3-11-2020 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అతివ లెల్లరు రోసెద రట్లతదియ”
(లేదా…)
“అతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురే”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:చతికిల నేలనున్ పడుచు చప్పటి యట్టులు చేసి మ్రింగుచున్మితమును లేక పర్విడుచు మిట్టలు పల్లము లాడి పాడుచున్కుతిగొని నూయలన్ నిలిపి కూరుచు నూగెడు రీతి నూతనం పతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురే...
* కుతిగొని యూయలన్
అట్లతద్ది 'సరదా'ల మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'నూతనంపు+అతివలు=నూతనంపు టతివలు' అవుతుంది. "... నూగెడు నేటి/నూత్న కాలమం దతివలు..." అందామా?
🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతిముక్కునోరుమూయుచుఁ బ్రతియొక్కరున్నునింటనుండుమని ప్రభుతహెచ్చరించపండుగలకెల్ల కోవిడు గండికొట్టెనతివలెల్లరు రోసెద రట్లతదియచంపకమాలబ్రతుకున దీర్ఘమాయువును భర్తలు పొందఁగ నోచు నోమటంచతివలు మెత్తు రట్లతదియన్ మగవారల బాగుకోరుచున్మతిగతి తప్ప నొక్కడనె మాటలఁ దూలుచు మైకమెక్కువై"యతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురే!"
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఘనత గలిగిన సంస్కృతిన్ గాదటంచు మతము మారిన మూర్ఖుండు హితుల తోడ యతివ లెల్లరు రోసెద రట్లతదియ యనుచు పలుకగ నడచిరా యనుసరుండ్రు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "హితులతోడ నతివ లెల్లరు...తదియ ననుచు" అనండి. 'అనుసరుండ్రు'?
గుంపులుగ జేర వెఱచిరి కోవి డంచు పండు గెందుకు వచ్చె నో బాధ పెట్ట ననుచు కుమిలెడు చిత్తాన నాంధ్ర నున్న నతివ లెల్లరు రోసెద రట్ల తదియ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం)పితలను మాతలన్ విడిచి ప్రీతిని జేరుచు హాస్టెలందునన్ కితకితలిచ్చి డింభకుల గిచ్చుచు కొట్టెడి నేటి రోజులన్వెతకుట నచ్చకే పతిని వెఱ్ఱిగ జేయుచు పూజలంచు మా యతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురే...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వెదకుట' అన్నది సాధుపదం. అక్కడ 'వెతలు దొలంగగా పతిని...' అందామా?
మతమును మారి క్రైస్తవమె మంచిదటంచువచించువాడు సు ప్రతిభను గ్రోలి మూర్ఖులు సురాపుల గూడుచు వాగె మైకమున్ వ్రతములు మూఢనమ్మకమురా! యవి నేడిల గాంచ విజ్ఞులౌ యతివలు మెచ్చరట్లతదియన్ మగవారల పండుగందురే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'విజ్ఞులౌ నతివలు...'
జతగను గూడిబడి మనసా యుపవాసము సేసి మందితోనతులిత భక్తితోడ నగజాతను గొల్చుచు నట్లుమేయుచున్ వ్రతమది యాడువారికని భర్తకు జెప్పగలేక నేలపై జతికిల బడ్డ భామిని విచారము గోపము తోడ భర్తతోన్ ఇతరము లేమియెంచకను ఈవ్రత మన్నను యాడువారికిన్ అతి"వలు మెచ్చ రట్లతదియన్" మగవారల పండుగందురే?? (వలము + ఎచ్చరు)వలము = ఆధిక్యము, ఎచ్చరు = హెచ్చరిక
వైవిధ్యంగా పూరించాలన్న మీ ఉత్సాహం ప్రశంసింపదగినది. "...గూడి పాడి...భర్తతో నితరము... యెంచకయె యీ వ్రతమన్ననె యాడువారికిన్" అనండి. 'వలము+ఎచ్చరు=వలమెచ్చరు' అవుతుంది. సమస్యలో 'వలుమెచ్చరు' అని కదా ఉన్నది!
చంపకమాల:++++++++++===+గతుకుల బాటలోనడిచి, గాఢముగానుటనీదిసంద్రమున్మెతుకుకు లోటులేదనగ,మెల్లగ దీనిని మంగళమ్ముగానతివలు బూజసేయుదురు,నాణ్యముగానదిఖర్చు యైననేనతివలుమెచ్చరట్లతదియనున్ మగవారి పండుగందురే??+++++++++++++++++రావెల పురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'గాఢముగా నట..' టైపాటు అనుకుంటాను.
౧.ఆచరించని వారల నడుగ వలదుపండుగలనెట్లు జరుపగ భారమనుచునోపలేకుండ నున్నట్టి యూరులోనిఅతివ లెల్లరు రోసెద రట్లతదియ!౨.వితరణశీలురైన కడు పేదతనమ్మున నున్నవారలైపతనము జేయబోరు మరి పండుగ నంగ కలుంగుసంతసమ్మె తగువిధమ్మునన్నెటుల మీరరుగా ఘన సంప్రదాయ మున్అతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురే”
చతురత విద్యనేర్చుటయె చానల కీయెడ నిష్టకృత్యమై పతులను గోరునోములిక పాతపురాణములంచు హేళనన్నతివలు మెచ్చరట్లతదియన్; మగవారల పండగందురేసతులకు బ్రీతిగూర్చుచును చక్కగ నట్లను బోయనేర్వగా!
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
సమస్య :అతివలు మెచ్చ రట్లతది యన్ మగవారల పండుగందురే (అట్లతద్ది పండుగ నెంత శ్రద్ధగా జరుపుకొన్నా భ్రష్టభర్త దొరికాడే ! అని చింతిస్తున్న అమ్మాయి ఆవేదన )" గతజలసేతుబంధనము ;గాంచగ జీవితమెంత మారెనే !మతిచెడినట్లు మద్యమున మత్తున జోగుచు పేకయాటతో బతనము నందె ; నా కితడు భ్రష్టుడు భర్తయ ? దెబ్బతింటి " నం చతివలు మెచ్చ రట్లతది యన్ ; మగవారల పండుగందురే !
గుంపుగూడకమెలగిన నింపుగానుమాటవినుమని చెప్పగా మంచికోరికోవిడందరి కొంపలగూల్చెననుచుఅతివలెల్లరు రోసెద రట్లతదియ
అతులితశోభ నాంగుడు నిజాత్మ సఖుండగుభర్త కోసమైసతతముపూజ సల్పుదు రచంచలనిర్మలభక్తి భావనన్వెతలిడు భర్త దుష్టుడు లభింపగనేడ్తు రిదేమి ఖర్మమోయతివలు మెచ్చరట్లతదియన్ మగవారలపండుగందురే?
స్ఫూర్తి శ్యామల రాయల వారి బ్లాగ్కామింటునేటి మగువల మదిదోచి నెమ్మి జేర్చుహేలొవీను పండగలేను హేల హేలనతివ లెల్లరు రోసెద రట్లతదియ మారె కాలము వినవె బామ్మా జిలేబి!జిలేబి
హెలొవీను చేష్ట లనెడు వెతల నతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందు రే ఓజిలేబి కాలమ్ము మారె జీన్సులమరగా!జిలేబి
వ్రతమును సలుపు చుందురాపకనె గాని ,యతివ లెల్లరు రోసెద రట్లతదియనాచరిచు పూచి నాతిదే యనుచు నుడువ ;పురుషులదది వారి స్వాస్థ్యమునకు గనుక
పరుల మాటలు నమ్మిన పడతి యొకతెమతము మారెను పతియును పండుగనగ పలికె నెవ్వరు చేయరు వలపు కలిగి అతివ లెల్లరు రోసెద రట్లతదియ
అతుకుల బొంతలై బ్రతుకు లార్థికదుస్థితు లావహించగాఁజితికెను, తిండిగింజలకె తీరని యప్పులుఁ దప్పవయ్యె, నీస్థితులు కరోన హేతువునఁ జేకురు చుండగ, సంబరంబుతోనతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురేకంజర్ల రామాచార్య.
మైలవరపు వారి పూరణ పతి తమ దైవమంచు మది భక్తిని నమ్మెడి భారతాంగనల్వ్రతములు నోములంచు ప్రతివర్షము భర్తృపదమ్ములంటు సం... స్కృతి గలవారు., పూజలన నిష్టము వారికి., భక్తిపూర్ణలౌయతివలు మెచ్చర., ట్లతదియన్ మగవారల పండుగందురే ?! మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పతి తమ దైవమంచు మది భక్తిని నమ్మెడి భారతాంగనల్వ్రతములు నోములంచు ప్రతివర్షము భర్తృపదమ్ములంటు సం... స్కృతి గలవారు., పూజలన నిష్టము., సేయగ వద్దటన్ననాయతివలు మెచ్చర., ట్లతదియన్ మగవారల పండుగందురే ?! (మెచ్చరు) మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
పతులకు సౌఖ్యముల్ కలుగ వారిజ వైరికి పూజ జేసి తామతులిత భక్తితో నతివ లట్లను పంచు వ్రతమ్ము చేసెడిన్పతనముచెంది భర్త కడు బాధల పెట్టుచు నుండ నీసుతోనతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురే
టైపాట్లను సవరించినందుకు ధన్యవాదాలు గురుదేవా.. !జతగను గూడిఁబాడి మనసా యుపవాసము సేసి మందితోనతులిత భక్తితోడ నగజాతను గొల్చుచు నట్లుమేయగానతడు మగండునట్లుఁదిన ఘాతముఁజేసె సమిష్టి చూడగన్జతికిల బడ్డ భామిని విచారము గోపము తోడ భర్తతోన్అతి"వలు మెచ్చ రట్లతదియన్" మగవారల పండుగందురే??(వలుము + ఎచ్చరు)వలుము = మోసము, ఎచ్చరు = హెచ్చరిక
అతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురేమతి మరలించు మాటలవి మానినులెన్నడునట్లు బల్కరేఅతివలు జేతు రట్లతదియన్ గడు శ్రద్ధయు భక్తిఁ వేడుచున్నతులొనరింతురా యుమకు నమ్మితి మిమ్మని మంగళత్వమున్
తెల్లవారంగముందుగాచల్లయట్లనమ్మవారికినైవేద్యమారగింపజేసియుయ్యాలలూగుచుచిన్మనమునసంతసంబునునొందుచుజరుపుకొనగనతివలెల్లరురోసెదరట్లతదియయనుటపాడిగదోచెనే యార్య!మీకు
నాతినోమునోచిమగనిమాటునుంటనేటిరీతిగాదుతెలిసినేర్పుమీరెవేషభాషలమగనాలివేగమారెఅతివరెల్లరురోసెదరట్లతదియ
ఇదియు పడతుల పర్వమంచెల్లడనననతివలెల్లరు, రోసెద రట్లతదియతీపి వంటలు కావివి తినుట యెట్లుటంచు పతులు హాసము తోడ నందు రిలను.
పొద్దు పొడువక పూర్వమ్మ ముదిత లెల్ల లేచి మఱచి పెట్టిన చోటు సూచి చూచిరుబ్బినట్టి పిండిని నింట నబ్బ యంచు నతివ లెల్లరు రోసెద రట్లతదియ [రోయు = వెదకు]పతి సుత బంధువర్గమును బండుగ వచ్చెను లెండు లెండు నా నతివలు వల్కి వేసి తగ నట్టులు కమ్మగ వేఁడివేఁడిగాఁ జతురత నెల్ల వారలకుఁ జక్కగ మోదము గూర్తు రింపుగా నతివలు మెచ్చ రట్లతదియన్? మగవారల పండు గందురే?
అతివలుమెచ్చరట్లతదియన్ మగవారలపండుగందురేమతిగలవారలెవ్వరునుమాటలనిట్లుగబల్కరెప్పుడున్ నతివలపండుగేయిదినిహారిక!నేర్వుమతప్పకుండగన్ బతులకుమంచిగల్గుటకుభామలుసేతురుగాదెనోములన్
వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని జరుపుకొనే పండుగ అనే భావనతో నా ఈ పూరణ. చం: సతులుగ సౌభగమ్మలర సంత్క్రుతి సేతురు నమ్మ గౌరికిన్వ్రతమును జేసి సిద్ధి గుడువంగ లభించెడు స్వాస్థ్య సామ్యతల్పతనము గాక యుండు నటు పంతము బూనెద రట్లు గానిచోఅతివలు మెచ్చ రట్ల తదియన్, మగవారల పండుగందురే !వై. చంద్రశేఖర్
తీరికన్నదియెరుగదు నారినేడు క్షణమువిడువకచాటింగు సలుపుచుండుపాతరోజులసరదాలు రోతనేడుఅతివ లెల్లరు రోసెద రట్లతదియ
పండుగన్నది దండుగై ప్రజలయందునైక మత్యము నశియించ సాకగలుగుసంతసంబను మాటల సంతలేక నతివ లెల్లరురోసెద రట్లతదియ
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
చతికిల నేలనున్ పడుచు చప్పటి యట్టులు చేసి మ్రింగుచున్
మితమును లేక పర్విడుచు మిట్టలు పల్లము లాడి పాడుచున్
కుతిగొని నూయలన్ నిలిపి కూరుచు నూగెడు రీతి నూతనం
పతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురే...
తొలగించండి* కుతిగొని యూయలన్
అట్లతద్ది 'సరదా'ల మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నూతనంపు+అతివలు=నూతనంపు టతివలు' అవుతుంది. "... నూగెడు నేటి/నూత్న కాలమం దతివలు..." అందామా?
🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండిముక్కునోరుమూయుచుఁ బ్రతియొక్కరున్ను
నింటనుండుమని ప్రభుతహెచ్చరించ
పండుగలకెల్ల కోవిడు గండికొట్టె
నతివలెల్లరు రోసెద రట్లతదియ
చంపకమాల
బ్రతుకున దీర్ఘమాయువును భర్తలు పొందఁగ నోచు నోమటం
చతివలు మెత్తు రట్లతదియన్ మగవారల బాగుకోరుచున్
మతిగతి తప్ప నొక్కడనె మాటలఁ దూలుచు మైకమెక్కువై
"యతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురే!"
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఘనత గలిగిన సంస్కృతిన్ గాదటంచు
రిప్లయితొలగించండిమతము మారిన మూర్ఖుండు హితుల తోడ
యతివ లెల్లరు రోసెద రట్లతదియ
యనుచు పలుకగ నడచిరా యనుసరుండ్రు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"హితులతోడ నతివ లెల్లరు...తదియ ననుచు" అనండి. 'అనుసరుండ్రు'?
గుంపులుగ జేర వెఱచిరి కోవి డంచు
రిప్లయితొలగించండిపండు గెందుకు వచ్చె నో బాధ పెట్ట
ననుచు కుమిలెడు చిత్తాన నాంధ్ర నున్న
నతివ లెల్లరు రోసెద రట్ల తదియ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పితలను మాతలన్ విడిచి ప్రీతిని జేరుచు హాస్టెలందునన్
కితకితలిచ్చి డింభకుల గిచ్చుచు కొట్టెడి నేటి రోజులన్
వెతకుట నచ్చకే పతిని వెఱ్ఱిగ జేయుచు పూజలంచు మా
యతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురే...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వెదకుట' అన్నది సాధుపదం. అక్కడ 'వెతలు దొలంగగా పతిని...' అందామా?
🙏
తొలగించండిమతమును మారి క్రైస్తవమె మంచిదటంచువచించువాడు సు
రిప్లయితొలగించండిప్రతిభను గ్రోలి మూర్ఖులు సురాపుల గూడుచు వాగె మైకమున్
వ్రతములు మూఢనమ్మకమురా! యవి నేడిల గాంచ విజ్ఞులౌ
యతివలు మెచ్చరట్లతదియన్ మగవారల పండుగందురే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విజ్ఞులౌ నతివలు...'
జతగను గూడిబడి మనసా యుపవాసము సేసి మందితో
రిప్లయితొలగించండినతులిత భక్తితోడ నగజాతను గొల్చుచు నట్లుమేయుచున్
వ్రతమది యాడువారికని భర్తకు జెప్పగలేక నేలపై
జతికిల బడ్డ భామిని విచారము గోపము తోడ భర్తతోన్
ఇతరము లేమియెంచకను ఈవ్రత మన్నను యాడువారికిన్
అతి"వలు మెచ్చ రట్లతదియన్" మగవారల పండుగందురే??
(వలము + ఎచ్చరు)
వలము = ఆధిక్యము, ఎచ్చరు = హెచ్చరిక
వైవిధ్యంగా పూరించాలన్న మీ ఉత్సాహం ప్రశంసింపదగినది.
తొలగించండి"...గూడి పాడి...భర్తతో నితరము... యెంచకయె యీ వ్రతమన్ననె యాడువారికిన్" అనండి.
'వలము+ఎచ్చరు=వలమెచ్చరు' అవుతుంది. సమస్యలో 'వలుమెచ్చరు' అని కదా ఉన్నది!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంపకమాల:
రిప్లయితొలగించండి++++++++++===+
గతుకుల బాటలోనడిచి, గాఢముగానుటనీదిసంద్రమున్
మెతుకుకు లోటులేదనగ,మెల్లగ దీనిని మంగళమ్ముగా
నతివలు బూజసేయుదురు,నాణ్యముగానదిఖర్చు యైననే
నతివలుమెచ్చరట్లతదియనున్ మగవారి పండుగందురే??
+++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'గాఢముగా నట..' టైపాటు అనుకుంటాను.
౧.
రిప్లయితొలగించండిఆచరించని వారల నడుగ వలదు
పండుగలనెట్లు జరుపగ భారమనుచు
నోపలేకుండ నున్నట్టి యూరులోని
అతివ లెల్లరు రోసెద రట్లతదియ!
౨.
వితరణశీలురైన కడు పేదతనమ్మున నున్నవారలై
పతనము జేయబోరు మరి పండుగ నంగ కలుంగుసంతస
మ్మె తగువిధమ్మునన్నెటుల మీరరుగా ఘన సంప్రదాయ మున్
అతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురే”
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిచతురత విద్యనేర్చుటయె చానల కీయెడ నిష్టకృత్యమై
రిప్లయితొలగించండిపతులను గోరునోములిక పాతపురాణ
ములంచు హేళన
న్నతివలు మెచ్చరట్లతదియన్; మగవారల పండగందురే
సతులకు బ్రీతిగూర్చుచును చక్కగ నట్లను బోయనేర్వగా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిఅతివలు మెచ్చ రట్లతది
యన్ మగవారల పండుగందురే
(అట్లతద్ది పండుగ నెంత శ్రద్ధగా జరుపుకొన్నా భ్రష్టభర్త దొరికాడే ! అని చింతిస్తున్న అమ్మాయి ఆవేదన )
" గతజలసేతుబంధనము ;
గాంచగ జీవితమెంత మారెనే !
మతిచెడినట్లు మద్యమున
మత్తున జోగుచు పేకయాటతో
బతనము నందె ; నా కితడు
భ్రష్టుడు భర్తయ ? దెబ్బతింటి " నం
చతివలు మెచ్చ రట్లతది
యన్ ; మగవారల పండుగందురే !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగుంపుగూడకమెలగిన నింపుగాను
రిప్లయితొలగించండిమాటవినుమని చెప్పగా మంచికోరి
కోవిడందరి కొంపలగూల్చెననుచు
అతివలెల్లరు రోసెద రట్లతదియ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅతులితశోభ నాంగుడు నిజాత్మ సఖుండగుభర్త కోసమై
రిప్లయితొలగించండిసతతముపూజ సల్పుదు రచంచలనిర్మలభక్తి భావనన్
వెతలిడు భర్త దుష్టుడు లభింపగనేడ్తు రిదేమి ఖర్మమో
యతివలు మెచ్చరట్లతదియన్ మగవారలపండుగందురే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిస్ఫూర్తి శ్యామల రాయల వారి బ్లాగ్కామింటు
నేటి మగువల మదిదోచి నెమ్మి జేర్చు
హేలొవీను పండగలేను హేల హేల
నతివ లెల్లరు రోసెద రట్లతదియ
మారె కాలము వినవె బామ్మా జిలేబి!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిహెలొవీను చేష్ట లనెడు వె
తల నతివలు మెచ్చ రట్లతదియన్ మగవా
రల పండుగందు రే ఓ
జిలేబి కాలమ్ము మారె జీన్సులమరగా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివ్రతమును సలుపు చుందురాపకనె గాని ,
రిప్లయితొలగించండియతివ లెల్లరు రోసెద రట్లతదియ
నాచరిచు పూచి నాతిదే యనుచు నుడువ ;
పురుషులదది వారి స్వాస్థ్యమునకు గనుక
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపరుల మాటలు నమ్మిన పడతి యొకతె
రిప్లయితొలగించండిమతము మారెను పతియును పండుగనగ
పలికె నెవ్వరు చేయరు వలపు కలిగి
అతివ లెల్లరు రోసెద రట్లతదియ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅతుకుల బొంతలై బ్రతుకు లార్థికదుస్థితు లావహించగాఁ
రిప్లయితొలగించండిజితికెను, తిండిగింజలకె తీరని యప్పులుఁ దప్పవయ్యె, నీ
స్థితులు కరోన హేతువునఁ జేకురు చుండగ, సంబరంబుతో
నతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురే
కంజర్ల రామాచార్య.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపతి తమ దైవమంచు మది భక్తిని నమ్మెడి భారతాంగనల్
వ్రతములు నోములంచు ప్రతివర్షము భర్తృపదమ్ములంటు సం...
స్కృతి గలవారు., పూజలన నిష్టము వారికి., భక్తిపూర్ణలౌ
యతివలు మెచ్చర., ట్లతదియన్ మగవారల పండుగందురే ?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిపతి తమ దైవమంచు మది భక్తిని నమ్మెడి భారతాంగనల్
వ్రతములు నోములంచు ప్రతివర్షము భర్తృపదమ్ములంటు సం...
స్కృతి గలవారు., పూజలన నిష్టము., సేయగ వద్దటన్ననా
యతివలు మెచ్చర., ట్లతదియన్ మగవారల పండుగందురే ?!
(మెచ్చరు)
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
పతులకు సౌఖ్యముల్ కలుగ వారిజ వైరికి పూజ జేసి తా
రిప్లయితొలగించండిమతులిత భక్తితో నతివ లట్లను పంచు వ్రతమ్ము చేసెడిన్
పతనముచెంది భర్త కడు బాధల పెట్టుచు నుండ నీసుతో
నతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురే
టైపాట్లను సవరించినందుకు ధన్యవాదాలు గురుదేవా.. !
రిప్లయితొలగించండిజతగను గూడిఁబాడి మనసా యుపవాసము సేసి మందితో
నతులిత భక్తితోడ నగజాతను గొల్చుచు నట్లుమేయగా
నతడు మగండునట్లుఁదిన ఘాతముఁజేసె సమిష్టి చూడగన్
జతికిల బడ్డ భామిని విచారము గోపము తోడ భర్తతోన్
అతి"వలు మెచ్చ రట్లతదియన్" మగవారల పండుగందురే??
(వలుము + ఎచ్చరు)
వలుము = మోసము, ఎచ్చరు = హెచ్చరిక
అతివలు మెచ్చ రట్లతదియన్ మగవారల పండుగందురే
రిప్లయితొలగించండిమతి మరలించు మాటలవి మానినులెన్నడునట్లు బల్కరే
అతివలు జేతు రట్లతదియన్ గడు శ్రద్ధయు భక్తిఁ వేడుచున్
నతులొనరింతురా యుమకు నమ్మితి మిమ్మని మంగళత్వమున్
తెల్లవారంగముందుగాచల్లయట్ల
రిప్లయితొలగించండినమ్మవారికినైవేద్యమారగింప
జేసియుయ్యాలలూగుచుచిన్మనమున
సంతసంబునునొందుచుజరుపుకొనగ
నతివలెల్లరురోసెదరట్లతదియ
యనుటపాడిగదోచెనే యార్య!మీకు
నాతినోమునోచిమగనిమాటునుంట
రిప్లయితొలగించండినేటిరీతిగాదుతెలిసినేర్పుమీరె
వేషభాషలమగనాలివేగమారె
అతివరెల్లరురోసెదరట్లతదియ
ఇదియు పడతుల పర్వమంచెల్లడనన
రిప్లయితొలగించండినతివలెల్లరు, రోసెద రట్లతదియ
తీపి వంటలు కావివి తినుట యెట్లు
టంచు పతులు హాసము తోడ నందు రిలను.
పొద్దు పొడువక పూర్వమ్మ ముదిత లెల్ల
రిప్లయితొలగించండిలేచి మఱచి పెట్టిన చోటు సూచి చూచి
రుబ్బినట్టి పిండిని నింట నబ్బ యంచు
నతివ లెల్లరు రోసెద రట్లతదియ
[రోయు = వెదకు]
పతి సుత బంధువర్గమును బండుగ వచ్చెను లెండు లెండు నా
నతివలు వల్కి వేసి తగ నట్టులు కమ్మగ వేఁడివేఁడిగాఁ
జతురత నెల్ల వారలకుఁ జక్కగ మోదము గూర్తు రింపుగా
నతివలు మెచ్చ రట్లతదియన్? మగవారల పండు గందురే?
అతివలుమెచ్చరట్లతదియన్ మగవారలపండుగందురే
రిప్లయితొలగించండిమతిగలవారలెవ్వరునుమాటలనిట్లుగబల్కరెప్పుడున్
నతివలపండుగేయిదినిహారిక!నేర్వుమతప్పకుండగన్
బతులకుమంచిగల్గుటకుభామలుసేతురుగాదెనోములన్
వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని జరుపుకొనే పండుగ అనే భావనతో నా ఈ పూరణ.
రిప్లయితొలగించండిచం:
సతులుగ సౌభగమ్మలర సంత్క్రుతి సేతురు నమ్మ గౌరికిన్
వ్రతమును జేసి సిద్ధి గుడువంగ లభించెడు స్వాస్థ్య సామ్యతల్
పతనము గాక యుండు నటు పంతము బూనెద రట్లు గానిచో
అతివలు మెచ్చ రట్ల తదియన్, మగవారల పండుగందురే !
వై. చంద్రశేఖర్
తీరికన్నదియెరుగదు నారినేడు
రిప్లయితొలగించండిక్షణమువిడువకచాటింగు సలుపుచుండు
పాతరోజులసరదాలు రోతనేడు
అతివ లెల్లరు రోసెద రట్లతదియ
పండుగన్నది దండుగై ప్రజలయందు
రిప్లయితొలగించండినైక మత్యము నశియించ సాకగలుగు
సంతసంబను మాటల సంతలేక
నతివ లెల్లరురోసెద రట్లతదియ