26, నవంబర్ 2020, గురువారం

సమస్య - 3556

27-11-2020 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్”

(లేదా…)

“తలగడతోడఁ గొట్టఁగనె దైవమ! హా! తల బ్రద్ధలయ్యెనే

67 కామెంట్‌లు:

  1. అందరికీ నమస్సులు🙏

    *శంకరాభరణం సమస్యా పూరణం*

    *“తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్”*

    నా పూరణ ప్రయత్నం..

    *కం*

    అలజడి రేపుచు గొడవలు
    విల విల లాడుచు జనులిట వింతగ చేష్టల్
    కలబడ వచ్చిన తానివ
    *“తల, గడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్”*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏😊

    రిప్లయితొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పిలిచిన వెంటనే చనక ప్రీతిని చూచుచు ప్రక్కనింటిదౌ
    కులసతినిన్ కనుంగొనుచు కూరిమి హెచ్చగ కన్నుగొట్టగన్
    వలపులు మీరి యాదటను భామయె రోకలి దోపినట్టిదౌ
    తలగడతోడఁ గొట్టఁగనె దైవమ! హా! తల బ్రద్ధలయ్యెనే...

    రిప్లయితొలగించండి
  3. లలనను దూషించె ననుచు
    నలిగిన యా మంత్రి వరుడె యాగ్రహమున నా
    ఖలుని పిలిచి తన కార్యక
    ర్తల గడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బొద్దింక ఉవాచ:

    వలపున నేను శయ్యనట వాలగ నెత్తిది నూనె గ్రోలగన్
    తలపుల ప్రేమ మీరగను దాపున జేరుచు నన్ను చూడగా
    కులసతి తీసి వెఱ్ఱిగను కుందుడు గంతులు వేసి చేరువన్
    తలగడతోడఁ గొట్టఁగనె దైవమ! హా! తల బ్రద్ధలయ్యెనే...

    రిప్లయితొలగించండి
  5. కం.
    అలజడి జేయకఁజోరుడు
    వలపట కత్తిని ధరింప,వంచన తో దా
    పల నుండి రాచ భటుల
    త్తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్

    అత్తలము = ఈటె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని సమస్యలో తలము లేదు.. తలగడ ఉన్నది. 'అత్తలగడ' అనాలి. కాని అర్థం ?

      తొలగించండి
  6. అలలుగబొంగు కోపమది,యార్తజనావన రక్షజేయుమా
    చిలుకనుగట్టియిమ్మనగ,చీల్చెదనోరు నటంచు బల్కగా
    విలవిలనాడునాననసు వీధికి నెట్టెదనిన్నునేడనన్
    తలగడతోడగొట్టగనె,దైవమ హా తలబద్దలయ్యెడిన్
    +++++++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  7. కందం

    కలవారలింట చోరుడు
    సలుపు సడికి లేచి పెద్ద, స్వర్ణపు ముద్దల్
    తెలివిగ లోనుంచినదగు
    తలగడతో గొట్టినంత దలయే పగిలెన్!

    చంపకమాల
    కలిమి గలుంగు వారలని కన్నము వేసియు చోరుడింటిలో
    నలికిడి జేయగన్ గదిలి యా గృహమందున లేచి పెద్దయే
    బలమున వాని వెంటబడి బంగరు ముద్దలు దాచినట్టిదౌ
    తలగడతోడఁ గొట్టఁగనె దైవమ! హా! తల బ్రద్ధలయ్యెనే!

    రిప్లయితొలగించండి
  8. అలికిడి వచ్చెను నింటన
    పలుకులు వినబడి కలముడు పరుగులు బెట్టెన్
    బలముగ యజమానియు, తన
    తల-గడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్

    కలముడు =దొంగ

    రిప్లయితొలగించండి
  9. అలజడి సృష్టింపంగా
    కలవర పడకుండ వాని గర్వము నణ చన్
    బలమును చూపుచు లోహపు
    తలగడ తో గొట్టి నంత దలయే పగిలెన్

    రిప్లయితొలగించండి
  10. కులుకుచుకామినిమేనక
    నలువనుఁబోలినమునినటనయవంచనతో
    మోలకలనవ్వులసిగ్గను
    తలగడతోకోట్టినంతతలయేపగిలెన్

    రిప్లయితొలగించండి
  11. పలువురు పెద్దవారచట ప్రార్థన జేసెడు పాళమందునన్
    జెలియను వెంటబెట్టుకుని శీలము లేని యమాత్యుడొక్కడా
    స్థలమున కేగుతెంచ గని తప్పని చెప్పగ మంత్రి కార్యక
    ర్తల గడతోడఁ గొట్టగనె దైవమ! హా! తల బ్రద్ధలయ్యెనేః

    రిప్లయితొలగించండి
  12. తలవనితలఁపుగనొకపరి
    పొలముననొకనాగుపాముబుసబుసమనుచున్
    తలయెత్తికదలిరాగా
    తలఁ గడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్

    రిప్లయితొలగించండి
  13. సమస్య :
    తలగడతోడ గొట్టగనె
    దైవమ హా తల బ్రద్దలయ్యెనే

    (" తులసిదళం " అనే ఉత్కంఠా
    భరితమైన నవలలో ఒకదృశ్యం )

    చంపకమాల
    ....................

    "తులసిదళంబు " నందొకటి
    దుర్భరదృశ్యము భీతిగొల్పెడిన్ ;
    వలపుల ప్రేయసీప్రియులు
    భవ్యపు శోభనమందిరంబునన్
    గలకల నవ్వుచున్ జరుపు
    కాముకచేష్టల కాంత ప్రేమికున్
    దలగడతోడ గొట్టగనె -
    దైవమ ! హా ! తల బ్రద్దలయ్యెనే !!

    రిప్లయితొలగించండి
  14. కలతలులేనికాపురము కల్లలెరుంగని కల్పవల్లినా
    చెలువముచిందుభార్యయొకచీకటిరేయిని నిద్రనుండగా
    కలుగుననుండిమూషికముకన్బడిదూకుచు పారునంతలో
    తలగడతోడఁ గొట్టఁగనె దైవమ! హా! తల బ్రద్ధలయ్యెనే

    రిప్లయితొలగించండి
  15. అలసిన దేహము చేరగ
    విలువగు పడకను మశకము విడువక కుట్టన్
    బలముగ చేతికి నందిన
    తలగడతో గొట్టినంత తలయే పగిలెన్

    అలుకనుబూని సోదరులె యాస్తుల పంపక మందు వైరమున్
    చెలగుచు వాదులాడుచును సీమను దాటిన నాగ్రహమ్మునన్
    తలపక మంచిచెడ్డలను తమ్ముని దారుణరీతి వాడి కుం
    తల గడతోడ గొట్టగనె దైవమహా! తలబ్రద్ద లయ్యెనే!

    కుంతలము = నాగలి
    గడ = కర్ర

    రిప్లయితొలగించండి
  16. చం:

    సెలవు లలోన గ్రామమునచెంతకు చేరిన చిన్నదానితో
    నిలబ డునన్ను జూచి కడు నిందలు వేయుచునప్రతిష్ఠగన్
    పలికిన వాని కోపమున పాపము నెంచక నొక్క దెబ్బతో
    తల, గడ తోడ గొట్టగనె దైవమ ! హా ! తల బ్రద్దలయ్యెనే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  17. గెలువడి లభించలేదని
    పలువురు గేలించ , నెదుటి పక్షము వానిన్
    మెలకువగ జనపదము కవ
    తల ; గడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్

    రిప్లయితొలగించండి


  18. విలవిల లాడి విదులు చతి
    కిలబడి రర్థము తెలియక! గిద్యమ్ములతో
    డలకల కొలికి జిలేబియె
    తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన

    సమస్య

    తలగడతో కొట్టినంత తలయే పగిలెన్
    (లేదా)

    తలగడదీసికొట్టగనె ,దైవమ హా తలబద్దలయ్యెడిన్

    నా పూరణ

    1) కందము

    బాలలు సరదా కోసము
    తలగడతో బంతియాట తలపడి యాడన్
    మూలన యుండిన బొమ్మను
    తలగడతో కొట్టినంత తలయే పగిలెన్

    2) చంపకమాల

    తలపడి దొంగిలించనొక తస్కరుడేగెను భామ యింటికిన్

    గొలుసులు గాజులున్ బసిడి కోరిన వన్నియు మూటగట్టగా

    లలనయు దవ్వునుండిగని లాలిత హస్తము తో నరాళ కుం

    తల , గడతోడ గొట్టగనె దైవమ హా! తల బ్రద్దలయ్యెనే !!



    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కందంలో మొదటి, మూడవ పాదాలు గురువుతో ప్రారంభమయ్యాయి. నాలుగు పాదాలు అయితే గురువుతోనో లేదా లఘువుతోనో ప్రారంభం కావాలని నియమం కదా?

      తొలగించండి


  20. విలవిల లాడిరరరె తవి
    కల తల గడతోడఁ గొట్టఁగనె దైవమ! హా!
    తల బ్రద్ధలయ్యెనే, చతి
    కిలబడి విదులర్థమును వెతికి వెతికి సుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. కం.
    ఎల నగవుల లేమనొకతి
    కలలో గిలిగింత తోచ గానక దయితున్
    కలవరమనితేల సఖిని
    తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్

    రిప్లయితొలగించండి
  22. పలకము పైన పరుండగ

    వలిముఖ మొకటి యరుదెంచి భయమును గొల్పన్

    లలన తన రక్షణ కొరకు

    తలగడతో గొట్టి నంత తలయే పగిలెన్

    రిప్లయితొలగించండి


  23. నలుగురు నవ్వేరవ్వా!
    నలుగురు నవ్వేరు వినవె నా కడ కొంగున్
    కొలిచిన పెనిమిటిని ఫెడేల్
    తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. ఎలమిని చోరుడొక్కడు ధనేచ్ఛ విభూషల నాహరించ ని
    స్తులధనవంతు నింట వడి దోచగ నత్తరి ధైర్యవంతుడా
    యిలుగల వాడు వేటిటగ నెల్గులఁ గావు మటంచుఁ జేసె మ్రో
    తల, గడతోడఁ గొట్టఁగనె దైవమ! హా! తల బ్రద్ధలయ్యెనే

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  25. తులువ తనంబు మొండి పతి దుండికి గబ్బితనంబు నూఱు నం
    చలమున లెంపకాయలిడ జాయను ముద్దిడె తంతువాయుడా
    చెలియ తటాలునన్ విసిరె చేలము నంతట కండె చుట్టుదౌ
    *“తలగడతోడఁ గొట్టఁగనె దైవమ! హా! తల బ్రద్ధలయ్యెనే*

    రిప్లయితొలగించండి
  26. కలలోజూచితివింతను
    నలికులవేణియొకతెదనయార్యునిశిరమున్
    గలిగినగోపంబునహో
    తలగడతోగొట్టినంతదలయేపగిలెన్

    రిప్లయితొలగించండి
  27. అలమీరిచ్చిన కైపద
    తలపగ తోచక సమస్య దడదడ జేసెన్
    విలవిల లాడగ నా గతి
    తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్

    రిప్లయితొలగించండి
  28. తలగడతోగొట్టగనె దైవమహాతలబ్రద్దలయ్యెనే
    తలగడతోగొట్టగనుదాపడమౌనె?నదేమిచిత్రమో
    కలనునుగంటిరే?చెపుడుకాలపురీతియ?యేమియాయెనో?
    తలపునకంతుబట్టగ నుదద్దయునేర్వకయుంటినేసుమా

    రిప్లయితొలగించండి
  29. గురు సప్తములందరికి శుభోదయము.🙏🏻💐🙏🏻. నాకు నేటితో భారతీయ జీవిత భీమా సంస్థ జోనల్ కార్యాలయం, హైదరాబాద్, నుండి Asst.Div manager గా పదవీ కాలం పూర్తి అవును.

    నాకు పద్యరచనా వ్యాసంగం లో ఓనమాలు దిద్దించిన శంకరార్యులకు పాదాభివందనములు.

    విరామ కాలమును సరస్వతీ సేవలో ధన్యమొనరించెదను.
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురు సత్తములకు లందరకూ శుభోదయం.
      🙏🏻🙏🏻🙏🏻🌺🙏🏻🙏🏻🙏🏻

      తొలగించండి
  30. వెలగల సొమ్ములతోడను
    బలమగు గుండ్రాయి నుంచె పదిలమ్ముగ నా
    చెలితస్కరుడేతెంచగ
    తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్”*

    మరొక పూరణ

    చెలితో కల్లల నాడిన
    ఫలమిటు కనపరచె గనుము వడిగా సఖుడా
    కలవర మొందక తా చే
    తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్”*

    రిప్లయితొలగించండి
  31. అలుకను బూనిన భార్యను
    తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్
    లలనామణి భర్తకు నా
    కలహప్రియ విసిరెనొక్క గరిటెను గురిగా 🤪

    రిప్లయితొలగించండి
  32. విలువగు నగ కొని దాచితి
    తలగడలో నది యెరుగని తరుణీ మణి దా
    నలుకువఁ బరియాచకముగ
    తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్

    రిప్లయితొలగించండి
  33. వలపు టలుక చెలరేఁగఁగ
    నెలఁతుక పాన్పు పయి నుండి నేలన్ రాలన్
    లలితముగఁ ద్రోయ భర్తను
    దలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్

    [ఇక్కడ తలగడతోఁ గొట్టినది భర్త]


    తలపయి పెట్టు కొంచుఁ దగ దారలు కొల్వఁగ నర్హు లౌర పే
    రలుకను జెంది నట్టి సతు లక్కట నేర్తురె మంచి చెడ్డలం
    గలుగఁగఁ గోప మెక్కువగఁ గాంతకు కాంతుని మీద నంతటం
    దల గడతోడఁ గొట్టఁగనె దైవమ! హా! తల బ్రద్ధలయ్యెనే

    [...దల (న్) గడతోడ; బ్రద్దలయ్యెనే : అతిశయోక్తి మాత్రమే]

    రిప్లయితొలగించండి
  34. మిలమిల లాడు చూతముల మేలగు రీతిని కోయ నెంచ నా
    పొలతి శకుంతలమ్మ చెయి బూనిన దండము పట్టు మీరుచున్
    తెలియక జారి పోయె! కట! దిష్టికి యుంచిన కుంభమున్ శకుం
    తల గడతోన గొట్టగనె, దైవమ! హా! తల బద్ద లయ్యెడిన్ !
    (దిష్టికి యుంచిన కుంభము = మనిషి ముఖము చిత్రింప బడిన దిష్టి కుండ)

    రిప్లయితొలగించండి
  35. పలుమార్లు నిదుర రాకయె
    కలకలముంగని నిదురెరుగకయుండగనా
    ఎలుకల యలికిడిని వినగ
    తలగడతోఁ గొట్టినంతఁ దలయే పగిలెన్!!


    రిప్లయితొలగించండి
  36. అలచట యన్నదే కొనక హర్షము తోడ పొలమ్ముదున్నుచున్
    నిలకడగావసించిచుచు నిర్మల చిత్తము రైతులుండగా
    విలువగు భూమి కొల్లగొని భీతినొసంగగ రైతు లల్క నే
    తల, గడతోడఁ గొట్టఁగనె దైవమ! హా! తల బ్రద్ధలయ్యెనే

    రిప్లయితొలగించండి
  37. పరమ భక్తి కలిగి ప్రభుని కొలుచుటన 
    క్రైస్తవులకె కద్దు, రామ భక్తి 
    కలుగు  వారల మంచు కల్లలాడ కద్దు  
    హిందు జనుల కెందు నెంచి చూడ 

    రిప్లయితొలగించండి