ఈ నాటి పరిస్థితి చూస్తే అన్నీ బినామీ రసీదులే బినామీ కట్టడాలే బినామీ వోట్లే. అవి కూడా చట్టరీత్యా సరియైనవిగానే చలామణీ చేస్తున్నారు కొందరు కలుషితబుద్ధిమంతులు. అలా అన్నీ అబద్ధాలని నిజం చేయడం వల్ల మన న్యాయవాదులూ ధర్మం నిలబెట్టలేకపోతున్నారు
ఎంతో పెద్ద సమరం చేస్తే కానీ మన భారతదేశ చట్టం తయారవ్వలేదు. ఐనా ఇటువంటి వారివల్ల న్యాయస్థాపన సాధ్యపడట్లేదు
ధన్య వాదములు ; ఆంధ్రభారతి నిఘంటువు 'మనది' కి మారుగా 'మంది, మన్ది( తెలంగాణా పదకోశము )'అని తెలుపుచున్నది. ఐనప్పటికిని దానిని మార్చి 'మాది / మాదె యంచు' .... గా మార్చెదను
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
తలపులు దుడ్డు మీదనిడి తన్నుకు చచ్చుచు కేసు కోసమై...
వెలుపల దాపటన్ గనక వేడుక చేయుచు వాయిదాలపై...
కులుకుచు కోర్టులందు కడు గొప్పగ వేయుచు నల్ల కోటులన్
పలుకరు సత్య మెన్నఁడును బాడిఁ దలంపరు న్యాయవాదులే...
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి(ఇది సరదా పూరణ ఎంతమాత్రం కాదు)
🙏
తొలగించండినిలుకడమీదసత్యమనినించివచించినిదానమంగిగా
రిప్లయితొలగించండిపలుచనజేసికాలమునుపైడిహరించిహృదంతరాగ్నికిన్
జలములవిందొనర్చమనసావచసావివరించుబుణ్యులే
*“పలుకరు సత్య మెన్నఁడును బాడిఁ దలంపరు న్యాయవాదులే”*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివిలువలనల్లనికోటుల
రిప్లయితొలగించండిపలుమడతలఁబెట్టిదాచువగలాడగుగా
నలువకులేదీజ్ఞానము
పలుకరుగదనిజమున్యాయవాదులుధూర్తుల్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండికలిసున్న వారు విడివడి
రిప్లయితొలగించండికలిమంత వకీలుకిచ్చి ఖర్చయి పోగా
తెలివిగ కాలము గడుపుచు
పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కలిసి+ఉన్న, కలిమి+అంత' అన్నపుడు సంధి లేదు. 'కర్చు' అన్నది సరైన పదం.
తెలివిగ కేసులబట్టుచు
రిప్లయితొలగించండికలివిడిగను పల్కుచుండ కార్యము దీరన్
తలువరు పూర్తింజేయగ
పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"తలపరు" అనండి.
ఈ నాటి పరిస్థితి చూస్తే అన్నీ బినామీ రసీదులే బినామీ కట్టడాలే బినామీ వోట్లే. అవి కూడా చట్టరీత్యా సరియైనవిగానే చలామణీ చేస్తున్నారు కొందరు కలుషితబుద్ధిమంతులు. అలా అన్నీ అబద్ధాలని నిజం చేయడం వల్ల మన న్యాయవాదులూ ధర్మం నిలబెట్టలేకపోతున్నారు
రిప్లయితొలగించండిఎంతో పెద్ద సమరం చేస్తే కానీ మన భారతదేశ చట్టం తయారవ్వలేదు. ఐనా ఇటువంటి వారివల్ల న్యాయస్థాపన సాధ్యపడట్లేదు
చం||
శిలయగు న్యాయదేవత సజీవము జేయగ ధర్మమున్ మెయిన్
వెలసెను చట్టమై, సమరభేరిని! పాపులు నేడిటుల్ కటా!,
కలుషపు పాములై మనకు కాటునొసంగుచు బామునిచ్చుచున్
పలుకరు సత్యమెన్నడును! బాడిదలంపరు న్యాయవాదులే!
ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻🙏🏻
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వలపులు మీర చెట్టుకడ వ్రాలుచు చూచుచు లోహపృష్ఠులై...
పిలుపులు కోరకే మురిసి పిచ్చిగ గంతుచు కక్షిదార్లపై...
నిలకడలేని వాక్కులను నిండుమనమ్మున వాగుచున్ సదా
పలుకరు సత్య మెన్నఁడును బాడిఁ దలంపరు న్యాయవాదులే...
మీ ఆటవిడుపు సరదా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండికలవాడిని కాపాడగ
రిప్లయితొలగించండిపలుతప్పుడు సాక్ష్యములను పమ్మెడు వారై
గెలుచుటె లక్ష్యము కావున
పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితెలిసిన సత్యమె జగతిని
రిప్లయితొలగించండిపలుకరుగద నిజము న్యాయవాదులు, ధూర్తుల్
పలు కేసులలో ధనమును
తెలివిగ నార్జించు విధము దెలియగ నౌరా!
చిలకల పల్కులట్లు పలు సెక్షనులన్ తెగ వల్లె వేయుచున్
పలువురు సాక్షులన్ బిలిచి పన్నుగ తిమ్మిని బమ్మిజేయుచున్
తెలివిగ సొమ్ముజేసుకొను ధీరులు న్యాయము కన్నుగప్పుచున్
పలుకరు సత్యమెన్నడును పాడి దలంపరు న్యాయవాదులే !
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యాస్మి గురుదేవా! నమోనమః! 🙏🙏🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపులినిన్ పిల్లిని జేసెడి
తెలివిని ఖలులను హితులుగ తేల్చగ నెపుడున్
చెలగుచు వాదన లందున
పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినా ప్రయత్నం :
రిప్లయితొలగించండిన్యాయస్థానంలో ఓడిపోయిన నిజాయితీ పరుని ఆవేదన...
కందం
కలిమిఁ బడయంగ నాఢ్యులు
నొలికెడి మోచేతినీళ్ల కొగ్గుచుఁ ద్రాగన్
బలహీనుల బాధింపగఁ
బలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్
* * * * * * * *
సత్యము రాబట్టి న్యాయనిలబెట్టే తపనగల న్యాయవాదుల పరంగా.....
చంపకమాల
కొలువున న్యాయదేవతను గుడ్డి దనంగను గంతగట్టి తా
మొలకరె సాక్షులన్ మిగుల నుక్కిరి బిక్కిరి చేయ నిందలన్
నిలుపఁగ సత్యమున్ దరచి నేరనిరూపణ జేయనెంచుచున్
బలుకరు సత్యమెన్నఁడును బాడి దలంపరు న్యాయవాదులే!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిపలుకరు సత్యమెన్నడును
బాడి దలంపరు న్యాయవాదులే
( నేటి కొందరు న్యాయవాదులు )
చంపకమాల
..................
అలుకల బూనుచుందు ; రిక
నాడెద రెన్నొ వితండవాదనల్ ;
విలవిలలాడ నాశ్రితులు
వేగమె డబ్బును పిండుచుందురే ;
" గెలుపిక నీదె నీదె " యని
గిత్తరి బిత్తరి మాటలాడుచున్
బలుకరు సత్యమెన్నడును ;
బాడి దలంపరు న్యాయవాదులే !!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగెలుచుట యొక్కటే కద వకీలుకు లక్ష్యము, నమ్మినట్టి యా
రిప్లయితొలగించండిఖలులగు నేరగాళ్ళకు వకాలతు గైకొని న్యాయస్థానమున్
బలువిధ దొంగసాక్షులను పట్టుకు తెచ్చెడు హస్తవంతులే
పలుకరు సత్యమెన్నడును బాడి దలంపరు న్యాయవాదులే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'న్యాయస్థాన' మన్నపుడు 'య' గురువై గణభంగం. 'హస్తవంతులు'?
విలువలు వీడిన వారై
రిప్లయితొలగించండికలిమిని యాశించి తాము కల్లల తోడన్
పలు కేసులు వాదించుచు
పలుకరు గద నిజము న్యాయ వాదులు ధూర్తుల్ t
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కలిమిని నాశించి..."
విలువలులేనిసంఘమున, విద్యలునేర్పిన ధర్మమెక్కడో?
రిప్లయితొలగించండికలుపులమొక్కలై నిలిచి,కాలపుకూటమునందు పాములై
శిలువనువేసినారుగద,శీర్షమునందున కాటువేయగా
పలుకరుసత్యమెన్నడును,బాడిదలంపరు న్యాయవాదులే
++++++++++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిలువలులేనిసంఘమున, విద్యలునేర్పిన ధర్మమెక్కడో?
రిప్లయితొలగించండికలుపులమొక్కలై నిలిచి,కాలపుకూటమునందు పాములై
శిలువనువేసినారుగద,శీర్షమునందున కాటువేయగా
పలుకరుసత్యమెన్నడును,బాడిదలంపరు న్యాయవాదులే
++++++++++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
అందరికీ నమస్సులు🙏
రిప్లయితొలగించండినా పూరణ యత్నం..
*కం*
కలతలు నిండిన మనసులు
విలవిల లాడేటి జనులు విజయము కొరకై
కలసిన యలసిన నేమట
*“పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్”*
*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏😊
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఆడేటి' అన్నది వ్యావహారికం. "విలవిల లాడంగ జనులు.." అనవచ్చు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపులులను పిల్లులన్ వలెను ప్రోఢిని వాదన జేయుచుండునౌ
తెలివినిగూడి సంతతము త్రిమ్మరులన్ హితమెంచు వారిగన్
మలచి నిదర్శనమ్ములను మాయమొనర్చుచు కోర్టులందునన్
పలుకరు సత్యమెన్నడును బాడి దలంపరు న్యాయవాదులే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచం:
రిప్లయితొలగించండినిలకడ లేని మాటలును నివ్వెరగొల్పెడి డాంబికమ్మునున్
ఫలితము మందె యంచు ప్రతివాదికి చుక్కలు గన్పడంచనన్
నిలువున మున్గ జేయుదురు నిట్టగ ద్వేష్యుడి గూడి యాడుచున్
పలుకరు సత్యమెన్నడును బాడి తలంపరు న్యాయవాదులే
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మనదె' ... 'మందె' అనవచ్చునా?
ధన్య వాదములు ; ఆంధ్రభారతి నిఘంటువు 'మనది' కి మారుగా 'మంది, మన్ది( తెలంగాణా పదకోశము )'అని తెలుపుచున్నది. ఐనప్పటికిని దానిని మార్చి 'మాది / మాదె యంచు' .... గా మార్చెదను
తొలగించండిఅలుకను బూని దంపతులు నాతుర నొందుచు వాదు సేయుచున్
రిప్లయితొలగించండిపలుమరు మంచి చెప్పినను పంతము మానక మాటమీరగన్
నెలవులు తప్పు వీరికని నేర్పుగ సంధిని సేయ వీరలున్
పలుకరు సత్య మెన్నడును బాడి దలంపరు న్యాయవాదులే
పాడి = స్వభావము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపలు పెను దోపిడీలు,నయ వంచన లాదిగ జేయు తస్కరుల్
రిప్లయితొలగించండిపలుకరు సత్యమెన్నడును;బాడి దలంపరు న్యాయవాదులే
విలువలు కాల రాసి,సరవిన్ ధనవంతులు కాగ జూచు వా
రల యెడ-లోక ధర్మమిది!రారె కనుంగొన్ ధర్మ సూక్ష్మముల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండిపలుకరు సత్యమెన్నడును బాడిదలంపరు న్యాయవాదులే
నా పూరణ
పలుకగనేల నేరము లనేకము జేసియు నాయకోత్తముల్
విలువలు నేలరాయుచు విభిన్న తెఱంగులమాట లాడుచున్
పలుకరు సత్యమెన్నడును బాడిఁదలంపరు, న్యాయవాదులే
తలపడి సాక్ష్యముల్గని యుతంబగుశిక్షలువేయ నొప్పగున్
ఆదిభట్ల సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిలువదు నాయమెదుట యని
రిప్లయితొలగించండిపలుకరు గద నిజము న్యాయవాదులు ; ధూర్తుల్
కలిసి యొనర్చిన పనులకు
పలుశిక్షలు దప్పునటుల వాదించుమనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితెలుపుము సరియో కాదో?
"పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్"
తెలిపితి సరికాదండీ!
కెలికెదరు నిజమును వారు కెవ్వుమన జనుల్!
జిలేబి
బాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండిపలుకరు వేశ్య లెన్నడును వాస్త వముల్ విటగాండ్ల తోనిలన్,
రిప్లయితొలగించండిపలుకరు వైద్యు లెన్నడును వ్యాధిని వారణ సత్య మెప్పుడున్,
పలుకరు పశ్యతోహరులు భాదనుపొందు చుతాము సత్యమున్,
పలుకరు సత్యమెన్నడును బాడి దలంపరు న్యాయ వాదులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికందచంపకము
అరరే ప్రవర్తనయె కం
డుర! పలు కరు సత్య మెన్నఁడును బాడిఁ దలం
పరు న్యాయవాదులే పరి
పరి విధముల కోర్టుకీడ్చి వాతలిడుదురే!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపలుకరు నిజమును యెన్నడు
రిప్లయితొలగించండిపలుమారులు వాయిదాలు కోరుటె పనిగా
సులువుగ మోసము చేతురు
“పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నిజమును+ఎన్నడు' అన్నపుడు యడాగమం రాదు. "నిజమ్ము నెన్నడు" అనండి.
రెండవ పాదంలో యతి తప్పింది. "పనిగా కోరన్" అందామా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొలదిగనున్న రోగమును కొండనుఁ జేసి పరీక్ష పేరునన్
రిప్లయితొలగించండినిలువున దోచు వైద్యులిల నేతలు వేశ్యలు పశ్యతోహరుల్
తులువలు లంచగొండులును ద్రోహమనీషులు వీరి సోదరుల్
పలుకరు సత్య మెన్నఁడును బాడిఁ దలంపరు న్యాయవాదులే.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసలుపగ నిత్యజీవితము సత్యమునే వ్రత మంచు గాంధియే
రిప్లయితొలగించండినిలిచిరి యట్టి మార్గమున నేమము బెక్కురు లోకమందునన్
తలపగ భావ్యమౌనె? మరి ధర్మము మచ్చను బొందునట్టిటుల్
"పలుకరు సత్య మెన్నఁడును బాడిఁ దలంపరు న్యాయవాదులే”
....రేసోజు మల్లేశ్వర్.
అలుగరు బుజ్జగింతురు జయంబగు నీక భయంబిదే కడన్
రిప్లయితొలగించండినిలువదు వారికేసు ననునిత్యము నేనిటు వంటి వ్యాజ్యముల్
గెలకితి యూరడిల్లుము ఖిద్రు నొనర్చెద ప్రత్యనీకునిన్
దలపరు బాధితాత్ముమతి దైన్యము కాలము రో హరించినన్
*“పలుకరు సత్య మెన్నఁడును బాడిఁ దలంపరు న్యాయవాదులే”*
రిప్లయితొలగించండిశంకరాభరణం
10-11-2020 .....మంగళవారం
సమస్య
**** ***
పలుకరు సత్య మెన్నఁడును బాడిఁ దలంపరు న్యాయవాదులే”
నా పూరణ. చం.మా
*** *** ***
( కొందరే సుమా...)
విలువల వల్వలన్ విడిచి విత్తమె ముఖ్యమటంచుఁ దల్చుచున్
ఖలులకు బాసటై నిలిచి గారడిఁ జేయుచు దొంగ సాక్షులన్
దెలివిగ సృష్టిఁ జేయుచును దీర్పుల గెల్చుచుఁ గోర్టు లందునన్
బలుకరు సత్య మెన్నఁడును బాడిఁ దలంపరు న్యాయవాదులే
-- ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండితలచుము ధర్మమున్ పరహితమ్మును న్యాయము పుణ్యవర్తనన్,
నిలుపును నిన్ను నున్నతిని నేడును., నీవు గతించునాడు., నీ
విల పలుపాపముల్ సలుపనెవ్వడు గాచును? భిన్నరీతిగా
పలుకరు సత్య మెన్నఁడును బాడిఁ దలంపరు న్యాయకోవిదుల్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉలుకరుబలుకరువారలు
రిప్లయితొలగించండిగలగలమ్రోగించడబ్బుకల్లలు వచ్చున్
గెలుపునొసగెదరుకేసుకు
పలుకరుగదనిజమున్యాయవాదులుధూర్తుల్
డా.బలిజేపల్లి ద్వారకానాధ్
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిచిలువలు పలువలుగ కథలు
పలురీతుల చెప్పుచుండి వాస్తవములనే
సులువుగ దాచెడి కపటులు
పలుకరుగద నిజము న్యాయవాదులు ధూర్తుల్.
నలుగురుమెచ్చెడివిధముగ
రిప్లయితొలగించండిపలుకునిజముమంచి న్యాయవాదినిరతమున్
కలుషమనస్కులుగావున
పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్
పలికినమాటలందుతమ వ్యాజ్యము నందలి సత్యమొక్కటే
రిప్లయితొలగించండితెలుపుచువాదనన్ సలుపు ధీమతుడైన వకీలు నిచ్చలున్
కలుషమనస్కలైయెపుడు కాసులకోసము ప్రాకులాడుచో
పలుకరు సత్య మెన్నఁడును బాడిఁదలంపరు న్యాయవాదులే
పలుకులధర్మసూక్ష్మమనువాదనఁజేయువిశాలబుద్ధులై
రిప్లయితొలగించండితలపులమాటలందునికతామోకపెద్దగనటింపఁజేతనౌ
పలుపునుగట్టిధర్మమునుబాధనుఁబెట్టుచుహీనఁజేతురే
పలుకరుసత్యమెన్నడునుపాడిఁదలంపరున్యాయవాదులే
పలుకుట సబబే యిటులుగ
రిప్లయితొలగించండిబలుకరుగదనిజమున్యాయవాదులుధూర్తుల్
నిలలోనుందురుకొందరు
పలువురునింగురిచిపలుకభావ్యమె మనకున్
పలుకఁగ నెంచ నిజము ధూ
రిప్లయితొలగించండిర్తులు మాత్రము కారు కాని తోరమ్ముగ లో
లులు జయలక్ష్మికి వారలు
పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్
వలచు జయమ్ము సంతతము వాక్పటిమం దనరించ నేఁడు యీ
పలికిన మాట నిక్కువము వాదము నెగ్గుట ముఖ్య మే విధిం
దలఁచిన వారి యోటమినిఁ దథ్యము నా వెనుకాడ రెవ్వరుం
బలుకరు సత్య మెన్నఁడును బాడిఁ దలంపరు న్యాయవాదులే
పలుకరుసత్యమెన్నడును బాడిదలంపరున్యాయవాదులే
రిప్లయితొలగించండిపలికిరిసత్యభాషణము,బాడినిజూడకయార్జనంబయే
విలువనునిచ్చుమార్గమును,బేర్మినిజూపుటకారణంబునన్
బలుకరుసత్యమెన్నడునుపాపపువాదనజేయుచుందురే
పలు లుకలుకలున్న వకీ
రిప్లయితొలగించండిలులందరును భారతంబు లూటీ జేయన్
ఖలులదె రాజ్యంబయ్యెన్
పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్!
కలియుగమందుగానమిక ,కన్నులముందున నీతిసూత్రముల్
రిప్లయితొలగించండిచిలికినవచ్చువెన్నకును,చీదరబుట్టును వీరితీరుతో
నలుపుచు ధర్మమంతటిని నాశముజేయగవాదియాస్తులన్
పలుకరుసత్యమెన్నటికి,బాడిదలంపరున్యాయవాదులే
+++++++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
తలపుకురాని ధర్మమది, దారినిదప్పును వారినోటిలో
రిప్లయితొలగించండివిలువలులేనిజీవితము,విద్యలనన్నిటిగోలుపోవగా
సులువుగమారువాదనలు శూన్యముజేయగ ధర్మదేవతన్
పలుకరుసత్యమెన్నడును బాడిదలంపరు న్యాయవాదులే
++++++++++++++===+=====
రావెల పురుషోత్తమరావు
కలిగిన వారి చుట్టమగు కాంచగ న్యాయము భూతధాత్రిపై
రిప్లయితొలగించండివిలువ ఘటిల్లదే నిజముఁ బేర్కొను వానికి, న్యాయమూర్తులే
పలుకుచునుండినన్ తామనృత వాక్యములన్ గొన సొమ్ముఁ దండిగా
బలుకరు సత్య మెన్నఁడును బాడిఁ దలంపరు న్యాయవాదులే
పలు దుర్మార్గంబుల నతి
రిప్లయితొలగించండిసులువుగ నొనరించి దిరుగుచుండెడి ఖలులన్
గెలిపింతురధర్మపరులు
పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్
విలువలు కోరెడి వారలు
రిప్లయితొలగించండిపలికెదరునిజములు సతము వాదించుతరిన్
తెలిసియు ధనాశ తోడను
పలుకరు గద నిజము న్యాయవాదులు ధూర్తుల్