30, జులై 2020, గురువారం

సమస్య - 3442

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కమలాక్షుఁడు విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై"
(లేదా...)
"కమలాక్షుండు విషమ్ముఁ గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్"

55 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    కమలమ్మున్ గొని భాజపా గుఱుతుగా గంభీర నాదమ్ముతో
    తిమిరమ్మందున ఖడ్గమూని తనరెన్ దీదీని కవ్వించగన్
    సమమౌ యుద్ధము గాంచి వంగముననున్ సాక్షాత్తుగా భీతుడై
    కమలాక్షుండు విషమ్ముఁ గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్

    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కమలాలయను వరించెను
    కమలాక్షుడు; విషముగ్రోలె గద శుభకరుడై
    ప్రమథాధిపతియె దివిజుల
    సమయోచిత నుతులనెంచి సంతోషముగా.

    రిప్లయితొలగించండి
  3. తమను తలగాచఁ గోరగ
    కమలాక్షుఁడు, విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై
    ప్రముదమ్మున శివుడా స
    ర్వమంగళయు నొప్ప దాళిబలుపెఱిఁగినదై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాళి బలమెఱిఁగినదై' అంటే బాగుంటుందేమో? బలుపు కంటె బలము మంచి పదం కదా!

      తొలగించండి
  4. రమణీయాతివరూపమందొదవి సుత్రాముణ్ణి రక్షించె శ్రీ ;
    విమలాంగుండుమనాథుడాపదలలో వేల్పుల్విశోకింప తా ;
    కమనీయాకృతరూపులీ హరిహరుల్ కారుణ్య మూర్తిద్వయుల్
    కమలాక్షుండు , విషమ్ము గ్రోలెనఁట , లోకక్షేమముం గోరుచున్.

    రిప్లయితొలగించండి
  5. తిమిధామము జిల్కు నపుడు
    కమఠమ్మైకాచెగాదె, గౌరీవరుడే
    తిమిరసమ హాలహలమను
    కమలాక్షుడు, విషముగ్రోలె గద శుభకరుడై

    తిమిధామమ్మును దేవరాక్షసులహో
    తీవ్రమ్ముగా జిల్కగా
    కమఠమ్మై గిరిక్రిందజేరి కుదురై కవ్వమ్ము నిల్పంగ నా
    కమలాక్షుడు, విషమ్ము గ్రోలెనట లోకక్షేమమున్ గోరుచున్
    సుమనోహారుడు గౌరికిన్ బతి భళా!
    శోభాయమానంబుగా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కమలాక్షుండు' టైపాటు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

      తొలగించండి

  6. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పాపము శమించుగాక!

    విమలమ్మౌ నొసటందునన్ తిలకమున్ వీర్యమ్ముతో నూనుచున్
    సమమౌ జంద్యముదాల్చి యెన్నికలనున్ జంబమ్ముతో పోరుచున్
    కుములంగా మన రాహులుండు వెతలన్ క్రుద్ధుండునై; ...గెల్వగన్
    కమలాక్షుండు;...విషమ్ముఁ గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్

    కమలాక్షుడు = narendra DAMODAR modi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      'నొసటియందు' అనడం సాధువు. "నొసటన్ దగన్ దిలకమున్..." అనండి.

      తొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తిమినిన్ జిల్కెడివేళ బుట్టిన రమాదేవిన్ వరించెన్ గదా
    కమలాక్షుండు; విషమ్ము గ్రోలెనట లోకక్షేమముం గోరుచున్
    హిమజానాధుడు దేవతల్ తెలచగా నిష్టంబుతో నప్పుడున్
    క్రమమౌ మార్గము కూడుచున్ యమృతమే గల్గెన్ గదా గొప్పగా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కూడుచున్+అమృతమే' అన్నపుడు యడాగమం రాదు. "కూడగా నమృతమే" అనవచ్చు.

      తొలగించండి
  8. అమరులకు బంచె నమృతము
    గమలాక్షుఁడు , విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై
    కామారి వేగిరముగా ,
    సముద్ర జనితల నటులనె సలిపిరిరువురున్

    రిప్లయితొలగించండి


  9. అమరగ చిరునగవులతో
    కమలాక్షుఁడు, విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై
    ప్రమథాధిపుడు జిలేబీ
    సమవుజ్జీలిరువురున్ను సాధించుటలో


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. కె.వి.యస్. లక్ష్మి:

    కమలప్రియ దాసుడె మరి
    కమలాక్షుడు; విషముగ్రోలె గద శుభకరుడై
    హిమజానాధుడు నమరుల
    విమలంబౌ స్తుతుల నెంచి ప్రీతిని జూపన్

    రిప్లయితొలగించండి

  11. * శంకరాభరణం వేదిక *
    30/07/2020...గురువారం

    సమస్య
    ********
    కమలాక్షుండు విషమ్ము గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్

    నా పూరణ. మత్తేభము
    *** ********

    అమృతమ్మే కుడుచన్ సురారులు సురల్ యంభోనిధిన్ ద్రచ్చ..,సం

    ద్రము శ్రీ యీయగ దొల్లి సర్వులు గడున్ దాపంబునొందంగ నా

    భ్రమరాంబేశ్వరుడే జగమ్ములను గావన్.., విన్నవించంగ నా

    కమలాక్షుండు.., విషమ్ము గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్

    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "అమృతమ్మే గుడువన్" అనండి. 'సురల్ + అంభోనిధిన్' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  12. సమముగ తెలిసిన వారికి
    కమఠుడు నా గరళక౦ఠు కానరు భేదమ్
    సమతను పలుకగ వచ్చును
    కమలాక్షుఁడు విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భేదమ్' అని హలంతంగా వ్రాయరాదు. "కన రంతరువుల్" అనండి.

      తొలగించండి
  13. నిన్నటి పూరణ

    సతి లేదందురు కొందరీ హనుమకున్ సత్యమ్ము కాదంచు త
    త్ప్రతివాదుల్ ప్రవచింత్రు భక్తసులభున్దాక్షిణ్యభావాన్వితున్
    సతతధ్యానతదేకమగ్నమతినై సామీరిదైవమ్ము శ్రీ
    మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  14. కం//
    సమలంకృత లక్ష్మినిగొనె
    కమలాక్షుఁడు, విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై l
    న మహేశుడు, శుభ వేల్పుల
    గమిగాడైరావతమును గ్రక్కున గొనియెన్ ll

    రిప్లయితొలగించండి
  15. మైలవరపు వారి పూరణ

    అమరుల్ భీతినిపొంద గాంచుచునటన్ హాలాహలజ్వాలఁ., దా
    నుమయే ప్రక్కనజేరి కొమ్మనుచు ధైర్యోక్తుల్ వచింపంగ., వి..
    భ్రమతన్ శంకరుడెత్తి., మేలనగనింద్రాదుల్ రమానాథుడౌ
    కమలాక్షుండు., విషమ్ముఁ గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  16. తిమిధామమ్ము మధింపగ
    కమలాలయయు చవుదంతి గరళము పుట్టన్
    ప్రమథాధిపతిని వేడగ
    కమలాక్షుఁడు, విషముఁ గ్రోలెఁ గద శుభకరుడై.

    రిప్లయితొలగించండి

  17. అమృతమ్మే గుడువంగ ద్రచ్చ ఘనమౌ యబ్ధిన్ సురల్ దైత్యులున్..,

    తిమిధామమ్మె విషమ్ము నీయ గడు భీతిన్ జెందగన్ సర్వులున్

    భ్రమరాంబేశ్వరుడే జగమ్ములను గావన్.., విన్నవించంగ నా

    కమలాక్షుండు.., విషమ్ము గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్

    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷





    రిప్లయితొలగించండి
  18. తమ పఱపు శేషుడాయెను
    తమనేస్తము గరళకంఠు, దారకుఁడతి మో
    దముగా విషకుచ యిడగా
    కమలాక్షుఁడు విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై.

    దారకుడు-బాలుడు
    విశకుచ-పూతన

    రిప్లయితొలగించండి
  19. కం.
    అమరులు తననర్థించగ
    నమలినవాత్సల్యపూర్ణు డగునా రుద్రుం
    డమితోత్సాహమునన్ గన
    గమలాక్షుడు, విషము గ్రోలె గద! శుభకరుడై.

    రిప్లయితొలగించండి
  20. ప్రమదమున గాచె గజమును
    కమలాక్షుడు : విషము గ్రోలె గద శుభ కరుడై
    విమలుడు రుద్రుడు గావగ
    మమ కారంబున జగముల మానితు డగుచున్

    రిప్లయితొలగించండి
  21. రమణీయంబగు దృశ్యకావ్యమున శ్రీరాగంబు శోభిల్లగా
    సమతారాగము పల్లవింపగను విశ్వాసంబు జేకూర్చుచున్
    యమునన్జేరుచు శంకరుండట ఘనశ్యాముండు విష్ణుండునై
    కమలాక్షుండు విషమ్ముఁ గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  22. కమఠముగా గిరిమోసెను
    కమలాక్షుడు, విషముగ్రోలెగద శుభకరుడై
    కమనీయ జగన్మోహిని
    భ్రమలో రాక్షసులుబడిరి, బాసిరిసుధయున్.

    రిప్లయితొలగించండి
  23. కమఠముగా గిరిమోసెను
    కమలాక్షుడు, విషముగ్రోలెగద శుభకరుడై
    కమనీయ జగన్మోహిని
    భ్రమలో రాక్షసులుబడిరి, బాసిరిసుధయున్.

    రిప్లయితొలగించండి
  24. కమలములబోలునేత్రుడు
    కమలాక్షుడు,విషముగ్రోలెగదశుభకరుడై
    యమరులుగిరిజయువేడగ
    బ్రమదముతోశంకరుండుభవ్యతగలుగన్

    రిప్లయితొలగించండి
  25. కమలాక్షుండువిషమ్ముగ్రోలెనటలోకక్షేమముంగోరుచున్
    నమలా!యేమనిబల్కుచుంటివిటయాకామారిమిత్రుండుగా
    నమరుల్ బార్వతివేడగానపుడదాహర్షాతిరేకంబునన్
    భ్రమరాంబాపతిద్రాగెనావిషమునింద్రాదాదులేమెచ్చగన్

    రిప్లయితొలగించండి
  26. అమరెను మంథర ధారిగ
    కమలాక్షుఁడు; విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై
    హిమజాపతి; సంకటముల
    దమ వంతుగ సాయపడుటె దైవత్వమనన్

    రిప్లయితొలగించండి
  27. అమృతమ్మున్ గ్రహియించ దేవతలు క్రవ్యాదుల్ కరంమైన యి
    చ్చమథించంగను మందరాచలము నుత్సాహమ్ముతోడన్ విషా
    స్యముఁ పగ్గమ్ముగ, భోగి క్రక్కవిషమున్ శంభుండు కోరంగ నా
    కమలాక్షుండు, విషమ్ముఁ గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్

    రిప్లయితొలగించండి
  28. కమనీ యోరగ భూషణ
    సుమనస్కుఁడు నిత్య పరమ శుచుఁడౌ శివుఁ డా
    యుమకుం బెనిమిటి, కోరఁగఁ
    గమలాక్షుఁడు, విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై


    అమృ తాకాంక్షులు ద్రచ్చ నంబుధిని రా హాలాహలం బక్కటా
    తము రక్షింప సురాలి వేఁడుకొనఁగం దాఁ బొందఁ, గీర్తించఁగాఁ
    బ్రమదస్వాంతులు కాలకంఠుఁ డని, సుప్రాశస్త్యముం ద్రిజ్వల
    త్కమలాక్షుండు విషమ్ముఁ గ్రోలెనఁట లోక క్షేమముం గోరుచున్

    [త్రిజ్వలత్కమలాక్షుండు = మూడు ప్రకాశించు కమలముల వంటి కన్నులు గలవాఁడు, శివుండు]

    రిప్లయితొలగించండి
  29. అమృతాసక్తులు దేవదానవులు తా మంభోధినిన్ జిల్కగన్
    రమయున్ వెల్లగజమ్ము హాలహలమున్ బ్రాలేయ భానుండటన్
    తిమిధామమ్మున వెల్వడన్ భయముచే దేవేశుడన్ వేడెనా
    కమలాక్షుండు, విషమ్ముఁ గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్.

    రిప్లయితొలగించండి
  30. కందం
    కమఠంబై గిరి మోయన్
    గమలాక్షుఁడు, విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై
    తిమిఁబొంగ సుధకు ముందుగ
    నుమ పనుపున శంకరుండు నుద్యుక్తుండై

    మత్తేభవిక్రీడితము
    తిమిఁ బొంగన్ గరళమ్ము నాశమని యుద్విగ్నంబులన్ బాపగా
    నుమ సర్వేశరుఁ గోరినంత రయమే యుద్యుక్తుఁడై, లోపలన్
    కమఠంబై గిరిమోయు మేటిదగు సంకల్పంబునందుండఁగన్
    గమలాక్షుండు, విషమ్ముఁ గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్

    రిప్లయితొలగించండి
  31. కం.

    సమవుజ్జీ లిరువురు నా
    ల మందల శరణు నగమును లఘుతన నెత్తన్,
    ప్రమధాధిపుడును వేడగ
    కమలాక్షుడు, విషము గ్రోలె గద శుభకరుడై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  32. ప్రమథాధీశుఁడు నిర్వికల్పుఁడు లసత్ప్రాజ్ఞుండు సర్వజ్ఞుఁడున్
    రమణీయాచల శృంగ గేహుఁడు మహోల్లాసుండు వేదార్థుఁడీ
    వె మహాదేవ త్రిలోకరక్షకుఁడటన్ వేడంగ నాశంకరున్
    కమలాక్షుండు, విషమ్ముఁ గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్

    రిప్లయితొలగించండి
  33. సమధిక ప్రోత్సాహమునిడ
    కమలాక్షుఁడు, విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై
    గమకించి త్రిభువనములకు
    నుమాధవుడుమేలుజేయునుత్సాహముతో

    రిప్లయితొలగించండి
  34. కమలజను పెండ్లియాడెను
    కమలాక్షుడు;విషము గ్రోలెగద శుభకరుడై
    హిమగిరి వాసుండచ్చట
    సముద్భవించగ విషమును సతివేడంగన్ .

    మరొక పూరణ

    సుమశర జనకుండెవరన
    కమలాక్షుడు;విషము గ్రోలెగద శుభకరుడై
    హిమజను పరిణయ మాడెన్
    సుమశరహరుడౌ పురారి సురవరు లొప్పన్

    రిప్లయితొలగించండి
  35. కమఠంబైకమలాక్షుఁడాయుదధిలోకవ్వంబుగా మందరన్
    అమరుల్ దానవులాదిశేషుని నగంబందూన్చి చిల్కంగనా
    సమయంబందుననుద్భవించెవిసమాసంద్రంబు నందున్ గనన్
    కమలాక్షుండు, విషమ్ముఁ గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్
    హిమజానాథుఁడుసర్వలోకములుపాహీయంచు ప్రార్థించగా

    రిప్లయితొలగించండి