21, జులై 2020, మంగళవారం

సమస్య - 3433

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము"
(లేదా...)
"తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా"

56 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    Mughal History:

    దమ్మున్ బట్టుచు నీతి చెప్పెదనయో దారా షికోవా గురూ!
    నమ్మంగోరుదు నాదు మాటనిపుడే నాదైన కుట్రన్ గొనిన్
    సమ్మానమ్ములనొంది రాజ్యమునహో సాధింప బోవంగ నీ
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      'కొనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
  2. అల్ప జీవితమ్ము నందహంకృతియేల?
    జానె డుదరమునకుఁ జాలు సుంత!
    స్వాంతమందుఁ జెలగు షడ్వర్గారులను సాం
    తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "షడ్వర్గ రిపుల సాం।తమ్ము..." అందామా?

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కమ్మంగానిక త్యాగపత్రమునయో గంభీర రూపమ్మునన్
    దుమ్మున్ డబ్బిని పారవేయుచు వడిన్ దుఃఖమ్మునున్ మాపగన్
    రమ్మున్ గ్రోలుచు నేడ్వకుండగనయో రాజీవ పుత్రుండ! పం
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా!

    రిప్లయితొలగించండి


  4. Mercy killing


    గుండెకాయ చూడ కొట్టుకొనుట తక్కు
    వాయె శ్వాస బీల్చ బరువు బరువు
    బతుక లేను వెజ్జు భారమాయెను జీవి
    తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. జీపీయెస్ వారికి నెనరుల్స్!!

      పొత్తంబెంతయొ నచ్చెను
      బెత్తంబట్టని‌ గురువుల పిరియమునకు రూ
      పెత్తిన నీరాజనమై
      మత్తిలు పద్యములతో సమాకర్షంబై!

      సెబాసో సప్తతి!



      జిలేబి

      తొలగించండి


  5. విదూషకుడు జనుల తరపున రాజు తో



    కొమ్మల్ పైనను వీధి గుమ్మములపై, క్రూరమ్ముగా జూచు దా
    హమ్మంచున్ క్షతజమ్ము కోరు జనులీయాతంకమున్ తాళలే
    రమ్మమ్మో ప్రభు! చేయిదాటెనిది మారామారి! టాటోటు భూ
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. కష్ట వేళలందు ఘనముగ జనులకు
    మంచి జేయగోరు మనుజులపయి
    మసలుజుండు నీదు మదినందలి దురాగ
    తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము

    రిప్లయితొలగించండి
  8. జనుల చ౦ప బుట్టి సాగుచు౦డె కరోన
    బైట తిరగలేము భయము భయము
    మాస్కు ధరియి౦చి నీచమైన యా భూ
    తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "మాస్కు దాల్చి నీచమై చెలరేగు భూ।తమ్ము..." అందామా?

      తొలగించండి
  9. మైలవరపు వారి పూరణ


    నెమ్మిన్ రక్తపుకూటినొప్పకుము., దుర్నీతిన్ హరింపన్ వలెన్!
    మమ్మున్ మా వెతలన్ రవంత మది సంభావింపగానొప్పు.,ద..
    ర్పమ్మున్ జూపుచు నిండుకొల్వు మనలన్ బంధించి బాధించు భూ...
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. శతృవుశేషమున్న శాంతియె మృగ్యమౌ
    హద్దులందునేడు హానిబెరుగు
    బుద్ధిలేనియట్టిబుద్బుదమైనభూ
    తమ్ముజంపిసదృశమ్ముగనుము
    +++++++++==++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  11. మిత్రులందఱకు నమస్సులు!

    [ప్రహ్లాదుఁడు తన తండ్రి హిరణ్యకశిపునితోఁ బలికిన సందర్భము]

    "తమ్ముం జంపిన యా హరిం దునిమెదన్ దండించెదం గాల్చెదం
    జు"మ్మంచుం బలుకంగ నేల నధిపా! చూడంగ నీ లోనఁ బం
    తమ్ముం బెంచుచు, హృత్స్థదుఃఖకరమై తర్జించు షట్ఛత్రుజా

    తమ్ముం జంపి, సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా!!

    రిప్లయితొలగించండి
  12. సత్య ధర్మ ములను సతతమ్ము పాటించి
    భేద భావ ములను విడిచి పెట్టి
    నిత్య నిర్మ లంపు నిష్ట తోడ చెడు చే
    తమ్ము జంపి స ద్యశమ్ము గొనుము

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అల విభీషణుడనె నన్న లంకేశుతో
    సీతను గొని రాము చెంత జేర్చు
    విరలి వీడి నీవు వికృతమునౌ దురాగ
    తమ్ము జంపి సద్యశమ్ము గొనుము.

    రిప్లయితొలగించండి
  14. ఆది దేవ నీవె యవనిలో జవమున
    చాప క్రింద పారు జలమునట్లు
    చేరి రుజల కూర్చి చెరచు కరోనభూ
    తమ్ము జంపి సద్యశమ్ము గొనుము

    రిప్లయితొలగించండి
  15. కట్టడిగనుసాగ కష్టమే బహునాళ్ళు
    గడిచె పార్మసి ఘనపాటవమున
    గట్టిమేలు టీక గనిపెట్టి కరొనభూ
    తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము!

    రిప్లయితొలగించండి
  16. అన్న! రావణా! దశాననా! నీ కవ
    మాన మొసగె నాదు మాన మడచె
    శీఘ్ర ముపశమిల్ల శ్రీరాము నాతని
    తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము౹౹

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. దశకంఠునికి మండోదరి హితవు.


    సీత వలయు ననిన పూతచరిత మీరు
    యుద్ధమందు గెలుడు పద్ధతినను,
    చోరవృత్తి తగదు వీర! మీరింక పం
    తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము

    రిప్లయితొలగించండి
  19. కొమ్ముల్జేర్చుచు భూతమై జెలగి సంక్షోభం బుసాగించగన్,
    నమ్ముండీమహి వైద్యశేఖరుల శ్రీనైపుణ్య సేవల్గనన్
    నమ్మా!శాంభవి శక్తిగా జెలగి బూనంగా రుజన్బాపి భూ
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా!

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  20. నమ్ము ముసుగు దొడగ నగుబాటు కాదయా
    సమ్మతమ్ము జన హితమ్మునదియె
    లెమ్ము దూరముండనిమ్ము, కరోన భూ
    తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము

    రిప్లయితొలగించండి
  21. సమ్మానమ్మున పృథ్విపైన మనుచున్ సత్బుద్ధి నిత్యమ్ము ద
    ర్పమ్మున్ వీడుచు పాలనమ్ములలి నిర్వర్తించుచున్, ప్రాజ్ఞులన్
    సమ్మోదమ్మున మెచ్చుచున్ హృదయమున్ శాసించు షట్చత్రు జా
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా

    రిప్లయితొలగించండి
  22. తనదు పొట్టలోన శివుని దాచి నట్టి
    మానుషాదుడితడు, దీర్ఘ మారుతమ్ము
    జంపి సద్యశమ్ము గొనుము శంభు వాహ
    కుండ ననుచు గరుడ వాహనుండు పలికె

    దీర్ఘ మారుతము = ఏనుగు

    రిప్లయితొలగించండి
  23. దొమ్మిన్ గోరకు రాజరాజ యదియే దుఃఖానికే హేతువౌ
    సమ్మానించుము నీదు భ్రాతలనుచున్ సచ్చీలుడా! నీదుక్షే
    మమ్మాశించుచు చెప్పువాడనుకదా మామాటలాలింపు, పం
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా!

    రిప్లయితొలగించండి
  24. సకలజనులనిరతిజంపుకరోనభూ
    తమ్ముజంపిసద్యశమ్ముగొనుము
    మనదికానిచోటమరుజన్మమెత్తియు
    దేశదేశములనుదిరుగుచుండె

    రిప్లయితొలగించండి
  25. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నమ్మంగోరుము నాదుమాట వినినో యన్నా! తమిన్ త్రేచి ద
    ర్పమ్మున్నిప్పుడె వీడి జానకిని శ్రీరామున్ దరిన్ జేర్చుమా!
    తమ్ముండౌనగు నీవిభీషణుని వాత్సల్యంబుతో దల్చి పం
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా!

    రిప్లయితొలగించండి
  26. శకుని ధృతరాష్టృనితో -

    సమ్మోదక్రియఁ పాలనమ్ము కొరకై సాధించుమా హస్తినన్
    లెమ్మా ఖడ్గము శూలమున్ ధనువునున్ లీలన్ గదం బూని, తీ
    వ్రమ్మై భీషణమైన సంగరమునన్ పాండవ్యవంశమ్ము సాం
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా!

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  27. మమ్ముంరక్షణజేయుపద్ధతియిదేమాయీకరోనామభూ
    తమ్ముంజంపిసుకీర్తిచంద్రికలనందంగదగున్భూవరా
    సమ్మోదంబగుమాకునట్లయినచోసద్బుద్ధిగావించుమా
    య మ్మౌశార్వరికాచునిన్నికనుదాహర్షాతిరేకంబునన్

    రిప్లయితొలగించండి
  28. సంఘజీవివీవుసర్వుల శ్రేయము
    కొరకుపాటుపడుట కొఱతగాదు
    చీడసంఘమందు జేర చేటగుసత
    తమ్ముఁ , జంపి సద్యశమ్ముఁ గొనుము

    రిప్లయితొలగించండి
  29. సమ్మాన్యంబుగ వేద శాస్త్ర విధులాచారంబులన్ దాల్తువే
    లెమ్మో రావణ యేల నేడిటుల దుర్నీతుండవై సాధ్వి సీ
    తమ్మన్ దెచ్చితి వీవు వీడుమిక మోహావేశమా కామ భూ
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా

    రిప్లయితొలగించండి


  30. పిన్నక నాగేశ్వరరావు.
    ( భీష్ముడు చివరిగా దుర్యోధనునికి
    చేయు ఉద్బోధ.)

    శాంత చిత్తుడవయి సుంత యోచింపుము
    పోరు నష్టమెపుడు పొందు మేలు
    పుత్ర! యిప్పుడైన మూర్ఖతన్ వీడి పం
    తమ్ముఁ జంపి సద్యశమ్ము గొనుము.

    రిప్లయితొలగించండి


  31. పిన్నక నాగేశ్వరరావు.
    ( భీష్ముడు చివరిగా దుర్యోధనునికి
    చేయు ఉద్బోధ.)

    శాంత చిత్తుడవయి సుంత యోచింపుము
    పోరు నష్టమెపుడు పొందు మేలు
    పుత్ర! యిప్పుడైన మూర్ఖతన్ వీడి పం
    తమ్ముఁ జంపి సద్యశమ్ము గొనుము.

    రిప్లయితొలగించండి
  32. నమ్మంగాదగదెన్నడేని భువిలోనారీజనాహ్లాదమున్
    వమ్ముంజేసెడికీచకాధములయా వక్రంపు, దుర్మార్గ నై
    జమ్ముంగన్గొని, శిష్టరక్షణకు రాజ్యంబందు రెచ్చిల్లు భూ
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా

    రిప్లయితొలగించండి
  33. పుత్ర కనుమ సుఖము పొత్తు మే లగు వారి
    భాగ మెల్ల వీడి పగను వారి
    కి నిఁకఁ బంచి దేనికిఁ బనికి రాని పం
    తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము


    తమ్ముండైనను నన్నయైనను మహా దండంబు సాగించి ప్రాం
    తమ్మంతం బగలం బ్రతిక్రియల విధ్వంసంబు గా నీక శాం
    తమ్ముం జిద్రము చేయునట్టివి త్వదంతశ్శత్రు బంధాల మొ
    త్తమ్ముం జంపి సుకీర్తి చంద్రికల నందంగం దగున్ భూవరా

    రిప్లయితొలగించండి
  34. ఆ.వె.
    కపట తనమనునది కనరాని దయ్యము
    అదుపు జేయ వచ్చు నభ్యసాన
    అంత మొంద కపట మంతర్మ దమను భూ
    తమ్ము జంపి సద్యశమ్ము గొనుము
    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  35. 21.07.2020

    నా పూరణ యత్నం 🙏

    *సరదా పూరణ*

    గొడవలాపు మింక గోలను జేయకు
    పతిని దెల్పు చుండ పడదు నీకు
    వలదు మాకు నిటుల వాదింప సూర్య కాం
    *"తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము"*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  36. మరచిపోతి వేమొ మగువ ద్రౌపదికట
    మానహాని జేయ పూనుకొనిన
    దుష్టులైనయట్టి దుర్యోధనుని వాని
    తమ్ము జంపి సద్యశము గనుము

    ఝుమ్మంచున్ ప్రబలెన్ కరోన వడిగా జుట్టేయుచున్ లోకమున్
    దమ్మున్ జూపుచు దా బ్రజాళి నడచన్ దాక్షిణ్యమే లేకయే
    సమ్మానించగ శ్రేష్ఠమైన విధమున్ సద్యౌషధిన్ దుష్ట భూ
    తమ్ముంజంపి సుకీర్తి చంద్రికల నందంగం దగున్ భూవరా!


    రిప్లయితొలగించండి
  37. యజ్ఞసంరక్షణార్థము శ్రీరామునితో విశ్వామిత్రుడు పలుకుతున్నట్లుగా..........

    మమ్మున్ రక్షణజేయుమంచు వరసన్మౌనివ్రజంబంతయున్
    నెమ్మిన్ నీ పదపంకజంబుగొని నెన్నే దిక్కుగానెంచె న
    స్త్రమ్ముల్ చేకొని ధీరుడై నిలచి పంతంబూని యా దైత్యజా
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా"

    రిప్లయితొలగించండి
  38. ఆటవెలది
    పలుకు వారు గలరు పరమాత్మలేడంచు!
    నక్కరోన యునికి ననఁగఁ దరమె?
    శాస్త్ర వేత్తలార! సరియౌషధాన భూ
    తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము!

    శార్దూలవిక్రీడితము
    కొమ్ముల్బుట్టగ మేనిచుట్టు ప్రజలన్ గుమ్మంగ జృంభించుచున్
    చిమ్మెన్ క్ష్వేళము నక్కరోన వడి నిర్జించెన్ జనాళిన్ వివే
    కమ్మెంతున్నను నిల్వరించఁదగు సంకల్పంబు మృగ్యమ్మె? భూ
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా!

    రిప్లయితొలగించండి
  39. కమ్మంగా లలి బాటబాడుచునహో కల్యాణిరాగమ్మునన్
    కెమ్మోవిన్ నునులేత నవ్వులను సంకేతమ్ముగా రువ్వుచున్
    సమ్మోహింపగ కన్యకామణి త్వరన్ సద్యోవికారంపు జా
    తమ్ముల జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా!

    రిప్లయితొలగించండి
  40. సీతాపహరణము చేయబోవు రావణుడితో మండోదరి హితోక్తులు:

    తమ్మీరీతిన వంచనల్ సలిపి సీతన్ పట్ట నూహింపగా
    సమ్మోదం బగునే మదీశ! విడుమా! సద్బుద్ధినన్ సాగుమా!
    నెమ్మిన్ గోరి వచించుచుంటి నిలుమా నీవింక ప్రాణేశ! పం
    తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా!

    రిప్లయితొలగించండి
  41. కట్టడిగను సాగ కష్టమే బహునాళ్ళు
    గడిచె పార్మసి ఘనపాటవమున
    గట్టిమేలు టీక గనిపెట్టి కరొనభూ
    తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము!

    రిప్లయితొలగించండి