను గోడనెక్కుచున్
    నల్లియె మ్రింగె నవ్వుచును నక్కను జూచి వనంబులోన హే
    *పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్*


    పిల్లి యనంగ దేహమగు వెల్గులనీనెడి నాత్మ యెల్కయౌ
    తెల్లము భక్తి క్షీరమగు దేవతయౌను బిలమ్ము సోదరా
    తెల్లని పాలు ద్రాగి పరదేవతతోడ రమించి మించగా
    *పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  33. ఉ:

    అల్లరి దొమ్మలాట మధుపానము జూదము నొక్కటేమిటో
    యెల్లలు లేని రీతులన యేమరి చేష్టల రాటు దేలగన్
    మెల్లగ రాజకీయమున మెల్గుట నేర్వగ గాన వచ్చెనౌ
    పిల్లిని మ్రింగి మూషకము వేగమె జొచ్చె బిలమ్ము లోనికిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  34. అల్లదెచూడుమాయచటయాఖువుదూరెనునద్బుతంబుగా

    పిల్లినిమ్రింగి,మూషికమువేగమెజొచ్చెబిలమ్ములోనికిన్

    నల్లటిపిల్లినింగనగనంజరతోడనునొక్కసారిగా

    పిల్లులయోగిరంబరయవిఘ్నగణాధిపువాహనంబులే

    రిప్లయితొలగించండి

  35. పిన్నక నాగేశ్వరరావు.

    పిల్లలు బొమ్మలన్ గొలువుఁ బెట్టిరి తల్లులు
    ప్రోత్సహించగన్
    పిల్లులు,కుక్కలేనుగులఁ బ్రీతిగ తెచ్చిరి
    స్వీటుషాపులో
    పిల్లలు నాడిపాడుచును వేడ్కలు చేసియు
    నేగ నంతటన్
    మెల్లగ తిండికై వెడలి మీదను పెట్టిన తీపి
    బొమ్మయౌ
    పిల్లిని మ్రింగి మూషికము వేగమె జొచ్చె
    బిలమ్ము లోనికిన్.
    ************************************

    రిప్లయితొలగించండి
  36. అల్లన బొమ్మలాటకు సమంచిత రీతిన చెక్కరచ్చులున్
    బెల్లముతోడ జేసిన విభిన్న మనోహర కల్పనాకృతుల్
    పిల్లల సంతసంబునకు పెద్దలు జేసిరి తీపిబొమ్మయౌ
    పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్

    రిప్లయితొలగించండి
  37. తేటగీతి
    విఘ్ననాయకునకు వేది వేడుకలన
    పెక్కునైవేద్యమిడి కావఁ బిల్లినుంచఁ
    బట్టి యప్ప్రసాదము దాటి, పండి తూగు
    పిల్లినిన్, మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె

    ఉత్పలమాల
    అల్లన విఘ్ననాయకునకందరు మెచ్చఁగ వేదిదీర్చుచున్
    గొల్లగ తీపి వంటలను గూర్చి ప్రసాదము కావలుంచినన్
    జెల్లును వాహ్యవారసులుఁ జేకొన నంచును దాటి తూగు నా
    పిల్లిని, మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్

    రిప్లయితొలగించండి