4, ఆగస్టు 2020, మంగళవారం

సమస్య - 3447

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు"
(లేదా...)
"సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా"

79 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    ప్రీతిని గెల్వ నెన్నికను పిండిని జేయుచు రాహులన్ననున్
    వాతలు బెట్టి సోనియకు వందన మీయగ వారణాసినిన్
    చేతినిబట్ట పున్నమిని చెల్వము మీరగ మోడివర్యుడే
    సీత, కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా!

    సీత = గంగ

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    శంకరాభరణపు కవయిత్రి సీత గారిని ఉద్దేశించి:

    ప్రీతిని నిన్ను చేకొనుచు రేయిని శ్రావణ పౌర్ణమిన్ భళా
    రీతిగ హైద్రబాదునను రివ్వున జేరుచు సాగరమ్మునన్
    కోతలుకోయు సోదరుడు గుట్టుగ చేతిని నీరుపట్టగా
    సీత! కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా?

    రిప్లయితొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అద్దమువలె నాజూకుగ నడరు నట్టి
    సీత కరపద్మమున వెల్గె శీతకరుడు
    భాతి చల్లని హృదితోడ పరిఢవిల్లు
    రాముడామె చేతిని జూచు నేమమందు.

    రిప్లయితొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దాహము నణచగ తానేగు దారి నందు
    కాన వచ్చినదగు తటాకమ్ము చెంత
    చేతులందున నీటిని చేదినంత
    సీత కరపద్మమున వెల్గె శీతకరుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "దాహము నడచ తానేగు..." అనండి.

      తొలగించండి
  5. అక్కాచెల్లెళ్ళ సంభాషణ

    పూతహృదంబునన్ మిగుల పుణ్యము నొందగ శ్రావణంబునన్
    బ్రీతిగ చెల్లినింబిలిచి పెట్టగ గానుక
    నోమునందునన్
    జేతము మోదమందగను శీతమయూఖుని వెండిబింబమున్
    సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగె! గంటివా?

    రిప్లయితొలగించండి


  6. మంచి నూనియ దివ్వె క్రమముగ నమరె
    సీత కరపద్మమున, వెల్గె శీతకరుఁడు
    రాత్రి గగనమునన్ మధురమ్ము గా జి
    లేబి పద్యమొకటి వ్రాసె లివ్వులీన!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. నాతిని గూడుచున్ మిగులనందము నొందుచు రాఘవుండదే
    ప్రీతిగ విశ్రమించగను రేయిని జానకి యంకమందునన్
    జేతము మోదమందగను జేతుల నల్కల జక్కజేసెడిన్
    సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగె! గంటివా?

    ఊహలో గంటివా! 😊😊🙏🙏

    రిప్లయితొలగించండి
  8. భ్రాత యొకండు చెల్లెలికి బాలకు జూపుచునుండె జూడుమా
    యాతడు మాంత్రికోత్తముడు హర్షము గూర్చెడి కర్మ లెన్నియో
    చేతలలోన జూపు నతిచిత్రముగా నదె కర్ర ద్రిప్పగా
    సీత! కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా?

    రిప్లయితొలగించండి


  9. కందోత్పల

    భువిని వెలిగె నా దివ్వె చ
    నవు సీత కరాంబుజంబు నను, శీతకరుం
    డు వెలింగెఁ గంటి వా సఖి
    దివిని! నిశియె సొబగు లీనె దివ్యముగ సుమీ


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. ముకురమునుచేతధరియించి ముదితసీత
    ముద్దుమోమునుగాంచుచుమురియుచుండ
    నింగిపైనుండి యల్లన తొంగిచూసి
    సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు

    రిప్లయితొలగించండి
  11. చేతన కౌసలేయుడటు చిత్తముఁగోరెను చందమామనున్
    ప్రీతుఁడు రాజపుత్రుడటు భీతిని గొల్పగ గోలసేయగ
    న్నాతత మంత్రివర్యుడట నద్దము లోపల జూపగా స్థిరా
    సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భ్రాతకు దాహమున్ కలుగ త్రాగుటకై జలమంద జేయగా
    ప్రీతిని గూడి చెల్లెలటు వెళ్ళి తటాకము జేరి వేగమున్
    చేతులు చాచి నీటిని విశేషముగా గొనుచుండు నంతలో
    సీతకరాంబుజంబునను శీతకరుండు వెలింగె గంటివా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భ్రాతకు దాహమున్ కలుగ త్రాగుటకై జలమంద జేయగా
      ప్రీతిని గూడి చెల్లెలటు వెన్క తటాకము జేరివేగమున్
      చేతులు చాచి నీటిని విశేషముగా గొనుచుండు నంతలో
      సీతకరాంబుజంబునను శీతకరుండు వెలింగె గంటివా?

      తొలగించండి

  13. మైలవరపు వారి పూరణ

    ప్రీతిగ ముద్దులాడుకొను పిట్టల జంటను జూచి తోటలో
    చేతిని బుగ్గకాన్చి కడు చిత్రముగా గమనించుచుండగా
    సీతను గాంచి., యిట్టులనె జిల్క హసించుచు గోరువంకతో
    సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగె గంటివా!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  14. ఆతత ప్రేమ పెల్లుబుక నాలుమగండునుగూడి రా
    రాతిరి , దివ్య గంధముల రంజిల నిద్దరు మేననద్ద జూ
    పెన్ తన గంధసౌరునట పెన్మిటి కద్దము నందు వేడ్కగన్
    సీత! కరాంబుజంబునను శీతకరుండు వెలింగె గంటివా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శీతకరంబు మేనుకని శ్రీలనొసంగగ సొంపుమీరగన్
      చేతికి నద్దిరందరును చిత్రసుపత్రిత లేహ్యముల్ రసో
      పేత నఖాంగుళుల్ మెరయ పేరట మందొక ముద్దరాలునౌ
      సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా ?

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటి పాదంలో గణభంగం. 'మేననద్ద'? మూడవపాదంలో ప్రాస తప్పింది.

      తొలగించండి
  15. "సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా
    భ్రాత త్వదీయనేత్రముల వాహినులే ప్రవహింపనందులో
    మాతను లక్ష్మణుండుగనె మానిని జేతము గుండెనిండె నీ
    పూతహృదంబుజూచుకొనుమోప్రభుదుఃఖమదేలరాఘవా

    రిప్లయితొలగించండి
  16. ఆతతసేవజేయు ప్రజలందరు నమ్మను నమ్మినారు సం
    ప్రీతిని మైథిలీ ముఖమువెన్నెలజిందగనద్దమంటిమీ
    చేతములోప్రదీప్తమయి జిందులువేయుచునుంది యందమౌ
    సీతకరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁగంటివా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చిందులు వేయుచునుండె నందమౌ" అనండి.

      తొలగించండి
  17. రామునికి తలంబ్రాలు పోద్దామని మణులను సీత చేతి లోనికి తీసు కొనగా రామ చంద్రుని బింబము ఆ మణుల మధ్య లో ప్రతి బింబిస్తు ఉంటే మణులు తారల లాగా వాటి మధ్య చంద్రుని లా రాముని వదనము సీత కరమున వెలిగెనని భావన



    రాముని శిరము పై తలం బ్రాలు
    పోయ

    తలచి మణులను చేబట్ట తారకముల

    చందమున మణులువెలుగ సుందరముగ


    సీత కర పద్మమున వెల్గె శీతకరుడు

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.

    సీత చతురోక్తు లాడుచు చెలులతోడ
    కోర గోరింట చేతులకు నలదుడని
    చెలియొకతె తెచ్చి చేకొని సీత కరము
    తారల నడుమ శశిని యందముగ దిద్ద
    సీత కరపద్మమున వెల్గె శీతకరుడు.

    రిప్లయితొలగించండి
  19. పెండ్లి వేడుక మొదలైన వేళ యందు
    వేసె రాముడు హస్తంబు వేడ్క మీర
    సీత కర పద్మమున : వెల్గె శీత కరుడు
    వెన్నెలలు నింప లోకాన విరివి గాను

    రిప్లయితొలగించండి
  20. పూతచరిత్ర సీత వని మోదముతో వసియించు చుండ నో
    రాతిరి వేళలోన చిరు గ్రావము గాయము చేయ గాడ్పుచే
    నాతి కరమ్మునందు కొని నాథుడు సేవలు చేయుచుండ నా
    సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా!

    రిప్లయితొలగించండి
  21. ప్రీతి నొసంగ జానకికి శ్రీరఘురాముడు శీతభానుడై
    చేత ధరించినట్టి యొక చెన్నగు దర్పణమందు దోచగా
    చేతన ముల్లసిల్ల తన జెల్వుని తోడ వచించె నిట్టులన్
    "సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగె గంటివా!"

    రిప్లయితొలగించండి
  22. హస్తరేఖలుబాగుగనమరెజూడు
    సీతకరపద్మమున,వెల్గెశీతకరుడు
    పఱగుపదహారుకళలతోపంచదశిని
    పగలురాత్రియుగలుగునుపాధివలన

    రిప్లయితొలగించండి
  23. కె.వి.యస్. లక్ష్మి :

    విల్లు విరచిన శ్రీరామ విభుని జూచె
    సిగ్గు మోమును పైకెత్తి సీత యపుడు
    వలచి వరమాల వేసెడి వడిని నంత
    సీత కరపద్మముల వెల్గె శీతకరుడు

    రిప్లయితొలగించండి
  24. శ్రావణాహ్లాదపూర్ణిమశోభతోను
    జనులమదిదోచుమరువంపుజాజిమల్లె
    పూలసోగసులుపోఁడిగాపలుకరింప
    సీతకరపద్మమునవెల్గెశీతకరుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, మూడవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  25. చేతముసంతసిల్లగనుశీతమయూఖుడుగానగానయెన్
    సీతకరాంబుజంబునను,శీతకరుండువెలింగెగంటివా
    ప్రీతినిషోడశంబనెడురేతసుతోడనుబూర్ణిమంబునన్
    రాతిరియేర్పడున్ బగలురాయనిగాంతులగారణంబునన్

    రిప్లయితొలగించండి
  26. కలువల కొలునున్ దంపతుల్ జలక మాడు
    సమయమందున ప్రియునిపై జలముఁ జల్లు
    వేళ పుటిత జలము నందు విధుని గాంచ
    సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు

    రిప్లయితొలగించండి
  27. అలసి పోయిన రాఘవు నాద రమున
    చెంత చేరి పలకరించె డింతి యపుడు
    రాముని కపోలముల సుతారముగ నిముర
    సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు

    రిప్లయితొలగించండి
  28. శారద నిశా సమయ మందుఁ జంద్రుఁ జేరఁ
    దార లెంచఁ జోద్యమ్ముగఁ దక్కి నట్టి
    చుక్క లలుగఁగ రోహిణి, చూచు చుండ
    సీత, కరపద్మమున వెల్గె శీతకరుఁడు


    శీతమయూఖ చంద్ర ముఖి సీత కృపారస సిక్త వీక్షయే
    పూత చరిత్ర భూమిసుత పూజకునై కడుగంగ నెంచి తా
    రాతిరి రామపాదములు రమ్యపు దోయిలి నీర ముంచగా
    సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా

    [సీత దోయిలి నీటిలో స్వీయ ముఖమ్మును గాంచినది]

    రిప్లయితొలగించండి
  29. ఆతత సంతసంబొసగునా శరదిందు విభావరీ తఱిన్
    భూతలమందు స్వర్గమనుభూతమొనర్చు వనాంతరంబునం
    దా తటమందు దోసిట జలంబులతో నిలిచెన్ లతాంగి యా
    సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా

    రిప్లయితొలగించండి
  30. ఆతత సద్గుణోత్తముడు, యాతుల పాలిటి మృత్యుదేవుడే
    యాతడు, రాక్షసాధముల నంతము చేసిన ధర్మరక్షకున్
    బ్రీతిగ పాదముల్ కడుగు వేళను దోసిలి తోయమందునన్
    సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సద్గుణోత్తముడు తరువాత యడాగమం రాదు.

      తొలగించండి
  31. రామ చంద్రుడు రాజ్యమ్ము రాజసమున
    కన్న బిడ్డల వలెనేల కడకు ప్రజను
    జానకి బిగుకౌగిటఁజేర జాము రాత్రి
    సీత కరపద్మమున వెల్గె శీతకరుడు.

    రిప్లయితొలగించండి
  32. సీతతటాకమందుతనచేతులనిండుగనీరునింపియా
    చేతులలోనినీటతనచెల్వమువెన్నెలలోనగాంచగన్
    సీతనుచేర్చికౌగిటను చెప్పెను రాముడు తన్మయంబుగన్
    సీతకరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా

    రిప్లయితొలగించండి
  33. నిండు పున్నమి జాబిలి నేల దిగెను!
    మురిసె మిధిలెల్ల రాముని మోము జూసి!
    వధువు జానకి కెటుజూడ ప్రాణవిభుడె!
    "సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు"

    రిప్లయితొలగించండి
  34. ఉ:

    చూతము కొత్త వింతలని జొచ్చుకుపోవగ మేలనమ్మునన్
    రాతిరి వేళ లోన పలు రంగుల చిత్రము లందు నిల్పగన్
    ద్యోతము శ్వేత వర్ణ కొమ దోయిలి గన్పడ నెల్లరడ్గుటే
    సీతకరాంబు జంబునకు శీతకరుండు వెలింగె గంటివా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  35. లంక త్రిజట గోరింటాకులదిమెనంత
    "సీత కరపద్మమున వెల్గె శీతకరుడు "
    రామ చంద్రుని మోమట్లు-రమణి మరల
    శోక సంద్రాన మునిగె నశోక వనిని!

    రిప్లయితొలగించండి
  36. తేటగీతి
    లవకుశులట రాముని వలె నవనిజ కడ
    వగలనేడ్చుచు ముద్దను వద్దనంగ
    ముద్దుఁ జేయుచుఁ జేపట్ట ముకురమొకటి
    సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు


    వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మ యనుంగు చెలియ తోటి వారితో...

    ఉత్పలమాల
    జాతికి మేటి వారసులు సాధ్యము చక్కని పెంపకంబునన్
    ప్రీతిగఁ బెంచుచున్ గవల బిడ్డల వాల్మికి యాశ్రమంబునన్
    యాతన బెట్టు పిల్లలకు నద్దముఁ బట్టుచుఁ బంచ మోదమున్
    సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా!

    రిప్లయితొలగించండి