8, నవంబర్ 2020, ఆదివారం

సమస్య - 3539

9-11-2020 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“భౌతికశాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్”

(లేదా…)

“భౌతికశాస్త్రముం జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్”

111 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    రాతిరి శంకరాభరణ ప్రాంగణ మందున జొచ్చి వేడుకన్
    చేతికి వచ్చినట్టివియు చేరువ నున్నవి నోటి కూతలన్
    నీతియు నీమమున్ గనక నిక్కపు రీతిని శాస్త్రివర్యుడే
    భౌతికశాస్త్రముం జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రీతిని శంకరాభరణ వేదికపై కవిమిత్రులౌననన్
      ఖ్యాతిని పొందితీవు సరదా కవితామృత మొల్కబోయుచున్
      నీతిని నీమమున్ దగ గణించు ప్రభాకర శాస్త్రి వర్యుఁడా!
      భౌతికశాస్త్రముం జదివి పద్యకవిత్వము వ్రాసి మించితే!

      తొలగించండి
    2. మీ సరదా (సెల్ఫ్ గోల్) పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    3. వేతన మొందగోరి కడు వేడుక మీరగ ఖర్గపూరునన్,
      భౌతిక శాస్త్రమున్ చదివి, పండుగ జేయుచు పల్కులీనితిన్...
      ఖ్యాతిని కోరకే కడకు గండరగండ్ల సమూహమందు వే
      భీతిని జేరి పద్యరుచి భిక్షను పొందితి కంది శంకరా!

      🙏

      తొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ప్రీతిని దేశభక్తి గొని పెద్దవి మాటలు పల్కజాలకే
    కోతలు కోయకే తనరి గొప్పగ జెప్పక ధర్మశాస్త్రముల్
    నీతులు చెప్పకే విరివి నేతల చేష్టల తోషమొందుచున్
    భౌతికశాస్త్రముం జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్...

    రిప్లయితొలగించండి
  3. వేతన జీవిగ మారెను
    భౌతిక శాస్త్రమ్ము చదివి : వ్రాసెను కవితల్
    పోతన పద్యాలు చదివి
    చేతన యిన రీతి తాను చెలువపు ఫణతి న్

    రిప్లయితొలగించండి
  4. అందరికీ నమస్సులు🙏🙏

    నా పూరణ యత్నం..

    *కం*

    కోతలు కోయుచు నొక్కడు
    నీతులు జెప్పంగ మేము నిష్ఠగ బల్కెన్
    హా! తెలిసెను జూడగ, తా
    *“భౌతికశాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్”*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరికీ నమస్సులు🙏🙏

      నా పూరణ యత్నం .

      *కం*

      కైతలు వ్రాయుట రాదట
      వాతలు బెట్టంగ జెప్పె వణుకుచు మాకున్
      చేతలతో డౌటొచ్చెను
      *“భౌతికశాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్”*

      *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
      🙏😀

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'మేము... పల్కెన్' వచనదోషం.

      తొలగించండి
  5. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కౌతుక మొప్పగ పేర్మిని
    భౌతికశాస్త్రముం జదివి వ్రాసెను కవితలు
    రీతిగ నాంధ్రము నేర్చిన
    చాతుర్యము కలిగినట్టి శాస్త్రజ్ఞుడటన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...శాస్త్రమ్ముఁ జదివి...కవితల్" టైపాటు.

      తొలగించండి
  6. కందం
    చైతన్యమాంగ్ల కైతలు
    మోతగ నిడ కంది 'గురులు' బూనిన యంతన్
    జేతగ గుర్రము వారలు
    భౌతిక శాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్

    ఉత్పలమాల
    బ్రాఁతిఁ బ్రభాకరుల్ దొలుత భౌతికశాస్త్ర ప్రబోధకుండునై
    చేతనుడౌచు నాంగ్లమున చిక్కని చక్కని కైతలల్లుచున్
    గైతల రాజు శంకరులఁ గాంచియు ప్రేరణనభ్యసించియున్
    ద్రాతగ నాటవిడ్పు సరదాలను పేర నవీన రీతులన్
    జేతగ రాజకీయములుఁ జిందెడివౌ యుపమాన శోభలన్
    భౌతికశాస్త్రమున్ జదివి పద్యకవిత్వము వ్రాసెమేలుగన్

    రిప్లయితొలగించండి
  7. భౌతికలింగపంచకముభౌతికలక్షణముల్ పరీక్షకుం
    డాతతిగాంచిసామ్యమునునద్భుతరీతివచించిసొంపుగా
    భూతగుణాలుజంతుతతిపోలికలన్ వివరించిమెచ్చుచున్
    *“భౌతికశాస్త్రముం జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్”*

    రిప్లయితొలగించండి
  8. ఖ్యాతి గణింపకే మహిత గౌరవ పద్య విధాన మార్గముల్
    బాతిగ సత్కవీంద్రులు సెబాసన చెప్పె ప్రభాకరుండు-- ని
    భీతిగ నేర్పు కూర్పుగొనె-వీర విహారము జేసె నాతడున్!!
    భౌతిక శాస్రమున్ జదివి పద్య కవిత్వము వ్రాసె మేలుగన్.

    బాతిగ=ప్రీతిగ

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. మీరు మూడుపాదాలను లఘువుతో నారంభించినారు గమనించండి.

      తొలగించండి
    2. అంతేకాదు... రెండవపాదంలో యతి కూడ తప్పింది. సవరించండి.

      తొలగించండి
  10. ప్రీతియె నటతెలుగన్నను
    ఖ్యాతిగడించిన కవివరులన్న కనుకనే
    యాతురతతోడ నాతడు
    భౌతిక శాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్

    రిప్లయితొలగించండి
  11. నైతిక విలువలు గలిగిన
    కైతికములచిన్ననాట కావ్యము చదువ
    న్నేతీరుగనేర్చెనయో
    భౌతికశాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్!!

    రిప్లయితొలగించండి
  12. కందం
    ప్రీతిగ ప్రవరాఖ్యునికై
    నీతిని విడెడున్ వరూధిని సొగసుఁ గనెనో?
    ఖ్యాతిగఁ బెద్దన యప్సర
    ' భౌతిక' శాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్

    ఉత్పలమాల
    చేతన మందుచున్ ప్రకృతి చిక్కెనొ యద్దమయంతి మేనిలోఁ!
    బోతనుఁ బోసెనో నలువ ముద్దుగ సౌష్టవమేర్చికూర్చుచున్
    ఖ్యాతిగొ నంగ నైషధపు కావ్యమునన్ కవిరాజు నాయకీ
    ' భౌతిక' శాస్త్రమున్ జదివి పద్యకవిత్వము వ్రాసెమేలుగన్

    రిప్లయితొలగించండి
  13. ఆతుర సన్యాసము వలె
    కౌతుకమొప్పగ కవియగు కండూతిమెయిన్
    భీతిని వీడుచు వేడుక
    భౌతిక శాస్త్రమ్ము జదివి వ్రాసెను కవితల్ !

    చేతనమందు స్పందనలు చెల్వగు
    రీతిని ప్రజ్వలింపగా
    నూతన యూహలే చెలగి నోటను జారగ మార్దవంబుగన్
    కైతల వ్రాయుటే కవికి గమ్యము! కానమె శాస్త్రివర్యునిన్
    భౌతిక శాస్త్రముంజదివి పద్యకవిత్వము వ్రాసెమేలుగన్ !

    🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'నూతన+ఊహలు=నూతనోహలు' అవుతుంది. యడాగమం రాదు. "నూతన భావముల్.." అందామా?

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏

      తొలగించండి
  14. ఖ్యాతిగడించినట్టి కవులందరు వ్రాసిన కావ్యరాజముల్
    ప్రీతిఁ బఠించి నంతట నభీష్టము హెచ్చగ తెల్గుభాషనే
    బ్రాతిగ కష్టమైనను నిరంతర సాధన చేసి యాతడే
    భౌతిక శాస్త్రమున్ జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్.

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కౌతుక మొప్పగన్ తెలుగు కైతల నల్లు విధానమంతయున్
    రీతిగ నేర్పు ప్రజ్ఞుల దరిన్ జని ఛందము నభ్యసించుచున్
    బ్రాతియెగల్గ నాగగము లన్నియు నేర్చెడి శాస్త్రవేత్త తా
    భౌతిక శాస్త్రమున్ జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కౌతుక మొప్పగన్ తెలుగు కైతల నల్లు విధానమంతయున్
      రీతిగ నేర్పు ప్రజ్ఞుల దరిన్ జని ఛందము నభ్యసించుచున్
      బ్రాతియెగల్గ నాగమములన్నియు నేర్చెడి శాస్త్రవేత్త తా
      భౌతిక శాస్త్రమున్ జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్.

      తొలగించండి
  16. నీతిగ నీమమున్ నిలిపి నేరుగ నేతల ప్రశ్నలేయుచున్
    జాతిని మేలుగొల్ప తగు శాస్త్రము లెల్లను చూచినేర్చెనే
    చేతనమందినాడె జన సీమల సాహితి సేవలంగనన్
    భౌతికశాస్త్రముం జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్!!

    రిప్లయితొలగించండి
  17. నూతన సంగతు లు దెలిపె
    భౌతికశాస్త్రమ్ముఁ జదివి ; వ్రాసెను కవితల్
    ఆతుమ తృప్తిని జెందగ
    కైతల శాస్త్రము జదివిన కతనము వలనన్

    రిప్లయితొలగించండి
  18. ఉ:

    చేతము పట్టుగొల్ప కడు చేరువు ఛందము నేర్వ నెమ్మదిన్
    గీతము బల్కయంగి మొలకెత్తుట మానస మందు కోరికల్
    వ్రాతలు కోతలేల మది భావన లోప్పగ నెంత వారికిన్
    భౌతిక శాస్త్రముం జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్

    అంగి=ముఖ్యము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి


  19. భౌతిక శాస్త్రమ్ము జదివి వ్రాసెన్గవితల్
    (లేదా)
    భౌతిక శాస్త్రమున్ జదివి పద్య కవిత్వము వ్రాసె మేలుగా

    1) కందము

    రీతిగ బాల్యమ్మందున
    ప్రాతః కాలమున లేచి పఠనముఁజేయన్
    ఖ్యాతిగ సకలముఁదెలియుచు
    భౌతిక శాస్త్రమ్ముఁజదివి వ్రాసెన్ గవితల్

    2) ఉత్పలమాల

    రీతిగ బాల్యమందలి వరేణ్యము లైన సుభాషితంబులున్
    కైతలు కావ్యముల్ కథలు కారణ హేతువులైదనర్పగా
    ఖ్యాతిగ శాస్త్రముల్ జదివి బాల్యకుతూహల పారవశ్యతన్
    భౌతిక శాస్త్రమున్ జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగా

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  20. కాళిదాస మహాకవి ఖగోళ భౌగోళిక శాస్త్రములను మేఘసందేశమున జొప్పించిన విషయమును ప్రస్తుతిస్తూ...
    శ్రీ శంకర మహోదయులకు రజనీకర కర రాజిత రజోభరిత ఉత్పలమాల సత్కారమునర్పణ సేయుచూ.... నమశ్శతమ్,,,🙏

    భాతిని గూర్చి భారతికి భావి తరాలకు మేలు సేయగన్
    వ్రాతను గూర్చె మేఘుపయి భారత భూమిని మానమెత్తుచున్
    ఖ్యాతిగ కాళిదాసుడిల కారణ జన్ముడు కాళిభక్తు డే
    భౌతికశాస్త్రముం జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్

    రిప్లయితొలగించండి
  21. భూతిని మెండుగ గోరుచు
    భౌతికశాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్
    రీతిగ విబుధులు మెచ్చగ
    రైతుల వలె జేసె సాగు రాతల పైరుల్ !!

    రిప్లయితొలగించండి
  22. సమస్య :
    భౌతికశాస్త్రముం జదివి
    పద్యకవిత్వము వ్రాసె మేలుగన్

    ( భారతరాష్ట్రపతి అబ్దుల్ కలాం
    భౌతికశాస్త్రపట్టభద్రుడు - కవి )
    ఉత్పలమాల
    ...................
    మాతకు - భారతం బనెడి
    మాతకు - మోదపు ముద్దుబిడ్డడే !
    ఖ్యాతిని గన్న రాష్ట్రపతి -
    గణ్యుడు - భారతరత్న మాతడే !
    నీతికి బద్ధుడున్ - క్షిపణి
    నేతయు - కలామువర్యుడే !
    భౌతికశాస్త్రముం జదివి
    పద్యకవిత్వము వ్రాసె మేలుగన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "నేతయు జ్ఞాని కలాము వర్యుడే" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి

  23. జీపీయెస్ వారికి అంకితం

    తాత ప్రొఫెసరాయె సుమా
    భౌతికశాస్త్రమ్ముఁ జదివి, వ్రాసెను కవితల్
    రాతిరి వేళ తొలుదొలుత
    నౌత సదనమున ప్రభాకరార్యులు వారౌ !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  24. కందోత్పల జీపీయెస్ వారికి అంకితం


    ప్రముఖులు ప్రొఫెసరయిరి బృం
    దిమ, భౌతికశాస్త్రముం జదివి, పద్యకవి
    త్వము వ్రాసె మేలుగన్ సద
    నమున, ప్రభాకరులు వారి నామము రమణీ!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  25. ఇక్కడేమో కంది వారు బాగున్నది ప్రశస్తము అద్భుతము అంటూంటారు.

    అక్కడేమో శ్యామలీయం వారు తూచ్ సదనంలో రాసేవన్ని పద్యాలేనా అంటూంటారు.

    జడశతకమూ ఓ శతకమేనా‌ అంటూ తీసి యేకి పారేసారు.

    ఏవిటో ఈ విష్ణుమాయ!

    నారదర్వాళ్ ఉంగళుక్కు ఏదావదు పురియరుదా :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎవరి టేస్ట్ వారిది! శ్యామలీయం వారు సామాన్యులు కారు. వారి మాటలు ఉపేక్షించవలసినవీ కావు.

      తొలగించండి
  26. [11/9, 5:34 AM] Ramacharya K: నిన్నటి పూరణ

    రుద్రాదిత్యవిరించిముఖ్యవిబుధప్రోత్సాహసమ్ప్రార్థనన్
    క్షుద్రుల్ రాక్షసదుష్టులం దునుమి వైకుంఠాధిపా! డస్సితో?
    తద్రూపశ్రమముల్ దొలంగగ జగద్వాపారయోగావహ
    న్నిద్రాసక్తుఁడవైన నీకు జయమౌ నిక్కంబిదే నమ్ముమా

    కంజర్ల రామాచార్య.


    చేతము తేజరిల్లి నును జెక్కిళు లందున నుల్లసిల్ల కం
    జాతముఖప్రసారసువిశాలవికాసము విస్తరిల్ల ని
    ట్లాతతరమ్యదృగ్గతవిలాసపికస్వరసుందరీలస
    ద్భౌతికశాస్త్రముం జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు నిస్సందేహంగా ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  27. నీతిగ  బ్రతుకగ కోరెను 
    వేతనమునకై పడుచును వెతలను విసుగును పొందెన్ 
    భూతిని వీడిన యాతడు 
    “భౌతికశాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్” 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  28. ఈ నాటి శంకరా భరణము‌ వారి‌ సమస్య

    భౌతిక‌శాస్త్రమ్ము చదివి వ్రాసెన్ కవితల్


    ఇచ్చిన పాదము కందము నా పూరణ సీసములో


    విశ్వ నాధ వారు బి ఎ. చదివారు, అడవి బాపిరాజు లా చదివారు, దాశరధి ఆంగ్ల ము‌చదివారు, వాల్మీకి భూగర్భ ,గణిత త్రికోణ.భౌతిక శాస్త్ర ములు‌ వ్రాసారు పివి నరసింహారావు న్యాయ శాస్త్ర ము చదివారు పూర్వ కవులు చాలా శాస్త్ర ములు‌ వ్రాశారు‌ అన్న. భావనతో పద్యము



    పౌరశాస్తమ్మును బాగుగా చదివియు విబుదుండు గానొప్పె విశ్వ నాధ,

    చదివిన న్యాయ శాస్త్రమ్మును వీడి యా బాపిరాజు కవియై వాసికెక్కె,

    చదివె నాంగ్లమును దాశరధి,వాల్మీకియు ఘనముగా వ్రాసె భూ గర్భ గణిత


    శాస్త్ర ముల్, భౌతిక శాస్త్రమ్ము, చదివి వ్రా
    సెన్ కవితల్ నర సింహ రావు


    న్వాయ. శాస్త్రమున్ వాత్సాయ న ఋషి‌
    వ్రాసె

    రత్న శాస్త్రము,శిల్ప శాస్త్రమును రచన

    చేసె కశ్యప ‌వరుడు ,వ్రాసె నిల‌లోన

    గొప్ప గ్రంధము లానాడు మెప్పు ‌బడసి

    రిప్లయితొలగించండి
  29. జాతికి వెలుగగు తెలుగున 
    కోతబడె నక్షరమ్ములు కూ ళల వలనన్ 
    మూతబడె పద్య రచనని 
    భౌతిక శాస్త్రమ్ము జదివి వ్రాసెను కవితల్ 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రచన+అని' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
  30. మైలవరపు వారి పూరణ

    చేతము పూతమై నవవిచిత్రమనోహరకావ్యకల్పనా
    వ్రాతమరందగంధయుతభాసురపుష్పముగాగ బల్కులే
    కైతలగున్., ప్రభాకరుల గాంచుడు., బాల్యమునందు శ్రద్ధగా
    భౌతికశాస్త్రమున్ జదివి పద్యకవిత్వము వ్రాసె మేలనన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.

      తొలగించండి

    2. మరోపూరణ...
      అందరికీ అభినందనలు 💐👏🙏

      ప్రీతిగనింజనీర్లయిన శ్రీకరులౌ నవశాస్త్రవేత్తలేన్
      ఖ్యాతినిగొన్న వైద్యులును., బ్యాంకులవృత్తులవారలట్టు., లే
      జాతికిచెందినన్ గురులు శంకరులిచ్చు సమస్య చూడగా
      రాతిరి పూరణమ్ము నిదురన్ దరిజేరగనీయదట్లె ప్రా...
      భాతికవేళ దుప్పటిని ప్రక్కకు ద్రోసి రచింపజేసెడిన్
      మేత లభించినట్లు మనమే ప్రథమంబను స్పర్థనిండగా.,
      కౌతుకమేమొ గాని కనగా వ్యసనంబుగ మారె! నిట్టులీ
      రీతిగ శ్రీ ప్రభాకరవరేణ్యులు నవ్వులు చిందునట్లుగా
      భౌతికశాస్త్రమున్ జదివి పద్యకవిత్వము వ్రాసె మేలనన్!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  31. మాతోటి వాడొకఁడు దా
    భౌతిక శాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్
    ఆతని కవితలు నట్లే
    భౌతిక శాస్త్రంబు భంగి భయమే కొలిపెన్!

    రిప్లయితొలగించండి
  32. మేతయు, గుడ్డ, గూడులును మిక్కిలి ముఖ్యము గావునన్ సదా
    చేతము వృత్తినిన్ యిడుచు జీవిత బీమను సేవజేయుచున్
    పోతన పద్య ధారలను ముద్దుగ నేర్చుచు యజ్ఞఁమిట్టులన్
    భౌతికశాస్త్రముం జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్


    యజ్ఞం-యజ్ఞభగవాన్

    స్వోత్కర్షకు-క్షమార్హూణ్ణి🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విత్తినిన్+ఇడుచు' అన్నపుడు యడాగమం రాదు. 'యజ్ఞ మిట్టులన్' అన్నపుడు అరసున్న అవసరం లేదు.

      తొలగించండి
  33. ఆతత పాండితీ గరిమ వ్యాకరణమ్మున పట్టుచిక్కినన్
    ఖ్యాతిని పొందగా తరమె కమ్మని పద్యములన్ లిఖించుటన్
    వ్రాతను బట్టి చేకుఱును వాణి లభించుట,యామె చేరగా
    భౌతిక శాస్త్రమున్ జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్

    రిప్లయితొలగించండి
  34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  35. 🙏🏻🙏🏻సవరణతో,
    ఉ.
    మేతయు, గుడ్డ, గూడులును మిక్కిలి ముఖ్యము గావునన్ సదా
    చేతము వృత్తినిచ్చుచును జీవిత బీమను సేవజేయుచున్
    పోతన పద్య ధారలను ముద్దుగ నేర్చుచు యజ్ఞమిట్టులన్
    భౌతికశాస్త్రముం జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్

    చేతిపట్టి పద్యాక్షరాభ్యాసము చేయించిన గురువులకు నమస్సులు.
    🙏🏻🌺🙏🏻

    రిప్లయితొలగించండి
  36. ప్రీతినిపద్యమునెడలను
    గౌతుకముగనేర్చుకొనియుగుముదముతోడన్
    జేతములలరగగ్రహపతి
    భౌతికశాస్త్రమ్ముచదివివ్రాసెనుకవితల్

    రిప్లయితొలగించండి
  37. మా తలి దండ్రు లాప్తులు సమాజము నన్నొక యింజ నీరుగా
    ఖ్యాతి సివిల్ పఠించియు ప్రయాస యశస్సు ధనంబు నించ నా
    భౌతిక మంకవిద్య పరభాష రసాయన శాస్త్ర సంస్కృతం
    బాతుర పాటు జేర్చఁ జదువయ్యగఁ గాపుగ పాట్లమారి గా
    నాతము నంది యూడిగము నంతము గాగ దృశానుడయ్యు దా
    *“భౌతికశాస్త్రముం జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్”*

    రిప్లయితొలగించండి
  38. నేతల కింపుగ స్వజన
    వ్రాతము మెచ్చఁగఁ గడింది పట్టుదలం దాఁ
    బ్రీతి దనర శాస్త్ర్యుక్తపు
    భౌతిక శాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్


    పూతులు ధాత్రి వ్యాస కవిముఖ్యుల సన్నుతి సేసి ధర్మ సం
    వీతము, మించి ఛందము కవిత్రయ పూర్వకవీంద్ర సత్కృతి
    వ్రాతము వే పఠించి ఘన వ్యాకర ణావృత మాంధ్ర మింకయున్
    భౌతిక శాస్త్రముం జదివి, పద్యకవిత్వము వ్రాసె మేలుగన్

    [కవి = వాల్మీకి మహర్షి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా! వృత్తపూరణ మీ సంబంధియే యని తలచెదను! మీరును వ్యాస కవి ముఖ్యుల కోవకు చెందినవారే! 🙏🙏🙏🙏

      తొలగించండి
    2. శాస్త్ర్యుక్తపు భౌతిక శాస్త్రము: శాస్త్రవిదులు చెప్పిన భౌతిక శాస్త్రము
      ధ్వని:
      శాస్త్ర్యుక్తపు కవితల్ : శాస్త్రి చెప్పిన కవితలు

      వృత్తములో స్వీయ ధ్వని.
      ధర్మ సంవీతము పద్యకవిత్వము.

      వ్యాస మహర్షి: శ్రీకృష్ణ సూక్తిసుధాకరము చే
      వాల్మీకి మహర్షి: శ్రీమమదాంధ్ర సుందర కాండ బాల కాండ (ప్రస్తుత మయోధ్యాకాండ ఆఱవ సర్గము) లచే సమ్మానితులు.

      రామాయణము మూడు మార్లు, మహాభారతము సంపూర్ణము మూడు మార్లు, భాగవతము నాలుగు మార్లు, మనుచరిత్ర, పారిజాతాపహరణము, ఆముక్తమాల్యద, అచ్చతెనుగు రామాయణము, మొల్ల రామాయణము, పాండురంగ మాహాత్మ్యము, శతకంఠ రామాయణము, శ్రీ ప్రబంధ రాజ వేంకటేశ్వర విలాసము, కుబ్జ విలాసము మున్నగునవి చదివితిని.


      తొలగించండి
    3. డా. సీతా దేవిగారు ధన్యవాదములు. వ్యాస దాసుఁడను.

      తొలగించండి
    4. నా ప్రియతమ కవిసార్వభౌముఁడు శ్రీనాథుని కావ్యము లున్నత పాఠశాలలోఁ జదివినవి తక్కఁ బూర్తిగాఁ జదువుటకు నాకు లభ్యము కాలేదు.

      తొలగించండి
    5. శ్రీ ప్రబంధ రాజ వేంకటేశ్వర విలాసము... వ్యాఖ్యానంతో ఎక్కడైనా లభిస్తుందా?

      తొలగించండి
    6. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    7. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      శ్రీ ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసము నావద్ద నున్నది కాని వ్యాఖ్యానముతో నున్నది కాదు. వలసిన మీకుఁ బంపఁ గలనండి.

      తొలగించండి
  39. భౌతికశాస్త్రముంజదివిపద్యకవిత్వమువ్రాసెమేలుగన్
    నాతడయెవ్వరాయనగనార్యుడుగుర్రపువంశధీరుడే
    కైతలువ్రాయగానగునుకబ్బముతల్లిదయారసంబునన్
    భౌతికశాస్త్రముంజదివిపద్యమువ్రాయుటగొప్పయేగదా

    రిప్లయితొలగించండి
  40. జాతికి లబ్ది గూర్చ కడు చక్కని శాస్త్రము నభ్యసించియున్
    జీతమగత్యమైన తఱి చేసెను కొల్వుల నల్వడేండ్లు! చే
    యూత నొసంగ శంకరుల యూధము, లేఖిని బట్టె నాతడున్
    “భౌతికశాస్త్రముం జదివి పద్యకవిత్వము వ్రాసె మేలుగన్!”
    -మాచవోలు శ్రీధరరావు

    రిప్లయితొలగించండి
  41. భూతలమందునచదువులు
    వేతనజీవులుగమారివేసారుటకా
    జోతలువిద్యాధరునకు
    భౌతికశాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్

    రిప్లయితొలగించండి
  42. డా. విష్ణు నందన్డిసెంబర్ 14, 2010 8:58 AM

    "అది యొకానొక దేవరహస్య రచన
    ఆ యరణ్యవాసమ్మునా మాయ లేడి
    కల్పనమె; రక్కసుని చావె కారణముగ
    రాముఁ డొసఁగెను జానకిన్ రావణునకు!!! "

    నా అజ్ఞాతవాసానికి యివ్వాళ్టితో స్వస్తి చెబుతూ....

    అజ్ఞాతృత్వము వీడి నేనిటుల సమ్యక్స్వస్వరూపమ్ముతో
    విజ్ఞానాంబుధినోలలాడుటకునై విచ్చేసి కైమోడ్చెదన్!!!
    యజ్ఞంబీయది ; అక్షర క్రతువు ; ధ్యేయంబూని పాల్గొందు నో
    విజ్ఞుల్ ; పేరుకు -' విష్ణు నందనుడ ' - సర్వేభ్యోః ప్రణామశ్శతం!!!!

    ప్రాక్తన పుణ్యలేశమున పద్యము లల్లుచునుందు ; పాండితీ
    శక్తియు నావగింజ ; మరి సంస్కృత మేధయు సున్న; భారతీ
    భక్తుడనామె దివ్య పద పద్మములన్ భజియించి పుణ్య సం
    సక్తుడనైతి- 'ఛాందసపు జాడలెరుంగని వాడ జూడగన్ ' !!!

    వైద్యుడ వృత్తికి ; కవితా
    సేద్యమ్మే నా ప్రవృత్తి ; శ్రీ కవితా నై
    వేద్యమ్మందించి మహా
    విద్యా భారతిని గొల్తు వినయాంజలినై!!!!

    https://kandishankaraiah.blogspot.com/2010/12/169.html?m=1

    రిప్లయితొలగించండి
  43. కంది శంకరయ్యడిసెంబర్ 16, 2010 2:09 AM

    డా. విష్ణు నందన్ గారూ,
    ధన్యోSస్మి.
    మీ పూరణలను చూసి మీరు తప్పకుండా లబ్ధప్రతిష్ఠులైన కవులని. లేక తెలుగు సాహిత్యంలో యం.ఏ. లేదా పి.హెచ్.డి. చేసి తెలుగు భాషా బోధకులుగా పనిచేస్తూ ఉంటారని, అంత గొప్పవారు ఇంత అల్పమైన బ్లాగులో సమస్యలు పూరించడం చిన్నతనంగా భావించి అజ్ఞాతంగా ఉన్నారని భావిస్తూ వచ్చాను. నిజానికి నా మనస్సులో రెండు పేర్లు మెసులుతూ ఉండేవి.
    మీ ప్రకటన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. వైద్య వృత్తిలో ఉంటూ సాధికారంగా, సలక్షణంగా, మనోహరంగా పద్యాలు చెప్పే మీ అభిరుచికి, నైపుణ్యానికి నమోవాకాలు. శంకరాభరణం బ్లాగుకు లభించిన ఆణిముత్యం మీరు.
    ముఖ్యంగా అజ్ఞాతవాసాన్ని వీడుతూ మీరు చెప్పిన పద్యాలు రత్నాలే. ఎక్కడిదీ పద సంపద? ఎక్కడిదీ ధారాశుద్ధి? సరస్వతీ కటాక్షమే. కాదు ... కాదు ... పుంభావ సరస్వతి మీరు.
    నా పక్షాన మిమ్మల్ని అభినందించిన కవి మిత్రులకు ధన్యవాదాలు. వారి అభిప్రాయాలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  44. డా.బల్లూరి ఉమాదేవి

    చేతము కోరిన విధముగ
    భౌతిక శాస్త్రమ్ము చదివి వ్రాసెను కవితల్
    నూతన రీతిగ భారత
    మాతయు మెచ్చెడి విధముగ మహిలో నితడే.

    రిప్లయితొలగించండి
  45. సీతారాముడు చదువరి
    యాతని ప్రతిభా విశేషమబ్బుర పరచున్
    చాతురిఁ గనుమాతడహా
    భౌతికశాస్త్రమ్ముఁ జదివి వ్రాసెను కవితల్

    రిప్లయితొలగించండి