11-11-2020 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగె”
(లేదా…)
“భయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:రయమున తమ్ముడాదటను వ్రాలెడి తోకను బుజ్జగించుచున్:“భయపడి ఋష్యమూకమున వాలికి దాఁగెను ప్రాణరక్షకై”నయనము విప్పి చెప్పెదను నాకిది తోచెను టైపుతప్పుగా: “భయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై”!!!
మీరు చేసిన ఉత్తమ పూరణలలో ఇది ఒకటి. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏
వలదు వీడుము చింతను, ప్రాణ భయము కలిగి తాను రాబోడుగా బలిమి తోడఋష్య మూకమ్మునకు వాలి,యేగి దాగినంత మీకు శుభము కల్గుననుచు పవనతనయుడా సూర్య సుతునకు వినతి జేసె
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వలదు' అన్న పదానికి అన్వయం?
భీతిఁగోలుపగరోగముభీముడైనప్రాణభయమునదాగునుపరుగులిడుచువానరముగాగరావణువంచిగూడరుష్యమూకమ్మునకువాలియేగిదాగె
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కాని ఋష్యమూకంలో దాగింది సుగ్రీవుడు కదా?
కరోనాకిభయపడివెళ్లాడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ప్రాణ భయముతో నటకింక రాడటంచు ఋష్యమూకమ్మునకు వాలి, యేగి దాగె నచట సుగ్రీవుడనుచు నలినాత్మజుండు పలికెనిట్లు నా పరమ పావనుని తోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో గణభంగం. సవరించండి.
రయముననుక్తలేఖనమువ్రాయగబంచిననోజుజెప్పెదాభయపడిఋష్యమూకమునభానుజుడుండెనుప్రాణరక్షకైస్వయముగవ్రాయబంచిననుఛాత్రుడొకండులిఖించెనివ్విధిన్*“భయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై”*
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం)రంగనాయకమ్మ ఉవాచ: "భయమును వీడి వేడుకను భళ్ళున చెప్పెద నాపురాణమున్ ప్రియముగ నాలకించుముర! భీతిని వీడుచు శాస్త్రివర్యుడా! రయమున రాగనాదటను రాముడు బాణము నెక్కుపెట్టుచున్ భయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై..."
రంగనాయకమ్మ శకారుని వంటిదే... మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తే.గి. "రాజు గావలె నన్న నీ మోజు నిష్ప లమ్ము "నమ్మిన యాశల వమ్ము సేసి నావు "యనిదిట్ట భీతిల్లి ప్రావు గోరి ఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగెవాలి = వాలము గలిగినది (వానరము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
దాగిన వాడు సుగ్రీవుడు. ఋష్యమూకమునకు వచ్చుటకు భయపడినవాడు వాలి.. తేటగీతితనను సుగ్రీవుఁడెంచెను దునుమ ననెడుభ్రమను దరిమి కొట్టఁగ ప్రాణభయము చేతమౌని శాపానరానెంచఁ బూనఁడనుచుఋష్యమూకమునకు వాలి, యేగి దాగెచంపకమాలస్వయముగ తమ్ముడౌచు గృహఁ జంపగ శైలము నడ్డునుంచె నిర్దయుడని సూర్యజున్ దరిమి ప్రాణము దీయఁగ జూచినంతటన్రయమునఁ బారి, శాపమున రాడని పాదము మోపఁ బోడనన్భయపడి ఋష్యమూకమున వాలియె, దాఁగెను ప్రాణరక్షకై
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
ప్రియమును గ్రోలి నీవిటుల ప్రేలుట మానుము మెచ్చ డెవ్వడున్ భయమునెఱుంగునే? యెదుటి వారి బలమ్మును సంగ్రహించెడిన్ నియతిని కల్గెనాతడది నిక్కమె కాద మరేల పందయై భయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై
అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ప్రియమును గ్రోలి'?
సయిపక నాగ్రహించి తన జాయను రాజ్యము నాక్రమించెనన్నయమున జెప్పిచూచినను నమ్మక తమ్ముని ద్రోహివంచు దారయమున చంపబూనుచు విరామ మెరుంగక వెంబడించగా,భయపడి ఋష్యమూకమున , వాలియె,దాగెను ప్రాణరక్షకై
మౌని శాపమ్ము నేతెంచబూన డనుచు ఋష్యమూకమ్మునకు వాలి, యేగిదాగెమంత్రులను గూడి సుగ్రీవ మల్లురాజురామలక్ష్మణుల చెలిమిఁ రక్షనొందె మల్లు రాజు = వానరరాజు
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. "సయిపక యాగ్రహించి..." అనండి.
ధన్యవాదములు గురువర్యా! సవరించెదను! 🙏🙏🙏
క్రొవ్విడి వెంకట రాజారావు: కాలిడడు తాపసుని శాపకారణమున ఋష్యమూకమ్మునకు వాలి; యేగి దాగె నచట భయముచేతను యార్కి ననుచు జెప్పె హనుమ రామలక్ష్మణులకు యసలు కిటుకు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు."లక్ష్మణులకు నసలు..."
మనదేశంలో కోట్లాది అప్పజెసి విదేశాలకు వెళ్లిన వారి నుద్దేశించి, ఎటువెళ్లినా ఇబ్బంది తప్పదని చెప్పే ప్రయత్నము: చం:నయమున యప్పు దీర్చు మన నాశల లోగి విదేశ మేగగన్రయమున సంధి సూత్రములు రాజిలు నొంద పరీక్ష చేయగన్స్వయముగ గోయి తవ్వు కొను చందము నయ్యది నివ్విధంబుగన్భయపడి ఋష్య మూకమున వాలియె దాగెను ప్రాణ రక్షకైవై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."నయమున నప్పు..."
ధన్యవాదములు
ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్యఋష్యమూకమ్మునకు వాలి యేగి దాగె నా పూరణఆలినెత్తుకు పోయన వాలి తోడకదన మొనరించి చాలగ కలతఁజెందిప్రాణభయమునఁ బరుగెత్తి భానుసుతుడుఋష్యమూకమ్మునకు వాలి , యేగిదాగె ఆదిభట్ల సత్యనారాయణ
మిత్రమా! శకారా! పల్కుమీ స దనముకోరె రామాయణమ్మున కొన్ని మంచివిషయములనంగ భళి పల్కె వింత గాను"ఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగె"జిలేబి
"శకార శ్శరణం మమ!"జి.పి.యస్. గారు రంగనాయకమ్మను పట్టుకుంటే మీరు శకారుణ్ణి పట్టుకున్నారు. అభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రామలక్ష్మణులు రాజర్షుల రూపమున ఉన్నారు గావున వారు ఋషితుల్యులే ఋషులే. అందుకు బాణం విడచిన తరువాత వాలి ఋషిమూకమున జేరాడు అనునది సమన్యసముఉ||పయనము జేసె రాముడటు వాలిని భ్రాతృసమేతమున్ వధింప యతులరూపధారులయి వానరు జావగ బాణమున్ విడన్నియమము దప్పెనంచు తను నేలను బ్రాకుచు జేరె వారినిన్భయపడి ఋష్యమూకమున వాలియె దాగెను ప్రాణరక్షకైఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻
పద్యం బాగున్నది. కాని సమస్యాపరిష్కారం అంత సమర్థంగా ఉన్నట్టు లేదు.
కందచంపకము"అనఘా!" శకార డనె, "మున మున, భయ పడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై , రాముని సాయమ్ము దహరుడగు మూర్ఖుని నడచెన్"జిలేబి
తపసి శాపవశంబున దరికి రాడుఋష్యమూకమ్మునకు వాలి ; యేగి దాఁగెనా గిరిపయిన సుగ్రీవు డగ్రజునికిభయము జెంది , వాయుసుతునిబలము తోడ
సమస్య :భయపడి ఋష్యమూకమున వాలియె దాగెను ప్రాణరక్షకై (మృచ్ఛకటిక నాటకంలో అడ్డదిడ్డపుమాటల రాజుగారి బావమరది శకారుడు పలుకుతున్న అమూల్యవాక్కులు )చంపకమాల ....................." నియమముతోడ హస్తినను నీటుగ భీష్మకు డేలుచుండగన్ నయముగ రావణేశ్వరుడు నాల్గవ తమ్ముడు రామజిత్తుతో జయమును గోరి ద్వారకకు జయ్యన యుద్ధపు యాత్రకేగగా ;భయపడి ఋష్యమూకమున వాలియె దాగెను ప్రాణరక్షకై . "
జయము లభించి దర్పము న చంపిన దైత్యుని మాంస ఖండముల్రయముగ కొండ పైన విసరన్ ముని శాపము వాలి పొందెగా,నియమము వీడి యెన్నడును నిన్ను వధింపగ చేర బోడుగాభయపడి ఋష్యమూకమున వాలియె,దాగెను ప్రాణ రక్షణకై,దయను పొసంగి కాచుము ముదంబుగ నన్నని తెల్పి వేడినీవయమును పొందుమా యను చు నంజని పుత్రుడు పల్కెరాజుతోన్ అయము = శుభము
ధన్యవాదములు స్వామి
అన్నకును చేయగను నేర మతడు కోప మూని చంపబూనగ శాపమునను రాడు “ఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగె”రవిసుతు డట మిత్రుల గూడి రహితొలంగ
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ప్రాస? చంపకమాల?
తొందరలో మరిచానుమీకు ధన్యవాదాలుశంకరయ్యగారికి క్షమాపణలు.
అన్న ధాటికి సుగ్రీవు డార్తి చెంది చేరి శైలమ్ము కలలోన చిత్ర ముగను వాలి నెదిరించి ఢీకొనభయము చేత ఋష్య మూ కమ్ము నకు వాలి యేగి దాగె
తేగీ.అభ్రరాజము లేగుచు నాకసమునదక్షిణాదిన ప్రకృతి యందాల గనుచుపరవశించుచు కర్ణాట పర్వతములఋష్యమాకమ్మునకు వాలి యేగి దాగె.వాలి-వానకురిసి పొలంలో పారే నీటిజాలు.
౧.ఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగెననుచు ఎద్దేవజేయుచు ననుజు జేసెగేలి,గర్వమందిన వాని గీరమణచరాము బాణమ్ము వేసెను రణము నందుచెట్టు చాటున దాగియు చింత దీరసోదరుండైన సుగ్రీవు నాదరమున!!౨.రయమున నేగుదెంచెను నిరాశగ వ్రాయపరీక్షలన్ దమిన్పయనము క్లిష్టమై సమయభావముగల్గగ తొందరందునన్నయనము ప్రశ్నలందునను నచ్చిన వానిని చూచి వ్రాసెనేభయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై!!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'ఎద్దేవ' అన్నపదం వ్యావహారికం. కొంత అన్వయదోషమున్నది.
ధన్యవాదములార్యా!సవరించ ప్రయత్నిస్తాను.
మైలవరపు వారి పూరణ నయపథదూరుడై యవగుణప్రకరాన్వితుడైన వాలి వి..స్మయముగ వాలియైన సహజాతుని భార్యను పొంది, వాలిపైరయమునఁ బోరు సల్పగ., త్వరన్ బరువెత్తుచుఁ జెట్ల గెంతుచున్భయపడి ఋష్యమూకమున వాలియె దాగెను బ్రాణరక్షకై!(వాలము కలవాడు వాలి)మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
భయమునభానుజుండుతనభ్రాతబలాఢ్యుడువాలికక్షతోస్వయముగజంపనెంచమునివాటినిజొచ్చివసించెనెప్పుడున్ *“భయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై?”*దయసవరించవయ్యవిశదంబయెవాలికిమారుభానుజున్🙏🙏
నియమమువీడి వాలితనభ్రాత నిజాలి నిఁ దస్క రించగారయమున సూర్యపుత్రుడును రాజితశౌర్య ప్రతాప ధీరుడైనయముగపోరియున్ రుధిర నాసికకర్ణశరీర తీవ్రతన్భయపడి ఋష్యమూకమునవాలియె దాగెను ప్రాణరక్షకై
రాముని కథనంతయు విని రవి తడబడిఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగెననుచు జెప్పగ నవ్వుచు నయ్యవారుదాగె సుగ్రీవుఁడంచు దా దప్పు దిద్దె
శాపకారణముననేగడెపుడునద్రిఋష్యమూకమ్మునకువాలి,యేగిదాగెఋష్యశృంగమునకుదనసేమమరసిసౌరిపరివారసహితుడైయార్యయపుడు
మిత్రుడు సూచించిన ప్రాస తప్పిదమును సవరించినపూరణస్వయముగ వాలముం గలుగి వానరుడొప్పిన వాలియౌ గదా!నియమితవాచకార్థమది నిర్ణితమే కద! మీరలన్న యాస్మయకరవాలి యెవ్వరహొ! సౌరియొ యంగదుడో మరెవ్వరోభయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై?.
భయపడిఋష్యమూకమునవాలియెదాగెనుప్రాణరక్షకైభయపడివాలికాదుగదభానునిసూతుడుసౌరియేసుమానయమగురీతినేనతడుపోరునుసల్పగవాలితోదగన్ జయమునుగల్గెరాముడటసంగరమొప్పుగజేయుటన్భళా
భాష్యము లగు భాషణములు పలుక మప్రధృష్యముగను బలుకకు మీ తీరు మాట దూష్య మౌను సుగ్రీవుఁడు దూఱె నందు ఋష్యమూకమ్మునకు వాలి యేఁగి దాఁగె వెయి నుడు లేల యల్పులె భువిం గల విప్రులు యెంత వీర్య మున్న యతఁడు లొంగు దుర్బలుఁడు నాఁగ మతంగ మహర్షి శాప భీతి యెడఁద నుంచి నాశిత ధృతిం దన కుందని ప్రాణ హానియే భయపడి ఋష్యమూకమున, వాలియె దాఁగెను ప్రాణరక్షకై
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
రయమున తమ్ముడాదటను వ్రాలెడి తోకను బుజ్జగించుచున్:
“భయపడి ఋష్యమూకమున వాలికి దాఁగెను ప్రాణరక్షకై”
నయనము విప్పి చెప్పెదను నాకిది తోచెను టైపుతప్పుగా:
“భయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై”!!!
మీరు చేసిన ఉత్తమ పూరణలలో ఇది ఒకటి. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండివలదు వీడుము చింతను, ప్రాణ భయము
రిప్లయితొలగించండికలిగి తాను రాబోడుగా బలిమి తోడ
ఋష్య మూకమ్మునకు వాలి,యేగి దాగి
నంత మీకు శుభము కల్గు
ననుచు పవన
తనయుడా సూర్య సుతునకు వినతి జేసె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వలదు' అన్న పదానికి అన్వయం?
భీతిఁగోలుపగరోగముభీముడైన
రిప్లయితొలగించండిప్రాణభయమునదాగునుపరుగులిడుచు
వానరముగాగరావణువంచిగూడ
రుష్యమూకమ్మునకువాలియేగిదాగె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాని ఋష్యమూకంలో దాగింది సుగ్రీవుడు కదా?
కరోనాకిభయపడివెళ్లాడు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రాణ భయముతో నటకింక రాడటంచు
రిప్లయితొలగించండిఋష్యమూకమ్మునకు వాలి, యేగి దాగె
నచట సుగ్రీవుడనుచు నలినాత్మజుండు
పలికెనిట్లు నా పరమ పావనుని తోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. సవరించండి.
రయముననుక్తలేఖనమువ్రాయగబంచిననోజుజెప్పెదా
రిప్లయితొలగించండిభయపడిఋష్యమూకమునభానుజుడుండెనుప్రాణరక్షకై
స్వయముగవ్రాయబంచిననుఛాత్రుడొకండులిఖించెనివ్విధిన్
*“భయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై”*
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
రంగనాయకమ్మ ఉవాచ:
"భయమును వీడి వేడుకను భళ్ళున చెప్పెద నాపురాణమున్
ప్రియముగ నాలకించుముర! భీతిని వీడుచు శాస్త్రివర్యుడా!
రయమున రాగనాదటను రాముడు బాణము నెక్కుపెట్టుచున్
భయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై..."
రంగనాయకమ్మ శకారుని వంటిదే... మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండితే.గి.
రిప్లయితొలగించండి"రాజు గావలె నన్న నీ మోజు నిష్ప
లమ్ము "నమ్మిన యాశల వమ్ము సేసి
నావు "యనిదిట్ట భీతిల్లి ప్రావు గోరి
ఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగె
వాలి = వాలము గలిగినది (వానరము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదాగిన వాడు సుగ్రీవుడు. ఋష్యమూకమునకు వచ్చుటకు భయపడినవాడు వాలి..
రిప్లయితొలగించండితేటగీతి
తనను సుగ్రీవుఁడెంచెను దునుమ ననెడు
భ్రమను దరిమి కొట్టఁగ ప్రాణభయము చేత
మౌని శాపానరానెంచఁ బూనఁడనుచు
ఋష్యమూకమునకు వాలి, యేగి దాగె
చంపకమాల
స్వయముగ తమ్ముడౌచు గృహఁ జంపగ శైలము నడ్డునుంచె ని
ర్దయుడని సూర్యజున్ దరిమి ప్రాణము దీయఁగ జూచినంతటన్
రయమునఁ బారి, శాపమున రాడని పాదము మోపఁ బోడనన్
భయపడి ఋష్యమూకమున వాలియె, దాఁగెను ప్రాణరక్షకై
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిప్రియమును గ్రోలి నీవిటుల ప్రేలుట మానుము మెచ్చ డెవ్వడున్
రిప్లయితొలగించండిభయమునెఱుంగునే? యెదుటి వారి బలమ్మును సంగ్రహించెడిన్
నియతిని కల్గెనాతడది నిక్కమె కాద మరేల పందయై
భయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై
అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ప్రియమును గ్రోలి'?
సయిపక నాగ్రహించి తన జాయను రాజ్యము నాక్రమించెనన్
రిప్లయితొలగించండినయమున జెప్పిచూచినను నమ్మక తమ్ముని ద్రోహివంచు దా
రయమున చంపబూనుచు విరామ మెరుంగక వెంబడించగా,
భయపడి ఋష్యమూకమున , వాలియె,దాగెను ప్రాణరక్షకై
మౌని శాపమ్ము నేతెంచబూన డనుచు
తొలగించండిఋష్యమూకమ్మునకు వాలి, యేగిదాగె
మంత్రులను గూడి సుగ్రీవ మల్లురాజు
రామలక్ష్మణుల చెలిమిఁ రక్షనొందె
మల్లు రాజు = వానరరాజు
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి"సయిపక యాగ్రహించి..." అనండి.
ధన్యవాదములు గురువర్యా! సవరించెదను! 🙏🙏🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికాలిడడు తాపసుని శాపకారణమున
ఋష్యమూకమ్మునకు వాలి; యేగి దాగె
నచట భయముచేతను యార్కి ననుచు జెప్పె
హనుమ రామలక్ష్మణులకు యసలు కిటుకు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"లక్ష్మణులకు నసలు..."
మనదేశంలో కోట్లాది అప్పజెసి విదేశాలకు వెళ్లిన వారి నుద్దేశించి, ఎటువెళ్లినా ఇబ్బంది తప్పదని చెప్పే ప్రయత్నము:
రిప్లయితొలగించండిచం:
నయమున యప్పు దీర్చు మన నాశల లోగి విదేశ మేగగన్
రయమున సంధి సూత్రములు రాజిలు నొంద పరీక్ష చేయగన్
స్వయముగ గోయి తవ్వు కొను చందము నయ్యది నివ్విధంబుగన్
భయపడి ఋష్య మూకమున వాలియె దాగెను ప్రాణ రక్షకై
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"నయమున నప్పు..."
ధన్యవాదములు
తొలగించండిఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండిఋష్యమూకమ్మునకు వాలి యేగి దాగె
నా పూరణ
ఆలినెత్తుకు పోయన వాలి తోడ
కదన మొనరించి చాలగ కలతఁజెంది
ప్రాణభయమునఁ బరుగెత్తి భానుసుతుడు
ఋష్యమూకమ్మునకు వాలి , యేగిదాగె
ఆదిభట్ల సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమిత్రమా! శకారా! పల్కుమీ స దనము
కోరె రామాయణమ్మున కొన్ని మంచి
విషయములనంగ భళి పల్కె వింత గాను
"ఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగె"
జిలేబి
"శకార శ్శరణం మమ!"
తొలగించండిజి.పి.యస్. గారు రంగనాయకమ్మను పట్టుకుంటే మీరు శకారుణ్ణి పట్టుకున్నారు. అభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరామలక్ష్మణులు రాజర్షుల రూపమున ఉన్నారు గావున వారు ఋషితుల్యులే ఋషులే. అందుకు బాణం విడచిన తరువాత వాలి ఋషిమూకమున జేరాడు అనునది సమన్యసము
రిప్లయితొలగించండిఉ||
పయనము జేసె రాముడటు వాలిని భ్రాతృసమేతమున్ వధిం
ప యతులరూపధారులయి వానరు జావగ బాణమున్ విడన్
నియమము దప్పెనంచు తను నేలను బ్రాకుచు జేరె వారినిన్
భయపడి ఋష్యమూకమున వాలియె దాగెను ప్రాణరక్షకై
ఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻
పద్యం బాగున్నది. కాని సమస్యాపరిష్కారం అంత సమర్థంగా ఉన్నట్టు లేదు.
తొలగించండి
రిప్లయితొలగించండికందచంపకము
"అనఘా!" శకార డనె, "మున
మున, భయ పడి ఋష్యమూకమున వాలియె దాఁ
గెను ప్రాణరక్షకై , రా
ముని సాయమ్ము దహరుడగు మూర్ఖుని నడచెన్"
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితపసి శాపవశంబున దరికి రాడు
రిప్లయితొలగించండిఋష్యమూకమ్మునకు వాలి ; యేగి దాఁగె
నా గిరిపయిన సుగ్రీవు డగ్రజునికి
భయము జెంది , వాయుసుతుని
బలము తోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిభయపడి ఋష్యమూకమున
వాలియె దాగెను ప్రాణరక్షకై
(మృచ్ఛకటిక నాటకంలో అడ్డదిడ్డపుమాటల రాజుగారి బావమరది శకారుడు పలుకుతున్న అమూల్యవాక్కులు )
చంపకమాల
.....................
" నియమముతోడ హస్తినను
నీటుగ భీష్మకు డేలుచుండగన్
నయముగ రావణేశ్వరుడు
నాల్గవ తమ్ముడు రామజిత్తుతో
జయమును గోరి ద్వారకకు
జయ్యన యుద్ధపు యాత్రకేగగా ;
భయపడి ఋష్యమూకమున
వాలియె దాగెను ప్రాణరక్షకై . "
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిజయము లభించి దర్పము న చంపిన దైత్యుని మాంస ఖండముల్
రిప్లయితొలగించండిరయముగ కొండ పైన విసరన్ ముని శాపము వాలి పొందెగా,
నియమము వీడి యెన్నడును నిన్ను వధింపగ చేర బోడుగా
భయపడి ఋష్యమూకమున వాలియె,దాగెను ప్రాణ రక్షణకై,
దయను పొసంగి కాచుము ముదంబుగ నన్నని తెల్పి వేడినీ
వయమును పొందుమా యను చు నంజని పుత్రుడు పల్కెరాజుతోన్
అయము = శుభము
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు స్వామి
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅన్నకును చేయగను నేర మతడు కోప
రిప్లయితొలగించండిమూని చంపబూనగ శాపమునను రాడు
“ఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగె”
రవిసుతు డట మిత్రుల గూడి రహితొలంగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిప్రాస? చంపకమాల?
తొలగించండితొందరలో మరిచాను
తొలగించండిమీకు ధన్యవాదాలు
శంకరయ్యగారికి క్షమాపణలు.
అన్న ధాటికి సుగ్రీవు డార్తి చెంది
రిప్లయితొలగించండిచేరి శైలమ్ము కలలోన చిత్ర ముగను
వాలి నెదిరించి ఢీకొనభయము చేత
ఋష్య మూ కమ్ము నకు వాలి యేగి దాగె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేగీ.
రిప్లయితొలగించండిఅభ్రరాజము లేగుచు నాకసమున
దక్షిణాదిన ప్రకృతి యందాల గనుచు
పరవశించుచు కర్ణాట పర్వతముల
ఋష్యమాకమ్మునకు వాలి యేగి దాగె.
వాలి-వానకురిసి పొలంలో పారే నీటిజాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి౧.
రిప్లయితొలగించండిఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగె
ననుచు ఎద్దేవజేయుచు ననుజు జేసె
గేలి,గర్వమందిన వాని గీరమణచ
రాము బాణమ్ము వేసెను రణము నందు
చెట్టు చాటున దాగియు చింత దీర
సోదరుండైన సుగ్రీవు నాదరమున!!
౨.
రయమున నేగుదెంచెను నిరాశగ వ్రాయపరీక్షలన్ దమిన్
పయనము క్లిష్టమై సమయభావముగల్గగ తొందరందునన్
నయనము ప్రశ్నలందునను నచ్చిన వానిని చూచి వ్రాసెనే
భయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై!!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'ఎద్దేవ' అన్నపదం వ్యావహారికం. కొంత అన్వయదోషమున్నది.
ధన్యవాదములార్యా!సవరించ ప్రయత్నిస్తాను.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండినయపథదూరుడై యవగుణప్రకరాన్వితుడైన వాలి వి..
స్మయముగ వాలియైన సహజాతుని భార్యను పొంది, వాలిపై
రయమునఁ బోరు సల్పగ., త్వరన్ బరువెత్తుచుఁ జెట్ల గెంతుచున్
భయపడి ఋష్యమూకమున వాలియె దాగెను బ్రాణరక్షకై!
(వాలము కలవాడు వాలి)
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండిభయమునభానుజుండుతనభ్రాతబలాఢ్యుడువాలికక్షతో
రిప్లయితొలగించండిస్వయముగజంపనెంచమునివాటినిజొచ్చివసించెనెప్పుడున్
*“భయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై?”*
దయసవరించవయ్యవిశదంబయెవాలికిమారుభానుజున్
🙏🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినియమమువీడి వాలితనభ్రాత నిజాలి నిఁ దస్క రించగా
రిప్లయితొలగించండిరయమున సూర్యపుత్రుడును రాజితశౌర్య ప్రతాప ధీరుడై
నయముగపోరియున్ రుధిర నాసికకర్ణశరీర తీవ్రతన్
భయపడి ఋష్యమూకమునవాలియె దాగెను ప్రాణరక్షకై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాముని కథనంతయు విని రవి తడబడి
రిప్లయితొలగించండిఋష్యమూకమ్మునకు వాలి యేగి దాఁగె
ననుచు జెప్పగ నవ్వుచు నయ్యవారు
దాగె సుగ్రీవుఁడంచు దా దప్పు దిద్దె
శాపకారణముననేగడెపుడునద్రి
రిప్లయితొలగించండిఋష్యమూకమ్మునకువాలి,యేగిదాగె
ఋష్యశృంగమునకుదనసేమమరసి
సౌరిపరివారసహితుడైయార్యయపుడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రుడు సూచించిన ప్రాస తప్పిదమును సవరించిన
తొలగించండిపూరణ
స్వయముగ వాలముం గలుగి వానరుడొప్పిన వాలియౌ గదా!
నియమితవాచకార్థమది నిర్ణితమే కద! మీరలన్న యా
స్మయకరవాలి యెవ్వరహొ! సౌరియొ యంగదుడో మరెవ్వరో
భయపడి ఋష్యమూకమున వాలియె దాఁగెను ప్రాణరక్షకై?.
భయపడిఋష్యమూకమునవాలియెదాగెనుప్రాణరక్షకై
రిప్లయితొలగించండిభయపడివాలికాదుగదభానునిసూతుడుసౌరియేసుమా
నయమగురీతినేనతడుపోరునుసల్పగవాలితోదగన్
జయమునుగల్గెరాముడటసంగరమొప్పుగజేయుటన్భళా
భాష్యము లగు భాషణములు పలుక మప్ర
రిప్లయితొలగించండిధృష్యముగను బలుకకు మీ తీరు మాట
దూష్య మౌను సుగ్రీవుఁడు దూఱె నందు
ఋష్యమూకమ్మునకు వాలి యేఁగి దాఁగె
వెయి నుడు లేల యల్పులె భువిం గల విప్రులు యెంత వీర్య ము
న్న యతఁడు లొంగు దుర్బలుఁడు నాఁగ మతంగ మహర్షి శాప భీ
తి యెడఁద నుంచి నాశిత ధృతిం దన కుందని ప్రాణ హానియే
భయపడి ఋష్యమూకమున, వాలియె దాఁగెను ప్రాణరక్షకై