8, అక్టోబర్ 2020, గురువారం

సమస్య - 3511

9-10-2020 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దాని సుతు లైదుగురు గూడి రా నెలఁతను"
(లేదా...)
"దాని కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్"

80 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    కోనల కోనలన్ వెదకి కొండొక నాతియె ప్రేమ కోరుచున్
    కాననమందునన్ మురిసి గండర గండుని చేరి కూడగా
    కానగ నాడ కేసరియె కన్నుల నిండుగ పిల్లలన్ గనన్
    దాని కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్...

    రిప్లయితొలగించండి
  2. ఇరువురను మనువాడెను‌ నిచ్చ తో మృ

    దాని సుతు,లైదుగురు గూడిరా నెలతను

    కుంతి కోర దృపద సుతన్,
    కూడె చక్రి

    కష్ట భార్యలు ముదముగ నిష్ట
    పడగ

    ననుచు పలికె నొకడు తన‌ వనిత తోడ

    మృదాని =పార్వతి

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    Self-pollination of flowers:

    బోనల పండుగందునను భోరున వానలు నేల తొల్కగా
    చేనున చేర్చి యాదటను చెన్నుగ పంటను కోరి కాపు వే
    కానగ సూర్యకాంత విరి కన్నుల పండుగ చేసి విచ్చగా
    దాని కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్...

    సూర్యకాంత విరి = ప్రొద్దు తిరుగుడు పువ్వు (దుష్టసమాసము)

    రిప్లయితొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దీక్షజూపి మత్స్యమ్మును తెలివిదోడ
    ఛేదనన్ జేసి ద్రౌపది చేయిబట్టి
    కూడ దెచ్చినంతట కుంతి కోర్కెమీర
    దాని సుతులైదుగురు గూడిరా నెలతను.

    రిప్లయితొలగించండి
  5. [10/8, 22:14] shankargdabbikar: కుక్కుటమునకుగలిగెనుకూనలేడు
    రెండుపెంటివిమగవైదుమెండుగాను
    పెరిగిపెద్దైనతదుపరిపెరిమతోడ
    *"దాని సుతు లైదుగురు గూడి రా నెలఁతను"*
    [10/8, 22:15] shankargdabbikar: మానిని కుంతిదేవియనె మంచిది నాయన లారమీరు స
    మ్మానము బొందినట్టి బహుమానము నందరు బంచు కొండనన్
    జానను ద్రౌపదీసతిని సాధులు మెచ్చగ పంచ పాండవుల్
    *"దాని కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్"*

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పూనికతోడ మత్స్యమును పూర్తిగ ఛేదన చేసినంతటన్
    జానుగ ద్రౌపదిన్నచట చక్కగ పొందిన సవ్యసాచియున్
    వానిసవిత్రి కుంతి శుభవాంఛను తీరుగ దీర్చనెంచుచున్
    దాని కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ద్రౌపతిన్+అచన' అన్నపుడు ద్విత్వనకార ప్రయోగాన్ని వర్జించండి. "ద్రౌపదీ సతిని..." అనండి.

      తొలగించండి
  7. ఆదిభట్ల సత్యనారాయణ

    పూర్వ జన్మతపోవర పుగరిమతన
    సాధ్వి ద్రౌపది పొందె పం చపతులన్,గడు
    ముదము నసుతులు కుంతియా మోదమంది
    దాని సుతులైదుగురు గూడి రానెలతను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "పంచపతుల గడు..." అనండి.

      తొలగించండి
  8. మానితమైన భోజనము మానవ శ్రేయము గూర్చునెప్పుడున్
    ఆనుచు చేతినిన్ దినగ నాయువు
    హెచ్చును ద్రోచిరోగమున్
    పాణిని యన్నమున్ గలిపి పారణ జేయుట శ్రేష్ఠమైనదై
    దాని కుమారులైదుగురు దానిని గూడిరి పెద్దలౌననన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సేనలు జొచ్చిగాల్వనను చీదర
      వెట్టగ చైనవారివే
      పాణిని పాణినిన్ గలిపి భారత సైనికు
      లందరొక్కటై
      ప్రాణము లొడ్డుచున్నెదిరి భగ్నము సేయగ ముష్టిఘాతమున్
      దాని కుమారు లైదుగురు దానిని గూడిరి పెద్దలౌననన్

      తొలగించండి
    2. కానగ నొక్కచో ఘనపు కాగిత
      ప్రోవును గార్దభంబదే
      చేనుల చెంతనున్ దిరుగు స్నేహితు
      లందర జేరబిల్చుచున్
      గానముజేయగా మురిసి గార్దభ
      సోదర బంధువర్గమున్
      దాని కుమారులైదుగురు దానిని గూడిరి పెద్దలౌననన్

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవా! నమోనమః! 🙏🙏🙏🙏

      తొలగించండి
  9. మత్స్య యంత్రమ్ము ఛేదించి మగువ గెలచి
    ఫలము సాధించి తిననుచు పార్థు డనగ
    పంచు కొనుడింక సమభాగ మంచు పలుక
    దాని సుతు లైదుగురు గూడి రా నెలఁతను

    రిప్లయితొలగించండి
  10. కె.వి.యస్. లక్ష్మి:

    వీరుడర్జునుడాసభ విప్రుడుగను
    మత్స్యయంత్రమ్ము ఛేదించి మగువ కృష్ణ
    కూడి కుంతి జేరగ పంచుకొనుమనంగ
    దాని సుతులైదుగురు గూడి రానెలతను.

    రిప్లయితొలగించండి
  11. మత్స్యయంత్రమ్ము ఛేదించి మఘవసుతుఁడు
    ద్రౌపదినిబొందె; కుంతియుతనకొమరుల
    ఫలమునేవురు సమముగ బడయుడనగ
    దాని సుతు లైదుగురు గూడి రా నెలఁతను

    రిప్లయితొలగించండి
  12. ఆదిభట్ల సత్యనారాయణ

    పూర్వ జన్మతపో వర పుగరిమతన
    సాధ్వి ద్రౌపది పొందె పం చపతుల గడు
    ముదము నసుతులు కుంతియా మోదమంది
    దాని సుతులైదుగురు గూడి రానెలతను

    రిప్లయితొలగించండి
  13. మానిని కుంతితో బలికె మధ్యము డైన కిరీటి యిట్టులన్
    తానొక దివ్యమౌ ఫలము దంచుకు వచ్చితి నంచు చెప్ప, నా
    చానయె పంచుకొమ్మికను చక్కగ నేవురటంచు పల్కగా
    దాని కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్

    రిప్లయితొలగించండి
  14. ఉత్పలమాల:
    ++++++++++++

    కానగలేనిరోగమిది,కన్నుల నిండుగ రాక్షసత్వమే
    మీనము మేషమున్ గనక మ్రింగుచునుండెను మానవాళినే
    దీనికి హస్తముల్ శతము,దీపములార్పెడు సేవకుల్ భళా
    దానికుమారులైదుగురు,దానినిగూడిరి పెద్దలౌననన్
    ++++++++++++++++++++====
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  15. మౌని వరంబునన్ గనెను మానిని యొక్కతె దేవతాంశమున్
    సూనులఁ, వారలందొకఁడు సూటిగ గొట్టెను మత్స్య యంత్రమున్;
    ఆ నిటలాక్షుఁ గొల్చె నొక యంగన పొందగ భర్త లేవురన్;
    దాని కుమారు లైదుగురు, దానినిఁ గూడిరి పెద్ద లౌననన్

    రిప్లయితొలగించండి
  16. పడతి నొకతెను దొంగల బారి నుండి
    దాసి కొమరు లాదుకొనిరి , తమకమొంది
    పాండవుల మాదిరి మసల వచ్చు ననుచు
    దాని సుతు లైదుగురు గూడి రా నెలఁతను

    రిప్లయితొలగించండి
  17. సమస్య :
    దాని కుమారు లైదుగురు
    దానిని గూడిరి పెద్ద లౌననన్

    ( ద్రౌపది పాండవుల నైదుగురిని పెండ్లాడె
    నని తండ్రికి చెబుతున్న దుర్యోధనుడు )
    దీనిని విశ్వసింపవలె ;
    దీప్తులు తగ్గెను వంశమందునన్ ;
    గానగ లేని దెచ్చటను ;
    గమ్మనివార్తయు గాదు తండ్రి ! ఛీ !
    వీనులు వ్రీలిపోయినవి ;
    పిన్నమ కుంతికి బుద్ధి పోయెనా ?
    దాని కుమారు లైదుగురు ;
    దానిని గూడిరి పెద్ద లౌననన్ .

    రిప్లయితొలగించండి
  18. వానకు దాళలేక బహుభంగుల గుందుచు పాక జేరు నా
    దీనజనంబు లెవ్వరది తెల్పుమురా యను తాత కిట్లనెన్
    దానొక బాలకుండు విను, తల్లి యొకర్తెయు జీర్ణవస్త్ర్ర య
    ద్దాని కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్

    రిప్లయితొలగించండి


  19. కుంతి! పాండు రాజు సతి ! సుగుణపు రాశి!
    దాని సుతు లైదుగురు గూడి రా నెలఁతను
    పొలతి పేరు ద్రౌపది! చేరె భూపతులను
    వ్యాసుడు రచియించెను కథ భారతమ్ము



    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. జూదమని పిల్చి రాజ్యము చూరగొనగ
    విదురు నింటను కుంతిని విడిచి పోయి
    యుద్ఢ మందున రాజ్యము యుక్తి బడసి
    దాని సుతు లైదుగురు గూడి రా నెలఁతను

    రిప్లయితొలగించండి


  21. అరె పొడుపుకథను విప్పుము
    గురు! "దాని కుమారు లైదుగురు దానినిఁ గూ
    డిరి పెద్ద లౌననన్" కుం
    తి రీతిగా తల్లియు, పడతి ద్రుపదు సుతయున్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. అరె పొడుపుకథను విప్పుము
      గురు! "దాని కుమారు లైదుగురు దానినిఁ గూ
      డిరి పెద్ద లౌననన్" కుం
      తి రీతిగా తల్లియగు, సతి ద్రుపదు సుతయున్


      జిలేబి

      తొలగించండి
  22. మానితచాపముక్తశరమయ్యెడ నింగిని వ్రేలు చున్న నా
    మీనము నేచ ఫల్గుణు డమేయవిదగ్ధత గెల్చె ద్రౌపదిన్
    దానినిఁ బొంద నైదుగురు తల్లి వచించి యొసంగు తీపివిం
    దాని, కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి


  23. దానిని నీటి యందు గని దానిని కొట్టెను ! తెచ్చె భిక్షగా
    దానిని శబ్దవేది, యమ దానిని పంచుకొనండనంగనే
    దాని కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్
    దానిని గాంచి రా జనులు! దానిని మెచ్చిరి భారతమ్మిదే



    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. మత్స్య యంత్రము ఛేదించి మగువ దెచ్చి
    తల్లి యనుమతి గైకొని ధర్మముగను
    దాని సుతు లైదుగురు గూడి రా నెలతను
    పంచ భర్త్రుక యయ్యె నా పడతి యపుడు

    రిప్లయితొలగించండి
  25. మైలవరపు వారి పూరణ

    దీని కుమారులైదుగురు దీనిని గూడిరి వృద్ధ యౌటచే.,
    దాని కుమారులైదుగురు దానిని గూడిరి .,యింక మీరు నన్
    దేనిని దేనిపుత్రులని తిప్పలు పెట్టగనేల? జూడుడీ!
    దాని కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  26. అడవికోడిపెట్టెగ పదియండములను
    పాముమెక్కెనొకటి నక్కపాలుమూడు
    పొదుగ నయిదు మగవిగాన పొలతినొకతి
    దాని సుతు లైదుగురు గూడి రా నెలఁతను

    రిప్లయితొలగించండి
  27. ఈనిజ మెరుంగు మవనిని యింద్రు డేను
    రూపముల నిల పాండుపుత్రులుగ నుద్భ
    వింప, శచి యాజ్ఞసేనియై వెలయ, వార
    యోనిజులుగాదె, జయమున కాత్మ కుంతి
    దాని సుతు లైదుగురు గూడి రా నెలఁతను.

    జయ-మహాభారతము

    రిప్లయితొలగించండి
  28. “దాని కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్”
    యీనుడినే సమస్యయని నీయగ
    పూర్తికి కుంతినే యిటన్
    “దాని”యటంచు తక్కువగ దబ్బుట నాయము గాదుగా ,యిదిన్
    మానగ మంచిదే యగును మాటను , పాత పురాణపాత్రలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...యని యీయగ" అనండి. 'ఇదిన్' అన్నది సాధుప్రయోగం కాదు.

      తొలగించండి
  29. ఉ:

    కానగరారు తల్లియని కష్టము లెంచియు పెద్ద చేయగన్
    హీనపు బల్కులున్ కడకు హెచ్చగు రీతిని వాదులాటలున్
    ప్రాణము తీతురా పిసిని పట్టెడు కూడుకు బెట్ట మంచనన్
    దాని కుమారు లైదుగురు దానిని గూడిరి పెద్ద లౌననన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      తేటగీతి మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      తేటగీతి

      రామపట్టాభిషేకాన రగిలె కైక
      షడ్గుణమ్ములశాంతికి సంతుఁ గాదె
      నక్కి సుతు మత్సరుని గూర్చఁ దక్కినట్టి
      దాని సుతులైదుగురుఁ గూడిరా నెలఁతను

      ఉత్పలమాల

      మేను ధరించె రాముఁడుగ మేదిని శ్రీహరి ధర్మరక్షకై
      మానితుఁ గానలన్ బనుప మంధర బూన్చఁగఁ గైక నొక్కతెన్
      బూని యశాంతి మత్సరునిఁ బుత్రుని గూర్చఁగఁ దక్కినట్టి య
      ద్దాని కుమారులైదుగురు దానిని గూడిరి పెద్దలౌననన్

      ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

      తొలగించండి
    3. కొద్దిపాటి సవరణతో వృత్త పూరణ :

      ఉత్పలమాల

      మేను ధరించె రాముఁడుగ మేదిని శ్రీహరి ధర్మరక్షకై
      మానితుఁ గానలన్ బనుప మంధర బూన్చఁగఁ గైక నొక్కతెన్
      బూని యశాంతి షడ్గుణులఁ బుత్రులలో మును గూర్చ మత్సరున్
      దాని కుమారులైదుగురు దానిని గూడిరి పెద్దలౌననన్

      తొలగించండి
  31. రిప్లయిలు
    1. న్యాయ మున్న చోటుననె మనకుఁ దగు నని
      వాదన జరుగ నచట కోపమ్ము మీఱఁ
      దల్లికిని నక్క కక్కట చల్లగాను
      దాని సుతు లైదుగురు గూడి రా నెలఁతను

      [దాని = ఇక్కడ తల్లి; నెలత = అక్క]


      మీనపు యంత్ర సంస్థితము మీనముఁ గొట్టి జయించి కన్యఁ దా
      నా నలినాక్షి దాచి తగ నర్జునుఁ డింపుగఁ జెప్పనిట్టులున్
      నే నిట భిక్ష తెచ్చితిని నేర్పునఁ దల్లి, మొగంపుఁ గమ్మి మీ
      దాని, కుమారు లైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్

      [మీదు +ఆని = మీ దాని; మొగము =ద్వారము; ఈ పెద్ద లౌ ననుటకుఁ జాల వ్యవహారము నడచినది.]

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక వందనములు.

      తొలగించండి
  32. మీనునుగొట్టి ద్రౌపదిని మేదిని భూవరులెల్లమెచ్చగా
    పాణి గ్రహించె ధీరుడగు పాండవమధ్యము డర్జునుండు న
    ద్దానిఫలంబుగాదలచితల్లికుమారులబంచుకొమ్మనన్
    దాని కుమారులైదుగురు దానినిఁ గూడిరి పెద్ద లౌననన్

    రిప్లయితొలగించండి
  33. కుంతియాఙ్ఞను బాండవుల్ గౌరవించి
    దానిసుతులైదుగురు గూడిరానెలతన్
    ద్రోవదికిమేముభర్తలౌదగుననుచును
    బంచుకొనిరటయేడాదిపాటువారు

    రిప్లయితొలగించండి
  34. మానమెభూషణంబుగనుమాన్యతకెక్కిన గుంతియేనొగిన్ 

    నానలినాక్షినిదనరయైదుగురొయ్యనబంచుకొండనన్ 
    నాననమందునన్ మిగులహర్షమునొందుచునేటికొక్కరున్ 
    దానికుమారులైదుగురుదానినిగూడిరిపెద్దలౌననన్

    రిప్లయితొలగించండి