(విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తన చరిత్రను వినిపిస్తున్నాడు ) ఉత్పలమాల .................... రాముని తోడ గాధిసుతు రాజసవాక్కులు సాగె నివ్విధిన్ - " రామ ! మరేమనందు ? జన రాజును మౌనిగ మారితిన్ ; మహా ధీమతి రాజమౌనినయి తిన్ ; మరి యంత దపోగ్రదక్షతా రాముని మానసంబు గడు రంజిలె మేనక గాంచినంతనే !! "
భూమిని సాగుసేయ తొలి ప్రొద్దునె రాముడు క్షేత్ర మేగగన్ గ్రామ పొలాల గట్ల సుర కన్యక రూపసి చూడముచ్చటన్ రామము బోలు చందమున రక్తిని గొల్పగ నావభావమున్ రాముని మానసంబు గడు రంజిలె మేనక గాంచినంతనే
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
పాములపాడునన్ పెరిగి పాపపు భీతిని పాముఁ జంపకే
కామము కోపమున్ విడిచి గారబు రీతిని చిత్రసీమనున్
ప్రేమను స్వర్గమున్ జనుచు వీధిని బోవగ తోటమాలియౌ
రాముని మానసంబు గడు రంజిలె మేనకఁ గాంచినంతనే..
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ నాటి శంకరాభరణం వారి సమస్య
తొలగించండిరాముని యెద మేనక గని రంజిల్లె గడున్
నా పూరణ
కామపు దాహము పెరుగగ
నీమము నువిడిచి యహల్య నే కోరుచు నా
లేమ కొరకు పరుగిడు సు
త్రాముని యెద మేనక గని రంజిల్లె గడున్
సుత్రాముడు = ఇంద్రుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేటి సమస్య : రాముని యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్
రిప్లయితొలగించండివిశ్వామిత్రుని చరిత్ర ఆధారంగా...
కం.
ఆ మునితో వైరముగొని
భీమసమతపముసలుపఁగ భీరుకమేగెన్
నీమమును దప్పఁగ "తపో
రాముని "యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్
తపోరాముడు = విశ్వామిత్రుడు
రామనుమేనకాఖ్యనుధరాస్థలిబంపెనుధ్యానభంగమై
రిప్లయితొలగించండిక్షేమముగూర్చనాకమునకేజయమీయగకౌశికున్మహా
కామపువార్ధిముంచిసభగౌరవమున్నిలుపంగబంచసూ
*“త్రాముని మానసంబు గడు రంజిలె మేనకఁ గాంచినంతనే”*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'సుత్రాముని' టైపాటు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
రాముడు కోలుపోవగను రాక్షసి వ్యాధికి ధర్మపత్నినిన్
గోముగ హైద్రబాదునను గొప్పగ కూర్చుచు నాసుపత్రినిన్
ప్రేమను స్వర్గమున్ జనుచు వీధిని బోవగ నందమూరుడౌ
రాముని మానసంబు గడు రంజిలె మేనకఁ గాంచినంతనే...
తొలగించండి* రక్కసి వ్యాధికి
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఅందరికీ నమస్సులు🙏🙏
రిప్లయితొలగించండినా పూరణ యత్నం..
*కం*
నీమము నెట్టుల దప్పెన్
శ్రీమంతుడు మనసు నందు సిరిగల వాడై
ప్రేమగ సీతను జూచెడి
*“రాముని యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్”*
*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీమంతుడు, సిరిగలవాడు... రెండూ ఒకటే కదా?
విశ్వామిత్ర తపోభంగము:
రిప్లయితొలగించండిఉ||
భూమిని గాంచి కౌశికుడు మోదము దివ్యసమాధియన్ గనన్
మైమరువంగ మెచ్చి బరిమార్చగ నిష్ఠను మౌనినిన్ నభో
గామి దలంప వ్రచ్చె పరికంపితమున్ విడ తాపసంబు శ
ర్వా! ముని మానసంబు గడు రంజిలె మేనక గాంచినంతనే
ఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻
పద్యం బాగుంది. కాని 'శర్వా' అనడం కుదరదు.
తొలగించండిభామినిమేనకమనుమని
రిప్లయితొలగించండిభూమినిరామునిపదములుపూజింపఁబడెన్
క్షేమముతనకనుభావన
రామునియెదమేనకఁగనిరంజిల్లెఁగడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికోమలి కౌసల్య సుతుడు
రిప్లయితొలగించండినేమమ్మును తప్పనట్టి నిశ్చలు డతడే
భామా! నీవను నది యే
రాముని యెద, మేనకఁ గని రంజిల్లెఁ గడున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిరాముని మానసంబు గడు
రంజిలె మేనక గాంచినంతనే
(విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తన చరిత్రను వినిపిస్తున్నాడు )
ఉత్పలమాల
....................
రాముని తోడ గాధిసుతు
రాజసవాక్కులు సాగె నివ్విధిన్ -
" రామ ! మరేమనందు ? జన
రాజును మౌనిగ మారితిన్ ; మహా
ధీమతి రాజమౌనినయి
తిన్ ; మరి యంత దపోగ్రదక్షతా
రాముని మానసంబు గడు
రంజిలె మేనక గాంచినంతనే !! "
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభామలు దలచినఁ దపముల
రిప్లయితొలగించండినీమంబులు సమసిపోవు నిర్వీర్యములై
భూమిని మును వి శ్వామి
త్రా ముని యెద మేనకఁగని రంజిల్లెఁ గడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిశ్వామిత్రా.. అనడం అక్కడ కుదరదు.
౧.
రిప్లయితొలగించండిఏమనసెందున దాగెనె
ప్రేమగ జెప్పంగ లేక వేరుగనుండన్
కామప్రకోపమందున
రాముని యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్!!
౨.
ఏమునిజెప్పెనీ విషయమేమియు వీరికి తెల్యకుండెనా
రామకథామృతంబెరిగి రాజిలె నెట్టుల మానసంబహో
యీముని బెట్టెనిట్లుగను నేదొపరీక్షను పూరణమ్ముకై
రాముని మానసంబు గడు రంజిలె మేనకఁ గాంచినంతనే!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికామిని చుప్పనాతి యభికాంక్షను తెల్పుచు చేరువేళలో
రిప్లయితొలగించండిభామిని సీతయే తనదు భార్యయటంచును చెప్పినట్టి యా
రాముడచంచలుండు కదరా! వివరమ్ముగ నాకు తెల్పుమే
రాముని మానసంబు గడు రంజిలె మేనకఁ గాంచినంతనే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏమరుపాటు లేక ఘన యింద్ర పదంబును గాపుగాచ స్వ
రిప్లయితొలగించండిక్షేమము నెంచుచున్ దనకు చేరువ యయ్యెడు మౌనివర్యుకున్
నీమము భంగమౌనటుల నేర్పున బంపగ నప్సరాంగ సు
త్రాముని మానసంబు కడు రంజిలె మేనక గాంచినంతనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మౌనివర్యునకున్' అనడం సాధువు. అక్కడ "మేటి మౌనికిన్" అందామా?
అలాగే గురువుగారూ! ధన్యవాదములు! నమస్సులు! 🙏🙏🙏
తొలగించండిసవరించిన పూరణ!
తొలగించండి🙏🙏🙏🙏
ఏమరుపాటు లేక ఘన యింద్ర పదంబును గాపుగాచ స్వ
క్షేమము నెంచుచున్ దనకు చేరువ యయ్యెడు మేటిమౌనికిన్
నీమము భంగమౌనటుల నేర్పున బంపగ నప్సరాంగ సు
త్రాముని మానసంబు కడు రంజిలె మేనక గాంచినంతనే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండిసోముని గొనఁగ నపర్ణగ
హైమవతి తపించినంత హరుఁడు ధరించన్
జామాతగ కైలాసా
రాముని యెద మేనకఁ గని రంజిల్లె కడున్
ఉత్పలమాల
సోముని నాదిశంకరుని చూపుల జిక్కిన చాలుచాలనన్
హైమవతీలలామ హరునంద నపర్ణగ సేవజేయగన్
భామకు మేని నీయ సగభాగము నల్లుడు! మెచ్చుచున్ నగా
రాముని మానసంబు, గడు రంజిలె మేనక గాంచినంతనే
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధీమంతుడు హిమవంతుడు
రిప్లయితొలగించండిభామినిమేనకఁగని ప్రియభావనగదురన్
సామీప్యముజేరగనభి
రాముని యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసీమలు లేని సౌఖ్యముల జీవిక సాగగ స్వర్గధామమున్
రిప్లయితొలగించండిసామజ గానడోలికల సారస రాత్రులు సాగుచుండగన్
కాముని పంచ బాణములు కాంతను గూడగ తొందరింప సు
త్రాముని మానసంబు గడు రంజిలె మేనక గాంచినంతనే
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండినీమము వీడక నెప్పుడు
తా మౌనముగా నొనర్చు ధ్యానము క్షయమై
కామముదయించగ తపో
రాముని యెద మేనక గని రంజిల్లె గడున్.
భూమిజకే లోబడినది
రాముని యెద; మేనక గని రంజిల్లె గడున్
క్షేమముగా వనమందున
కోమలమగు సుతను గాంచ కూరిమి తోడన్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి"వీడక యెప్పుడు.." అనండి.
ఆ మాన్యుఁడు గాధేయుని
రిప్లయితొలగించండినీమపు దపమును చెరపగ నెలతుకఁ బంపన్
కాముని ప్రేరణమున కౌ
రా ముని యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅర్ధ కందం.
గోముగ దరిచేరుచు నౌ
రా, ముని యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్
జిలేబి
బాగుంది. మిగతా సగం ?
తొలగించండి
రిప్లయితొలగించండిలకలక లక! మోదంబా
గకరా, ముని మానసంబు గడు రంజిలె మే
నకఁ గాంచినంతనే చెం
త కణకణమనంగ వేడి తాండవ మాడన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మోదంబాగకరా' ?
రిప్లయితొలగించండిగోముగ చెంత చేరి మునిగోటిని దాకుచు ముద్దుచేయనౌ
రా, ముని మానసంబు గడు రంజిలె మేనకఁ గాంచినంతనే
నీమము తప్పె నాతడిది నిష్ణుడు చిక్కెను మోహమందురా
కామము పెచ్చు రేగె మది గమ్యము తప్పగ ధూకుడాయెగా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినీమము నిష్టయు తప్పెను
కామమ్మదె తూట్లుపొడిచె గమ్యము మారెన్
గోముగ దరిచేరుచు నౌ
రా, ముని యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్!
జిలేబి
పూర్తి చేసిన కందం బాగుంది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికామునితూపువోలె తమకమ్మొనరించెడి యందగత్తె, సు...
త్రామసభాంతరస్థసురరంజకనాట్యకళాప్రపూర్ణ, స్వ...
ర్భామిని గాధిపుత్రుని తపస్స్థలి జేరగ.,మోహవృత్తినౌ
రా! ముని మానసంబు కడు రంజిలె మేనకఁ గాంచినంతనే!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అద్భుతమైన పూరణ.
తొలగించండినీమపు తపోధను ని వి
రిప్లయితొలగించండిశ్వామిత్రుని భంగ పరచ వాసవు డంపన్
భామిని హొయలుకు దా నౌ
రా ముని యెద మేనక గని రంజిల్లె గడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిశ్రీమహనీయరూపవతి సీత మొగమ్మునుఁ జూచినంతనే
శ్రీమహిజాస్వయంవరపురారిశరాసనభంజకుండునౌ
రాముని మానసంబు గడు రంజిలె, మేనకఁ గాంచినంతనే
కామవశీకృతుండగుట గాధిజు డయ్మొ తపమ్ము వీడెనే!
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభామలఁ గూడగా మునులు భాసిత శక్తిని కోలువోదురౌ
రిప్లయితొలగించండినీమము నిష్టలుం సమసి నిశ్చల తేజము హీనమౌ గదా!
భూమిని పుష్కళం బగుతపోబల సంపదఁ గల్గివిశ్వమి
త్రా ముని మానసంబుగడు రంజిలె మేనకఁగాంచినంతనే
పద్యం బాగుంది. 'విశ్వమిత్రా ముని' అనడం సాధువు కాదు.
తొలగించండిశ్రీమహనీయరాజ్యమును ఛీ యని వీడి తపమ్ము కోసమై
రిప్లయితొలగించండియా ముని వాటిఁ జేరి మహిమాన్వితగాధిజుడయ్యె మౌని, స్వ
ర్ధామవిభుండు పన్నెను కుతంత్రము, నంతట వ్యాజభాగమే
రా! ముని మానసంబు గడు రంజిలె మేనకఁ గాంచినంతనే.
కంజర్ల రామాచార్య
మరో పూరణ
తొలగించండిమీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరామల వెంటనంటును పురందరు డెప్పుడు నెంచి చూడగా
రిప్లయితొలగించండినాముని శాపమున్ గొనె నహల్యను మోసముతోడ పొంది తాన్
కామ వికారమున్ బడసి క్రాలుచు నుండగ సీత బాధ సు
త్రాముని మానసంబు గడు రంజిలె మేనకఁ గాంచినంతనే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిజీపీయెస్ వారు,
నిన్నటి మైలవరపు వారి అద్భుతోత్పలమునకు జిలేబీయపు కందోత్పలములు , అంకితము మీకు, మీ ద్వారా వారికున్ను!
అమరగ నా గజపతి ధా
మము కారణజన్మురాలు మన కాకతి రు
ద్రమ, కాళికాంబయే, నడి
చె మహిని పగవాండ్లను చరిచె నడచె నౌరా!
అనఘా! దునిమెను రక్షణ
మున ధీరగుణాఢ్య,లోకమున స్త్రీయన బు
ట్టిన వీరభద్రుడే, కలి
పెను రాజ్యమ్ముల, నిలుపుచు పెఱల క్షణములో
సతతము రక్షణకై సం
యుత! క్రూరుల యాదవాన్వయుల గూల్చిన తీ
రు తదీయ శౌర్యగంభీ
రత రుద్రమదేవి ముద్ర రాజ్ఞిగ నిలలో
సణుగుట, భయమ్ము, సమరాం
గణ భీరత కానవాలు, రణభీకరరూ
పిణి, శ్లాఘనీయయే దిన
మణి తీక్ష్ణతకు పొడ! రుద్రమ నిశానియదే!
జిలేబి
మీ పద్యాలు బాగున్నవి.
తొలగించండి
తొలగించండిశ్రీమతి జిలేబి గారూ..💐🙏🙏
కందోత్పలములు సదువగ
విందొనరించినవి, ప్రథితవిదుషీమణి! మీ
కందింతు వీరి మాటల
వందనశతపుష్పమాల, వరలుమ కీర్తిన్.!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
సామము నాటక మందున
రిప్లయితొలగించండితమ్ముడు ముని యయ్యె, నన్న థాశరథిగ రం
గమ్ములు వేడుక మారిన
రాముని యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్
రెండవ, మూడవ పాదాలలో ప్రాస సరిచేయండి.
తొలగించండిసామము నాటక మందున
తొలగించండిఆ మునిగ ననుజుడు, నన్న థాశరథయ్యెన్
తామను వేసము మారిన
రాముని యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్
ధన్యవాదాలు🙏🏻🙏🏻
కాంతయ కాదుకాదనగ కాకలుతీరిన మేరు ధీరవై
రిప్లయితొలగించండిశాంతము సౌర్యమున్ కలిగి చక్కగ పాలన చేసి మెప్పుల
న్పొంతన లేక వైరులకు పూర్తిగ తీటను తీసివేయుచున్
ఖ్యాతిని గాంచి నావు గద కాకతి వంశపు వీర నాయకీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాముని తత్త్వము తెలియక
రిప్లయితొలగించండిగోముగ మోహ పరచంగ కోరిక కలుగన్
మైమరపున నిదురింపగ
“రాముని యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిభూమిని సాగుసేయ తొలి ప్రొద్దునె రాముడు క్షేత్ర మేగగన్
గ్రామ పొలాల గట్ల సుర కన్యక రూపసి చూడముచ్చటన్
రామము బోలు చందమున రక్తిని గొల్పగ నావభావమున్
రాముని మానసంబు గడు రంజిలె మేనక గాంచినంతనే
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఉమతో అర్ధనారీశ్వరుడై సోమునిగా వెలసినాడని గ్రహించి సవరించిన పద్యం...
రిప్లయితొలగించండికందం
ప్రేమగ నపర్ణ యగుచున్
హైమవతి తపించినంత హరుఁడు ధరించన్
సోముండౌ కైలాసా
రాముని యెద మేనకఁ గని రంజిల్లె కడున్
ఉత్పలమాల
ప్రేమగ నాదిశంకరుని బెండ్లము నైనను చాలుచాలనన్
హైమవతీలలామ హరునంద నపర్ణగ సేవజేయగన్
భామనుఁ బొంది సోముఁడుగ బాసిల నల్లుడు! మెచ్చుచున్ నగా
రాముని మానసంబు, గడు రంజిలె మేనక గాంచినంతనే
నీమముతోడకారడవినీరవనిశ్చలనిర్వికారుడై
రిప్లయితొలగించండితామసమున్ త్యజించిఘన తాపసవృత్తిజరించు మౌనికిన్
కామ ప్రచోదనంబెసఁగి ఖర్వమొనర్పతపంబు వచ్చె నౌ
రా! ముని మానసంబు గడు రంజిలె మేనకఁ గాంచినంతనే
కామునిబ్రేరణమునసు
రిప్లయితొలగించండిత్రామునియెదమేనకగనిరంజిల్లెగడున్
భామలజోలికినేగక
నీమముతోనుండదగును నిశ్చలబుద్ధిన్
ఆ మానిసి మిన్న కలువ
రిప్లయితొలగించండిమోము నలరు పుడమి కానుపు మగని బువికిన్
సామిని కడింది జోదుని
రాముని యెద మేనకఁ గని రంజిల్లెఁ గడున్
బూమిని జోగిబొబ్బమెకముం గని వానిఁ గడింది ముంచఁగా
వే మెయి చెన్ను వెల్గులను వింతగఁ దామరకంటి జూపఁగా
నేమని చెప్పగా వలయు నీ జడదారికి, గొప్పయొజ్జ దా
రాముని, మానసంబు గడు రంజిలె మేనకఁ గాంచినంతనే
ప్రేమనుజూపెడున్వలువ పేర్మినిదాధరియించియుండసు
రిప్లయితొలగించండిత్రామునిమానసంబు గడురంజిలెమేనకగాంచినంతనే
భామలవేషధారణలుభావితరాలకుచేటుజేయుచో
బ్రేమనుజెప్పగాదగునురెట్టునుధారణజేయుమాయనిన్
కోమలిచెంతజేరగనె,కోవిదుడైనను నీరుగారునే
రిప్లయితొలగించండివేమన పద్యరత్నములు వేనకు వేలుపఠించ నేమగున్
భామల సోయగమ్ములకు,భళ్ళున జారెడునందమూరిలో
రాముని మానసంబుగడు, రంజిలె మేనక గాంచినంతనే