29-11-2020 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్”
(లేదా…)
“కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుఁడే”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:గోలన్ బెట్టి కరోన బాధలికనున్ కొండొక్కటిన్ సైచకేనేలన్ గూలుట చేతకాక బలుపౌ నీమమ్ములన్ వీడుచున్మేలౌ తీరున పద్మమున్ విడుచుచున్ మెప్పొందు స్వప్నమ్మునన్ కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుఁడే...
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
వేలావలయితబ్రహ్మాండాలనుతానేనిలుపునుఠావులనుండన్ఆలముసేయకశేషుఁడుకైలాసముననహిపైనకంజుడుపండెన్
పద్యం బాగుంది. కాని పూరణ అర్థం కాలేదు.
గతితప్పనివిధముగశేషుడుబ్రహ్మాండమునుమోయుచున్నాడు, కైలాసముగూడబ్రహ్మాండాంతర్భాగమే, కైలాసపరబ్రహ్మముగాకంజుడువర్తించుచున్నాడు, అనగఅహిపైకైలాసముఅందులోబ్రహ్మఅందగించుచున్నారు
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం)వీలున్ జూచుచు శంకరయ్య కడకున్ వేగమ్మునన్ జేరెగా;..వ్రాలెన్ ముద్దుగనిచ్చి మోక్షమును తా వైనమ్ముగా హస్తికిన్;... మేలౌ పద్మమునందునన్ బలుపుగా మెప్పొంది వాణెమ్మదౌ;...కైలాసమ్మున;...శేషతల్పమున;..సౌఖ్యంబందె వాణీశుఁడే...
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
అందరికీ నమస్సులు🙏*సమస్య : “కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్”*నా పూరణ ప్రయత్నం..*కం||*కాలము మారగ నిప్పుడుపాలించుచు నిల కరోన ప్రాణము దీయన్చాలించగ పుట్టుకలను *“కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్”**కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గ్రోలి యవసురము భూరిగ ప్రేలెనచట మత్తుతోడ వెంగలియె పురా ణాలెరుగక మూర్ఖుడిటుల కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అది 'గ్రోలి' కాదు... 'క్రోలి' అనండి.
నీలకంఠుడు సతితోడ నెచ్చట నుండునో తెల్పు?బాల కృష్ణుడు నాట్య మాడె పరవశముగ దేని పైన?నాలుగు ముఖములు కూడి నట్డి దేవుని పేరు తెలుపు?పాలకడలి లోన శేషు పాన్పు పైనేమి జరిగెను?కైలాసమున,నహి పైన, కంజుడు, పండెన్ ప్రణవము,
మద్యాక్కర లో పూరణ
మీ క్రమాలంకార పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
కాలాలెంచకకాటువేయగనునాకామందుకోవిడ్డుతోచాలీచాలనిజీతభత్యములతేజంబున్హ్రుదిన్వీడెగాచాలండాయెనుబోధసేయగురుడేఛాత్రుల్మదిన్క్రుంగనాకైలాసమ్మునశేషతల్పమునసౌఖ్యంబందెవాణీశుడే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'హృదిన్ వీడెగా...'
సమస్య :కైలాసమ్మున శేషతల్పమున సౌ ఖ్యంబందె వాణీశుడే (గురువు శిష్యురాండ్రను అడిగిన ప్రశ్నలు - వారి సమాధానాలు )శార్దూలవిక్రీడితము -----------------" బాలారత్నములార ! నీలగళు డం బన్ గూడి యెందుండునో ?వాలాయంబుగ విష్ణుదేవుడు రమా ప్రాణేశు డెందుండునో ?మేలైనట్టిది సత్యలోకమున గ్రొ మ్మించైన జేజెవ్వడో ? "" కైలాసమ్మున " " శేషతల్పమున " " సౌ ఖ్యంబందె వాణీశుడే ! "( వాలాయము - నిరంతరము ; జేజె -దైవముక్రొమ్మించు - క్రొత్త మెరుపు )
మీ క్రమాలంకార పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కందంకోలాహలమున నటులకువీలుండక నిదుర బోవ వేదిక కొదవైమూలన నుంచఁగ కల్పితకైలాసమున నహి, పైన కంజుఁడు పండెన్శార్దూలవిక్రీడితము"వేళాయెన్ వరమీయ రావణునకున్ బిల్వంగ రాడేలనో?"గోలన్ బెట్టఁగ దర్శకుండు భటుడున్ గుర్తించి శోధించుచున్లీలన్ బల్కెను "స్టూడియో చివరిలో నింపంగ పూర్తైనదౌకైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుడే!"
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
పాలాక్షుండు వసించు నెచ్చట? యకూపారంబులో మాధవుం డాలక్ష్మీ సహితుండుగా నిలుచు నిత్యంబంచు నేనడ్గితిన్ నాళీకాసను డన్న చెప్పు మెవరో నాశంకనే బాపుమా! కైలాసమ్మున, శేషతల్పమున సౌఖ్యంబందె, వాణీశుఁడే.
వాలంబొక్కటి తక్కువేయగు మహా వ్యాఖ్యాత చాంచల్యమున్మేలైనట్టి పురాణ గాథలను జిమ్మిక్కుల్ గ వర్ణించుచున్వేళాకోళముగా వచించెనిటులన్ వీణాధరిన్ గూడుచున్కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుడే
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
హాలాహలమై కోవిడునేలగ, నరులను సృజించ నిక్కము నికపై శూలిదె పూచీ, కినుకన్కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్
ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్యకైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యమ్మందె వాణీశుడే నా పూరణలీలావిగ్రహమాతృమూర్తి కరుణా లేలేత వీక్షంబు నందీలోకంబున సత్కవీశ్వరుడు తానేపారు వాణీశుగాధీలోకంబున చూచుచున్ కవన వీధీ సద్విహారంబునన్కైలాసమ్మున,శేషతల్పమున,సౌఖ్యంబందె వాణీశుడే(వాణీశుడు---వాక్కునకు ప్రభువు---కవి అన్న భావంతో) 🙏🙏ఆదిభట్ల సత్యనారాయణ
క్రొవ్విడి వెంకట రాజారావు: శూలి యధివాస మెచ్చట? పాలకడలిని హరి దేనిపై శయనించెన్? కాలిక యాత నొడి నెవడు? కైలాసమున, నహిపైన, కంజుడు పండెన్.(కాలిక=పార్వతి; యాత=తోడికోడలు)
క్రొవ్విడి వెంకట రాజారావు: కాలాత్ముండగు శంకరుండు నెచటన్ ఖామందుగా నుండెనౌ? సౌలభ్యమ్ముగ తా పరుండె హరి నేశయ్యన్ రమన్ గూడుచున్? శ్రీలక్ష్మీ స్నుషయైన భారతి యొడిన్ చెన్నొందు వాడెవ్వడున్? కైలాసమ్మున, శేషతల్పమున సౌఖ్యంబందె, వాణీశుఁడే!
బ్రహ్మ ఎప్పుడూ నిద్ర పోయినట్లు లేదు.విష్ణువు నిద్ర వీడకుండా వుండిందీ లేదు.శివుడేమో అర్ధనారి యయ్యె!ఏమిటీ మాయయో!గోల! శివుని గృహమెచటే?బేలా! విష్ణువు పరుండు పేర్మిగ నెచటే?లోలా! సత్యపురమ్మున?కైలాసమున; నహిపైన; కంజుఁడు పండెన్;జిలేబి
క్రమాలంకారంలో -----కాలుడు వసించు నెచ్చట? శ్రీ లక్ష్మీ పతి శయనము చెపుమా యెచ టో? మేలుగ సృష్టి o చి యలసే కైలాసమున : నహి పైన : కంజుడు పండె న్
కాలము మార్పులు జరుపునుయీలోకము నందెగాక యెల్ల జగములన్ ,ఆలోకము లొకటయ్యన్కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'జరుపును+ఈ' అన్నపుడు యడాగమం రాదు. "మార్పులను జరుపు । నీ లోకము...లోకము లొకటైనన్" అనండి.
🙏🏽
ఏలాగైనను బూర్తి చేతురనియా!, మాకీ సమస్యన్ మతివ్యాలోలాత్మకరమ్మొసంగ దయ లేదా!, లేక కోపమ్మొ! యేలీలన్ జూడగ నొప్పె పద్మజుడు, మేలే మీకు? నీరీతిలోకైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుఁడేకంజర్ల రామాచార్య
ఆదివారం సెలవు రోజు అందరికీ పరీక్ష / పని పెడదామని శంకరుల వారి వ్యూహమై వుంటుంది :)జిలేబి
మీ పూరణ ప్రశస్తంగా, మనోహ్లాదకరంగా ఉన్నది. అభినందనలు.
29-11-2020 (ఆదివారం)ఫాలాక్షుండు వసించునే గిరిని శర్వాణీ సమేతంబుగా?లీలానాటక సూత్రధారి రమతో క్రీడించునేశయ్యపై?యాలక్ష్ష్మీపతి నాభిపద్మమున సౌఖ్యంబందెనెవ్వం? డొగిన్“కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుఁడే”
బహుకాల దర్శనం!మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు మాష్టారు
హమ్మయ్య!బాలా చెప్పవె యర్ధనారి వలె యొప్పారెన్ త్రినేత్రుండెటన్?మూలాధారముగా జనార్దనుడు కన్మోడ్పందు పండెన్ సదా?శీలా! సత్యపు రమ్ము నందెవడు సృష్టించెన్ సదా చెప్పవే!కైలాసమ్మున; శేషతల్పమున సౌఖ్యంబందె; వాణీశుఁడేజిలేబి
కం.కైలాస పర్వతమ్ముననాలింపగ శివుని వాక్కు నలువయె వెడలెన్లీలగ బడలిక భ్రమతోకైలాసమున నహిపైన కంజుఁడు పండెన్
🙏 ధన్యవాదములు గురువుగారు
నీలగ్రీవుడుచంద్రశేఖరుడుదానిద్రించునెచ్చోటనో?కాలాతీతుడుశంకరార్చితుడుసౌఖ్యంబందెతావెక్కడో?నాళీకోద్భవుసృష్టితీరెటులనో?నల్వాఖ్యుడెవ్వండునో?*“కైలాసమ్మున; శేషతల్పమున ;సౌఖ్యంబందె ;వాణీశుఁడే”*
కాలము మారెను, నిప్పటి కాలము చెడిపోవ కలికి కారణు డయ్యెన్ చాలక మార్చగ కలికియు కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్
మేలములాడగసబబే?కాలునినానాగరాజు గంజునిగురిచిన్ గాలపు మార్పుల ఫలితముకైలాసముననహిపైనకంజుడుపండెన్
కైలాసమ్మున శేషతల్పమునసౌఖ్యంబందెవాణీశుడేమేలంబుల్బలుకంగబాడియె సఖా!మీరీవిధంబొప్పగాకైలాసమ్మునుశేషతల్పమునునాకైలాసనాధున్ నజున్ వాలాయంబుగనేకమౌనటుదగన్భాగమ్ముజేయంగనౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పౌరాణిక నటుని మనోగతంగా నా ప్రయత్నము: శా: భోళాశంకరు వేసమున్ నటనలో పొంగార రంగమ్మునన్తోడై గూడెను వాణి ప్రేయసియె తా తోడుండ మేలెంచనైకాలంబెంచగ మెప్పునొందె నదియున్ కంజాక్షుగా, బోధిలన్కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుడేవాణీశుడు: వాణి భర్త, నటుడువై. చంద్రశేఖర్
ఏలానిరతమునీవిధినాలీకముపైతపంబునాకనిమదిలోనాలోచనతోమారుపుకై లాసమున నహిపైన కంజుఁడు పండెన్(లాసము - ఆట)
శైలసుత నివాస మెచట? శ్రీలక్ష్మిని గూడి నిలచె శ్రీహరి యెచటను?బాల! జలజ మందెవడే? కైలాసమున నహిపైన కంజుడు పండెన్
కాలము కాఁ బ్రళయమునకుఁ గాలాంతకుఁ గాంచఁ జేరి కైలాసమ్ముం గాలగ్రీవుని మహిమం గైలాసమున నహిపైనఁ గంజుఁడు పండెన్ [అహి =మేఘము]ఏ లోకమ్ముల జన్మ రక్షణ లయాం తై కైక కార్యోన్ముఖుల్ హేలా లీలఁ ద్రిమూర్తు లుందురు నిజంబే! సత్యలోకమ్ములోఁ,గాలాతీతము వెల్గఁగా హర హరుల్, కాంతామణిం గూడుచుంగైలాసమ్మున శేషతల్పమున, సౌఖ్యం బందె వాణీశుఁడే
బోళాశంకరుడేప్రదేశమున సమ్మోదమ్ముతో నుండు తాన్?లీలామానుష రూపుడైనహరి సంప్రీతిన్ పరుండెచ్చటో?బాలుండై జనియించె నెవ్వరల విశ్వాత్ముండు శ్రీజానికిన్ ?కైలాసమ్మున, శేషతల్పమున సౌఖ్యంబందె, వాణీశుఁడే.
కం.మౌళియె గావలె నాకున్బాల నలువ తెచ్చెను నకటా! సంకటమున్నాలుగు తలలన కిన్కన్కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్
కాలాతీతుఁడుశంకరుండెచటలోకాలెల్ల పాలించునోలీలామానుషవిగ్రహుండుహరియేలీలన్ కటాక్షించునోనాలీకంబుననుండిజీవులకుతానాయుస్సునిచ్చెవ్వరోకైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుఁడే
ఫాలాక్షుండు నిరంతరంబు దపమున్ బాటించు తావెద్దియోలీలామానుష విగ్రహుండు హరి నిద్రింపంగ పాన్పెద్దియోపాలేటిన్ బవళించు నచ్యుతుని నాభ్యాసీనుడౌనెవ్వరోకైలాసమ్మున; శేషతల్పమున; సౌఖ్యంబందె వాణీశుఁడే
శూలియు తాండవ మాడెనుశ్రీ లక్ష్మిని గూడి హరియు క్షీరాంబుధిలోహేలగ కమలభవుండౌకైలాసమున నహిపైన కంజుడు పండెన్
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
గోలన్ బెట్టి కరోన బాధలికనున్ కొండొక్కటిన్ సైచకే
నేలన్ గూలుట చేతకాక బలుపౌ నీమమ్ములన్ వీడుచున్
మేలౌ తీరున పద్మమున్ విడుచుచున్ మెప్పొందు స్వప్నమ్మునన్
కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుఁడే...
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండివేలావలయితబ్రహ్మాం
రిప్లయితొలగించండిడాలనుతానేనిలుపునుఠావులనుండన్
ఆలముసేయకశేషుఁడు
కైలాసముననహిపైనకంజుడుపండెన్
పద్యం బాగుంది. కాని పూరణ అర్థం కాలేదు.
తొలగించండిగతితప్పనివిధముగశేషుడుబ్రహ్మాండమునుమోయుచున్నాడు, కైలాసముగూడబ్రహ్మాండాంతర్భాగమే, కైలాసపరబ్రహ్మముగాకంజుడువర్తించుచున్నాడు, అనగఅహిపైకైలాసముఅందులోబ్రహ్మఅందగించుచున్నారు
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వీలున్ జూచుచు శంకరయ్య కడకున్ వేగమ్మునన్ జేరెగా;..
వ్రాలెన్ ముద్దుగనిచ్చి మోక్షమును తా వైనమ్ముగా హస్తికిన్;...
మేలౌ పద్మమునందునన్ బలుపుగా మెప్పొంది వాణెమ్మదౌ;...
కైలాసమ్మున;...శేషతల్పమున;..సౌఖ్యంబందె వాణీశుఁడే...
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఅందరికీ నమస్సులు🙏
రిప్లయితొలగించండి*సమస్య : “కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్”*
నా పూరణ ప్రయత్నం..
*కం||*
కాలము మారగ నిప్పుడు
పాలించుచు నిల కరోన ప్రాణము దీయన్
చాలించగ పుట్టుకలను
*“కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్”*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగ్రోలి యవసురము భూరిగ
రిప్లయితొలగించండిప్రేలెనచట మత్తుతోడ వెంగలియె పురా
ణాలెరుగక మూర్ఖుడిటుల
కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅది 'గ్రోలి' కాదు... 'క్రోలి' అనండి.
నీలకంఠుడు సతితోడ నెచ్చట నుండునో తెల్పు?
రిప్లయితొలగించండిబాల కృష్ణుడు నాట్య మాడె పరవశముగ దేని పైన?
నాలుగు ముఖములు కూడి నట్డి దేవుని పేరు తెలుపు?
పాలకడలి లోన శేషు పాన్పు పైనేమి జరిగెను?
కైలాసమున,నహి పైన, కంజుడు, పండెన్ ప్రణవము,
మద్యాక్కర లో పూరణ
తొలగించండిమీ క్రమాలంకార పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికాలాలెంచకకాటువేయగనునాకామందుకోవిడ్డుతో
రిప్లయితొలగించండిచాలీచాలనిజీతభత్యములతేజంబున్హ్రుదిన్వీడెగా
చాలండాయెనుబోధసేయగురుడేఛాత్రుల్మదిన్క్రుంగనా
కైలాసమ్మునశేషతల్పమునసౌఖ్యంబందెవాణీశుడే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'హృదిన్ వీడెగా...'
సమస్య :
రిప్లయితొలగించండికైలాసమ్మున శేషతల్పమున సౌ
ఖ్యంబందె వాణీశుడే
(గురువు శిష్యురాండ్రను అడిగిన
ప్రశ్నలు - వారి సమాధానాలు )
శార్దూలవిక్రీడితము
-----------------
" బాలారత్నములార ! నీలగళు డం
బన్ గూడి యెందుండునో ?
వాలాయంబుగ విష్ణుదేవుడు రమా
ప్రాణేశు డెందుండునో ?
మేలైనట్టిది సత్యలోకమున గ్రొ
మ్మించైన జేజెవ్వడో ? "
" కైలాసమ్మున " " శేషతల్పమున " " సౌ
ఖ్యంబందె వాణీశుడే ! "
( వాలాయము - నిరంతరము ; జేజె -దైవము
క్రొమ్మించు - క్రొత్త మెరుపు )
మీ క్రమాలంకార పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండికోలాహలమున నటులకు
వీలుండక నిదుర బోవ వేదిక కొదవై
మూలన నుంచఁగ కల్పిత
కైలాసమున నహి, పైన కంజుఁడు పండెన్
శార్దూలవిక్రీడితము
"వేళాయెన్ వరమీయ రావణునకున్ బిల్వంగ రాడేలనో?"
గోలన్ బెట్టఁగ దర్శకుండు భటుడున్ గుర్తించి శోధించుచున్
లీలన్ బల్కెను "స్టూడియో చివరిలో నింపంగ పూర్తైనదౌ
కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుడే!"
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిపాలాక్షుండు వసించు నెచ్చట? యకూపారంబులో మాధవుం
రిప్లయితొలగించండిడాలక్ష్మీ సహితుండుగా నిలుచు నిత్యంబంచు నేనడ్గితిన్
నాళీకాసను డన్న చెప్పు మెవరో నాశంకనే బాపుమా!
కైలాసమ్మున, శేషతల్పమున సౌఖ్యంబందె, వాణీశుఁడే.
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాలంబొక్కటి తక్కువేయగు మహా
రిప్లయితొలగించండివ్యాఖ్యాత చాంచల్యమున్
మేలైనట్టి పురాణ గాథలను జిమ్మిక్కుల్ గ వర్ణించుచున్
వేళాకోళముగా వచించెనిటులన్ వీణాధరిన్ గూడుచున్
కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుడే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
తొలగించండిహాలాహలమై కోవిడు
రిప్లయితొలగించండినేలగ, నరులను సృజించ నిక్కము నికపై
శూలిదె పూచీ, కినుకన్
కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈనాటి శంకరాభరణం వారిచ్చిన
రిప్లయితొలగించండిసమస్య
కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యమ్మందె వాణీశుడే
నా పూరణ
లీలావిగ్రహమాతృమూర్తి కరుణా లేలేత వీక్షంబు నం
దీలోకంబున సత్కవీశ్వరుడు తానేపారు వాణీశుగా
ధీలోకంబున చూచుచున్ కవన వీధీ సద్విహారంబునన్
కైలాసమ్మున,శేషతల్పమున,సౌఖ్యంబందె వాణీశుడే
(వాణీశుడు---వాక్కునకు ప్రభువు---కవి అన్న భావంతో)
🙏🙏
ఆదిభట్ల సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశూలి యధివాస మెచ్చట?
పాలకడలిని హరి దేనిపై శయనించెన్?
కాలిక యాత నొడి నెవడు?
కైలాసమున, నహిపైన, కంజుడు పండెన్.
(కాలిక=పార్వతి; యాత=తోడికోడలు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికాలాత్ముండగు శంకరుండు నెచటన్ ఖామందుగా నుండెనౌ?
సౌలభ్యమ్ముగ తా పరుండె హరి నేశయ్యన్ రమన్ గూడుచున్?
శ్రీలక్ష్మీ స్నుషయైన భారతి యొడిన్ చెన్నొందు వాడెవ్వడున్?
కైలాసమ్మున, శేషతల్పమున సౌఖ్యంబందె, వాణీశుఁడే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబ్రహ్మ ఎప్పుడూ నిద్ర పోయినట్లు లేదు.
విష్ణువు నిద్ర వీడకుండా వుండిందీ లేదు.
శివుడేమో అర్ధనారి యయ్యె!
ఏమిటీ మాయయో!
గోల! శివుని గృహమెచటే?
బేలా! విష్ణువు పరుండు పేర్మిగ నెచటే?
లోలా! సత్యపురమ్మున?
కైలాసమున; నహిపైన; కంజుఁడు పండెన్;
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రమాలంకారంలో -----
రిప్లయితొలగించండికాలుడు వసించు నెచ్చట?
శ్రీ లక్ష్మీ పతి శయనము చెపుమా యెచ టో?
మేలుగ సృష్టి o చి యలసే
కైలాసమున : నహి పైన : కంజుడు పండె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాలము మార్పులు జరుపును
రిప్లయితొలగించండియీలోకము నందెగాక యెల్ల జగములన్ ,
ఆలోకము లొకటయ్యన్
కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జరుపును+ఈ' అన్నపుడు యడాగమం రాదు. "మార్పులను జరుపు । నీ లోకము...లోకము లొకటైనన్" అనండి.
🙏🏽
తొలగించండిఏలాగైనను బూర్తి చేతురనియా!, మాకీ సమస్యన్ మతి
రిప్లయితొలగించండివ్యాలోలాత్మకరమ్మొసంగ దయ లేదా!, లేక కోపమ్మొ! యే
లీలన్ జూడగ నొప్పె పద్మజుడు, మేలే మీకు? నీరీతిలో
కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుఁడే
కంజర్ల రామాచార్య
తొలగించండిఆదివారం సెలవు రోజు అందరికీ పరీక్ష / పని పెడదామని శంకరుల వారి వ్యూహమై వుంటుంది :)
జిలేబి
మీ పూరణ ప్రశస్తంగా, మనోహ్లాదకరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి29-11-2020 (ఆదివారం)
రిప్లయితొలగించండిఫాలాక్షుండు వసించునే గిరిని శర్వాణీ సమేతంబుగా?
లీలానాటక సూత్రధారి రమతో క్రీడించునేశయ్యపై?
యాలక్ష్ష్మీపతి నాభిపద్మమున సౌఖ్యంబందెనెవ్వం? డొగిన్
“కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుఁడే”
బహుకాల దర్శనం!
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు మాష్టారు
తొలగించండి29-11-2020 (ఆదివారం)
రిప్లయితొలగించండిఫాలాక్షుండు వసించునే గిరిని శర్వాణీ సమేతంబుగా?
లీలానాటక సూత్రధారి రమతో క్రీడించునేశయ్యపై?
యాలక్ష్ష్మీపతి నాభిపద్మమున సౌఖ్యంబందెనెవ్వం? డొగిన్
“కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుఁడే”
రిప్లయితొలగించండిహమ్మయ్య!
బాలా చెప్పవె యర్ధనారి వలె యొప్పారెన్ త్రినేత్రుండెటన్?
మూలాధారముగా జనార్దనుడు కన్మోడ్పందు పండెన్ సదా?
శీలా! సత్యపు రమ్ము నందెవడు సృష్టించెన్ సదా చెప్పవే!
కైలాసమ్మున; శేషతల్పమున సౌఖ్యంబందె; వాణీశుఁడే
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం.
రిప్లయితొలగించండికైలాస పర్వతమ్మున
నాలింపగ శివుని వాక్కు నలువయె వెడలెన్
లీలగ బడలిక భ్రమతో
కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏 ధన్యవాదములు గురువుగారు
తొలగించండినీలగ్రీవుడుచంద్రశేఖరుడుదానిద్రించునెచ్చోటనో?
రిప్లయితొలగించండికాలాతీతుడుశంకరార్చితుడుసౌఖ్యంబందెతావెక్కడో?
నాళీకోద్భవుసృష్టితీరెటులనో?నల్వాఖ్యుడెవ్వండునో?
*“కైలాసమ్మున; శేషతల్పమున ;సౌఖ్యంబందె ;వాణీశుఁడే”*
కాలము మారెను, నిప్పటి
రిప్లయితొలగించండికాలము చెడిపోవ కలికి కారణు డయ్యెన్
చాలక మార్చగ కలికియు
కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్
మేలములాడగసబబే?
రిప్లయితొలగించండికాలునినానాగరాజు గంజునిగురిచిన్
గాలపు మార్పుల ఫలితము
కైలాసముననహిపైనకంజుడుపండెన్
కైలాసమ్మున శేషతల్పమునసౌఖ్యంబందెవాణీశుడే
రిప్లయితొలగించండిమేలంబుల్బలుకంగబాడియె సఖా!మీరీవిధంబొప్పగా
కైలాసమ్మునుశేషతల్పమునునాకైలాసనాధున్ నజున్
వాలాయంబుగనేకమౌనటుదగన్భాగమ్ముజేయంగనౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపౌరాణిక నటుని మనోగతంగా నా ప్రయత్నము:
తొలగించండిశా:
భోళాశంకరు వేసమున్ నటనలో పొంగార రంగమ్మునన్
తోడై గూడెను వాణి ప్రేయసియె తా తోడుండ మేలెంచనై
కాలంబెంచగ మెప్పునొందె నదియున్ కంజాక్షుగా, బోధిలన్
కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుడే
వాణీశుడు: వాణి భర్త, నటుడు
వై. చంద్రశేఖర్
ఏలానిరతమునీవిధి
రిప్లయితొలగించండినాలీకముపైతపంబునాకనిమదిలో
నాలోచనతోమారుపు
కై లాసమున నహిపైన కంజుఁడు పండెన్
(లాసము - ఆట)
శైలసుత నివాస మెచట?
రిప్లయితొలగించండిశ్రీలక్ష్మిని గూడి నిలచె శ్రీహరి యెచటను?
బాల! జలజ మందెవడే?
కైలాసమున నహిపైన కంజుడు పండెన్
కాలము కాఁ బ్రళయమునకుఁ
రిప్లయితొలగించండిగాలాంతకుఁ గాంచఁ జేరి కైలాసమ్ముం
గాలగ్రీవుని మహిమం
గైలాసమున నహిపైనఁ గంజుఁడు పండెన్
[అహి =మేఘము]
ఏ లోకమ్ముల జన్మ రక్షణ లయాం తై కైక కార్యోన్ముఖుల్
హేలా లీలఁ ద్రిమూర్తు లుందురు నిజంబే! సత్యలోకమ్ములోఁ,
గాలాతీతము వెల్గఁగా హర హరుల్, కాంతామణిం గూడుచుం
గైలాసమ్మున శేషతల్పమున, సౌఖ్యం బందె వాణీశుఁడే
బోళాశంకరుడేప్రదేశమున సమ్మోదమ్ముతో నుండు తాన్?
రిప్లయితొలగించండిలీలామానుష రూపుడైనహరి సంప్రీతిన్ పరుండెచ్చటో?
బాలుండై జనియించె నెవ్వరల విశ్వాత్ముండు శ్రీజానికిన్ ?
కైలాసమ్మున, శేషతల్పమున సౌఖ్యంబందె, వాణీశుఁడే.
కం.
రిప్లయితొలగించండిమౌళియె గావలె నాకున్
బాల నలువ తెచ్చెను నకటా! సంకటమున్
నాలుగు తలలన కిన్కన్
కైలాసమున నహిపైన కంజుఁడు పండెన్
కాలాతీతుఁడుశంకరుండెచటలోకాలెల్ల పాలించునో
రిప్లయితొలగించండిలీలామానుషవిగ్రహుండుహరియేలీలన్ కటాక్షించునో
నాలీకంబుననుండిజీవులకుతానాయుస్సునిచ్చెవ్వరో
కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుఁడే
ఫాలాక్షుండు నిరంతరంబు దపమున్ బాటించు తావెద్దియో
రిప్లయితొలగించండిలీలామానుష విగ్రహుండు హరి నిద్రింపంగ పాన్పెద్దియో
పాలేటిన్ బవళించు నచ్యుతుని నాభ్యాసీనుడౌనెవ్వరో
కైలాసమ్మున; శేషతల్పమున; సౌఖ్యంబందె వాణీశుఁడే
రిప్లయితొలగించండిశూలియు తాండవ మాడెను
శ్రీ లక్ష్మిని గూడి హరియు క్షీరాంబుధిలో
హేలగ కమలభవుండౌ
కైలాసమున నహిపైన కంజుడు పండెన్