14, నవంబర్ 2020, శనివారం

సమస్య - 3544

15-11-2020 (ఆదివారం)

కవిమిత్రులారా,

దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దీపములు వెల్గె నన్నియు దీప్తి లేదు”

(లేదా…)

“దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్”

72 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  కోపము నొందుచున్ విరివి గోలను బెట్టుచు మోడిఁ దిట్టుచున్
  రూపము మారిపోవగను రోగము హెచ్చగ నెన్నికందునన్
  పాపడె యోడగన్ కినిసి బంగరు భూమిని బీహరందునన్
  దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్...

  రిప్లయితొలగించండి
 2. విశ్వమంత కరోనాయె విస్త రించి
  విటతటము జేసె ప్రజల జీవితమటంచు
  వగచు తరుణమందున వచ్చె పర్వదినము
  దీపములు వెల్గె నన్నియు, దీప్తి లేదు.

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  గోపకాంత...

  కోపము బూనెనేమొ? తనకున్ మరి యొక్కతె చిక్కెనేమొ? ఈ
  తాపమునెచ్చె, నెచ్చెలి! ముదంబననాతడె., దీప్తి యాతడే!
  ఏ పగిదిన్ భరింపగలనింతటి వేదన ! కారుచీకటిన్
  దీపములెల్ల వెల్గినవి! దీప్తియె సుంతయు కానరాదిటన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 4. తేటగీతి

  కోవిడు వినాశకారిగఁ గూడినంత
  జనులు దీపావళీ పర్వదినమునందుఁ
  బాలలన్ టపాసులుఁ గాల్చ వలదటన్న
  దీపముల్ వెల్గె నన్నియు దీప్తి లేదు!

  ఉత్పలమాల
  పాపుల స్పర్శతో జగము పంకిల మందున మున్గి పర్వముల్
  దాపుకు పారె కోవిడను దయ్యము మృత్యువు రూపమెత్తగా
  నాపుమనన్ టపాసులు విహాయస వీధులు చీకటై భువిన్
  దీపము లెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్

  రిప్లయితొలగించండి
 5. మా ఆవిడ విడువకుండా చూసే 'కార్తికదీపం' సీరియల్ ప్రభావం నామీద కొంత పడింది...

  దీపయె వంటలక్క మఱి దేశము బట్టుకు పోయె కార్తికే
  పాపము పిల్లలిద్దరును బాధల మున్గిరి నాయనమ్మతో
  నీ పగిదిన్ వచింతురట యేమిది కార్తికదీపమందు బల్
  దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్

  రిప్లయితొలగించండి
 6. పాపము పెర్గినట్లు పలు వ్యాధులు ముట్టడి చేయు వేళలో
  నీ పది నెళ్ళుగా పొడిమి హేమఁ గరోనయె విస్తరించ సం
  తాపము చెందుచున్ జనులు తాళగ లేమను దుర్ముహూర్తమున్
  దీపములెల్ల వెల్గినవి, దీప్తియె సుంతయుఁ గానరాదిటన్

  రిప్లయితొలగించండి

 7. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  పాపము! భాజపా తనరి భండన భూమిని గంతులేయగన్
  చేపలు జారిపోవగను చెప్పుల కాంతది జాలమందునన్
  పాపట పండిపోవగను, పండుగ రాత్రిని వంగభూమినిన్
  దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్...

  రిప్లయితొలగించండి
 8. క్రొవ్విడి వెంకట రాజారావు:

  దేశమందు కరోనయె తిపురుగొనగ
  పౌరులెల్ల వెతలపాలై బాధతోడ
  జోతులుంచి టపాసులు సున్నజేయ
  దీపములు వెల్గె నన్నియు దీప్తిలేదు.

  రిప్లయితొలగించండి
 9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 10. అందరికీ నమస్సులు🙏

  నా పూరణ యత్నం..

  *ఉ*

  కోపము జూపుచున్ జనుల కొంపలు ముంచెడి రోగమొక్కటిన్
  శాపము బెట్టినట్టులిట శాంతిని మొత్తము పారద్రోలగన్
  పాపము, వచ్చు జీతమున వందలు వేలుగ కోత వేయగన్
  *“దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్”*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అందరికీ నమస్సులు🙏

   మరో పూరణ యత్నం..

   *ఉ*

   బాపును నమ్ము దైవమని పండుగ సేయగ నెంచిరెల్లరున్
   చూపులు సంత సమ్మునకు శోధన సేయుచు వెద్కుచుండగన్
   మాపటి వేళకున్ జనులు మందులు కాల్చగ నెంచినన్, నహో
   *“దీపములెల్ల వెల్గినవి, దీప్తియె సుంతయుఁ గానరాదిటన్”*

   *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
   🙏

   తొలగించండి
  2. మాపటి వేళలన్ జనులు మర్చిరి యొత్తుల కాంతులెన్నడో
   సూపరు' పండుగన్ వెరసి సుందర రీతులు బోయి నందునన్
   చీపుగ' పద్దతిన్ విడచి చీనుల లైట్లను దెచ్చి బెట్టగన్
   *“దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్”*

   తొలగించండి
  3. మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 11. పుట్టి నింటికి వెళ్ళెనేపురిటి కొరకు
  భర్త నొక్కడే నుండ దీపావళందు
  ఇంటి దీపమునిల్లాలు లేకయుండ
  దీపములు వెల్గె నన్నియు, దీప్తి లేదు

  రిప్లయితొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు:

  బవరమున యభిమన్యుడు వధను జెంద
  చింత గూడిన సైనిక శిబిరమందు
  దీపములు వెల్గె నన్నియు దీప్తి లేదు
  పార్థునకు శంక గల్గెను స్వాంతమందు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బవరమున నభిమన్యుడు...' అనండి.

   తొలగించండి
 13. విలయమును సృష్టిచేయగా వింతపురుగు
  దిక్కుతోచకజనమెల్ల దీనులైరి
  దీపములు వెల్గె నన్నియు దీప్తి లేదు
  శార్వరము చుట్టుముట్టెనీజగమునందు

  రిప్లయితొలగించండి
 14. ఇటీవల దేశ సరిహద్దులలో మరణించిన వీరజవానులకు నివాళిగా ! 🙏🙏🙏

  ఊపున బోయిచేరుచు సమున్నత
  స్థానము సైన్యమందునన్
  కాపుగ దేశహద్దులకు గాచుచు నెండను శీతవాయువుల్
  పాపము యుద్దరంగమున ప్రాణము గోల్పడ, నంజలించుచున్
  దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయు గానరాదిటన్

  రిప్లయితొలగించండి
 15. పాపమిదేమి ఖర్మ దలపన్ అమరావతి కర్షకాళికిన్
  శాపము గాను మారె గద శాసన కర్తల దీరు జూడగా
  రేపటి పైని యాశ కదిలింపగ పండుగ వేళనందునన్
  దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్

  రిప్లయితొలగించండి
 16. దివ్వెలు వెలిగించెడి పర్వదినమునందు
  దీపములు వెల్గె నన్నియు ;దీప్తి లేదు
  మురిగ నైనను మనుజుల మోము నందు
  కోవిడు చీకట్లు మనమున గుదురు గొనగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో గణభంగం. "కోవిడు తిమిరమ్ము మదిని గుదురుకొనగ" అందామా?

   తొలగించండి
 17. వెలుగు లీనిన వేడ్కలు ప్రీతిగాను
  దీపకలికల మెరుపులు ధీటుగుండ
  కరొన కాలపు సరదాలు కఠినమయ్యి
  దీపములు వెల్గె నన్నియు దీప్తి లేదు!!

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  శాపముగా కరోనయె ప్రసారమునౌచు జనాళి కెంతయున్
  తాపముగూర్చునీ వడిని తల్లడ నొందుచు మందుగుండునున్
  నాపగ దీప పర్వమున నందరి ధామములందు జూడగన్
  దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్.

  రిప్లయితొలగించండి
 19. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

  దీపములు వెల్గె నన్నియు , దీప్తి లేదు

  నా పూరణ
  (సీసం లో)

  విశ్వమందందరూ విశ్వసిం చెడివృద్ధి
  వెక్కిరించినరీతి వెనుక బడియె

  బడికి పోవలసిన బాల ప్రాయంబంత
  యాన్లైను క్లాసులో నంతమయ్యె

  వ్యాపార రంగము వ్యవధియే లేకుండ
  నిస్సారమైపోయె నిలువలేక

  బతుకు భారంబయ్యె భవిత శూన్యంబయ్యె
  జీతాలు లేనట్టి జీవితాన

  తేటగీతి

  రోగమేతెంచె పేరు "కరోన" యనగ
  ప్రజలు బయటకు పోలేకఁ బాట్లు పడగ
  యిండ్ల దీపావళిజరుప నిచ్ఛ లేక
  దీపములువెల్గె నన్నియు, దీప్తి లేక

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "విశ్వమందందరు" అనండి. 'అందరూ' అనడం సాధువు కాదు.

   తొలగించండి
 20. గోపకిశోరుడంగనలకోకలదాచగనేగెనొక్కొయీ
  గోపికబాధపట్టదొకొకొండనుమోయుచునిల్చెనొక్కొసం
  తాపముహెచ్చెగాళియుమదంబునణంచజరించెనోహృదిన్
  గోపికలేదొకోపొదలగోపకులైకశిరోమణిన్గనన్
  గోపికలారరండనుచుగొండలకోనలవృక్షవాటినిన్
  పాపముపాపజూచినదిభక్తులపెన్నిధిదాగెనెక్కడో
  *“దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్”*

  రిప్లయితొలగించండి
 21. ఇంతి వెలిగింప పర్వాన నింటి ముందు
  దీపములు వెల్గె నన్నియు : దీప్తి లేదు
  వెఱచె నకట కరోనా కు విశ్వ మంత
  నిభలు కనిపించ వెచ్చ ట నిక్క ముగను

  రిప్లయితొలగించండి


 22. చూడ గా మనుజులలోన శూన్యత కన
  బడె కరోన భయమ్మదె ప్రతిఫలించె
  ఔర! యేమిటీ విష్ణుమాయ!నగరమున
  దీపములు వెల్గె నన్నియు దీప్తి లేదు!


  దివ్వెలసిరి పటాసు
  ఢమాల్ ఢమాల్
  శుభాకాంక్షలతో

  దీపాలు వెలుగ వలె నీ
  శాపమగు కరోన తొలగి, చక్కగ మెరుగై
  వ్యాపారములు, పరమపద
  సోపానపు బతుకు బండి సొబగుగ దాటన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. రిప్లయిలు
  1. ప్రాపు నొసంగు రైతునకు పండిన పంటకు లేవు మద్దతుల్,
   దీపితమౌనొ వెల్గులు స్వదేశసురక్షణకీర్తిశేషసం
   తాపితవేశ్మలందు, సతతాధికవర్షవిదగ్ధులిండ్లలో,
   దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి


 24. అయయో కరోన! పోయెను
  నయ! దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుం
  తయుఁ గానరాదిటన్ మన
  భయములెపుడు తొలగునో నిభాయించుకొనన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. సమస్య :-
  “దీపములు వెల్గె నన్నియు దీప్తి లేదు”

  *తే.గీ**

  వర్షమధికమై పంటలు పండలేదు
  సరుకు కొనను బోవ నధిక ధరలు పలికె
  తాళి కుదువబెట్టిన నన్నదాత ముఖము
  దీపములు వెల్గె నన్నియు దీప్తి లేదు
  .........‌‌............✍️చక్రి

  రిప్లయితొలగించండి


 26. శాపము చీనిదేశపు పిశాచి కరోన జనాళి నెల్లరిన్
  వీపున వేటువేసి పెనవేసెను; ప్రాణభయమ్ము కోవర
  మ్మై పను లెన్నియో నిలిచె మైవడి మేవడి కానదేలనో!
  దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్  జిలేబి

  రిప్లయితొలగించండి

 27. * శంకరాభరణం *
  నవంబరు 15, 2020...ఆదివారం
  సమస్య

  “దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్”

  నా పూరణ. చం.మా.
  **** *** ***

  ఏపుగ సస్యముల్ బెరుగ నెవ్విధి లాభము?వర్ష ధారలే

  శాపముగాను మారి కడుఁ జక్కని పంటల నీటముంచె నె

  న్నో పుర పట్టణాలఁ గన నెన్నియొ గ్రామము లీక్ష జేయగాన్

  రేపటి రోజులన్ గడప రేగిన భీతియొ రైతు గీములో

  దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్”

  -- ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి
 28. చూపుచు సింగపూరునట స్రుక్కగ జేయుచు గుంజ భూములన్
  దోపిడి చేయువారి పడఁ ద్రోసిరి పేదలు వోట్లతోడుతన్
  ఏపుగ పంటలిచ్చు భువి యిప్పుడు బీడుగ మారిపోవగా
  దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్

  రిప్లయితొలగించండి
 29. సంతసమ్మున జనులెల్ల శ్రద్దగాను 
  లక్ష్మి పూజలు గావించి రమ్యముగను 
  బాణసంచ కాల్చ కరోన భయము చూప 
  “దీపములు వెల్గె నన్నియు దీప్తి లేదు” 

  రిప్లయితొలగించండి
 30. బాణ సంచను కాల్చంగ బాధ లేదు 
  చేతులును కాళ్ళు కాలంగ చింత లేదు 
  వెరశి దీపావళి జరిగె వీధులందు 
  దీపములు వెల్గె నన్నియు దీప్తి లేదు

  రిప్లయితొలగించండి
 31. పాపమదేమి చేసితిమి? పాపడుగా జనియించినట్టి యా
  గోపకిషోరుడేమయెను? కోపము హెచ్చెన? మమ్ము గానగా
  నోపడదెట్లు? యుద్ధవ యనూహ్యము, సాయపు సందెలన్ గనన్
  దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్

  రిప్లయితొలగించండి
 32. నిన్నమధ్యాహ్న సమయాన గన్నులలర
  దీపములువెల్గెనన్నియు దీప్తిలేదు
  పెద్దతేజస్సుగలిగినబితువువలన
  నల్పములుగదయన్నియుయర్కుముందు

  రిప్లయితొలగించండి
 33. ఉ:

  లోపములేదు సాధనములొక్కటిసేయ ప్రచార మొందగన్
  పాపమదేమొ గాని సమభావము నొప్పగ నల్లజాతికిన్
  ప్రాపును గూర్చలేక తల రాతను నమ్ముకొనంగ ట్రంపునున్
  దీపము లెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గాన రాదటన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 34. ఆత్మనిస్వార్ధదీపంబునార్పఁజేసి
  నరుడుకోటినివెల్గింపనిష్ఫలంబె
  కీర్తికాంక్షనుమదినింపకిల్బిషంబె
  దీపములువెల్గెనన్నియుదీప్తిలేదు

  రిప్లయితొలగించండి
 35. మాయదారి యీ క్రిమి వచ్చెమహిని నేఁడు
  రాజ్య ముఖ్య పట్టణమున రామ! రామ!
  ప్రభువులే నిరోధించఁగ బాణసంచు
  దీపములు వెల్గె నన్నియు దీప్తి లేదు


  తాపము కల్గఁ జిత్తములఁ దద్దయు దర్శన కాంక్ష నీరు కా
  దీపము లెల్ల నాఱ నటఁ దీవ్ర తమస్సు చెలంగ వాటికా
  గోపన కారణమ్మునను ఘోర తరానిల వేగ సంచల
  ద్దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్

  [దీపము = 1. దివ్వె, 2. తీఁగ]

  రిప్లయితొలగించండి
 36. పాపము పెచ్చరిల్లినది పాపఫలంబుగ మానవాళికిన్
  శాపమువోలె వచ్చినదిశార్వరియందుకరోన ఘోరసం
  తాపమునిండెనెల్లెడల తగ్గినపండుగ సంబరాలతో
  దీపములెల్ల వెల్గినవి దీప్తియె సుంతయుఁ గానరాదిటన్

  రిప్లయితొలగించండి
 37. ఆపగలేని మోహమున నావన భూముల సంచరించుచున్
  మాపటివేళలో ప్రియుని మానుగ
  రోయు నిశాభిసారికా
  గోపికకున్ మురారియెట గోచరమవ్వని
  వేళ పల్లెలో
  దీపములెన్నొ వెల్గినవి దీప్తియె సుంతయు గానరాదిటన్

  రోయు = వెదకు

  రిప్లయితొలగించండి
 38. పాపముపెచ్చుపెర్గుటన భారతమంతయుశోకతప్తయై
  పాపపురోగమియ్యదియభావితరాలకుసోకుచుండగా
  దాపముజెందుచున్భువినిదాళగలేకయుండనౌ
  దీపములెల్లవెల్గినవి దీప్తియెసుంతయుగానరాదిటన్

  రిప్లయితొలగించండి

 39. ( బాహుబలి కట్టప్పతో ఇలా వచిస్తున్నాడు..)

  చినతనమందు నెత్తుకొని చేతుల మీదుగఁ బెంచినావు , మి
  త్రుని వలె నాటలాడితివి తోడుగ నిల్చియు తల్లి దండ్రివై
  అనయము గాచినావు కద!ఆర్య! మహిస్మతి రాజ్య సేవకా!
  నను దయమాలి చంపఁ దగునా తగవా పగఁ బూని మిత్రమా”

  -- ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి