27, నవంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3557

28-11-2020 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“క్రైస్తవులకె కద్దు రామభక్తి”

(లేదా…)

“రాముని భక్తు లెవ్వరన క్రైస్తవులే కద యెంచి చూచినన్”

71 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    కామము క్రోధమున్ విడిచి కమ్మగ పాడగ కీర్తనమ్ములన్
    నోములు పండగా మురిసి నొప్పులు బాపుచు హైద్రబాదునన్
    గోముగ చర్చికోసమిడ గొప్పగు దుడ్డులు కల్వకుంటడౌ
    రాముని భక్తు లెవ్వరన క్రైస్తవులే కద యెంచి చూచినన్...

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. జగతి లోన ముస్లిములు పూజలను చేతు

      రుగద యల్లాను యేసు శిలువను కొలుచు


      ఘనత నెపుడు క్రైస్తవులకె, కద్దు రామ


      భక్తి హిందువు లకెపుడు ముక్తి కోరి

      తొలగించండి
    2. ఆటవెలది సమస్యకు తేటగీతి పూరణ. బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    "కరుణించు మేరి మాతా"

    ధీమతినిన్ కనుంగొనుచు త్రిప్పలు సైచుచు దుడ్డుకోసమై...
    ప్రేమను జూపి మోసమగు పెండ్లిని యాడుచు చిత్రసీమనున్
    నామము మిస్సమమ్మనగ నందము నొందెడి నందమూరుడౌ
    రాముని భక్తు లెవ్వరన క్రైస్తవులే కద యెంచి చూచినన్...

    రిప్లయితొలగించండి
  4. సామముదానభేదముసమాంతరదండనభేదభావముల్
    కామమునెత్తికెక్కపరకాంతలగూడినవాలిరావణుల్
    రామునిచేతగూలిపరరాజ్యమునందిరిపాపమిప్పుడీ
    *“రాముని భక్తు లెవ్వరన క్రైస్తవులే కద యెంచి చూచినన్”*
    క్షేమమునింటివారికిరుచించరచించివచించుఫాదరుల్

    రిప్లయితొలగించండి
  5. మతముగాదుగోప్పమానవబంధంబు
    రాముక్రీస్తునంచురాగమేల
    జేసుదాసుఁబాడెజేగోట్టభక్తులు
    రామదాసుగాగరంజితమతి

    రిప్లయితొలగించండి
  6. ఆటవెలది
    క్రీస్తుఁ గన్న తల్లి ప్రియమైన మరియమ్మ
    ' రామ' యనఁగ నొప్పు ప్రవిమలముగ
    దైవమిడిన తల్లి దయఁ జూచుననినమ్ము
    క్రైస్తవులకె కద్దు 'రామ' భక్తి


    ఉత్పలమాల
    ఆ మరియమ్మ జన్మమిడ నద్భుత రీతిని ప్రీతిఁ గూర్చుచున్
    సేమము నెంచి రక్తమును చిందిన త్యాగము భక్తిఁ దల్చుచున్
    ప్రేమను బంచు దైవమని క్రీస్తును నమ్మఁగఁ బ్రోచు మానసా
    రాముని భక్తులెవ్వరన క్రైస్తవులే కద యెంచి చూచినన్

    రిప్లయితొలగించండి
  7. సమస్య :
    రాముని భక్తు లెవ్వరన
    క్రైస్తవులే కద యెంచి చూచినన్ .

    (సామాన్యుని వలె పుట్టిన అసామాన్యుని ఏసుని ఆరాధించినవారే క్రైస్తవులు కదా !)

    ఉత్పలమాల
    ...................

    శ్యామము చిమ్మచీకటిన
    శాంతికి ప్రేమకు మార్గదర్శియై
    ఆమనివోలె గడ్డియిలు
    నందున పుట్టిన చిట్టితండ్రియౌ
    కోమలమేరి- జోసఫుల
    కూరిమి బిడ్డడు దివ్యజీవితా
    రాముని భక్తు లెవ్వరన
    క్రైస్తవులే కద ! యెంచి చూచినన్.

    రిప్లయితొలగించండి
  8. బస్తిలోన దిరిగి బహు ముఖాలను జూచి
    వాస్తవ మ్ము దెలియ వాసమేను
    రామచరిత మెరుగ రానున్నకాలాన
    క్రైస్తవులకె కద్దు రామభక్తి!!

    రిప్లయితొలగించండి
  9. ఏసు క్రీస్తుపైన యెనలేని భక్తియే
    క్రైస్తవులకె కద్దు, రామ భక్తి
    దండిగకని పించు ధరణిలో కాంచగ
    హిందువులకు సత్యమిదియె కాదె.

    రిప్లయితొలగించండి
  10. ప్రేమ పెళ్లి జరిగె వేదమంత్రాలతో
    సాంప్రదాయ విధము చర్చి లోన
    వారు వీరు రామ భజనలు జేసెనే,
    క్రైస్తవులకె కద్దు రామభక్తి

    రిప్లయితొలగించండి
  11. భామను వీడి భోగముల బాసి యరణ్యము కేగినట్టి యా
    కోమల లక్ష్మణుండు తిమికోశము దాటిన వాయుపుత్రుడే
    రాముని భక్తు లెవ్వరన, క్రైస్తవులే కద యెంచి చూచినన్
    నేమము తప్పకుండ ప్రతి నిత్యము క్రీస్తును కొల్చు వారలే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అరణ్యమున కేగినట్టి..' అనాలి కదా? అక్కడ "వనంబున కేగినట్టి" అనండి.

      తొలగించండి
  12. తామసమార్గమున్ విడచి తండ్రిని
    నమ్ముచు సాధువర్తనన్
    నీమము దాటకుండ యనునిత్యము బైబిలు వల్లెవేయుచున్
    క్షేమము నీయగానిలకు శిల్వను మోసిన పాపమోచనా
    రాముని భక్తులెవ్వరన క్రైస్తవులేగద యెంచిచూచినన్

    రిప్లయితొలగించండి
  13. ఆదివారమెళ్ళు నందరు చర్చికిన్
    క్రైస్తవులకె కద్దు, రామభక్తి
    వారు రామ అంటు భజనలు జేయునే
    మతము మతము భక్తి మారుచుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఆదివార మేగు దందరు... రామ యనుచు భజనలు సేతురే..."

      తొలగించండి

  14. బోనసు సరదా పూరణ:

    వాస్తవమిది కదర! బంగరు భూమిని:
    “క్రైస్తవులకె వద్దు రామభక్తి!"
    చేస్తిరి గురువరులు మస్తుగ టైపాటు:
    “క్రైస్తవులకె కద్దు రామభక్తి”

    రిప్లయితొలగించండి
  15. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన

    సమస్య

    రాముని భక్తులెవ్వరన క్రైస్తవులే కద యెంచి చూడగాన్
    (లేదా)

    క్రైస్తవులకె కద్దు రామ భక్తి

    నా పూరణ

    1) ఆట వెలది

    ఆసుపత్రి యందు ఆల్బర్టు చేరెను
    రాము రక్త మిచ్చి రక్షఁ జేసె
    కోరి క్రైస్తవునికి కోరికఁదీర్చగా
    క్రైసతవులకె కద్దు రామభక్తి

    2) ఉత్పలమాల

    నీమము వీడకన్ ధరణిఁ రాముని పూజలుఁ జేయువారలున్ ,

    క్షేమముఁగోరిలక్ష్మణుడు ,సీతయు ,నీలుడు నాంజ నేయుడున్

    రాముని భక్తులెవ్వరన,? క్రైస్తవులే గద యెంచి చూడగన్

    ప్రేమగ చర్చియందు నిరు పేదల యార్తిని దీర్చుచుండెడిన్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వీడక' అన్నది కళ. "వీడకే" అనండి.

      తొలగించండి
  16. రామదండునిపుడు రాజ్యమ్ము నేలగ
    ఏసుజనులకెపుడునేమిగాదు
    జాతిమతములనెడు జాడ్యమ్ము వలదిక
    క్రైస్తవులకు కద్దు రామభక్తి

    రామగాథవినగ రాజిల్లు మనసంత
    ఏసురాజునెపుడు నేమరకుడి
    మనుజులొక్కటైన మాటలూ మంచివౌ
    క్రైస్తవులకె కద్దు రామభక్తి

    రిప్లయితొలగించండి
  17. మతము లందు సమత మమతను భావించు
    క్రైస్తవులకు కద్దు రామ భక్తి
    వేరు జేసి చూసి వింత గా వర్తించు
    వారి కుండ దట్టి భావ మెపుడు

    రిప్లయితొలగించండి
  18. ఏసు పబువు గొలువ నెంతయొ మోక్షము
    క్రైస్తవులకె కద్దు ; రామభక్తి
    యెక్కు వయిన నదియె హిందువు లకు కద్దు
    వేరు మతములయిన వేడుకొకెటె

    రిప్లయితొలగించండి

  19. సబ్ కా మాలిక్ ఏక్ హై
    ఈశ్వర్ అల్లా తేరేనామ్

    ప్రేమ తత్త్వ మైన పేర్మిగా యేశుపై
    క్రైస్తవులకె కద్దు, రామభక్తి
    కలదు హిందువులకు, కలదు నమ్మిక ముస్లి
    ములకయా ప్రవక్త మొహ్మదన్న!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  20. ముదమారగ హిందువులు వ
    రద! రాముని భక్తు లెవ్వరన; క్రైస్తవులే
    కద యెంచి చూచినన్ ప్రభు
    ని దారిని నడచెడు వారు నిర్ధారణగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  21. నీమము గా నమాజున వినిర్మల మయ్యెడు వారు ముస్లిముల్!
    క్షేమము జేర్చు వారు మన కెందరికో ప్రియ మైన వారలే
    రాముని భక్తు లెవ్వరన; క్రైస్తవులే కద యెంచి చూచినన్
    మోమున ప్రేమ రక్షకుని ముద్రగ జీససు క్రీస్తు భక్తులౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీమహిజాపతిప్రకటశీలుడు పావనధర్మమూర్తి శ్రీ
      రాముని భక్తు లెవ్వరన రంజితహైందవులౌదురే కదా
      స్వామిని గొల్వగన్, 'సిలువ'వాహకదైవలసన్మనోగతా
      రాముని భక్తు లెవ్వరన క్రైస్తవులే కద యెంచి చూచినన్

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  22. నిన్నటి పూరణ

    తులవ యొకండు మార్గమునఁ దొయ్యలొకర్తుకఁ బోవ నొంటిగన్
    చిలిపి తనమ్మునం జెనకి చెచ్చెరఁ జేలము వట్టి యీడ్వగాఁ
    దలపడి యాగ్రహించి, వడి దార్కొని పోరుచు మూర నాలుగం
    తల గడతోడఁ గొట్టఁగనె దైవమ! హా! తల బ్రద్ధలయ్యెనే.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  23. మైలవరపు వారి పూరణ

    ప్రేమకు మారురూపమయి, పేర్మిని గొర్రెలపాకఁబుట్టినా..
    డామెకు కన్నెయైన మరియమ్మకు., పాపుల రక్షణార్థమై
    యీ మహినేసుక్రీస్తనగ., నెంచగ చర్చియటన్నమందిరా....
    రాముని భక్తులెవ్వరన క్రైస్తవులే కద యెంచి చూచినన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  24. ఆ.వె//
    నింద జేయుచుంద్రు వందనమనకనే
    రామచంద్ర ప్రభువు రాయి యనగ !
    ముదమునొంది ప్రభువె ముక్తి నొసగెనయా
    క్రైస్తవులకె కద్దు రామభక్తి !!
    ✍ మల్లి సిరిపురం శ్రీశైలం.

    రిప్లయితొలగించండి
  25. నామములొక్కటేక్షమయనాదిమతంబనిసామరస్యతన్
    నీమముతోడదైవమునునించుచునార్తిభజించిక్రీస్తునున్
    బ్రేమమహమ్మదున్శుభదభీమనుజూచినరామకృష్ణుడే
    స్వామినితట్టిజూచిమదివాంఛితమున్వరియించుబుణ్యులౌ
    *“రాముని భక్తు లెవ్వరన క్రైస్తవులే కద యెంచి చూచినన్”*

    రిప్లయితొలగించండి
  26. క్షేమము గూర్చగా ప్రజకు క్రీస్తు జనించెను మేరిగర్భమున్
    ధీమతితోడ బాధలను తీర్చి యశక్తుల కెల్లవేళలన్
    ప్రేమను పంచి, ప్రాణముల వీడెను ప్రీతిని, విశ్వశాంతి కా
    రాముని భక్తు లెవ్వరన క్రైస్తవులే కద యెంచి చూచినన్



    రిప్లయితొలగించండి
  27. భక్తియనగనుండు బ్రతియొక్కరికిని
    వీరువారుననగ వేరులేక
    దైవమనగ నొక్కడేవసుధకుగద
    క్రైస్తవులకెకద్దు రామభక్తి

    రిప్లయితొలగించండి
  28. ఉ:

    లేమిని పెల్లగింతుమని లెక్కలు జెప్పుచు నమ్మజూపగన్
    సేమము నెంచి మారినను చింతన సద్యము పూర్వ ధ్యాసగన్
    నీమము తప్పకుండగను నిత్యము గొల్వ మనంబునందు నా
    రాముని భక్తు లెవ్వరన క్రైస్తవులే కద యెంచి చూడగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  29. రామునికందఱున్ ననగరామలు,బిల్లలుబెద్దవారలున్
    రామునిభక్తులె,వ్వరనగక్రైస్తవులేకదయెంచిచూచినన్
    గోమలిమేరిమాతకును,గూరిమిపట్టికిభక్తులందఱున్
    నీమముతోడనున్మెలగినెయ్యముగూర్చుచునుండుటొప్పగున్

    రిప్లయితొలగించండి
  30. వీడకుండనెపుడు వెళ్ళుట చర్చికి
    క్రైస్తవులకె కద్దు, రామభక్తి
    తత్పరులమనంబుతాదాత్మ్యమొందును
    రామనామమందురాత్రిపవలు

    రిప్లయితొలగించండి
  31. పస్తు లుండి నంత భక్తి కల దనంగఁ
    జోద్య మగును జిత్త శుద్ధి వలయుఁ
    గ్రీస్తుని సతతమ్ము ప్రస్తుతింతు రెడందఁ
    గ్రైస్తవులకె కద్దు రామ! భక్తి


    భామరొ దేవుఁ డొక్కఁ డగు వాని కనేకము నామధేయముల్
    భూమిని నొక్క రొక్కరిని ముక్తికిఁ గొల్తురు వేఱు వేఱుగన్
    లేమ నిజమ్ము నమ్ము నను గ్రీస్తున కిద్ధరఁ, దల్చి చెప్పెదన్
    రాముని, భక్తు లెవ్వరనఁ గ్రైస్తవులే కద యెంచి చూచినన్

    రిప్లయితొలగించండి
  32. రామభజనయందు రామనామమురీతి
    హల్లలూయగూడ హార్ధికమ్ము
    లోనివెల్గుదెల్వ లోకేశుడొక్కడే
    క్రైస్తవులకు కద్దు రామభక్తి

    రిప్లయితొలగించండి
  33. కాముకు రావణున్ దునిమి కాంతను గాచిన రాక్షసాంతకున్
    రాముని భక్తి గొల్తు రభిరక్షకుడంచును హిందువుల్ సదా;
    ప్రేమ స్వరూపి దాననుచు బేరిమి గొల్తురు యేసు క్రీస్తు న
    బ్రాముని భక్తు లెవ్వరన క్రైస్తవులే కద యెంచి చూచినన్

    రిప్లయితొలగించండి
  34. ఆదివార మందు నరుగుట చర్చికి
    *క్రైస్తవులకు కద్దు; రామ భక్తి*
    నంది రాముని గన అడవిలో వేచెను
    శబరి కాంత యైన శబరి తాను.

    ఈ మహిలోన చూడగను నిమ్ముగ రాముని కీర్తనల్ సదా
    నేమము తోడ పాడుచును నెమ్మని బూనుచు కొల్చు వారలే
    *రాముని భక్తు లెవ్వరన క్రైస్తవులే కద యెంచి చూచినన్”*
    వేమరు తల్చుచున్ విధిగ వీధుల లోచను చుందురెప్పుడున్

    రిప్లయితొలగించండి