15, నవంబర్ 2020, ఆదివారం

సమస్య - 3545

 16-11-2020 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నన్ను దయమాలి చంపుట న్యాయమగునె”

(లేదా…)

“నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా”

77 కామెంట్‌లు:

 1. ఘనుడవు శత్రుమిత్రులకకారణవైరముబెట్టువాడవీ
  వనఘుడవాలిపెన్మిటులవైరముదీర్చెడుసిద్ధహస్తువీ
  వనితనుబాధపెట్టుటకువాయినిమూసితివేలవిప్పుమా
  *“నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా”*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సిద్ధహస్తుడవు' అని కదా ఉండాలి?

   తొలగించండి

 2. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  మునుపట రోమునందునను ముప్పది వీరులు చేరి మూగగా
  తనువున దోపి ఖడ్గమును దారుణ రీతిని నిల్వ బ్రూటసే
  కనులను నీరు నింపుచును గండర గండుడు సీజరిట్లనెన్:
  "నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా"

  రిప్లయితొలగించండి
 3. కనులవిమీనుగన్నులుముఖంబదిపద్మమువాయికోయిలే
  మనమదివెన్నమీగడయుమైవిరబూసిననందనంబుని
  న్ననబనియేమిగోపికలనాథుడవీవిరహంబుగొల్పుచున్
  *“నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా”*

  రిప్లయితొలగించండి
 4. వాలి రామునితో పలికిన పలుకులు....
  ...... ...... ....... ........ .......... ........ సద్గుణాంభుధి సోమ దశరథ తనయ
  దివ్యమూర్తివి నీవిల ధీరుడవని
  ప్రజలు నమ్మిరి కద, పగ వాడను కాని
  నన్ను దయమాలి చంపుట న్యాయమగునె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణభంగం. "పగవాడ గాని/ పగవాడనొక్కొ" అనండి.

   తొలగించండి
 5. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తలచ నీకు నాకును నెట్టి తగవు లేదు
  ఏతలమునుండొ నిటజేరి నీతి వీడి
  వాడి సెలలతో చాటుగ వాలినైన
  నన్ను దయమాలి చంపుట న్యాయమగునె?

  రిప్లయితొలగించండి

 6. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  పనుపగ బీబి యాదటను బంజర హిల్సున రూకలిచ్చుచున్
  చనుచును చార్మినారమున జాతర నందున లొట్టలేయుచున్
  కొనగను కుర్మ కోసమును కోడియె పల్కె మియాను గాంచుచున్:
  “నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా”

  రిప్లయితొలగించండి
 7. ఘనముగ వంట సేయ పలు కందములాకులు కూరలుండ నీ
  వనమున నవ్య జాతలగు పక్వఫలాదులు మెండుగుండగన్
  వినిమయమన్చు జంతువుల పీడన సేయుచు చిన్ని గొర్రె కూ
  నను దయమాలి చంప దగునా తగవా పగ బూని మిత్రమా

  రిప్లయితొలగించండి
 8. రాజదర్పంబుప్రకటింపరాజహంస
  నలుఁడుచెఱఁబట్టెకుటిలతనయముమీరి
  పలికెహంసంబురారాజుమనసుకరుగ
  నన్నుదయమాలిఁజంపుటన్యాయమగునె

  రిప్లయితొలగించండి
 9. జంతువులలో అన్ని జాతులలో సాలీడు మైథునము కడు చిత్రము, విషాదము. మైథునసమయము గడిచిన తక్షణము శరీరబలం 80% పెద్దదైన స్త్రీ, చాలా చిన్న కాయము కల పురుష సాలెపురుగును చంపి తినేస్తుంది. ఆ విషయమునుద్దేశిస్తూ పూరణ:

  చం||
  మనుచుట తంతువాయములు మైథునకేళిననిశ్చయంబుగన్
  ఘనమగు స్త్రీయటన్ పురుషకాయము చిన్నది, దేహమున్ నివే
  దననిడ తధ్యమంచు కడు దైన్యతయన్ ప్రియురాలినిట్లనెన్:
  'ననుదయమాలి జంపదగునా తగవా పగ బూని మిత్రమా'

  ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కేళిని...దైన్యత/ముతో..." అనండి.

   తొలగించండి
 10. కర్ణుని మరణం తర్వాత రారాజు ఆవేదన...

  తేటగీతి
  అంగ రాజ్యమ్మనాధగ బెంగపడఁగ
  నక్కురుక్షేత్ర విజయమ్ము నందనీక
  సాగితే! క్షణక్షణమీవె సలిపి మదిని
  నన్ను దయమాలి చంపుట న్యాయమగునె?

  చంపకమాల
  నినుఁ గని యంగరాజ్యమున నిల్పితి రాజుగ నాదరమ్మునన్
  బెనఁగెదవంచు నర్జునుని బీరముఁ ద్రుంచగఁ బ్రాణమిచ్చితిన్
  వెనుకకు రానిలోకములఁ బ్రీతినిఁ జేరితొ? నీ తలంపులన్
  నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁబూని మిత్రమా!

  రిప్లయితొలగించండి
 11. తమ్మునికి సాయ పడుట కధర్మముగను
  నన్ను దయ మాలి చంపుట న్యాయ మగునె
  యనుచు రాముని గాంచుచు నార్తి తోడ
  భక్తి ప్రణమిల్లి పలికెను వాలి యపుడు

  రిప్లయితొలగించండి
 12. బ్రతుకు పోరున సాగెడు వాడనైతి
  నిమిషమైనను తీరక నిద్రలేమి
  కవిత వినిపింతుననుటేల కవివరుండ
  నన్ను దయమాలి చంపుట న్యాయమగునె!!

  రిప్లయితొలగించండి
 13. మేనయల్లుళ్ళ వలనను మృత్యు వనుచు
  సొంతయన్న కంసా! నీవు, సోదరైన
  నన్నుదయమాలి చంపుట న్యాయమగునె?
  అనిన దేవకి నుంచెనేబందిగాను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సోదరి+ఐన' అన్నపుడు సంధి లేదు. "సోదరియగు/సోదరినగు.." అనండి.
   చివరి పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 14. ఒక భర్త ఆవేదన 😊😊

  నీవు తెమ్మన్న నగలన్ని నికరముగను
  పైడి యంచుల చీరలు పదిలముగను
  పెదవి విప్పక దెచ్చిన నధరమీక
  నన్ను దయమాలి చంపుట న్యాయమగునె?

  కమలములు నీటబాసిన

  అనయము నీదు నార్ద్ర కిరణావళి
  దాకగ విచ్చుకొందునే
  దినమణి తమ్మి మిత్రుడని తీరుగనందరు మెచ్చుకుందురే
  వనమును బాసినంతటనె వాడి
  మయూఖములన్ విదుర్చుచున్
  నను దయమాలి చంపదగునా తగవా
  పగబూని మిత్రమా?

  వనము = నీరు

  రిప్లయితొలగించండి
 15. ఈనాడు శంకరాభరణం వారిచ్చిన సమస్య

  నను దయమాలి చంపదగునా తగవా పగబూని మిత్రమా

  నా పూరణ

  (ఒక మేక యజమానితో)

  అనుపమప్రేమఁ బెంచితివి యన్నము నీరు సకాల మందునీ

  వనువుగ నందఁజేయుచు నపార సపర్యలఁజేసి ,యిప్పుడీ

  తనువును సొమ్ముఁజేతునను తప్పుడు బుద్ధిఁ గసాయికిత్తువే

  ననుదయమాలి చంపదగునా తగవా పగబూని మిత్రమా

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 16. వినుము పులస్త్యవంశజుడ, వీరుడ, సింహ బలాఢ్యుడేనునున్,
  మనమిఁక నగ్ని సాక్షిగను మైత్రిని జేయుద మంచు వాలితో
  వినయము హెచ్చ రావణుఁడు వింత భయావహుఁడౌచు బేర్కొనెన్
  నను దయమాలి చంపఁ దగునా తగవా? పగఁ బూని మిత్రమా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తేగీ.
   చిన్ని వత్స యదెంతయు చింత జేయు
   నీకు నీపిల్ల లెంతయొ నాకు నంతె
   కనిక రింపుము మృగరాజ గరుణ తోడ
   *నన్ను దయమాలి చంపుట న్యాయమగునె*

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "సింహబలాఢ్యుడన్ గదా..." అనండి.

   తొలగించండి
  3. 🙏🏻🙏🏻 ధన్యవాదములు. సవరించెద.

   తొలగించండి
 17. దినమిదె యాదివారమని దీర్ఘపు నిద్రన నాదమఱ్చితిన్
  స్వనమును జేయుచూ నసను వ్రాలెను దోమయె, చూచి దృశ్యమున్
  నిను విడువంగ జాలనని నేర్పుగ బ్యాటును కొట్టి ముక్కుపై
  న నుదయ మాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా?
  (బ్యాటు = విద్యుత్ బ్యాటు, దోమల్ని చంపేది)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిద్రను' అనడం సాధువు. "...జేయుచున్" అనండి. 'నసను'?

   తొలగించండి
  2. నస అంటే ముక్కు అని ఆంధ్ర భారతి లో చూసాను. దాని బదులు నొసటఁ అంటే బానే ఉంటుందా?
   రఘు

   తొలగించండి
 18. గాంధీ గారి ప్రశ్న
  తే.గీ.
  మంచిచెడ్డలెంచనొకటె మతములన్ని
  హింస తగదని మేలగు హితముపల్క
  శాంతిపలుకులు జెప్పిన గాంధియడిగె
  నన్ను దయమాలి చంపుట న్యాయమగునె?

  మూగజీవాలు ప్రశ్న:
  తే.గీ.
  పాలు పెరుగులనిచ్చును పాడియావు
  మాంసమేలాగు జనులకు మంచిగూర్చు
  శాంతిపలుకులు చెప్పగ శాక్యమౌని
  మూగజీవుల చంపుట ముచ్చటౌర
  నన్ను దయమాలి చంపుట న్యాయమగునె?

  రిప్లయితొలగించండి


 19. కనబడని నిన్ను లేదని కల్పనయని
  చెప్పి నాను నారాయణ! చేరి నావు
  చట్టనుచు నన్ను వెంటనే చంపగాను
  నేను చేసిన తప్పేమి నేరమేమి
  నన్ను దయమాలి చంపుట న్యాయమగునె!  జిలేబి

  రిప్లయితొలగించండి


 20. కందచంపకము


  భగభగ మని నిప్పు కణిక
  ధగ! నను దయమాలి చంపఁ దగునా తగవా
  పగఁ బూని మిత్రమా నే
  ను గురువుగ కొలిచితికద నిను విడువక సదా!  జిలేబి

  రిప్లయితొలగించండి
 21. అనువున సత్కవీశ్వరులు నారయ తత్కమనీయకావ్యవ
  ర్ణనముల యందు నిన్ను కమలాప్తుడవంచన నిప్పుడేలనో
  వనమునుఁ బాసినంతటనె ప్రాకటతీక్ష్ణమరీచులన్ గటా!
  నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా.

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురం.

  రిప్లయితొలగించండి
 22. మరో పూరణ.

  అనయము తన్మయీకరకరావళి సోక స్పృ శింతువే సతం
  బనువగుఁ గౌగిలీయవకటా! మృదురమ్యవిలాసభాసమో
  హనరతులందుఁ దేల్చవహహా! కవివాక్కులు రిత్తలె, నీరజాప్తువై
  నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా!

  కంజర్ల రామాచార్య
  వనస్తలిపురం.

  రిప్లయితొలగించండి
 23. వలదు మర్కట వీరుడా వదలు మయ్య

  నన్ను దయమాలి చంపుట న్యాయమగునె

  బ్రహ్మ వరము జ్ఞప్తికి వచ్చె పతన మగును

  లంక యనుచులంకిణి పల్కె జంకు వీడి  హనుమంతుడు లంకిణిపై పిడికిలితో తాడనము చేసినపుడు భీతితో పలికిన మాటలు

  రిప్లయితొలగించండి
 24. మైలవరపు వారి పూరణ

  ఘనతరధర్మమూర్తివఁట., కారుణికమ్మునఁబెద్దవంట., నీ..
  వినకులదుగ్ధవార్ధినుదయించిన చంద్రుడవంట., కాని యీ
  వనచరుఁజెట్టుచాటుఁగొని బాణమునన్ గడతేర్చఁబాడియే!
  నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 25. అనయము నీదు సంగడి ప్రయాణము చేసితి నిన్నునమ్ముచున్
  కనుగొన మంచు నీకు నదికారము నిచ్చితి వర్తకమ్మునన్
  ధనమును కొల్లగొట్టి కడు దర్పముతోడుత మాటలాడుచున్
  నను దయమాలి చంపదగునా తగవా పగబూని మిత్రమా?

  రిప్లయితొలగించండి
 26. నినుగను భాగ్యమబ్బె కద నేటికి, సూర్యకులాన్వయుండ హే
  మునిజన రక్షకా! పరమ పూజ్యుడ వంచు జనాళి కొల్తురే
  వనముఁ జరించు వాడిపయి వైరమదేల? సుగాత్ర! తెల్పుమా
  నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా

  రిప్లయితొలగించండి
 27. నీవునిలుచుండ చల్లని నీడనిత్తు
  ప్రాణవాయువు నీకిచ్చి బ్రతుకునిత్తు
  భుక్తి ఫలములనిచ్చెడి భూజమేను
  నన్ను దయమాలి చంపుట న్యాయమగునె

  రిప్లయితొలగించండి
 28. చెట్టుచాటున నిలబడిబిట్టుగాను
  నన్నుదయమాలిచంపుటన్యాయమగునె
  ననుచువాలివేడుకొనెనునజునిపౌత్రు
  యుద్ధరంగమునందునబద్ధుడౌట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "న్యాయమగునె యనుచు...వేడుకొనియె నజుని..."

   తొలగించండి
 29. నీకు నపకారమును చేసి నేనెఱుంగ 
  గడ్డి గాదము తినుచు నే గడుపుదాన 
  సరగ నిష్కారణముగ నన్ చంప జూతు  
  “నన్ను దయమాలి చంపుట న్యాయమగునె”

  రిప్లయితొలగించండి

 30. * శంకరాభరణం *
  నవంబరు 16, 2020...సోమవారం
  సమస్య

  నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా”

  నా పూరణ. చం.మా.
  **** *** ***
  ( బాహుబలి కట్టప్పతో ఇలా వచిస్తున్నాడు..)

  చినతనమందు నెత్తుకొని చేతుల మీదుగఁ బెంచినావు , మి

  త్రుని వలె నాటలాడితివి తోడుగ నిల్చియు తల్లి దండ్రివై

  అనయము గాచినావు కద!ఆర్య! మహిస్మతి రాజ్య సేవకా!

  నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా”

  -- ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి
 31. నినువిడనాడియెన్నడును నేచరియించగనైతి నీగతిన్
  పెనుమసనమ్మునందునిటు వేదనచెందుచు నున్నవేళ నే
  నినువిడనైతిఖడ్గమ! వినీతకిగా సతినెంచి నీవు చా
  నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా

  రిప్లయితొలగించండి
 32. కొత్త కోడలిగా వచ్చి కూర్మితోను
  పిల్లపాపలనిచ్చితి పెంపుజేసి
  అత్తవారింట సిరులకై నాడపిల్ల
  నన్ను దయమాలి చంపుట న్యాయమగునె

  రిప్లయితొలగించండి
 33. చం:

  ఘనమగు కైతలంచు నొక కావ్యుడు కోరగనచ్చువేయగన్
  వినతిగ ముద్రకర్త తగువెన్నికసేయ నుపక్రమించగన్
  వినికి కఠోర మన్న, కవి వెక్కసముంగని నిట్లనంగ హే
  నను దయమాలి చంప దగునా తగ వాపగ బూని మిత్రమా

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి


 34. తే.గీ:మాటతప్పని వాడను ‌మదిని నమ్ము
  మొసగితి మృగరాజా వినుమొప్పుగాను
  *నన్ను దయమాలి చంపుట న్యాయమగునె*
  నమ్ము మనుచు గోవు పలికె నయము గాను.

  తే.గీ:అష్టమ శిశువు హరియించు నసువు లనుచు
  గగన వాణి నాలించుచు గాలి మాట
  నమ్మి కడతేర్చ పెంచుట నయము గాదు
  *నన్ను దయమాలి చంపుట న్యాయ మగునె*

  ఉ.మా:వినుమికనాదుమాటలను ప్రేమను చూపితి విన్నిది నమ్ములున్
  మనముననాప్తమిత్రుడన మానుగ నమ్మితి నేమదిన్
  వినయము తోడవేడుచుంటిని స్వార్థ మూనుచున్
  *“నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా”*

  ఉ.మా:వినుమపకారమేనునవివేకముతోడనుచేయలేదుగా
  ఘనచరితానినున్ నెపుడుకన్నులతోడను గాంచనైతినో
  యినకులభూషణాయనుచునింద్రసుతుండగువాలి రాముతో
  *“నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా”*

  రిప్లయితొలగించండి
 35. ఇద్దరు మిత్రుల సంభాషణ లో,
  పెళ్లి కి బోదమని మిత్రుని తోడ్కొని పోవనెంచిన వాని పల్కులు:

  మనమిట మంచిమిత్రులము మ్రాన్పడి నచ్చెరువందుటేలనో
  వినుమిక చిందువేయగను వేగము బోవలె విందుజేయగా
  చనియగ పాతమిత్రులట చాలనె వచ్చిరి పెండ్లి కార్యమున్
  వినవలె కాలతీతమగు వేగము రమ్మిక జాగుసేయకన్

  మిత్రుని సమాధానం:

  అనువగు కాలమేనయిది నందర కూడ కరోనయేలగన్
  నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా!!

  రిప్లయితొలగించండి
 36. తోటలఁ దిరుగు చుండు సంతోషముగను
  గీడు సేయఁ దా నేరదు పాడి కాదు
  చాలు నీ ఘోర మింక శశమును, వినుమ
  నన్ను దయ, మాలి! చంపుట న్యాయ మగునె


  చనియెద నింక నీ గుణము చక్కఁగ నేరితి నబ్బురంబు నౌ
  తనరు రహస్య మంతయును దప్పక చెప్పెద నంచు లంచ మీ
  పని పని మీద యబ్బ పని పంచుచుఁ జేయఁగఁ బల్క వింతయున్
  నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా

  రిప్లయితొలగించండి
 37. ఆడపిల్లలనిననంత నలుసుయేల
  పుట్టకుండనె చంపుట పుణ్యమేన
  మనిషి మనుగడే తీరున ముందుకేగు
  నన్ను దయమాలి చంపుట న్యాయమగునె?

  రిప్లయితొలగించండి
 38. వినుమురమానవుండ!యిదివేయివిధంబులవృత్తులీభువిన్
  మనుగడయందుభాసిలగమమ్ములయేలనొ?నొప్పిజేయుచున్
  ననుదయమాలిచంపదగునాతగవాపగబూనిమిత్రమా!
  యనుచునువేడెదోమయటనారడినొందుచుశోకతప్తయై

  రిప్లయితొలగించండి
 39. విను మనుమానమేల మది వీడి కుశంకల నాలకింపుమా
  నిను నను వేరు జేయుటకు నిందలు మోపిరి వీరు నా పయిన్
  నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా
  మనమున శాంతమూని గనుమా మన మైత్రి పవిత్రబంధమున్

  రిప్లయితొలగించండి