1, ఆగస్టు 2020, శనివారం

సమస్య - 3444

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో"
(లేదా...)
"కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో"

45 కామెంట్‌లు:

  1. కవులకు కార్ఖాన నిటుల
    యవలీలగ నడుప శంకరయ్య మరొకడున్
    కవిసమ్రాట్ పుట్టుననుచు
    కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో!

    రిప్లయితొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    లవలేశమ్మును శబ్దశాస్త్రముననున్ లావణ్యమున్ బొందకే
    స్తవనీయమ్మగు శంకరాభరణమున్ శాస్త్రీ! ప్రకోపంబునన్
    కవిసామ్రాట్టును నేనహోయనుచు వే కందంబులన్ వ్రాయగా
    కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో!

    రిప్లయితొలగించండి


  3. తవికల జిలేబి వ్రాయగ
    "కవితాసాంబా"రనబడు కావ్యతిలకమున్
    చవులూరెనని జనులనన్
    కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో



    ది ఫేమస్ జగత్విఖ్యాత కవితాసాంబారిణీ
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. హహహహ...నిజ్జంగా మీరు ఫేమస్సె...


      కవితల జిలేబి వ్రాయగ
      నవి మైసూర్ పాక్ వలె గలదని శాంతి యనన్
      చవులూరెనని జనులనన్
      కవిసమ్రాట్ విశ్వనాథ గర్వపడె నహో

      తొలగించండి
  4. కవి విశ్వనాథ మదమున

    గవిసమ్రాట్ నేనొకడినె క్ష్మాతలముననెన్

    కవి నోరియె...యనగ నలా

    కవిసమ్రాట్ విశ్వనాథ...కలతపడె నయో

    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చవిలేని పదము లల్లుచు
    కవియై ప్రతివాడు నేడు ఘనమగు బిరుదుల్
    సవరించుకొనుట దల్చుచు
    కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో!

    రిప్లయితొలగించండి


  6. "కవిసామ్రాట్" "కవి చక్రవర్తి" బిరుదుల్ కాణీలకా పావులా
    కు వరాకున్ సురకానికిన్ విరివిగా కుమ్మక్కుగా నమ్ముచున్
    తవికల్ వ్రాయగ నివ్వ పీఠములు సత్కారమ్ములన్చేయుచున్
    కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. కం//
    కవి మల్లినాథ సూరియు
    కవి శ్రేష్టులకు నభిభూతి గలిగించెననిన్ l
    కవి శంకరార్య దెలుపగ
    కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో ll

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:
    చవిలేకుండెడి నాల్గుమాటలను తా సంధించి ప్రజ్ఞానుడౌ
    కవిగా సంఘములో నపారమగు ప్రఖ్యన్ గాంచితేనంచుచున్
    అవివేకమ్మున్ పట్టముల్ నిలుపు నవ్వానిన్ సమీక్షించుచున్
    కవిసమ్రాట్టగు విశ్వనాధ కడు దు:ఖంబందె నీనాడయో!

    రిప్లయితొలగించండి
  9. భువనైకాద్భుత సంభ్రమాద్యమల దివ్యోద్భాసభాస్వత్కవీ
    కవనాస్వాదిత సారసాద్యనుపమాకర్ణామృతోపేత బృం
    ద వినోదార్భటి " శంకరాభరణ విద్వన్వేదికన్ " గాంచి స
    త్కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో


    స్వామీ ! నమస్సులు. మీ ఆరోగ్యం ఎలా ఉంది ? మొన్నామధ్య మీరు క్రింద పడ్డాను అన్నారు ఇప్పుడు నెమ్మదించిందా ? - సదా మీ క్షేమమభిలషిస్తూ.....

    రిప్లయితొలగించండి
  10. అవనిన్ బద్యకవిత్వ దక్షతకు నాహా వీరె పో వీరులన్
    స్తవనంబుల్ పొనరించి మత్సదృశులౌ సామాన్యులన్ జేర్చి స
    త్కవివర్యుల్ గద వీరటంచు బిరుదుల్ కైదండలన్ గూర్చగా
    కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో.

    కవితాగంధము కావ్యపాఠగరిమల్ కల్యాణభావంబులున్
    వివిధానంతసుశబ్దసంతతియు ఠీవింగూర్చు శైలీస్థితుల్
    లవమైనన్ గొనకుండ సంస్తుతులతో లంఘించు వారిన్ గనన్
    కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో.

    రిప్లయితొలగించండి
  11. కవులట య౦దరు నా౦ధ్రను
    కవిశేఖరులు కవిరత్నకవివృషభులునే
    కవి నేలనైతి ననుచును
    కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో

    రిప్లయితొలగించండి
  12. కవిగా రామాయణమును
    చవులూరగ వ్రాసెతాను చరితార్థుండై
    యవివేకులువక్రించగ
    కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో

    రిప్లయితొలగించండి
  13. కవిసామ్రాట్ "బిరుదములను
    కవిబృందము లొక్క దెసను గర్హించుట నీ
    కవిసమ్రాట్ మెచ్చె ననుచు
    కవిసమ్రాట్ విశ్వనాథ కలత పడెనయో!

    రిప్లయితొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    🤔🥱🥱శ్రీ కంది శంకరులు దీక్షాప్రకటనను విరమింప కోరుతూ.... 🙏🙏

    *సమస్యా*... *పూరణం*..

    *కవిసామ్రాట్టులు* *చక్రవర్తుల* ని లోకంబందు గన్పట్ట స్వ..
    ల్ప వివాదంబిది నిక్కమే! యదొక వేలంవెర్రియే! కాని మా..
    నవులారా! మరణమ్మె మార్గమగునా? నా పేరు మీకందునా?
    కవితానందమరందపుష్పయుతవృక్షంబొక్కటే చాలదా?
    వివిధాలంకృతులేల స్వర్ణమన దీపింపంగ లావణ్య.? మీ
    భువి దీనిన్ నిరసించుడీ! తెలుపుడీ! పూర్వప్రభన్ నిల్పుడీ!
    కవినామమ్ములు భ్రష్టమౌనటుల వ్యాఖ్యానమ్ములన్ మానుడీ!
    నవపద్యమ్ములనల్లుడీ! జనులకానందమ్ములన్ పంచు., డీ..
    వ్యవహారమ్మును విస్మరింపుడి! సమాహారమ్ముగానుండుడీ!
    అవివేకమ్మును ద్రుంచుడీ! గనుడి నా యాక్రోశమున్., దీని నే
    నవమానమ్మని యెంచుచుంటి., నిక మీరాహారమున్ మానుచో
    దివి నా చిత్తము క్రుంగదా! యనుచునెంతేన్ బాధతో బెంగతో
    కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దు:
    ఖంబందె నీనాడయో !!

    (తొలిపాదములో.. సామ్రాట్. శబ్దప్రయోగం యథావసరము..)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. జీపీయెస్ వారు_

      మీకున్ను మైలవరపు వారికున్ను ఈ లింకు లోని పుస్తకము చదవడానికి ఉత్సుకత కలిగిస్తుందని అనుకుంటా. మైలవరపు వారికి లంకె వేయండి :)


      https://archive.org/details/familyhistoryofv00sastrich



      జిలేబి

      తొలగించండి
    2. శుభోదమండీ ! విశ్వనాథ వారిని మత్తేభ మాలికతో సత్కరించి, వారి భావమన మీ భావకవితా ఝరుల వారి నభిషేకించిరి. నమస్సులతో సెలవ్

      తొలగించండి
  15. భువి కొసగి వేయి పడగలు
    దివి కేగిన మేటి యైన దిగ్గజ కవితో
    నెవరో పోటీ యనగ నె
    కవి స మ్రాట్ విశ్వ నాథ కలత పడె న యో !

    రిప్లయితొలగించండి
  16. కవితలువ్రాయుటరాకను
    నవకరముగవ్రాయుచుండియర్ఢములేకన్
    కవులముమేమేయనుటను
    కవిసమ్రాట్ విశ్వనాధకలతపడెనయో

    రిప్లయితొలగించండి
  17. కవితాసేద్యముసేయలేదుభువికిన్గ్రాంతిన్శుభాశీస్సులన్
    స్తవనీయావ్యయసత్ఫళావళులవిశ్వశ్శ్రేయమందించడీ
    కవియాకుంజరసింహరత్నబిరుదుల్కట్నంబుగానీయగా
    "కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో

    రిప్లయితొలగించండి
  18. కవికాానందమునిష్కళంకహృదులైకావ్యోక్తదోషాళినిన్
    స్తవనీయాత్మపరీమళంపుచవిశశ్శచ్ఛాంతిసందేశమున్
    భువికందించినగప్పిపిచెప్పిననెసమ్మోదంబునెత్తీరునన్
    "కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో?

    రిప్లయితొలగించండి
  19. కవనంబేదియురాకపోయిననుదాకావ్యంబువ్రాయంగభో
    యవగాహంబదిరాకపోకకడుదుర్వాపోహముంబొందుటౌ
    కవిసమ్రాట్టగువిశ్వనాధకడుదుఃఖంబందెనీనాడయో
    కవనంబయ్యదియుండనోపుగదనెక్కాలంబుశ్రేయంబుగా

    రిప్లయితొలగించండి
  20. కవులపురస్కారములనె
    వ్యవహారముగను గలిగిన వ్యర్థుల క్రియలే
    యవమానము భారతికని
    కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో

    రిప్లయితొలగించండి


  21. కవిసమ్రాట్టులనంగ సు
    కవులిద్ధరనిద్దరైరిఘనముగ
    తొలుతన్
    నవిసామాన్యమ్మవగా
    కవిసమ్రాట్ విశ్వనాథ కలత పడినయో

    రిప్లయితొలగించండి
  22. వ్యవహారమ్ముగ దల్చి నీచులిలలో స్వార్థమ్ముతో దుడ్డుకై
    కవిసన్మానములంచు జేయుటయె సత్కార్యమ్ము గా జేప్పుటే
    యవమానమ్మది శారదాంబకని తానావేదనన్ బొందుచున్
    కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో

    రిప్లయితొలగించండి
  23. కవన వనమ్మున నేడిటు
    కువకువమన జాలు కాకి కోకిలటంచున్
    కవివరుడని బిరుదులిడగ
    కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో

    రిప్లయితొలగించండి


  24. నాకు బిరుదు ప్ర దానము+ డాక్టరేటిస్తున్నారండీ మీరెల్లరి ఆశిస్ పద్యాల వెల్లువ కామింట్ల తో నా టపాను ముంచాల్సిందిగా కోరుతున్నా ;)


    https://varudhini.blogspot.com/2020/08/blog-post_1.html


    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. కవిసమ్రాట్టనవిశ్వనాథకవియే, కాబోరు వేరెవ్వరున్
    కవిసమ్రాట్కవిచక్రవర్తులనగాకర్జంబుగాదెన్నడున్
    కవితల్ వ్రాసినమాత్రనన్యులకుసత్కారంబులందించుచున్
    "కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో

    రిప్లయితొలగించండి
  26. 🙏🙏గురువు గారికి నా నమస్కారము🙏🙏

    నేటి సమస్యకు నా పూరణ ప్రయత్నం

    *కవిగాంచనదిలగలదే!..*
    *రవినయిననుఁగాంచనట్టిరారాజులునౌ*
    *కవులకు బిరుదుల నియ్యన్*
    *"కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో"*
    ......✍బోరెల్లి హర్ష
    కర్నూలు..

    రిప్లయితొలగించండి
  27. కవి లోకార్ణవ చంద్రుం
    డవు విబు ధారాధ్యుఁడవు పుడమి రత్నంబై
    సువిదితుఁడవు నా చిత్తము
    కవిసమ్రాడ్విశ్వనాథ! కలతపడె నయో


    భువి నీ యస్తమయమ్ము దుఃఖకరమే భూగోళ విద్వాంస గౌ
    రవ పాత్రుండవు నీకు భావ్య మగు స్వర్గప్రాప్తి నిర్జన్మమై
    స వివేక ప్రవ రాగ్ర్య వార్తలకు సత్సంధాత నా విత్తమే
    కవిసమ్రాట్టగు విశ్వనాథ! కడు దుఃఖంబందె నీనాఁ డయో

    [ఈనాఁడు = వార్తాపత్రిక]

    రిప్లయితొలగించండి
  28. కవితారీతులు కావ్యపద్ధతుల లంకారార్థశబ్దప్రయో
    గవిధానమ్ము నెఱుంగ లేరు దురహంకారప్ర వృత్తిన్ ధరన్
    గవు లాత్మస్తుతి నంధులై బిరుదముల్ గైకొంద్రహో! యంచు తా
    కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  29. కవులంచున్ బిరుదమ్ములన్ గొనుచుప్రఖ్యాతిన్ గడించంగ తా
    మవలంభించుచు దొడ్డిదారులనుసమ్రాట్లంచు చాటించు యీ
    యవివేకమ్మున సంచరించు కవులన్నల్పాత్ములన్ గాంచి యా
    కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో

    రిప్లయితొలగించండి
  30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  31. చవిలేని కుకవనమునకు
    జవ మెరుగని సంఘములు ప్రశంసల నిడుచున్
    కవులకు బిరుదుల నొసగగ
    కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె "
    నయో

    డా.బి. ద్వారాకనాథ్

    రిప్లయితొలగించండి
  32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  33. చవిలేనట్టి కవిత్వమే బిరుదులన్ సత్కారముల్ బొందగా
    స్తవనీయంబగు శంకరాభరణ సత్సం
    చాలకుల్ శంకరుల్
    అవిరామంబగు దీక్షదల్చనిట
    నన్యాయంబు ఖండించగన్
    కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో

    గురువుగారిని చూసి జాలిపడి దుఃఖించాడని భావన!

    రిప్లయితొలగించండి
  34. అవిరామంబుగ వ్రాయుచు
    రవికుల తిలకుని చరితము రామాయణమున్
    భువిజను దశకంఠుడొడుచ
    కవి సమ్రాట్ విశ్వనాథ కలత పడెనయో

    రిప్లయితొలగించండి

  35. పిన్నక నాగేశ్వరరావు.

    ౘవి లేని రచన చేసెడు
    కవులకు బిరుదమ్ములిచ్చు కవిసంఘ
    ములన్
    దివి నుండి గాంచుచుండిన
    కవిసమ్రాట్ విశ్వనాథ కలత పడెనయో!

    రిప్లయితొలగించండి
  36. కందం
    వివరము కొరవడు పలుకులె
    కవిత్వమన బిరుదులిచ్చి గౌరవమీయన్
    దివినుండి తెలుగుల గనుచుఁ
    గవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో!

    మత్తేభవిక్రీడితము
    శ్రవణీయంబుగ బల్కువారిఁ' గొనినన్' సన్మానమన్ దంతుతోఁ
    గవనంబంచును కాఱుకూతలకు వ్యాఖ్యానాల సంధించుచున్
    భువిలో కుప్పలుతెప్పలై బిరుదముల్ మోదించ, స్వర్గస్తుడౌ
    కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో!

    రిప్లయితొలగించండి