19, నవంబర్ 2020, గురువారం

సమస్య - 3549

20-11-2020 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శంకరుండు వలదు శాంతి వలయు”

(లేదా…)

“శంకరుఁ డేల మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిన్ గనన్”

66 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    జంకుచు చేరగా నిచట జంబము వీడుచు కైపదమ్ములన్
    వంకర పూరణమ్ము లిడి వాసిగ నాతని బ్లాగునందునన్
    పంకజ నేత్రుడాదటను బాగుగ తట్టుచు కంది వంశపున్
    శంకరుఁ డేల మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిన్ గనన్...

    రిప్లయితొలగించండి


  2. అమ్మ లేని అయ్య ఆ అయ్య లేని అ
    మ్మయు జిలేబి గలదె మహిని? రెండు
    గా కనపడునదొకటెకద ? కుదురునకొ
    శంకరుండు వలదు శాంతి వలయు?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో ప్రాసయతి తప్పింది. సవరించండి.

      తొలగించండి


    2. అమ్మ లేని అయ్య ఆ అయ్య లేని అ
      మ్మయు జిలేబి గలదె మహిని? రెండు
      గా కనపడునది యొకటెగా? కుదురునకొ
      శంకరుండు వలదు శాంతి వలయు?


      సరియేనాండి ?


      జిలేబి

      తొలగించండి


  3. ఇలలో నొకటైనది లే
    వులె! శంకరుఁ డేల మాకిపుడు శాంతియె కా
    వలె నెవ్విధిన్ గనన్ కో
    మలాంగి కుదరనిది! ద్వైత మద్వైతమిదే!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    జంకి కరోన రోగమున జంబము వీడుచు మాస్కులేయగన్
    వంకర పోవగా బ్రతుకు బంగరు భూమిని హైద్రబాదునన్
    బింకము కూలగా హృదిని వీరుడు శూరుడు కల్వకుంటడౌ
    శంకరుఁ డేల మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిన్ గనన్...

    రిప్లయితొలగించండి
  5. కంఠమందువిషముకామందుఁజూడగా
    బాధలన్నిపలుకుభాషలోన
    నెత్తినీళ్లకుండనెఱజాణభార్యగా
    శంకరుండువలదుశాంతివలయు

    రిప్లయితొలగించండి
  6. శంకలతీర్చిదిద్దిమనుజాళికిమంచినిపంచియిచ్చిని
    శ్శంకనుపద్యరాజములఛందమునందముశయ్యపాకమున్
    పొంకముగాప్రశంసలనపూర్వతితీక్షసమీక్షదక్షుడౌ
    *“శంకరుఁ డేల మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిన్ గనన్”*
    వంకలబెట్టకుండనలువంకలదోషములెంచకేభళా
    కంకణమిచ్చిపుచ్చుకొనుకాతరులేకుకవుల్నుతించరే

    రిప్లయితొలగించండి
  7. కులమతమ్ము లనుచు కుటిలత్వమును జూపు
    మానవత్వ మనెడు మాట మరచి
    దమన కాండ జరుపు ద్రాబయైనట్టి నా
    శంకరుండు వలదు శాంతి వలయు.

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కష్టపెట్టు చుండు దుష్ట కరోనయే
    నిద్రపోవనీక నిల్పు వడిని
    గుళిక లీయలేక కళవళించు కుహనా
    శంకరుండు వలదు శాంతి వలయు.

    రిప్లయితొలగించండి
  9. కపట బుద్ధి గల్గి కాఠిన్య హృదయుడై
    చెడ్డ పనులు సతము చేయు వాడు
    పరుల హింస పెట్టు వంచక దుష్ట వ
    శంకరుండు వలదు శాంతి వలయు

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    జంకును గూర్చుచున్ జనుల స్వస్థత జాఱ్చిన కరోనయే
    అంకిలి పెట్టుచున్ సతము నాతుర జేయుచు నిద్ర నెట్టుచున్
    వంకరజేయు నీవడిని వైద్యమె చేయగరాని కింజుడౌ
    శంకరుఁ డేల?మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిన్ గనన్.

    రిప్లయితొలగించండి
  11. సంకటమాయె జీవనము చాపగ
    కోరలు క్రొత్తరోగమే
    శంకలె నిండగామదిని సైపరు మిత్రుల బంధు పొందులన్
    ఇంకగ ప్రేమలే భువిని హింసయె నిండగ జాలిజూపడా
    శంకరు డేల? మాకిపుడు శాంతియె గావలె నెవ్విధిన్ గనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిన్నటి మాశ్రీ గారి పుస్తకావిష్కరణ సందర్భంగా వారి శ్రీమతి నాగలక్ష్మిగారి మనోగతం 😊🙏

      అంకిత భావమున్నిచట నౌనన నార్యులు జాగులేకయే
      వంకర కైపదమ్ములను వాసిగనిచ్చెడు
      శంకరార్యులే
      పంకజలోచనన్ గొనుచు పన్నుగ చేరగ
      మిత్రబృందమున్
      శంకరుడేల మాకిపుడు శాంతియె గావలె నెవ్విధిన్ గనన్

      శాంతి = శంకరార్యుల శ్రీమతి

      తొలగించండి
    2. సమస్య నిత్చుటలో గురువుగారి మనోగతం యిదే అనుకుంటాను! 😊😊🙏🙏🙏

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఇస్తున్నపుడు తోచలేదు. ఇచ్చిన తర్వాత అలాగే అనిపించింది. నిజానికి ఇది ఆకాశవాణి విజయవాడ వారు ఎప్పుడో ఇచ్చిన సమస్య "శంకరుండు వద్దు మాకు శాంతి కావలెన్ సదా" అన్నదానికి రూపాంతరం.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురువర్యా! నమోనమః! 🙏🙏😊

      తొలగించండి
  12. *హిమవంతుడు తన కూతురు పార్వతితో పలుకు మాటలు*
    ....... ........ ........ ........ ....... .....
    వంకర బుద్ధితో తలను భామను దాల్చిన వాడు జూటమున్
    వంక ధరించెవాడు, ఫణివంతమె యాభరణమ్ము నిత్యమున్
    శంకువు కంఠమందు కరిచర్మము గట్టెడు కామహారియౌ
    శంకరుఁ డేల మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిన్ గనన్

    రిప్లయితొలగించండి
  13. 1.రాయభారమున శ్రీకృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రునితో...

    ఆటవెలది
    తమ్ముని సుతులడుఁగఁ దమదైన భాగమ్ము
    ధర్మమెంచుటన్న దగును మామ!
    రణము కోరు వాడు ప్రాజ్ఞుడె? వంశ నా
    శంకరుండు! వలదు శాంతి వలయు!!

    2. ప్రెసిడెంట్ ను ఎన్నుకోవడంలో అమెరికా ప్రజల అంతరంగం....

    ఉత్పలమాల
    జంకది లేక కూతుఁగని జారుడు మాటలు సంప్రదాయమే?
    పంకము లోనఁ గాలిడెది పందియె కాదను వారలెవ్వరే!
    వంకర మాటలన్ జనుల వంచన జేసెడు 'ట్రంపు' జాతి నా
    శంకరుఁ డేల? మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిన్ గనన్!

    రిప్లయితొలగించండి
  14. రక్కసులనుగాచి చక్కగ వరముల
    నిచ్చి వారి మేలు నిట్టెగోరు
    వాడు దేవుడైన వన్నెగూడదు తిక్క
    శంకరుండు వలదు శాంతి వలయు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రళయకాలరుద్రు బాధించ గోరిన
      కోవిడనెడిపురుగు కొలువుజేసె
      కాలమహిమజూప కనుదెరిచిన వేళ
      శంకరుండు వలదు శాంతి వలయు

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. సమస్య :-
    “శంకరుండు వలదు శాంతి వలయు”

    *ఆ.వె**

    కాల్పులు వినబడెడు కాశ్మీర దేశపు
    పుణ్య తీర్థములకు పోక వలదు
    జలదరింపు వలదు శంకరుండు వలదు
    శాంతి వలయు ప్రజకు కాంతి మెరవ
    .................✍️చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్య :-
      “శంకరుండు వలదు శాంతి వలయు”

      *ఆ.వె**

      మంచి చెడులు దెలుపు మతములన్నవి గాని
      గొడవలు పడి తుదకు కోట్టు కుంద్రు
      రాజకీయపుచ్చురా యిది దేశ నా
      శంకరుండు వలదు శాంతి వలయు
      .................✍️చక్రి

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  16. సమస్య :
    శంకరు డేల మా కిపుడు
    శాంతియె కావలె నెవ్విధి గనన్

    ( ప్రస్తుత ప్రపంచప్రజల ప్రగాఢకాంక్ష )
    ఉత్పలమాల
    ....................
    వంకలు లేని ప్రేమమృదు
    వర్షము గుర్యుచు జూపులందునన్ ;
    శంకలు లేని చర్యలను
    సత్యము దొణ్కిసలాడజేయుచున్ ;
    గొంకులు మాని మానవులు
    గూడి చరించెడి వేళ ; మైత్రినా
    శంకరు డేల మా కిపుడు ?
    శాంతియె కావలె నెవ్విధిన్ గనన్ .

    రిప్లయితొలగించండి
  17. శంకలు దీర్చ నోర్మిగల శంకరభూషణవర్గస్రష్ట యా
    తంకనిరస్తసంకలితదత్తసమస్యల నిచ్చు చుండ నా
    శంకరమయ్యె మందమతి, సత్కవితోక్తిలసత్సమూహమున్
    శంకరుఁ డేల.... మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిన్ గనన్.

    ఏల= పాలించుచుండగ( సమీక్షించుచుండగ)

    కంజర్ల రామాచార్య.
    వనస్థలిపురం.

    రిప్లయితొలగించండి
  18. యుద్ధకాంక్షపెరిగి యోధుఁడ నేనని
    విర్రవీగిరాజు వెఱపుజేయ
    తలచిరపుడుజనులు తమకట్టి ధృతివినా
    శంకరుండు వలదు శాంతి వలయు

    రిప్లయితొలగించండి
  19. రంకెల వేయుచున్ దిరిగు రక్కసి మూకల యాగడాలకున్
    గొంకుచు బొంకుచున్ గలియ గూడుచు నెన్నిక లందునిట్టులన్
    బింకము వీడి రాజ్యమును పిక్కు కుటుంబము కల్వకుంట్ల యా
    శంకరుఁ డేల మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిన్ గనన్.

    రిప్లయితొలగించండి
  20. జంకును గొంకులేకనిల సర్వవిధంబుల దాడిఁజేయుచున్
    రంకెలువేయుచున్ దనరు రాక్షసిరోగము మాన్పలేమిచే
    పంకమునందులోతుగను పాతుకు పోయిన జీవనమ్ముతో
    శంకరుడేలమాకిపుడు శాంతియెకావలె నెవ్విధిన్గనన్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  21. శంక లేదు మాకు సరియగు పూరణ
    జేయ, కవివరుండు చెంత గలడె
    కందిశంక రున్న కారణమ్మున మాకు
    శంకరుండు వలదు శాంతి వలయు!!

    రిప్లయితొలగించండి
  22. ప్రాన కుదర కున్న పద్యమని యలిగె
    శంకరాభరణపు సంస్కృతుడగు
    శంకరుండు ; వలదు శాంతి వలయు నని
    వేడె నతని పాఠి వేదనపడి

    రిప్లయితొలగించండి
  23. శంకరుండువలదు శాంతివలయునట
    పిచ్చివానిపలుకు లిచ్చగించ
    రాదు,శంకరుండె రత్నసువునకుదై
    వమని,యరయుమమ్మ పార్వతమ్మ!

    రిప్లయితొలగించండి
  24. శంకలువీడిమీరలునుశంభునిగోల్వగనీటమున్గినన్
    రంకెనువేయుచున్పురుగురచ్చకునీడ్చునుజీవితంబునే
    సుంకముకట్టలేమునికసుందరుజూడగమానుకోందమా
    శంకరుడేలమాకిపుడుశాంతినిగావలెనెవ్విధిన్గనన్

    రిప్లయితొలగించండి
  25. సంకులమాయె నెన్నికలు శాంతియు శంకరు డగ్ర నేతలై
    యంకములాడుచుండ జనులందరు సూటిగ బల్కిరిట్టులన్
    శంకరు పాలనంబున నశాంతి యభద్రత పెచ్చు మీరెగా
    శంకరుఁ డేల మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిన్ గనన్

    రిప్లయితొలగించండి
  26. ఉ:

    శంకరు వోలె లోకమున సంపుచు ప్రాణుల నుగ్ర రీతినిన్
    సంకట మందు జేర్చి కడు సంపద లెల్లను గుల్లసేయగన్
    చంకిలి వీడ జాలు నిక చాలు కరోన ప్రయాస దీర్చ నా
    శంకరుడేల మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిన్ గనన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  27. శంకరుడేల మాకిపుడు శాంతియెకావలె నెవ్విధిన్ గనన్
    వంకరమాటలెందులకు భవ్యుడులేకనుశాంతియుండునే?
    శంకరునామమున్ లలిత! సన్మతితోడను నాలపించుచో
    శంకలులేనిసంపదలు,సౌఖ్యములిచ్చును దప్పకుండగన్

    రిప్లయితొలగించండి











  28. దేవరకొండ భగవాన్ గురువు గారికి నమస్కారం ప్రయత్నం మాత్రమే మే

    జంకు గొంకు వీడి జనులంత గూడియు
    చిందు లేయు చుండే మత్తు చేత
    పరుల బాధ గనరు పబ్బుల గోలలో
    శంకరుడు వలదు శాంతి వలయు

    రిప్లయితొలగించండి
  29. చక్కదిద్దు సతము శాంతియె పగల న
    డంచి సకల రాజ్య సంచయముల
    నేల మనకు వీరుఁ డీ భండన కళా వ
    శంకరుండు వలదు శాంతి వలయు


    అంకము కోర మిత్తరి యనర్థము లిచ్చుఁ గరమ్ము పూని తాఁ
    బొంక మెడంద మిక్కిలి త్రిమూర్తుల మేటి భృగూత్తమర్షియే
    యంకము సేరి కన్గొనె మహాత్ముఁడు నోర్పరి విష్ణు వుండఁగా
    శంకరుఁ డేల మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిం గనన్

    రిప్లయితొలగించండి
  30. శంకలనేకముల్ మదిని శాంతినిదోచి సతంబు చింతనా
    పంకమునందుదించిమముపాయక వంతలు వెట్టుచుండె నా
    శంక రవంతలేక మదిసంతసమొందు విధంబు జూడడా
    శంకరుఁ డేల మాకిపుడు? శాంతియె కావలె నెవ్విధిన్ గనన్

    రిప్లయితొలగించండి
  31. బొంకుచు నుండు మాకితడు పుత్రునిగా జనియించి కొంపలో
    సంకట పెట్టుచున్ బ్రతుకు సద్గుణముల్ గల వారి నెప్పుడున్
    వంకర బుద్ధితోడను వివాదములన్ తలదూర్చు వంశ నా
    శంకరుఁ డేల? మాకిపుడు శాంతియె కావలె నెవ్విధిన్ గనన్

    రిప్లయితొలగించండి