4, నవంబర్ 2020, బుధవారం

సమస్య - 3535

5-11-2020 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్”

(లేదా…)

“శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా”

84 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  భవనమ్మందున జేరగా సకియలే బంజార హిల్సందునన్
  కవితల్ వ్రాయగ నశ్వముల్ తనరుచున్ గాఢంపు స్నేహమ్మునన్
  లవలేశమ్మును సిగ్గునున్ విడుచుచున్ లావణ్యమౌ తీరునన్
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా...

  రిప్లయితొలగించండి
 2. గుఱ్ఱాలు పాటలు వ్రాసినపుడు గాడిదలు పాడకుంటా ఉంటాయా? బాగుంది మీ సరదా పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. నవగీతములను బాడగ
  భవతారకమంత్రమనుచుభారతిమెచ్చన్
  కువకువలాడుచునటుపై
  శ్రవణానందముగ ఖరము రాగముదీసెన్
  ++++++++++++++++
  రావెల పురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  భువిలో నాణ్యపు చిత్రమున్ వఱలుచున్ మోహమ్మునన్ చెండెడిన్
  జవరాలౌచును నేర్పగన్ కినుకనున్ సావిత్రి మిస్సమ్మగా
  నవనీతమ్మగు గొంతుతో బెదరుచున్ నాగార్జునిన్ నాయనే...
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'మీకు మీరే మాకు మేమే' ... మిస్సమ్మ చిత్రంలోని చక్కని హాస్య సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చారు.
   మీ ఆటవిడుపు పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 5. కందం
  నవజాత గాడిద శిశువు
  శివసాయుజ్యమ్ముఁ బొంద సింతలువడెడున్
  జవరాలి సేద దీర్పఁగ
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '..బొందఁ జింతలు..' అని ఉండాలి. అక్కడ గసడదవాదేశం రాదు.

   తొలగించండి
  2. మత్తేభవిక్రీడితము
   వివరమ్మెర్గవు 'గాడిదా' !బ్రతికెడున్ విజ్ఞానమేలేనిదై
   జవసత్వంబులు నాకు గల్గువరకే సాపాటు నీకన్నఁ దా
   నవమానంబుగఁ దండ్రి వీడి స్వర విద్యా పాటవంబందుచున్
   శ్రవణానందముగా 'ఖరమ్ము' సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా!

   తొలగించండి
  3. గురుదేవులకు ధన్యవాదములు.సవరించుకుంటాను.

   తొలగించండి
  4. మీ వృత్తపూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. దవమున శశకము కంఠీ

  రవముకు జూపించ నీడ , రయముగ కని తా

  నవివేకముతో దూకన్

  శ్రవణా నందముగ ఖరము రాగము తీసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కంఠీ।రవమునకున్ జూప నీడ...' అనండి. (రవముకు అనరాదు.రవమునకు అనడం సాధువు)

   తొలగించండి
 7. స్తవనీ యమ్మగు తానమందు కడు నుద్దండుల్ ప్రవేశించి భల్
  కవితల్ పాడుచు ప్రేక్షకాళి తనియన్ కావించగా నొక్క డే
  చవి లేనట్టి గళమ్ముతోపలుక నిస్సారమ్ముగా, శ్రోతనెన్
  “శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా”

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శ్రోత+అనెన్' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "నిస్సారమ్మనెన్ శ్రోతయే" అనండి.

   తొలగించండి
 8. అవతల నుప యెన్నికలన్
  క్షవరంబై ధనము పోయి కడకు తనోడన్,
  వివరింపుచు వంచన యని
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తాను'ను 'తను' అనరాదు. "కడకోడగ దాన్" అనండి.

   తొలగించండి
  2. 🙏🏻🙏🏻 సరి చేసికొందును.🙏🏻🙏🏻

   తొలగించండి
 9. ఏ విధముగా నైనా ప్రాచుర్యము పొందాలనుకునే వారిని గురించి చెబుతూ గురువు శిష్యునికి....
  కం.
  భువిలో జడుడని దిట్టగ
  నవనిన్ జనులెల్ల గాడిద యనుచు ననగా
  నవఘళ మయ్యను నేనని
  శ్రవణా !నందముగ ఖరము రాగముఁ దీసెన్

  కం.
  అవనిన్ సాధకులిర్వురు
  నవగుణముల బరిహరింప సాధన జేయం
  గ, వరలెను సిద్ధి, నప్పుడు
  శ్రవణా! నందముగ ఖరము రాగముఁ దీసెన్

  నందముగ = ఆనందముగా, ఖరము = ఖరనామ సంవత్సరము , రాగము = మాత్సర్యము (వారికి ఆ సంవత్సరం లో సిద్ధి లభించింది )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలలో అస్పష్టత ఉన్నది. రెండింట రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 10. సమస్య :
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో
  రాగమ్ము దీసెన్ సఖా

  (శాస్త్రజ్ఞుల ప్రయోగఫలితంగా కఠోరకంఠం
  కమనీయకంఠమయింది. )
  మత్తేభవిక్రీడితము
  ............................

  నవతల్ జిందెడి నేటి కాలమున మా
  నైపుణ్యసందీప్తితో ;
  జవసత్వంబులు ధారవోసిన మహా
  శాస్త్రజ్ఞధీశక్తితో
  భవమున్ జెందిన గార్దభంబు బడసెన్
  భవ్యంపు కంఠధ్వనిన్ ;
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో
  రాగమ్ము దీసెన్ సఖా !!

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సవురుగ మనుజులు సలిపెడి
  రవముల ననుకృతి నెఱుగుచు రాణించు నటుల్
  ద్రువునీడను నిలుచుండుచు
  శ్రవణానందముగ ఖరము రాగము దీసెన్.

  రిప్లయితొలగించండి
 12. శ్రవణా నందముఁ గూరగ
  కవివర్యుడు మధురగీతి గానముఁ జేయన్
  నీవేనా పాడెదవని
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్

  రిప్లయితొలగించండి
 13. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సవురున్ గూడెడి రీతి శబ్దములు లెస్సగా విడంబించుచున్
  రవణించంగగ సాగు వారలను నిర్వర్ణించి కీలాలముల్
  రవముల్ జేయుట నేర్చి నాడెడి వడిన్ రమ్యంబునౌ గొంతుతో
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా1

  (విడంబించు= అనుకరించు/ మిమిక్రీ; నిర్వర్ణించి= చూచి/గమనించి; కీలాలముల్=జంతువులు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లెస్సగా' అన్నచోట గణభంగం. 'రవణించంగ(గ)' ఇక్కడ అదనపు గ ఎందుకు? "నేర్చి యాడెడి" అనడం సాధువు.

   తొలగించండి
  2. గురువుగారు తందరలో గమనించలేదు ఇప్పుడు సవరించాను పరిశీలించండి.

   సవురున్ గూడెడి రీతి శబ్దముల నాసక్తిన్ విడంబించుచున్
   రవణించున్నటు సాగు వారలను నిర్వర్ణించి కీలాలముల్
   రవముల్ జేయుట నేర్చి యాడెడి వడిన్ రమ్యంబునౌ గొంతుతో
   శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా1

   తొలగించండి
 14. దవమున గార్ధభమోండ్రిడె
  భవనము నందొక వనితయె పాడగ విని కా
  రవమది తా బలికెనిటుల
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్

  రిప్లయితొలగించండి
 15. కె.వి.యస్. లక్ష్మి:

  రవళించెను శుభరాగము
  శ్రవణానందముగ; ఖరము రాగము దీసెన్
  పొవరున రజకుడు చఱచగ
  నెవులును గూడిన స్వరమున నేడ్చుచు నచటన్.

  రిప్లయితొలగించండి
 16. అవతలి గట్టున మేసెడు
  నవనవ లాడెడు కరభపు నాయిక వినగా
  నవిరళమౌ ప్రేమ దెలుప
  శ్రవణానందముగ ఖరము రాగము దీసెన్

  అవిరామంబుగ మోసిమూటలను దా
  నాయాసమున్ మర్వగా
  చవులూరించెడు మొక్కజొన్నలను
  వే సంతుష్టిగా మెక్కుచున్
  దివి సౌఖ్యమ్మును బొందుచున్ సతికి, నుద్దీపించు తోషమ్ముతో,
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ము దీసెన్ సఖా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కాకిపిల్ల కాకికి ముద్దు... గాడిద పాట గాడిదలకు శ్రావ్యం.. బాగున్నాయి మీ రెండు పూరణలు. అభినందనలు.

   తొలగించండి
  2. ధన్యాస్మి గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏🙏

   తొలగించండి
 17. దవమున జంతువు లన్నియు
  కవగూడి సభికులలోన గళమెత్తుకొనన్
  నెవరికి సాధ్యమని యడుగ
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్

  కవగూడు = గుంపుగూడు

  రిప్లయితొలగించండి
 18. వివరించందగు గాన సంపదల వైవిధ్యంబులేపారగా
  నవగీతమ్ముల రామునిన్ బొగడుచున్ నాదాత్మ సంకీర్తనల్
  రవళీరంజిత మోహనమ్ము,ఘన సారస్వంబునన్ బాడగా
  శ్రవణానందముగా ఖరమ్ముసభలో రాగమ్ముఁ దీసెన్ సఖా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...బొగడి తా నాధ్యాత్మ..." అనండి.

   తొలగించండి


 19. ఎంత శ్రవణానందమో కదా!


  జవరాలొకతె జిలేబి త
  నివారగా పాడగా పనిని వదిలి భళా
  రె వరుసగా జత గలుపుచు
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. కం//
  చివురాకులుదిని కోయిల
  శ్రవణానందముగ, ఖరము రాగముఁ దీసెన్ !
  భువనంబులె యదురునటుల
  నవమన్మధ నృత్య క్రీడ నవలోకింపన్ !!

  రిప్లయితొలగించండి
 21. నవ వధువు పాట పాడగ
  లవ లేశము తొణక కుండ రయమున పతియున్
  జవమున హసించు చి ట్ల నె
  శ్రవణా నందముగ ఖరము రాగము దీ సెన్

  రిప్లయితొలగించండి
 22. ✍️ మల్లి సిరిపురం శ్రీశైలం,
  కం//
  భవభూతి కావ్యరచనే
  నవకోమల సుందరమని నలువురు బొగడన్ !
  చెవులొగ్గి వినుచు ముదమై
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్ !!

  రిప్లయితొలగించండి
 23. ఒకానొక గానసభలో పాడుచున్న తన పుత్రుని గూర్చి మిత్రునికి తెలియజేస్తూ ప్రేమతో తండ్రి.....

  స్తవనీయమ్ముగఁ బాడె నొక్కతె పికస్వారస్యకంఠమ్ముతో
  చవులూరించె మరో మరాళి మృదుషడ్జాస్వాద్యగానమ్ముతో
  నవనీతామలమార్దవస్వరమునన్ నా పుత్రుడు న్బాడుచున్
  శ్రవణానందముగా, ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి


 24. అవిరామంబుగ శంకరాభరణమందాశ్చర్యమున్ గొల్పుచున్
  కవనంబందుకొనన్ జిలేబి విధిగా కందమ్ము మాకందమై,
  జవరా లొక్కతె పాటనందుకొనగా శ్రావ్యమ్ముగా జోడిగా
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా!


  జిలేబీయము

  రిప్లయితొలగించండి
 25. మత్తేభవిక్రీడితము
  వివరమ్మెర్గవు 'గాడిదా' !బ్రతికెడున్ విజ్ఞానమేలేనిదై
  జవసత్వంబులు నాకు గల్గువరకే సాపాటు నీకన్నఁ దా
  నవమానంబుగఁ దండ్రి వీడి స్వర విద్యా పాటవంబందుచున్
  శ్రవణానందముగా 'ఖరమ్ము' సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా!

  రిప్లయితొలగించండి
 26. అవలోకించగ నేగితి 
  యవధానము చేయునన్న యా సభ కేనున్ 
  భవ బంధము లూడగ  ఖర
  “శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్” 

  రిప్లయితొలగించండి
 27. ఎవరేమన్నను తప్పక
  నవ కటకమును తునుకలుగ నరికెద ననుచున్
  చవి దీరగ తన వారికి
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్

  కటకము = రాజధాని

  రిప్లయితొలగించండి
 28. దవమున నొకనాడొక యు
  త్సవమునగార్ధభవృకముల సంహర్షణమం
  దవలీలగనోండ్రించుచు
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్

  రిప్లయితొలగించండి
 29. నవజాత రాసభ స్వనము
  శ్రవణానంద మును గూర్చ చాకలి యింటన్
  జవమున దానిని గాంచుచు
  *శ్రవణానందముగఖరము రాగము తీసెన్*

  రిప్లయితొలగించండి
 30. అవకాశంబిదె జిక్కెను
  అవమానంబేమి ఖరమె యశ్వంబంచున్
  జవమున దోలెను గణపతి*
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్
  (*చిలకమర్తి వారి గణపతి 🙂)

  రిప్లయితొలగించండి
 31. మైలవరపు వారి పూరణ

  అవమానమ్మిది జాతికంతటికి నోరారన్ ధ్వనిన్ జేయ మా..
  నవలోకమ్మవహేళనమ్ము సలుపున్.,రారండు రండో యిటుల్
  వివరింతున్ మృదురాగసంగతులనన్ వే గాడిదల్ జేరగా
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముదీసెన్ సఖా!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 32. Raja Raoనవంబర్ 05, 2020 8:54 AM
  గురువుగారు తందరలో గమనించలేదు ఇప్పుడు సవరించాను పరిశీలించండి.

  సవురున్ గూడెడి రీతి శబ్దముల నాసక్తిన్ విడంబించుచున్
  రవణించున్నటు సాగు వారలను నిర్వర్ణించి కీలాలముల్
  రవముల్ జేయుట నేర్చి యాడెడి వడిన్ రమ్యంబునౌ గొంతుతో
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా1

  రిప్లయితొలగించండి
 33. ఏ విధముగా నైనా ప్రాచుర్యము పొందాలనుకునే వారిని గురించి చెబుతూ గురువు శిష్యునికి....
  కం.
  భువిలో జడుడని దిట్టగ
  నవనిన్ జనులెల్ల గాడిద యనుచు ననగా
  నవఘళ మయ్యను నేనని
  శ్రవణా !నందముగ ఖరము రాగముఁ దీసెన్

  అవఘళము = ప్రాచుర్యము
  నందముగ = ఆనందముగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువర్యులు క్షమించాలి పైన పూరణలకు సందర్భము తారుమారు ఐయ్యింది.
   (అ - ద కి యతి సరిపోతుంది కదా.. )

   తొలగించండి
 34. భవనాశంబుతపోస్థలంబుజనినిస్వార్థాత్మనిష్కామ్యుడై
  యువకుండొక్కడుముక్కుమూసుకొనిసాయుజ్యంబునేగోరదా
  నవకార్యంబుదలంచిమాంత్రికుడుగ్రామ్యాశ్వంబుగామార్చినన్
  *“శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా”*

  రిప్లయితొలగించండి
 35. వివరముగ చెప్ప గోరిన
  చెవులబడినదంత తానె చెప్పగదలచెన్
  ఎవరికి నప్పని రీతిన్
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్

  రిప్లయితొలగించండి
 36. సరిజేసితిని గురూజీ !
  ✍️ మల్లి సిరిపురం శ్రీశైలం,
  కం//
  భవభూతి కావ్యరచనయె
  నవకోమల సుందరమని నలువురు బొగడన్ !
  చెవులొగ్గి వినుచు ముదమై
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్ !!

  రిప్లయితొలగించండి
 37. ధవళంబన్నను వానరమ్మనుచు బంధంబన్న జైలంచు, కా
  రవమన్నన్ బికమంచు నెంచునొక మూర్ఖాగ్రేసరుండప్పుడున్
  బ్రవచించెన్ దన యాలితో నిటుల సంరంభమ్ము తో గాంచవే
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా

  రిప్లయితొలగించండి
 38. జవరాలొక్కతె గానకౌశలముతో సంతోషముల్ పంచగా
  వివిధోత్సాహముతోడ జూచి యొకడున్ విస్తారమోదమ్ముతో
  కవిమిత్రుంగని నొక్కిపల్కె యిటులా "ఖల్యాణి సథ్యమ్మురా
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా”

  'కల్యాణి,సత్యము,కరమ్ము'లను పైవిధంగా ఉచ్చరించాడని అభిప్రాయం.

  రిప్లయితొలగించండి
 39. చవి లేని పాట లెల్ల వి
  ని విని యసహనమునఁ దాఁ గినిసి సభలో ని
  ట్లవహేళనముగఁ బల్కెను
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్


  భువి నీరీతిఁ జెలంగు హాస్యములు సమ్మోహమ్ము వెల్గం గర
  మ్ము వచశ్శుద్ధియు నింక నైపుణము సన్ముద్రాదులం గావలెం
  గవి ముందుండఁగ నొత్తి పల్కకుమ యీ “కా” నిట్లు దా గాడ్ద యౌ
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా

  రిప్లయితొలగించండి
 40. సకలంబావిధియాడునాటకముగాసాకల్యమేనంతటన్
  వికటంబాయెనుకార్యమేభువినితావేదాలువల్లింపగా
  కవిసెంబాధలుజంటలాయెడనుతాగాసింవిడాకుల్కనన్
  శ్రవణానందముగాఖరమ్ముసభలోరాగమ్ముఁదీసెన్సఖా

  రిప్లయితొలగించండి
 41. సవిత అనే అమ్మాయి కొత్తగా సంగీతం నేర్చుకొంటున్నది. పాట పాడాలనే కంగారు ను తెలుపుతూ నా ఈ ప్రయత్నం

  మ:

  సవితన్ రమ్మనె పాట పాడుటకు యేంచక్కా సమారోహణన్
  జవముంజేరగ వేదికన్ మరచె తా సంగీత సారమ్ములన్
  వివశత్వమ్మున యెంచె రాగ మొకటిన్ విభ్రాంతి గొల్పంగటన్
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ము దీసెన్ సఖా

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 42. లవకుశులిరువురుపాడిరి
  శ్రవణానందముగ,ఖరమురాగముదీసెన్
  జెవులవిచిల్లులువోవన్
  రవమున్ దగ్గించిపలుకరాణింత్రుభువిన్

  రిప్లయితొలగించండి
 43. దవమందున్ వశియించుజంతుతతిలో దక్షుండ నేఁ నెన్న సం
  శ్రవణమ్ముల్గదియించి శబ్దములనాస్వాదించ రారండహో
  రవళించున్ హృదయాంతరాళములలోరాగాలు నావంచు దా
  శ్రవణానందముగా ఖరమ్ము సభలో రాగమ్ముఁ దీసెన్ సఖా

  రిప్లయితొలగించండి
 44. కవియేవ్రాసినపాటలన్దనర దాగానంబుజేయంగగా
  నవహేళంబునుజేయుచున్ నొకడుయాహాహామదీయంబిదిన్
  రవముల్జేయుచుబాడగావినుమయాావంబుమూలంబునన్
  శ్రవణానందముగాఖరమ్ముసభలోరాగమ్ముదీసెన్ సఖా!

  రిప్లయితొలగించండి
 45. అవగతమాయెను తల్లీ
  యవిరళ కృషి సల్పినట్టి యానందమునన్
  కవనము సేయందలుపగ
  శ్రవణానందముగ ఖరము రాగముఁ దీసెన్!!

  రిప్లయితొలగించండి