18, నవంబర్ 2020, బుధవారం

సమస్య - 3548

 19-11-2020 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ప్రాణగండముఁ దెచ్చెను పావురమ్ము”

(లేదా…)

“ప్రాణాపాయముఁ దెచ్చెఁ బావురము శర్వా యేమి కానున్నదో”

35 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  బోణీ చేయుచు గూటినిన్ విడుచుచున్ ప్రొద్దున్ననే నేగుచున్
  రాణింపంగను వ్రాలుచున్ కిచెనులో రాకాసియౌ జబ్బుతో
  నాణెంబైన కరోన దెచ్చియిచటన్ నాజూకుదౌ తీరునన్
  ప్రాణాపాయముఁ దెచ్చెఁ బావురము శర్వా యేమి కానున్నదో...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. సార్!

   "రంగరాయ వాస్తవ శతకము" ను పరిష్కరించుటలో వ్యస్తుడనై ఉండుట వలన ఈ రోజు ఆటవిడుపు పూరణ లేదు...క్షమింపగలరు

   🙏

   తొలగించండి

  2. దీని pdf ను జిలేబి గారికి పంపుటకు

   తొలగించండి
 2. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

  ప్రాణగండము దెచ్చెను పావురమ్ము

  నా పూరణ

  తే.గీ.

  ధర్మ రక్షణపరునిగా ధరణి యందు
  శిబిమహారాజు ను పరీక్ష చేయునపుడు
  సభన కూర్చుండి వీక్షించు సాధు జనులు
  చెవుల యందున తామిట్లు చెప్పు కొనిరి
  ప్రాణగండము దెచ్చెను పావురమ్ము

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 3. పావురాలనుబెంచుట పాడిగాద
  నంగ, పెంచి పోషించగా నందమేల
  వినక రోగమ్ముదెచ్చిరే విజ్ఞులయ్యు
  ప్రాణగండముఁ దెచ్చెను పావురమ్ము!!

  రిప్లయితొలగించండి
 4. ధర్మనిరతిన సంపన్న దాన గుణము
  నందు, శిబిని పరీక్ష బూన యమధర్మ
  రాజు, ఇంద్రదేవ నవతారములు మార,
  ప్రాణగండముఁ దెచ్చెను పావురమ్ము

  రిప్లయితొలగించండి
 5. సమస్య :
  ప్రాణగండము దెచ్చెను పావురమ్ము

  (శిబిచక్రవర్తి డేగబారి నుండి పావురాన్ని కాపా
  డటంకోసం కండలు కోసి త్రాసులో వేస్తుంటే
  బాధాతప్తులైన సభాసదుల భావన )

  డేగ తరుమగ బావురమ్మేగి భీతి
  రాజు శిబివద్ద కేతెంచి రక్ష గోరె ;
  గండ లవియెన్ని వైచిన నిండకుండె !
  బ్రాణగండము దెచ్చెను పావురమ్ము .

  రిప్లయితొలగించండి
 6. ప్రాణభీతితోశరణన్నపావురమును
  గావతనమేనిచియ్యలవైవత్రాసు
  డేగతుల్యముకాదయ్యెరాగునకును
  ప్రాణగండముదెచ్చెనుపావురమ్ము

  రిప్లయితొలగించండి


 7. మిత్రుడొకడు బిలిచెను సుమీ రవంత
  తాగిన సమస్య యేమిలేదనుచు బోవ
  ప్రాణగండముఁ దెచ్చెను పావు, "రమ్ము"
  చావు వచ్చు మార్గమ్ములు చాన గాదె!  జిలేబి

  రిప్లయితొలగించండి


 8. దాణా వేయగ కత్తలాని కరరే దారుఢ్యమేతగ్గగా
  ప్రాణాపాయముఁ దెచ్చెఁ, బావురము శర్వా యేమి కానున్నదో
  చైనాదేశపు పప్పుగింజలు తినెన్! సర్వేశ్వరా యీ కరో
  నానానాటికి వృద్ధిగాంచెనయ ప్రాణాల్ ఖాద్యమై బోవగా!  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. ఒక “మిత్ర లాభం” కథ ఆధారంగా

  నింగినెగురు పావురగుంపు నేలనగల
  బియ్యము గని వద్దనినను వృద్ధగువ్వ
  పలుకు నమ్మి కిందకుదిగి వలను జిక్క
  ప్రాణగండముఁ దెచ్చెను పావురమ్ము

  రిప్లయితొలగించండి
 10. తేటగీతి
  స్నేహితులటంచు నేవురు చేరి త్రాగ
  నేలకొరిగిరి ముగ్గురు సోలెనొకఁడు
  మర్మమేమిటో మరొకడు మాయమాయె
  ప్రాణ గండముఁ దెచ్చెను పావు 'రమ్ము'

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాణించున్ దగు శోభతోఁ బొరుగు చూరందున్ ప్రభాతమ్మునన్
   గోణంగొక్కడు దాని కాలి చివరన్ గుర్తించి లేఖొక్కటిన్
   రాణీ భామయె పంపెనేమొ? ననుచున్ నందమ్మునన్ దాకియున్
   చైనా వారి లిపిన్ గ్రహించి నలతన్ సాగంగ వైద్యమ్ముకై
   ప్రాణాపాయముఁ దెచ్చెఁ బావురము శర్వా! యేమి కానున్నదో

   తొలగించండి
 11. వాయుమార్గానబోవంగ బయలుదేర
  నడ్డగించెవిమానంబునపుడు పక్షి
  సత్వరముమరలిదిగెను క్షాంతికపుడు
  ప్రాణగండముఁ దెచ్చెను పావురమ్ము

  రిప్లయితొలగించండి
 12. శ్యేనంబొక్కటిబావురంబుఁదరుమన్హేవాణియీప్రాణికిన్
  బ్రాణంబుల్దయజేయుమంచునొడిలోవ్రాలన్గపోతానిదౌ
  ప్రాణాల్గావశిబీశుడిచ్చెమయిదొబ్బన్ప్రీతిసాళ్వంబుకై
  *“ప్రాణాపాయముఁ దెచ్చెఁ బావురము శర్వా యేమి కానున్నదో”*

  రిప్లయితొలగించండి
 13. క్షోణిన్గెల్వగరాయబారమదిగోశోఠంబునేతెంచెనా
  ప్రాణిన్వేస్ట్రమునుజ్జగించికొనిపోవన్సోదయేనేరకే
  క్షోణీనాధులమధ్యయుద్ధమతిసంక్షోభార్థమున్సేనకున్
  *“ప్రాణాపాయముఁ దెచ్చెఁ బావురము శర్వా యేమి కానున్నదో”*

  రిప్లయితొలగించండి
 14. మద్యపాన నిషేధసమయము నందు
  పల్లెటూరు నందున నొక బ్రాంది షాపు
  రంగునీరు గలిపి నమ్మె లాభ మునకు
  ప్రాణగండముఁ దెచ్చెను పావు-రమ్ము!

  రిప్లయితొలగించండి
 15. వడిగ సైకిలు త్రొక్కుచు వెడలు చుండ
  నడ్డు పడనేదియో యపు డతను పడియు
  వైద్య శాలలో చేరగ వైద్యుడనియె
  ప్రాణ గండము దెచ్చె ను పావురమ్ము

  రిప్లయితొలగించండి
 16. వేణి నొక్కడు బెంచగ వింతగాను
  పక్షివాసము వోలెను ఫ్యాషననునచు
  వచ్చిచేరగ నొకజంట పరవశించి
  ప్రాణగండము దెచ్చెను పావురమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లాల్ బహదూర్ శాస్త్రిగారి జ్ఞాపకాలతో
   🙏🙏🙏🙏

   క్షోణిన్ శాంతికి దూతయంచు బహుధా గుర్తింపు గొన్నట్టిదై
   పాణిన్ దాల్చగ నెహ్రువర్యుడు సదా
   పాటించి మైత్రిన్ ధరన్
   హీనంబైన కుతంత్రమున్ నడుప నాయెర్రన్ని తాష్కెంటునన్
   ప్రాణాపాయము దెచ్చెపావురము శర్వా! యేమికానున్నదో!

   తొలగించండి
 17. శాంతి చిహ్నము జేయుట శాపమాయె
  చెప్పినపని తలచి జేయ చిన్నతనమొ
  మిద్దెమేడల పైనుండి సద్దుజేయు
  ఫంగసు పురుగుల నెలవై పంచిపెట్టు
  ప్రాణగండముఁ దెచ్చెను పావురమ్ము

  రిప్లయితొలగించండి
 18. శిబిమహారాజు చెంతకు చేరినట్టి
  పక్షుల తగవును గనుచు ప్రభువు నిర్ణ
  యమ్ము వినుచును పలికిరి యవనిజనులు
  ప్రాణగండము తెచ్చెను పావురమ్ము

  మరొక పూరణ

  నాగరికత యటంచును నయము గాను
  నచ్చ జెప్ప మిత్రుల మాట నమ్మి వేగ
  త్రాగి నంతనే పడిపోయి తలచె మదిని
  ప్రాణగండము దెచ్చెను పావు'రమ్ము'

  రిప్లయితొలగించండి
 19. వ్రుద్ధపావురముపలుకువ్రుధగమారె
  వలనుఁదగిలెనుపక్షులువంతఁబాడి
  వయసువిలువకుమేధయేవన్నెఁదెచ్చు
  ప్రాణగండముఁదెచ్చెనుపావురమ్ము

  రిప్లయితొలగించండి
 20. శత్రు కాయపు వ్యూహ విశదము తనదు
  ఱెక్క సందులఁ గట్టిన ఱేని వాడి
  వార్త నిట మోసికొని వచ్చి యార్తి నింకఁ
  బ్రాణగండముఁ దెచ్చెను పావురమ్ము


  కాణాచిం బడి యుండ కేలఁ బడెనో కంటం బురిన్ డేగకుం
  ద్రాణార్థమ్ముగ శ్యేన భీతము ధరం దాఁ జేరి వేగమ్ముగా
  వాణీశుద్ధున కక్కటా శిబికి దుర్వారమ్ముగాఁ జెంత హా
  ప్రాణాపాయముఁ దెచ్చెఁ బావురము శర్వా యేమి కానున్నదో

  రిప్లయితొలగించండి
 21. డేగబారినిపడినట్టి కూకియపుడు
  దానశీలియౌయాశిబిదరికిజేరి
  రక్షగోరగమాఃసపురవలుగోయ
  ప్రాణగండముదెచ్చెనుపావురమ్ము

  రిప్లయితొలగించండి
 22. దాణాగైకొనడేగపావురమునే వెంటాడబోవంగగా
  బ్రాణాపాయముదప్పిబోవుటకునైరక్షించుడంచున్ శిబిన్
  దీనాలాపముజేయపావురమయో ధైర్యంబుగోల్పోవగా
  ప్రాంణాపాయముదెచ్చె బావురముశర్వా!యేమికానున్నదో

  రిప్లయితొలగించండి
 23. వాణీ! నన్నిక రక్షజేయుడని నే ప్రార్థించు చుంటిన్ వడిన్
  ప్రాణమ్మున్ హరియింప వచ్చెనది కంబ్వాతాయి యే గాంచుమా
  త్రాణమ్మిమ్మని గోరినంత శిబి తా తౌలమ్మునే జేరెనే
  ప్రాణాపాయముఁ దెచ్చెఁ బావురము శర్వా యేమి కానున్నదో.

  రిప్లయితొలగించండి
 24. ప్రేమసందేశ మంపెనా ప్రియుడు, రాజు
  ముద్దు కూతురు కంచు, కపోత మదియె
  చేర్చె నాలేఖను నృపుని చెంత కపుడు
  ప్రాణ గండముఁ దెచ్చెను పావురమ్ము

  రిప్లయితొలగించండి
 25. శా:

  బోణీ నీదె యటంచు నింపు పలుకన్ పూబోడి చేరంగ నై
  తూణీరంబును వీడు బాణము వలెన్ దూరంగ నా వాటికన్
  ఠాణా పోలిస టంచు దెల్ప నొక షోఠమ్మెన్చి, యోచించగన్
  ప్రాణాపాయము దెచ్చె బావురము శర్వా యేమి కానున్నదో

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 26. వీడు మద్యమనుచు చెప్పె వెజ్జొకండు
  వాని మాటను వినకుండ వాసతేయి
  తమ్ముడు పిలువ పరుగెత్తి తాగి చచ్చె
  ప్రాణగండముఁ దెచ్చెను పావు రమ్ము

  రిప్లయితొలగించండి
 27. ప్రాణంబుల్ గడదేర్చు జీవిక గదా బాధాకరమ్మౌ విధిన్
  బాణాఘాతముతో కిరాతుడొకడా పార్వంబు గూలార్చగా
  ప్రాణాంతంబును బొందె జిక్కి యొక దీవన్ విద్యుదుత్పాతమై
  ప్రాణాపాయముఁ దెచ్చెఁ బావురము శర్వా యేమి కానున్నదో

  రిప్లయితొలగించండి