24, నవంబర్ 2020, మంగళవారం

సమస్య - 3554

25-11-2020 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తేలును ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్”

(లేదా…)

“తేలును ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయతీయఁగన్”

70 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    మేలగు ప్రేమయాత్రనట మెప్పును పొందిన బీచినందునన్
    నాలుగు ప్రక్కలన్ గనుచు నందన మొందుచు క్రొత్త భర్తపై
    వాలుచు వక్షమందు నగి వైనపు పచ్చగ వెల్గుచుండెడిన్
    తేలును ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయతీయఁగన్...

    పచ్చ = tattoo

    రిప్లయితొలగించండి
  2. ఉ||
    వ్రాలిన సూర్యునిన్ విరియపాలసముద్రము వంటి వెన్నెలన్
    సాలమునందు ప్రేమికులు జాల విలాసమునందునోలగన్
    జాలునటంచు భామ దలుచన్ కడు రమ్యతనిన్ దలంపులన్
    తేలును ముద్దులాడి. సుదతీమణి బల్కెను తీయతీయగన్

    రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  3. బాలుడు రయముగ చంపెను

    తేలును,ముద్దాడి కాంత తీయగ పలికెన్

    మేలును చేసితివి గదా

    బాలికకు ననుచు పొగడెను పలురీతులుగన్

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పూలవనమ్ములో నడిచి ముగ్ధయె నాథుని చెంత పున్నమిన్
    తూలుచు సంబరమ్మునను తుంటరి చేష్టల నోలలాడగా
    కాలి సమీపమందునను కన్గొని కాంతుడు మట్టుపెట్టగా
    తేలును;...ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయతీయఁగన్...

    (పాత పూరణ...బద్ధకముతో)

    రిప్లయితొలగించండి
  5. కాలము కల్సిరాక పసి కందునకున్ శుభమంచు పచ్చతో
    మేలొన గూడు నంచు దలమీదను వృశ్చికమున్ రచింపగా
    బాలుడు నేడ్వ వద్దనుచు బాధశమింపగ నూరడించుచున్
    *“తేలును ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయతీయఁగన్”*

    రిప్లయితొలగించండి
  6. కూలీకేగెను పేదెయె
    బాలుర యాకలిని తీర్చ పట్నము నందున్
    శాలీనుండిచ్చిన బ
    త్తేలును ముద్దాడి కాంత తీయగఁ బలికెన్

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పాలార్చెను పతిదేవుడు
    తేలును; ముద్దడి కాంత తీయగ పలికెన్
    వాలకమగు నీ చేష్టయె
    పాలించెను నను నిపుడని పరవశ మతియై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాలార్చెను పతిదేవుడు
      తేలును;ముద్దాడి కాంత తీయగ పలికెన్
      వాలకమగు నీ చేష్టయె
      పాలించెను నను నిపుడని పరవశ మతియై.

      తొలగించండి
  8. మేలుగ బల్కియామె యిక మేలగు మాటలు ముద్దుముద్దుగన్
    వీలగు హామిలన్నిటిని వేలుగ నిచ్చుచు వోటునడ్గుచున్
    యేలుదునంచుజెప్పె తన యేలిక చెంతజేరియున్
    తేలును ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయతీయఁగన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అడ్గుచున్+ఏలును' అన్నపుడు యడాగమం రాదు. మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  9. కూలికి వెళ్ళకున్న తన కొడ్కుల యాకలి తీరదంచు తా
    జేలకు పోవుచుండె తగు జీతము గోరుచు నాదినమ్మునన్
    బేలను పోహణించి యట పేరిమికాడపు డిచ్చినట్టి బె
    త్తేలును ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయతీయఁగన్

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    హేలను బొందుచు భర్తయె
    వాలకముగ వీపునందు పచ్చటి యళినిన్
    లీలగ నచ్చొందగ నా
    తేలును ముద్దాడి కాంత తీయగ పలికెన్.

    రిప్లయితొలగించండి
  11. కె.వి.యస్. లక్ష్మి:

    వేలును కుట్టగ చంపెను
    తేలును; ముద్దాడి కాంత తీయగ పలికెన్
    బాలుండైనను వీడిటు
    మేలగు తెగువ వెలయించె మెఱుపుగ ననుచున్.

    రిప్లయితొలగించండి
  12. మేలగు గిన్నిసు కెక్కగ
    తాలిమితో తేళ్ళనడుమ తడబడక భళా!
    మాలిమి హసించుచు గవర
    తేలును ముద్దాడి కాంత తీయగ బలికెన్

    గవర = ఎరుపు

    వేలకు వేలుబోసికొనె వెంకటనాథుని
    పెండ్లిసంతలో
    మాలిమి జేరగాపతియె మానిని చెంతకు మామయింటిలో
    తూలెను పాన్పుపైననొక తుంటరి తేలును జూచిభీతిమై
    తేలును ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయతీయగన్
    చాల ముదంబు బెంచితిని సన్నిధి నెప్పుడు నుండగావలెన్

    రిప్లయితొలగించండి
  13. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన

    సమస్య

    తేలును ముద్దాడి కాంత తీయగఁ బలికెన్
    ( లేదా)
    తేలును ముద్దులాడి సుదతీమణి పల్కెను తీయతీయగా

    నా పూరణ

    కందము

    విలువలు తెలిసిన వనితయె

    పలుమరు మగనిని దలచుచు పరవశ మందున్

    వలపుల మధురపు తలపులఁ

    దేలును , ముద్దాడి కాంత తీయగఁ బలికెన్(బలుకున్)


    ఉత్పలమాల

    మేలగు శోచనన్ బ్రియుడు మేనున పచ్చని రంగుతో నటన్

    వీలుగ ముద్రితం బయిన వృశ్చిక బొమ్మను ముద్దులాడగా

    బేలయు సమ్మతించి యట వేడుక పూర్వక భావనంబునన్

    దేలును ముద్దులాడి సుదతీమణి పల్కెను తీయతీయగా

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  14. తేలును గుర్తుగ నిచ్చెను
    ఏలెడు నవకాశమివ్వు వేంకట రమణా!
    మేలును జేయుము!జెండా
    తేలును ముద్దాడి కాంత తీయగ పలికెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి. 'ఇచ్చెను+ఏలెడు' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు.

      తొలగించండి
  15. కం.
    బాలను నాటలదేల్చగ
    మేలిమి బొమ్మలను దెచ్చె మెత్తగ నుండన్
    బేలగ బెదరిన బొమ్మగు
    తేలును ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కం.
      పూలను కోరెను కోమలి
      మాలలు గూర్చగ మగనికి మరవని రీతిన్
      బేలగ జూసెను దునుమగ
      తేలును, ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి


  16. చాల ముదము తోడా బ
    త్తేలను ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్,
    "ఆలి! మగడా! జిలేబి ని
    లా లిప్త సమయములోన లావొనరింతున్!"


    జిలేబి

    రిప్లయితొలగించండి


  17. అనఘా! "చూడండీ!" గో
    సున! తేలును ముద్దులాడి సుదతీమణి బ
    ల్కెను తీయతీయఁగన్, "మా
    కనుకట్టిదె వచ్చె మీ నగరమున రండీ!"


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. సమస్య :
    తేలును ముద్దులాడి సుద
    తీమణి బల్కెను తీయతీయగన్

    ( క్రొత్తయింట యిల్లాలి ఆనందం )

    ఉత్పలమాల
    ------------

    వాలగు కన్నుదోయి మురి
    పాలను గుమ్ముగ గ్రుమ్మరించుచున్ ;
    పాలను జీవితేశ్వరుని
    ప్రక్కన నుంచుచు ; మందహాసమున్
    మేలుగ జిందుచున్ ; బరిథి
    మీరిన బ్రేమను బంచసారపుం
    దేలును ముద్దులాడి ; సుద
    తీమణి బల్కెను తీయతీయగన్ .
    ( పంచసారము - పంచదార ; గుమ్ముగ - నిండుగ )

    రిప్లయితొలగించండి
  19. పాలును నీరము కరణిని
    మేలిమి గా కలసి మెలసి మెలగుచు మదనున్
    గాలము న జిక్కి రతిలో
    తేలును ముద్దాడి కాంత తీయగ పలికెన్

    రిప్లయితొలగించండి
  20. బేలలు బేలలంచు నడివీధిని దూగుచు ద్రాగుబోతు దా
    బ్రేలుచుద్రావనేర్తురొకొ బేలలుమద్యము నౌషధీజవం
    బీలలనాంగులెర్గరననెంతయొప్రీతియుగంజద్రావియున్
    *“తేలును ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయతీయఁగన్”*

    రిప్లయితొలగించండి
  21. ఏల నిటులయ్యె ననునది
    తేలును ; ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్
    బాలుడు మోసము నొందుచు
    పాలను తాగుట మరువగ బడుగును పొందెన్

    రిప్లయితొలగించండి
  22. హేలగ గానామృతమున
    తేలును, ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్
    లీలాకృష్ణామురళీ
    జాలమునామదినిగప్పె జాలినిగొనుమా

    రిప్లయితొలగించండి
  23. మేలుగ బల్కెనామె యిక మేలగు మాటలు ముద్దుముద్దుగన్
    వీలగు హామిలన్నిటిని వేలుగ నిచ్చుచు వోటునడ్గుచు
    న్నేలుదునంచుజెప్పె తన యేలిక చెంతకు జేరితెల్పెనే
    తేలును ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయతీయఁగన్!!

    ***సవరణతో...!

    రిప్లయితొలగించండి
  24. (వరుడు సత్యనారాయణ ను సత్తెమని, కూళల పాలి తేలని 'సత్తేలు' అని పిలిచేవారు.)

    కందం
    బేలను పద్మనుఁ గొనఁ "గ
    ష్టాల కడలి కన్య పాలి శౌరి వ" టంచున్
    దేలుచు సంతసమున 'స
    త్తేలు' ను ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్

    ఉత్పలమాల
    కాలము వెక్కిరించినదొ? కష్టము సాగరమైన నింటిలో
    శీలమె రూపమౌ పడతి చిక్కగ 'సత్తెము' పెండ్లి యాడె "నా
    పాలిటి విష్ణుమూర్తివని భాగ్యము నాద" ని పొంగిపోయి 'స
    త్తేలు' ను ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయ తీయగన్

    రిప్లయితొలగించండి
  25. పాలను పోలిన రంగున
    వాలుగ నిద్రించు చున్న భంగిమ లోనన్
    మేలుగ నగపడ చక్కెర
    "*తేలును ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్”*

    రిప్లయితొలగించండి
  26. "ఏలనొ! భీతిఁ గొల్పు నెడ నీ సమయమ్మునఁ గౌగిలింతలున్
    జాలు సరాగముల్ సరససంగతభాషణముల్ ప్రమోదముల్,
    జాలమ! యాలసించకుమ! చంపుము మూలకుఁ బ్రాకు చున్న నా
    తేలును".... ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయతీయఁగన్.

    ముద్దులాడి=ముద్దుగొల్పు స్త్రీ.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  27. మైలవరపు వారి పూరణ

    🙏🙏

    బాలల పేళ్ళ వర్ణముల బల్కగ బద్ధకమేమొ, పొట్టి *రా*
    *కీ* లయె రామకృష్ణుడు., *వకీ* లయె వాసవకృష్ణుడట్టులే
    *తేల* యె తేజపాలుడు., గతింపగ సార్థకనామముల్., సుతున్
    తేలును ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయతీయఁగన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  28. కం//
    లీలాకృష్ణా గనరా
    గోలనుమానుము చిరుబురు కోపంబేలన్ !
    వాలకు ననుచున్, రబ్బరు
    తేలును ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్ !!

    రిప్లయితొలగించండి
  29. "కీలకమేమిల మారుని
    కీలల నార్పగ" యనె బతి "కేలను జేర్చన్
    ఆలిని లాలనఁ హాయిని
    తేలును" ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారి సూచనలతో 🙏 సవరించిన పాఠము...

      "కీలకమేమిల మారుని
      కీలల నార్పగ" ననె బతి "కేలను జేర్చన్
      ఆలిని లాలన హాయిని
      తేలును" ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్

      తొలగించండి
  30. ఆలును దనవెంటిడుకొని
    వీలున జంతువులశాల విభుడేగంగన్,
    వాలున మగనిన్ గని కుం
    దేలును ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్.

    రిప్లయితొలగించండి
  31. మాలతిభయపడె జూడగ
    దేలును,ముద్దాడికాంతతీయగబలికెన్
    బాలికదరికిన్వడిజని
    లాలనగాగౌగిలించి,లాస్యములొలుకన్

    రిప్లయితొలగించండి
  32. వ్రేలు జడన్ రహించు సురభీకరసుందరపుష్పమాలికల్
    వాలుగఁ గూర్చెదో!, చెలియ! స్వర్ణవిభూష నలంకరింతునా!
    మేలగు రమ్యచేలమును మేకొని దెత్తు ననన్ మగండు, తే
    తేలును ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయతీయఁగన్.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురం.

    రిప్లయితొలగించండి
  33. చాలొక సంతాన మనుచు
    యాలంపుర జోగులాంబ నభిషేకమునన్
    ఫాలమున తేలును గనుచు
    దేలును ముద్దాడి కాంత తీయగ పలికెన్.

    రిప్లయితొలగించండి
  34. చేలములన్ ధరించి కడు చెన్నుగ పువ్వుల దాల్చి మౌళిపై
    గాలము వేయు చూపులను కాంతుని గాంచిన సంతసమ్ములో
    తేలును ముద్దులాడి, సుదతీమణి బల్కెను తీయతీయఁగన్
    వేళకు వచ్చి మన్మథుని వేదనఁ దీర్చుము నిత్యమివ్విధిన్

    రిప్లయితొలగించండి
  35. క్రాలుచుఁ గుడ్యమ్మున నళు
    లాలు మగలు వగలు వోవు చాడం బ్రేమన్
    వాలము నూపుచు సతి పతిఁ
    దేలును ముద్దాడి కాంత తీయఁగఁ బలికెన్


    ఆలుల కెంచ డెందమున హర్షము రోషము లావహించగాఁ
    జాలరు నాథు లెవ్వరును సైఁచగఁ బర్యవ సాన మెన్నడుం
    గాలము సెల్ల నల్క కిఁకఁ గాంతుని, నాథుని నింకఁ జిల్క రౌ
    తేలును, ముద్దులాడి సుదతీమణి బల్కెను దీయతీయఁగన్

    [చిల్కరౌతు + ఏలును = చిల్క రౌ తేలును]

    రిప్లయితొలగించండి
  36. ఉ:

    బాలిక కన్య రాశి యగు బాలుడు వృశ్చిక మంచు బెండ్లికై
    పోలిక జూచి మైత్రిగని పుత్రుని కోరగ సమ్మతించ నా
    లాలిని జేర బంపె నొక లాక్షపు బొమ్మగు రాశిచక్రమున్
    తేలును ముద్దులాడి సుదతీమణి బల్కెను తీయ తీయగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  37. కాలెడికడుపుకుగంజే
    పాలైయాకలిఁదరుగనుభావనయందున్
    ఆలియుమగనికివిందై
    తేలునుముద్దాడికాంతతీయగపలికెన్

    రిప్లయితొలగించండి
  38. బాలుడొకండుగానచట పాటలుబాడుచునుండగాగనెన్
    తేలును,ముద్దులాడిసుదతీమణిబల్కెనుతీయతీయగన్
    బాలికయంగసౌష్ఠవము,పాటలుబాడెడురీతినిన్ గనిన్
    లాలనతోడగౌగిలిని,లాస్యములారగబందిజేయుచున్

    రిప్లయితొలగించండి

  39. ఏమండోయ్

    అసంభావితము అంటే అర్థమేమిటండీ ?



    జిలేబి

    రిప్లయితొలగించండి