3, నవంబర్ 2020, మంగళవారం

సమస్య - 3534

4-11-2020 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కుకవులెల్ల మనకు గురువులె కద”

(లేదా...)

“కుకవులు వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా”

102 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  వికటపు హాస్యమాడి భళి వింతగు రీతిని గేలిజేయుచున్
  సకలపు నేతలన్ దునిమి జంకును గొంకును త్రోసివేయుచున్
  పకపక నవ్వుచున్ విధిగ పద్యము లల్లుచు హ్లాదమిచ్చెడిన్
  కుకవులు వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా...

  రిప్లయితొలగించండి
 2. ఆ. వె.
  రామలింగని గని రాయలి సభలోన
  "నకట !వచ్చినాడు వికటకవియు"
  పండితుండు నొకడు వడువుకు దెల్పె "మొ
  క్కు"కవులెల్ల మనకు గురువులె కద

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జతగను గూడిపాడి మనసా యుపవాసము సేసి మందితో
   నతులిత భక్తితోడ నగజాతను గొల్చుచు నట్లుమేయగా
   నతడు మగండునట్లుఁదిన ఘాతముఁజేసె సమిష్టి చూడగన్
   జతికిల బడ్డ భామిని విచారము గోపము తోడ భర్తతో
   నతి"వలు మెచ్చ రట్లతదియన్" మగవారల పండుగందురే??

   (వలుము + ఎచ్చరు)
   వలుము = మోసము, ఎచ్చరు = హెచ్చరిక

   తొలగించండి
  2. దీనిని కూడా ఒకసారి పరికింపగలరని ప్రార్ధన

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో "రాయల సభలోన...పండితుం డొకంటు వడువుతో ననెను మ్రొక్కు..." అనండి.

   తొలగించండి
 3. సకలము మాకు దక్కునని,సన్నుతిబొందగనాశజెందుచున్
  ప్రకటితమైన భావములు,ప్రాభవమందగ గూర్చకావ్యముల్
  నికరముగాను నిల్చునిక,నిందలుమోయకనిల్వగల్గుచో
  కుకవులువారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులేగదా
  *******************+*********
  రావెల పురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 4. సకలము నేర్చిసద్గుణవిశాల విమోహ విలక్షణంబుగా
  వికట విరుద్ధ భావనల విశ్వజనీన విధాన వర్తులై
  ప్రకట కవిత్వతత్వమున భాసిలు వారి హసింప జూతురే
  కుకవులు-వారలెల్లమనకున్ గురు దేవులె పూజ్యులే కదా!

  రిప్లయితొలగించండి
 5. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కైత జెప్ప లేక కవులను నిందింత్రు
  కుకవు లెల్ల; మనకు గురువులెకద
  పద్యమల్ల గలుగు పాటవమ్మునె నేర్పు
  శంకరయ్య సూరి శంకలేక.

  రిప్లయితొలగించండి

 6. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  సుకవులు తిండి కోరుచును స్రుక్కుచు సోలుచు మాడుచుండగన్
  తికమక కావ్యముల్ తనరి తీరిచి దిద్దుచు సంస్కృతమ్మునన్
  నకనకలాడి వ్రాయుచును నాలుగు వీధుల మెప్పుకోరి ప్రా
  కు; కవులు వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   మరీ 'వీథులకే' పరిమితం చేస్తే ఎలా? "నాల్గు పురంబుల/నాలుగు నాడుల" అందామా?

   తొలగించండి
 7. ఆటవెలది
  మేటి కవుల కవన పాటవమ్మెరుగంగ
  వారికృతులఁ జదివి తీరుఁ దెలిసి
  మెరయ వ్రాయఁగలుఁగు నొరవడినందుట
  కు కవులెల్ల మనకు గురువులె కద!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంపకమాల
   సకలమెరుంగు పండితులు చక్కఁగ వ్రాయుట నేర్పెడున్ గవుల్
   నికరమనంగ పూజ్యులు ననేకరకమ్ముల మార్గదర్శులై
   నికముగ లోపముల్ బలికి నేర్పగ నెట్టుల వ్రాయకూడదో
   కుకవులు వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా!

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. కువలయమ్ము నందు కోవిదు లెందరో
  పటిమ తోడ వ్రాయు పద్యములను
  చదవకుండ మేటి చదువరులను దూర
  కు, కవులెల్ల మనకు గురువులెకద.

  రిప్లయితొలగించండి
 9. ౧.
  గణములన్నిగూర్చి ఘనమైన పద్యమ్ము
  వ్రాయనేమిఫలము ప్రాసదప్ప
  తప్పులన్ని విప్పి చెప్ప తగవుపెంచ
  కు,కవులెల్ల మనకు గురువులె కద!!

  ౨.
  సుకవులమంచొకింత పలు శోభలుగూర్చెడు
  పద్యమెంతయో
  చకచక వ్రాయబూనె కవి ఛాత్రుడె, నేర్చెను కార్యశాలలో
  పకపక నవ్వగాను పలుపాఠకులెల్లరు, బిక్కమోముతో
  వికలమనస్కుడైన కవి వింతగ జూచెను తప్పులెక్కడో
  సకలము జూచినట్టి జవసత్వము గూర్చినవారలేను నీ
  కు,కవులు వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా!!

  రిప్లయితొలగించండి
 10. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సకలముదెల్సు మాకనుచు జల్పములాడి నిరంతరమ్ముగన్
  వికటమునైన కైతలను విస్తరణమ్మొనరించి ద్రిమ్మరున్
  కుకవులు వారలెల్ల; మనకున్ గురుదేవులె పూజ్యులే కదా
  సుకవితలల్లు నైపుణము జూపుచు దిద్దెడి శంకరార్యులున్.

  రిప్లయితొలగించండి
 11. వ్తాసభగవానుడూ వాల్మీకీ ఎంతటి ఋషిపుంగవులైనా ప్రప్రథమంగా మహాకవులు కదా. వారిని గూర్చి నా పూరణ

  చం||
  ప్రకటిత వేదశాస్త్రపరిభాష్యమహామహులీ పయోధినూ
  రక మహిమాన్వితంబయిన రమ్యకథాకృతులిచ్చినట్టి తా
  రకలగునార్షధర్మపరిరక్షకులీ ఋషివర్యులైన మా
  కు కవులు! వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులేకదా

  ఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
 12. సుకవులెల్ల మనకు సూక్ష్మము నేర్పింత్రు
  సకలమైన శాస్త్ర సమితిగూర్చి
  వికటమైన విధిని విడువంగ నేర్పింత్రు
  కుకవులెల్ల, మనకు గురువులె కద!

  సుకవులు జూపుచుందురుగ సుందర
  మార్గము కావ్యకల్పనన్
  వికసిత భావజాలముల వీనుల విందగు శబ్దసంపదన్,
  సకలము దోషభూషిత మసంగతమై
  విడనాడ యోగ్యులౌ
  కుకవులు , వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే గదా!

  రిప్లయితొలగించండి
 13. క్రమముదప్పకుండ కార్యసాధనమున
  ఖచ్ఛితత్వమరసి కవన మందు
  నియమ నిష్ఠ లెల్ల నిక్కము తెలుపు మా
  కు,కవులెల్ల మనకు గురువులె కద!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కచ్చితమ్ము నరసి... అనండి. 'కచ్చితము' తెలుగు పదం. దాన్ని కచ్చితత్వమని సంస్కృతీకరించరాదు.

   తొలగించండి
 14. సకలమెఱుంగువారు మనజాతికి మేలొనరించు వారితో
  వెకిలిగ మాటలాడుట వివేకము కాదని చెప్పుచుంటినే
  నకృతపు బుద్ధితో ఘనవిహస్తుల హేళన జేసి దూరబో
  కు, కవులు వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా!

  రిప్లయితొలగించండి
 15. ఈ కలియుగ మందు నెట్టి వా రికయిన
  లేని దాని నున్న రీతి జూపి
  విశద పరచ వలయు విజ్ఞత నొసగుట
  కు ,కవులెల్ల మనకు గురువులె కద

  రిప్లయితొలగించండి
 16. అందరికీ నమస్సులు🙏🙏

  నా పూరణ యత్నం..

  *చం*

  సకలము నేర్చె మేమనుచు శాలువ నొందగ ఖర్చుజేయుచున్
  చక చక పద్య రాజములు సాధ్యము జేయగ చేతగాక తా
  ప్రకటన లిచ్చి వేదికన పైత్యము దీర్చుకు గొప్ప వీరులౌ
  *“కుకవులు వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా”*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "నేర్చినామనుచు...కర్చు...వేదికను..." అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురువు గారు
   సవరణ చేసుకొందును

   తొలగించండి
 17. కె.వి.యస్. లక్ష్మి:

  పద్య విద్య యందు భవ్యమౌ నేర్పును
  బోధ జేసి నట్టి బుధులు నౌచు
  కైత లల్లు పటిమ ఘనముగా నొసగి సా
  కు కవులెల్ల మనకు గురువులె కద!

  రిప్లయితొలగించండి
 18. సమస్య :
  కుకవులు వారలెల్ల మన
  కున్ గురుదేవులె పూజ్యులే కదా

  ( సుకవులు - కుకవులు )
  సుకవుల శబ్దశాసనుని
  సోమన దిక్కన నెర్రనార్యునిన్
  వికవికనవ్వులన్ విసరి
  వింతగ జూచెడి వ్రాతగాండ్రదే ;
  చకచక నెద్దియో గిలికి
  జబ్బల నూపెడి గ్రంథసాంగు లా
  కుకవులు ; వారలెల్ల మన
  కున్ గురుదేవులె ! పూజ్యులే కదా !!
  ( వికవికనవ్వులు - కృత్రిమపు నవ్వులు ;
  జబ్బలు - భుజములు ; గ్రంథసాంగులు-
  ప్రబుద్ధులు ; వారలెల్ల - నన్నయాది ఆ పూర్వకవులందరు )

  రిప్లయితొలగించండి
 19. మంచి చెడ్డ తెలిపి మార్గదర్శ కు లౌచు m
  మాన్య మగుచు వెలిగి మధుర భావ
  విలువ పెంచి తాము ప్రియ మైరి జగము న
  కు కవు లెల్ల మనకు గురువు లె కద

  రిప్లయితొలగించండి
 20. నన్నయ తిక్కన లన్న తెలుగు నాట
  భారత కవులని పేరు పొందె,

  తరచి చూడ నెపుడు తిరుపతి వేంకట కవులు మహిని జంట కవులు గాదె,

  సోమన్నయును‌ నన్నె చోడుడు,
  మల్లికార్జునుడు శివకవులై ఘనత నొందె,

  గోనబుధ్ధారెడ్డి కుమ్మరి మొల్లలు రామాయణమ్మను‌ వ్రాసె నిచట,

  పెద్దన,తిమ్మన్న,పింగళి వారు,ప్రభంద కవులు కాదె భరణి లోన,

  అన్నమయ్యయు,త్యాగ య్య,ఘనుడు క్షేత్రయ్య పద కవుల నబడె భక్తి గూర్చ,

  వేమన,బద్దెన,రామదాసు‌ లెపుడు శతక కవులు కదా జగతి లోన,

  దువ్వూరి, వేదుల,తుమ్మల, జాతీయోద్యమ కవులే గదా ధరణి లోన,

  నండూరి,అబ్బూరి,నాయని భావ కవులెపుడు కాంచంగ పుడమి లోన,  కాళిదాసు యా వాల్మీకి కావ్య జగతి

  లోన సంస్కృతమున కవులుగ గరిమను

  పొందె భారతావనిలోన,పుణ్య ము పలు

  కు కవులెల్ల మనకు గురువులు కద

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వాహ్! ఉదయాన్నే ఎందరు కవులను గుర్తుకు తెచ్చారు! సంతోషం.
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'పొందె, అందె, వ్రాసె, అనబడె..' ఈ క్రియాపదాలన్నీ ఏకవచనాలు. కాని కర్తృపదాలు బహువచనాలు.

   తొలగించండి


 21. అమరదనుకొనకు కవులె
  ల్ల మనకు గురువులె కద మరల మరల నా వృ
  త్తమువలె చెప్పెదరిక విష
  యము పునరావృత్తముగ చయమున జిలేబీ !  జిలేబి
  గుండు సున్న :)

  రిప్లయితొలగించండి


 22. ఇల పూచిన పువ్వులు కొ
  మ్మలకు కవులు! వారలెల్ల మనకున్ గురుదే
  వులె పూజ్యులే కదా కో
  మల మృదుపల్లవపు బాస మ్రానుగనమరన్


  చైంచిక్
  జాల్రా
  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. సకలమునర్హమంచువికచాబ్జమరందముగ్రోలుభృంగమున్
  ప్రకటితకావ్యవస్తువుగగైకొనిపద్యమువ్రాయబూనునా
  *“కు,కవులు వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా”*
  యకహరమైనభావనలనందముగాగుదిగుచ్చిబూన్చినన్

  రిప్లయితొలగించండి
 24. రిప్లయిలు
  1. చం:

   సుకవులు వీర లంచు విన సొంపగు మాటలు మెచ్చుకోలులున్
   ప్రకటిత మొంద కారణము వాస్తవికమ్ముగ మూల కారకుల్
   కుకవులు, వారలెల్లఁ మనకున్ గురుదేవులె పూజ్యు లేకదా
   కక విక లౌదు రెల్లరును గాంచిన సత్యము లోక మందునన్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 25. కవుల నెపుడు మనము గౌరవించవలయు
  నిలుచు సుకవి పేరు నిత్యముగను
  కవితలల్లలేని కవులను నిందింప
  కు , కవు లెల్ల మనకు గురువులె కద

  ప్రకటిత కావ్య సంపద నపార పదాతిశయంబు లొప్పగా
  వికసిత పద్యమాలికలవేదిక నూత్న జవంబుఁ గూర్చగా
  ముకుళితహస్త గౌరవ సముంచితభక్తి నిఁజూపు, తిట్టఁబో
  కు , కవులు వారలెల్ల మనకున్ గురుదేవులేకదా

  రిప్లయితొలగించండి
 26. ప్రకటరసార్దృశబ్ద విపులార్థమనోజ్ఞకవిత్వసంపదల్
  సకలహృదబ్జరంజకవిశాలదృగంచితభావకావ్యముల్
  నికటమొనర్చి వారు తగు నేర్పరులైరి తిరస్కరించఁ బో
  కు, కవులు వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా

  కంజర్ల రామాచార్య

  రిప్లయితొలగించండి
 27. పటిమ గల్గి కవులు పద్యములను వ్రాయ 
  చదువ శక్తిలేని చవటవగుచు   
  పనికిరాని వంచు పలుకు టేలర?   దూర                  
  “కు కవులెల్ల మనకు గురువులె కద”  

  రిప్లయితొలగించండి
 28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 29. అకలుషభావనాయుతులు, నద్భుతకావ్యవరప్రదాత, లీ
  సకలజగద్ధితైషులయి సంస్తుతులందుచు దేవతాత్వమున్
  బ్రకటముచేయు వారు గద వ్యాసుడు వాల్మికి, యొప్పరైరహో
  కుకవులు, వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా.

  రిప్లయితొలగించండి
 30. జనుల బాగు గోరి జాగృత మొనరించు
  కవిత లల్లు వారు ఘనులు గారె
  కీ ర్తి నందు వారి కీడెంచి నిందించ
  కు కవు లెల్ల మనకు గురువు లె కద

  రిప్లయితొలగించండి
 31. కుకవులెల్లమనకుగురువులెకదయార్య!
  కుకవులనగనెవరుసుకవులెవరొ
  మొదటతెలిసికొనుచుపూజ్యులగునెడల
  చూడవచ్చుగురువుచోటునందు

  రిప్లయితొలగించండి
 32. క్రమముదప్పకుండ కార్యసాధనమున
  ఖచ్ఛితత్వమరసి కవన మందు
  నియమ నిష్ఠ లెల్ల నిక్కము తెలుపు మా
  కు,కవులెల్ల మనకు గురువులె కద!!

  రిప్లయితొలగించండి
 33. సకలము నేర్చినోడె పలు సంగతులెట్లుగ మార్చివేసెనో
  వికలమనస్కుడయ్యు విను వీధుల దిర్గుచు
  వింతగావుతన్
  కుకవులు వ్రాసినట్టి పలు ఘోరపు తప్పుల విప్పిచెప్ప మా
  కు,కవులు వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా!!

  --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

  ***నేను ఒకప్పుడు పని చేసిన పాఠశాలలో పరిసర ప్రాంతమందు ఒకాయన తిరిగేవాడు. ఎంత సమయం దొరికినా బయటకు వచ్చిన విద్యార్థులను పిలుచుకొని గ్రౌండులో తెలుగు పాఠాలు బోధించే వాడు. ఒక్కోసారి తరగతి గది కిటికీ ల్లోంచి పిలుచుకొని అలాగే బోధించే వాడు. నేనా పాఠశాల కు కొత్త. ఇదేమిటని సహ ఉపాధ్యాయులనడిగితే, వాళ్ళు చెప్పిన విషయం వింటే చాల ఆశ్చర్యం వేసింది. ఆయనొక ఉపాధ్యాయుడే.కానీ కొన్ని వ్యక్తి గత కారణాలవల్ల ఆయనలా తయారయ్యాడని, ఇప్పుడు ఉద్యోగం లో లేడని, అతడు మంచి ఉపాధ్యాయుడని, తెలివి గలవాడని, కానీ అతనెప్పుడూ అదే ధ్యాస లో ఉంటాడని, అన్ని సబ్జెక్టుల్లో నిష్ణాతుడే.తెలుగంటే చాలా ఇష్టం.కానీ దురదృష్టం.అలా తయారయయ్యాడని, బాధపడుతూ చెప్పారు. కానీ ఒక ఇరవై యేళ్ళ తర్వాత ఒక సందర్భంలో కలిసి చాలా చక్కగా మాట్లాడాడు. ఉద్యోగం చేస్తున్నాని చెప్పాడు. నన్ను గుర్తు పట్టి మాట్లాడటం కూడా చాలా ఆశ్చర్యం సంతోషం, కలిగాయి. ఇన్నాళకది గుర్తుకొచ్చి అదే స్పూర్తితో... వ్రాసిన పద్యమిది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది మీ పూరణ. అభినందనలు.
   'నేర్చినోడు' అన్నది వ్యావహారికం.

   తొలగించండి
  2. సకలము నేర్చినట్టి పలు సంగతులెట్లుగ మార్చివేసెనో
   వికలమనస్కుడయ్యు విను వీధుల దిర్గుచు
   వింతగావుతన్
   కుకవులు వ్రాసినట్టి పలు ఘోరపు తప్పుల విప్పిచెప్ప మా
   కు,కవులు వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా!

   ***సవరణతో....🙏🙏

   తొలగించండి
 34. వ్యాకరణము నేర్పి వీఁక ఛందస్సును
  శబ్ద భావములు విశదము సేసి
  మూరి మంచి చెప్పు వారిని నిందించ
  కు కవులెల్ల మనకు గురువులె కద


  కకవిక లైన కేశముల కాంతకు భూషణ వస్త్ర భూషితాం
  గికిఁ గల భేద ముండుఁ బరికించఁగ గ్రామ్య విశుద్ధ భాషలం
  బ్రకటిత దుష్ట వృత్తులను రంజిలఁ జేసి ద్రుతాది సంధులన్
  వికలము సేసి యట్టు నిడి వింతగ నుత్తున కెందు వ్రాయు నా
  కుకవులు వార లెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా!!!

  రిప్లయితొలగించండి
 35. కవనవనమునందుకవితవల్లరులకు
  పాదుపోసిపెంచు రైతు సుకవి
  హితముగూర్చు సన్నిహితులగు ఛాత్రుల
  కు కవులెల్ల మనకు గురువులె కద

  రిప్లయితొలగించండి
 36. సుకవులుగాదెశిష్యులకుసూచనలిచ్చుచు చక్కదిద్దుచున్
  సకలముబోధచేసెదరుసాత్వికవర్తనతోడమెల్గుచున్
  సుకవులు తేటనీటివలెశుద్ధమనస్కులు వారి సాటియా
  కుకవులు? వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా!

  రిప్లయితొలగించండి
 37. నికరముగాని పద్ధతినినీచపుభావనతోడవ్రాయుచోౄ
  కుకవులువారలెల్ల,మనకున్ గురుదేవులెపూజ్యులేకదా
  సకలముశాస్త్రరీతినిరసామయకావ్యమువ్రాయునందరున్
  ముకుళితహస్తముందనరమోదముతోడనవందనంబులౌ

  రిప్లయితొలగించండి
 38. మరో పూరణ.

  ప్రకటితపుణ్యు రామవిభు వర్ణనఁజేసిన వామలూరుజున్
  సకలవినీతధర్మగతసారముఁ జెప్పు పరాశరాత్మజున్
  సుకృతులనున్ నుతించెద, విశుద్ధగతిన్ హృదయాంబుజంబుఁ దా
  కు కవులు, వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా!.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 39. కుకవులందు బ్రతుకు కూర్పుల నేర్పులు
  వర్ణ నాంశమందు పద్యరచన
  సాగజేయ గలుగు భావనసందించ
  కుకవులెల్ల మనకు గురువులెగద

  రిప్లయితొలగించండి
 40. క్రమముదప్పకుండ కార్యసాధనమున
  కచ్చితమ్ము నరసి కవన మందు
  నియమ నిష్ఠ లెల్ల నిక్కము తెలుపు మా
  కు,కవులెల్ల మనకు గురువులె కద!!

  ***సవరణతో... ధన్యవాదములు!

  రిప్లయితొలగించండి
 41. సకల పురాణముల్ చదివి. జక్కని పద్యములన్ లిఖించుచున్
  మెకముల వంటి నాయకుల మెప్పును పొందు తలంపు వీడుచున్
  మకిల తొలంగ సంఘమున మాన్యపుఁ గైతల వాణి సేవఁ జొ
  క్కు కవులు, వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా

  రిప్లయితొలగించండి
 42. చంపకమాల:
  +++++++++++++++
  వికసితమైన భావనల,విందులొనర్చెడు కావ్యసంపదన్
  సుకవులు తీర్చిదిద్దుదురు,చూపరులందరు మెచ్చునట్లుగా
  నికరముజేయలేకనిట నెట్టి యతుల్నిక కూర్చలేని,యే
  కుకవులువారలెల్లమనకున్,గురుదేవులెపూజ్యనీయులే
  _________________________________________________________

  రిప్లయితొలగించండి
 43. నికమగు ప్రజ్ఞ గల్గినను నిత్య కృషీవలులై వినమ్రులై
  ప్రకటము గాగ సత్ప్రతిభ పండిత పామర రంజకమ్ముగా
  సకల జనాళి మెప్పు గొను సత్కవనంబొనరించి రాణకె
  క్కు కవులు వారలెల్ల మనకున్ గురుదేవులె పూజ్యులే కదా

  రిప్లయితొలగించండి
 44. పద్య రాజములను వ్రాయగ మది నెంచు
  కొత్తకవుల యొక్క కోర్కె నరసి
  తప్పుల సరి దిద్ది తర్ఫీదిడ గమన
  *కు,కవులెల్ల మనకుగురువు లెకద*

  రిప్లయితొలగించండి