5, నవంబర్ 2020, గురువారం

సమస్య - 3536

6-11-2020 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గాజులు గల్లనఁగ నరుఁడు గాండివ మెత్తెన్”

(లేదా…)

“గాజులు గల్లుగల్లనఁగ గాండివమెత్తె ధనంజయుం డనిన్”

65 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    తేజము మాసిపోవగను తీరిచి దిద్దిన హస్తినమ్మునన్
    మోజులు తీరగా మురిసి ముద్దుల రోజులు జారిపోవగా
    రాజుల రాణులెల్లరివి రమ్యపు గుండెలు కొట్ట ఢబ్బుగన్
    గాజులు గల్లుగల్లనఁగ గాండివమెత్తె ధనంజయుం డనిన్..

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    రాజులు చేరగా మురిసి లాగుకు పోవగ గోవులన్ భళా
    పోజులు కొట్టినన్ ఘనుడు పోకిరి మీరగ పారిపోవగా
    మోజుగ నాడవేషమున ముచ్చట మీరగ నుత్తరుండితో
    గాజులు గల్లుగల్లనఁగ గాండివమెత్తె ధనంజయుం డనిన్...

    రిప్లయితొలగించండి
  3. రాజులు చోరత జూపన్
    తేజము చూపచు కిరీటి తానని తెల్పన్
    ఈ జిలుగులు వేసమ్మని
    గాజులు గల్లనఁగ నరుఁడు గాండివ మెత్తెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆజిని గెల్వన్ వైరుల
      జేజెమ్మల తరము గాదు జెండా గూల్చన్
      వాజమ్మల దునిమెదనని
      గాజులు గల్లనఁగ నరుఁడు గాండివ మెత్తెన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'తేజము జూపుచు' టైపాటు.

      తొలగించండి
  4. కందం
    తేజమువిడ నరునకు హరి
    రాజసమిడ గీతనని విరాగము బాపన్
    పూజితులహస్త తాళపు
    గాజులు గల్లనఁగ నరుఁడు గాండివ మెత్తెన్

    ఉత్పలమాల
    తేజముఁ గోల్పడన్ నరుఁడుఁ దేరును ద్రిప్పుమటన్న గీతతో
    రాజసమొప్ప నిల్పియు విరాగముఁ బాపఁగ. ,విశ్వరూపుడం
    భోజదళాక్షు బోధనకు పూజిత చర్చరి మిన్నుముట్టగన్
    గాజులు గల్లుగల్లనఁగ గాండివమెత్తె ధనుంజయుండనిన్

    రిప్లయితొలగించండి
  5. మోజుపడి శబ్ద భేదిని
    యాజవ్వని కాంచనెంచి యడిగిన తరి తా
    నాజాయ కరములందలి
    గాజులు గల్లనఁగ నరుడు గాండివ మెత్తెన్.

    రిప్లయితొలగించండి
  6. కం.
    ఆజిన్ బాండుకుమారులు
    తేజము జూపంగ రుధిర తిలకము బెట్టెన్
    సాజముగ ద్రౌపదీసతి
    గాజులు గల్లనఁగ, నరుఁడు గాండివ మెత్తెన్

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆజికి వచ్చిన కౌరవ
    పౌజుని గని ఉత్తరుండు భయపడి నంతన్
    వాజమున పేడి యగు తన
    గాజులు గల్లనగ నరుడు గాండివ మెత్తెన్.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ గురుభ్యోన్నమః🙏

    మోజును వీడి నుత్తరుడు మ్రొక్కెను గాచగ నాలమందలన్
    వాజము దాచ నెంచగను వైరి బృహన్నల రూ పమందునన్
    తేజము ప్రజ్వరిల్ల తన తేకువ జూపెను యుధ్ధ రంగమున్
    *గాజులు గల్లుగల్లనఁగ గాండివమెత్తె ధనంజయుం డనిన్*

    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వీడి యుత్తరుడు.." అనండి. సమస్యలో 'అనిన్' ఉంది. మూడవ పాదంలో యుద్ధరంగము పునరుక్తి అవుతుంది.

      తొలగించండి
  9. ఆజినిధరణీనాధులు
    వేఁజనువైరినినిలుపగవేగమెరాగా
    రాజిలుద్రౌపదినాధుడు
    గాజులుఘల్లనగనరుఁడుగాండివమెత్తెన్

    రిప్లయితొలగించండి
  10. మోజది కల్గుచుండె శ్రమమున్ బ్రతియోగుల జంప నంచు నా
    రాజకుమారుడుత్తరుడు రజ్జునుడుల్ పలుకంగనేమిరా
    యాజిని శత్రుమోహరము నంతను గాంచి భరంపడు నత్తరిన్
    గాజులు గల్లుగల్లనఁగ గాండివమెత్తె ధనంజయుం డనిన్

    రిప్లయితొలగించండి
  11. తమలమున గెలచి ధర్మనందనుడు యా
    గమును సలిపి తురగమును వదల

    యాగాశ్వమును కాచ నర్జునుడు వెడలె,
    హయము రయంబుగ నచట నిచట

    తిరుగుచు జేరెను తరుణీమణి ప్రమీల
    రాజ్యము‌నకు,వావురమును పట్టి

    బంధించ ,పార్ధుడు పడతితో
    సమరము పాడిగాదని వెను కాడ నపుడు

    గాజులు గల్లనగ నరుడు,గాండివ
    మెత్తెన్వె రవక నా యింతి తోడ

    పోరు సలుపుచు నుండగ పురుష వరుడు

    వాసు దేవుడు యేతెంచి పడతి
    మనసు

    మార్చి సమరంబు నాపగ మగువ ముదము

    బడసి విజయుని పెండ్లాడె పదుగురెదట

    రిప్లయితొలగించండి
  12. మోజుపడిన సతి రాకకు
    గాజులు గల్లనఁగ , నరుఁడు గాండివ మెత్తెన్
    పూజా గృహమున నుంచగ
    నాజూకు రమణికి నొప్పు నాయము జేయన్

    ఎత్తు = తీయు

    రిప్లయితొలగించండి
  13. ఎన్నికల్లో స్త్రీలు గెలిచి నప్పటికీ వారి భర్తలు వారే గెలుపొందినట్లు ప్రజల్లో భావన కలిగిస్తారనే సందర్భంగా నా ప్రయత్నము:

    ఉ:

    బాజలు మ్రోగుచుండె ప్రజ బారులు దీరిరి వీధి వీధికిన్
    సాజము తానె గెల్చెనను చక్కని భావన గొల్పు రీతినున్
    పోజులు కొట్టుచుండ సరి పోల్చిరి నిట్టుల వెక్కిరింపుగన్
    గాజులు గల్లుగల్లనగ గాండివ మెత్తె ధనుంజయుండనిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. రోజూ కురుభూమిన నా
    రాజన్యుల దునుమి ధర్మ రాజ్యము నిలుపన్
    రాజీవాక్షుని హస్తపు
    గాజులు గల్లనఁగ నరుఁడు గాండివ మెత్తెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రోజూ' అనడం వ్యావహారికం. 'భూమిని' అని ఉండాలి. 'రాజీవాక్షుని హస్తపు గాజులు'?

      తొలగించండి
  15. నైజము పాండు నందను,గుణాధిక వర్తను కవ్యయాత్ముకున్,
    తేజము జూపి శత్రు గణ తీవ్రత బాపగజేయు క్రీడికిన్
    ఆజి పరాక్రమ స్ఫురిత మందగ-కౌరవ గుండెలందునన్
    గాజులు గల్లు గల్లనగ-గాండివమెత్తె ధనంజయుండనిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
      'వర్తనుకు, ఆత్ముకు' అనడం సాధుప్రయోగాలు కావు. 'వర్తనునకు, ఆత్మునకు' అని ఉండాలి.

      తొలగించండి
  16. తేజము మీరగ పేడియ
    భూజము పైనున్న ధనువు భుజముల పైనన్
    నాజూకుగ చేకొని తన
    గాజులు గల్లనగ నరుడు గాండివమెత్తెన్

    రిప్లయితొలగించండి
  17. రాజసమూహ మధ్యమున రాజస మొప్పగ తీక్ష్ణబాణముల్
    వాజజమేయనన్ శనికి భగ్నము జేయగ ధార్తరాష్ట్రులన్,
    జాజులు వాడిపోయి యరిజాయల
    చేతుల దున్కలైనవౌ
    గాజులు గల్లుగల్లనగ, గాండివమెత్తె
    ధనుంజయుండనిన్

    వాజజము = ఆహారము
    శని = యముడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజ సభాంగణ మందున
      తేజరిలిన మత్య్సమునను త్రెంచగ
      వడిగా,
      రాజిత వధువగు ద్రౌపది
      గాజులు గల్లుమన , నరుడు గాండివ మెత్తెన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యాస్మి గురుదేవా! నమోనమః! 🙏🙏🙏

      తొలగించండి
  18. వాజిని యధిరోహించిన
    రాజిలు సౌందర్య రాశి రాణి ప్రమీలన్
    ఆజిని గన వెఱఁగైనను
    గాజులు గల్లనఁగ నరుఁడు గాండివ మెత్తెన్

    రిప్లయితొలగించండి
  19. సమస్య :
    .............
    గాజులు గల్లుగల్లనగ
    గాండివమెత్తె ధనంజయుం డనిన్


    ( పదవరోజు యుద్ధంలో శిఖండిని తనకు
    కృష్ణునికి మధ్య నుంచుకొని భీష్మునిపైకి
    విజృంభిస్తున్న అర్జునుడు )
    వాజులు నాల్గు పర్వులిడు
    వన్నెలు నిండు మహారథంబుపై ;
    నాజిని సల్పు భీష్ముని ; మ
    హారథు నంతము జేయనెంచి ; నీ
    రాజితు మాధవున్ గనుచు ;
    రమ్యపు జేష్టల నా శిఖండివౌ
    గాజులు గల్లుగల్లనగ ;
    గాండివమెత్తె ధనంజయుం డనిన్ .
    ( వాజులు - గుర్రములు ; ఆజిని - యుద్ధమును )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'పురుషరూపాన్ని పొందిన శిఖండి గాజులు ధరిస్తాడా?" అని బండకాడి అంజయ్య గారి సందేహం!

      తొలగించండి


  20. బూజుల్బట్టె వ్యవస్థయె
    వాజమ్మలవలె జనాళి వ్యవహారమ్ముల్
    మేజోళ్లనువిసిరెనతడు
    గాజులు గల్లనఁగ, నరుఁడు గాండివ మెత్తెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. రాజ సమూహము మ్రాన్పడ
    తేజము జూపించికొ ట్ట ద్విజ వేషమునన్
    రాజిత ద్రౌపది హస్తపు
    గాజులు గల్లన నరుడు గాండివ మెత్తెన్

    రిప్లయితొలగించండి


  22. వ్యధపెట్టు వ్యవస్థ యొక వ
    నధి! గాజులు గల్లుగల్లనఁగ గాండివమె
    త్తె ధనంజయుండనిన్ చే
    రి ధర్మము ధరణిని నిలువరింప జిలేబీ !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. వాజిశతాంగదంతిభటబంధుర కౌరవయుద్ధభూమివి
    భ్రాజితుడై శరాసనవిలాసమహోగ్రభయావహుండునై
    యాజిని వెల్గు పార్థుఁ గని యప్సరసల్ గురుపింపఁ బూవులన్,
    గాజులు గల్లుగల్లనఁగ గాండివమెత్తె ధనంజయుం డనిన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  24. భూజము వలె తా నిలువఁగ
    “గాజులు గల్లనఁగ నరుఁడు గాండివ మెత్తెన్”
    యాజిని కాంతను గెలువఁగ
    మావును విడిపింప వేరు మార్గము కనకన్

    రిప్లయితొలగించండి
  25. కె.వి.యస్. లక్ష్మి:

    రాజకొమరుడుత్తరుడా
    పౌజుని గని భీతినొంది పారగ నెంచన్
    తేజముతో పేడియె తన
    గాజులు గల్లనగ నరుడు గాండివ మెత్తెన్.

    రిప్లయితొలగించండి
  26. మైలవరపు వారి పూరణ

    రాజకులైకభూషణ! విరాజితయుద్ధనభఃప్రభాకరా!
    నీ జయదివ్యనాదమవనిన్ సుఖశాంతుల నింపు., సాగుమా!
    శ్రీజయమందుమా! యనుచు జేతులనూపెడి రాజ్యలక్ష్మి చే...
    గాజులు గల్లుగల్లనగ, గాండివమెత్తె ధనంజయుండనిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  27. రాజకుమారుడుత్తరుడునుత్తరగోగ్రహనార్థమెంతయో
    ప్రాజితువైజయంబుగొనరామబృహన్నలచేయిదోడుతో
    నాజికినేగిభీతిలెననంతపతాకినిగాంచివైళమే
    గాజులుగల్లుగల్లనఁగగాండివమెత్తెధనంజయుండనిన్

    రిప్లయితొలగించండి
  28. రాజసముగనర్జునుడు వి
    రాజితతేజంబుజూపిరణమొనరింపన్
    జేజేలుతెలుపు ద్రౌపది
    గాజులు గల్లనఁగ నరుఁడు గాండివ మెత్తెన్

    రిప్లయితొలగించండి
  29. ఆజినిభీష్ముఁగెల్చుటననయ్యదిసాధ్యముకాదటంచు ని
    స్తేజముతోనరుండుతన తేఱుననిల్పెశిఖండినంతటన్
    వాజిని ధన్వునున్విడచివైచెనుశాంతనుడా శిఖండికిన్
    గాజులు గల్లుగల్లనఁగ గాండివమెత్తె ధనంజయుం డనిన్

    రిప్లయితొలగించండి
  30. శ్రీజయె నాట్యము జేసెను
    గాజులుగల్లనగ,నరుడుగాండివమెత్తెన్
    నాజినిరిపులనుదునుమను
    రాజులకర్తవ్యమదియరంజితవదనా!

    రిప్లయితొలగించండి
  31. రిప్లయిలు
    1. ఆజినిఁ గుంజర ఘన రథ
      వాజిస్థ ధనుర్ధరులకు భయపడిన మహా
      భూజ స్థోత్తరుఁ డీయఁగ
      గాజులు గల్లనఁగ నరుఁడు గాండివ మెత్తెన్


      భూజను లిట్టి యబ్బురపుఁ బోరులు మెచ్చరు హస్త నేత్ర స
      ద్భోజన మంచు నెంచి కని దోర్బల గర్వయుత ప్రమీలనున్
      వాజి సహేషిత ప్రమద వాహన చారిణి నాతి రుక్మపుం
      గాజులు గల్లు గల్లనఁగ గాండివ మెత్తె ధనంజయుం డనిన్

      తొలగించండి
  32. ఆజినిసత్యభామనరకాసురుజంపెనుగోపచిత్తయై
    గాజులుగల్లుగల్లన!గాండివమెత్తెధనంజయుండనిన్
    వాజులుగూడినట్టిబలుపారెడుదేరునువాహనంబునై
    తేజమునొప్పగామిగులదీవ్రపుగార్యమునొందగోరియే

    రిప్లయితొలగించండి
  33. రాజసమొప్ప సైనికుల ప్రాణము భీష్ముడు తీయు చుండ వి
    భ్రాజితుడై, జయంబు గొనఁ బ్రార్థనఁ జేసి గ్రహించి మర్మమున్
    ఆజి శిఖండినిన్ నిలిపి యర్జును తేరున, నామె చేతులన్
    గాజులు గల్లుగల్లనగ గాండివమెత్తె ధనంజయుండనిన్

    రిప్లయితొలగించండి