11, నవంబర్ 2020, బుధవారం

న్యస్తాక్షరి - 68

12-11-2020 (గురువారం)

కవిమిత్రులారా,

ఉత్పలమాలలో రుద్రమాంబ పౌరుషాన్ని వర్ణించండి.

1వ పాదం 1వ అక్షరం ‘కా’

2వ పాదం 7వ అక్షరం ‘క’

3వ పాదం 13వ అక్షరం ‘తీ’

4వ పాదం 19వ అక్షరం ‘య’

65 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  కానగ లేనుగా తనరి కన్నుల నిండుగ రుద్రమాంబనున్
  గానుగ యెద్దునున్, కవిని కానుగ నేనిట కంది శంకరా!
  చేనున దున్నుచున్ మురిసి చెన్నుగ తీసెద పర్వులాదటన్
  మౌనమె నాకికన్ శరణు మందపు బుద్ధిని నూచుమూయలన్ 😊

  స్వామీ! సమస్యా పూరణములో తప్ప వేరొక అంశములో నాకు "ఆసక్తి" లేదని వచించారుగా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శుభోదయం! ఆసక్తి లేదన్నాను కాని అసమర్థులనలేదే...
   పద్యం బాగుంది. న్యస్తాక్షరాలను సమర్థంగా ప్రయోగించారు. కాకుంటే రుద్రమ పేరు తప్ప ఆమె పౌరుషాన్ని తెలుపలేదు.

   తొలగించండి

  2. 🙏

   సారీ సార్! రుద్రమాంబను గురించి నాకేమియును తెలియదు. గూగులమ్మను అడిగి తెలుసుకునే ఓపిక లేదు.

   "తాటి చెట్టు" పై వ్యాసము వ్రాయ మంటే దానికి కట్టిన "ఆవు" పై వ్రాశాడట నా బోటి విద్యార్థి.

   తొలగించండి
 2. ఉ||
  కాలమదేమొ మధ్యయుగకాష్టము కష్టములబ్బ జాతికిన్
  శైలిని ధీర ప్రాకటితసాధ్వి యనిన్ వసుధైకవీర యీ
  నేలను రుద్రమే యనుచు నిల్చెను తీవ్రవికల్పయుద్ధముల్
  వ్రాలని మ్రానగున్ వనిత భండనమందల దుర్గయేయగున్

  ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
 3. ౧.
  కాంతయె నైననేమిదియ కాకతి రుద్రమ వీరనారియే
  వింతగజూడబోకను వివేకము తోనిక చేయు యోచనల్
  ఎంతగ కుట్రబన్నినను ధూర్తుల తీరును భగ్నపర్చెనే
  కాంతలకైననీయమ యె కాంచుడు ధైర్యము
  నిచ్చునీయమే!!

  ౨.
  కాకలు దీరినట్లుగను కాంచరె యోధులు ధీరులెందరో
  చీకులు చింతలేక గను, చేరగలేరుగ శత్రుమూకలున్
  భీకరమైన యట్టి యరివీరుల తీరును మెచ్చె రుద్రమే
  పీకలుగోయువారె రిపు వీరుల నందర రాణి సంయమున్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'ఈయమ' పునరుక్తమయింది.
   రెండవ పూరణలో 'సంయము' ?

   తొలగించండి
  2. 'రుద్రమ+ఏ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

   తొలగించండి
 4. కాలిక వోలె రుద్రమయె ఖడ్గము బూనుచు శత్రుమూకలన్
  చీలిచి వేసెనా కలిని, స్త్రీ యని దల్చిన వారిగుండెలో
  ప్రేలె పిరంగులే, ద్యుపతి రీతిన తీక్ష్ణపు నిప్పు రవ్వలన్
  రాలుచు వీరనారి గని రాణువ పారగ గెల్చెనా యనిన్.

  రిప్లయితొలగించండి
 5. ౧.
  కాంతయె నైననేమిదియ కాకతి రుద్రమ వీరనారియే
  వింతగజూడబోకను వివేకము తోనిక చేయు యోచనల్
  ఎంతగ కుట్రపన్నినను నెంతయు తీయగ మాటలాడినన్
  క్రాంతియునిచ్చునీయమయెకాంచుడు ధైర్యము గొల్పెడీయమే!!

  ***మొదటి పద్యం సవరణ...🙏

  రిప్లయితొలగించండి
 6. కారణ జన్మురాలగుచు కాకతి వంశము నందు పుట్టి యున్
  ధీర త వైరి మూకలను తేకువ తో నెదిరించి పోరుచున్
  పౌరుష రూపమో యనగ బాసిలి తీక్షణ శక్తి యుక్తులన్
  మేర య లేని రత్న మయి మించిన రుద్రమ మెప్పు సేయరే

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  (కా)కతి రాజ్యమున్ ఘనముగా తన శౌర్యపరాక్రమంబులన్
  వీకగనేలి బిం(క)మున విద్విషులన్ ముదలించి చక్కగన్
  సాకుచు పౌరులెల్లరను జానుగ (తీ)ర్చిన రుద్రమాంబ! నిన్
  జోకగ నుగ్గడించెదను సొంపుగ నందరు మెచ్చులీ(య)గన్.

  రిప్లయితొలగించండి
 8. ఈ నాటి శంకరాభరణం వారి న్యస్తాక్షరి

  1వ అక్షరం "కా"
  7వ అక్షరం. "క"
  13వ అక్షరం "తీ"
  19వ అక్షరం."య"

  రుద్రమాంబ పౌరుషం ఉత్పలమాలలో చెప్పాలి

  నా పూరణ

  కారణ జన్మయై వెలసి కాకతి వంశము నుద్ధరించగా
  వీరత జూపుచున్ కదన విభ్రమ శౌర్యపు వీరనారియై
  గారవ మొప్పగన్ ఘనత గాంచిన తీరుల రాజ్యమేలుచున్
  నారుల పాటవం బునకు నాణ్యతఁ బెంచెను రుద్రయో యనన్

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 9. న్యస్తాక్షరి : ఉత్పలమాలలో
  రుద్రమాంబ పౌరుషం
  1 వ పాదం 1 వ అక్షరం కా
  2 వ పాదం 7 వ అక్షరం క
  3 వ పాదం 13 వ అక్షరం తీ
  4 వ పాదం 19 వ అక్షరం య
  వచ్చేలా వర్ణించాలి .

  కాకతి గణ్పతీశ్వరుని
  గాదిలి రుద్రమ ; మత్సరాగ్నికే
  యాకరులౌ మహాకఠిను
  లా మహదేవమురారులన్ ; సదా
  వ్యాకులబుద్ధిమాంద్యుల ; న
  వారితతీవ్రపు రాజ్యకాంక్షులన్
  భీకరయుద్ధరంగమున
  భిన్నము జేసెను శౌర్యకాయయై .

  రిప్లయితొలగించండి
 10. 12-11-2020 (గురువారం)
  న్యస్తాక్షరి - 68
  కవిమిత్రులారా,
  ఉత్పలమాలలో రుద్రమాంబ పౌరుషాన్ని వర్ణించండి
  1వ పాదం 1వ అక్షరం ‘కా’
  2వ పాదం 7వ అక్షరం ‘క’
  3వ పాదం 13వ అక్షరం ‘త'
  4 వ పాదం 19 వ అక్షరం 'య'

  నా చిరు ప్రయత్నం..🙏🙏

  *ఉ*

  *కా* కలు దీరినెందరికి కత్తిని ధాటిగ జూపి చంపె తా
  భీకర పోరునన్ *క* దలి విశ్వము నంతయు శక్తి జూపెగా
  రాకను నెంచుచున్ తరలి రక్షణ *తీ* రుగ నెంచియుంచుచున్
  లోకము మొత్తమున్ దెలిపె యోధులు దల్చిన యుద్దమే *య* నన్

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏😊

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...దీరి యెందరికి/దీరు నెందరికి..." అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
 11. కాలిక రూపియై రిపుల గర్వము భగ్నము చేసె‌ మెప్పుతోన్

  బేలను కాను నాకసలు భీతియె‌ లేదని తెల్పెగా నిలన్

  జాలియె తల్చకన్ యెదిరి సత్వము తీసిన యోధురాలుగా

  నేలెను కాకతీయ ఘన యింతిగ రుద్రమ‌ దేవియే యనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "..తెల్పెగా యిలన్.తల్చకే.." అనండి. 'ఘన యింతి' దుష్టసమాసం.

   తొలగించండి
 12. కాకతిగొల్చిపాలనమఖండజయమ్మునుశత్రుగుండియన్
  మేకులగొట్టినాకమనమేలుభళీయనిప్రస్తుతించదా
  నాకలిమంటలార్పిశుభమందగతీయనిమాటలాడియే
  కాకులుగారుమీరనుచుకాపునుదాపయెకీర్తికాయమై

  రిప్లయితొలగించండి
 13. 1వ పాదం 1వ అక్షరం ‘కా’
  2వ పాదం 7వ అక్షరం ‘క’
  3వ పాదం 13వ అక్షరం ‘తీ’
  4వ పాదం 19వ అక్షరం ‘య’

  కాకతివంశసంజనితకమ్రగుణాఢ్య రణోగ్రధీర ది
  వ్యాకృతిదీప్తిసంకలితభాసురయాదవవైరిభీకరిన్
  బ్రాకటరౌద్రరుద్రమను మానవతీద్ధశిరోమణిద్యుతిన్,
  జేకొని యోరుగల్లు ప్రభఁ జేర్చియు పేర్మి నుతింతు ధ్యేయమై.

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురం.

  రిప్లయితొలగించండి
 14. కాకతిమాతగొల్చిప్రజకండగదండగశత్రుమూకచీ
  కాకొనరించచీకటికికాంతిగరాణిగరుద్రమాంబయే
  కాకతికాకతీయులకుకాన్కగతీయనిగుర్తుగానిడెన్
  బ్రాకటవైభవంబతులబాహుపరాక్రమికీర్తికాయమై

  రిప్లయితొలగించండి
 15. కాకతి వంశపాలనను కాంతయొకర్తుక
  ఖడ్గధారియై
  తేకువ మీరగా కదలి దేశము నందున
  తిర్గుబాటులన్
  భీకరమైనరీతి తెగవేసిన తీరును దల్చగామదిన్
  ప్రాకట రుద్రతేజమిల భాసుర యయ్యెను కాళికేయనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

   ప్రాకట రుద్రతేజమది గా చదువ గోరెదను!

   తొలగించండి


 16. కాకతి వంశ గౌరవము కారణ జన్మము నేలె దేశమున్
  భీకర మైన యుద్ధమను విశ్వసహమ్మున వైరులెల్లరిన్
  తేకువ చూపి గూల్చెను కుదేలను తీరుగ ముందు నిల్చి తా
  నై కరవాలమున్ ఝుళుపు నైజము రుద్రమ దేవినాయమై!  రుద్రమదేవి సినిమా చూపించేసారివ్వాళ కంది వారు :)  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. నమస్కారం స్వామీ ! నాకు పద్య రచన అంటే ఏమిటో ఎలా ఉంటుందో తెలియదు. నా వృత్తికి సంబంధము లేనిది. మా నాన్న గారు శ్రీ రేవణ సిద్ధాంతి గారు తెలుగు పండితులు వారి ఆశీస్సులతో ఈ కరోనా పుణ్యమా అని విస్తృత విడిది లభించటంతో పద్యాలు వ్రాయటం ఆరంభించాను. ఇదే సమయములో అంతర్జాల శోధనలో మీ సాంగత్యం లభించింది.
  మీ పుణ్యమా అని తెలుగులో నాలుగు మాటలు వాగ్రుచ్చటానికి సాహసించాను. ఈ జూన్ నుండి పూరణలు చేయుచున్నాను. నా వంటి వారికెందరికో అవకాశం కల్పించి, శంకల తీర్చి, సూచన లిచ్చే మహోన్నత ఔదార్య సద్గుణము కలిగిన మీకు సాహితీ లోకము సదా ఎంతైనా ఋణపడి ఉంటుంది. మీరు అంబానుగ్రహము చేత శతవసంతములు ఆమనిలా, శరశ్చంద్రికలా కవి కుల హృదయములో సదా యశోకాంతను గూడి నిలిచి యుండాలని సదా ఆకాంక్షిస్తూ......నమశ్శతమ్.


  "కా"రణ జన్ము డీ సుకవి *కంది* సుధాంబుజ *శంకరార్యుడున్*
  పూరణ గూర్చుచున్ "క"వుల పూజన లందుచు శంకదీర్చుచున్
  సారస సౌమ్య భాషణల సాగుచు "తీ"రుగ తీర్పు చెప్పగన్
  మీరలె పూర్ణ రూపులిల మీకివె జోతలు కైతనా"య"కా !

  రిప్లయితొలగించండి
 18. ఉత్పలమాల

  కాకలు తీరి రాణిగను గణ్పతి దేవుని వారసత్వమై
  లోకమునందు శ్రీకరిగ 'రుద్రమహాప్రభు' నామకీర్తనన్
  కాకతి కాళికే యన దగాలను తీరున నంత్యపాలకుల్
  చేకొన దండయాత్రలను జీల్చె ఘటోధృతి! యోధ! జైయనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'కాళిక+ఏ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన.

   ఉత్పలమాల
   కాకలు తీరి రాణిగను గణ్పతి దేవుని వారసత్వమై
   లోకమునందు శ్రీకరిగ 'రుద్రమహాప్రభు' నామకీర్తనన్
   కాకతి కాళికా యన దగాలను తీరున నంత్యపాలకుల్
   చేకొన దండయాత్రలను జీల్చె ఘటోధృతి! యోధ! జైయనన్

   తొలగించండి
 19. మైలవరపు వారి పూరణ

  కారణజన్మురాలు మన కాకతి రుద్రమ కాళికాంబయే,
  ధీరగుణాఢ్య,లోకమున స్త్రీ యన బుట్టిన వీరభద్రుడే!
  క్రూరుల యాదవాన్వయుల గూల్చిన తీరు తదీయశౌర్యగం..
  భీరతకానవాలు., రణభీకరరూపిణి, శ్లాఘనీయయే!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి

 20. (కా)ళిక వోలె శత్రువుల ఖడ్గముఁ బూనుచుఁ జీల్చుచుండ హే

  రాళముగా ననీ(క)మున రాజస మొప్పగ రుద్రమాంబయే..,

  తాళక పర్వు లెత్తుదురుఁ దాకిడి (తీ)రుకుఁ బ్రాణ భీతితోన్!

  పాలనఁ జేసెఁ బ్రాకటపు భంగిఁ బ్రజాళి ముదమ్ము జై (య)నన్


  ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి
 21. అందరికీ నమస్సులు🙏
  ఉ.మా

  *కా* టుక కళ్ళలో మెరిసె ఖడ్గపు కాంతులు భాసురంబుగన్
  ధాటిగ సంకటాం *క* మును దాటగ జూపెను పౌరుషంబునే
  మేటిగ ధీరతన్ బడసి మేరువు *తీ* రుగ నిల్చెనండగన్
  చోటిక లేదు రాజ్యమున చోరుల కించుక లొంగనీ *య* కన్

  *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'ఈయక' అన్నది కళ, ద్రుతాంతం కాదు. "లొంగనీయకే" అనండి.

   తొలగించండి
 22. కాకతిరాజ్యలక్ష్మిగనుకాకలుఁదీరినయోధురాలుగా
  తాకెనువైరినేకనెనుతాల్మినిదాల్చెనుపేదబంధువై
  ఆకెగవీరనారిగనుహాయనుతీయనిజ్ఞాపకంబగున్
  పాకినదామెకీర్తిభువిపావనిగాగనురుద్రమాయమే

  రిప్లయితొలగించండి
 23. రిప్లయిలు
  1. కాఁకలు తీరినట్టి నర కాంతుల నెల్లర ఘోర దుస్స హా
   నీకము తోడ వీఁక ఘన నిగ్రహ కాంక్ష జయించి శక్తినిన్
   శ్రీకర కాకతీయ నృపశేఖర తీష్ణ పరాక్రమ ప్రభా
   ప్రాకట రుద్రమాంబ నిజ రాజ్యము నిల్పెను భీతి వాయఁగన్

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 24. *కా* వరు లైన క్ష్మాపతులు కప్పము కట్టక చక్రవర్తికిన్
  చేవను చూపుచున్ *క* లనుఁ జేయగ నందరు నేకదాటిగా
  కావగ రాజ్యమున్ కనలి క్రన్నన *తీ* వ్ర పరాక్రమమ్ముతో
  జీవముఁ గోలుపోయె దృతిఁ జేయుచు రుద్రమ సంపరా *య* మున్

  రిప్లయితొలగించండి
 25. చిరు ప్రయత్నము

  ఉ:

  కాలము నెంచి రుద్రమ ను కట్టడిసేయగ పోరు యాదవుల్
  నేలకు నొర్గిరేకముగ నిప్పులు గ్రక్కెడి భద్రకాళిగన్
  మేలును గూర్చి యంగనల మేవడి తీరుల వృద్ధి చేయుచున్
  పాలన సేయగన్ ప్రతిభ పాటవ మొందెను కాకతీయమై

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 26. కాకతి దేవి సత్కృపను కాకలుదీరిన వీర నారియై
  ప్రాకటమొప్పనా కదనరంగమునందు విరోధి వర్గమున్
  కూకటి వ్రేళ్ళతో దునిమి గుర్వుగ తీర్చె విశాల రాజ్యమున్
  జోకగ జేసె పాలనము చొక్కపు రీతుల బేరుమోయగా

  రిప్లయితొలగించండి
 27. కాంతిని జిమ్ముచుండగను కన్నుల సాగెహయమ్ము నెక్కితా
  సుంతయు జంకులేక మది జోధులు ముందట సాగచుండగా
  చింతను వీడుచున్ జనులు సేసలు తీరుగ జల్లరుద్రమే
  నంతము చేయనెంచుచును నాజిన వైరుల చావె ధ్యేయమై

  రిప్లయితొలగించండి