31, జులై 2020, శుక్రవారం

సమస్య - 3443

కవిమిత్రులారా,
వరలక్ష్మీ వ్రత మహోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె పురుషు లిలన్"
(లేదా...)
"వరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్"

58 కామెంట్‌లు:

  1. తరుణులు శ్రావణమందున
    వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె, పురుషు లిలన్
    జెరుపుల నొందక పత్నులు
    వరల వలయునన సతీసుభగత సతతమున్

    రిప్లయితొలగించండి

  2. నడిరేయి సరదాపూరణ:

    వరమౌ భాగ్యపు శంకరాభరణమున్ పద్యమ్ములన్ వ్రాయుచున్
    దరహాసోక్తులు పల్కుచున్ ముదమునన్ ధారాళమౌ తీరునన్
    సరదా పూరణలూనగన్ నగవుచున్;...సంతోషమున్ దారలే
    వరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం;...బూరుషుల్

    రిప్లయితొలగించండి
  3. తరుణులు సౌభాగ్యముకై
    వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె; పురుషు లిలన్
    చిర యశమును సాధింతురు
    నిరతము హరి ధ్యానమందు నియమిత మతులై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సౌభాగ్యమునకు... నిరత హరిధ్యానమందు..." అనండి.

      తొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బరువౌ జీతపు జాబులూడగనయో బంజార హిల్సందునన్
    కరొనా రోజుల పూరుషుల్ దిగులునన్ ఖాళీగ కూర్చుండగా
    తరుణుల్ జేయగ వర్కుహోముననయో తాదాత్మ్యమై ఫోనులన్
    వరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్

    రిప్లయితొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సిరిసంపత్తులు కూడగ
    హరువుగ సతిసంతుతోడ నచ్చపు రీతిన్
    సరవిని పరికీర్తించుచు
    వరలక్ష్మీవ్రతము చేయవలె పురుషులిలన్.

    తరుణులు నైదు వరాలకు
    వరలక్ష్మీవ్రతము జేయవలె; పురుషులిలన్
    తరళేక్షణులకు ఘనముగ
    నెరవగుచు నుపాస్థులెల్ల నిగ్గించవలెన్.

    రిప్లయితొలగించండి

  6. వరసిద్దికి సతులెల్లరు
    వరలక్ష్మీ వ్రతము జేయవలె, పురుషులిలన్
    విరివిగ సమకూర్చవలెను
    సరకులు పరిపూర్తిజేయ సద్వ్రతము
    దగన్


    హరిదేవేరికి ప్రీతిపాత్రముగ నాహ్లాదమ్ముతో స్త్రీలిలన్
    వరలక్ష్మీవ్రత మాచరింపవలె, సద్భక్తిన్ దగం బూరుషుల్
    విరివిన్ గూర్చవలెన్ పదార్ధముల
    నైవేద్యమ్ము నర్పించగా
    పరివారమ్మును గూడి తోషమున దా భార్యామణిన్ మెచ్చుచున్!

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పరమౌ నైదు వరాలకై రమణులున్ ప్రాధాన్య మైనట్టిదౌ
    వరలక్ష్మీవ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం; బూరుషుల్
    నెరవై నుండుచు శ్రావణమ్మున తగున్నేర్పున్ కురంగాక్షులతో
    వరుస న్నోములు పట్టజేసి సుఖముల్ వర్థిల్లజేయం వలెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదం చివర గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారములు. దయతో సవరించిన పద్యాన్ని పరిశీలించండి.

      పరమౌ నైదు వరాలకై రమణులున్ ప్రాధాన్య మైనట్టిదౌ
      వరలక్ష్మీవ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం; బూరుషుల్
      నెరవై నుండుచు శ్రావణమ్మున చెలుల్ నేర్పున్ మహాలక్ష్మికిన్
      వరుసన్ పూజలొనర్చు పద్ధతుల నభ్యాసింపజేయంవలెన్.

      తొలగించండి


  8. అరయగ మహిళలు పేర్మిని
    వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె, పురుషు లిలన్
    త్వరితము బుద్ధి బడసి రాన్
    పరుగుల పరుగుల సతుల సపర్యల కొరకై


    శుభాకాంక్షలతో

    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. వరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్
    పరమాన్నంబు భుజించి పత్నుల కెడన్ వైవశ్యులై సేవలన్
    తరియింపంగ, సుఖమ్ములన్ బడయగా దర్పమ్ముతో తప్పకన్
    పరిణేతల్ తమ కొల్వులో వెలుగగా ప్రాణేశ్వరిన్ వీడకన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. నిరతము వీడక గృహమును
    పొరలాడుచు కాల మె౦తొ బోరను క౦టెన్
    సరసము లాడుచు సతితో
    వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె పురుషు లిలన్

    రిప్లయితొలగించండి
  11. తరుణులు శ్రావణమందున
    వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె ; పురుషు లిలన్
    పరువడి దప్పక వారికి
    పురురపు భూషణమునిచ్చి పొసగవలెగదా

    రిప్లయితొలగించండి
  12. తరుణీ మణులీ మహిలో

    వరలక్ష్మీ వ్రతముచేయవలె, పురుషులిలన్

    కరివదనుని గొలచుచు చున్

    సురుచిరమౌ వ్రతముచేయ శుభములు కలుగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కరివదనుని మది గొలుచుచు" అనండి.

      తొలగించండి
  13. తరుణులు శ్రావణ మందున
    వరలక్ష్శీవ్రతముఁ జేయవలె, పురుషు లిలన్
    హరిహరులను సేవించుచు
    చరియింపగ వలెను వారి సత్కృప కొరకై.

    రిప్లయితొలగించండి
  14. పరదైవమ్మని నిర్ణయించఁ బడె నాబ్రహ్మోక్తలోకమ్ములం
    దరయన్ శ్రీహరి, వాడె విశ్వజనకుం డాస్వామిపత్నిన్ నిరం
    తరసౌభాగ్యము నిమ్మటంచుఁ గొలువన్ త్వద్భార్యతోడన్ సుహృ
    ద్వర! లక్ష్మీవ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల

    రిప్లయితొలగించండి
  15. తరుణీమణు లెల్లరునిల
    వరలక్ష్మీ వ్రతము చేయవలె;పురుషులిలన్
    నిరతము సాయము చేసిన
    త్వరితముగా మాత మెచ్చి వరముల నొసగున్

    మరొక పూరణ

    కరుణను కోరుచు వనితలు
    వరలక్ష్మీ వ్రతము చేయవలె;పురుషులిలన్
    కరమతి భక్తిని బూనుచు
    కరములు జోడించ దయను కమలజ జూపున్.

    రిప్లయితొలగించండి
  16. అందరికీ నమస్సులు 🙏🙏

    31.07.2020

    నా పూరణ..

    *కం*

    తరుణులతో జేరిక, భళి
    కరొనా నిక ధరణి నుండి కాటికి బంపన్
    సరియగు భక్తిని నిల్పుచు
    *"వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె పురుషు లిలన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  17. వరపాండిత్యవిభూషితుండొకడు సర్వశ్రేయముల్ గోరుచున్
    ధరలో సంపదలున్ సమస్తసుఖముల్ ధాన్యాదికంబుల్ శుభం
    కరసద్యోగములందు మార్గము వినన్ గాంక్షించగా దెల్పె భూ
    వర! లక్ష్మీవ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్

    రిప్లయితొలగించండి
  18. కరుణాకరివరదాంబిక
    వరలక్ష్మీ ;వ్రతముఁ జేయవలె పురుషు లిలన్"
    తరుణీసహితాచ్యుతు శీ
    కరునిరతముమోక్షదాయకాభయునార్తిన్

    రిప్లయితొలగించండి
  19. వరమీయన్ గలిమాతయే యనెనుదివ్యజ్ఞానసంపత్తులున్
    హరిసాన్నిధ్యము భుక్తిముక్తులునిరోగాయుష్షునైశ్వర్యమై
    "వరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్; దగం బూరుషుల్"
    తరుణీక్షేమముగోరగావలెను తద్భాగ్యాంశలేశంబునై

    రిప్లయితొలగించండి
  20. తరమే నీ మహత్వము న్బొగడగా తల్లీ ! మహాలక్ష్మి ! నీ
    శరణమ్మౌ సకలార్థ సాధనములైశ్వర్యంబులున్గూర్చగన్
    తిరమై వెల్గగ దారతో గలిసి భూతిన్గూర్చ నీ పూజయౌ
    వరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్

    రిప్లయితొలగించండి
  21. ధరణీచక్రమునందుదుఃఖములునీదౌర్భాగ్యముందాటగా
    హరిసౌభాగ్యదభుక్తిముక్తిదవ్రతంబానందదైశ్వర్యదం
    బురుపుణ్యావ్యయమంచుదెల్పెమునుసమ్మోదంబునన్సల్పుభూ
    "వర!లక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్"

    రిప్లయితొలగించండి
  22. తరుణులుశుభములకొఱకై
    వరలక్ష్మీవ్రతముజేయవలె,పురుషులిలన్
    వరలక్ష్శిపూజకొఱకును
    దరుణులకున్సాయబడగదప్పదుసుమ్మీ

    రిప్లయితొలగించండి
  23. స్థిరచి త్తమ్మునుఁ బడయుచు
    నిరతము నమ్మకునుతోడు నీడగ నిలువన్,
    పరగుచు భార్యకు తోడై
    వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె పురుషు లిలన్

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  24. తరుణులు నిండగు భక్తిగ
    వర లక్ష్మీ వ్రతము చేయ వలె : పురుషులిల న్
    తిరమగు చిత్తమున సతుల
    మురి పపు కోర్కెల ను దీర్త్రు మోదము గూర్పన్

    రిప్లయితొలగించండి
  25. మైలవరపు వారి పూరణ

    శ్రీ మహాలక్ష్మ్యై నమః 🕉🙏💐💐

    వరకారుణ్యసుధారసాంబునిధి సౌవర్ణప్రభారాశి శ్రీ
    హరికిన్ బట్టపురాణి., నిర్జరనతాంఘ్ర్యబ్జద్యుతిన్ శ్రీ రమన్
    నిరతంబున్ భజియింప కల్గునిలలో నిత్యోత్సవంబుల్., సుహృ..
    ద్వర ! లక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  26. వరలక్ష్మీవ్రతమాచరింపవలెసద్భక్తిన్దగంబూరుషుల్
    వరమేయయ్యదియాలితోమగడుసద్భక్తిన్దగంబూజదా
    నిరతిన్జేయగనొప్పునియ్యెడలదోనీడంజమెల్గందగున్
    దరుణీ!వింటివెనాదుమాటలనుమద్భాగ్యంబుపెంపొందగన్

    రిప్లయితొలగించండి
  27. సిరులన్ బొందుతలంపు తోడుతను సుశ్శీలమ్ముతో ప్రీతితో
    స్థిరమౌ పూనిక యింతులందరును సంక్షేమమ్ము కాంక్షించుచున్
    వరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్, దగం బూరుషుల్
    కరమౌ ప్రేముడి చేయ సాయముల నాకాంక్షల్ సుసాధ్యమ్ములౌ

    రిప్లయితొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సిరిసంపత్తులు మెండుగా దలచుచున్ చెన్నైన పొంకమ్ముతో
    వరుస న్నిచ్చలు శ్రావణమ్ము ననువౌ వాటున్ సతిన్ గూడుచున్
    హరువౌ రీతిని పూజలే నడపుచున్నాకీర్తివంతంబునౌ
    వరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్

    రిప్లయితొలగించండి
  29. ఈరోజు శంకరాభరణం వారి సమస్యకు నా పూరణ
    31-07-2020

    వరుడై రాముడు జానకిన్ బరిణయం బాడంగ తాజేసెగాన్
    నరుడై పార్థుడు కృష్ణకై జలజ యంత్రాంగమ్ము భేదించెగాన్
    హరుడే గంగను మోయగా సలిపె మోహావేశమందున్ స్వయం
    వరలక్ష్మీవ్రతము+ఆచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్!

    రిప్లయితొలగించండి

  30. పిన్నక నాగేశ్వరరావు.

    తరుణులు శ్రావణ మాసపు
    వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె; పురుషులిలన్
    హరిహరులను సద్భక్తిని
    నిరతము సేవించవలయు నిర్మల
    మనమున్.

    రిప్లయితొలగించండి
  31. తరుణుల్ నీమము నిష్ఠ దోడ గడు శ్రద్ధాసక్తులై భక్తితో
    వరలక్ష్మీ వ్రత మాచరింపవలె; సద్భక్తిన్ దగం బూరుషుల్
    వరలక్ష్మిన్ మది నిల్పి గొల్వవలె సంభావ్యంబుగా నిత్యమున్;
    చిర సౌభాగ్య యశో వికాసమొసగున్ శ్రీమన్మహాలక్ష్మియే

    రిప్లయితొలగించండి

  32. పిన్నక నాగేశ్వరరావు.
    ( రెండవ పూరణము )

    సిరిసంపదలన్ గోరుచు
    వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె; పురుషులిలన్
    తరుణులకున్ గావలసిన
    సరుకుల సమకూర్చవలయు సఖ్యత
    వెలయన్.

    రిప్లయితొలగించండి
  33. హరిడెందమ్మున నిల్చియుండు రమనే యర్చింపగా నెంచుచున్
    దరుణుల్ శ్రావణ మాసమందు తమ సత్సౌభాగ్యమున్ గోరుచున్
    వరలక్ష్మీ వ్రత మాచరింపవలె, సద్భక్తిన్ దగం బూరుషుల్
    గరళమ్మున్ గళమందు దాచిన శివున్ గామారినే కొల్తురే.

    రిప్లయితొలగించండి
  34. ఉరువుగ నిజ చిత్తమ్ము ల
    లరంగ దృఢభక్తి నుంచి రాజ్యం బెల్లం
    బరఁగ ధనధాన్యముల భూ
    వర లక్ష్మీ వ్రతముఁ జేయవలె పురుషు లిలన్


    పురుషశ్రేష్ఠులు దేవ తార్చనలకుం బుణ్యాత్ములుం జాలరే
    పరమోదారులు పూర్వ కాలమున నంబా పూజలం జేయరే
    వరమాలన్ ధరియించి శుద్ధ హృదులై భార్యాద్వితీయస్థిరుల్
    వరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షీరా బ్ధ్యుద్భవ కన్యా
      నారీ లోకాభిపూజ్య నలి నావాసా
      నారాయణ వక్షోద్భా
      సా రామా లోక రత్న సామజ సేవ్యా


      పాథోధ్యుద్భవ వాసవానుజ కరాబ్జగ్రాహిణీ! పావ నా
      నాథత్రాణ సతీ! సరోజ దళ విన్యస్తేభ హస్త స్రవ
      త్పాథస్సిక్త నవీన పద్మ విలసద్ధస్తాబ్జ సమ్మోదినీ!
      గాథా గాన మనో వికాస ధనదా! కారుణ్య రాశీ! నతుల్

      తొలగించండి
  35. మ:

    సిరులన్ గూర్చెడు మాతకున్ సకల వైశిష్ట్యంబు నాచారమున్
    వరలక్ష్మీ వ్రతమాచరింపవలె సద్భక్తిన్ ; దగం బూరుషుల్:
    తరుణుల్ నిష్ఠగ; తోడుగా నిలిచి తాదాత్మ్యమ్ము బొందంగ నై
    పరపన్ జూడరె నడ్డులేక నట సంభాలించ కార్యామ్ము లన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  36. కందం
    స్మరియింపఁగ శ్లోకమ్ములు
    గరితల్ రావన్నఁ దోడుగా వల్లించన్
    బురమాయించిన వారై
    వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె పురుషులిలన్

    మత్తేభవిక్రీడితము
    గరితల్ నిత్యము వృత్తిలో మునిగి శ్లోకాలేవి రావన్ననే
    నెరవేర్చన్ గృహధర్మ మేమరక సాన్నిధ్యమ్మునన్ వారితో
    స్మరియింపన్ బతిదేవులున్ జదివి ప్రోత్సాహంబనన్ భక్తిమై
    వరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్

    రిప్లయితొలగించండి
  37. తిరమగు భక్తిని మహిళలు
    వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె, పురుషు లిలన్
    వరముగతమ సతులకు నా
    భరణములనుశక్తికొలదిబహుమతులీయన్

    రిప్లయితొలగించండి
  38. సురభూజార్చిత పాదపద్మయుగ సంశోభిత్కళాసల్లలితా
    మర సౌభాగ్య శుభాభిరేఖసకలైకసమ్మాన్యమేయాద్భుతాం
    గ రమేశాత్మనివాస శ్రీ వనిత సౌఖ్యంబిచ్చి రక్షించు భూ
    వర ! లక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్

    రిప్లయితొలగించండి
  39. పురుషుల్ స్త్రీలని భేదముండదుగదా పూజల్ పురస్కారముల్
    స్థిరచిత్తంబునసల్పగాపుడమిలో తీర్థంబులంజూడగన్
    మరియాభేదములక్ష్మిపూజకుగణింపంగాకతంబేమిటో
    వరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్

    రిప్లయితొలగించండి